Varun Sandesh ‘Induvadan’ Censor Complete..Movie Releasing on January 1st

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR (ఎం శ్రీనివాసరాజు) దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్, పాటలకు అనూహ్యమైన స్పందన వస్తుంది. కంటెంట్ అంతా కళాత్మకంగా ఉంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎమ్మెస్సార్. విడుదలైన క్షణం నుంచే కంటెంట్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా టీజర్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. U/A సర్టిఫికేట్ వచ్చింది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇందువదన. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.

నటీనటులు:
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్ తదితరులు

టెక్నికల్ టీం:
దర్శకుడు: ఎం శ్రీనివాస రాజు
బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్
నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి
కో ప్రొడ్యూసర్: గిరిధర్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సతీష్ ఆకేటి
సంగీతం: శివ కాకాని
కో డైరెక్టర్: ఉదయ్ రాజ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: వై నాగు
లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన
లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాలా, వర్మ
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here