Advocate Harini Organizes Annadanam at Basavatarakam Hospital on Her Birthday

తన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు ఏమైనా చేయాలి అని సదుద్దేశంతో నేడు తన పుట్టిన రోజు కావడంతో డాక్టర్ కోనేటి హరిణి ఎల్.ఎల్.ఎమ్ హైదరాబాద్ లోని నందమూరి బాలకృష్ణ గారు తమ తల్లి జ్ఞాపకంగా మొదలుపెట్టిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వద్ద హరిణి గారు సుమారు 200 మందికి పైగా అన్నదానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా హరిణి గారు మాట్లాడుతూ… “నాకు మొదటి నుండి పేదవారికి ఏదో ఒకటి చేయాలని ఉండేది. నా ప్రతి పుట్టినరోజుకి గత కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. గత సంవత్సరం అనాధాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో నా వంతు సాయంగా కొన్ని సేవ కార్యక్రమాలు చేపట్టాను. అయితే నేను రోజు ఇదే మార్గంలో వెళ్తూ ఉండగా ఇక్కడ హైదరాబాద్లోని బసవతారకం హాస్పిటల్ లో ఎంతోమంది పేదవారు వైద్యం చేపించుకుంటూ ఉంటారు. వారి కుటుంబ సభ్యులు అంతా బయట ఉండడం గ్రహించాను. వారి కోసం ఏమైనా చేయాలని అని ఉండేది. ఈ సంవత్సరం నేడు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉండేవారికి అన్నదానం చేద్దామని ఉద్దేశంతో సుమారు 200 మందికి పైగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా నేను మరిన్ని ఇటువంటి సేవ కార్యక్రమాలలో పాల్గొని మరింతమందికి నా సాయం అందజేసేందుకు ప్రయత్నిస్తాను” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here