Suspense Engaging Crime Thriller ‘WWW’ Review

Cinemarangam.com
సినిమా : “WWW”(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు)
రివ్యూ రేటింగ్: 3.5/5
విడుద‌ల తేది: 24-12-21(సోనిలీవ్‌)
స‌మ‌ర్ఫ‌ణ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌
బ్యానర్‌: రామంత్ర క్రియేషన్స్
నిర్మాత: డా. రవి ప్రసాద్ రాజు దాట్ల
కో–ప్రొడ్యూసర్‌: విజయ్‌ ధరణ్‌ దాట్ల
కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్
న‌టీన‌టులు: అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, దివ్య, సందీప్‌, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ వైవా హర్ష, తదితరులు
సంగీతం: సైమన్‌ కె. కింగ్
ఎడిటింగ్‌: తమ్మిరాజు
ఆర్ట్‌: నిఖిల్‌ హాసన్
డైలాగ్స్‌: మిర్చి కిరణ్
లిరిక్స్‌: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: పొన్మని గుహన్
కొరియోగ్రఫి: ప్రేమ్‌ రక్షిత్
స్టంట్స్‌: రియల్‌ సతీష్
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: కె. రవి కుమార్
పి.ఆర్.ఓ : సిద్దు,శ్యామ్


సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా  రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన థ్రిల్ల‌ర్ మూవీ ‌’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్, పాట‌లు ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది.దిల్‌రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఈ సినిమాకు స‌పోర్ట్ చేయ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృశ్యా ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కి వెళ్లింది. ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌రు 24 నుండి సోనిలీవ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి…

కథ:
విశ్వ (అరుణ్ ఆదిత్) తన మెడకు ఉరితాడు బిగించు కుంటుండగా సినిమా ప్రారంభమవుతుంది. కొన్ని నెలల ఫ్లాష్ బ్యాక్ కెళ్తే విశ్వ(అదిత్ అరుణ్), అష్రఫ్(ప్రియదర్శి), సదా సత్యం రాజేష్), కిష్ట్రీ(దివ్య శ్రీపాద) నలుగురు మంచి స్నేహితులు, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్స్ వీరంతా వేరు వేరు నగరాల్లో ఉంటూ కంప్యూటర్ లో నే వర్చువల్ గా మాట్లాడుకుంటూ చాట్ చేస్తూ ఉంటారు.. కిష్ట్రీ కి మిత్ర(శివాని రాజశేఖర్) మంచి ఫ్రెండ్. చిష్ట్రీ ద్వారా విశ్వ‌కి మిత్ర ప‌రిచ‌య మ‌వుతుంది. ఒక సారి మిత్ర ఫ్యామిలీకి.. విశ్వ హెల్ప్ చేస్తాడు. దాంతో ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారుతుంది. మిత్ర ఒక రోజు కిష్ట్రీ ఇంటికి వెళుతుంది. అయితే ఉన్నట్టుండి కరోన కారణంగా రాత్రికి రాత్రే ఇండియా మొత్తం లాక్ డౌన్ విధిస్తారు. దాంతో మిత్ర అక్కడే లాక్ అయిపోతుంది. ఈ క్రమంలో ఓ ఆగంతకుడు ఫ్లాట్ లోకి చొరబడి.. కిష్ట్రీని విచక్షణా రహితంగా పొడిచేసి గాయాపరుస్తాడు. మిత్రను కూడా దారుణంగా చంపేస్తా అని ఆమెను కూడా చిత్రహింసలకు గురిచేస్తాడు. దీన్ని వర్చువల్ గా చూసిన విశ్వ హాతాశుడైపోయి… ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అలానే మిత్రను కూడా దారుణంగా చంపుతానని బెదిరిస్తాడు. ఆమె బతకాలంటే నువ్వు ఉరేసుకుని చస్తే… మిత్రను వదిలేస్తా అంటాడు. అస‌లు ఆ వ్య‌క్తి ఎవ‌రు? క్రిస్టీ ఇంటికి ఎందుకు వచ్చాడు, మిత్రను బంధీగా పట్టుకోవడానికి కారణం ఏంటి, విశ్వకు ఈ నేరస్తుడికి సంబంధం ఉందా, విశ్వ‌ని ఎందుకు ఉరివేసుకుని చావ‌మ‌న్నాడు. ఆ వ్య‌క్తి నుండి విశ్వ మిత్ర‌, కిష్ట్రిల‌ను కాపాడాడా లేదా అనేది మిగ‌తా సినిమా క‌థ‌..


నటీనటుల పని తీరు
విశ్వ (అదిత్ అరుణ్)… క్యారెక్టర్ లో ఇల్లీగల్ హ్యాకర్ గా ఒదిగిపోవడమే కాకా చాలా చక్కగా స్టయిలిష్ నటనతో లవ్, ఎమోషన్, రియలైజేషన్ తో ఆకట్టుకున్నాడు. అతనికి జంటగా నటించిన శివాని రాజశేఖర్ కూడా ఓ సిన్సియర్ ప్రేమికురాలిగా బాగా నటించింది. సినిమా అంతా కంప్యూట‌ర్ స్క్రీన్ మీద‌నే న‌డుస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌తి ఎక్స్‌ప్రెష‌న్ ఆడియ‌న్స్ క్యాచ్ చేసే విధంగా ఎంతో అనుభ‌వ‌మున్న న‌టి అనేలా న‌టించింది. సాంగ్స్‌లో చాలా క్యూట్ గా కనిపించింది. ఇక  ప్రియదర్శి, దివ్య, సత్యం రాజేష్ వారి పాత్రలకు తగ్గట్టు చేశారు. కిల్లింగ్ వీరప్పన్ ఫేం సందీప్ కూడా ఉన్న కాసేపు అయినా భయపెట్టాడు. వైవా హర్ష… త‌న‌ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. రియాజ్ ఖాన్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి గా కనిపించి మెప్పించారు.ఇంకా మిగిలిన వారంతా తమ తమ క్యారెక్టర్ లకు న్యాయం చేశారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె.వి. గుహన్ గతంలో కళ్యాణ్ రామ్ తో తీసిన “118”అయితేనేం… ఈరోజు “సోనీలివ్” OTT లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన ‘WWW’ అయితేనేం… అన్నీ వేటికవే వైవిధ్యమైన సినిమాలు. తను తీసే కథలన్నీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చాలా డిఫరెంట్ గా ఉండి…ఆడియన్స్ ని ఇట్టే ఆకట్టుకుంటాయి.ఇలాంటి స్టోరీ ఐడియా దర్శకుడికి రావడమే నిజంగా అభినందిచాల్సిన విష‌యం.ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం…రెండు కంప్యూటర్ల స్క్రీన్ మీదనే సినిమా మొత్తం రన్ కావడం సూపర్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సాఫ్ట్ వేర్ మోసాల వల్ల ఎందరి జీవితాలు నాశనం అవుతున్నాయో, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తల్లిదండ్రులకు తెలిసేలా ఓ మంచి మెసేజ్ ఇచ్చాడు దర్శకుడు కేవి గుహన్ . ఈ చిత్రానికి గుహ‌న్ మేకింగ్ తో పాటు సినిమాటోగ్ర‌ఫి కూడా చాలా ప్ల‌స్ అయింది. కొన్ని స‌న్నివేశాల్లో విజువ‌ల్స్ గూజ్‌బ‌మ్స్ తెప్పించేలా ఉన్నాయి. త‌ర్వాత మాట్లాడు కోవాల్సింది  సైమన్‌ కె. కింగ్ సంగీతం, నేప‌థ్య సంగీతం బాగుంది . అన్ని పాట‌లు స్క్రీన్ మీద ప్ల‌జెంట్‌గా ప్రొజెక్ట్ చేయ‌బ‌డ్డాయి.ఇందులో నైలు నది పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తమ్మిరాజు  ఎడిటింగ్ బాగుంది.. ఇక నిర్మాతల విషయానికి వస్తే రామంత్ర క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌ల్ని త‌ప్ప‌కుండా మెచ్చు కోవాల్సిందే.ఇలాంటి సినిమాలు తీయాలంటే గట్స్ ఉండాలి.ఈ క‌థ‌ను కేవ‌లం ఆన్‌లైన్‌లోనే విని మొద‌టిసినిమాగా ఒక డిఫ‌రెంట్ చిత్రాన్ని ఎంచుకోవ‌డం గొప్ప విష‌యం. ఖ‌ర్చుకి ఎక్క‌డా వెన‌కాడ‌కుండా క‌థ‌కు త‌గ్గ న‌టీన‌టుల్ని సాంకేతిక వ‌ర్గాన్ని ఎంపిక‌చేసుకోవ‌డంతోనే ఈ టీమ్ స‌క్సెస్ సాధించింది. రెగ్యుల‌ర్ సినిమాలు కాకుండా  స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ కథలు ఇష్ట‌ప‌డేవారికి ఈ సినిమా మ‌రింత బాగ న‌చ్చుతుంది. . సోనీలీవ్‌లో త‌ప్ప‌క చూడాల్సిన చిత్ర‌మిది.

Cinemarangam.com Rating..3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here