‘Virgin story’ Movie Success Meet

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా “వర్జిన్ స్టోరి”. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక.రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడ పాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సౌమిక పాండియన్ నాయికగా నటించింది. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం థియేటర్ లలో విడుదలైన “వర్జిన్ స్టోరి” సినిమా యువ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చిత్ర బృందం తెలిపారు. హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా

నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ...”వర్జిన్ స్టోరి” చిత్రంతో ఒక కొత్త ప్రయత్నం చేశామని అభినందిస్తున్నారు. రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. అవకాశం ఉన్నా ఎక్కడా అసభ్యత చూపించలేదు అని ప్రశంసిస్తున్నారు. యూఎస్ నుంచి మిత్రులు కాల్ చేసి అభినందిస్తున్నారు. టీనేజ్ లో ఉన్న వాళ్లకు మా సినిమా కంటెంట్ బాగా అర్థమవుతుంది. సినిమాకు విజయాన్ని అందించి మమ్మల్ని మా టీమ్ ను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు. అన్నారు.

దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ...క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేశాం. యూత్ నుంచి రెస్పాన్స్ బాగుంది. కామెడీలో చాలా రకాలు ఉంటాయి. మేము విభిన్నంగా ఎంటర్ టైన్ మెంట్ ఇద్దామని ప్రయత్నించాం. మంచి రివ్యూస్
వచ్చాయి. ఆడియెన్స్ నుంచి ఇంకా మంచి స్పందన ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. అన్నారు.

నాయిక సౌమిక పాండియన్ మాట్లాడుతూ...నేను పియూ అనే పాత్రలో నటించగలను అని నమ్మిన దర్శకుడు ప్రదీప్ గారికి థాంక్స్. థియేటర్ లో సినిమాచూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను. కానీ కొన్ని సీన్స్ పూర్తయ్యాక నేను బాగానే నటించానని నమ్మకం కలిగింది. కొత్త ప్రయత్నం చేసిన మా చిత్రాన్ని ఆదరించండి. అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్రంలోని ఇతర నటీనటులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here