Cinemarangam.Com
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్స్ – గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
సినిమా : “ది గర్ల్ ఫ్రెండ్ “
విడుదల తేదీ: 07.11.2025
రివ్యూ రేటింగ్ : 3/5
నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్
నటీనటులు – రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు
సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ – జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ – ఫస్ట్ షో

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ
భూమాదేవి (రష్మిక) పుట్టగానే తల్లిని చనిపోవడంతో తల్లి పేరును తనకు పెడతారు.తల్లిలేని బిడ్డ కావడంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తాడు తండ్రి, (రావు రమేష్). భూమాకు చదువంటే చాలా ఇష్టం. థియేటర్, ఆర్ట్స్, లిటరేచర్ పై ఉన్న ఇష్టం తో రామలింగాయ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో లిటరేచర్ జాయిన్ అవుతుంది.అక్కడ తన ప్రొఫెసర్(రాహుల్ రవీంద్రన్).అక్కడ చదువు తప్ప వేరే ధ్యాస లేని భూమాదేవికి ఒక చిన్న యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ద్వారా అదే కాలేజీలో చదివే విక్రమ్ తో పరిచయం ఏర్పడుతుంది.అయితే తొలిచూపులోనే భూమని ఇష్టపడతాడు విక్రం. కొన్ని సందర్భాల దృష్ట్యా భూమా కూడా ఇష్టపడాల్సి వస్తుంది. ఆ తరువాత ఒకానొక సందర్బంలో అనుకోకుండా భూమాను, విక్రమ్ ముద్దు పెట్టుకుంటాడు. ఆలా ఒక ముద్దుతో మొదలైన వారి ప్రేమ హద్దులు దాటుతుంది.అయితే తనతో మాత్రమే క్లోజ్ గా ఉండాలి, వెరెవరితో క్లోజ్ గా ఉండకూడదంటూ తనకు దగ్గరగా ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ను కూడా దూరం చేస్తాడు విక్రం..ఇది తట్టుకోలేని భూమా తన స్వేచ్ఛను హరిస్తున్నా డనే ఆలోచనలో పడుతుంది. ఇలా టాక్సిక్ రిలేషన్ లో చిక్కుకొని దాని నుంచి బయటపడలేక నలిగిపోయిన భూమాదేవి కథే ది గర్ల్ ఫ్రెండ్. తనని తానుగా స్వీకరించని.బంధం నుంచి ఆ బంధీ కానా నుంచి భూమా ఎలా బయటపడింది అనేది ది గర్ల్ ఫ్రెండ్ కథ.

నటీ – నటుల పనితీరు
రష్మిక మందన్న ఓ సింపుల్ రెగ్యులర్ అమ్మాయి పాత్రలో బాగానే మెప్పించింది. కొన్ని సీన్స్ లో మాత్రం రష్మిక పర్ఫార్మెన్స్ అదరగొడుతుంది. దీక్షిత్ శెట్టి నెగిటివ్ షేడ్స్ లో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయాడు. దీక్షిత్, రశ్మిక తమ పర్ ఫార్మెన్స్ లతో ఆధారగొట్టారు. అను ఇమ్మాన్యూల్ పాత్ర తక్కువ ఉన్నా బాగానే నటించింది.. ప్రొఫెసర్ పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్ నటన బాగుంది. తను అప్పుడప్పుడు చెప్పే మోటివేషన్ స్పీచ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.భూమా కు తండ్రిగా రావు రమేష్, విక్రమ్ కు తల్లిగా రోహిణి ల నటన బాగుంది. ఇంకా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రల్లో నటించి మెప్పించారని చెప్పచ్చు.

.సాంకేతిక నిపుణుల పనితీరు
ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ద్వారా ఇబ్బంది పడుతున్న గర్ల్ ఫ్రెండ్, అతన్ని ఎలా వదిలించుకుంది అనే ఓ కాంటెంపరరీ కథ రాసుకుని.. ఇంకా ఇప్పటికీ సమాజం లో టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ లాంటి వారు ఉన్నారని, అలాంటి వాళ్ళ వల్ల అమ్మాయిలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అనే పాత కథను కాస్త కొత్తగా చెప్పడంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు…డీవోపీ కృష్ణన్ వసంత్ విజువల్స్ కథకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.హేషమ్ అబ్దుల్ వాహబ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఖర్చుకు వెనుకకాడకుండా నిర్మించిన నిర్మాణవిలువలు బాగున్నాయి. అన్ని ఎమోషన్స్థి ఉన్న ఈ సినిమా చూసిన వారందరికీ నచ్చుతుంది. అలాగే థియేటర్స్ వచ్చిన అమ్మాయిల్లో 60 పర్సెంట్ ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారని కచ్చితంగా చెప్పచ్చు.
Cinemarangam.Com Review Rating 3/5









