Cinemarangam.Com
బ్యానర్ : ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్
సినిమా : “ధూం ధాం”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 08.11.2024
ప్రొడ్యూసర్ – ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ – సాయి కిషోర్ మచ్చా
స్టోరీ స్క్రీన్ ప్లే – గోపీ మోహన్
నటీనటులు – చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ – గోపీ సుందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ కుమార్
ఎడిటింగ్ – అమర్ రెడ్డి కుడుముల
డైలాగ్స్ – ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ – విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ – రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ – అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ – రఘు కులకర్ణి
పీఆర్ ఓ– జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని గ్రాండ్ గా ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ధూం ధాం” సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం పడండి..

కథ:
కార్తీక్ (చేతన్ కృష్ణ) సరదాగా తన మిత్రులు (ప్రవీణ్, నవీన్)లతో తిరుగుతూ కాలం గడిపేస్తూ వుంటారు. సుహానా(హెబ్బా పటేల్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. మనసులో ప్రేమ ఉన్నా సుహానా లవ్ చేయడానికి నిరాకరిస్తుంది. కానీ పొలెండ్‌కు జాలీ ట్రిప్‌కు వెళ్లిన కార్తీక్‌కు సుహానా కూడా జతకలుస్తుంది. అయితే తన ప్రేమను అంగీకరించడానికి ఓ పరీక్ష పెట్టిందనే కారణంతో సుహానాకు కార్తీక్ బ్రేకప్ చెప్పి.. మరో యువతితో నిశ్చితార్థానికి సిద్దమవుతాడు. అయితే పొలెండ్ అమ్మాయితో కూడా కార్తీక్ ఎంగేజ్‌మెంట్ చేసుకోకుండానే బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకొని కార్తీక్, సుహానా ఒక్కటవుదామని అనుకొంటారు. కానీ వారి ప్రేమకు కార్తీక్ తండ్రి (సాయికుమార్)పై పాత పగ కారణంగా సుహానా నాన్న, పెద్దనాన్నలు (వినయ్ వర్మ, బెనర్జీ, గోపరాజు) అడ్డుగా నిలుస్తారు. తొలుత కార్తీక్ ప్రేమను సుహానా ఎందుకు నిరాకరించింది? పొలెండ్‌లో కుదిరిన సంబంధాన్ని కార్తీక్ ఎందుకు బ్రేకప్ చేసుకొంటాడు? హెబ్బా గురించి కార్తీక్ ఏం తెలుసుకొని ఆమె ప్రేమను అంగీకరిస్తాడు? కార్తీక్ తండ్రిపై సుహానా ఫాదర్‌కు ఉన్న పాత పగ ఏంటి? ఇక కార్తీక్ ఫ్రెండ్స్ (ప్రవీణ్, నవీన్)పై సుహానా పెదనాన్నలకు ఎందుకు కోపం ఉంది? ఇలాంటి ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకొని కార్తీక్, సుహానాలు ఒక్కటయ్యారా లేదా ? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి
“ధూం ధాం“. సినిమా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు ..
హీరోగా చేతన్ కృష్ణ తొలిపరిచయం అయినా సరే నటన పరంగా మెప్పిస్తాడు. లవ్ సీన్లలో చాలా బాగా నటించాడు. అలాగే సాంగ్స్ కూడా మెప్పించే విధంగా ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా చేశాడు. కచ్చితంగా సిల్వర్ స్క్రీన్‌పై మంచి భవిష్యత్తు ఉంది. ఇక హెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో గ్లామర్ తో పాటు బెస్ట్ పెర్ఫార్మర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొత్త హీరో చేతన్ కృష్ణ తో కలసి కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. 80% కమెడియన్స్ ఉన్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ తన మార్క్ కామెడీతో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించాడు. ప్రవీణ్, నవీన్ లు కూడా కామెడీ పండించారు. శ్రీనివాసరావు, పృథ్వీరాజ్, బెనర్జీ, గోపరాజు రమణ, వినయ్ వర్మ లు సీరియస్ గా ఉంటూనే ప్రేక్షకులను నవ్వించారు. ఇంకా ఇందులో నటించిన , శివన్నారాయణ, గిరిధర్, భద్రమ్, రతిక రోజ్, యాంకర్ హర్షిణి, తదితరులు అందరూ వారికిచ్చిన పాత్రాలకు న్యాయం చేశారని చెప్పచ్చు..

సాంకేతిక నిపుణుల పనితీరు
ప్రేక్షకులకు వినోదాన్ని అందించి వారి బాధలను తగ్గించే ప్రతి దర్శకుడూ గొప్పవాడే అన్నట్టు . దర్శకుడు సాయి కిషోర్ మచ్చ, రైటర్ గోపీ మోహన్ రాసిన కథ… స్క్రీన్ ప్లేను తన ప్రతిభతో అన్ని వర్గాల ప్రేక్షకులు కూర్చుని హాయిగా నవ్వుకునేలా తెరపై ఆవిష్కరించిన విధానం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం పోలెండ్ లో జరగడంతో అక్కడ లొకేషన్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. పొలెండ్ ఎపిసోడ్, అలాగే సెకండాఫ్‌లో పెళ్లి ఎపిసోడ్ లో వెన్నెల కిషోర్ రాకతో… ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా తెరకెక్కించడంతో సరదాగా రెండు గంటలపాటు చూసేలా చేస్తాయి. ఈ సినిమాకు గోపి సుందర్, సిద్దార్థ్ రామస్వామి, గోపి మోహన్, ప్రవీణ్ వర్మ పనితీరు ఈ సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లాయి. అలాగే ఈ సినిమాకు గోపీ సుందర్ గారి మ్యూజిక్, రామజోగయ్య గారి లిరిక్స్ మా మూవీకి ఆకర్షణగా నిలుస్తాయి. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి గారు రాసిన అన్ని పాటలు బాగున్నాయి. మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా పాట అద్భుతంగా వుంది. అమర్ రెడ్డి ఎడిటింగ్ పనితీరు బాగుంది, ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన చిత్ర నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఫైనల్ గా “దూం.. దాం” సినిమా విషయానికి వస్తే రెండు గంటలపాటు ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఎంటర్ టైనింగ్ తో రూపొందించిన ఈ సినిమాను ఫ్యామిలీ సమేతంగా వచ్చి సరదాగా ఎంజాయ్ చేయచ్చని చెప్పవచ్చు.
Cinemarangam.Com Review Rating 3/5









