స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయట. త్వరలోనే వీరిద్దరూ ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ ద్వారా ఒక్కటవబోతున్నారు. గత కొంత కాలంగా.. వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ బంధం ఇప్పుడు పెళ్లిగా మారనుంది. ఈ ఏడాది చివరిలోనే వీరి వివాహం ఉందని.. అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అని సమాచారం. అలాగే.. వీరు తమ పెళ్లిని విదేశాల్లో ఘనంగా చేసుకోబోతున్నారని మరో టాక్ వినిపిస్తోంది. కాగా.. టాలీవుడ్, తమిళ స్టార్స్, ప్రముఖ యాక్టర్స్, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరగబోతోందట. అయితే.. వీరి పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు కానీ.. తాజాగా.. నయన్ షేర్ చేసిన పిక్స్ చూస్తుంటే మాత్రం.. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందని ఖాయమనిపిస్తోంది.
రివ్యూ: గద్దలకొండ గణేష్
నటీనటులు: వరుణ్ తేజ్, అధర్వ మురళి, పూజా హెగ్డే, మృణాళిని రవి తదితరులు
మ్యూజిక్: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ : అయినంక బోస్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపినాథ్ ఆచంట
దర్శకత్వం: హరీష్ శంకర్
ముకుంద, కంచె, అంతరిక్షం, ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2 ఇలా వరసగా సాఫ్ట్ పాత్రలుండే సినిమాల్లో నటిస్తూ వస్తున్న వరుణ్ తేజ్ మొదటిసారిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్టైనర్ గద్దలకొండ గణేష్ సినిమాలో నటించారు. ఒక గ్యాంగ్ స్టర్ గా ఉండే వరుణ్ ఎలా మంచి వాడుగా మారాడు అన్నది కథ. కథ ప్రకారం మొదట వాల్మీకి అని టైటిల్ పెట్టినా కొన్ని కారణాల వలన సినిమా టైటిల్ మార్చాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ వంటి బెస్ట్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. వరుణ్ తేజ్ తో చేసిన ఈ గద్దలకొండ గణేష్ ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం.
కథ:
అధర్వ మురళి ఓ దర్శకుడు. అందరిలా కాకుండా కొత్త సబ్జెక్టుతో సినిమా చేయాలని అనుకున్నాడు. ఫేడ్ ఔట్ అయిన గ్యాంగ్ స్టర్ తో కాకుండా ప్రస్తుతం దందాలో ఉన్న గ్యాంగ్ స్టర్ కథను బేస్ చేసుకొని సినిమా చేయాలని అనుకోని.. అలాంటి వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్తాడు మురళి. మురళికి గద్దలకొండ గణేష్ కనిపిస్తాడు. గణేష్ తో పరిచయం పెంచుకొని అయన కథ తెలుసుకొని ఆ కథ ఆధారంగా సినిమా చేయాలని అనుకుంటే.. గద్దలకొండ గణేష్ మురళికి ట్విస్ట్ ఇచ్చి.. ఆ సినిమాలో తానే హీరోగా ఉంటానని చెప్పడంతో షాక్ అవుతాడు. గణేష్ నుంచి తప్పించుకోలేని పరిస్థితి.. సినిమా చేయకుండా వెళ్లలేని వైనం.. దీనిమధ్య మురళి గణేష్ తో సినిమా చేశాడా ? లేదా.? గ్యాంగ్ స్టర్ గణేష్ మంచివాడిగా ఎలా మారాడు..? పూజా హెగ్డే పాత్ర ఏంటి? అన్నది మిగతా కథ.
విశ్లేషణ :
హీరో ఎలివేషన్ కోసం ఒరిజినల్ వెర్షన్‌లో హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేయడంతో అవి మూవీ సోల్‌ని దెబ్బతీశాయి. దీనితో క్లైమాక్స్ సోసోగా అనిపిస్తుంది. అటు వరుణ్ పాత్ర సినిమాలో వచ్చి వెళ్లే పాత్రలా అనిపిస్తుంది తప్ప.. సినిమాలో భాగంగా ఉండదు. హరీష్ శంకర్ చేసిన మార్పుల వల్ల పర్ఫెక్ట్ క్లాసిక్ స్టోరీ డిస్టర్బ్ అయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా వరుణ్ తేజ్‌కి ఈ సినిమాలో ఒక్క పూర్తిస్థాయి యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉండకపోవడం గమనార్హం. దీనితో పాటు ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా నడుస్తుంది.
రివ్యూ: సైరా
నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, రవికిషన్, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు
మ్యూజిక్: అమిత్ త్రివేది,
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జూలియస్ ఫాఖియం
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్
నిర్మాత: రామ్‌చరణ్
దర్శకత్వం: సురేందర్‌రెడ్డి
మెగా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించాడు. అక్టోబర్ 2న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల అయింది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో ఈ చిత్రం రూపొందింది.
కథ:
అనగనగా రాయలసీమలోని రేనాడు ప్రాంతం.. ఈ ప్రాంతాన్ని 61మంది పాలెగాళ్ళు పరిపాలన చేస్తుంటారు. ఆ 61 ప్రాంతాలు కూడా చిన్న చిన్న సంస్థానాలుగా ఉన్నాయి. అయితే, వీరి మధ్య ఐక్యత లేదు. ఒకరంటే మరొకరికి పడదు. అప్పటి వరకు ఆ ప్రాంతంలోని పన్నులను నిజాం నవాబులు వసూళ్లు చేసేవారు. బ్రిటిష్.. నిజాం నవాబుల మధ్య జరిగిన ఒప్పందంతో.. అక్కడి పన్నులను వసూలు చేసుకునే హక్కును బ్రిటిష్ పాలకులకు అప్పగిస్తుంది. వర్షాలు లేక, పంటలు పండగ నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా పన్నులు కట్టాలని బ్రిటిష్ పాలకులు ఒత్తిడి తీసుకొస్తారు. ప్రజలను హింసిస్తుంటారు. అలాంటి సమయంలోనే సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతాడు. అయితే, 61 పాలెగాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడంతో మొదట్లో ఇబ్బందులు పడతారు. అనంతరం 61 మంది పాలెగాళ్లను ఒకతాటిపైకి తీసుకొచ్చి బ్రిటిష్ పాలకులను ఎలా ఎదుర్కొన్నారు అన్నది చిత్ర కథ.
విశ్లేషణ:
ఆడియన్స్ కు ఓ పక్కా కమర్షియల్ సినిమాను అందించారు.సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్,టెక్నికల్ టీమ్ సపోర్ట్,నటీనటుల ప్రతిభ అన్నీ తోడై సక్సెస్ అయింది.మొదలయిన 30 నిమిషాల వరకు సోసో గా సాగినా.. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉండటంతో ఫస్టాఫ్ బాగుందనిపిస్తుంది.అక్కడ లేచిన సినిమా పేస్ తర్వాత కూడా కంటిన్యూ అయింది.తన కోటపై దాడికి వచ్చిన బ్రిటీషర్లను ఎదుర్కునే ఎపిసోడ్,వార్ ఎపిసోడ్,క్లైమాక్స్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి.చివర్లో దేశం గురించి,స్వాతంత్ర్య పోరాటం గురించి చెప్పిన డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి.తద్వారా బయటకు వచ్చే ప్రేక్షకుడు సాటిస్ ఫై అవుతాడు.చరిత్ర మరిచిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గొప్పదనం ఈ సినిమా ద్వారా తెలుస్తుంది.ఆ పాత్రలో మెప్పించిన చిరంజీవి అభినందనీయుడు. సెకండాఫ్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రతిభ కనిపిస్తుంది.ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.చిరంజీవి ఫ్యాన్స్ కు ఈ సినిమా పండగ లా ఉంటుంది.తమ హీరోను ఇలాంటి గొప్ప పాత్రలో చూడటం వాళ్లను సాటిస్ ఫై చేస్తుంది కాగా ఆడియన్స్ ను కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది.
Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!








