ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెంచిన “జిన్నా” ప్రీ లుక్ పోస్టర్. జూలై 11న ఫస్ట్ లుక్

విష్ణు మంచు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ నటీ నటులుగా డైనమిక్ డైరెక్టర్ ఈషన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తున్న చిత్రం “జిన్నా”.ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించడం విశేషం.శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్ర నిర్మాతలు ఈ రోజు ఈ చిత్రం ప్రీ లుక్ ను విడుదల చేయడం జరిగింది
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… ‘గిన్నా’ చిత్రంతో విష్ణు మంచు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు, మేము విడుదల చేసిన ప్రీ-లుక్ పోస్టర్ కు సినీ అభిమానులలో మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. టైటిల్ విడుదలైనప్పుడు తలెత్తిన చాలా ప్రశ్నలను ప్రీ-లుక్ తో ప్రేక్షకులకు సమాధానం దొరికింది అని చెప్పవచ్చు.ఈ చిత్రంలో సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఇంతకుముందు విష్ణు నటించిన ‘ఢీ’ మరియు ‘దేనికైనా రెడ్డి’ చిత్రాలకు స్క్రిప్ట్‌లు అందించిన కోన వెంకట్ చిత్రానికి కథ మరియు స్క్రీన్‌ప్లే రాయనున్నారు.. విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ జూలై 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అని అన్నారు
నటీ నటులు
విష్ణు మంచు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాతలు : అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
దర్శకత్వం ::ఈషన్ సూర్య హెల్మ్
సినిమాటోగ్రఫి : ఛోటా కె. నాయుడు
కథ, స్క్రీన్ ప్లే : కోన వెంకట్
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్









