నిన్నటి వరకు సోషల్ మీడియాలోని మీమ్స్ గ్రూప్స్ లలో, సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా వైరల్ అయి సంచలనం సృష్టించిన ‘హూ ఈజ్ విరాజ్‌రెడ్డి?’ ప్రి లుక్ పోస్టర్ కు ఎంతో క్యూరియాసిటీ తో ఎదురు చూసిన ప్రేక్షకులకు ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సమాధానం దొరికింది అనుకోవచ్చు.
విరాజ్ రెడ్డి చేలం తన మొదటి సినిమా తోనే పాన్ ఇండియా స్థాయిలో “ది గార్డ్ 2020” సినిమాతో హీరో గా పరిచయమవుతుండడం విశేషం.ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన రైతు కొడుకు ప్రపంచమే తనవైపు చూసేలా అను ప్రొడక్షన్ పతాకంపై థ్రిల్లర్ కథాంశంతో పాన్ ఇండియానే కాకుండా పాన్ వరల్డ్ మూవీగా హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. విరాజ్ రెడ్డి చేలం ,మిమీలినోర్డ్ (శ్రీలంక), శిల్పా బాలకృష్ణన్ హీరో హేరోయిన్స్ గా జగ పెద్ది దర్శకత్వం లో అనసూయ రెడ్డి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ది గార్డ్ 2020”.ఈ సినిమా మొత్తం ..ఆస్ట్రేలియాలో చిత్రీకరించబడిన తొలి పాన్ ఇండియన్ సినిమా ఇది. ఈచిత్రాన్ని పాన్ ఇండియా తో సరిపెట్టకుండా పాన్ వరల్డ్ గా ఇంగ్లీష్ మరియు చైనా భాషల్లోనూ భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ సందర్భంగా
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసే సన్నివేశాలతో అద్భుతమైన టెక్నోలజీతో పూర్తిస్థాయి థ్రిల్లర్ కథాంశాన్ని సెలెక్ట్ చేసుకున్న దర్శకుడు జగ పెద్ది ఈ సినిమాకోసం అహర్నిశలు పనిచేసి, ప్రేక్షకుల కోసం ఓ భారీ బడ్జెట్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ని సిద్ధం చేశారు. ఇటీవల దర్శకత్వం వహించిన తన చిత్రాలకు అనేక ప్రశంసలతో పాటు అవార్డులను సైతం గెలుచుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా ఆస్ట్రేలియాలో రూపొందించబడింది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులైన సినిమా టోగ్రాఫర్ గా మార్క్ కెనిఫిల్డ్ ,స్టంట్ డైరెక్టర్ పువెన్ పాంథర్, వీఎఫ్ ఎక్స్ కు షే శాలిత్,ఎడిటర్ గా గ్యారీ బీహెచ్ వంటి గొప్ప హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ సినిమాను చిత్రీకరించాము.ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసే సన్నివేశాలతో అద్భుతమైన టెక్నోలజీతో చిత్రీకరించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ అవుతుంది.అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. భారతీయ భాషలలోనే కాకుండా ఇంగ్లీష్ మరియు చైనీస్ భాషలలో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
నటీనటులు
హీరో – విరాజ్‌రెడ్డి చీలం (నాయకుడిగా రెండో సినిమా, రెండూ విడుదల కాబోతున్నాయి) ,హీరోయిన్స్ – మిమీ లినోర్డ్ (శ్రీలంక), శిల్పా బాలకృష్ణన్ తదితరులు
సాంకేతిక నిపుణులు
సినిమా టైటిల్ -ది గార్డ్ 2020
బ్యానర్ – అను ప్రొడక్షన్స్
నిర్మాత – అనసూయ రెడ్డి
దర్శకుడు – జగ పెద్ది
సినిమాటోగ్రాఫర్- మార్క్ కెన్‌ఫీల్డ్ (హాలీవుడ్)
స్టంట్ డైరెక్టర్ – పువెన్ పాంథర్ (హాలీవుడ్)
ఎడిటర్ – గ్యారీ బిహెచ్
VFX – షే షాలిత్
జోనర్ – థ్రిల్లర్









