We guarantee give the ‘Pakka Entertainment to the audience coming to the ‘Pakka Commercial’ Movie.. Producer Bunny vaas, Director Maruthi

వరుస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా “పక్కా కమర్షియల్”.మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న “పక్కా కమర్షియల్” సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు. అలాగే రాశీ ఖన్నా పాత్రను హిలేరియస్‌గా డిజైన్ చేసారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ప్రెస్ మీట్ ను చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని దస్ బల్లా హోటల్ లో ఏర్పాటు చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని జులై 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాసు పాత్రికేయ మిత్రులతో ముచ్చటించారు

దర్శకుడు మారుతి మాట్లాడుతూ..జులై 1న “పక్కా కమర్సియల్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. రావు రమేష్, సత్యరాజ్,సప్తగిరి ఇలా మా టీం అందరూ ప్రతి రోజు పండగే తరువాత మా సేమ్ కాంబినేషన్ GA2, UV మీద ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మంచి ఎంటర్ టైన్మెంట్ తో నా ప్రివియస్ సినిమాల మాదిరే ఈ సినిమాలో కూడా మంచి ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ ను పెట్టుకుంటూ కమర్సియల్ ఎలిమెంట్స్ ఎక్కడా మిస్ కాకుండా ఫైట్స్, పాటలు ఇలా అన్ని రకాలుగా ఉండేలా ప్లాన్ చేసుకొని ఈ సినిమా చెయ్యడం జరిగింది.

చిరంజీవి గారు మా ప్రి రిలీజ్ ఈవెంట్ కు రావడంతో మా సినిమా ఎంతో మందికి రీచ్ అయ్యింది. గోపీచంద్ గత సినిమాలు మాదిరె ఈ సినిమా కూడా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది.. నేను ఎప్పుడూ డైరెక్టర్ అవుతాను అనుకోలేదు. కానీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యాను. మూడు హిట్స్ ఇవ్వగానే పెద్ద హీరోలకు కథలు వినిపించి వారితోనే సినిమాలు చెయ్యాలనుకోను వారితో చేసినా చిన్న సినిమాలను వదులుకోను. చిన్న సినిమాలో దర్శకుడు గా అవకాశం వచ్చినా ఆది పెద్ద ఆఫర్ గా భావిస్తాను. ఈ ఇండస్రీ ఎంతో మంది దర్శకులను చూసింది.మనం ఎంతో మంది గొప్ప దర్శకులనుండి ఎంతో నేర్చుకోవాలి.ఈవివి, గారు, దాసరి గారు ఇలా ఇలా చాలామంది దర్శకులు పెద్ద సినిమాలు చేసి హిట్ ఇచ్చినా, చిన్న సినిమాలను మరువకుండా వాటిని కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి గొప్ప దర్శకుల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి కాబట్టి నా విషయంలో పెద్ద సినిమాలు చేసినా చిన్న సినిమాలు చేస్తూనే ఉంటాను..

జులై 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా డెఫినెంట్ గా ప్రతి ఒక్క ఆడియన్ కు రీచ్ అవుతుంది. యూత్ ఆడియన్స్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అన్ని ఎలిమెంట్స్ ఉన్న “పక్కా కమర్షియల్” సినిమా ఇది.ఈ సీజన్ లో వచ్చే మంచి ఎంటర్ టైన్మెంట్ సినిమా. ఈ సినిమాను మిస్ ఆవ్వరిని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసి మాకు మంచి ఎనర్జీ ఇస్తారని కోరుకుంటున్నాను.

 

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. “పక్కా కమర్సియల్” సినిమా రిలీజ్ అవ్వడానికి అన్ని విధాల కార్యక్రమాలు రెడీ అయ్యాయి. ఫైనల్ కాపీ కూడా చాలా బాగా వచ్చింది.జులై 1న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.మ్వ్వ్ రందరూ ఎప్పుడూ కూడా మా GA2, UV క్రియేషన్స్ లను ఆదరించినట్లే ఈ సినిమాను కూడా ఆదరించండి. అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మారుతి మార్క్ అంటే 100% ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి కడుపారా నవ్వుకొని వెళ్లే సినిమాలు ఉంటాయి. భలే భలే మగాడివోయ్, ప్రతి రోజూ పండగే ఇలా తన సినిమాలు ఏవి తీసుకున్నా కూడా అయన నిర్మించిన ఏడు సినిమాలకు కూడా ఎంటర్ టైన్మెంట్ ఫస్ట్ ప్రిపరన్స్ ఇస్తారు. ఇప్పుడు చేసే ఈ సినిమాకు తను ఎప్పుడూ చెసే ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఒక కమర్సియల్ యాంగిల్ కూడా అంటే గోపీచంద్ గారికి హీరోయిజంలో ఏదైతే పట్టు ఉంటుందో అది కూడా మిస్ కాకుండా ఇటు ఎంటర్టైన్మెంట్ గాను అటు మాస్ ఎలిమెంట్స్ పెట్టుకుని మాస్ ఎంటర్టైన్మెంట్ టైనర్ గా అయన తీయడం జరిగింది. డెఫినెంట్ గా మేము ప్రేక్షకులకు గ్యారెంటీ ఇచ్చేది ఏంటంటే మీరు హ్యాపీగా ఫ్యామిలీ తో సినిమాకు రండి టికెట్స్ కూడా మీకు అనుకూలంగానే తీసుకువచ్చాము. నైజాం లో కూడా చాలా థియేటర్స్, మల్టీప్లెస్ లలో రిలీజ్ చేస్తున్నాము. తీసిన సినిమాలలో కెల్లా ఈ సినిమా కంటే ఇందులో యాక్షన్ చూయించాడు. అందరికీ తగిన ధరలు అంటే సిటీ 150, రూరల్ లో 110 రూపాయలకే మా సినిమా టికెట్స్ ఉంటాయి. ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే కరోనా తరువాత ఫ్యామిలీ తో అందరూ వచ్చి హ్యాపీగా ఎంటర్ టైన్ అవుతారని తీసుకున్న నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ లో ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఆక్కడకూడా ఎటువంటి ఎక్స్ రేట్స్ లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేయడం జరుగుతుంది.అయితే మా సినిమాను చాలామంది ఓటిటి లో చూద్దాం అనుకుంటు న్నారేమో కానీ ఇప్పట్లో ఈ సినిమా ఓటిటి లో రాదు. కాబట్టి మీరందరూ మా సినిమాను చూసి ఆశీర్వదిస్తే ఇంకా వచ్చే సినిమాలతో ఇండస్ట్రీ ముందుకు వెళుతుంది. కరోనా తర్వాత సమస్యల లో ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది.కాబట్టి అందరూ సపోర్ట్ చెయ్యాలని కోరుతున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here