ఉగాది పండగ అంటే చాలా మందికి ఒక్క ఉగాది పచ్చడి తినటమే అని తెలుసుగాని దాని ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు.. ఈతరం వాళ్ళకి అసలు తెలియదు. మనమందరం ఈ పండగ ఎందుకు జరుపుకుంటాము, ఉగాది పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటి..ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకొందాం…..
బ్రహ్మ విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజునే ఉగాది పండగ అని పురాణాల ప్రవచనం. ఈ ఉగాది పండగ చారిత్రిక వివరాలను కూడా కలిగి ఉంది. ఉగాది పండగ శాలివాహనుల కాలం నుండి ఆచరణలో ఉన్నాదని చరిత్రకారుల మాట. అప్పటి శాలివాహనుల రాజు “గౌతమీపుత్ర శాతకర్ణి”గా పేర్గాంచిన రాజా శాలివాహన ఉగాది పండగకు శ్రీకారం చుట్టారు.తెలుగు సంవత్సరాలు 60. ప్రభవతో మొదలై అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్లీ తిరిగి ప్రభవతో ఆరంభమవుతుంది. ఈ పేర్ల వెనుక భిన్న వాదనలు ఉన్నాయి.
ఓ పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడి 16100 మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి నామాలనే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. నారదుడి పిల్లల పేర్లు వీటికి పెట్టారనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దక్షుడు కుమార్తెల పేర్లుకూడా ఇవేనని అంటారు.కాలమానంలోని అంశాలన్నింటిని పూర్తిగా ఖగోల శాస్త్రరీత్యా పురాతన భారతీయులు నిర్ణయించారు.కాలమాన అంశాలైన… రోజు, వారం, పక్షం, కార్తె మాసం, రుతువు, అయనం, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం మొదలైన అన్నింటినీ ఖగోళ శాస్త్ర ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఖగోళపరమైన కాలమానాన్ని పురాణకాలం నుంచి ఆచరించడం భారతీయుల ఘనత. ఇది మన భారతజాతి కాలమాన పరిజ్ఞానానికి ఉన్న అవగాహనను తెలిజేస్తుంది. అంతేకాదు మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉంది ఉగాది.
ప్రపంచ వ్యాప్తంగా జనవరి 1 నూతన సంవత్సరం అయితే తెలుగు వారికి ఉగాది పండుగతో నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది… తెలుగు వారు ఉగాది పండుగను ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు.అయితే ఉగాది అంటే ఉగస్య ఆది అనేదే ఉగాది. ఉగ… అంటే నక్షత్ర గమనము జన్మ ఆయుష్షు అని అర్థం. ఇక ఆది అంటే మొదలు…..ఉగాది అంటే యుగానికి ఆది అనే అర్థం వస్తుంది. తెలుగు సంవత్సరాని ఆరంభంగా ఉగాదిని చెబుతారు.
తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం.చైత్రమాసంలోని మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.ఇది అచ్చమైన పకృతి పండగ. ఈ పండగను షడ్రుచుల సమ్మేళనంగా పిలుస్తారు. ఆ రోజు ఉగాది పచ్చడి,పిండివంటలు, మామిడి తోరణాలతో తెలుగు లోగిళ్లు అన్ని కళకళలాడుతాయి. చిరు వేప పూత.. మామిడి కాత.. పులుపులో పులకింతతో పాటు ఆరు రుచులతో పాటు ఆనందంగా ఆరంభించే తెలుగు నూతన సంవత్సరమే ఉగాది పండుగ. ఈ షడ్రుచులలో ఒక్కో రుచికి, ఒక్కెో పదార్థానికి ఒక్కో భావానికి ప్రతీక అని పెద్దలు చెబుతుంటారు.
ఉప్పులో ఉండే గుణం మన జీవితంలో ఉత్సాహానికి, వేప పూతలోని చేదు మన జీవితంలో బాధ కలిగించే అనుభవాల గురించి, చింతలోని పులుపు.. మన నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను, మామిడి ముక్కలలోని వగరు వంటి రుచులు.. కొత్త సవాళ్ల గురించి..ఇక చివరగా కారం విషయానికొస్తే మనల్ని సహనం కోల్పేయేటట్టు చేసే పరిస్థితులను గుర్తు చేస్తుంది.
కొత్త సంవత్సరాదైన ఉగాది నుండే వసంతకాలం మొదలవుతుంది. వాతావరణం ఈ రోజు నుండి ప్రత్యేక అందాలను సంతరించుకొంటుంది.ఈ సమయంలో వృక్షాలు కొత్త ఆకులు, పూలతో చూపరులను ఆహ్లాదపరుస్తాయి.ఎక్కడ చుసిన పచ్చదనం కనిపిస్తుంది. ఉగాది రోజున కొత్త పనులు, నిర్ణయాలు ప్రారంభించే సమయమని తెలుగు ప్రజలు నమ్ముతారు. అంతే కాకుండా ఈరోజు కొత్త వస్తువులను కూడా కొని ప్రారంభించటం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఉగాది పండగ ఎంతో కొత్తగా అనిపిస్తుంది. వికారి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాది శార్వరి నామ సంవత్సరానికి ఘన స్వాగతం పలకండి. ఈ ఏడాది కూడా కొత్తగా జరుపుకోండి.
వీటన్నింటి సంగతి పక్కనబెడితే ప్రస్తుతం కరోనా వైరస్ కల్లోలం కారణంగా ప్రజలు ఇళ్లలో ఉండే.. పండుగ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా మంది తమ బంధు, మిత్రులను కలుసుకోలేమని బాధపడాల్సిన అవసరం లేదు.తీపి, చేదు కలిసిందే జీవితం కష్టం, సుఖం తెలిసిందే జీవితం.
మీరు మీ కుటుంబ సభ్యులు ఇంటి వద్ద ఉండి త్వరగా ఈ దేశంలో కరోనా వైరస్ పోవాలని….సరికొ త్త సంకల్పతొ అన్ని కష్టాలని ఎదుర్కొనె శక్తి ని సాదిద్దాం…. రాష్ట్రం మరియు దేశం సుఖ సంతోషాలతో ఉండాలని..ఈ దేశానికి వచ్చిన కరోనా మహమ్మరిని నుండి త్వరగా విముక్తి కలిగించాలని ఉగాది పండుగ రోజున దేవుణ్ణి ప్రార్థించాలని తెలియజేస్తూ మా Cinema Rangam.com ఎదుగు దలకు తోడ్పడుతూ మాకు సపోర్ట్ గా నిలిచి ప్రోత్సాహమిస్తున్న మీకు మీ…కుటుంబ సభ్యులకు శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలతో….. మీ.. Cinema Rangam









