Home Blog Page 1005

“Bhagyanagara Veedhullo Gammathu”Pre Release Event

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. డిసెంబ‌ర్ 6న విడుద‌ల సినిమాను విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా అనిల్ రావిపూడి, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ పాల్గొన్నారు. బ్యాన‌ర్ లోగోను అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. టైటిల్ యానిమేష‌న్‌ను ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా..
ద‌ర్శ‌క నిర్మాత శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ – “ఈ సినిమాను ముందుగా చిన్న కాన్సెప్ట్‌గానే స్టార్ట్ చేశాం. అంద‌రూ త‌మ వంతు స‌పోర్ట్ చేశారు. ముందు ఈ సినిమాకు నిర్మాత‌గా మాత్ర‌మే సినిమా చేద్దామ‌ని అనుకున్నాను. కానీ వేరే డైరెక్ట‌ర్‌ను పెట్టినా ఆయన వెన‌క ఏమైందంటూ నేను నిల‌బ‌డాల్సి వ‌స్తుంది. దీంతో నేనే డైరెక్ట్ చేశాను. ద‌ర్శ‌కుడు కావాల‌నే కోరిక అలా తీరింది. సినిమా చూసిన దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, సాయిగారు స‌హా కొంత‌మంది చిన్న చిన్న క‌రెక్ష‌న్స్ చెప్పారు. అదంతా మా సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది. సినిమాను డిసెంబ‌ర్ 6న విడుద‌ల చేస్తున్నాం. జౌట్ అండ్ ఔట్ కామెడీ. 1గంట 53 నిమిషాలున్న మా సినిమాలో గంట‌న్న‌ర సేపు ప‌డి ప‌డి న‌వ్వుతారు. ఆ విష‌యంలో నాది గ్యారెంటీ. నో యాక్ష‌న్‌, నో సెంటిమెంట్ .. ఓన్లీ కామెడీ“ అన్నారు.
ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ – “ఈ సినిమాకు రెండోసారి సాకేత్ మ్యూజిక్ అందించాడు. త‌న ప‌నితో అంద‌రినీ క‌లుపుకుపోయే ర‌కం. త‌ను మంచి సింగ‌ర్‌, మ్యూజిషియ‌న్‌. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌తిరోజూ క‌ష్ట‌ప‌డాల్సిందే. ఆ క‌ష్ట‌మేంటో నాకు తెలుసు. అలాగే శ్రీనివాస‌రెడ్డిగారికి థ్యాంక్స్‌. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “ ఇండ‌స్ట్రీలో నేను వ‌చ్చిన‌ప్ప‌టి నుండి నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఒక‌రు. అందుక‌నే నా సినిమాల్లో త‌నుంటాడు. `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో త‌ను మిస్స‌య్యాడు. ఈ సినిమా చేయాల‌నుకోగానే న‌న్ను స‌ల‌హా అడిగాడు. త‌ను మా సినిమా షూటింగ్‌లో కూడా ఆర్టిస్ట్ కంటే అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా క‌ష్ట‌ప‌డుతుంటాడు. త‌ను డైరెక్ష‌న్‌తో పాటు ఈ సినిమాకు ప్రొడ‌క్ష‌న్ కూడా చేస్తున్నాన‌ని చెప్ప‌గానే కాస్త భ‌య‌ప‌డ్డాను. ఎందుకున్నా.. రిస్క్ ఏమో! అని అన్నాను. త‌ను ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాడు. త‌న‌కు ఆల్ ది బెస్ట్ అలాగే వాళ్ల ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ గ్రూప్ త‌న‌ను బాగా న‌మ్మారు. నేను సినిమాను చూశాను. నాకు స‌న్నివేశాలు బాగా న‌చ్చాయి. ప్రేక్ష‌కులు కూడా శ్రీనివాస్‌రెడ్డిగారి తొలి ప్ర‌య‌త్నాన్ని స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు. సాకేత్‌కు అభినంద‌న‌లు“ అన్నారు.
నిర్మాత ప‌ద్మ‌నాభ రెడ్డి మాట్లాడుతూ – శ్రీనివాస‌రెడ్డిగారితో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌రిచ‌యం ఎర్ప‌డిన‌ప్ప‌టికీ ఆ ప్ర‌యాణం బావుంది. ఈ సినిమా విష‌యంలో ఆయ‌న కేవ‌లం భాగ్య‌న‌గ‌ర వీధుల్లోనే కాదు. రెండు రాష్ట్రాల్లోనూ గ‌మ్మ‌త్తు చేస్తార‌న‌డంలో సందేహం లేదు. గ‌ట్టిగా న‌వ్విస్తున్నారు. చాలా క్లారిటీగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది“ అన్నారు.
స‌త్యం రాజేష్ మాట్లాడుతూ – “సాధార‌ణంగా మ‌న‌కు క్లోజ్‌గా ఉండేవాళ్ల సినిమాల్లో న‌టించేట‌ప్పుడు ఎంజాయ్ చేస్తూ న‌టిస్తాం. కానీ ఈ సినిమా విష‌యానికి వ‌స్తే డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రెడ్డిని ఓ ఆటాడుకున్నాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. అంద‌రూ అద్భుతంగా న‌టించారు“ అన్నారు.
ష‌క‌ల‌క శంక‌ర్ మాట్లాడుతూ – “శ్రీనివాస్‌రెడ్డన్న‌తో నా కెరీర్ ప్రారంభం నుండి ట్రావెల్ అవుతున్నాను. ఆయ‌న నాకు పెద్ద‌న్న‌లాంటి వ్య‌క్తి. 37 రోజుల పాటు ప‌నిచేశాను. సినిమా స‌క్సెస్ సాధిస్తుంద‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్రం శ్రీను, ప్రవీణ్‌, అశోక్ త‌దిరులు పాల్గొన్నారు.

Sridevi: The Eternal Goddess’ Book Launched By Bollywood Star Deepika Padukone

శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖనటి దీపికా పదుకొనె.
దివంగ‌త అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి జీవిత చ‌రిత్ర‌ ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ అనే పుస్తక రూపంలో రానుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌త్యార్థ్ నాయక్ ఈ పుస్తకాన్ని రచించారు. పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించింది. ఇండియా హాబీటాట్ సెంటర్ ఢిల్లీ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకొనె, శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ పుస‌క్తానికి ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ముందు మాట‌ రాయ‌డం విశేషం.
‘ఐకాన్ శ్రీదేవిగారి న‌టనా జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. ఆమె సినిమాల‌ను చూస్తూ పెరిగాను. న‌ట‌న‌లో ఆమె ఒక ఇన్సిస్టిట్యూట్‌.. ఆమె పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు కాజోల్.

శ్రీదేవి చిన్నతనం నుండి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే వ‌ర‌కు ఆమె ఎదుర్కొన్న ప‌రిస్థితులు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రచయిత స‌త్యార్థ్ నాయ‌క్ సవివరంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ బుక్ కోసం శ్రీదేవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Angry Hero Karthi’s ‘Donga’ Releasing On December 20th

ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు దొంగ గా రానున్నాడు. ఈ చిత్రం లో కార్తీకి వదిన, సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ పోస్టర్స్, టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

‘దొంగ’ నుండి ఫస్ట్ సింగ్ విడియో నీ ఆదివారం విడుదల చేశారు. ‘రూపి రూపి’ అంటూ సాగే హుషారైన పాటని గోవా లో కలర్ఫుల్ గా పిక్చరైజ్ చేశారు. లాంగ్ హెయిర్ తో, కొత్త తరహా స్టైలింగ్ తో కార్తీ సాంగ్ లో ఎనర్జిటిక్ గా ఉన్నారు.”… ఎవ్వరినీ వదలదుగా నా స్ట్రీట్ స్మార్ట్ చిలిపి తనం.. మాయలోన పుట్టి మాయలోన పెరిగినాను” అంటూ సాగే ఈ పాట హీరో క్యారెక్టరైజేషన్ నీ తెలిపేలా సాగుతుంది. రామజోగయ్య శాస్త్రీ ఈ పాటని రాయగా, రంజిత్ గోవింద్ పాడారు. గోవింద్ వసంత సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి డిసెంబ‌ర్ 20 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌, నిఖిల విమల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.

Arjun Suravaram Directer Tn Santhos interview

బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై యువ క‌థానాయ‌కుడు నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని థియేటర్ లలో మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ టి.ఎన్. సంతోష్ మీడియా తో మాట్లాడుతూ…..

తెలుగు సినిమా చేశారు కదా తెలుగు నేర్చుకోలేదా.?

తెలుగు బాగా అర్ధమవుతుంది, కానీ మాట్లాడడం రాదు,నాకు చెన్నయ్ కంటే కూడా హైదరాబాద్ చాలా ఇష్టం.ఇక్కడ పీపుల్ సినిమా టీం అంతలా నచ్చింది.నిఖిల్ ప్రొడ్యూసర్ కు మంచి సపోర్ట్ చేశారు.

నిఖిల్ గురుంచి…..

ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నిఖిల్ ఒక చాక్లెట్ బాయ్ లా ఉన్నాడు ఈ సినిమాని క్యారీ చెయ్యగలడా అనుకున్నాను కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అలాంటి డౌట్స్ ఏమి లేవు చాలా బాగా చేసాడు,ఈ సినిమా కోసం 15 kgs పెరిగాడు.

తెలుగు ఆడియన్స్ గురుంచి?

నాకు తెలుసు సినిమా ఎలా ఉంటే తెలుగు ఆడియన్స్ లవ్ చేస్తారు అని,మిగతా వాటితో పోలిస్తే పైరసీ ఇక్కడే తక్కువగా ఉంటుంది.
సినిమా కూడా అక్కడ 100 కోట్లు సాధిస్తే ఇక్కడ 200 కోట్లు సాధిస్తుంది.

తమిళ్ తరువాత మీరు ఏ లాంగ్వేజ్ లో చెయ్యడానికి ఇష్ట పడతారు?

నాకు వేరే లాంగ్వేజ్ లో కూడా సినిమాలు వచ్చాయి కానీ నేను చేయలేదు కన్నడ లో కూడా వచ్చింది.నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం.

క్లైమాక్స్ ఏమైనా చేంజ్ చేశారా?

క్లైమాక్స్ అక్కడ లెంగ్తీ గా ఉంటుంది.ఇక్కడ కొంచెం ఎమోషన్ యాడ్ చేసాం,ఒరిజినల్ సినిమాలో లేనివి కూడా కొన్ని యాడ్ చేసాం.

మురగదాస్ గారితో మీ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది?

ఆయనతో రెండు సినిమాలకు వర్క్ చేసాను 7th సెన్స్ ,తుపాకీ ఈ కథ పాయింట్ ఆయనకి తెలుసు 1st టైం తమిళ్ రిలీజ్ అయ్యాక చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.ఈ సినిమా చూసి తెలుగులో కూడా రిమేక్ చెయ్ బాగుంటుంది ఆయనే చెప్పారు.

తెలుగు సినిమా చేస్తారా తమిళ్ సినిమా చేస్తారా.?

తెలుగు సినిమా అనుకుంటున్నాను,
బై లింగ్వగల్ అయితే ఇంకా మంచిది.

ఈ సినిమా సీక్వెల్ చేస్తున్నారా?

ఇప్పుడు ఇంకా ఏవిధమైన ప్లాన్ చెయ్యలేదు

సినిమా రిలీజ్ లేట్ అయింది కదా మీకు ఏమనిపించింది.?

కొంచెం బాధ అనిపించింది, అలానే మాకు ప్రాబ్లమ్ కూడా తెలుసు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్న.

నిఖిల్ చెప్పాడు నేను డైరెక్టర్ తో కొన్నిసార్లు గొడవ పడ్డాను అని.?

అది ఫైట్ కాదు,నిఖిల్ క్వశ్చన్స్ చేసేవాడు ఇది రీమేక్ కాబట్టి నేను కూడా ఆన్సర్ ఇచ్చేవాణ్ణి, అలా ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉండేది అది చాలా మంచిది, ఆయన అడిగిన ప్రతిసారి నేను పాజిటివ్ గా తీసుకున్నాను.మేము సినిమా కోసం గొడవ పడ్డాము,మేము పర్శనల్ గా మంచి ఫ్రెండ్స్.

నెక్స్ట్ సినిమా విషయం గురించి.?

ఇంకా డిస్కషన్ జరుగుతుంది,కాన్ఫర్మ్ అయ్యాక అతి త్వరలో చెప్తాను.

ఏ జోనర్ లో చేయబోతున్నారు .?

సినిమా రిలీజ్ అయ్యాక కంప్లీట్ సబ్జెక్ట్ చెప్తాను మీకు.

Sai Ram Shankar New Movie “Resound” Opening

రియల్ రీల్స్ ఆర్ట్స్, అమృత హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ పతాకం పై దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరో గా రాశి సింగ్ హీరోయిన్ గా కృష్ణ చిరుమామిళ్ల దర్శకతం లో జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం ‘రి సౌండ్ ‘. శ్రీ వెంకటేశ్వర స్వామి అశీసులతో పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది . ముఖ్య అతిధులు, స్టార్ చిరంజీవి తో సైరా సినిమా తో విజయ కెరటం ఎగరవేసిన దర్శకుడు సురేంద్ర రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. డైరెక్టర్ సుకుమార్ క్లాప్ ఇవ్వగా . మొదటి షాట్ కు పోసాని కృష్ణ మురళి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ తో యూత్ ని అలరిస్తున్న ఆకాష్ పూరి కూడా పూజ కార్యక్రమాలలో పాల్గున్నారు.

అనంతరం పాత్రికేయుల సమావేశం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్సకుడు సుకుమార్ మాట్లాడుతూ “సాయి రామ్ శంకర్ మళ్ళి రీసౌండ్ పేరుతో వస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది.

హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ “ఆర్య తో దర్శకుడు సుకుమార్ మంచి హిట్ సౌండ్ చేసారు ఇప్పుడు రంగస్థలం తో రీసౌండ్ చేసాడు, అతడొక్కడే తో దర్శకుడు సురేంద్ర రెడ్డి హిట్ సౌండ్ చేసారు ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి తో సైరా సినిమా తో రీసౌండ్ చేసాడు. మా సినిమా పేరు రీసౌండ్ , మంచి కథ, కొత్త గా ఉంటుంది. రేపటి నుంచే షూటింగ్ ప్రారంభం. హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం. అని కమర్షియల్ ఎలెమెంట్స్ ఉంటాయి. అందరిని అలరిస్తుంది . మా సినిమా ప్రారంభానికి వచ్చిన సుకుమార్ గారి కి సురేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు.

హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ : నాకు ఈ సినిమా లో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది. సాయి రామ్ శంకర్ గారికి, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్స్” అని తెలిపారు.

డైరెక్టర్ కృష్ణ చిరుమామిళ్ల మాట్లాడుతూ : మంచి కమర్షియల్ సినిమా. అందరికి సినిమా నచ్చుతుంది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

నిర్మాతలు రాజా రెడ్డి మాట్లాడుతూ “రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. సాయి రామ్ శంకర్ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. సుకుమార్ గారికి, సురేంద్ర రెడ్డి గారికి మా సినిమా ఫంక్షన్ కి వచ్చినందుకు ధన్యవాదాలు . మంచి కథ ప్రతి ప్రేక్షకుడికి నచుతుంది” అని తెలిపారు.

సినిమా పేరు : రీసౌండ్
నటి నటులు : సాయి రామ్ శంకర్, రాశి సింగ్, అరవింద కృష్ణ, తదితరులు
కెమెరా మాన్ : సాయి ప్రకాష్
సంగీతం : స్వీకర్ అగస్తి
డైరెక్టర్ : కృష్ణ చిరుమామిళ్ల
నిర్మాతలు : జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి

Aisian Muktha Cinema A2 Opening

సినిమా మల్టీప్లెక్స్ లలో ఎసియన్ బ్రాండ్ నలుదిశలా వ్యాప్తిస్తుంది.  హైదరాబాద్ లో పదో మల్టీ ప్లెక్స్ ను నారపల్లి లో మంత్రులు తలసానిశ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ప్రారంభించారు.
రాజకీయ,సినీ ప్రముఖలతో ఎసియన్ ముక్తా సినిమాస్ ఎ2 ప్రారంభం గ్రాండ్ గా జరిగింది. మిడిల్ క్లాస్ పీపుల్ కి అందుబాటులో ఉండే విధంగా మల్టీప్లెక్స్ లను అందుబాటులోకి తెచ్చిన ఘనత ఎసియన్ గ్రూప్ కే దక్కుతుంది.

వేగంగా విస్తరిస్తున్న జంట నగరాలలో ఎసియన్ మల్టీ ప్లెక్స్ లు సాధారణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో  అందరికీ అందుబాటులో ఉండే విధంగా మల్టీ ప్లెక్స్ లను డిజైన్ చేయడంలో ఎసియన్ గ్రూప్ సక్సెస్ అయ్యింది.  అందుకే అనతి కాలంలో పది మల్టీ ప్లెక్స్ లను నిర్మించగలిగింది. ఈ కార్య క్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి , ఎమ్యల్యే భేతి సుభాష్ రెడ్డి లతో పాటు నిర్మాతలు లక్షణ్, గోవర్దన్ లు, ఎసియన్ సినిమాస్ అధినేత్ సునీల్ దాస్ నారాంగ్, డిస్ట్రిబ్యూటర్ సదానంద్ గౌడ్, శ్రీధర్ , కాంప్లెక్స్ యజమాని జనార్ధన్ లతో పాటు పలువురు ప్రముఖలు  హాజరయ్యారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ:
‘‘ ఈ  కార్యక్రమానికి అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా అనేది సామాన్యులకు అందుబాటులో ఉండే వినోదం. ఆ వినోదాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచుతున్న ఎసియన్ సంస్థకు నా శుభాకాంక్షలు’’ అన్నారు.

ఎసియన్ గ్రాప్ ఛైర్మన్ నారాయన్ దాస్ కె నారంగ్  మాట్లాడుతూ:
‘‘ ఎసియన్ జంటనగరాల్లో నిర్మించిన పదో మల్టీ ప్లెక్స్ ఇది. నగరం వేగంగా అభివృద్ది చెందుతుంది.  అందుకే మల్టీ ప్లెక్స్ లను అందరికీ అందుబాటులో ఉండేవిధంగా నిర్మిస్తున్నాము. ఎ మల్టీ ప్లెక్స్ లేని విధంగా ఎసియన్  మల్టీ ప్లెక్స్ సామాన్యులకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది మిడిల్ క్లాస్ వారికి సామాన్యులకు అందుబాటులో ఉండే వినోదం. హైదారాబాద్ తో పాటు కర్నాటక, ఆంధ్రాలలో కూడా ఎసియన్ మల్టీ ప్లెక్స్ లను వచ్చే యేడాది నిర్మిస్తాము. నారా పల్లి లో ఎసియన్ మల్టీ ప్లెక్స్  నిర్మించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

Roylakshmi ‘Cinderella’ teaser Release

ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామ‌ర్ డాల్ `రాయ్‌ల‌క్ష్మి ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం `సిండ్రెల్లా`. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని మ‌ల్టీ కల‌ర్‌ ఫ్రేమ్స్, ఎస్‌.ఎస్‌.ఐ ప్రొడ‌క్ష‌న్‌  బ్యాన‌ర్స్‌పై తెలుగులో మంచాల ర‌వికిర‌ణ్ `సిండ్రెల్లా` పేరుతోనే ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఎం.ఎన్‌.రాజు ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌.

ఎస్‌.జె.సూర్య ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన విను వెంక‌టేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా టీజ‌ర్‌ను ఆదివారం విడుద‌ల చేశారు. హార‌ర్ ఫాంట‌సీ, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

స‌ర్కార్ 3, కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాల‌కు కెమెరామెన్‌గా వ‌ర్క్ చేసిన ర‌మ్మీ ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు. కాంచ‌న 2 చిత్రానికి సంగీతాన్ని అందించిన అశ్వామిత్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే గేమ్ ఓవ‌ర్ చిత్రానికి సౌండ్ డిజైన్ చేసిన స‌చిన్ ఈ చిత్రానికి చేసిన సౌండ్ డిజైనింగ్ హైలైట్ కానుంది.

త్వ‌ర‌లోనే ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత‌ మంచాల ర‌వికిర‌ణ్‌, స‌హ నిర్మాత‌ ఎం.ఎన్‌.రాజు తెలిపారు.

న‌టీన‌టులు:
రాయ్ ల‌క్ష్మి, రోబో శంక‌ర్‌, అభిన‌య‌, అర‌వింద్ ఆకాశ్‌, సాక్షి అగ‌ర్వాల్‌, వినోద్‌, అన్బు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌:  మ‌ల్టీ క‌ల‌ర్ ఫ్రేమ్స్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  విను వెంక‌టేశ్‌
నిర్మాత‌:  మంచాల ర‌వికిర‌ణ్‌
కో ప్రొడ్యూస‌ర్‌: ఎం.ఎన్‌.రాజు
సినిమాటోగ్రాఫ‌ర్‌: ర‌మ్మీ
మ్యూజిక్‌: అశ్వామిత్ర‌
సౌండ్ డిజైనింగ్‌: స‌చిన్‌(సింక్ సినిమాస్‌)

ఎడిట‌ర్‌:  లారెన్స్ కిషోర్‌

December 6th “Mera Dosth”

పవన్, శైలజ జంటగా వి.ఆర్ ఇంటర్నేషనల్ పతాకం పై  పి .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం `మేరా దోస్త్`. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునిఈ నెల  6న రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమంలో చిత్ర  నిర్మాత పి.వీరా రెడ్డి  మాట్లాడుతూ …“సినిమా అంతా  కంప్లీట్ అయ్యింది. ఈ నెల  6న దాదాపు 150 థియేటర్స్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. సినిమా పట్ల మా టీమ్ అంతా ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. స్టోరీ, చిన్నా  గారి మ్యూజిక్ మా సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది“ అన్నారు.
  డైరెక్టర్ జి. మురళి మాట్లాడుతూ…“నిర్మాత   ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు. సినిమా ప్రమోషన్, రిలీజ్  కూడా చాలా  గ్రాండ్ గా చేస్తున్నారు.   ప్రేమ , ఫ్రెండ్ షిప్ తో పాటు ఫామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి.  ఈ నెల6న సినిమా రిలీజ్. మా ప్రయత్నాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా “అన్నారు.
హీరోయిన్ శైలజ మాట్లాడుతూ…“ఇందులో నేను  పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర  చేశాను. డిసెంబర్ 6 న సినిమా  వస్తుంది. లవ్, ఫ్రెండ్ షిప్, ఫామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అందరూ  చూసి బ్లెస్ చేయండి “ అన్నారు.
 కాశీవిశ్వనాధ్ , బెనర్జీ, అమిత్, వీరారెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ : చిన్న; ఎడిటర్ : నందమూరి హరి; కెమెరా: సుధీర్; నిర్మాత: పి. వీరారెడ్డి; డైరెక్టర్: జి.మురళి.

“MADHANAM” Trailar launched by Sukumar

శ్రీనివాస సాయి హీరోగా భావన రావు హీరోయిన్ గా అజయ్ మణికందన్ దర్శకత్వంలో కాశీ ప్రొడక్షన్స్ పతాకంపై దివ్యప్రసాద్, అశోక్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం “మథనం”. రియలిస్టిక్ కథాంశంతో లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఇండియాలో రిలీజ్ అవకుండా ఫస్ట్ టైం యు ఎస్ లో డిసెంబర్ 6న విడుదల కావడం విశేషం..ఆ తర్వాత ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.  కాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్యఅతిధిగా హాజరై మథనం ట్రైలర్ ని లాంచ్ చేశారు.. ఈ కార్యక్రమంలో సూపర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, హీరో  శ్రీనివాస సాయి, హీరోయిన్ భావన రావు, నటులు అజయ్ గోష్, రవి ప్రకాష్, సుభాష్, దువ్వాసి మోహన్, నటి హేమ, నిర్మాత దివ్య ప్రసాద్, దీప, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరామెన్ పిజి విందా, లిరిక్ రైటర్ పూర్ణచారి, తానా ప్రెసిడెంట్ సతీష్ వేముల, సెక్రటరీ రవిపోతుల, చిత్ర నిర్మాత అశోక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.. 

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ… అశోక్ ప్రసాద్ ప్యాషన్ ఉన్న ఎన్ ఆర్ ఐ ప్రొడ్యూసర్. ట్రయిలర్ చాలా డిఫరెంట్ గా ఉంది. హీరో శ్రీనివాస్ సాయి ఐస్  ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. ఈ సినిమా యు ఎస్ లో విడుదల కావడం చాలా హ్యాపీగా ఉంది. నా సినిమా “వన్ నేనొక్కడినే” యు.ఎస్ లో బాగా ఆడింది. లేకపోతే నా కెరియర్ వేరేలా ఉండేది. కంటెంట్ బాగుంటే యు..ఎస్ ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారు.. ఈ సినిమా రియలిస్టిక్ లవ్ స్టోరీతో వస్తోంది.. మంచి సినిమా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.. నిర్మాతలు దివ్య, అశోక్ ప్రసాద్ కి పెద్ద సక్సెస్ రావాలి.. అన్నారు. 

సూపర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం అశోక్ ఇండస్ట్రీలో నే ఉండేవాడు. అమెరికా వెళ్లి జాబ్ చేస్తూ.. డబ్బులు సంపాదించి ఈ సినిమా తీశాడు. సినిమా అంటే అతనికి పిచ్చి. దాంతోనే తన ఫ్రెండ్ ని డైరెక్టర్ని చేస్తూ ఒక మంచి సినిమా చేశాడు.  కొత్త పాయింట్తో ఒక మంచి ప్రయత్నం చేశారు. ఫస్ట్ టైం ఈ చిత్రం యు.ఎస్ లో రిలీజ్ కావడం విశేషం.. అన్నారు. 

తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన మాట్లాడుతూ.. యు.ఎస్ లో సెటిల్ అయిన ఎన్ ఆర్ ఐస్  మన తెలుగువారు నవీన్ ఎర్నేని, అనిల్ సుంకర మంచి హిట్ చిత్రాలు తీసి సక్సెస్ ఫుల్ నిర్మాతలు అయ్యారు. వారిలాగే అశోక్ ప్రసాద్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది.. డిసెంబర్ 6న యు.ఎస్ లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి మా సపోర్ట్ ఉంటుంది. అక్కడ చిత్రం సెలబ్రేషన్స్ ని ఘనంగా జరపనున్నాం.. అన్నారు. 

హీరో శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ.. నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు. అజయ్ మాస్టర్ డాన్స్ ఇనిస్టిట్యూట్ లో మిర్రర్స్ చూసుకుంటూ ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాను. అప్పట్నుంచి అజయ్ గారితో పరిచయం ఉంది. కథ వినగానే చాలా ఎక్సయిట్ అయ్యాను. మేకప్ లేకుండా నాచురల్ గా ఈ చిత్రంలో నటించాం. పిజి విందా అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రాన్ని  పిక్చరైజ్ చేశారు. అశోక్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు..సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని మా టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.. అన్నారు. 

దర్శకుడు అజయ్ మణికంధన్ మాట్లాడుతూ.. కేరళ లో పుట్టి, చెన్నైలో పెరిగి, హైదరాబాద్ వచ్చి ఇక్కడ సినిమా తీయడం చాలా హ్యాపీగా ఉంది. నిజ జీవితంలో జరిగిన ఒక విషయాన్ని ఇన్ స్పైర్ అయి కథ రాశాను. అశోక్, దివ్యలకు స్టోరీ చెప్పాను. వారికి బాగా నచ్చింది. అప్పట్నుంచి వారిని వదలకుండా సినిమా పూర్తి చేశాను. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. అందరం కలిసి జెన్యున్ గా మంచి సినిమా చేశాం… అన్నారు. 

నిర్మాత అశోక్ ప్రసాద్ మాట్లాడుతూ.. అజయ్ ఆరేళ్లుగా ఈ కథపై వర్క్ చేశాడు. డిసెంబర్ 6న మథనం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.  తెలుగు సినిమా హిస్టరిలో తొలిసారిగా మా సినిమాని ఇండియాలో రిలీజ్ చేయకుండా యు.ఎస్ లో విడుదల చేస్తున్నాం.  ఆ తర్వాత తెలుగు రిలీజ్ ఇండియాలో  ప్లాన్ చేస్తాం.. కోటగిరి చంటి గారి ఎడిటింగ్, పిజి విందా కెమెరా విజువల్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి.. హీరో శ్రీనివాస్, హీరోయిన్ భావన రావ్ పోటా పోటీగా నటించారు. బడ్జెట్ కి వెనకాడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించాం. అన్నారు.