‘Udvegam'(Law, judgement & suspense ⚖️)Movie Review

Cinemarangam.Com
బ్యానర్స్ : కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్
సినిమా : ‘ఉద్వేగం’ 
రివ్యూ రేటింగ్ : 3/5 
విడుదల తేదీ : 29.11.2024 
నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధు 
దర్శకుడు: మహిపాల్ రెడ్డి 
నటీనటులు: త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు 
సంగీతం: కార్తిక్ కొడగండ్ల 
సినిమాటోగ్రఫీ: అజయ్ 
ఎడిటర్: జశ్వీన్ ప్రభు 
పీఆర్ఓ: హరీష్, దినేష్ 

2021లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత కోర్టు నేపథ్యంలో వస్తున్న మరో సినిమా ‘ఉద్వేగం’. కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జి శంకర్, ఎల్ మధు లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు. అలాగే త్రిగుణ్ కి ఇది 25వ సినిమా కావడం మరో విశేషం. ఈ చిత్రంలో దీప్సిక కథానాయికగా నటించగా శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఉద్వేగం’ సినిమా  ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం పదండి..

కథ:

‘ఉద్వేగం’ సినిమా క్రైమ్, ఎమోషన్స్ మేళవింపుతో రూపొందిన కోర్టు డ్రామా. మహీంద్రా (త్రిగుణ్) వృత్తిరీత్యా లాయర్. తనదైన శైలిలో క్రిమినల్ కేసులను డీల్ చేస్తుంటాడు. న్యాయ వృత్తినే జీవితంగా భావించే మహీంద్రా లైఫ్ లో ప్రేయసి అమ్ములు (దీప్షిక) కూడా ప్రధాన భాగం. మహీంద్రా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో, గ్యాంగ్ రేప్ కేసు ఒకటి విచారణ కోసం అతని దగ్గరకు వస్తుంది. మొదట కేసును టేకప్ చేయడానికి మహీంద్రా ఒప్పుకోడు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల కేసుని టేకప్ చేస్తాడు. ఆ కేసులో A2 అయిన సంపత్ అనే నిందితుడి కోసం వాదించడానికి మహీంద్రా రంగంలోకి దిగుతాడు. మరోవైపు ప్రసాద్ (శ్రీకాంత్ అయ్యంగార్) అమ్మాయి వైపు నుండి ఈ కేసును వాదిస్తాడు. అసలు ఈ కేసు కారణంగా మహీంద్రా వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఈ గ్యాంగ్ రేప్ కేసుని మహీంద్రా ఎలా డీల్ చేశాడు? సంపత్ ని ఆధారాలతో కేసు నుంచి బయట పడేయగలిగడా? చివరికి ఏం జరిగింది? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి
‘ఉద్వేగం’  సినిమా చూడాల్సిందే..

నటీనటులు:
నాయకుడు పాత్రలోయువ లాయర్ గా త్రిగుణ్ చాలా బాగా నటించాడు . నటనలోనూ ఎంతో పరిణితి కనబరిచాడు. దీప్షిక తన పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించింది. త్రిగుణ్ తో కలిసి ఉన్న ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించింది. త్రిగుణ్ గురువు పాత్రలో పరుచూరి గోపాలకృష్ణ ఎప్పటిలాగే తన మార్క్ చూపించారు. జడ్జిగా సీనియర్ నటుడు సురేష్ బాగానే నవ్వులు పంచారు. ఇక లాయర్ గా శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ నటుడు శివకృష్ణ కూడా తాను పోషించిన పోలీస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.ఇంకా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రాలకు న్యాయం చేశారని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణులు:
కోర్టు డ్రామా సినిమాల్లో సాధారణంగా బాధిత అమ్మాయి తరపున హీరో కేసు వాదించడం చూస్తుంటాం. కానీ ఇందులో బాధిత అమ్మాయి తరపున కాకుండా, A2 నిందితుడు తరపున హీరో కేసు వాదించడం అనేది కొత్త పాయింట్. దాంతో చూసే ప్రేక్షకులు.. ఓ వైపు అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటూనే, మరోవైపు హీరో గెలవాలని కోరుకుంటారు. అయితే కథలోకి వెళ్ళే కొద్దీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. 20 నిమిషాల తర్వాత నుంచి.. సినిమా అసలు ఎక్కడా డౌన్ అవకుండా, చివరివరకూ అదే టెంపో మెయింటైన్ చేసింది. ముఖ్యంగా కోర్టు రూమ్ సన్నివేశాలు, ట్విస్ట్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతి నాయకుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నాయకుడు పాత్ర సినిమాలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలా ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, త్రిగుణ్ మధ్య సన్నివేశాలు అద్భుతంగా పండాయి.

అలాగే త్రిగుణ్, దీప్షిక మధ్య వచ్చే సన్నివేశాలు కూడా రియాలిటీకి దగ్గరగా ఉండడంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి  కలుగుతుంది. అలాగే దర్శకుడు మహిపాల్ రెడ్డి ఈ కోర్టు డ్రామాను ఎలాంటి డైవర్షన్స్ లేకుండా నీట్ గా అదిరిపోయే ట్విస్ట్‌లతో  తనదైన స్క్రీన్ ప్లే, నేరేషన్ తో ప్రేక్షకులను కట్టిపడేసేలా సినిమాని రూపొంచడం లో దర్శకుడుగా సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. జి.వి. అజయ్ కుమార్ కెమెరా పనితనం బాగానే ఉంది. జశ్వీన్ ప్రభు ఎడిటింగ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. మ్యూజిక్ డైరక్టర్ గా కార్తిక్ కొడగండ్ల డీసెంట్ జాబ్ చేశారు. కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మాతలు జి శంకర్, ఎల్ మధులు నిర్మించిన చిత్ర నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఫైనల్ గా ‘ఉద్వేగం’ సినిమా విషయానికి వస్తే ఆకట్టుకునే కథా కథనాలు, ఊహకందని మలుపులతో కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఫ్యామిలీ సమేతంగా వచ్చి చూసే చిత్రమని కచ్చితంగా చెప్పచ్చు.

@Cinemarangam.Com  Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here