“Iddari Lokam Okkate” Release Date
“HEZA” Pre Release Event
“Rural” Pre Release Event at Vizag
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రూలర్`. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్య్రకమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ నెల 14న వైజాగ్ ఎంజీఎం గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో ఎంటైర్ చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు.
ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ షేడ్స్‌లో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ లుక్స్, టీజర్, లిరికల్ వీడియో సాంగ్‌కు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.త్వరలోనే మిగిలిన పాటల లిరికల్ వీడియోలను, ట్రైలర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
`జైసింహా` వంటి సూపర్‌హిట్ తర్వాత బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్, సి.కల్యాణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక, జయసుధ, షాయాజీ షిండే, ధన్‌రాజ్, కారుమంచి రఘు తదితరులు కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
నందమూరి బాలకృష్ణ
సోనాల్ చౌహాన్
వేదిక
ప్రకాశ్ రాజ్
భూమిక చావ్లా
జయసుధ
షాయాజీ షిండే
నాగినీడు
సప్తగిరి
శ్రీనివాస్‌రెడ్డి
రఘుబాబు
ధన్‌రాజ్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు
కొరియోగ్రఫీ: జానీ మాస్టర్
Hero Sundeep Kishan ventures into a new business
కథానాయకుడిగా, నిర్మాతగా ఈ ఏడాది సందీప్ కిషన్ మంచి విజయాలు అందుకున్నారు. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన ఆ చిత్రం, కథానాయకుడిగా సందీప్ కిషన్‌కు మంచి విజయం అందించింది. అలాగే, ‘తెనాలి రామకృష్ణ’తో కమర్షియల్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు సందీప్ కిషన్. ఈ సంతోష సమయంలో తల్లిదండ్రులకు బెంజ్ జిఎల్ఈ 350డి కారును ఆయన బహుమతిగా ఇచ్చారు.
సందీప్ కిషన్ నటుడు, నిర్మాత మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా! జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లో ‘వివాహ భోజనంబు’ పేరుతో ఆయనకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి. విజయవంతంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఆయన, కొత్తగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఆయన ఒక సెలూన్ ప్రారంభించనున్నారు.
స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నారు. త్వరలో ఆ సెలూన్ ప్రారంభం కానుంది. ఇక, సినిమాల విషయానికి వస్తే… హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చేస్తున్న సంగతి తెలిసిందే.
“Erra Cheera”First kiss Romantic song launch
శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢమరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం `ఎర్రచీర`. సి.హెచ్ సుమన్ బాబు స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ హర్రర్ చిత్రంలో నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారి. మహానటి ఫేం బేబి సాయి తేజస్విని, సి.హెచ్ సుమన్‌బాబు, కారుణ్య, సంజనా శెట్టి, కమల్ కామరాజు, శ్రీరామ్, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శివ శివ శంభో శంకర అనే పాటకు ఇంతకుముందు చక్కని స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి `తొలి తొలి ముద్దు.. ముద్దు పైన 150 ముద్దులు..` పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. సినిమాలో రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ పాటకు కె.సత్యసుమన్ బాబు లిరిక్ అందించగా అంజనా సౌమ్య- హేమచందర్ పాడారు.
దర్శక నిర్మాత మాట్లాడుతూ “కుటుంబ బాంధవ్యాలకి, అనురాగాలకి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సంపూర్ణ కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది. కుటుంబ కథే అయినా.. హారర్ థ్రిల్లింగ్ అంశాల్ని కూడా మేళవించాం. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రమోద్ స్వరాలు ప్రధాన బలం. రాజమండ్రి రైలెక్కి… శివ శివ శంభో శంకర పాటలకు ఇప్పటికే అద్భుత స్పందన వచ్చింది. తాజాగా తొలి తొలి ముద్దు పాట శ్రోతల్లోకి అంతే వైరల్ గా దూసుకెళుతుందన్న నమ్మకం ఉంది. ఈ లిరిక్ యువతరాన్ని హత్తుకునే రొమాంటిక్ పదజాలంతో ఆకట్టుకుంటుంది. బాణీ అద్భుతంగా కుదిరింది. హేమచందర్- సౌమ్య గానం ఆకట్టుకుంటుంది“ అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: ప‌్రమోద్, కెమెరా: చందు, ఎడిటింగ్: డి.వెంకట్ ప్రభు, ఫైట్స్: నందు, సమర్పణ: బేబి ఢమరి, బ్యానర్: సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్, దర్శకనిర్మాత: సి.హెచ్ సుమన్ బాబు.

Crazy Multi Starars Victory Venkatesh,Nagachaitanya “Venkymama” Released on December 13..
టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మల్టీస్టారర్ `వెంకీమామ`. విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం ఇద్దరి హీరోల అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో …
ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ – “వెంకటేశ్, నాగచైతన్య అభిమానులకు ఇది పెద్ద పండగలాంటి సినిమా. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ బాబీగారికి, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, డి.సురేష్‌బాబు సహా ఫ్యాన్స్‌కు కూడా ఇది పెద్ద పండగ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – “ఈ సినిమాను రెండు బ్యానర్‌లు నిర్మించాయి. ఇద్దరు ప్రొడ్యూసర్ కానీ నిజానికి నలుగురు ప్రొడ్యూసర్స్ మా సినిమాకు పనిచేశారని చెప్పాలి. ఎందుకంటే హీరోలు వెంకటేశ్, చైతన్యలిద్దరూ నిర్మాతలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఈ సినిమా చక్కగా వచ్చింది. వారికి ఈ సందర్భంగా థ్యాంక్స్. ఎమోషనల్ సీన్స్ చేయడంలో వెంకటేశ్‌గారు మాస్టర్ ఆయనతో పాటు చైతన్యగారు కూడా ఎమోషనల్ సీన్స్‌లో చక్కగా నటించారని.` అన్నారు.
నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ – “నాకు వెంకీమామ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సురేశ్‌బాబుగారు, వెంకటేశ్‌గారు, చైతన్యగారు, బాబీగారికి థ్యాంక్స్. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌తో ఉన్న సినిమా ఉన్న సినిమా. డిసెంబర్ 13న సినిమా విడుదలవుతుంది“ అన్నారు.
నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ – “మానవ సంబంధాలపై తెరకెక్కించిన చిత్రం `వెంకీమామ`. ఏడాదిన్నర క్రితం జనార్ధన మహర్షి అనే రైటర్ వచ్చి ఈ కథను నాకు వినిపించారు. విన్నాను.. బావుంది. చూద్దాం అన్నాను. తర్వాత ఆ కథ బాబీ చేతికి వచ్చింది. ఆయన దాన్ని అద్భుతంగా డెవలప్ చేశారు. ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్స్, రిలేషన్ షిప్స్, త్యాగాలు ఇలా అన్ని అంశాలుంటాయి. రాజమండ్రి, హైదరాబాద్, కాశ్మీర్‌లో ఈ సినిమాను చిత్రీకరించాం. కాశ్మీర్‌లోని రిస్కీ లొకేషన్స్‌లో ఈ సినిమాను 25 రోజుల పాటు చిత్రీకరించాం. భారత అధికారులు, ఆర్మీ అధికారులు మాకెంతో సహాయపడ్డారు. ఇంకా చాలా మంది కాశ్మీర్‌కు రావాలని, అక్కడ షూటింగ్‌లు చేయాలని అందరూ మాకు సపోర్ట్ చేశారు. బ్రహ్మాపుత్రుడు చిత్రాన్ని కాశ్మీర్‌లో చిత్రీకరించాం. తర్వాత ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగాం. కానీ కాశ్మీర్ వంటి అందమైన ప్రాంతం.. మన దేశంలో ఉండటం ఊహించుకుని చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మావయ్య సురేంద్రగారిని బాగా ఇష్టపడేవాడిని. అలా ప్రతి ఒక్కరికీ వారి మేనమామలతో మంచి అనుబంధం ఉంటుంది. అలాంటి మామ, అల్లుడు మధ్య అనుబంధాన్ని తెలియజేసే చిత్రమిది. నేను సినిమా చూశాను. చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఈ సినిమాకు పనిచేసిన రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో ప్రకాశ్‌రాజ్‌గారు నటించారు. చాలా ఇన్‌వాల్వ్‌మెంట్‌తో ఈ సినిమాలో మాకు సపోర్ట్ చేశారు. ఆయనకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. రావు రమేశ్‌గారు తొలిసారి మా బ్యానర్‌లో పనిచేశారు. వెంకటేశ్, చైతన్య అందరూ సినిమా చూసి బావుందన్నారు. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా చూసి బావుందన్నారు. నవరసాలున్న సినిమా. డిసెంబర్ 13న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ 7న ఖమ్మంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాం“ అన్నారు.
రాశీఖన్నా మాట్లాడుతూ – “నేను కూడా మీలాగే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. హీరోయిన్‌గానే కాదు, వెంకటేశ్ అభిమానిలా ఎదురుచూస్తున్నాను. చైతన్యతో పాటు వెంకటేశ్‌గారితో కలిసి నటిచండం హ్యాపీగా అనిపించింది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఆయన గొప్ప నటుడే కాదు.. గొప్ప వ్యక్తి. చైతుతో మనం తర్వాత కలిసి పనిచేస్తున్నాం. మామ, అల్లుడు మధ్య రిలేషన్ తెరపైనే కాదు, సెట్స్‌లోనూ చూశాను. బాబీగారు పాజిటివ్, కాన్ఫిడెంట్ ఫిలింమేకర్. ఆయన కారణంగానే నేను ఈ సినిమా చేశాను.. ఫస్టాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా, సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగే చిత్రమిది“ అన్నారు.
డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ – “నేను విధిని నమ్మేవాడిని కానీ.. ఈ సినిమాకు 100 శాతం నమ్మాను. ఎందుకంటే జైలవకుశ సినిమాను కల్యాణ్‌రామ్‌గారు ఎన్టీఆర్‌గారి పేరు మీద పెట్టిన బ్యానర్‌లో తారక్‌తో పని చేశాను. తర్వాత మామ, అల్లుడు మధ్య రిలేషన్‌తో సినిమా చేద్దామని కోనగారు చెప్పగానే.. నిజ జీవితంలో ఓ కుటుంబానికి చెందిన మామ అల్లుడు కలిసి చేసే సినిమా తప్పకుండా బావుంటుందననిపించి విన్నాను. తర్వాత సురేష్‌గారిని కలిసి నెరేషన్ ఇచ్చాను. ఎఫ్2, మజిలీ కంటే ముందు స్టార్ట్ కావాల్సిన ప్రాజెక్ట్.. ఉగాది పచ్చడిలో చేదు, పులుపు, కారం ఇలా ఆరు రుచులుండినా చివరి ప్రొడక్ట్ బావుంటుంది. అలాంటి ఉగాది పచ్చడిలాంటి వ్యక్తి సురేష్‌బాబుగారు. ఆయన ప్రతి అడిగిన దానికి ఓ లాజిక్ ఉంటుంది. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల మేనమామ గుర్తుకొస్తాడు` అన్నారు.
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ – “డిసెంబర్ 13న `వెంకీమామ`తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వారం పదిరోజులుగా యూనిట్ అందరిలో థ్రిల్లర్ సినిమాలా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ డిస్కషన్ నడిచింది. ఇప్పుడు మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. నా కెరీర్‌లో మనం, వెంకీమామ చిత్రాలు జ్ఞాపకాలు. రేపు ఎన్ని సినిమాలు వచ్చినా, వీటిని రీప్లేస్ చేయలేం. ప్రతి విషయంలో ఈ సినిమ పరంగా బెస్ట్‌గానే జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్‌లో పనిచేయడం నా కోరిక. లేట్‌గా జరిగినా లేటెస్ట్‌గా ది బెస్ట్‌గా జరిగింది. అది వెంకీమామ పక్కన చేయడం. ప్రేమమ్‌లో ఒక సీన్‌లో చేసేటప్పుడే చాలా ఎగ్జయిట్ అయ్యి చేశాను. ఈ సినిమాలో ప్రతి సీన్‌లో ఎగ్జయిట్‌గా చేశాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా విషయాలు ఆయన్నుండి నేర్చుకున్నాను. ఈ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేశాను. బాబీ ఓ మిలటరీ ఎపిసోడ్‌లో నన్ను కొత్త చూపించాడు.. ఈ సందర్భంగా తనకు థ్యాంక్స్. విశ్వప్రసాద్‌గారికి థ్యాంక్స్. రాశీతో కలిసి భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేస్తాను. తమన్, ప్రసాద్ మూరెళ్లగారు, విజయ్‌మాస్టర్, రామ్‌లక్ష్మణ్ మాస్టర్, రవివర్మమాస్టర్ సహా అందరికీ థ్యాంక్స్“ అన్నారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ – ” నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ‘వెంకీమామ’ సినిమాకి వచ్చేటప్పటికీ నా కల నిజమైందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎప్ప్పుడు రానా, చైతన్యలతో వర్క్ చేయాలి అనుకుంటాను. నాన్నగారు కూడా మా అందరితో సినిమా తీయాలని కోరుకునేవారు. ఆయన ఉండుంటే ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసేవారు. నాన్నా ఈ సినిమా మీ కోసమే..చైతన్యని మీరు చాలా సినిమాల్లో చూశారు. కానీ ఈ సినిమాలో ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ప్రతి ఎమోషన్ చక్కగా పండించాడు. ఈ సినిమా చైతన్యతో చేయడం హ్యాపీగా ఉంది. రేపు ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. బాబీ ఇలాంటి ఒక మామ అల్లుళ్ళ కథతో రావడమే చాలా గొప్ప విషయం. చాలా సెన్సిబుల్ గా తీశారు. ప్రతి సీక్వెన్స్ బాగా వచ్చింది. బాబీ కి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది. థమన్ మంచి పాటలు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మొదటి నుండి సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే చైతన్య కెరీర్ లో బెస్ట్ రోల్ అవ్వాలని మా అన్నయ్య సురేష్ బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన అనుకున్న విధంగానే చైతన్య క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది ‘అన్నారు
నటీనటులు:
వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ)
నిర్మాతలు: సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల
మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్
కెమెరా: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: ప‌్రవీణ్ పూడి
“Prathiroju Pandage” Trailer launched by Mega Star Mother Anjanadevi
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రావు రమేష్ మాట్లాడుతూ…
అల్లు అరవింద్ గారు ఈ కథ సింగిల్ సిట్టింగ్ లో ఓకె చేసిన కథ కావడంతో నాకు ఈ సినిమాపై నమ్మకం పెరిగింది. యు.వి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్లు కలిసి చేసిన సినిమా కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సెకండ్ హాఫ్ లో ఈ సినిమాలోని రెండు సీన్స్ ను మారుతి గారు ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. థియేటర్స్ లో మాత్రమే చూడదగ్గ సినిమా ఇది. మూవీ చూస్తున్న ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ…
ఈ సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు అందరూ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. మారుతి సినిమాలో కొన్ని సీన్స్ లో విపరీతంగా నవ్వించాడు. తేజ్ నాకు బ్రదర్ లాంటివాడు, మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్త్సైన్మెంట్ గా రాబోతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ…
ట్రైలర్ చూసిన అందరూ బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. నాకు సపోర్ట్ చేసిన నా టీమ్ కు గీతా, యూవీ బ్యానర్స్ కు థాంక్స్. ఈ కథ ముందుగా దిల్ రాజుకు చెప్పినప్పుడు ఆయన సబ్జెక్ట్ బాగుందని ఎంకరేజ్ చేశారు. తేజ్ ఈ కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నాడు. సినిమాలో నటించిన అందరూ బాగా చేశారు. సత్యరాజ్ గారు కథ విని ఎన్నిరోజులు కావాలంటే అన్నిరోజుకు ఈ సినిమాకు వర్క్ చేస్తాను అన్నారు. రావ్ రమేష్ గారి పాత్ర గుర్తుండి పోతుంది. తండ్రిగా, కొడుగ్గా వెరీయేషన్స్ ఉన్న పాత్రలో నటించారు. అంజనాదేవి గారు మా చిత్ర ట్రైలర్ లాంచ్ చెయ్యడం అదృష్టాంగా భావిస్తున్నాను. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న బన్నీ గారికి స్పెషల్ థాంక్స్ తెలిపారు.
బన్నీవాసు మాట్లాడుతూ…
ఈ కథను విని నమ్మి ఒప్పుకున్నందుకు ధన్వవాదాలు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడతాను. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నానని ఇప్పుడు చెప్పగలనని అన్నారు.
రాశిఖన్నా మాట్లాడుతూ…
హ్యాపిగా ఉంది. ట్రైలర్ అందరికి నచ్చింది. నాకోసం మంచి పాత్ర రాసిన మారుతి గారికి థాంక్స్. నాకు సపోర్ట్ చేస్తున్న తేజ్ గారికి స్పెషల్ థాంక్స్. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అందరికి నచ్చే సినిమా ఇది అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ…
ఈ సినిమాను థియేటర్ లో ఫామిలీ అందరితో పాటు చూస్తే వచ్చే ఆనందం వేరు. మారుతి ఈ సినిమాను చాలా ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు, ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు. అంజనాదేవి గారు మా ట్రైలర్ విడుదల చెయ్యడం సంతోషం. తేజ్ సినిమా చేస్తున్నప్పుడు ఇతర పాత్రలకు ప్రాధాన్యం ఇస్తారు. చిరంజీవి గారి దగ్గర ఉన్న ఈ లక్షణం తేజ్ లో ఉండడం విశేషం అన్నారు.
సాయి తేజ్ మాట్లాడుతూ…
చిత్రాలహరి సినిమాతో నా సెకండ్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటినుండి మీకు అన్ని మంచి సినిమాలే ఇస్తాను. మా సినిమా ఇంత బాగా వచ్చిందంటే కారణం మా టీమ్, సో మా యూనిట్ సభ్యులకు థాంక్స్ తెలుపుతున్నాను. మారుతి గారు మాతో మంచి ఫీల్ గుడ్ సినిమా చేయించరు. గీతా ఆర్ట్స్, యూవీ బ్యానర్స్ లో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి అన్నారు
Karthikeya “90 ml” Releasing on December 6th
హీరో కార్తికేయకి `RX100` వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర తో నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన `90 ml` ని ఈ నెల 6న విడుదల చేయనున్నారు.నేహా సోలంకిని హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పాటలకి, ప్రమోషనల్ టూర్లకి మరియు ప్రీ రిలీజ్ ఈవెంటుకి అనూహ్య స్పందన వచ్చింది.ఇక కథ విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు `దేవదాస్`, ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. అంతటి విద్యావంతుడు ‘ఆథరైజ్డ్ డ్రింకర్’ గా ఎందుకు అయ్యాడన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. యూత్ కి కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు, కార్తికేయ డాన్సులు, డైలాగులు, ఫైట్స్ ట్రైలర్ లో కనిపించడంతో ప్రేక్షకుల్లో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి.ఈచిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ని శ్రీ వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థఫ్యాన్సీ ఆఫర్‌కి సొంతం చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సర్టిఫికెట్ లభించింది.
ఈ సందర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ “90ml ని మొదట డిసెంబరు 5 న విడుదల చేద్దాం అనుకున్నాము కానీ , కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6 కి మార్చుకున్నాం. పూర్తిగా కొత్త కథ కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కమెర్షియల్, ఎంటర్టైనింగ్ మరియు ఎమోషనల్ అంశాలతో రాబోతుంది. మా బ్యానర్ కి పేరు తెచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం `RX100` ని మించిన హిట్ అవుతుందని మా ప్రగాఢ నమ్మకం’’ అని చెప్పారు.
పాటలు: చంద్రబోస్, కెమెరా: జె.యువరాజ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: జీఎం శేఖర్, ఫైట్స్: వెంకట్.
Directer Sukumar launched “Play Black” Trailer
కవిత పెద్దినేని సమర్పణలో ప్రసాద్ రావు పెద్దినేని నిర్మాతగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్లే బ్యాక్. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ…
చిన్న సినిమాలు బాగా ఆడుతున్న రోజులివి. ఈ సినిమాలో పనిచేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలువుతున్నాను. కమ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. కెమెరామెన్ బుజ్జి తక్కువ టైమ్ లో బాగా తీశాడు. నేను చెయ్యలనున్న కథ ఈ ప్లే బ్యాక్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. హిట్ ఆయే ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. హరిప్రసాద్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది అన్నారు.
డైరెక్టర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ…
హీరో దినేష్ తేజ్ కష్టపడి చేశాడు, అనన్య కథ విని వెంటనే ఒప్పుకుంది. డిఫరెంట్ వెరీయేషన్స్ లో ఈ అమ్మాయి నటించింది. పెద్ద కథను కేవలం 35 రోజుల్లో పూర్తి చేశాను, అందుకు కారణం కెమెరామెన్ బుజ్జి. ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి బొంతల ఈ సినిమాను అర్థం చేసుకొని బాగా కట్ చేశాడు. టీవీ 5 మూర్తి మా సినిమాలో మంచి పాత్ర చేశాడు. సుకుమార్ నాకు తమ్ముడు, నేను సుకుమార్ 25 ఏళ్లుగా ఫ్రెండ్స్. మీడియా సపోర్ట్ తో ఈ సినిమా మరింత ఎక్కువ ప్రేక్షకులకు చేరువవుతుంది అనుకుంటున్నట్లు తెలిపారు.
టివి5 మూర్తి మాట్లాడుతూ…
నాకు హరి ప్రసాద్ చెప్పిన కథ విని థ్రిల్ ఫీల్ అయ్యాను. కొత్త కాన్సెప్గ్ తో హరి గారు మీ ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్ని ఇలాంటి కాన్సెప్ట్స్ తోనే సినిమాలు వస్తాయని అనుకుంటున్నాను. ఆడియన్స్ ఈ పాయింట్ కు కనెక్ట్ అవుతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్న అన్నారు.
క్రియేటివ్ ప్రొడ్యూసర్ డీజె.రాజు మాట్లాడుతూ…
మీడియా వారికి, సుకుమార్ గారికి థాంక్స్. అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మా సినిమా టీజర్ నచ్చితే మీరందరూ సపోర్ట్ చెయ్యండి. డైరెక్టర్ హరి రాసుకున్న థ్రిల్లింగ్ పాయింట్ ను కెమెరామెన్ బుజ్జి అందంగా తెరమీద చూపించారు. అనన్య, అర్జున్ కళ్యాణ్, స్పందన, ఐశ్వర్య పాండే, దీప్తి, టీవీ 5 మూర్తి, ఆనంద చక్రపాణి బాగా నటించారు. ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి బాగా కట్ చేసాడు, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను హరి ప్రసాద్ గారు చక్కగా చూపించారన్నారు.
డైరెక్టర్ సూర్యప్రతాప్ మాట్లాడుతూ..
చిన్న సినిమాలు ఈ మధ్య బాగా ఆడుతున్నాయి. అందుకు కారణం మీడియా. అలాగే ప్లే బ్యాక్ సినిమాను కూడా మీడియా సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్న. టీజర్ బాగుంది, సినిమా అంతకంటే బాగుంటుందని నమ్ముతున్నాను. నిర్మాత ధనుంజయ్ గారికి, డైరెక్టర్ హరి ప్రసాద్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.
హీరోయిన్ అనన్య మాట్లాడుతూ…
ప్లే బ్యాక్ కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకు ఈ సినిమా గుర్తుండి పోతుంది. మల్లేశం సినిమా తరువాత డైరెక్టర్ హరి గారు నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. టీజర్ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. మా సినిమాకు పని చేసిన ప్రతిఒక్కరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.
హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ…
మా సినిమా టీజర్ ఫంక్షన్ కు సుకుమార్ గారు రావడం సంతోషం. నాకు డైరెక్టర్ ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడే నచ్చింది. నా కెరీర్ కు ఈ సినిమా ఒక మైల్ స్టోన్ అవుతుంది అనుకుంటున్నాను. మా చిత్రంలో నటించిన అందరూ నటీనటులు, టెక్నీషియన్స్ కు థాంక్స్ తెలుపుతున్నాను. మా సినిమాకు ఆడియన్స్ సపోర్ట్ కావాలని కోరారు.
హీరో అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ…
మా ప్లే బ్యాక్ చిత్ర టీజర్ లాంచ్ చెయ్యడానికి వచ్చిన సుకుమార్ గారికి థాంక్స్, కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.
ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…
కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఆ వరుసలో ప్లే బ్యాక్ సినిమా ఉంటుంది. ఎడిటర్ గా నాకు ఈ సినిమాతో మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్ మాట్లాడుతూ…
నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ హరిప్రసాద్ గారికి ధన్యవాదాలు. మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. ముఖ్యంగా రీ రికార్డింగ్ బాగా వచ్చింది. కొత్త కథ, కథనాలతో వస్తున్న ఈ సినిమా అందరికి నచ్చుతుంది అనుకుంటున్న అన్నారు.















