Home Blog Page 72

“Police Vari Hechcharika” Trailer Launched held Grandly in Presence of Film Celebrities

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన “పోలీస్ వారి హెచ్చరిక” ట్రైలర్ ను ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు.

ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... “అందరికీ నమస్కారం. మనమంతా ఇక్కడికి వచ్చామంటే కారణం బాబ్జి మీద ఉన్న గౌరవం. చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఆర్మీ నుండి వచ్చిన నిర్మాత జనార్ధన్ గారితో కలిసి క్రమశిక్షణతో ఈ సినిమాను చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటి ఇంద్రజ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. నేను ఈ ఈవెంట్ కు బాబ్జి గారి కోసం ఈ కార్యక్రమానికి వచ్చాను. నా ప్రతి పుట్టిన రోజుకు నన్ను విష్ చేసే సుధాకర్ గారికి ధన్యవాదాలు. జనార్ధన్ గారికి ఈ సినిమాతో మంచి విజయం రావాలి అని కోరుకుంటున్నాను. సినిమా విజయం సాధించేందుకు మీడియా వారు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ... “ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. సాధారణంగా చిన్ననాటి నుండి మనల్ని పెద్దవారు ఏదో ఒక విషయంలో హెచ్చరిస్తూ ఉంటారు. దానిని మనం మంచికి తీసుకుని ముందుకు వెళ్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పోలీసు వారు ఏదైనా హెచ్చరించినప్పుడు దానిని పాటిస్తే అది మనకే మంచిది. ఈ సినిమాలో అన్ని కోణాలు ఉన్నాయి. ఈ సినిమాకు అందరి ఆశీస్సులు ఉండాలి. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ… “ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఒక ఆదరణ లభిస్తుందని కోరుకుంటున్నాను. సినిమాలో చాలా మంచి ఆర్టిస్టులు నటించారు. మంచి కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బాబ్జి. జులై 18వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత బెల్లి జనార్ధన్ మాట్లాడుతూ... “పోలీస్ వారి హెచ్చరిక చిత్ర టైలర్ లంచ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ నా నమస్కారం. నేను జీవితంలో ముగ్గురు నమ్ముకున్నాను. తల్లిదండ్రులను, భారతదేశాన్ని అలాగే ఇప్పుడు కళామతల్లిని. నేడు నన్ను కళామతల్లి నిలబెడుతుంది అని నమ్ముతున్నాను. జూలై 18వ తేదీన సినిమాలు అందరూ చూసి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ... “ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం. సినిమాల కోసం పనిచేసేవారు తాము చేసిన సినిమా విడుదలైన ప్రతిసారి పుడుతూనే ఉంటారు. సినిమా కోసమే పుట్టామని భావిస్తాము. జూలై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.

తారాగణం :
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ వినోద్, జబర్దస్త్ పవన్, జబర్దస్త్ శాంతి స్వరూప్, హిమజ, శంకరాభరణం తులసి, జయ వాహిని, మేఘనా ఖుషి తదితరులు.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు : బాబ్జీ
నిర్మాత : బెల్లి జనార్థన్
బ్యానర్ : తూలికా తనిష్క్ క్రియేషన్స్
సంగీతం : గజ్వేల్ వేణు
కెమెరా : కిషన్ సాగర్, నళినీ కాంత్
ఎడిటర్ : శివ శర్వాణి
సహ నిర్మాత : NP సుబ్బా రాయుడు
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం

Pedro Pascal reveals that he had to tone down his 1960s ‘mid-Atlantic’ accent for Fantastic Four: First Steps

Pedro Pascal is all set to make his Marvel debut with The Fantastic Four: First Steps as Mister Fantastic/Reed Richards, the leader of the team. The movie, which is set to kick off the sixth phase of the MCU, will hit the Indian theatres on July 25 in English, Hindi, Tamil, and Telugu.

During the global promotions for the film, Pedro Pascal shared an interesting anecdote. Speaking with Vanity Fair, Pedro said that he gave his 100% while committing to the 1960s accent but the crew kept on pulling him back. , “The theatre of that is something to step into. I don’t know if I did it well, they had to keep on pulling me back from a very mid-Atlantic, early 60s talk. They had a dialect coach who was going to help us with that kind of dialect.”

Pedro further added, “I took to it so well, they had to pull me aside…they were like, ‘Uh, talk more like yourself.’ I had a hard time doing that because I was so into the era, which for me, was something to step into, as it’s different from what we’ve seen before. What they’ve created is something we haven’t seen.”

Directed by Matt Shakman, the film also features Vanessa Kirby as Sue Storm, Joseph Quinn as Johnny Storm, Ebon Moss-Bachrach as Ben Grimm, Ralph Ineson as Galactus, and Julia Garner as Silver Surfer.

‘Kalamandir’s 17th Anniversary celebrations held grandly.

కళామందిర్ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవాలను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హైదరాబాదులో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుక రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు, వ్యాపార నిపుణులు, సామాజిక సేవకర్తలు, కళామందిర్ ఫౌండేషన్ నిర్వాకులతో కన్నుల పండుగగా జరిగింది.

ఈ వేడుకలో సినీ నటుడు కమెడియన్ అలీ మాట్లాడుతూ.. మనం ఎంతకాలం బతకామని కాదు, ఎంత సేవ చేసాము అనేదే ముఖ్యం అలాగే కళామందిర్ బ్రదర్స్ కూడా ఎన్ని బ్రాంచీలు పెట్టామని కాదు, ఎంతమందికి సేవ చేసాము అనేదే వారికి ముఖ్యమన్నారు. ప్రతి సంవత్సరం కళామందిర్ వార్షికోత్సవ వేడుకను ఎంతో బ్రహ్మాండంగా చేస్తూ.. ఎంతోమంది దివ్యాంగులకు సేవ చేస్తారు. ఆర్థిక సాయం చేస్తారు అందుకేనేమో కళామందిర్ ఇలా వెలిగిపోతుంది అని అన్నారు.

ప్రముఖ రచయిత బివిఎస్ రవి మాట్లాడుతూ.. ముందుగా కళామందిర్ ఫౌండర్ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపుతూ . దినదిన ప్రవర్తమానంగా స్టాక్ మార్కెట్లో కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు అని అన్నారు. ఇక కళామందిర్ ఇలా దేదీప్యమానంగా వెలగడానికి మహిళలే కారణమని.. అందులో భాగంగా ప్రసాద్ గారి వెన్నంటి ఉండే తమ కుటుంబంలోని ఆరు మంది మహిళలతో పాటు కళామందిర్ కుటుంబంలో ఉన్న మహిళలు కూడా కారణమని అన్నారు.

సినీ నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ కళామందిర్ వేడుక చాలా బ్రహ్మాండంగా, కన్నుల పండుగగా ఉందని అన్నారు. అలాగే ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ్ గారు వేడుక గురించి చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది కచ్చితంగా ఈ వేడుకలో భాగస్వామ్యం కావాలని అనుకున్నట్లు తెలిపారు. కళామందిర్ బిజినెస్ పరంగా ఎదగడమే కాదు ఎంతోమందికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక బ్రాంచ్ తో మొదలైన కళామందిర్ ప్రయాణం నేడు దేశవ్యాప్తంగా 60 బ్రాంచ్ లకు చేరడం అంటే అది కళ్యాణ్, ప్రసాద్ గార్ల కృషి పట్టుదల అన్నారు.

డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ ఇలాంటి బర్త్ డేలు ప్రసాద్ గారు వంద సంవత్సరాలు జరుపుకోవాలని, ఖచ్చితంగా జరుపుకుంటారు అన్నారు. ప్రసాద్ గారు కావాలంటే ఏ దుబాయిలోనో కోట్లు ఖర్చుపెట్టి జన్మదిన వేడుకలు చేసుకోవచ్చు కానీ, గత 17 సంవత్సరాలుగా కళామందిర్ కుటుంబ సభ్యులతో.. ఎంతోమంది దివ్యాంగులకు సేవలందిస్తూనే తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. అది ఆయన గొప్పతనం అన్నారు.
కచ్చితంగా ప్రసాద్ గారు చేసే సేవా కార్యక్రమాలు అన్ని ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు.

సినీ నటుడు శ్రీ విష్ణు మాట్లాడుతూ చాలామంది డబ్బు సంపాదిస్తారు, చదువుకుంటారు గొప్ప గొప్ప ప్రదేశాలకు వెళ్తారు.. కానీ ఇలా సేవ చేయాలని చాలా తక్కువ మందికి అనిపిస్తుంది. అందుకు ప్రసాద్ గారు హృదయం చాలా గొప్పది అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నారు.

Vijay Deverakonda’s ‘KINGDOM’ grand Release  on July 31st – Team Unveils New Action-Packed Promo! 

The much-anticipated action drama ‘KINGDOM’ starring Vijay Deverakonda, Satyadev, Bhagyasree Borse and Written & Directed by Gowtam Tinnanuri have officially announced that the film will release worldwide on July 31st, 2025. Alongside the release date, the team has also dropped a high-octane promo that has left fans thrilled and wanting more.

Bringing together a potent blend of action, heroism and high-stakes drama. The newly released promo teases intense action sequences, dramatic confrontations and visually arresting battle visuals… all of which promise a cinematic spectacle like never before.

The announcement of the new release date comes as a huge relief and excitement for fans who have been eagerly waiting to witness this epic unfold on the big screen. The team has reportedly used the extra time to further enhance the scale and finesse of the film.

Speaking about the new date, the makers shared, KINGDOM is not just a film…it’s a vision and a world we’ve passionately built. We want every frame to be unforgettable. July 31st will mark the beginning of a cinematic storm. The promo has already started trending across social media, with fans praising its larger-than-life scale, thumping score, and electrifying glimpses of the lead characters.

The film is produced by S Naga Vamsi of Sithara Entertainments and Sai Soujanya of Fortune Four Cinemas & Presented by Srikara Studios. This grand production boasts a stellar technical team Music by the sensational Anirudh Ravichander, Editing by National Award winner Navin Nooli and Cinematography by the acclaimed duo Jomon T John and Girish Gangadharan. With such an exceptional crew, Kingdom promises to be a cinematic spectacle like no other.

Mr. Soldier (From Military Madhavaram) grand Releasing on August 2nd Week

Taking inspiration from the village of Military Madhavaram, located around 13 kilometers from Tadepalligudem Mandal in East Godavari district, Andhra Pradesh, Mr. Soldier (From Military Madhavaram) has been successfully completed under the Sri Dharani Arts banner, produced by VRM Patnaik and USN Patnaik.

We extend our heartfelt thanks to the Ex-Servicemen’s Association of Military Madhavaram and the village Sarpanch and residents for their valuable support throughout the making of this film. On behalf of Sri Dharani Arts, we convey our warm greetings and gratitude.

Having completed its censor certification, Mr. Soldier (From Military Madhavaram) is now ready for a grand release in both Andhra Pradesh and Telangana during the second week of August. We are immensely proud of this milestone. We are happy to present the essence of this film’s story to our audience with pride and anticipation.

Military Madhavaram, located in the capital of India, Delhi, is a village with a rich and honorable history. From this village alone, nearly 2,000 soldiers participated in the First and Second World Wars, rendering invaluable service to the nation. Several of them laid down their lives in the line of duty. Post-Independence, the village has continued its legacy of service, with around 5,000 individuals currently serving in the Indian Army and various defense sectors.

In 1970, Major Raju, a righteous and courageous officer from this village, valiantly fought off many enemies and received numerous gallantry awards. However, he faced false allegations, endured humiliation, and eventually ended his life along with his family as a mark of protest and sacrifice, in front of Mother India herself. Even today, Major Raju remains a symbol of inspiration for the youth of Military Madhavaram. The villagers firmly believe that if war breaks out, every home from their village will send brave youth to protect the nation.

Based on such a true and emotionally powerful story, Mr. Soldier (From Military Madhavaram) brings to life the spirit of patriotism, sacrifice, and unwavering commitment to the nation. It is with great pride that Sri Dharani Arts presents this film to the audience. We hope and trust that viewers will watch, support, and bless our entire team wholeheartedly.

Cast: Prudhvi Raju, Golisoda Madhu, Srinivas Dampagala, Gopi Nath, Omkar, Shivam Kiran, Ju, Rajanala Eeshwar Sri, Madhu Priya, Swapna Sri, Adhya, Madhushree, Kanaka Durgamma others

Credits:
Music: Markandeya. P,
DOP: Sriram,
Art Direction: Vijayakrishna,
Publicity Design: Rambabu Poster Ads,
PRO: Rambabu Media House
Screenplay & Direction: Balaji Mutyala
Producers: VRM Patnaik, USN Patnaik

Ram Gopal Varma’s film Saaree to stream on Aha from July 11th

The psychological thriller Saaree, produced by renowned filmmaker Ram Gopal Varma, is set to premiere on Aha OTT platform from July 11th. Directed by Giri Krishna Kamal, the film stars Satya Yadhu and Aradhya Devi in the lead roles. The film is produced by Ravishankar Varma under the banner of RGV, RV Productions LLP.

Saaree was released theatrically on April 4th as a Pan-India film in Telugu, Hindi, Tamil, and Malayalam languages and garnered decent attention from the audience. Now, with its digital release on Aha, the film is expected to reach a wider audience.

Inspired by real-life incidents, Saaree presents an intense psychological thriller experience. The film also features Sahil Sambhav, Appaji Ambarish, Kalpalatha, and others in important roles.

Actress Nabha Natesh graces the cover of Elle India July edition

Leading magazine Elle India has featured the beautiful and talented South Indian actress Nabha Natesh on the cover of its July edition. The cover story highlights how Nabha has carved a special place for herself in South Indian cinema with her impressive performances and captivating screen presence. Being featured on Elle India’s cover is yet another prestigious recognition for the actress.

Interestingly, Nabha Natesh recently won the Outlook Style Icon of the Year award, further adding to her list of achievements.

On the work front, Nabha is currently busy with back-to-back Pan-India projects in Telugu. She is playing the female lead opposite Nikhil in Swayambhu, which is currently under regular shoot. She is also part of another Pan-India film titled Nagabandham. With these two projects, Nabha is once again grabbing everyone’s attention. A few more exciting projects are also in her lineup.

Telugu Film Chamber Elections should be held as per schedule

ఈ జూలైతో తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎన్నుకున్న ప్రస్తుత కమిటీ గడువు ముగుస్తుంది. నిబంధనల ప్రకారం వెంటనే ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి. కానీ ఈ అసోసియేషన్ లోని కొందరు వ్యక్తులు స్వార్థంతో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ బై లా ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలంటూ ఈ రోజు నిర్మాతలు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్, బసిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు ఫిలింఛాంబర్ లోని నాలుగు సెక్టార్స్ నుంచి దాదాపు 60 మంది నిర్మాతలు మెమొరాండం సమర్పించారు.

తెలుగు ఫిలింఛాంబర్ లో ఇటీవల జరిగిన ఈసీ మీటింగ్ లో ఎన్నికల వాయిదా అంశాన్ని ప్రతిపాదించారని, ఈసీ మీటింగ్ కు రాని ఒక సభ్యుడు ప్రతిపాదించిన దానికి మిగతా వారు ఎలా ఒప్పుకుంటారని ఈ రోజు మెమొరాండం సమర్పించిన నిర్మాతలు నిలదీశారు. అసోసియేషన్ లోని సి కల్యాణ్, అశోక్ కుమార్, మోహన్ గౌడ్, రాందాస్ వంటి పెద్దలు ఈ ప్రతిపాదన వ్యతిరేకించి ఎన్నికలు జరపాలని కోరారని నిర్మాతలు వెల్లడించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఎన్నికల వాయిదా వేస్తారని, అందుకు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి దాదాపు నెల రోజుల ముందే తెలియజేయాలని వారు అన్నారు. ఎన్నికల వాయిదా ప్రతిపాదనకు నొచ్చుకుని ఒకరిద్దరు నిర్మాతలు రాజీనామా చేశారని, వారికి బాసటగా ఉంటామన్నారు. చిత్రపురి కాలనీలో అవినీతి జరిగింది అనేది అందరికీ తెలిసిందేనని, కొత్తగా నిర్మించే ఫ్లాట్స్ ను తెలుగు ఫిలింఛాంబర్ కు చెందిన పేద సినీ కార్మికులకు కేటాయించాలని నిర్మాతలు కోరారు.

మొమరాండం సమర్పణ అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ – ఇటీవల తెలుగు ఫిలింఛాంబర్ లో ఈసీ మీటింగ్ నిర్వహించారు. 48 మందికి ఓటు హక్కు ఉండగా 38 మంది హాజరయ్యారు. ఇప్పుడున్న కమిటీ సభ్యులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సన్నిహితంగా ఉన్నారని, అందుకే ఈ బాడీనే కొనసాగించాలని ఒక ఈసీ మెంబర్ లేఖ రాశాడు. ఆ లేఖను పట్టుకుని 34 మంది సభ్యులు అంగీకారం తెలిపారు. ఇది మీడియా ద్వారా ప్రచారం చేయించి ఈసారి ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు ఫిలింఛాంబర్ లో కొందరు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. వారికి మిగతా సభ్యులు సపోర్ట్ చేయొద్దని కోరుతున్నాం. నిబంధనలు పాటించడం లేదు. ఒకరిద్దరు సభ్యులు మాత్రం తమ ఎన్నిక గడువు ముగిసినందున పదవులకు రాజీనామా చేస్తూ లెటర్స్ రాస్తున్నారు. వారిని అభినందిస్తూ, మిగతా వారు కూడా అలాగే గౌరవంగా ఎన్నికల కోసం ముందుకు రావాలి. గతంలో కరోనా టైమ్ లో మాత్రమే ఎన్నికలు వాయిదా వేశాం. తెలుగు ఫిలింఛాంబర్ నిబంధనల్లోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎన్నికైనా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తెలుగు ఫిలింఛాంబర్ నుంచి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రంజెటేషన్స్ ఇస్తాం అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాతలు గురురాజ్, అల్లాభక్స్, శంకర్ రెడ్డి, బులెట్ రవి, వింజమూరి మధు తదితరులు పాల్గొన్నారు.

KJR’s Second Film Pooja Ceremony held grandly in Chennai

తెలుగు, తమిళ భాషల్లో ‘ గుర్తింపు’ పేరుతో స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాతో హీరోగా పరిచయమవుతోన్న కేజేఆర్ హీరోగా రెండో చిత్రం శ్రీకారం చుట్టుకుంది. సోమవారం ఉదయం చెన్నై లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి.

ఇటీవల ‘మార్క్ ఆంటోనీ’ చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియో సంస్థ ప్రొడక్షన్ నెం. 15 గా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని గంగా ఎంటర్ టైన్మెంట్స్ అందించనుంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండ్య రాజన్ శిష్యుడైన రెగన్ స్టానిస్లాస్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చిత్రీకరణ త్వరలోనే మొదలుకానుంది. ‘కోర్ట్’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీదేవి ఇందులో హీరోయిన్ గా నటించనున్నారు.

ఈ చిత్ర ప్రధాన తారాగణం.అర్జున్ అశోకన్, సింగం పులి, జయప్రకాష్, హరీష్ కుమార్, పృద్వి రాజ్, ఇందుమతి, అశ్విని. కె. కుమార్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, అజువర్గీస్, శ్రీకాంత్ మురళి తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం: పి. వి. శంకర్, నిర్మాత: ఎస్. వినోద్ కుమార్.

“Dheergayushman Bhava” Pre Release event held grandly, Movie Released on July 11

కార్తీక్‌రాజు, నోయల్ ,మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలో త్రిపుర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించిన “దీర్ఘాయుష్మాన్ భవ” చిత్రం విడుదలకు సిద్దమైంది. కాగా ఈ చిత్రం ట్రైలర్, ప్రోమోస్ , పాటలను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పలువురు అతిథులు ఆవిష్కరించారు.

ట్రైలర్ ను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రోమోస్ ను ప్రముఖ నటుడు ఓ.కల్యాణ్, పాటలను జబర్దస్త్ ఆర్.పి. ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అతిథి కె.ఎల్.దామోదర్ ప్రసాద్,మాట్లాడుతూ, కొత్త నిర్మాతలకు చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. అయితే కొత్త నిర్మాతలు చిత్ర పరిశ్రమ మీద కనీసం ఒక ఏడాది పాటు అవగాహన పెంచుకుని వస్తే బావుంటుంది. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్ తరపున మేము ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం. పెద్ద, చిన్న సినిమాల సమస్యలు, సాధ్యాసాధ్యాల గురించి ఛాంబర్ లో చర్చించబోతున్నాం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, మంచి అభిరుచితో, మంచి కాంబినేషన్ ఆర్టిస్టులతో ఈ సినిమా తీసినట్లు అనిపిస్తోంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆస్తిస్తున్నాను” అని అన్నారు.

చిత్రాన్ని నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ తరపున థియేటర్లలో విడుదల చేస్తున్న నట్టి కుమార్ మాట్లాడుతూ,,” చిన్న సినిమాల సమస్యలను తీర్చేందుకు ఇటు పరిశ్రమ, అటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. చిన్న సినిమాకు 2-30 గంటల షో ను కేటాయించాలి. మల్టీ ఫ్లెక్స్ లలో పేదవాడు సినిమా చూసే విధంగా ఆక్యుపెన్సీ లో 20 శాతం టిక్కెట్ రేట్లను 75 రూపాయలుగా నిర్ణయించాలి. ఫామిలీ అంతా కూర్చుని హాయిగా చూసుకునేలా ఈ చిత్రం ఉంటుంది” అని అన్నారు.

నటుడు జబర్దస్త్ ఆర్.పి. మాట్లాడుతూ, “నట్టి కుమార్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు అంటే తప్పకుండా ఈ చిత్రంలో మంచి కంటెంట్ ఉంటుందని భావిస్తున్నాను. చిన్న సినిమాల సమస్యలు తొలగితే, పరిశ్రమకు మరింత మేలు జరుగుతుందన్న నమ్మకం ఉంది” అని అన్నారు.

చిత్ర నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ మాట్లాడుతూ, “ఈ నెల 11న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అన్ని ఎమోషన్స్ ఉన్న చక్కటి చిత్రమిది” అని అన్నారు

చిత్ర దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ, “ఫ్యామిలీ ప్యాక్ చిత్రమిది. అందరినీ ఆహ్లదపరిచే కామెడీ, ఉంది. సోసియో ఫాంటసీ గా దీనిని మలిచాం” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ;కల్యాణ్, నటుడు జెమినీ సురేష్, గీత రచయిత రాంబాబు గోషాల తదితరులంతా ట్రైలర్ , ప్రోమోస్ అలాగే విభిన్నమైన పాటలు ఇందులో ఉన్నాయని, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో ఆమని, కాశీ విశ్వనాధ్, పృథ్వీరాజ్‌, సత్యం రాజేష్, గెటప్ శ్రీను , తాగుబోతు రమేష్. జె మిని సురేష్‌, నోయల్, గుండు సుదర్శన్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు మల్హర్ భట్ జోష్ ఛాయాగ్రహణం సమకూర్చగా, వినోద్ యాజమాన్య సంగీతాన్ని, కిషోర్ మద్దాలి ఎడిటింగ్ అందించారు. నిర్మాత: వంకాయలపాటి మురళీకృష్ణ, దర్శకత్వం:: ఎం.పూర్ణానంద్.