“ADIPARVAM” Movie Review (Periodic Love Entertainer)

Cinemarangam.Com
బ్యానర్ :  అన్వికా ఆర్ట్స్ , ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్
సినిమా : “ఆదిపర్వం”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 08.11.2024
నిర్మాణం – అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్
రచన, దర్శకత్వం – సంజీవ్ మేగోటి
నటీనటులు – మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్, యోగి ఖత్రి , మధు నంబియార్, బీఎన్ శర్మ, బృంద, స్నేహ అజిత్, అయోషా, జ్యోతి, దేవి శ్రీ ప్రభు, శ్రావణి, గూడా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, రవి రెడ్డి, లీలావతి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీరామ్, తదితరులు
కో డైరెక్టర్ – సిరిమల్ల అక్షయ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – ఘంటా శ్రీనివాసరావు
సహ నిర్మాతలు – గోరెంట శ్రావణి, రవి మొదలవలస, ప్రదీప్ కాటకూటి, రవి దశిక, శ్రీరామ్ వేగరాజు.
సినిమాటోగ్రఫీ – ఎస్ ఎన్ హరీశ్
మ్యూజిక్ – మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ(సుధీంద్ర)
ఎడిటింగ్ – పవన్ శేఖర్ పసుపులేటి
ఫైట్స్ – నటరాజ్
కొరియోగ్రఫీ – సన్ రేస్ మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్ – కేవీ రమణ
ప్రొడక్షన్ మేనేజర్స్ – బిజువేముల రాజశేఖర్ రెడ్డి, కొల్లా గంగాధర్, కంభం ప్రకాష్ రెడ్డి
పీఆర్ఓ– మూర్తి మల్లాల
పీఆర్ డిజిటల్ టీమ్ – కడలి రాంబాబు, దయ్యాల అశోక్

రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం “ఆదిపర్వం”. ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా “ఆదిపర్వం” చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ఆదిపర్వం” సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం పదండి.


కథ:
రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడి నేపథ్యంతో రూపొందిన ఒక పీరియాడిక్ ప్రేమకథే “ఆధిపర్వం” . ఈ సినిమా 1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఉండే బుజ్జమ్మ – శ్రీను 12 ఏళ్ల తర్వాత కలుసుకుంటారు. ప్రేమించుకుంటారు. సీన్ క‌ట్ చేస్తే.. ఆ ఊరిలో ఉండే అమ్మ‌వారి ఎర్ర‌గుడి గుహ‌లో ఉండే గుప్త నిధి సొంతం చేసుకుంటే రాయ‌ల‌సీమలోనే గొప్ప‌వాళ్లు అవుతార‌ని భావించి దానిపై కొంద‌రు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడ‌తారు. ఎమ్మెల్యే నాగ‌మ్మ (మంచు లక్ష్మి) గుప్త నిధి కోసం ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం క్షుద్ర శక్తుల కోసం ప్రయత్నిస్తుంది. మ‌రోవైపు రాయప్ప అనే గ్రామ నాయ‌కుడు కూడా గుప్త నిధి కోసం ప్ర‌య‌త్నిస్తాడు. ఈ క్ర‌మంలో రాయ‌ప్ప త‌న కూతురును ఎందుకు చంపాల‌ని అనుకుంటాడు? నాగ‌మ్మను కూడా ఎందుకు చంపాల‌నుకుంటాడు? చివ‌రికి గుప్త‌నిధి కోసం జ‌రిగిన ఆరాచ‌కాలు ఏంటీ? అనే విష‌యాలు తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి “ఆదిపర్వం” సినిమా చూడాల్సిందే

న‌టీన‌టుల పనితీరు :
మంచు లక్ష్మి తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు. కొన్ని సీన్ల‌లో ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తుంది. అదిత్య ఓం కీలక పాత్రలో కనిపించగా, ఎస్తేర్ పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. అలాగే, బెంగాలి నటి శ్రీజిత ఘోష్, సుహాసినీ (“చంటిగాడు” ఫేం) కూడా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. ఇంకా ఇందులో నటించిన వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్, యోగి ఖత్రి , మధు నంబియార్, బీఎన్ శర్మ, బృంద, స్నేహ అజిత్, అయోషా, జ్యోతి, దేవి శ్రీ ప్రభు, శ్రావణి, గూడా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, రవి రెడ్డి, లీలావతి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీరామ్ తదితరులంతా
వారికిచ్చిన పాత్రల మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
అప్పట్లో ఆల‌యాల్లో విగ్రహాలు ధ్వంసం చేసి నిధులు దొంగిలించే ఘటనలకు కొంత ఫిక్షన్‌ను మిక్స్ చేస్తూ తెరకెక్కించడమే కాకుండా.. ఆల‌యాల పట్ల ఉన్న గౌరవాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని కూడా గుర్తుచేస్తూ.. రాయలసీమ నేపథ్యంలో ఒక పీరియాడిక్ కథని సెలెక్ట్ చేసుకొని దానికి ఫాంటసీని జోడించి చూస్తున్న ప్రేక్షకుడు ప్రతి పాత్రను ఒక కొత్త అనుభూతిని పంచేలా “ఆదిపర్వం” చిత్రాన్ని తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు సంజీవ్ మేగోటి. . ఈ చిత్రానికి కథా నిర్మాణం, నటీనటుల పెర్ఫార్మెన్స్, గ్రాఫిక్స్ ఈ ప్రధాన బలం. ముఖ్యంగా అమ్మోరు, అరుంధతి తరహా పీరియాడిక్ ఫాంటసీ సినిమాల మాదిరిగా ప్రేక్షకులకి దృశ్యానుభవాన్ని అందించారు. కథలొని ట్విస్ట్ లు బాగున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ మరో మెట్టుకు తీసుకెళ్లాయి. పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటింగ్ పనితీరు బాగుంది, అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మించిన చిత్ర నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఫైనల్ గా “ఆదిపర్వం” సినిమా విషయానికి వస్తే రెండు గంటలపాటు ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఎంటర్ టైనింగ్ తో రూపొందించిన ఈ సినిమా అన్ని త‌ర‌హా ప్రేక్ష‌కుల‌కు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు ఈ చిత్రం ఎంత‌గానో న‌చ్చుతుంది.

Cinemarangam.Com Review Rating: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here