Rebal Star Prabhas ‘Radhe Shyam’ Movie Pre Release event

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ “రాధే శ్యామ్” ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.జనవరి 14న ఐదు ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు చైనీస్, జపనీస్ భాషల్లోనూ విడుదల కాబోతున్న ఈ సినిమాను రెబ‌ల్ స్టార్ డా. యూ.వి. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌లు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ల‌వ్లీ విజువ‌ల్ వండ‌ర్ ని ఏక‌కాలంలో హిందీ, త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం భాష‌ల తో పాటు చైనీస్, జపనీస్ భాషల్లోనూ రాధేశ్యామ్ భారీ రేంజ్ లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా గురువారం 23 న  రామోజీ ఫిలిం సిటీలో అభిమానులే అతిథులు గా “రాధే శ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల ట్రైలర్లను ఫ్యాన్స్ తో విడుదల  చేయించి జాతీయ రికార్డ్ క్రియేట్ చేసింది.


రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ ..రాధే శ్యామ్ అందమైన ప్రేమ కథ. కచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుంది. సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు.రెబల్ స్టార్ గా  గత 55 ఏళ్లుగా నన్ను అభిమానిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే  పరిగెత్తుకుంటూ వచ్చి కలవాలని, కౌగిలించు కోవాలని ఉంది. ఈ వేదికపైకి వచ్చి సరదాగా డ్యాన్స్ చేసి, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ మరో వారం పది రోజుల పాటు నిలబడలేను. అది దేవుడు వేసిన చిన్న శిక్ష. ఆ తరువాత కచ్చితంగా డాన్స్ చేస్తా..ఇప్పటి వరకు  నాపై చూపిన అభిమానంతో నేను  55 ఏళ్ల పాటు మిమ్మల్ని ఆనందింపజేశాను.ఇప్పుడు రెబల్ ప్రభాస్ మరో 50 ఏళ్లు మిమ్మల్ని ఆనందింపజేస్తారు అన్నారు


రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ .. రాదే శ్యామ్ అన్ని భాషల ట్రైలర్స్ ని అభిమానులతో విడుదల చేయించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రైలర్స్ ను విడుదల  చేసిన ఫ్యాన్స్ కు ధన్యవాదాలు ఈ ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి ప్రేమకథను కరోనా టైంలో కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. జార్జియా,ఇటలీ, హైదరాబాద్ లలో షూటింగ్ చేశాము. పెదనాన్నగారి పరమహంస లుక్ చూశారుగా.. తను ఒక  చిన్నసైజు దేవుడిలా ఉన్నారు. గోపి కృష్ణా మూవీస్ లో మన ఊరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు వంటి పెద్ద సినిమాలు తీశారు. ఆ బ్యానర్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంటుంది. మేమిద్దరం కలిసి చేశాం.. బాగానే ఆడింది.. ఇప్పుడు “రాధేశ్యామ్”. ఈ చిత్రం లవ్ స్టోరి నే కానీ ఇంకా చాలా ఉన్నాయి. పెద్ద నాన్న తో పాటు ఈ సినిమాలో నటించిన సత్యరాజ్, సచిన్, జయరామ్, భాగ్యశ్రీ గార్లకు కూడా నా ధన్యవాదాలు. అలాగే జగపతి బాబు గారు ఇందులో అతిథి పాత్ర చేశారు.ఈ సినిమాలోని జస్టిన్ సంగీతానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. పూజ హెగ్డే ఈ సినిమాలో మరింత బ్యూటీఫుల్ ఉంటుంది..రాధాకృష్ణ ఐదేళ్లు ఈ సినిమాకు పనిచేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ ప్రతిఫలం ట్రైలర్లో కనిపిస్తుంది. ఈ సినిమాలో చాలా ట్విస్టులు, టర్నింగ్స్  ఉన్నాయి. క్లైమాక్స్ హైలెట్ గా ఉంటుంది మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.

హీరోయిన్ పూజ హెగ్డే మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమాతో ప్రయాణం చేస్తున్నా..ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రియల్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ సినిమాకోసం సృష్టించిన ఫాంటసీ ప్రపంచం ప్రతి ఒక్కరినీ మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. ఒక అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో కొత్త ప్రభాస్, కొత్త పూజ హెగ్డే లను చూస్తారు. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు. .


ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ .. ప్రభాస్ తో నాకు నా ప్రయాణం గురించి మీ అందరికీ తెలుసు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు. మాస్ హీరో ని ఇంత క్లాసు గా చూపిస్తే ఎవరు చూస్తారు? అనుకున్నాము.కానీ.. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  మిర్చి, రెబల్, బాహుబలి, సాహో లతో ఆకాశానికి వెళ్ళిపోయి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. మళ్ళీ సాహో ఇప్పుడు “రాధే శ్యామ్” తో గ్లోబల్ స్టార్ అయ్యాడు. స్టార్ హీరోకి కావాల్సింది  అదే.. ఎప్పుడూ కమర్షియల్ తో పాటు కొత్తగా ప్రయత్నం చేస్తూ ప్రేక్షకులను అలరించాలి. ఇపుడు “రాధే శ్యామ్” వంటి చక్కటి ప్రేమకథ తో మన ముందుకు వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఏ మాత్రం సందేహం లేకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్నారు


చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ మాట్లాడుతూ ..ఈ “రాధేశ్యామ్” సినిమా తీయడానికి నాకు నాలుగేళ్లు పట్టింది. కానీ.. కథ రాయడానికి మాత్రం18 ఏళ్లు పట్టింది. ఈ కథను ఇండియా లోని పెద్ద పెద్ద రచయిత లను పిలిపించి రాయించాం. ప్రభాస్ తో సినిమా అనుకున్నప్పుడు కథతో కాదు ఓ ఛాలెంజ్ తో చేయాలనుకొని మా గురువుని అడిగి ఒక ఫిలాసఫీ కి లవ్ యాడ్ చేసి ప్రభాస్ కు చెప్పగా..  ఆయనకు నచ్చింది. ఈ సినిమాలో ఫైట్స్ ఉండవు, కానీ అమ్మాయికి అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలు ఉంటాయి.ఇది ఒక అందమైన ప్రేమకథ.ఈ సినిమా అందరి ఎక్స్పెక్టేషన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది.  వంశీ, ప్రమోద్, విక్కీ గార్లు లేకుంటే ఈ సినిమా లేదు. ప్రభాస్ లాంటి ఫ్రెండ్, గురువు అందరికీ ఉండాలి అన్నారు

సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాకు సంగీతం అందించినందుకు చాలా సంతోషంగా ఉంది.నాకీ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. మొదట ప్రభాస్-రాజమౌళి లు పాన్ ఇండియా ట్రెండ్ ను ఆరంభించారు. ఇప్పుడు అన్ని సినిమాసలు ఆ పంథాలో కొనసాగుతున్నాయి. రాధేశ్యామ్ ట్రైలర్ చూస్తుంటే ఇంటెన్స్ లవ్ స్టోరి అనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని అన్నారు

సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ప్రభాస్ అన్న అంటే ఎంత అభిమానమో ప్రేమతో ఇక్కడకు  వచ్చిన జన సందోహాన్ని చూస్తుంటే అర్థవుతుంది.ట్రైలర్ చాలా బాగుంది  ఈ సినిమా గొప్ప విజయం సాంధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. ప్రభాస్ గారి తో ఆదిపురుష్ లాంటి భారీ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. “రాధే శ్యామ్” ‘ ట్రైలర్ అద్భుతంగా ఉంది ఇది ప్రేమ కథ అని చెప్పారు. కానీ ఇందులో కేవలం లవ్ స్టొరీ మాత్రమే కాదు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా ప్రతి ఒక్క అంశం రాధే శ్యామ్ సినిమాలో కనిపిస్తున్నాయి. సినిమాకు ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా అద్భుతమైన విజయం సాధిస్తుంది..’ అని తెలిపారు.

ఇంకా ఈ వేడుకలో చిత్ర నిర్మాతలు వంశీ, ప్రమోద్,  కెమెరామెన్ మనోజ్ పరమహంస,టి సిరీస్ ముఖేష్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here