Cinemarangam.Com
బ్యానర్స్ : ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్
సినిమా : ”డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ “
రివ్యూ రేటింగ్ : 3.25/5
విడుదల తేదీ : 27.12.2024
ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి
లైన్ ప్రొడ్యూసర్ – లక్ష్మీ మురారి
నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు
కొరియోగ్రఫీ – భాను, మోయిన్
డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్ – శ్రీ వసంత్
లిరిక్స్ – చంద్రబోస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ
స్టిల్స్ – రాజు వైజాగ్ (SVA)
వీఎఫ్ఎక్స్ – సుమరామ్ రెడ్డి.ఎన్
ఆర్ట్ – లావణ్య వేములపల్లి

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ”డ్రింకర్ సాయి” సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం పదండి.

కథ:
ప్రేమలో మనకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. మన జీవితంలోని ప్రతి దశలో, ప్రతి సందర్భంలో ప్రేమను అనుభూతి చెందుతాం. “డ్రింకర్ సాయి“లో ఒక మంచి ప్రేమకథ ఉంటుంది. బాగీ(ఐశ్వర్య శర్మ) ముందుకు బానిస అవుతున్న కుర్రాళ్లకు హిత బోధ చేయడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ధనవంతడైన సాయి(ధర్మ)కి చిన్నప్పుడే తల్లి, తండ్రులు చనిపోయి వుంటారు. అయితే వారు సంపాదించిన డబ్బులతో రోజంతా మందు తాగుతూ ముగ్గురు స్నేహితులని వెనకేసుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. న్యాచురోపతిలో డాక్టర్ గా చదువుతున్న భాగీ (ఐశ్వర్య శర్మ) న్యాచురోపతి గురువైన వంతెన (భద్రం)ను గురువుగా ఆరాదిస్తూ తనంత స్థాయికి ఎదగాలని తపన పడుతుంటుంది. అయితే బాగీ ఒకరోజు అనుకోకుండా సాయి ని యాక్సిడెంట్ చేస్తుంది. .దాంతో బాగిని చూసిన మెదటి చూపులోనే ప్రేమలో పడతాడు సాయి . తనే నా లవర్ అని ఫిక్స్ అవుతాడు. కానీ తాగుబోతు సాయి అంటే బాగీ కి ఏమాత్రం ఇష్టం ఉండదు. అయినా తన వెంట పడుతూ బాగీ ని ఇబ్బంది పెడుతుంటాడు. అయితే ఒకరోజు జరిగిన గొడవను చూసి తనని ఏమైనా చేస్తాడేమో అని బయపడి ప్రేమిస్తున్నట్లు అబద్దం చెపుతుంది. అది నిజమనుకున్న సాయి తన వెంట తిరిగుతుంటాడు.. భాగి పుట్టినరోజున సాయి డైరెక్ట్ గా బాగి బెడ్ రూమ్ లోకి వచ్చి సాయి చేసిన పనికి అతను ఎవరో తెలియదని పొరుగింటి వారితో చెప్పి కొట్టిస్తుంది. అయినా సాయి అవేమే పట్టించుకోకుండా ఆమె వెంట పడుతుంటాడు.ఇది భరించలేని బాగీ ఒకానొక రోజు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తుంది. దీనికి సాయి ఎలా రియాక్ట్ అయ్యాడు.ఆ తరువాత వీరిద్దరి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది. చివరికి భాగిలో ప్రేమ కలిగేలా సాయి మార్చుకొని ఆమె ప్రేమను పొందగలిగాడా లేదా? అనేది తెలుసు కోవాలంటే కచ్చితంగా “డ్రింకర్ సాయి” సినిమా చూడాల్సిందే

నటీ నటుల పనితీరు
సాయి పాత్రలో నటించిన (ధర్మ) లవర్ బాయ్ గా గడ్డంతో మాస్ లుక్ తో అదరగొట్టాడు. ఎక్కడ తడబాటు లేకుండా చక్కటి హావభావాలతో ఎమోషన్స్ లలో కూడా చాలా చక్కని క్యారీ చేశాడు ఇతనికి నటుడుగా మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు.డాన్సులు, ఫైట్స్ కూడా బాగా చేశాడు. ఇక మెడికల్ స్టూడెంట్ గా భాగి పాత్రలో నటించిన ఐశ్వర్య శర్మ కు ఇది మొదటి సినిమా అయినా చక్కని ఎక్స్ప్రెషన్స్ తో మంచి పెర్ఫార్మన్స్ కనబరచింది.అమ్మాయి ఫాదర్ గా నటించిన ఎస్ఎస్ కాంచి,పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్ ఇలా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రలతో నటించి మెప్పించారని చెప్పచ్చు

సాంకేతిక నిపుణుల పనితీరు
మందు సిగరెట్ వాటి వలన యువత తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే అంశాన్ని రాసుకొని దీనికి ప్రేమకథను జోడించి రియలిస్టిక్ అంశాలతో చాలా చక్కగా తెరకేక్కించడంలో దర్శకుడు కిరణ్ తిరుమల శెట్టి సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.సినిమా స్టోరీ ఓల్డ్ గా అనిపిస్తుంది కానీ.. దాని నడిపించిన తీరు కొత్తగా ఉంటుంది. ఇందులో సాయి ఫ్రెండ్ మందార పువ్వు కోసం తిరిగే తిరుగుడు కామెడీ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ వరకు ఆడుతూ పాడుతూ అన్నట్టుగా సాగిన సినిమా క్లైమాక్స్ లో గుండెని బరవెక్కిస్తాడు దర్శకుడు.

అలాగే ఇందులో ఉన్న సాంగ్స్ అన్నీ బాగున్నాయి. బాగీ బాగీ బాగీ సాంగ్, డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..స్వర్గానికి మనకు లింక్సు సాంగ్ . ‘నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే, నువ్వు తన్నితే వెన్నపూసినట్టున్నదే వంటి పాటలకు సంగీత దర్శకుడు శ్రీ వసంత్ అందించిన సంగీతం మరియు బిజీయం బాగుంది. డిఓపి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్‌గా ఉంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా “డ్రింకర్ సాయి” సినిమా గురించి చెప్పాలి అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఫ్యామిలీ తో వచ్చి హ్యాపీ గా ఎంజాయ్ చేయచ్చని కచ్చితంగా చెప్పచ్చు
Cinemarangam.Com Review Rating.. 3.25/5









