
సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి మాట్లాడుతూ “వెల్కమ్ తో తీహార్ కాలేజీ చాలా గొప్ప సినిమా. పాటలు చాలా బాగా వచ్చాయి. కథకి కథనానికి అనుగుణంగా ఉంటాయి. సునీల్ గారితో జర్నీ చాలా గొప్పగా ఉంది. సినిమా చాలా గొప్పగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది” అని కోరుకున్నారు.నిర్మాత ఎక్కలి రవీంద్ర బాబు మాట్లాడుతూ “ఈ చిత్రం నేటి యువతకి బాగా నచ్చుతుంది మరియు తల్లిదండ్రులకు కూడా బాగా నచ్చుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
మనోజ్ నందం మాట్లాడుతూ “ఈ చిత్రం నేటి ఎడ్యుకేషన్ సిస్టం గురించి ప్రతిఫలించేలా తీయడం జరిగింది. ప్రతి తల్లీ తండ్రి మరియు ప్రతి విద్యార్థి తప్పకుండా చూడాలి. మన ఎడ్యుకేషన్ సిస్టం మెరుగు కోసం చేసిన సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది ” అని కోరుకున్నారు.
ముఖ్య అతిధి చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ “చిన్న సినిమాలు హిట్ అయితే అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. సునీల్ గారు మంచి చిత్రాలు నిర్మిస్తారు. ఈ తీహార్ కాలేజ్ చిత్రం కూడా మంచి చిత్రంగా నిలిచిపోవాలి” అని కోరుకున్నారు.
మాతృదేవోభవ దర్శకుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ ” సమకాలీన అంశాలతో చిత్రాలు నిర్మిస్తే అవి తప్పక విజయవంతం అవుతుంది ఆ కోవలోకి ఈ చిత్రం వస్తుందని అన్నారు.
బాపి రాజు మాట్లాడుతూ “వెల్కమ్ తో తీహార్ కాలేజ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి విచ్చేసిన అతిదులందరికి ధన్యవాదాలు. యూత్ కి తల్లి తండ్రులకి అందరికి నచ్చుతుంది. మా చిత్రాన్ని అక్టోబర్ 28న విడుదల చేస్తాం” అని తెలిపారు.
బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్
నటి నటులు : మనోజ్ నంధం ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా, వినయ్ మహాదేవ్, స్టార్ మేకర్ సత్యానంద్, , బుగత సత్యనారాయణ, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను, మల్లికా తదితరులు
కెమెరా మాన్ & ఎడిటింగ్ : సాబు జేమ్స్
సంగీత దర్శకుడు : ప్రవీణ్ ఇమ్మడి.
కలరింగ్ అమల్
వి ఎఫ్ ఎస్ : శ్యాం కుమార్ ,పీ
పి ఆర్ ఓ : పాల్ పవన్
సౌండ్ మిక్సింగ్: పద్మారావునిర్మాతలు : డాక్టర్ ఎల్ ఎన్ రావు యెక్కలి రవీంద్ర బాబు
దర్శకుడు : పి సునీల్ కుమార్ రెడ్డి









