Cinemarangam.Com
బ్యానర్ : మై టీ ఓక్ పిక్చర్స్
సినిమా : ‘C.202’
రివ్యూ రేటింగ్ : 3./5
విడుదల తేదీ : 25.10.2024
నిర్మాత : మనోహరి కెఏ
కథ స్క్రీన్ ప్లే మ్యూజిక్ ఎడిటర్ డైరెక్టర్ : మున్నాకాశి
నటీనటులు : మున్నాకాశి, తనికెళ్ల భరణి, సత్య ప్రకాష్, షఫీ; శుభలేఖ సుధాకర్, అర్చన, చిత్రం శ్రీను, వై. విజయ, షరూన్ రియా ఫెర్నాండెస్, డ్రీమ్ అంజలి, సెల్వ (ఇక్బాల్), డాక్టర్ ఏవి గురవారెడ్డి తదితరులు
డి ఓ పి : సీతారామరాజు ఉప్పుతల
మై టీ ఓక్ పిక్చర్స్ పతాకంపై మున్నాకాశి, తనికెళ్ల భరణి, సత్య ప్రకాష్, షఫీ; శుభలేఖ సుధాకర్, అర్చన, చిత్రం శ్రీను, వై. విజయ,నటీ నటులుగా మున్నాకాశి దర్శకత్వంలో మనోహరి కెఏ నిర్మించిన హార్రర్ థ్రిల్లర్ చిత్రం “C.202”.ఈ సినిమా టీజర్, ట్రైలర్, ఇప్పటికే ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాయి .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “C.202” సినిమా ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్దాం..

కథ
కథ మొత్తం ఒక ఇంట్లో జరుగుతుంది. C.202 ఇంట్లో ఒక హత్య జరుగుతుంది. అది ఒక సాంఘిక శక్తి చేతబడి వల్ల జరుగుతుంది. తనికెళ్ల భరణి (బూరా) భూతాల రాజుగా, వశీకరణం, చేతబడి తెలిసిన వ్యక్తి. తను చేసిన చేతబడితోనే ఆ ఇంట్లో ఒక అమ్మాయి చనిపోతుంది. అదే ఇంట్లోకి శుభలేఖ సుధాకర్, అర్చన ల కుటుంబం వస్తుంది. వాళ్లకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి పెళ్లి అయిపోయి యుఎస్ లో ఉంటుంది. వాళ్లు తమ పెద్దమ్మాయి దగ్గరికి వెళ్తూ మిగతా ఇద్దరు కూతుళ్ళని ఇద్దరు స్నేహితులతో ఆ ఇంట్లో వదిలి వెళ్తారు. అందులో ఒక స్నేహితుడిగా మున్నాకాశి (అయాన్) షరూన్ రియా ఫెర్నాండెస్ (రియా), తన చెల్లికి మరియు తన స్నేహితురాలు మ్యాడి కి తోడుగా ఉంటాడు. ఆ ఇంట్లో వీళ్ళందరికీ వింత వింతగా రూపాలు కనపడటం భయం కలిగించే సంఘటనలు జరుగుతాయి. అసలు ఆ ఇంట్లో ఏముంది? శుభలేఖ సుధాకర్ కుటుంబం ఆ ఇంటికి ఎలా వెళ్లారు? ఆ ఇంట్లో ఉన్న అసాంఘిక శక్తులను ఎవరు తరిమికొట్టారు? తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు
మున్నాకాశి, షరూన్ రియా ఫెర్నాండెస్ అద్భుతంగా నటించారు. భయపడి భయపెట్టే క్యారెక్టర్లలో మంచి నటనను కనబరిచారు. భూతాల రాజు గా తనికెళ్ల భరణి గారి క్యారెక్టర్ బావుంది. సత్య ప్రకాష్, షఫీ, వై. విజయ వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. సపోర్టింగ్ రోల్ లో చిత్రం శ్రీను నటన, క్యారెక్టర్ చాలా బాగున్నాయి. తనికెళ్ల భరణి, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శ్రీను తదితరులు అందరూ వారికిచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
కథని ఎంచుకోవడం దగ్గరనుంచి స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఎడిటింగ్ మరియు దర్శకత్వం వహించిన మున్నాకాశి పడిన కష్టం కనిపిస్తుంది.హార్రర్ సీన్స్ తో సగటు ప్రేక్షకుడిని దర్శకుడు కట్టిపేడేసాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది.సీతారామరాజు ఉప్పుతల సినిమాటోగ్రఫీ బాగుంది. మై టీ ఓక్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత మనోహరి ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. హర్రర్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం “C.202” కచ్చితంగా నచ్చుతుందని చెప్పచ్చు.
Cinemarangam.Com Review Rating : 3/5









