Cinemarangam.Com
బ్యానర్ : జే. కె ఎంటర్టైన్మెంట్స్
సినిమా : “పా పా ”
రివ్యూ రేటింగ్ : 3.5/5
విడుదల తేదీ : జూన్ 13
ప్రొడక్షన్ హౌస్ – జేకే ఎంటర్ టైన్ మెంట్స్,
ప్రొడ్యూసర్ – నీరజ కోట,(ఎన్నారై)
దర్శకత్వం: గణేష్ కె.బాబు
నటీనటులు – కవిన్, అపర్ణా దాస్, భాగ్యరాజ, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి, మాస్టర్ ఇయాన్ తదితరులు
కో ప్రొడ్యూసర్స్ – శశాంక్ చెన్నూరు, శ్రీకాంత్ నూనెపల్లి, వెంకట్ బొమ్మరాజు
కెమెరా: ఎలిల్ అరసు
మ్యూజిక్ – జెన్ మార్టిన్
లిరిసిస్ట్ – రవి వర్మ ఆకుల
మనుషులుగా మనం ఎంత ఆధునిక జీవితాన్ని సాగిస్తున్నా మనలోని హ్యూమన్ ఎమోషన్స్, విలువలు మారవు. అవి అలాగే ఉంటాయని చెప్పే చిత్రమే “పా పా”. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ “డాడా”. తమిళంలో విడుదలై దాదాపు 40 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రాన్ని జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఎన్నారై శ్రీమతి నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు “పా పా” పేరుతో తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. ఈ నెల 13న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ అయిన “పా పా” చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..
కథ :
కాలేజీలో చదువుకుంటూ పీకల్లోతు ప్రేమలో పడిపోవడమే కాకుండా… పెళ్ళికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న విచిత్ర మలుపుల సమాహారం “పాపా”. వయసులో ఉండే ఆకర్షణలు, ఆవేశాలు, అపార్ధాలు, తరాల మధ్య అంతరాలు, వ్యక్తుల మధ్య ఉండే ఇగోలు, ఫ్రెండ్ షిప్, హెల్పింగ్ నేచర్, ముఖ్యంగా బంధాలు, భావోద్వేగాల కలబోతగా “పాపా” చిత్రాన్ని దర్శకుడు గణేష్ బాబు ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు. దర్శకుడిగా ఇతని పేరు కచ్చితంగా ముందు ముందు మరింత వింటాం. అందులో సందేహం లేదు. కథగా చెప్పుకోవడానికి సింపుల్ గా ఉన్నా… కథనాన్ని రక్తి కటించిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!

విశ్లేషణ:
భాగ్యరాజా, విటివి గణేష్ తప్ప మిగతా పాత్రలు పోషించినవారు మనకు తెలియనివారే అయినప్పటికీ… ప్రేక్షకులు ఆయా పాత్రలతో సహానుభూతి చెందుతారు. హీరోగా నటించిన కవిన్, హీరోయిన్ పాత్ర పోషించిన అపర్ణాదాస్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తారు. వీళ్ళ అబ్బాయిగా చేసిన మాస్టర్ ఇయాన్ తోనూ మనం ప్రేమలో పడిపోతాం. ముఖ్యంగా క్లైమాక్స్ లో కంట తడి పెట్టని వారంటూ ఎవరూ ఉండరు. హృదయాల్ని మెలిపెట్టేసే పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. బరువెక్కిన గుండెలతో థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు… చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ చూశామనే సంతృప్తికి లోనవుతారు. హీరోయిన్ అపర్ణాదాస్… కెరీర్ బిగినింగ్ నాటి నయనతారను కాస్త పోలి ఉండడం వల్ల… అట్లీ దర్శకత్వంలో ఆర్య – నయనతార నటించగా ఘన విజయం సాధించిన “రాజా – రాణి” చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఆ పోలిక జోనర్ కు మాత్రమే పరిమితం.

ప్లస్ పాయింట్స్:
దర్శకత్వం, నటీనటుల పని తీరు తర్వాత… ఛాయాగ్రహణం, సంగీతం కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే అనువాదం పరంగా తీసుకున్న జాగ్రత్తలు “పాపా” చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. డబ్బింగ్ చిత్రమనే విషయం తెలియకుండా… థియేటర్లకు వెళ్లి సినిమా చూసేవాళ్ళు… స్ట్రెయిట్ సినిమా చూస్తున్న అనుభూతిని పొందుతారు. సంభాషణలు కూడా చాలా చోట్ల ఆకట్టుకుంటాయి, కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి కూడా.
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే మరింత బాగుండేదనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ ను ఇంకొంచెం క్యాష్ చేసుకునెలా రెండుమూడు సీన్స్ కన్సీవ్ చేసుకుని ఉంటే ఎమోషన్ మరింత పండేదనిపిస్తుంది. “సింగిల్ పేరెంటింగ్”లో ఉండే పెయిన్, తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ కు ఇంకొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఉంటే కూడా ఇంకా బాగుండేదనిపిస్తుంది. అయితే… మనసు తడిని వెలికి తీసే క్లైమాక్స్… ఇటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ కు తావు లేకుండా చేస్తుంది. దర్శకుడి మీద గౌరవం పెంచేలా చేస్తుంది!!

చివరిగా చెప్పాలంటే…
ఫీల్ గుడ్ మూవీస్ ను ఇష్టపడేవాళ్ళంతా మిస్సవ్వకుండా చూడాల్సిన చాలా మంచి చిత్రం “పాపా”. ఎన్నారై ప్రొడ్యూసర్ శ్రీమతి నీరజ కోట ఉత్తమాభిరుచికి ఈ చిత్రం అద్దం పడుతుంది. ఒక టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన చిత్రంగా “పాపా” పదికాలాలపాటు నిలిచిపోతుంది!!
Cinemarangam Review *Rating: ⭐️⭐️⭐️½ (3.5/5)









