Home Blog Page 78

Hero Havish Family Entertainer “Nenu Ready” Movie Title & Glimpse Launch Event held grandly

నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ “నేను రెడీ”. ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “నేను రెడీ” మూవీ టైటిల్, గ్లింప్స్ ను ఈ రోజు హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ మాట్లాడుతూ – ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న మా హీరో హవీష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా డైరెక్టర్ త్రినాథరావు గారు, హవీష్ గారు సూపర్ హిట్ కొట్టేందుకు నేను రెడీ అంటున్నారు. ఇది స్టాటర్స్ మాత్రమే ఫుల్ మీల్స్ రెడీగా ఉంది. ఎంటైర్ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్. అన్నారు.

నటుడు బలగం సత్యనారాయణ మాట్లాడుతూ – “నేను రెడీ” మూవీలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ చిత్రంలో మంచి ఫన్ ఉంటుంది. సినిమా ఆద్యంతం మీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ త్రినాథరావు గారికి థ్యాంక్స్. అన్నారు.

నటి జయవాణి మాట్లాడుతూ – “నేను రెడీ” సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. చాలా రోజుల తర్వాత నాకు ఇలాంటి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ దక్కింది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావు గారికి కృతజ్ఞతలు. మా హీరో హవీష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్నారు.

నటుడు మాణిక్ రెడ్డి మాట్లాడుతూ – హవీష్ గారు ఈ సినిమా గురించి చాలా రోజుల కిందట నాతో చెప్పారు. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ చేస్తున్నాను త్రినాథరావు గారితో అన్నారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఎంటర్ టైన్ చేస్తుంది. నాకు కూడా మంచి రోల్ ఇచ్చారు. ఎంతోమంది దర్శకులు టాలీవుడ్ లో ఎంటర్ టైనింగ్ మూవీస్ చేస్తున్నారు. వారి లిస్టులో త్రినాథరావు గారు కూడా ఉంటారు. ఈ కథలో ఎక్కడ అవకాశం దొరికినా ఆయన నవ్వించే సీన్స్ చేయించారు. కథ బాగున్న ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నేను రెడీ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని నమ్మకంతో చెబుతున్నా. అన్నారు.

నటి రూప లక్ష్మి మాట్లాడుతూ – మంచి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఆర్టిస్టులకు ఎంతో సంతృప్తి దక్కుతుంది. అలాంటి అవకాశం నేను రెడీ చిత్రంతో నాకు దక్కింది. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు మేమంతా హ్యాపీగా ఫీలయ్యాం. ఇదే సంతోషం థియేటర్స్ లో ప్రేక్షకులకూ అందించబోతున్నాం. అన్నారు.

నటి మహతి మాట్లాడుతూ – నేను రెడీ మూవీలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ త్రినాథరావు గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ధమాకా చిత్రంలో అవకాశం వస్తుందని ఆశించాను. ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ ఉంటుంది. నేను ఎన్నో సీరియల్స్ లో నటించాను. ఇప్పుడు మూవీస్ ద్వారా ప్రేక్షకుల అభిమానం పొందాలని ప్రయత్నిస్తున్నా. అన్నారు.

నటి హరితేజ మాట్లాడుతూ – హవీష్ గారికి ఈ బర్త్ డే ఎంతో స్పెషల్ కావాలని కోరుకుంటున్నా. నేను రెడీ సినిమా నుంచి ఆయనతో పాటు మా అందరికీ సక్సెస్ దక్కాలి. ఈ సినిమాకు 3 రోజులు షూటింగ్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్. నేను రెడీ సినిమా చూస్తూ ప్రేక్షకులు బాగా ననవ్వుకుంటారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు గోపరాజు రమణ మాట్లాడుతూ – నేను రెడీ సినిమాలో నేనొక మంచి రోల్ చేశాను. ఈ చిత్రంలో ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. మధ్య తరగతి లైఫ్ లో ఉండే అన్ని ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని త్రినాథరావు గారు రూపొందించారు. నేను రెడీ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. అన్నారు.

ఎడిటర్ ప్రవీణ్ పూడి మాట్లాడుతూ – నేను రెడీ సినిమా హవీష్ గారికి పెద్ద సక్సెస్ ఇవ్వాలి. అలాగే మా డైరెక్టర్ త్రినాథరావు గారితో వర్క్ చేసిన ఎక్సిపీరియన్స్ హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఔట్ పుట్ చాలా బాగా వస్తోంది. నేను రెడీ మూవీ టీమ్ అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

స్టోరీ, డైలాగ్ రైటర్ విక్రాంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ – ఈ మధ్య ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం లేదు అంటున్నారు. కానీ నేను రెడీ సినిమాతో మేము రెడీగా ఉన్నాం. ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా థియేటర్స్ కు తప్పకుండా వస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనమంతా ఏది కావాలని కోరుకుంటామో ఆ ఎలిమెంట్ తో ఈ సినిమా చేశాం. డైరెక్టర్ త్రినాథరావు గారు చాలా కాలంగా నాకు పరిచయం. అయితే ఈ సినిమాతో ఆయనతో వర్క్ చేసే అవకాశం దొరకడం సంతోషంగా ఉంది. అన్నారు.

ప్రొడ్యూసర్ నిఖిల కోనేరు మాట్లాడుతూ – నేను రెడీ చిత్రంతో నిర్మాతగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. మా నాన్నగారు జీనియస్, రాక్షసుడు వంటి సూపర్ హిట్స్ మూవీస్ చేశారు. విద్యారంగంలో ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన లెగసీని ముందుకు తీసుకువెళ్లాలి అనేది నా డ్రీమ్. ఇప్పటికే నేను విద్యారంగంలో నాన్న లెగసీని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఆ ప్రయత్నం ప్రారంభించాను. నా మొదటి చిత్రాన్ని త్రినాథరావు గారి లాంటి పెద్ద దర్శకుడితో ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఎప్పుడు ఇంటికి వచ్చినా నవ్విస్తారు. ఆయన ఎక్సిపీరియన్స్ నుంచి ఎంతో నేర్చుకున్నాం. మిక్కీ, ప్రవీణ్, నిజార్ వంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ మా మూవీకి వర్క్ చేశారు. మా హీరోయిన్ కావ్య థాపర్ బాగా కోపరేట్ చేస్తూ నటించింది. నేను రెడీ సినిమాతో సూపర్ హిట్ మూవీ ఇవ్వాలని అనుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ కావాలి. అన్నారు.

హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ – నేను రెడీ మూవీ పక్కా ఎంటర్ టైనర్. హవీష్ లాంటి మంచి హీరోతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా డైరెక్టర్ త్రినాథరావు గారు ఈ మూవీని కంప్లీట్ ఫన్ తో రూపొందించారు. ఈ రోజు మేము చూపించింది చిన్న గ్లింప్స్ మాత్రమే. మూవీలో మీకు కావాల్సినంత వినోదం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది. నేను రెడీ నుంచి రిలీజ్ చేసే ప్రతి కంటెంట్ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

హీరో హవీష్ మాట్లాడుతూ – ఈ బర్త్ డే నాకు ఎంతో స్పెషల్. చాలా మంది నుంచి విశెస్ అందుకున్నా. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నువ్విలా, జీనియస్, సెవెన్ వంటి మూవీస్ తో నన్ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. వారి సపోర్ట్ ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. గ్యాప్ తీసుకోకుండా మూవీస్ చేయమని నా వెల్ విషర్స్ చెబుతుంటారు. నాకు ప్రతి రోజూ ఓ సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది. కానీ లో క్వాలిటీ మూవీస్ చేయకూడదు. మంచి స్టాండర్డ్స్ లో చేయాలనుకుంటా. మంచి అవకాశాలు రావాలని రోజూ కోరుకుంటా. త్రినాథరావు గారితో ఎప్పుడో మూవీ చేయాల్సింది. కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. నేను రెడీ మూవీతో ఆ అవకాశం రావడం సంతోషంగా ఉంది. నేను రెడీ బ్రిలియంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ, త్రినాథరావు గారి అన్ని మూవీస్ లో కల్లా ఈ సినిమాకే బెస్ట్ స్క్రిప్ట్ కుదిరిందని చెప్పగలను. ఈ చిత్రంలో ప్రతి యాక్టర్ బాగా పర్ ఫార్మ్ చేశారు. మిక్కీ గారి మ్యూజిక్, నిజార్ గారి విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. ప్రవీణ్ పూడి గారు కూడా నేను అడగగానే వచ్చి వర్క్ చేశారు. మా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీ అందరినీ థియేటర్స్ లో కలిసేందుకు వెయిట్ చేస్తున్నా. అన్నారు.

డైరెక్టర్ నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ – కుబేర సినిమా హిట్ కావడం ఇటీవల నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం. నెక్స్ట్ రాబోతున్న కన్నప్ప హిట్ కావాలి, ఆ తర్వాత వచ్చే పదీ పదిహేను సినిమాలు హిట్ కావాలి. థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడాలని కోరుకుంటున్నా. నేను రెడీ మూవీ గురించి చెప్పాలంటే…హవీష్ గారి ఫాదర్ నాకు బాగా పరిచయం. నేను వాళ్ల ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడిని. హవీష్ తో సినిమా చేయాలని అనుకుంటూ ఉన్నా. ఆయనకు కుదిరే మంచి కథ దొరికితే చేద్దామని అనుకున్నా. మజాకా కంప్లీట్ అయ్యాక రైటర్ విక్రాంత్ శ్రీనివాస్ ఈ కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. హవీష్ కు ఈ కథ బాగుంటుంది అనిపించి కథ చెప్పించాను. ఆయనకు వినగానే నచ్చి, ఈ సినిమా చేద్దామని అన్నారు. అలా నేను రెడీ టేకాఫ్ అయ్యింది. అప్పట్లో పెళ్లిసందడి మూవీలో ఇండస్ట్రీలోని కమెడియన్స్ అంతా నటించారని విన్నాం. నేను రెడీ మూవీలో కూడా ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులతో కళకళగా ఉంటుంది. మీరు ఈరోజు వేదిక మీద చూస్తున్నది ఒక ఫ్యామిలీగా నటించిన ఆర్టిస్టులనే. ఇలాంటివి మూడు ఫ్యామిలీలు ఉంటాయి. రోజూ షూటింగ్ లో చాలా క్యారవాన్స్ పెట్టాల్సివస్తోంది. షూటింగ్ మొత్తం ఒక పండగలా చేస్తున్నా. పది సీన్స్ చేస్తే 8 సీన్స్ బాగా నవ్వుకుంటుంన్నాం. 2 సీన్స్ సెంటిమెంట్ తో ఉద్వేగానికి గురవుతున్నాం. ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్, కుటుంబం మధ్యలో ఉండే సరదాలు, ఎమోషన్స్ ..ఇవే మూవీలో ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో చాలా మంచి ఆర్టిస్టులు నాకు దొరికారు. మిక్కీ గారు చాలా మంచి సాంగ్స్ ఇస్తున్నారు. 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సినిమా అంతా ఫ్యామిలీతో కలిసి చూసేలా హాయిగా ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ బొనాంజా మూవీ. ప్రేక్షకులంతా సకుటుంబంగా థియేటర్స్ కు వచ్చి 2.30 గంటలు నవ్వుకుని, చివరి 15 నిమిషాలు ఎమోషన్ ఫీల్ అయ్యి బయటకు వెళ్తారు. నిఖిల ఫస్ట్ మూవీకే ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకుంటారు. నేను రెడీ హవీష్ గారి కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది. త్వరలోనే ఈ చిత్రంతో థియేటర్స్ లో మీట్ అవుదాం. అన్నారు.

నటీనటులు – హవీష్, కావ్య థాపర్, శ్రీలక్ష్మి, గోపరాజు రమణ, హరి తేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్, తదితరులు

టెక్నికల్ టీమ్
నిర్మాణం- హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి
ఫైట్స్ – రామకృష్ణ
ఎడిటర్ – ప్రవీణ్ పూడి
డీవోపీ – నిజార్ షఫీ
సంగీతం – మిక్కీ జే మేయర్
స్టోరీ, డైలాగ్స్ – విక్రాంత్ శ్రీనివాస్
మార్కెటింగ్ : క్రేజీ షౌట్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – నిఖిల కోనేరు
రచన: దర్శకత్వం – నక్కిన త్రినాథరావు

“Thammudu” is the perfect Movie for my comeback : Beautiful Actress Laya

“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు నటి లయ. “తమ్ముడు” సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్ లో నటించిన తన ఎక్సిపీరియన్స్ తెలిపారు నటి లయ.

– నేను 2023 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాను. ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూస్ చూసి జూన్ లో “తమ్ముడు” మూవీ టీమ్ నుంచి కాల్ వచ్చింది. నేను తీసుకున్న కొన్ని ఫొటోస్ పంపిస్తే, వాటిలో ఈ క్యారెక్టర్ కు సెట్ అయ్యేలా కనిపించలేదు. దాంతో మళ్లీ ఫొటోషూట్ చేసి పంపమన్నారు. ఆ ఫొటోస్ చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటికి లైన్ గా “తమ్ముడు” కథ తెలుసు. నా రీ ఎంట్రీకి ఇది సరైన సినిమా అనిపించింది. క్యారెక్టర్ కోసం కొంచెం లావు కావాలని చెప్పారు. స్వీట్స్ తిని బరువు పెరిగాను. ఈ మూవీ కోసం కొన్ని నెలల పాటు ఇక్కడే ఉన్నాను.

– “తమ్ముడు” మూవీలో ఝాన్సీ కిరణ్మయి అనే క్యారెక్టర్ లో నటించాను. తనొక ఆఫీసర్. స్ట్రిక్ట్ గా ఉంటుంది. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆఫీసర్ గా నా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాను. హీరో నితిన్ కు సోదరి పాత్ర నాది. ఈ చిత్రం కోసం అడవిలో షూటింగ్ చేశాం. రోజూ యూనిట్ లో ఎవరో ఒకరికి గాయాలు అయ్యేవి. షూటింగ్ పిక్నిక్ లా చేశామని చెబుతుంటారు. కానీ మేము పిక్నిక్ లా చేయలేదు. కష్టపడాల్సి వచ్చింది. మూవీ బాగా వస్తుందనే సంతోషంలో అంతా యూనిటీగా పనిచేశాం. ఈ సినిమా షూటింగ్ కాదని ఎవరూ ఎక్కడికీ వెళ్లలేదు. చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశాం.

– నితిన్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తను స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడిలా మా అందరితో కలిసిపోయారు. పర్ ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ సినిమాలో నితిన్ చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తాడు. చాలా కష్టమైన సీన్స్ కూడా ఈజీగా చేశాడు. సీన్స్ కోసం చేసిన ప్రిపరేషన్ వల్లే అంత సులువుగా నటించగలిగారు. తమ్ముడు అనే టైటిల్ ఈ సినిమాకు యాప్ట్. మీరు సినిమా చూశాక చెబుతారు. పవన్ కల్యాణ్ గారి తమ్ముడు మూవీకి ఈ చిత్రానికి పోలిక లేదు.

– నేను గతంలో సినిమాల్లో నటించినప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ప్రమోషన్ విషయం తీసుకుంటే అప్పుడు ఆడియో ఫంక్షన్, థియేటర్ విజిటింగ్, 100 డేస్ ఫంక్షన్ ఉండేది. ఇప్పుడు చాలా ఈవెంట్స్ చేస్తున్నారు. తమ్ముడు మూవీకి చేసిన ఈవెంట్స్ కు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వస్తున్నారు. నేను హీరోయిన్ గా నటించినప్పుడు కూడా సింపుల్ గానే ఉన్నాను. ఒక స్టార్ హీరోయిన్ గా కాకుండా ప్రేమించులో మీనాగా, మిస్సమ్మలో రత్నమాలగానే ప్రేక్షకులు నన్ను చూశారు. అందుకే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నప్పుడు సెట్ లో ఆ తేడా తెలియడం లేదు.

– ఈ సినిమా కోసం ఇండియా రావాలనుకున్నప్పుడే అక్కడ యూఎస్ లో జాబ్ మానేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు. అందుకే ఇండస్ట్రీలో వచ్చిన అవకాశం వదులుకోకూడదని వచ్చేశా. ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్ ఎక్కువగా మాట్లాడదు. కానీ మాట్లాడినప్పుడు చాలా పవర్ ఫుల్ గా చెబుతుంది. ఈ క్యారెక్టర్ గురించి దర్శకుడు శ్రీరామ్ వేణు గారు చెప్పినప్పుడు ఝాన్సీ కిరణ్మయి స్ట్రాంగ్ వుమెన్, తను అనుకున్నది చేస్తుంది. ఏది ఏమైనా భయపడదు అని చెప్పారు. ఆయన చెప్పినట్లే నటించాను. ఈ క్యారెక్టర్ లో ఆ స్ట్రిక్ట్ నెస్ తో పాటు ఎమోషన్, అఫెక్షన్ కూడా ఉంటాయి.

– అడవిలో షూటింగ్ చేసిన ఎక్సిపీరియన్స్ మర్చిపోలేం. చాలా దెబ్బలు తగిలాయి. కొన్ని సీన్స్ లో చెప్పులు వేసుకోలేదు. రాళ్లు కాళ్లకు తగిలేవి. నేనే కాదు టీమ్ లో డైరెక్టర్ గారితో సహా సిక్ అయ్యాం. నితిన్ గారితో నాకు ఫస్ట్ కొన్ని రోజులు కాంబినేషన్ సీన్స్ లేవు. ఆ తర్వాత కలిసి చేశాం. డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు సెట్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. నేను డబ్బింగ్ చెప్పినంత వరకు మూవీ కంటెంట్ చూశాను. చాలా బాగా, ఇంపాక్ట్ ఫుల్ గా వచ్చింది.

– నా కెరీర్ లో ఇప్పటిదాకా ఒక సాధారణ అమ్మాయి పాత్రల్లోనే నటించాను. తమ్ముడు మూవీలో మాత్రం స్ట్రాంగ్ వుమెన్ గా నటించే అవకాశం దక్కింది. ఈ కథలో ప్రతి పాత్రకు ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరూ ఊరికే కనిపించరు. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

– నేను హీరోయిన్ గా చేసినప్పుడు అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మనకంటూ ఏదో సాధించాలనే తపనతో తిరిగి వచ్చాను. కథలో ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించాలని అనుకుంటున్నా. ఆ పాత్ర సిస్టర్ అయినా, మదర్ అయినా చేస్తాను. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఆడియెన్స్ కు నా క్యారెక్టర్ గుర్తుండాలి. నేను హీరోయిన్ గా చేసిన చిత్రాల్లోనూ మదర్ గా కనిపించినవి ఉన్నాయి. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. కథకు డ్రైవింగ్ ఫోర్స్ లాంటి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా నటిస్తా. నేను యూఎస్ ఆర్టిస్టును కాదు హైదరాబాద్ లోకల్ ఆర్టిస్టునే. మూవీస్ ఉన్నప్పుడు ఇక్కడే ఉంటా. ప్రస్తుతం శివాజీ గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఇంకే ప్రాజెక్ట్స్ అంగీకరించలేదు.

The Youth Anthem is Back! ‘Hushaaru’ Re-Releasing in Theatres on July 5th

Get ready to relive the magic, madness, and memories — the blockbuster coming-of-age drama Hushaaru is all set to hit the big screens once again with its re-release scheduled for July 5th.

Presented by Lucky Media, in association with ASIN and HK Films, Hushaaru made a massive impact during its initial release with its vibrant storytelling, relatable characters, and youthful energy. Directed by Sree Harsha Konuganti and produced by Bekkem Venu Gopal, the film became a cult favorite for Telugu youth, capturing the essence of friendship, love, heartbreak, and self-discovery.

Now, with audience demand surging and fan nostalgia at an all-time high, the makers are bringing it back to theatres to let a new generation experience the charm of Hushaaru, and to give longtime fans the chance to relive the iconic moments with their gang — this time, louder and larger on the big screen.

Whether it’s the hilarious college banter, the emotional rollercoasters, or the unforgettable soundtrack, Hushaaru stands as a timeless celebration of youth.

Mark your calendars — Hushaaru returns to theatres on July 5th.
It’s not just a movie; it’s a memory you’ll want to visit

Mr India 2025 Titile Winner : Model & Social Servicer Rakesh Arne

తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నె, మిస్టర్ ఇండియా 2025 టైటిల్‌ను గెలుచుకుని రాష్ట్రాన్ని గర్వపడేలా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవపేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన యువకుడు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాకేష్ తన విజయ గాధను పంచుకున్నారు.

ఈ సందర్భంగా రాకేష్ ఆర్నె మాట్లాడుతూ
“ఈ విజయానికి మూలకారణం నా నిరంతర కృషి, శ్రమ, కుటుంబం, మిత్రుల మద్దతు. మిస్టర్ ఇండియా పోటీలకు నేను నా ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, సోషల్ ఆవగాహనతో సన్నద్ధం అయ్యాను. ఇప్పుడు నా లక్ష్యం మిస్టర్ ఎలైట్ గ్లోబల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం.”

ఈ పోటీలో రాకేష్ తన ప్రదర్శనలో సామాజిక సేవ, ఫిట్‌నెస్, అంతర్జాతీయ అవగాహన, టాలెంట్ ప్రదర్శనతో జడ్జిలను ఆకట్టుకున్నారు. ప్రత్యేకించి, ఆయన అందించిన “సోషల్ ప్రాజెక్ట్ – ఆత్మవిశ్వాసం”, అనేక వర్గాల ప్రజలపై ప్రభావం చూపిన అంశంగా నిలిచింది. మోడలింగ్, ఫిట్‌నెస్, లైఫ్ కోచింగ్ రంగాలలో రాకేష్ తన అనుభవంతో జూనియర్లకు మార్గదర్శకుడిగా నిలవడమే కాక, దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఆయన శిక్షకులు, మెంటార్లు, పోటీ నిర్వహకులకు రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు. “ఫిట్‌నెస్ అంటే కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకూ అవసరం. నేను నా అనుభవాల ద్వారా యువతకు ఇదే సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. త్వరలోనే ఫిట్‌నెస్, మానసిక అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు ప్రారంభిస్తాను” అని అన్నారు.

రాకేష్ ఆర్నె మోడలింగ్ రంగంతో పాటు సామాజిక సేవలో భాగస్వామిగా మారే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.

ఈ విజయంతో రాకేష్ యువతకు – “కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమే” అన్న స్ఫూర్తినిచ్చారు. తెలంగాణ నుంచి ప్రపంచ వేదికపై భారత జెండాను ఎగరవేయాలనే ఆయన లక్ష్యం.

Our fight will not stop until justice is served! : Bhoo Porata Samithi Convener Senior Member Ramesh

Senior member of the Telugu Cine & TV Costumers Union and leader of the Bhoo Porata Samithi, Mr. Ramesh, has appealed to “Stop the exploitation by the leaders of the Telugu Cine & TV Costumers Union.”

Speaking to the media, he said: “In 2017, the leaders of the Telugu Cine & TV Costumers Union collected money from 330 union members with the promise of purchasing land for them. They entered into an agreement for 20 acres, paid money for 16 acres 36 guntas, but registered only 13 acres 12 guntas in the members’ names. Now, they are claiming that most of the land is gone and only 7 acres 2 guntas are remaining. They handed over this remaining land to a developer named Suresh for development, entering into agreements in such a way that deceives the members.

For the past 8 years, the leaders have been continuously cheating the members by not allotting the promised land. Unfortunately, 25 of our members have already passed away, still waiting for their rightful land.

To bring our issue to the notice of the government, we organized a protest at Indira Park, Dharna Chowk on Sunday (15-06-2025).

We will continue our fight until all our members get justice and the promised land is given to us,” said Mr. Ramesh!!

Actor Shiva Balaji interview about Dynamic Star Vishnu Manchu’s magnum opus ‘Kannappa’

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో బుధవారం నాడు శివ బాలాజీ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..

* ‘కన్నప్ప’ కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు అని విష్ణుని మోహన్ బాబు గారు అడిగారు. శివ బాలాజీ చేసే పాత్ర ఇందులో కనిపించలేదు అని విష్ణు అన్నారు. లేదు లేదు శివ బాలాజీ కచ్చితంగా ఉండాలి అని మోహన్ బాబు గారు అన్నారు. దీంతో ఆ తరువాత కొన్ని రోజులకు మహదేవశాస్త్రి కొడుకు పాత్రకు నేను అయితే బాగుంటుందని అనుకున్నారు. అలా కన్నప్ప చిత్రంలోకి వచ్చేశాను.

* ‘కన్నప్ప’ చిత్రంలో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యత కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ ఓ గొప్ప చిత్రం, ప్యాన్ ఇండియన్ చిత్రంలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించలేదు. న్యూజిలాండ్‌లో మొత్తం రెండు నెలలు ఉన్నాను. మోహన్ బాబు గారు షూటింగ్ చేసినన్ని రోజులు నేను కూడా షూట్ చేశాను.

* ప్రస్తుతం మంచి కథలు వస్తేనే చేస్తున్నాను. నచ్చకపోతే దర్శక, నిర్మాతల మొహం మీదే చేబుతున్నాను. డబ్బుల కోసం సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. నేను చేసిన ‘రెక్కీ’ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘సింధూరం’ అనే మరో మూవీని చేశాను. ఇప్పుడు ‘రెక్కీ 2’ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతోంది.

* ‘కన్నప్ప’ సినిమాను నేను చూశాను. అద్భుతంగా వచ్చింది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీ తరువాత రేంజ్ మారుతుంది. ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి. మోహన్‌లాల్ ఎంట్రీ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ సర్ ప్రైజింగ్‌గా అనిపిస్తుంది.

* మోహన్ బాబు గారు ఆన్ స్క్రీన్ వేరుగా ఉంటారు.. ఆఫ్ స్క్రీన్‌ వేరుగా ఉంటారు. విష్ణుతో ‘మా’ నుంచి పరిచయం. ‘మా’కు పని చేస్తున్నప్పుడే మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం. మోహన్ బాబు గారికి దగ్గరవ్వడం కష్టం.. దగ్గరైతే అలా ప్రేమతో కట్టి పడేస్తారు.

* కెరీర్ ప్రారంభంలో వరుసగా మూడు ఫ్లాపులు వచ్చాయి. నా మొదటి హిట్ ఆర్య. నేను ప్రారంభంలోనే ఎత్తుపల్లాలు చూశాను. ఇప్పుడు నేను ఏ విషయాన్ని కూడా అంతగా పట్టించుకోను. నేను ఎవ్వరి నుంచి ఏమీ ఆశించను. అసలు ఈ పాత్రను మోహన్ బాబు గారు చేయమని అన్నప్పుడు చాలా ఆలోచించాను. మరీ సైడ్‌కి అలా నిలబడే పాత్రను ఎలా చేయాలి? అని విష్ణుని అడిగాను. అది నీ ఇష్టం అని విష్ణు అన్నారు. మా ఆవిడ మధు కూడా అలానే అన్నారు. సరే అని ఒప్పేసుకున్నాను. కానీ ఈ చిత్రంలో, ఆ పాత్రను పోషించకపోతే చాలా మిస్ అయ్యేవాడ్ని. ఇప్పుడు నాకు ఆ పాత్ర గొప్పదనం అర్థమైంది.

* ‘కన్నప్ప’ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించారు. ఫస్ట్ డే ఆయన్ను షూట్‌లో చూసినప్పుడు షాక్ అనిపించింది. మనకు తెరపై ఆయన కనిపించే ఫస్ట్ సీన్‌కు మనం శివుడు అని ఫిక్స్ అయిపోతాం. అంతలా ఆ పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని మెప్పిస్తారు.

* ప్రస్తుతం నేను మోహన్ బాబు గారి ప్రొడక్షన్‌లో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. రెక్కీ 2 కూడా త్వరలోనే రానుంది.

Nava Dalapathy SudheerBabu Launches the Teaser of ‘Police Vari Heccharika’

Renowned actor Sudheer Babu officially unveiled the teaser of the upcoming film Police Vari Heccharika at a special event held at his office. The film is directed by Babji, a filmmaker known for his socially conscious narratives, and is produced by Belli Janardhan under the banner Thulika Tanishk Creations.

The film features Sunny Akhil in the lead role, supported by an ensemble cast. Cinematography for the film is handled by Kishan Sagar and Nalini Kanth, while music is composed by Gajwel Venu. Shiva Sharvani has taken charge of editing duties.

Speaking at the launch, Sudheer Babu shared:

“Director Babji has a long-standing connection with my father-in-law, the legendary Superstar Krishna garu. He is well-respected among Krishna garu’s admirers. I’m honored to release the teaser of a film made by someone so closely associated with our family. Teasers are crucial—they’re the first impression that draws audiences in, and Police Vari Heccharika does that brilliantly. It looks rich, intense, and compelling.

Producer Belli Janardhan expressed his happiness at the support the film has received from the industry:

“As a debut producer, it is heartening to see respected personalities participate in our film’s promotional journey—from unveiling the title and songs to this teaser. These moments are truly encouraging for me.”

Lead actor Sunny Akhil shared insight into his character:

“Typically, a hero is portrayed in stylish costumes, romancing the heroine and dancing to duets. But in this film, I play a common youth who, due to social injustice, spirals into mental instability, ultimately becoming a pivotal figure in the story’s climax. It’s a powerful, layered role that challenged me as an actor.”

Cast & Crew :

Sunny Akhil, Ajay Ghosh, Ravi Kale, Sayaji Shinde, Shubhalekha Sudhakar, Kashi Vishwanath, Jabardasth Vinod, Jabardasth Pawan, Jabardasth Shanti Swaroop, Himaja, Shankarabharanam Tulasi, Jaya Vahini, Meghna Khushi, and others.

Director: Babji
Producer: Belli Janardhan
Production Banner: Thulika Tanishk Creations
Music: Gajwel Venu
Cinematography: Kishan Sagar, Nalini Kanth
Editing: Shiva Sharvani
Co-Producer: N.P. Subba Rayudu
PRO: Madhu VR
Digital Marketing: Digital Dukanam

With its socially relevant theme and gripping teaser, Police Vari Heccharika is already generating positive buzz. The film promises to deliver a powerful message through strong performances and thought-provoking storytelling.

“DumDigaDum” Song Launched From Youthful Entertainer Virgin Boys

The upcoming youthful entertainer Virgin Boys, produced under the Raj Guru Films banner by Raja Darapuneni, and directed by Dayanand Gaddam, is all set to hit the screens on July 11. Ahead of the release, the team launched an energetic song titled “DumDigaDum”, which is already garnering attention for its catchy tune and vibrant visuals.

Featuring a dynamic cast including Mitraaw Sharma, Geethanand, Srihan, Jennifer Emmanuel, Ronith, and Anshula, the film revolves around youth, relationships, and modern love with a strong dose of entertainment.

The newly launched track “DumDigaDum” features lyrics by Pranav Chaganti and vocals by Yasir Nisar, with music composed by Smaran Sai. The song showcases JD Master’s lively choreography and has been released under the Aditya Music label.

At the song launch event, Producer Raja Darapuneni shared,

“We’re thankful for the overwhelming support the teaser and songs have received so far. Virgin Boys is a youthful film with fun, emotions, and an engaging love story. The censor board appreciated the film and granted it an A certificate. What’s more special is the positive feedback we’ve received from female viewers as well. We’re excited to bring this film to audiences on July 11, with distribution in Nizam by Asian Sunil Garu.”

Actress Jennifer Emmanuel expressed,

“I’m truly grateful for this opportunity. Reuniting with the media is always a pleasure, and this film has been a wonderful experience, especially working with JD Master.”

Actor Srihan added,

“Thanks to the team for believing in me. Virgin Boys is made for youth and talks about the realities of life in a fun way. It’s a complete entertainer, and we hope audiences enjoy it in theatres this July.”

Director Dayanand Gaddam remarked,

“This film will take audiences back to their college memories. With six beautiful songs and a strong background score, Virgin Boys is more than just a comedy — it’s a heartfelt story. I’m proud to have worked with this team.”

Actor Geethanand mentioned his earlier collaboration with the producer and added,

“The vibe of the song reflects the film’s overall mood — energetic, fun, and totally relatable to today’s youth.”

Actress Mitraaw Sharma concluded the event by saying,

“This film gave me the satisfaction of portraying a well-rounded role. Working with Dayanand felt like working with family, and JD Master’s choreography elevated our performance. I’m proud to be a part of Virgin Boys and can’t wait for audiences to experience it on July 11.”

Cast: Geetanand, Mitraaw Sharma, Shrihan, Ronith, Anshula, Jennifer Emmanuel, Kaushal Manda, Babloo, Rj Surya, Sheetal Tiwari, Sujith Kumar, Kedar Shankar, Rj Saran & Others

Technical Crew :
Producers : Raja Darapuneni
Banner : Rajguru Films
Writer & Director : Dayanandh Gaddam
Music : Smaran
DOP : Venkat Prasad
Editor : Marthand K Venkatesh
PRO : MadhuVR
Digital : Digital Dukanam
Audio On : Aditya Music

Films like ‘Dokka Seethamma’ Deserve Great Success: Murali Mohan

మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు , మట్టా శ్రీనివాస్ నిర్మాతలుగా టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తిక్ కోడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మురళీ మోహన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్ నీ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో..

మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘నా పుట్టిన రోజుని ఎప్పుడూ కూడా ఆశ్రమాల్లో చేసుకుంటూ ఉంటాను. దివ్యాంగులు, వృద్దాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు కూడా అంధుల ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఓ అరగంట వచ్చి వెళ్లండని ‘డొక్కా సీతమ్మ’ టీం పిలిచింది. అందుకే ఇలా వచ్చాను. చిన్న నిర్మాతలే అయినా నా బర్త్ డేను ఇలా సెలెబ్రేట్ చేస్తున్నందుకు థాంక్స్. రేలంగి గారితో నా అనుబంధం మరువలేనిది. రామ సత్యనారాయణ గారు ఎంతో మంది నిర్మాతలకు అండగా నిలుస్తుంటారు. డొక్కా సీతమ్మ గారి మీద సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కాటన్ దొర గారు సైతం డొక్కా సీతమ్మ గారిని పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే సైతం డొక్కా సీతమ్మ గారు వెళ్లలేదు. ‘నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు?’ అని డొక్కా సీతమ్మ గారు నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు అంతా కమర్షియల్‌గా మారింది. అలాంటి టైంలో రాంబాబు, రవి నారాయణ గారు ముందుకు వచ్చారు. ఇలాంటి చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ .. ‘నా మొదటి హీరో మురళీ మోహన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ కథను చేయాలని మురళీ మోహన్ గారు చెప్పిన క్షణం నుంచీ ఇప్పటి వరకు ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆయన వల్లే ఈ మూవీ ఇక్కడి వరకు వచ్చింది. ఆయన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని అన్నారు.

దాసన్న మాట్లాడుతూ .. ‘డొక్కా సీతమ్మ సినిమా నుంచి రిలీజ్ చేసిన మురళీ మోహన్ గారి ఫస్ట్ లుక్ బాగుంది. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ .. ‘మురళీ మోహన్ గారి లాంటి గొప్ప వ్యక్తి నటిస్తున్న చిత్రానికి నేను పని చేస్తుండటం ఆనందంగా ఉంది. డొక్కా సీతమ్మ గారు అంటే ధర్మం.. ధర్మం అంటే మురళీ మోహన్ గారు. ఇలాంటి గొప్ప చిత్రంలో పని చేసే అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అని అన్నారు.

శివ నాగు మాట్లాడుతూ .. ‘మురళీ మోహన్ గారు డొక్కా సీతమ్మ చిత్రంతో మరో విజయాన్ని అందుకోబోతోన్నారు. నేను త్వరలోనే ఆయన్ను డైరెక్ట్ చేయబోతోన్నాను. ఆయన మహా నటులు’ అని అన్నారు.

లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ .. ‘‘మురళీ మోహన్ గారు ప్రతీ రంగంలో విజయాన్ని సాధించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయనెప్పుడూ కూడా సర్వేజనా సుఖినోభవంతు అని అంటుంటారు. అందుకే ఆయన అంత ఆరోగ్యంగా ఉంటారు’ అని అన్నారు.

ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ .. ‘నాలుగు పాటలు, ఫైట్లు అంటూ సినిమాలు తీస్తున్న టైంలో ఇలా డొక్కా సీతమ్మ గారి కథతో గొప్ప సినిమాను తీస్తున్నారు. ఇలాంటి చిత్రాలే ఇప్పుడు రావాలి. నా వెన్నెంటే ఉండే మా మురళీ మోహన్ గారికి మరోసారి ఈ చిత్రంతో పెద్ద విజయం చేకూరాలి’ అని అన్నారు.

ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ .. ‘నా కెరీర్ ప్రారంభం నుంచీ మురళీ మోహన్ గారు నాకు సపోర్ట్‌గా నిలుస్తూనే వచ్చారు. నాకు జీవితంలో ఆయనే స్పూర్తి. ఆయన సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో విజయాన్ని సాధించారు. ఈ డొక్కా సీతమ్మ గారి సినిమాతో ఆయనకు మరో విజయం దక్కాలి’ అని అన్నారు.

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ..‘డొక్కా సీతమ్మ గురించి మేం చదువుకునే రోజుల్లో చాలా విన్నాం. ఇక ఆమె కథతో సినిమా తీస్తున్నారని తెలియడంతో ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచీ ఆయన నాకు సపోర్ట్‌గానే నిలిచారు. ఇండస్ట్రీలో మంచితనం అంటే సూపర్ స్టార్ కృష్ణ, మురళీ మోహన్ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. మా గురువు దాసరి గారు అయితే మురళీ అంటూ కొడుకుని పిలిచినట్టుగా ప్రేమగా పిలుస్తుండేవారు’ అని అన్నారు.

నటీనటులు : మురళీ మోహన్, ఆమని, రాజమౌళి, ఆకెళ్ల, జబర్దస్త్ అప్పారావు, R C M రాజు,చినబాబు, కాకినాడ ప్రసాద్, జబర్దస్త్ బాబి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కేశవి, పిట్టలదొర, కూరాకుల చిన్న, డి. వీరబాబు తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్: ఉషారాణి మూవీస్
నిర్మాతలు: వల్లూరి రాంబాబు,మట్టా శ్రీనివాస్.
సహ నిర్మాతలు వలిసెట్టి చాహితి ప్రియా, పోల గాని సుబ్బారావు
దర్శకుడు: టి.వి. రవి నారాయణ్
సంగీత దర్శకుడు:కార్తిక్ కోడకండ్ల
ఎడిటర్: శ్రీకృష్ణ
కెమెరామెన్: రాహుల్ శ్రీ వాత్సవ్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. రవి కుమార్
పాటలు : చంద్రబోస్, విజయ్ కుమార్, వీరు
కొరియోగ్రఫీ : సుచిత్రా చంద్రబోస్
పీఆర్వో : సాయి సతీష్

‘Jai Bagalaamukhii’ Song Released from Hero Nithiin’s “Thammudu” Movie

After the blockbuster success of “Sankranthiki Vastunnam”, leading production house Sri Venkateswara Creations is back with another promising film “Thammudu”. Produced by Dil Raju and Sirish, and directed by Sriram Venu, the film features Laya, Varsha Bollamma, and Sapthami Gowda in key roles. “Thammudu” is all set for a grand worldwide theatrical release on July 4th.

Today, the lyrical song ‘Jai Bagalaamukhii’ from “Thammudu” has been officially released. The lyrics for ‘Jai Bagalaamukhii’ have been penned by renowned lyricist Jonnavithula Ramalingeswara Rao, with music composed by Ajaneesh Loknath, known for his divine tunes. Singer Abhi V has rendered the song beautifully.

Talking about the song – it goes as,
“Jai Bagalaamukhii, Jai Shivanayaki, Jai Vanaroopini, Jai Jayakarini, Vidruma Roopini, Vibhra Karini, Gagana Chatra Vindhyachala Vasini, Veera Vihaarini, Kshudra Vidaarini, Sarvajeewa Samrakshini Janani…”

The song is a powerful devotional number, praising Goddess Bagalaamukhii, the embodiment of strength and divinity. It has been picturised during a grand village fair setting, reflecting the film’s rooted and vibrant tone.

Cast:

Nithiin, Laya, Varsha Bollamma, Sapthami Gowda, Swasika Vijay, Baby Sriram Deetya, and others.

Technical Crew:

Cinematography: K.V. Guhan
Editing: Praveen Pudi
Music: B. Ajaneesh Loknath
PRO: Vamsi Kaka, GSK Media
Banner: Sri Venkateswara Creations
Producers: Dil Raju & Sirish
Story, Screenplay & Direction: Sriram Venu