Home Blog Page 12

MS Raju’s Pan India Mystical Divine Thriller “Agadha” In Telugu, Tamil, Kannada, Malayalam and Hindi

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన “శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రాలు ఒక ట్రెండ్ సృష్టించాయి. దర్శకునిగా కూడా ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ చిత్రాలు అందుకు నిదర్శనాలు. ఒకసారి చేసిన కాన్సెప్ట్ ని మళ్లీ మళ్లీ అనుసరించటం ఆయనకు ఇష్టం ఉండదు. ఏం చేసినా ప్రేక్షకులకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నదే ఆయన లక్ష్యం. అందుకోసమే ఆయన ‘అగధ’ను సిద్ధం చేస్తున్నారు. ఏడాది కాలంగా ఆయన ఈ ప్రాజెక్టు మీదనే అహరహం శ్రమిస్తున్నారు.

‘అగధ’ ప్రమోషన్స్ విభిన్నంగా మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ వీడియోను విడుదల చేశారు. ఇద్దరు దొంగలు ఎమ్మెస్ రాజు ఆఫీసులో దొంగతనానికి వెళ్లడం, అక్కడున్న సినిమా పోస్టర్స్ ని చూస్తూ ఆ దొంగలు ఆ సినిమా జ్ఞాపకాలను తలుచుకోవడం, చివరగా ఒక పోస్టర్ ని చూసి అక్కడ ఏదో ఉందని భయపడటంతో ఆ వీడియో ఎండ్ అవుతుంది. తీరా అక్కడ ఉన్నది ‘అగధ’ సినిమా పోస్టర్ . ఆ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు.

ఒక చీకటి గుహ.
చుట్టూ వెలుగుతోన్న కొన్ని కాగడాలు.
చీకటే కాదు ఆ సన్నని వెలుతురు కూడా భయానకంగా ఉంది.
అక్కడ ఒక భారీ విగ్రహం.
మొహమంతా మిస్టిక్ గా ఉంది.
ఆ విగ్రహానికి 12 చేతులు.
ఈ విగ్రహం ముందు … వెనుతిరిగి ఉన్న ఒకమ్మాయి . ఆమె వేషధారణ కూడా చాలా విభిన్నంగా ఉంది.
ఈ పోస్టర్ తోనే ఒక ఆసక్తిని జనరేట్ చేశారు ఎమ్మెస్ రాజు.

మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ గా ‘అగధ’ను రూపొందిస్తున్నారాయన. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతున్న చిత్రం ‘అగధ’. కాశీ విశాలాక్షి బలుసు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘అగధ’ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రం గురించి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ “ఇదొక మిస్టికల్ డివైన్ థ్రిల్లర్. ఇందులో నటించిన తారలు ఎవరనేది త్వరలో తెలియజేస్తాం. రకరకాల సెట్లు, విభిన్న లొకేషన్లలో 85 రోజులు షూటింగ్ చేసాం. ఈ సినిమాలో 45 నిమిషాల వి ఎఫ్ ఎక్స్ ఉంటుంది. దాన్నిబట్టే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అతిత్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: మిక్కిన్ అరుల్ దేవ్, ఛాయాగ్రహణం : నాని చమిడిశెట్టి, ఎడిటర్: జునైద్ సిద్దిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, అడిషనల్ స్క్రీన్ ప్లే: చైతన్య వేగి , ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. వి. ఎన్. సుబ్బరాజ్ , నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు, రచన- దర్శకత్వం: ఎమ్మెస్ రాజు.

Spider-Man: Brand New Day Star Tom Holland Suits Up for an Epic Showdown in Two New Posters

The buzz around everyone’s favourite web-slinger is only getting louder, courtesy of two new posters released this week! Weeks after Spider-Man: Brand New Day dropped its first look, Sony Pictures has treated fans to fresh glimpses of the superhero’s next chapter. The posters were unveiled at CinemaCon 2026.

Sony head Tom Rothman first showcased the two upcoming posters for the film, noting that it “feels like nothing we’ve ever made,” despite the many past stories around the superhero. He also called it Holland’s “finest performance,” before Holland appeared virtually to declare that the movie is “the most emotional Spider-Man film we’ve ever made, and in some ways, the most grown-up.”

The trailer of Spider-Man: Brand New Day has already shattered records, becoming one of the most talked-about and widely viewed trailers in recent times. The overwhelming response is a clear sign that audiences are more than ready to dive back into Spider-Man’s world—this time with higher stakes, deeper emotions, and a gripping new storyline.

Directed by Destin Daniel Cretton, Spider-Man: Brand New Day sees Tom Holland reprise his role alongside Zendaya, Jacob Batalon, Sadie Sink, Jon Bernthal, Mark Ruffalo, Michael Mando, and Tramell Tillman in pivotal roles.

Sony Pictures Entertainment India will release Spider-Man: Brand New Day in theatres on 31st July 2026 in English, Hindi, Tamil, Telugu, Kannada, and Malayalam across all premium formats.

‘Pithapuramlo…Ala modalaindi’ Movie Grand Releasing on May 1st

సీనియర్ దర్శకులు మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘పిఠాపురంలో … అలా మొదలైంది’ చిత్రం మే 1 న విడుదల కానుంది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన తారాగణం. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు.

దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ “ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కి , 2 పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా లో ప్రేమ ఉంది. సునిశిత హాస్యం ఉంది. సెంటిమెంట్ ఉంది. తండ్రీకూతుళ్ల అనుబంధం ఉంది. తప్పటడుగులు వేస్తే యువతరం ఏం కోల్పోతుందో అనే హెచ్చరిక ఉంది. మొత్తంగా అటు పెద్దలకు – ఇటు యువత కు మంచి సందేశం ఉంది. మన పక్కింట్లోనో, మన చుట్టూరా కనిపించే సహజమైన పాత్రలే ఈ సినిమాలో కనిపిస్తాయి. నిజంగా కెమెరా పెట్టి లైవ్ చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఇలాంటి కాన్సెప్టులు ఎప్పుడూ ఎవర్ గ్రీన్. నాకు అప్పట్లో ‘ ప్రేయసి రావే ‘ ఎలా కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిందో, ఇప్పుడు ఈ ‘పిఠాపురంలో … అలా మొదలైంది’ సినిమా నా కెరీర్ ని టర్న్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఇందులో ప్రముఖ పాత్ర లో నటించారు. హాస్య బ్రహ్మ డా. బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ” అని తెలిపారు.

డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K A పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన తారాగణం. 

ఈ చిత్రానికి కథ: ఆకుల సురేష్ పటేల్, స్టోరీ డెవలప్మెంట్ & డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: B. సత్యనారాయణ, మ్యూజిక్ : G.C క్రిష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అంజి సండ్రాల, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య), స్క్రీన్ ప్లే- డైరెక్షన్: మహేష్ చంద్ర .

Nandamuri Balakrishna Appreciates ‘M4M’ Song; Thriller Directed by Mohan Vadlapatla Starring Jo Sharma

జో శర్మ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (Motive for Murder)’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలకు సిద్ధ‌మైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “Who is the Killer” పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట తాజాగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఆకట్టుకునే ట్యూన్‌తో, ఎనర్జిటిక్ మ్యూజిక్ ఆండ్ విజువల్స్ ఇప్పటికే మంచి స్పందన పొందుతోంది.

ఈ చిత్రంలో జో శర్మ – సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించి, నిర్మించారు. ఆకట్టుకునే టైటిల్, ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో, M4M ఆసక్తిని పెంచుతోంది.

ఈ మూవీ హీరోయిన్, అమెరికన్ నటి జో శర్మ, ప్ర‌ముఖ న‌టుడు బాలకృష్ణని కలిసి, M4M చిత్రంలోని పాటను ఆయనకు చూపించారు. విజువల్స్, ప్రెజెంటేషన్‌ను చూసి బాలకృష్ణ చిత్ర‌యూనిట్‌ని అభినందించారు. అంతేకాకుండా, “ఎవడు వాడు” అనే క్యాచీ లైన్‌ను ఆయన స్వయంగా హమ్ చేశారు.

ఈ సంద‌ర్బంగా జో శర్మ.. బాల‌కృష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. బాల‌కృష్ణ లాంటి ప్ర‌ముఖ న‌టుడిని క‌లిసి ఆశీర్వాదాలు పొంద‌డం సంతోషంగా ఉంద‌ని జో శర్మ తెలిపారు. ఆయ‌న ఆత్మీయంగా ఆహ్వానించి, చిత్ర‌యూనిట్ అంద‌రికి విషెస్ చెప్పార‌ని, టీమ్‌కి కొత్త‌ ఉత్సాహ‌న్నిచ్చింద‌ని ఆమె చెప్పారు.

మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, McWin Group USA సహకారంతో రూపొందిన ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో 5 భాష‌ల్లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

బ్యానర్‌: మోహన్ మీడియా క్రియేషన్స్
సహకారం: McWin Group USA
న‌టీన‌టులు: జో శర్మ, సంబీత్ ఆచార్య, త‌దిత‌రులు.
ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణం: మోహన్ వడ్లపట్ల
పీఆర్ఓ: ప‌ర్వ‌త‌నేని రాంబాబు, క‌డ‌లి రాంబాబు, అశోక్ ద‌య్యాల‌

Yuvasudha Arts Production No.3 starring Vishwak Sen begins with Pooja Ceremony & Blockbuster director Koratala Siva Clap

The popular production house Yuvasudha Arts, known for backing the sensational blockbuster Devara starring NTR, has now set the stage for its next ambitious venture. Producer Sudhakar Mikkilineni is joining forces with Vishwak Sen, popularly known as “Mass Ka Das,” for what promises to be an exciting new project. 

Tentatively titled Yuvasudha Arts Production No.3, the film is being presented by Vishwak Sen himself, adding further buzz to the project. Even before the film officially goes on floors, the team came together for a traditional and auspicious pooja ceremony to mark the beginning. The event was attended by several prominent personalities from the industry, reflecting the significance and anticipation surrounding the film.

Blockbuster filmmaker Koratala Siva delivered the first clap, symbolizing a strong start, while Shyam Prasad Reddy carried out the script handover and switched on the camera, marking the formal launch. Such a grand kickoff has only amplified curiosity about what the team is set to deliver with this new venture.

The film will be directed by Rajath, who is set to helm this new-age romantic comedy. The technical team includes cinematographer Aravind Vishwanathan, while music will be composed by Thejas Krishna. Adding to the film’s appeal, the blockbuster writing duo Bhanu Bhogavarapu and Nandu Savirigana are crafting the dialogues. More details will be announced soon.

Karthik Jayanti, Radhika Jayanti, Srisha first look as Rani from RaysuN Productions “Rayavalasa” released

RaysuN ప్రొడక్షన్స్ తమ తొలి చిత్రమైన “రాయవలస” ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. మనసుని తాకే గ్రామీణ కథతో వస్తున్న ఈ చిత్రం తెలుగు సినీ రంగంలో ఓ డేరింగ్ ప్రయత్నంగా నిలుస్తోంది. గోపీ కృష్ణ జె నిర్మించిన ఈ సినిమా, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆయన విజన్‌కు నిదర్శనం.

ఈ చిత్రానికి అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. అసలైన తెలుగు గ్రామీణ కథను చెప్పాలనే ధైర్యంతో ఆమె అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఈ సినిమాను తీర్చిదిద్దారు.

తన కుమారుడు కార్తిక్ జయంతిని హీరోగా పరిచయం చేస్తూ, “నవ యువ కథానాయకుడు”గా ఆయనను ఆవిష్కరించారు. “Love Tied by Fate” అనే ట్యాగ్‌లైన్ కథలోని భావోద్వేగాన్ని, విధిని చక్కగా ప్రతిబింబిస్తోంది. డెబ్యూ హీరో అయినప్పటికీ కార్తిక్ జయంతి పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

హీరోయిన్‌గా శ్రీష నులు నటిస్తుండగా రాణి పాత్రలో ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చీరలో “రాణి” పాత్రలో అందంగా కనిపించారు. బ్యాక్‌డ్రాప్‌లోని దేవాలయం, పల్లెటూరి వాతావరణం కథకు ఒక సహజమైన టోన్‌ను ఇస్తున్నాయి.

ఈ చిత్రానికి అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ నటులతో పాటు త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పూర్ణ చారి, కార్తిక్ జయంతి, తరుణ్ సైదులు లిరిక్స్ అందించగా, రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తిక్ జయంతి వంటి ప్రముఖ గాయకులు పాటలను ఆలపించారు.

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రాధిక జయంతి; కథ, సంభాషణలు రాఖీ ఎ; సంగీతం డెబ్యూ కంపోజర్ అర్జున్ బాలా; సినిమాటోగ్రఫీ విఆర్‌కే నాయుడు (కిట్టు); ఎడిటింగ్ గ్యారీ బిహెచ్; ఫైట్స్ మల్లేశ్ షాలియోన్; కొరియోగ్రఫీ రాజ్ పైడే నిర్వహించారు.

భావోద్వేగం, యాక్షన్, సంగీతం కలగలిపిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా “రాయవలస” ప్రేక్షకులను అలరించనుంది.

నటీనటులు: కార్తిక్ జయంతి, శ్రీష నులు, అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాధిక జయంతి
కథ, సంభాషణలు: రాఖీ ఎ;
సంగీతం: అర్జున్ బాలా;
సినిమాటోగ్రఫీ: విఆర్‌కే నాయుడు (కిట్టు);
ఎడిటింగ్: గ్యారీ బిహెచ్
ఫైట్స్: మల్లేశ్ షాలియోన్
కొరియోగ్రఫీ: రాజ్ పైడే
పీఆర్వో: వంశీ శేఖర్

Title and first look poster of the film ‘Chiranjeevi’ unveiled by Mega Brother Nagababu

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా “చిరంజీవి”. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు.సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు.”చిరంజీవి” సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా లాంఛ్ చేశారు.ఈ సందర్భంగా నాగబాబుకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.

డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో ఉండే చిరు అనే యువకుడు తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను, సవాళ్లను, అరుదైన పరిస్థితిని ఎలా తట్టుకుని నిలబడ్డాడు , తను అనుకొన్నవి ఎలా సాధించాడు అనేది ఈ చిత్రంలో ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా, ఇన్స్ పైరింగ్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సాయివెంకట్. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో సమ్మర్ రిలీజ్ కు రాబోతోందీ చిత్రం. త్వరలోనే “చిరంజీవి” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు – కికు యనమల, కశిష్ ఖాన్, తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, తదితరులు

టెక్నికల్ టీమ్

డీవోపీ – రామకృష్ణ
మ్యూజిక్ – శేఖర్ చంద్ర
ఎడిటింగ్ – ఛోటా కె ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – యష్ మిట్టల్
కొరియోగ్రఫీ – గోవింద్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా (సురేష – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్- దీప్తి నడిమింటి
స్క్రిప్ట్, డైరెక్షన్- శుభ సాయి వెంకట్

Director V. Muniraju interview about suspense drama Movie ‘Thimmarajupalli TV’

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శకుడు వి.మునిరాజు.

– దర్శకుడు కావాలనేది నా కల. ఇండస్ట్రీకి వచ్చాక జాబ్ కోసం ఆన్ లైన్ ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టాను. కొంతకాలం ఆన్ లైన్ ఎడిటింగ్ చేస్తుంటే డైరెక్షన్ అనే కలకు దూరంగా ఉండిపోతున్నా అనిపించింది. దాంతో ఒక స్క్రిప్ట్ అనుకుని దాన్ని ఊరికి వెళ్లి అక్కడి వాళ్లతో డెమో షూట్ చేశాను. తిరిగొచ్చి ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ చేయించాను. ఆ తర్వాత మీటర్ మూవీ షూటింగ్ టైమ్ లో కిరణ్ అబ్బవరం గారు పరిచయం అయ్యారు. ఆయన ఏం చేస్తున్నావు అని అడిగారు. అలా మాటల్లో నా డెమో మూవీ గురించి చెప్పాను. ఆయనకు నచ్చి కథ ఏంటని అడిగారు. స్క్రిప్ట్ చెప్పాక పూర్తిస్థాయిలో డెవలప్ చేయి మనం మూవీ చేద్దామని అన్నారు. అలా “తిమ్మరాజుపల్లి టీవీ” మూవీకి తొలి అడుగులు పడ్డాయి

– “తిమ్మరాజుపల్లి టీవీ” కథకు స్పూర్తి నేను చిన్నప్పుడు చూసిన ఘటనలే. నేను చూసిన మనుషుల క్యారెక్టర్ లు, వారి భావోద్వేగాలు, నా చిన్నప్పటి అనుభవాలు ఇవన్నీ ఈ మూవీలో చిత్రీకరించాను. నేను తెరపై ఒక చెప్పాలనుకున్నప్పుడు అది నా ఊరి కథే ఎందుకు కాకూడదు అనిపించింది. మా ఊరికి మొదటిసారి టీవీ వచ్చినప్పుడు మాఊరికి దగ్గరలోని థియేటర్ కదిలి వచ్చిందా అనే భావన నాలో కలిగింది. ఇది ప్రతి ఊరి కథ. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీవీ నేపథ్యంగా నేను చూసిన ఘటనలు చూసే ఉంటారు. ఊరి మనుషులు, వారి మధ్య అహం వంటి అంశాలు చూపిస్తూనే చివరలో మంచి ఎమోషనల్ కంటెంట్ చెబుతున్నాం.

– ఈతరం జెన్ జీ కిడ్స్ కు కూడా మా సినిమా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈతరం పిల్లలకు అప్పటి మన కల్చర్,సంప్రదాయాలు తెలియవు, అప్పుడు మనమంతా ఎలా ఉండేవాళ్లమో తెలియదు. కాబట్టి మా సినిమాలోని వాతావరణం అంతా వాళ్లకు కొత్తగా ఉంటుంది. ఈతరం పిల్లలు చూడని ప్రపంచం, చూడని విషయాలు మా మూవీలో ఆకట్టుకుంటాయి.

– ఫ్యూర్ సస్పెన్స్ డ్రామా చిత్రమిది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నెక్ట్స్ ఏం జరుగుతుంది అని సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు. చివరకు మంచి ఎమోషనల్ ఫీల్ తో థియేటర్ నుంచి బయటకు వస్తారు.రాయలసీమ నేపథ్యంగా కథ సాగుతుంది. మా ఊరు తిమ్మరాజుపల్లి. అదే ఊరిలో రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. మీరు చూసే పాటలన్నీ మా ఊరు చుట్టుపక్కల రూపొందించినవే.

– రియలెస్టిక్ అప్రోచ్ తో ఈ సినిమాను తెరకెక్కించాను. కమర్షియల్ సినిమాల మేకింగ్ స్టైల్ వేరు. నేను సాధ్యమైనంత సహజంగా, అలాంటి వాతావారణంలో సినిమాను తెరకెక్కించాను. సైరత్, జునూన్ లాంటి మరాఠీ చిత్రాలు నాకు ఇష్టం. అలాగే సత్య చిత్రాన్ని కనీసం వందసార్లు చూసి ఉంటా. మేకింగ్ పరంగా మా మూవీ సర్ ప్రైజ్ చేస్తుంది. ఆరేడు నిమిషాల సింగిల్ టేక్ సీన్స్ చేశాం. కిరణ్ అబ్బవరం లాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకే కాదు మా టీమ్ అందరి అదృష్టం. ఇలాంటి చిన్న చిత్రానికి ఇంత మంచి రిలీజ్ ఇస్తున్నారు. నన్ను కిరణ్ గారు చాలా బిలీవ్ చేశారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకంతో మరింత బాధ్యతగా సినిమాను తెరకెక్కించాను. కంటెంట్ బాగున్న ఎన్నో చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. కొత్త వాళ్లం మేము చేసిన ఈ సినిమా న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ గా పేరు తెచ్చుకుంటుంది.

– మా మూవీలో నటించిన వారిలో ఏపీ తెలంగాణ నుంచి పలు జిల్లాల నుంచి వచ్చిన వారున్నారు.సురభి వంటి నాటకాల నుంచి వచ్చిన ఆర్టిస్టులున్నారు. ఈ సినిమా నాలాంటి ఎంతోమంది కొత్త వాళ్ల కల.మా మూవీ సక్సెస్ అయితే మరింతమంది కొత్త వాళ్లను నిర్మాతలు నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. అవకాశాలు పెరుగుతాయి. మా సన్నిహితులు, తెలిసిన వాళ్ల కోసం కొన్ని షోస్ వేసుకున్నాం. మూవీ చూసినవాళ్లందరికీ నేను చెప్పాలనుకున్న పాయింట్ కనెక్ట్ అయ్యింది.

– పర్ ఫార్మెన్ పరంగా ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు.హీరో హీరోయిన్స్ సహా అందరి నటన ఆకట్టుకుంటుంది. మీకు మూవీలో ప్రతి ఒక్కరూ కీలకమైన క్యారెక్టర్ లాగే అనిపిస్తారు. అట్మాస్ సహా టెక్నికల్ గా క్వాలిటీగా మూవీ చేశాం. ప్రతి పాట దేనికది భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాను. ప్రస్తుతం ఐదారు కథలు సిద్ధం చేసుకున్నాను. మన చుట్టూ ఉన్నస్టోరీస్ ను తెరకెక్కించాలనేది నా కోరిక.

RaaKaaSaa Movie Crossing ₹22.60 Cr Worldwide in 10 Days to Emerge as a Breakout Summer Sensation

విడుద‌లైన‌ 10 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.22.60 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ ‘రాకాస’ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఇంకా త‌న స‌త్తాను చాటుతోంది. రిలీజైన రోజు నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇంకా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ కొన‌సాగుతుండ‌టం విశేషం. ఇది చూస్తుంటే ఈ స‌క్సెస్ జోరు మరింత‌గా కొన‌సాగుతుంద‌నే సంకేతాల‌ను సూచిస్తోంది.

ఈ విజ‌యానికి ప్రధాన కారణం థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వ‌స్తోన్న స్పంద‌న‌. రాకాస‌ సినిమాను ప్రేక్ష‌కులు వారి కుటుంబంతో క‌లిసి వ‌చ్చి వీక్షించి స‌ర‌దాగా న‌వ్వుకుని ఆస్వాదిస్తున్నారు. ఈ రెస్పాన్స్ ప్రతి షోలో కనిపిస్తోంది. ఈ రెస్పాన్స్ కొన‌సాగుతుండ‌టంతో సినిమాకు ఓ స్థిర‌మైన ర‌న్ కొన‌మంచి స్పందన రావడం వల్ల ఈ సినిమాకు థియేట‌ర్స్‌లో స్థిరమైన రన్ కొనసాగుతోంది.

సాధార‌ణంగా ఓ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ రావ‌టం అనేది ఈరోజుల్లో అరుదుగా మారింది. అలాంటిది రాకాస సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ వ‌చ్చి ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వస్తున్నారు. ప్రేక్ష‌కులు వారి కుటుంబాల‌తో, మరోసారి ఇతరులతో కలిసి చూసేందుకు ఆస‌క్తిగా థియేట‌ర్స్‌కు వస్తున్నారు, ఇది సినిమాకు స‌హ‌జంగా పెరుగుతోన్న స్పంద‌న‌న‌ను తెలియ‌జేస్తోంది. రాకాస సినిమా అందరికీ సులభంగా అర్థమయ్యేలా వినోదాత్మక చిత్రంగా రూపొందింది. దీంతో అన్ని వయసుల వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా అన్నీ వ‌ర్గాల వారికి న‌చ్చ‌టంతో రాకాస మూవీ బ్యాలెన్స్‌డ్‌గా మంచి ఆద‌ర‌ణ‌తో చ‌క్క‌టి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తోంది. ఇందులో చిన్న పిల్ల‌ల‌కు కావ‌ల్సిన స‌ర‌దా, ఊహాశక్తిని రేకెత్తించే సన్నివేశాలు ఉండ‌టంతో వారు ఆక‌ర్షితుల‌వుతున్నారు. అలాగే మిగిలిన ఆడియెన్స్‌కు కావాల్సిన కామెడీ, పాత్ర‌ల ఆధారంగా న‌డిచే ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాలు అన్నీ క‌ల‌గ‌లిసి ఉండ‌టంతో ప్రేక్ష‌కుల‌కు ఇదొక మంచి ఎంపిక‌గా మారుతోంది.

చ‌క్క‌టి అర్థ‌వంత‌మైన కామెడీతో ఈ సినిమా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. సంగీత్‌, గెట‌ప్ శీను ట్రాక్ ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యింది. దీంతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్‌, న‌ట‌న‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతో ప్రేక్ష‌కులు ఈ స‌మ్మ‌ర్‌లో కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూడ‌టానికి ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు.

రాకాస సినిమా స్థిరమైన రన్‌ను కొనసాగిస్తోన్న త‌రుణంలో మేక‌ర్స్ ఏప్రిల్ 10 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 ఫ్లాట్ టికెట్ ధరను ప్రవేశపెట్టారు. దీంతో సినిమా ప్రస్తుతం పొందుతున్న ప్రేక్షకుల ఆద‌ర‌ణ మ‌రింత పెరిగింది. టికెట్ ధ‌ర ప్రేక్ష‌కుల అందుబాటులోకి రావ‌టం ఎంతో కీల‌క‌మ‌ని చెప్పొచ్చు. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికీ ఎక్కువ వసూళ్లను సాధిస్తున్నాయి. ఇప్పటికే సినిమాతో కనెక్ట్ అయిన కుటుంబాలు మళ్లీ మళ్లీ రావడానికి కూడా ఇది ప్రోత్సాహకంగా ఉంది.

జీస్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల సినిమాను రూపొందించిన తీరు, డైరెక్ట‌క‌ర్ మాన‌స శ‌ర్మ టేకింగ్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ పని తీరుని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను సినిమా మెప్పిస్తూ ముందుకు సాగుతుండ‌టంతో ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌కు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చే సినిమాగా అభినందిస్తున్నారు.

అంద‌రినీ మెప్ప్పిస్తూ రాకాస సినిమా రన్ కొనసాగుతుంది. దీంతో థియేట‌ర్స్‌కు ఆడియెన్స్ రావ‌టానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి తోడు డిఫ‌రెట్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ, మౌత్ టాక్ కూడా తోడు కావ‌టం మంచి ప‌రిణామం. ప్రస్తుతం ఉన్న ఈ వేగం అలాగే కొనసాగుతూ, టికెట్ ధరలు కూడా అందుబాటులోకి రావడంతో, ఈ సినిమా వేసవి కాలం మొత్తం మంచి రన్ కొనసాగించే స్థితిలో ఉంది.

‘Anni O Gurutulu’ movie got awards and rewards a film by Director Venkat Challagundla

టిఒఎఫ్ టవర్ వన్ ఫిలిమ్స్ బ్యానర్ పై సంతోష్ రావ్ ప్రెజెంట్స్ లో వంకాయల దివాకర్, కసం తేజ , మాస్టర్ శ్రీ నిక్షిత్, బేబీ మిక్కీ, నాగరాణి రెడ్డి ప్రధాన పాత్రలుగా వెంకట్ చల్లగుండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్ని ఓ గురుతులు ’

పుట్టుకతోనే మన జీవితంతో ఎన్నో బంధాలు పెనవేసుకుపోతాయి. ప్రతి బంధం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఒక నిజమైన తోడుగా ఉంటానని నమ్మకాన్ని కలిగిస్తుంది కానీ నీ అసలైన తోడు ఎవరు అనేది తెలిసే సరికి జీవితం మొత్తం ఖర్చు అయ్యుంటుంది. ప్రతి మనిషికి కడదాకా ఉండే అసలైన తోడు ఎవరో చెప్పే ప్రయత్నమే ఈ ‘అన్నీ ఓ గురుతులు‘ సినిమా.

ఈ సినిమా పలు ఫిలిం ఫెస్టివల్స్ లో పది అవార్డ్స్ ను సొంతం చేసుకుంది, మంచి కథ బలం ఉన్న ఈ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షస్తుంది, చిత్ర యూనిట్ కు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.

పారాడైస్ ఫిలిం ఫెస్టివల్, అమెరికా – జనవరి 2026 కు అధికారికంగా ఎంపిక అయ్యింది, వరల్డ్ ఇండై ఫిలిం అవార్డ్స్, యుకె – జనవరి – బెస్ట్ ఫిలిం విన్నర్, వరల్డ్ ఫిలిం ఫెస్టివల్, కెన్స్ – విన్నర్ బెస్ట్ ఇండియన్ ఫిలిం, పూంబుకర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఫిలిం గా అవార్డ్స్ గెలుచుకుంది, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా అవార్డు లభించింది, స్వీడెన్ ఫిలిం అవార్డ్స్ లో ఫైనలిస్ట్ గా చేరుకుంది, టి. హెచ్. ఈ ఫిలిం ఫెస్టివల్, అమెరికా లో అధికారికంగా సెలెక్ట్ అయ్యింది, ఫ్లైట్ డెస్క్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అధికారకంగా సెలెక్ట్ అయ్యింది… అన్ని ప్రతిష్టాత్మక IMDB సర్టిఫైడ్ అర్హత పొందినవి

ఈ చిత్రానికి దర్శకత్వం వెంకట్ చల్లగుండ్ల, కెమెరామెన్ చక్రి కనపర్తి, ఎడిటర్ దుర్గ నరసింహ, సంగీతం అబు, ఎస్ఎఫ్ఎక్స్ సాయి మణిధర్ రెడ్డి