‘Vadili Vellipoke’ song impresses the audience from the movie ‘Dirghayushman Bhava’

కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నోయెల్, ఆమని, పృద్వీ, సత్యం రాజేష్, కాశి విశ్వనాధ్,  తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం  ‘దీర్ఘాయుష్మాన్ భవ’. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ గారు  చాలా రోజుల తర్వాత మళ్ళీ యముడి పాత్రలో నటించగా డాక్టర్ ఎంవీకే రెడ్డి సమర్పణలో ప్రతిమ ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. పూర్ణానంద మిన్నకూరి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు. మలహర్ భట్ జోషి ఛాయాగ్రహణం అందించగా వినోద్ యాజమాన్య సంగీతం సమకూరుస్తున్నారు. కిషోర్ మద్దాలి ఎడిటర్ గా చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో ని వదిలి వెళ్ళిపోకే అనే పాట యూట్యూబ్ లో విడుదల కాగా ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. సోసియో ఫాంటసీ ప్రేమకథా చిత్రం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదలతేదీ ని ప్రకటించనున్నారు. 
నటీనటులు :  కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి , నోయెల్, ఆమని, పృద్వీ, తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను తదితరులు
సాంకేతిక నిపుణులు : 
సమర్పణ :  డాక్టర్ ఎంవీకే రెడ్డి
ఎడిటింగ్ : కిషోర్ మద్దాలి
సినిమాటోగ్రఫీ : మలహర్ భట్ జోషి
మ్యూజిక్ :  వినోద్ యాజమాన్య
సాహిత్యం : చిర్రావూరి విజయ్ కుమార్, రాంబాబు గోపాల, పూర్ణ చారి
పబ్లిసిటీ : ధనియేలే
ఆర్ట్ డైరెక్టర్ : ఆర్కే బాబాయ్
మాటలు : ప్రదీప్ ఆచార్య, పూర్ణానంద్
నిర్మాత : ప్రతిమ
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : పూర్ణానంద మిన్నకూరి
పీఆర్వో : సాయి సతీష్ ,  పర్వతనేని రాంబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here