కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ‘బింబిసార’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను రీసెంట్గా విడుదల చేయగా విశేషమైన స్పందన లభించింది. ఇక నేడు (జూలై 13)గురుపూర్ణిమ సందర్భంగా బుధవారం ఈ మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ...
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. ‘మీడియాకు, నందమూరి అభిమానులకు, ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. మా ట్రైలర్‌కు విశేషమైన స్పందన ఇచ్చిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన చిరంతన్ గారి, అద్బుతమైన సాహిత్యం ఇచ్చిన శ్రీమణి గారికి, పాడిన కాళ భైరవకు థ్యాంక్స్. ఈ పాట మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మా బింబిసారుడి త్రిగర్తల రాజ్యం నుంచి మొదటి పాట. ఇలాంటివి ఇంకా వస్తాయి. కర్మ సిద్దాంతాన్ని ఆధారంగా ఈ పాట నేపథ్యాన్ని తీసుకున్నాం. బింబిసారుడు చేసే యుద్దం ఎలా ఉంటుందో ఆగస్ట్ 5న చూస్తారు’ అని అన్నారు
సంగీత దర్శకుడు చిరాన్ బట్ మాట్లాడుతూ..గురుపూర్ణిమ సందర్భంగా ఈ పాటను విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేశారు . ఈశ్వరుడే అనే ఈ పాట కర్మ చుట్టూ తిరుగుతుంది. దీన్ని కంపోజ్ చేయడం నాకు చాలెంజింగ్‌గా అనిపించింది’
ఈ సాంగ్ ను ఫిలాసఫికల్ టచ్ తో మంచి మీనింగ్ వచ్చేలా అద్భుతంగా రాశారు మణి గారు..ఆగష్టు 5 న వస్తున్న ఈ సినిమా అందరికి కచ్చితంగా నచ్చుతుంది అన్నారు
లిరిక్ రైటర్ శ్రీ మణి మాట్లాడుతూ..కళ్యాణ్ రామ్ తో “పటాస్” చిత్రం తో నా జర్నీ నా స్టార్ అయ్యింది. వశిష్ఠ గారు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని తెరాకెక్కించాడు. కలియుగంలో అయితే ఎప్పుడు చేసిన పాపం అప్పుడే కనిపిస్తుంది అనే విధంగా ఈశ్వరుడి సాంగ్ రాయడం జరిగింది.కాళ భైరవ గారు తన గాత్రంతో ఈ పాటకు
చాలా ఎఫెక్ట్ పెట్టి అద్భుతంగా పాడారు. ఇలాంటి మంచి పాటను రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు









