Cinemarangam.Com
బ్యానర్ : సుబిషి ఎంటర్టైన్మెంట్స్
సినిమా : ‘లగ్గం ’
రివ్యూ రేటింగ్ : 3.25/5
విడుదల తేదీ : 25.10.2024
నిర్మాత : వేణుగోపాల్ రెడ్డి
కథ – మాటలు – స్క్రీన్ ప్లే- దర్శకత్వం : రమేశ్ చెప్పాల,
నటీనటులు : సాయి రోనక్, ప్రజ్ఞ నగ్ర, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి, కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, వివా రెడ్డి, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి, రవి వర్మ, తదితరులు
నేపధ్య సంగీతం: మణిశర్మ,
కెమెరామెన్: బాల్ రెడ్డి.
సంగీతం:చరణ్ అర్జున్.
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి.
కొరియోగ్రఫీ: అజయ్ శివశంకర్.
పిఆర్ఓ : శ్రీధర్ శ్రీ

లగ్గం చేయడం అంటే ఎన్నో సంఘర్షణల నిర్ణయం ఒక లగ్గం జరపడం. ప్రతి కంట తడి వెనక కారణం, ఓ కథ ఉంటుంది.ఒక లగ్గం ప్రతి నాన్న తాలూకు బాధ్యత!! ఒక లగ్గం ప్రతి కూతురి ప్రేమ లగ్గం.అంటూ సాఫ్ట్ వేర్ సంబంధాలు, వ్యవసాయం, నేపథ్యంలో అచ్చ తెలుగు టైటిల్ తో, ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా “లగ్గం” సుబిషి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయి రోనక్, ప్రగ్యా నాగ్ర రాజేంద్ర ప్రసాద్, సప్తగిరి, రోహిణి నటీ నటులుగా రమేశ్ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాయి .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “లగ్గం” సినిమా ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్దాం..

కథ
సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా ) కి పెళ్లి చేయాలి అని తన సొంత చెల్లెలు సుగుణ( రోహిణి) కొడుకు ( సాయి రోనక్) ని చూడడానికి సిటీకి వస్తాడు. తన అల్లుడి ఖరీదైన జీవితం,జీతం,సాఫ్ట్వేర్ లైఫ్ చూసి తన కూతుర్ని ఎలాగైనా సాఫ్ట్ ఇంజనీర్కే ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అయి తన చెల్లెలితో మాట్లాడి లగ్గం ఫిక్స్ చేసుకుంటారు. అయితే తెలంగాణ నేపథ్యంలో లగ్గం చుట్టూ ఉండే సంప్రదాయాల్ని , పద్ధతుల్ని ఆచారాల్ని, చూపిస్తూ పెళ్లి సంబరం మొదలవుతుంది. ఇంత సంబరంగా మొదలైన పెళ్లి జరిగిందా లేదా!! అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కి వెళ్లి “లగ్గం” సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
రాజేంద్రప్రసాద్ గారు , రోహిణి గార్ల పాత్రలు ఈ సినిమాకి ప్రాణం అని చెప్పుచు. ఇద్దరు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు మొదటిసారి తెలంగాణ యాసలో సినిమా చేసిన ఎక్కడా మిస్టేక్స్ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.రఘుబాబు , యల్.బి శ్రీరామ్, సప్తగిరి , రచ్చ రవి,చమ్మక్ చంద్ర , వడ్లమాని శ్రీనివాస్ ,కిరీటి , తదితరులు అందరూ వారికిచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
పెళ్లి చేయాలంటే ఇరు కుటుంబాలు ఎలా ఆలోచించాలి ఏం చేయాలి. పెళ్లి కుదిరినంత మాత్రాన పెళ్లికూతురు అవుతుందా!! అసలు లగ్గం చేయాలంటే ఏం కావాలి!! వంటి అనేక విషయాన్ని డిస్కస్ చేసుకుంటూ ట్రెడిషన్ మిస్ చేయకుండా అర్థవంతమైన సంభాషణలతో. చక్కటి బాక్గ్రౌండ్ స్కోర్ తో, లగ్గం చుట్టూ ఉండే సరదా సరదా సన్నివేశాలతో , బంధువుల పాత్రలతో అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చిన దర్శకుడు రమేష్ తన మార్క్ మేకింగ్ తో సినిమా చూస్తున్న ప్రేక్షకులను కథలోకి ఇన్వాల్వ్మెంట్ చేసి పెళ్లికొచ్చిన బంధువులుగా మార్చడమే కాకుండా ఇంటర్వెల్ కి అస్సలు ఏం జరిగుంతుంది అని బ్యాంగ్ ఇచ్చి ఆలోచనలో పడేశాడు. మొదటి భాగం క్యారెక్టర్స్, వాళ్ల క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ట్రెడిషన్ చెప్పాడు. సెకండ్ హాఫ్ మెల్లిగా టర్న్ తీసుకుని ఒక ఎమోషనల్ రైడ్ లోకి తీసుకెళ్లిపోయాడు. ద్వితీయ భాగం మొదలైన కాసేపటికే ట్విస్టులు , ఎమోషనల్ సీన్స్ తో సగటు ప్రేక్షకుడిని దర్శకుడు కట్టి పేడేసాడు. ఒక లగ్గం చుట్టూ ఇన్ని సందర్భాలు, ఇన్ని కుతంత్రాలు, ఒక లగ్గం జరగాలి అంటే ఏం కావాలి అనేలా ప్రతీ సన్నివేశాన్ని చాలా బలంగా నిర్మించాడు అని చెప్పచ్చు. ఒక సాఫ్ట్వేర్ లైఫ్ స్టయిల్ , ఒక తండ్రి కూతురి జీవితం , ఎక్కడో కుటుంబానికి దూరంగా బతికే వారి కష్టాలు… ఇలా ఎన్నో సున్నితమైన విషయాలను చాలా చక్కగా చూయించాడు. కేవలం లగ్గం చుట్టూ మాత్రమే కథ రాసుకోకుండా లగ్గంతో పాటు కొన్ని కరెంట్ ఎఫైర్స్ ని టచ్ చేసి వాటి చుట్టూ కథను నడిపి , లగ్గంతో లింక్ వేసి ఎక్కడ బోర్ కొట్టకుండా కథను నడిపించడంలో రచయితగా, దర్శకుడిగా రమేష్ చెప్పాల సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.

ఈ చిత్రానికి మరో బలం సినిమాటోగ్రఫీ బాలరెడ్డి (బేబీ ఫేమ్) అలాగే మణిశర్మ గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. మణిశర్మ గారి మార్క్ BGM ని లగ్గంలో చూడచ్చు. ప్రతీ ఎమోషనల్ సన్నివేశాన్నీ తన BGM తో మరో మెట్టు ఎక్కించారు. చరణ్ అర్జున్ పాటలు బాగున్నాయి. కూతురికి పెళ్లి చేసి మెట్టినింటికీ పంపించే సందర్భాన్ని ఒక పాట రూపంలో ఎంతో ఎమోషనల్గా ప్రెసెంట్ చేశారు.ఎడిటింగ్ పనితీరు బాగుంది. సుబిషి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత వేణుగోపాల్ రెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా రోజుల తరువాత థియేటర్లో ఒక చక్కని ఫామిలీ ఎంటర్టైనర్ చూసిన ఫీలింగ్ కలిగింది. సినిమా చివరి నిమిషం బరువెక్కిన గుండెతో చేమార్చిన కళ్ళతో ప్రతీ ప్రేక్షకుడు బయటకి వచ్చేలా ఉంటుంది.ఫామిలీ ఎంటర్టైనమెంట్స్ కోసం చూసే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ చిత్రం “లగ్గం”.ఇంటిళ్ల పాది కలిసి చూడాల్సిన సినిమా “లగ్గం”.
Cinemarangam.Com Review Rating : 3.25/ 5









