Kichcha Sudeep’s pan-India action-packed “Max” Movie Review

Cinemarangam.Com
బ్యానర్స్ :వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్
సినిమా : ”’మ్యాక్స్“
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 27.12.2024
నిర్మాత – కలైపులి ఎస్.థాను
దర్శకత్వం – విజయ్ కార్తికేయ  
నటీనటులు: కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులు
మ్యూజిక్ – అజనీష్ లోకనాథ్  
సినిమాటోగ్రఫీ – శేఖర్ చంద్ర
ఎడిటింగ్ – ఎస్ఆర్ గణేష్ బాబు
డైలాగ్స్: ఆశ్లేషా
లిరిక్స్: గోసాల రాంబాబు
పి.ఆర్.ఓ : పులగం చిన్నారాయణ

కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు సునీల్, ‘అఖండ’ ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ  దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్   27న  ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తెలుగులో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “’మ్యాక్స్’ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం పదండి. 


కథ:
“మ్యాక్స్’ మూవీ కథ మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతుంది.ఇదంతా ఓ రాత్రిలో జరుగుతుంది. రాత్రి మొదలై… తెల్లవారు జామున ముగుస్తుంది. అంటే…మొత్తం ఓ ఏడెనిమిది గంటల పాటు ఉత్కంఠ భరితంగా సాగే యాక్షన్ క్రైం థ్రిల్లర్ మూవీ.
అర్జున్ (సుదీప్)న్యాయంగా ఉండే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అడ్డొచ్చింది ఎవరినేది కూడా చూడకుండా వారి భరతం పడుతూ ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తుంటాడు. దీంతో అందరూ తనను మాక్స్ అనే నిక్ నేమ్ తో పిలుస్తుంటారు. అర్జున్ దూకుడుకు నిత్యం ట్రాన్స్ ఫర్లు, సస్పెన్సన్స్ కు గురవుతూ వుంటాడు.అయితే తను ఓ పోలీస్ స్టేషన్ కు సీఐ హోదాలో ట్రాన్స్ ఫర్ అయి వస్తారు. అయితే ఇద్దరు మంత్రుల కుమారులు పోలీసులపై కారు ను డ్యాష్ ఇవ్వడమే కాకుండా అడ్డొచ్చిన లేడీ కానిస్టేబుల్ బట్టలు చింపుతాడు. దాంతో ఇంకా అక్కడ డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే వారిని అరెస్ట్ చేసి సెల్ లో వేసి…ఇంటికి వెళ్లిపోతాడు. అయితే వారిద్దరూ స్టేషన్ లో దారుణంగా చంపబడి వుంటారు. ఈ విషయం మంత్రులకు తెలిస్తే… తమ ప్రాణాలు పోతాయని అర్జున్ కి మొరపెట్టుకుంటారు ఆ స్టేషన్ లోని మిగతా పోలీస్ సిబ్బంది. ఆ మినిస్టర్ కొడుకులు ఎలా చనిపోయారు? వారిని ఎవరు సంపారు? ఈ జంట హత్యల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆ స్టేషన్ సిబ్బంది వేసిన ప్లాన్ ఏమిటి? వారికి అర్జున్ ఎలాంటి సపోర్ట్ చేశాడు ? ఈ కథలో క్రైమ్ ఇన్ స్పెక్టర్ రూపా (వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్ స్టర్ గని (సునిల్) పాత్రలు ఏంటి? వారికి, అర్జున్ కి మధ్య వున్న వైరం ఏమిటి? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా ‘మ్యాక్స్’ సినిమా చూడాల్సిందే.

నటే నటుల పనితీరు
అర్జున్ (సుదీప్) పాత్రలో హీరో గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సీనే అదిరిపోతుంది. ఓ ఎదురులేని, తలవంచని పోలీస్ ఆఫీసర్.. మొండిఘటమైన అధికారిలా అన్యాయాన్ని సహించని పోలీస్ ఆఫీసర్‌గా వన్ మ్యాన్ షో లా కిచ్చా సుదీప్ అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్స్ అయితే ఫ్యాన్స్‌ కు ఫీస్ట్‌ లానే ఉంటుంది. ఇంకా ఇందులో సునీల్, వరలక్ష్మీ శరత్ కుమార్ లు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.. ఇంకా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రలతో నటించి మెప్పించారని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
కార్తీ నటించిన ‘ఖైదీ’మూవీ ఫార్మాట్ కు దగ్గరలో ఉన్నా … జానర్… టేకింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పచ్చు. ఆరడుగుల హైట్ ఉన్న సుదీప్ కి తగ్గట్టుగా రాసుకున్న ట్విస్టులు, యాక్షన్ సీక్వెన్సెస్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో మాస్… క్లాస్ ఆడియన్స్ కు నచ్చేలా యాక్షన్ సీక్వెన్స్ లతో సినిమాను ఉరకలెత్తించాడు డైరెక్టర్. సెకెండాఫ్ తరువాత ఆద్యంతం పోలీసులకు, విలన్ గ్యాంగులకు మధ్య వచ్చే ట్విస్టులు, యాక్షన్ సీక్వెన్స్ తో ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో దర్శకుడుగా విజయ్ కార్తికేయ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు..సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ అందించిన పాటలు సంగీతం మరియు బిజీయం సినిమాకే హైలెట్ అని చెప్పచ్చు. సినిమా మొత్తం రాత్రి పూటే జరుగుతుంది కాబట్టి డిఓపి – శేఖర్ చంద్ర ఇచ్చిన నైట్ మోడ్స్ విజువల్స్ ట్రీట్‌గా ఉంది. ఎస్ఆర్ గణేష్ బాబు ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. ఈ చిత్ర నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.. ఫైనల్ గా “”మ్యాక్స్ ” సినిమా గురించి చెప్పాలి అంటే ఫుల్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here