Home Blog Page 77

 “DEEKSHA” Movie Worldwide Grand Theatrical Release This July

ఆర్ కె ఫిలిమ్స్ బ్యానర్‌‌లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్య రెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్సా ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “దీక్ష”. ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలైలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ ప్రెస్‌ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

దర్శక, నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – మా “ఆర్కే దీక్ష” సినిమాకు సంబంధించిన డబ్బింగ్, మిక్సింగ్, రీ రికార్డింగ్ పూర్తి అయ్యాయి. జూలై మొదటి వారంలో మా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి జూలై నెలాఖరుకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. ప్రతి మనిషికి దీక్ష అనేది అవసరం. ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. దర్శకుడిగా నాకు ఇది 8వ సినిమా. నిర్మాతగా 50 చిత్రాలకు చేరువవుతున్నాను. “దీక్ష” సినిమా నాతో పాటు మా హీరో కిరణ్, హీరోయిన్ అక్సాఖాన్ ఇతర టీమ్ అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. మధుప్రియ మూడు పాటలు పాడింది. మొత్తం సినిమాలో ఐదు హిట్ సాంగ్స్ ఉన్నాయి. హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. ఇందులో హీరోయిన్ ను కాపాడే సీన్ లో భీముడి పాత్రలో ఆయన చెప్పిన లెంగ్తీ డైలాగ్ హైలైట్ అవుతుంది. అలాగే అక్సాఖాన్ తన నటనతో పాటు ఈ చిత్రంలో ఓ అదిరిపోయే పాట చేసింది. ఈ పాటలో ఆమె డ్యాన్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి రోహిత్ శర్మ అనే ఒక విలన్ ను తీసుకున్నాం. అతని విలన్ గా ఫెరోషియస్ గా నటించాడు. తులసి మరో కీ రోల్ చేసింది. మా మరో ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి కూడా ఈ మూవీ పెద్ద సక్సెస్ ఇవ్వాలి. ఈ సినిమా కంప్లీట్ చేశాక మహిళా కబడ్డీ అనే చిత్రాన్ని రూపొందించబోతున్నాం. “ఆర్కే దీక్ష” సినిమాను మీరంతా ఆదరిస్తారని, మా టీమ్ కు మంచి గుర్తింపు అందిస్తారని కోరుకుంటున్నాం అన్నారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ – “ దీక్ష” చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. టైటిల్ కు తగినట్లే ఆర్కే గౌడ్ గారు ఈ చిత్రాన్ని ఒక దీక్షతో చేస్తున్నారు. ఆయన తన పట్టుదల వల్లే టీఎఫ్ సీసీ ఛైర్మన్ గా తెలంగాణ సినిమా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ అక్సాఖాన్ బాగా నటించింది. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్, ఫైట్ మాస్టర్ రవితో పాటు మా డీవోపీ..ఇలా ప్రతి టెక్నీషియన్ కష్టపడి పనిచేశారు. నాకు నటనే జీవితం. ఎప్పుడూ సినిమా ఆలోచనే ఉంటుంది. ఆర్కే గౌడ్ గారికి మూవీ మేకింగ్ లో పక్కా ప్లానింగ్ ఉంటుంది. ఏ రోజు అనుకున్న సీన్స్ ఆ రోజు తీసేవారు. అందరం పంక్చువల్ గా పనిచేశాం. “ఆర్కే దీక్ష” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. మా టీఎఫ్ సీసీ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలనుకుంటున్నాం. నెక్ట్స్ మూవీ మహిళా కబడ్డీలో కూడా కీ రోల్ చేస్తున్నా అన్నారు.

హీరోయిన్ ఆక్సాఖాన్ మాట్లాడుతూ – ” దీక్ష” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. ఆయన సపోర్ట్ ను మర్చిపోలేను. హీరో కిరణ్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఎంతో టాలెంట్ ఉన్న కిరణ్ కు ఈ సినిమాతో మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో నేనొక స్పెషల్ సాంగ్ చేశాను. ఆ పాటలో సాంగ్స్ మీకు బాగా నచ్చుతాయి. తులసీ చేసిన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ” దీక్ష” సినిమా కోసం ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఎంతో కష్టపడి పనిచేశారు. నన్ను ఢీ షో నుంచి ఎలా ఆదరించారో…ఈ సినిమాతోనూ అలాంటి సక్సెస్ అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు. ఈ చిత్రాన్ని ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో పి. అశోక్ కుమార్, ఆర్ కె గౌడ్ నిర్మించారు.

Director Sriram Venu interview about Sri Venkateswara Creations “Thammudu” Movie

సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్ శ్రీరామ్ వేణు.

“తమ్ముడు”సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం. సెన్సార్ వాళ్లు కొన్ని కట్స్ చెప్పారు. మేము ఆ కట్స్ వద్దు అనుకున్నాం. ఒప్పుకుంటే యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్లు. సినిమాలోని ఎస్సెన్స్ ను సరిగ్గా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలనే కట్స్ లేకుండా ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం. ఇది మా అందరి ఉమ్మడి నిర్ణయం. దిల్ రాజు గారు ఒక్కరే ఈ డెసిషన్ తీసుకోలేదు. సినిమాలో అంతగా హింస లేదు. కొత్తగా వచ్చిన సెన్సార్ ఆఫీసర్స్ స్ట్రిక్ట్ గా ఉన్నారు. వాళ్లనూ తప్పు పట్టలేం. వారి గైడ్ లైన్స్ ప్రకారం వర్క్ చేస్తుంటారు.

– ఈ కథలో హీరోతో పాటు ఐదుగురు లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, దిత్య ముఖ్యమైన పాత్రలు చేశారు. హీరో అంటే ఇంత లెంగ్త్ ఉండాలి అనేది “తమ్ముడు”లో ఉండదు. హీరోతో పాటు ఐదుగురు వుమెన్ క్యారెక్టర్స్ బలంగా ఉంటాయి. విక్రమ్ లో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కథలో ఎలా ట్రావెల్ అవుతుందో అలా మా మూవీలోనూ ఉంటుంది. కథ ప్రకారమే తమ్ముడు టైటిల్ పెట్టాం.

– “తమ్ముడు” కథ విని దిల్ రాజు గారు బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అంతకుముందు మా కాంబోలో ఐకాన్ మూవీ కోసం వర్క్స్ చేసుకున్నాం. ఆ తర్వాత ఈ మూవీ స్టార్ట్ చేశాం. ఈ కథకు సెట్ అయ్యే హీరో కోసం సెర్చ్ జరిగింది. నితిన్ బాగుంటాడని తీసుకున్నాం. ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ స్ఫూరితో “తమ్ముడు” కథను సిద్ధం చేసుకున్నా.

– లయ గారి పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఒకరికి కథ చెప్పాను. ఆమెకు స్టోరీ, క్యారెక్టర్ నచ్చింది కానీ తన పర్సనల్ రీజన్స్ వల్ల నటించలేదు. అయితే మరోసారి ఇలాంటి క్యారెక్టర్ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది. ఆ తర్వాత లయ గారు ప్రాజెక్ట్ లోకి వచ్చారు. ఆమెది ఈ మూవీలో 90 డేస్ క్యారెక్టర్. తను బాగా సపోర్ట్ చేసి మూవీ ఫినిష్ చేసింది.

– మన సినిమాల్లో ఫైట్స్ త్వరగా వచ్చి వెళ్తుంటాయి. మా సినిమాలో ఫైట్స్ ను ఎపిసోడ్స్ ఫీల్ ఉండేలా రూపొందించాం. ఈ ఫైట్ సీక్వెన్సులు మంచి ఇంపాక్ట్ ఉంటాయి. కథను కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలనే ప్రయత్నిస్తుంటాను. ఒక్కో దర్శకుడికి ఒక్కో మార్క్ ఉంటుంది. నా స్క్రిప్ట్స్ లో ఫీమేల్ క్యారెక్టర్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పటిదాకా అలా చేస్తూ వచ్చాను. నెక్ట్స్ సినిమాకు ఎలా ఉంటుందో చెప్పలేను.

– బడ్జెట్, క్రియేటివ్ పరంగా దిల్ రాజు గారు “తమ్ముడు” మూవీ బాధ్యత మొత్తం నాకే అప్పగించారు. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక ఆయనకు చూపించాం. ఆయన ఎక్సిపీరియన్స్ ప్రకారం కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని ఇన్ క్లూడ్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. 8 నెలల్లో ఈ సినిమాను కంప్లీట్ చేయాలనుకున్నాం కానీ రెండేళ్లు పట్టింది. అయినా మేము ముందు అనుకున్న బడ్జెట్ లోనే మూవీ ఫినిష్ చేశాం.

– “తమ్ముడు” ప్రమోషన్స్ లో అందరూ పాల్గొంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ బిజీ వల్ల నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నా. ప్రమోషన్స్ కు డైరెక్టర్స్ లీడ్ తీసుకోవడం అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. మేమూ అదే ఫాలో అవుతున్నాం. ఒక గర్వం నిలబడటానికి జరిగిన యుద్ధమే తమ్ముడు మూవీ. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా కథలో ఉన్నా అనేక లేయర్స్ తో మూవీ సాగుతుంది. మా పాప దిత్య ఈ చిత్రంలో ఒక కీ రోల్ చేసింది. ఈ సినిమా కోసం మూడు ఆడిషన్స్ లో పాల్గొంది. తను ఈ సినిమా కోసం 70 రోజులు షూటింగ్ చేసింది.

– మిగతా స్పోర్ట్స్ కంటే ఆర్చరీకి మెంటల్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా, ఏకాగ్రతతో ఉండాలి. గాలి వచ్చే దిశను, వేగాన్ని కూడా అంచనా వేయగలగాలి. విలువిద్య చాలా పురాతనమైనది, రాముడు, అర్జునుడి కాలం నుంచీ చూస్తున్నాం. ఆర్చరీని కథలో ఇన్ క్లూడ్ చేయాలని చాలా రోజులుగా అనుకున్నాం. “తమ్ముడు”లో కుదిరింది. ఆర్చరీ ట్రైనర్ తో నితిన్ కు 15 డేస్ ట్రైనింగ్ ఇప్పించాం. ఫారెస్ట్ లో షూటింగ్ చేసినప్పుడు అందరికీ గాయాలు అయ్యాయి. రోడ్లు సరిగ్గా లేక, వెహికిల్స్ అక్కడి దాకా వెళ్లలేక ఇబ్బందులు పడ్డాం. ఈ మూవీకి సేదు, సమీర్ రెడ్డి, గుహన్ కెమెరామెన్స్ గా పనిచేశారు. ఏ కెమెరామెన్ వచ్చినా నా దగ్గరున్న విజువల్ టెంప్లేట్ తో “తమ్ముడు” మూవీ విజువల్ గా బ్యూటిఫుల్ గా తెరకెక్కించాం.

– కాంతార చూశాక సప్తమిగౌడ మా మూవీలోని క్యారెక్టర్ కు బాగుంటుందని అనిపించి తీసుకున్నాం. తను బాగా పర్ ఫార్మ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ చాలా టాలెంటెడ్. మా మూవీకి మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థియేటర్ లో ఆయన వర్క్ చూస్తారు. నిడివి పరంగా చూస్తే నేను ఎక్కువ లెంగ్త్ షూటింగ్ చేయను. ఈ సినిమాలో ల్యాగ్ ఉండదు. రాజు గారు సినిమా చూశాక ఎక్కడా కట్స్ చెప్పలేదు.

– నా ప్రతి సినిమా ఒక కొత్త జానర్ లో ఉంటుంది. నేనెప్పుడూ జానర్ రిపీట్ చేయలేదు. నా నెక్ట్స్ మూవీ ఐకాన్ ఉంటుందా, లేక మరో మూవీ ఉంటుందా అని తర్వాత చెప్తా. మలయాళం నుంచి ఒక యాక్టర్ ను తీసుకోవాలని అనుకున్నప్పుడు స్వసిక బాగుంటుందని అనిపించింది. మిగతా పాత్రలకు కూడా తెలుగు యాక్ట్రెస్ ను అనుకున్నాం కానీ కొన్ని రీజన్స్ తో కుదరలేదు.

– రాజు గారి ప్రొడక్షన్ లో నాకు కావాల్సినంత స్వేచ్ఛ, కంఫర్ట్ ఉంటుంది. ఇలాంటి కంఫర్ట్ తో మరో మంచి అవకాశం వస్తే ఇంకో బ్యానర్ లోనూ మూవీ చేస్తా. రాజు గారు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీసి ఉంచలేదు. పాన్ ఇండియా సినిమా చేయకూడదని కాదు. అలాంటి ప్రాజెక్ట్ కుదిరితే తప్పకుండా చేస్తా. పాన్ ఇండియా అని రిలీజ్ చేసిన అన్ని సినిమాలు ఆదరణ పొందలేదు కదా.

– దిల్ రాజు గారి ప్రతి సినిమాను అమోజాన్ వాళ్లు తీసుకునేవారు. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వాళ్లు చూసి మంచి రేట్ కు తీసుకున్నారు. నితిన్ కు ఇప్పుడున్న సక్సెస్ ట్రాక్ బట్టి చూస్తే ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ పరంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. థియేట్రికల్ రిలీజ్ ను కంఫర్ట్ గా చేసుకుంటున్నాం.

– ఐకాన్ మూవీ సెట్స్ మీదకు వెళ్లని టైమ్ లో నేను బాధపడలేదు. ఎందుకంటే నా కెరీర్ లో మొదటి చిత్రానికి రెండో సినిమాకు మధ్యలో ఏడేళ్ల గ్యాప్ వచ్చింది. అప్పటికి పెళ్లై పిల్లలు ఉన్నారు. అలాంటి టైమ్ లోనే సర్వైవ్ అయ్యాను. కాబట్టి లైఫ్ లో దేనికీ డిప్రెషన్ లోకి వెళ్లలేదు. రాజు గారి బ్యానర్ లోనే వేరే సినిమాలకు వర్క్ చేస్తూ వచ్చాను.

– ఏఐ సహా చాలా టెక్నాలజీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. టెక్నికల్ గా యాప్స్ ఎంత వర్క్ చేసినా మన హ్యూమన్ ఎఫర్ట్స్ సినిమాలకు తప్పకుండా కావాల్సిందే.

‘Veede Mana Vaarasudu’ Pre Release Event held grandly, Movie Releasing on July 18

Delivering a powerful message much needed in today’s society, ‘Veede Mana Vaarasudu’ stars Ramesh Uppu (RSU) in the lead role alongside heroines Lavanya Reddy and Sarvani Mohan. Written, directed, produced, and performed by Ramesh Uppu himself, the film’s grand pre-release event was held at Prasad Labs in Hyderabad.

Several notable personalities from the film and political fraternity attended the event, congratulating and extending their best wishes to the film team. The guests appreciated Ramesh Uppu’s versatility and compared him to the legendary filmmaker Dasari Narayana Rao for his all-round talent.

Actors Sammeta Gandhi, Devasena (Venkatagiri), Vijay Rangaraju, Anand Bharathi, Gooduru Kishore, and Shilpa (Vizag) play key roles in the film, which is slated for release across the Telugu states on July 18, as announced by director-producer Ramesh Uppu.

Key Guests’ Comments:

 

 

MLA Mal Reddy Rangareddy said, “I wholeheartedly appreciate Ramesh Uppu for managing the film single-handedly. Back in 1994, he used to compose songs for me. He’s a talented artist, and I wish for his dreams to come true. This film resembles the meaningful message-driven movies of the past. I hope it becomes a success.”

Actor 30 Years Prithvi added, “Wishing the film to be a super hit!”

Congress leader Surender Reddy said, “I watched the trailer and songs. They are excellent. Every guest here today must promote this film, as every drop counts to make an ocean. Wishing the entire team success.”

Director VN Aditya shared, “The trailer looks fantastic. The action scenes are impressive. I truly hope Ramesh Uppu emerges as a rightful heir to the film legacy.”

Director Samudra expressed confidence in the film, saying, “Wishing the team all the best in advance. I believe the film will succeed.”

Police officer Ramaavath Teja remarked humorously, “Everyone here came lawfully to ensure the movie becomes a hit, and so did I. The film will become a hit!”

Actor Krishnasai praised Ramesh Uppu’s multi-departmental talent and congratulated him, drawing comparisons with Dasari.

Prominent attendees included MLA Mal Reddy Rangareddy, Congress leader Surender Reddy, officer Ramaavath Teja, directors Samudra and VN Aditya, 30 Years Prithvi, actors Krishnasai, Dil Ramesh, Jabardasth Apparao, Jabardasth Naveen, actor Nag Mahesh, actor-director Sai Venkat, among others—all of whom conveyed their wishes for the film’s success.

Director-Producer Ramesh Uppu (RSU) said:
“I express heartfelt thanks to all film and political personalities for blessing our film team. Our movie delivers a meaningful message to society and carries strong emotional elements that will touch everyone. It portrays the hardships faced by farmers. I urge everyone to watch this family drama in theaters.”

Heroines Lavanya Reddy and Sarvani Mohan said:
“It’s a joy to be part of such a good film made by Ramesh Uppu. We’re proud to have shot in rural areas, which added natural charm. We truly believe the film will be a super hit.”

Cast:
Hero – Ramesh Uppu
Heroines – Lavanya Reddy, Sarvani Mohan
Key roles – Sammeta Gandhi, Devasena (Venkatagiri), Vijay Rangaraju, Anand Bharathi, Gooduru Kishore, Shilpa (Vizag), Siddu Royal, Adwithej Reddy, and others.

Technical Crew:

Cinematography: D. Yadagiri

Editing: K. Srinivas Rao

Music: Sadive Devendra
Background Score: Sri Venkat
Lyrics & Singing: Ramesh Uppu (RSU)
Co-Director: Ameer Kaz Rani
Fights: Action Ahmad, Shaolin Mallesh
Choreography: Balakrishna (Balu)
Publicity Design: Dadi Trinath
PROs: Kadali Rambabu, Dayyala Ashok

Heartfelt thanks to the audience for making ‘Kannappa’ a phenomenal success: Dr Mohan Babu At Kannappa Thanks Meet

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ మేరకు శనివారం నాడు చిత్రయూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ .. ‘ఆ భగవంతుడు ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి ఇంత గొప్ప విజయం దక్కింది. మా టైంలో ఓ సినిమాకు ఇన్ని సభలు పెట్టేవాళ్లం కాదు. నటుడిగా 50 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా అభిమానులు నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ‘కన్నప్ప’ సక్సెస్ తరువాత వాళ్లంతా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. వారి ప్రేమకు నేను తిరిగి ఏం ఇవ్వగలను. ఈ చిత్రం కోసం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. అందరికీ హృదయ పూర్వక అభినందనలు. ఆ భగవంతుడి ఆజ్ఞతోనే ఈ సినిమాను తీశామనిపిస్తుంది. అందరి ప్రోత్సాహం ఉండబట్టే ఇక్కడి వరకు రాగలిగాం. వినయ్ లేకపోతే.. కన్నప్ప చిత్రం ఉండేది కాదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు’ అని అన్నారు.

విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘మాలాంటి ఆర్టిస్టులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేం ఈ స్థాయికి వస్తాం. ‘కన్నప్ప’కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదంతా శివలీల. ‘కన్నప్ప’ను ఇంత గొప్ప సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ సినిమా మీద అందరూ ప్రేమను కురిపిస్తున్నారు. ఇంకా సినిమాను చూడాల్సినవాళ్లు చాలా మంది ఉన్నారు. అందరూ ఈ మూవీని చూడండి. మోహన్ బాబు గారు, విష్ణు గారు పదేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడుతూ వచ్చారు. ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ మూవీకి పని చేశారు. అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

మైత్రి శశి మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’కి అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఎక్కువగా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ‘సలార్’, ‘పుష్ప’ లాంటి చిత్రాల తరువాత ‘కన్నప్ప’కి కల్వకుర్తి వంటి ఊర్లో థియేటర్లు నిండుతున్నాయి. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ ఇలా అన్ని చోట్లా ప్రభంజనం సృష్టిస్తోంది. ‘కన్నప్ప’ చిత్రం మున్ముందు భారీ విజయాన్ని నమోదు చేయనుంది. క్లైమాక్స్ చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. విష్ణు గారు అద్భుతంగా నటించారు. ఇప్పుడున్న తరం చూడాల్సిన చిత్రమిది. ఇలాంటి సినిమాను తీసుకు వచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి మాట్లాడుతూ .. ‘మోహన్ బాబు గారి ఫ్యామిలీతో నాకు ఎంతో మంచి సంబంధం ఉంది. ‘కన్నప్ప’ చిత్రం అద్భుతం చేసింది. ఇంతటి ప్రేమను ‘కన్నప్ప’ దక్కించుకుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. విష్ణు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది తరతరాలు నిలిచిపోయే సినిమా అవుతుంది’ అని అన్నారు.

అర్పిత్ రంకా మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ కోసం మూడేళ్లుగా విష్ణు, మోహన్ బాబు గారితో ప్రయాణిస్తున్నాను. వారిని ఎప్పుడూ కూడా ఇంత సంతోషంగా చూడలేదు. అక్కడే మా ‘కన్నప్ప’ ఎంత సక్సెస్ అయిందో అర్థం అవుతోంది. చాలా నెగెటివిటీని వారు ఎదుర్కొన్నారు. తిన్నడు కంటే ఎన్నో కష్టాల్ని విష్ణు పడ్డారు. మహాదేవుడు ఎన్నో కష్టాలు పెడుతుంటాడు. కానీ చివరకు ఇలాంటి విజయాన్ని అందిస్తారు. ఈ మూవీ క్లైమాక్స్ చూసి అందరూ ఏడ్చేస్తున్నారు. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. అందరూ ‘కన్నప్ప’ మూవీని చూడండి’ అని అన్నారు.

శివ బాలాజీ మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’కి వస్తున్న ప్రేమను చూస్తే నాకు మాటలు రావడం లేదు. విష్ణు గారు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఇకపై ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అర్జునుడు, తిన్నడు, కన్నప్పగా విష్ణు అద్భుతం చేశారు. ఈ మూవీ కోసం ప్రతీ ఒక్కరూ పగలు, రాత్రి అన్న తేడా లేకుండా పని చేశారు. ఈ సక్సెస్‌ను టీం ఎంజాయ్ చేయాలి. ఈ చిత్రంలో పని చేసిన మేం అంతా అదృష్టవంతులం. సినిమాను చూడాలన్నా అదృష్టం ఉండాలి. తల్లిదండ్రులంతా కూడా పిల్లలకు ఇలాంటి చిత్రాలను చూపించాలి’ అని అన్నారు.

నటుడు కౌశల్ మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ను కొంత మంది చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు. శివుడ్ని తలుచుకుని సినిమాను చూస్తే అందరికీ నచ్చుతుంది. తిన్నడుగా ఉన్నప్పుడు రక్తి ఎక్కువగా ఉంటుంది.. కన్నప్పగా మారినప్పుడు భక్తి ఎక్కువగా ఉంటుంది. ‘కన్నప్ప’ను ఎన్ని సార్లు చూసినా తనివి తీరడం లేదు. మోహన్ బాబు గారు మా అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. విష్ణు గారికి ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాలి’ అని అన్నారు.

International Iconic Award for Young cinematographer Kishore Boyidapu

Talented young cinematographer Kishore Boyidapu received the prestigious International Iconic Award for his outstanding cinematography in the film “105 Minutes”, starring popular actress Hansika Motwani. The film stands out for being shot in a single take with a single character on a limited budget. Kishore received the award at a grand ceremony held yesterday (June 27, 2025) at Le Meridien Hotel, Hyderabad. On this occasion, he expressed his gratitude to the film’s director Raju Dussa and producer Bommak Shiva.

Kishore started his career as a camera assistant in Ravi Prasad’s unit. Climbing the ladder quickly, he showcased his skills as a second-unit cinematographer in Hollywood projects like Slumdog Millionaire, Mission Impossible 4, Letters, and Suitable Boys. A proud student of renowned cinematographer Anil Mehta, Kishore also worked on notable Hindi films such as Secret Superstar, Ye Dil Hai Mushkil, Beyond the Clouds, and Hindi Jersey. He also handled Ad films for top Bollywood stars.

Kishore transitioned as a full-time cinematographer with “Boy Meets Girl”. His works include Kirrak, Vasham, Kartha-karma – Kriya (directed by journalist-turned-filmmaker Nagu Gavara), 105 Minutes, and My Name is Shruthi. Currently, he is working on On the Way (starring Sunil), Rudhiraksha (Aadi Saikumar), and an untitled project featuring Bigg Boss fame Shanmukh, Shivaji, and Bhumika.

Kishore strongly believes that job satisfaction is more valuable than just financial gain. He constantly updates his craft by observing the works and interviews of talented cinematographers from different languages worldwide. Now based in Hyderabad after relocating from Mumbai, Kishore stated that his focus will be entirely on Telugu cinema from now on!!

Keerthy Suresh and Suhas “Uppu Kappurambu” Music Album Unveiled

Prime Video, India’s most loved entertainment destination, today launched the evocative and earthy music album of its Telugu Original Movie, UppuKappurambu. Released under the Believe India label, the album boasts three original tracks that beautifully capture the quirky tone and emotional undercurrents of this small-town satire. Composed by the exceptionally talented Sweekar Agasthi with lyrics penned by Ravi Krishna Vissapragada, S Attavur Rahim, and Raghuram Dronavajjala the soundtrack breathes soul into Chitti Jayapuram — a village caught in an unusually grim yet humorous crisis.
 
Enhancing the charm of the music album are powerful vocals by celebrated artists Sean Roldan,AnuragKulkarni and Anthony Daasan,each bringing a distinct flavour to the film’s soundscape. From carefree celebrations in Nomilala to grief-tinged longing in Yaadunaavo and the rustic energy of the title track Uppu Kappurambu, the tracks perfectly complement the story’s journey with warmth and wit. The entire album of UppuKappurambu is now available to stream on Amazon Music, Spotify, JioSaavn, Apple Music, and all leading music platforms.
 
“Nomilala is one of those rare songs that instantly transport you — emotionally and visually — to the heart of the story,” shares singer Sean Roldan. “It’s an anthem for letting go, for dancing through life’s absurdities. The song embraces both chaos and community, something that resonated deeply with me while recording it. There’s cheekiness, yes, but there’s also a sense of resilience that I think a lot of people from smaller towns will connect with. I’m thrilled that this song, and the world it belongs to, will now reach homes across the globe with Prime Video.”
 
“Yaadunaavo carries the ache of a child missing his mother and the quiet poetry of everyday absence,” says singer Anurag Kulkarni. “The song is rooted in pain, but also hope, and I’m grateful to lend my voice to something so tender. I’m sure it will strike a nostalgic chord with listeners everywhere. I’m so happy that Prime Video is taking this heartfelt track to such a wide and diverse audience.”
 
“The title track, Uppu Kappurambu is full of grit, wit, and madness — just like the village it belongs to,” notes singer Anthony Daasan. “It has this raw energy and rustic flavour that I absolutely loved channeling. It’s wild, it’s grounded, and it was a total riot to record. This song will make you smile, groove, and feel the chaos all at once! I can’t wait for audiences across languages and regions to vibe with it on Prime Video.”

“Kannappa” Movie Review (Passable Devotional Drama)

Cinemarangam.Com
Banner : AVA Entertainment and 24 Frames Factory,
Movie : “Kannappa”
Review Rating : 3.25/5
Release Date : June 27th
Produced by : Mohan Babu Manchu,
Directer : Mukesh Kumar Singh
Cast : Mohan Babu, Prabhas, Akshay Kumar, Mohanlal, Sarath Kumar, Arpit Ranka, Kajal Aggarwal, and Preity Mukundhan others
Music : Steephen Devassi,
Dop: Sheldan Chow
Editor : Antoni
Choreagrapher : Prabhu Deva
Lyrics : Suddala Ashok Teja
PRO: Sateesh Palakurthi

Dynamic Star Vishnu Manchu’s dream project ‘Kannappa’ is carrying good craze among the audience. Directed by Mukesh Kumar Singh and produced under AVA Entertainment and 24 Frames Factory by Dr. M. Mohan Babu, the film had a Pan India release today. Let’s see how it goes.

Story:

Inspired by the legend of Bhakta Kannappa, the film follows Thinnadu, a tribal hunter who is initially an atheist but undergoes a spiritual transformation, eventually becoming a devout follower of Lord Shiva. Set against a rich mythological backdrop, the film delves into themes of devotion, sacrifice, and divine grace, culminating in the ultimate test of Thinnadu’s faith.

Plus points:

Vishnu Manchu’s Career-Best Performance.
He delivers a power-packed and emotionally stirring act, effectively portraying the arc of an atheist turning into a devoted saint. Appearances by Akshay Kumar and Prabhas as divine beings add star power without feeling forced.

The track between Manchu Vishnu and Prabhas which comes during the key second half is engaging gives the required push to the movie.

Preity Mukhundhan is cute on the screen and provides required glamour to the youth audience.

Other actors such as Akshay kumar, Kajal Agarwal, Mohanlal and Mohan Babu are good in their key cameo roles.

Minus Points:

The pace of the film is slow during the first half of the film which can be termed as a major minus.

The romantic track between the lead pair looks unwanted in the first half proceedings which could have been avoided.

Technical Aspects:

Director Director Mukesh Kumar Singh balances devotional depth with commercial entertainment. High-voltage action sequences are blended with philosophical undertones.

Music by Stephen Devassy is largely good and so is the case with his BGM.

The cinematography work looks rich and editing by Anthony would have been even better.

The production values by Vishnu Manchu’s home banner are lavish and stunning for this big budget movie.

Verdict:
On the whole, Kannappa is a devotional drama that keeps the audience attention hooked due to the performances by the lead actors. If you ignore a few loopholes here and there, the film will end up as a time-pass watch during this weekend.

Cinemarangam.Com   Review Rating.. 3.25/5

‘Kannappa’ is not a myth, it is our history. With Lord Shiva’s blessings, This Friday belongs to me: Vishnu Manchu at Media Meet

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో గురువారం నాడు విష్ణు మంచు, కన్నప్ప టీం మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో

*విష్ణు మంచు మాట్లాడుతూ* .. ‘‘కన్నప్ప’కు ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు తెగాయి. ఇంతటి రెస్పాన్స్ చూసి నాకు ఆనందమేస్తోంది. ఇదంతా శివ లీల అనిపిస్తుంది. ‘కన్నప్ప’ మీద ఇంత పాజిటివిటీ వస్తుందని ప్రారంభంలో ఎవ్వరూ నమ్మలేదు. అది వారి తప్పు కాదు. ఇప్పుడు ‘కన్నప్ప’ మీద ఫుల్ పాజిటివిటీ వచ్చింది. ‘కన్నప్ప’ చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడాలని కోరుకుంటున్నాను. అందుకే నేను టికెట్ రేట్లు పెంచడం లేదు. ఈ మూవీని పిల్లలే ఎక్కువగా చూడాలని అనుకుంటున్నాను. అందుకే కుటుంబాలకు భారం కావొద్దని టికెట్ రేట్లు ఎక్కువగా పెంచడం లేదు. ఏపీలో కొన్ని చోట్ల మాత్రమే పెంచాం. ప్రభాస్‌కి ఇప్పటికే నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆ దేవుడి దయవల్ల నేను కన్నప్ప విషయంలో ఎప్పుడూ ఆర్థిక కష్టాల్ని ఎదుర్కోలేదు. నా తండ్రి మోహన్ బాబు గారు, విజయ్, వినయ్ గారు నా వెన్నంటే ఉండి అంతా చూసుకున్నారు. కన్నప్ప కోసం మా టీం పడినంత కష్టాన్ని నేను అయితే పడలేదు. నా నలుగురు పిల్లలు ఈ చిత్రంలో నటించారు. ఓ తండ్రిగా నా పిల్లల్ని తెరపై చూడటం ఆనందంగా ఉంటుంది. నా పిల్లలు ఆర్టిస్టులు అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ వాళ్లు ఏం అవుతారో చూద్దాం. అసలు ‘కన్నప్ప’ ఈ రేంజ్ పాజిటివిటీతో వస్తుందని ఒకప్పుడు ఎవ్వరూ ఊహించలేదు. కర్ణాటకలో తెల్లవారు ఝామున రెండు గంటలకు ప్లాన్ చేశారు. కేరళలో పెద్ద ఎత్తున సినిమాను విడుదల చేస్తున్నారు. నా చిత్రం పది వారాల వరకు ఓటీటీలో రాదు. నా మీద రిలీజ్ గురించి ఒత్తిడి లేదు. నేను అందరినీ గౌరవిస్తాను. ఏ కమ్యూనిటీని కించపర్చాలని కూడా అనుకోను. ఈ చిత్రంలో ఎవ్వరినీ ఎక్కడా కూడా అగౌరవపర్చలేదు. దేవుడు, భక్తుడికి మధ్యలో ఎవ్వరూ ఉండాల్సిన పని లేదు, మూఢ నమ్మకాలు అవసరం లేదు అని చెప్పడమే ఈ చిత్రం ఉద్దేశం. దేవుడి మీద మనసారా భక్తి ఉంటే చాలు అని చెప్పాలని అనుకున్నాం. ‘కన్నప్ప’ స్క్రిప్ట్ మీదున్న నమ్మకంతోనే ఇంత బడ్జెట్ పెట్టి, రిస్క్ చేసేందుందుకు ముందుకు వచ్చాం. ఈ చిత్రంలో మోహన్‌లాల్ గారి పాత్ర చాలా సర్ ప్రైజింగ్‌గా, షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది. ‘కన్నప్ప’ కథ కల్పితం కాదు. కన్నప్ప ఉన్నారు.. ఇప్పటికీ ఆయన్ను ఆరాధిస్తుంటారు. మళ్లీ చెబుతున్నాను ‘కన్నప్ప’ కల్పితం కాదు.. చరిత్ర.. మన చరిత్ర. మన మధ్యలో జీవించినవాడు’ అని అన్నారు.

*ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ* .. ‘నేను ఇంత వరకు కన్నప్ప గురించి ఎంతో చెప్పాను. మోహన్ బాబు గారు, విష్ణు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. మేం కన్నప్ప చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించాం. ఇక ఇప్పుడు మేం మా పనికి తగ్గ ప్రతిఫలం వస్తుందా? అని ఎదురుచూస్తున్నాం. మేం ఆడియెన్స్ ఇచ్చే ఫలితం కోసం వెయిట్ చేస్తున్నాం. కన్నప్ప గురించి ఇప్పటి తరానికి ఎక్కువగా తెలియదు. భక్తి, దేవుడు అనే వాటి మీద నమ్మకం లేని వ్యక్తి.. చివరకు గొప్ప శివ భక్తుడిలా ఎలా మారాడు? అన్నది ప్రపంచానికి తెలియజేయాలని ఈ ‘కన్నప్ప’ సినిమాను తీశాం. ఇందులో ప్రతీ పాత్రకు అందరూ ప్రాణం పెట్టి నటించారు. పూర్తి నిర్మలమైన మనసుతో సినిమాను చూడండి. మీరిచ్చే తీర్పుని గౌరవిస్తాను’ అని అన్నారు.

*కెమెరామెన్ షెల్డన్ చౌ మాట్లాడుతూ* .. ‘‘కన్నప్ప’ చిత్రం అద్భుతంగా వచ్చింది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లోని చివరి గంట గొప్పగా వచ్చింది. క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది’ అని అన్నారు.

*శివ బాలాజీ మాట్లాడుతూ* .. ‘భూమ్మీద అతి సుందరమైన ప్రదేశంలో(న్యూజిలాండ్) షూటింగ్ చేశాం. ప్రస్తుతం సినిమా మీద పూర్తిగా పాజిటివిటీ ఏర్పడింది. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి సినిమాలు చేయడం, నిర్మించడం అంత ఈజీ కాదు. నేను కన్నప్ప చిత్రాన్ని ఆల్రెడీ చూశాను. ఒట్టేసి చెబుతున్నా సినిమా అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు.

*నటుడు కౌశల్ మాట్లాడుతూ* .. ‘మా ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న రాబోతోంది. మన తెలుగు వాళ్లకు దాదాపు మళ్లీ 50 ఏళ్ల తరువాత కన్నప్ప చిత్రాన్ని ఈ తరానికి తగ్గట్టుగా విష్ణు అందిస్తున్నారు. విజువల్ వండర్‌గా, గ్రాండియర్‌గా ఈ మూవీని నిర్మించారు. ప్రస్తుతం ఉన్న తరమంతా కూడా కన్నప్ప చిత్రాన్ని చూడాలి’ అని అన్నారు.

Actor and producer Vijay Antony’s ‘Maargan’ Movie Pre-Release event held grandly

విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు  సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27న సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఈ సందర్భంగా మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ అనే ఓ ఈవెంట్‌ను చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

*సురేష్ బాబు మాట్లాడుతూ* .. ‘విజయ్ ఆంటోని గారిని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాను. ఆయనకు సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. నేను అలాంటి వారు తీసే చిత్రాల్ని చూసేందుకు ఇష్టపడుతుంటాను. అందుకే నేను ‘మార్గన్’ మూవీని తీసుకుని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఆయన ప్రొడక్షన్ కంపెనీ, వాల్యూ, మేకింగ్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం.’ అని అన్నారు.

*విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ* .. ‘మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారికి చాలా ధన్యవాదాలు. ఆయన చాలా గొప్ప నిర్మాత. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాను. ఆయన మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా మొదటి సక్సెస్. లియో జాన్ పాల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు. ఇందులో చాలా లేయర్లు ఉంటాయి. నేను కంటెంట్ గురించి ఎక్కువ మాట్లాడితే కథ రివీల్ అవుద్ది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంగేజింగ్‌గా ఉంటుంది. నేను ఈ సినిమాకు సంగీతాన్ని అందించాను. భద్రకాళి, లాయర్ చిత్రాలకు కూడా సంగీతాన్ని అందిస్తున్నాను. నేను ప్రస్తుతం ఆరేడు సినిమాల్ని నిర్మిస్తున్నాను. మా ‘మార్గన్’ ప్రస్తుతం తమిళ, తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. మా సిస్టర్ సన్ అజయ్ ధీషన్ బిచ్చగాడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అతడ్ని ఈ చిత్రంతో నటుడిగా పరిచయం చేస్తున్నాను. భాష్యశ్రీ గారి పాటలు, మాటల వల్ల ఇది పూర్తి తెలుగు సినిమాగా అనిపిస్తోంది. బ్రిగిడ, దీప్శిఖ గొప్పగా నటించారు. జూన్ 27న రాబోతోన్న మా ‘మార్గన్’ సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

*అజయ్ ధీషన్ మాట్లాడుతూ* .. ‘మా ‘మార్గన్’ మూవీ రేపు (జూన్ 27) రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్‌లా ఉండదు. ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. మా డైరెక్టర్ లియో జాన్ పాల్ నా మీద ఎంతో నమ్మకంతో అవకాశం ఇచ్చారు. నన్ను నమ్మి ఛాన్స్ ఇచ్చినా ఫాతిమా గారికి, విజయ్ గారికి థాంక్స్’ అని అన్నారు.

*బ్రిగిడ మాట్లాడుతూ* .. ‘మా మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ గారికి థాంక్స్. ‘మార్గన్’తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రతీ సారి తెలుగు ఆడియెన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. ఈ చిత్రంతోనూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జూన్ 27న మా ‘మార్గన్’ రాబోతోంది. అందరూ చూడండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని గారికి థాంక్స్’ అని అన్నారు.

*దీప్శిఖ మాట్లాడుతూ* .. ‘‘మార్గన్’ చిత్రంలో నా పాత్ర అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని గారికి, లియో జాన్ పాల్ గారికి థాంక్స్. మా సినిమాను సురేష్ బాబు గారు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ టీంతో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. మా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

*రైటర్ భాష్య శ్రీ మాట్లాడుతూ* .. ‘విజయ్ ఆంటోని గారితో నా ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 127 నిమిషాల నిడివితో రాబోతోన్న ఈ చిత్రం ప్రతీక్షణం ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. బ్రిగిడ, దీప్శిఖ, అజయ్ పాత్రలు అద్భుతంగా ఉంటాయి. నన్ను నమ్మి అవకాశం ఇస్తున్న విజయ్ ఆంటోని గారికి థాంక్స్. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

తారాగణం: విజయ్ ఆంటోని, అజయ్ ధీషన్, సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్

సాంకేతిక సిబ్బంది
రచయిత, దర్శకుడు: లియో జాన్ పాల్
నిర్మాత: విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్
ప్రెజెంట్స్: సర్వాంత్ రామ్ క్రియేషన్స్, జె.రామాంజనేయులు
సంగీతం: విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ: యువ ఎస్
ఆర్ట్ డైరెక్టర్: రాజా ఎ
PRO: సాయి సతీష్

‘The Fantastic Four: First Steps’ Trailer Released, Movie Releasing on July 25

The clock is ticking! With just one month left until release, Marvel Studios has unveiled the explosive trailer for The Fantastic Four: First Steps, setting the stage for the biggest cinematic battle of the year — Marvel’s First Superhero Family vs. the planet-devouring Galactus ahead of July 25, 2025 release.*

Set against a stunning 1960s-inspired retro-futuristic backdrop, the film introduces the new MCU lineup: Pedro Pascal as Reed Richards/Mister Fantastic, Vanessa Kirby as Sue Storm/Invisible Woman, Joseph Quinn as Johnny Storm/Human Torch, and Ebon Moss-Bachrach as Ben Grimm/The Thing. Their mission? Stop Galactus (Ralph Ineson), a cosmic force bent on consuming Earth, and face off against his powerful Herald, the Silver Surfer (Julia Garner). But saving the planet isn’t the only challenge; keeping their bond as a family intact may prove just as difficult. The action adventure also stars Paul Walter Hauser, John Malkovich, Natasha Lyonne and Sarah Niles. “The Fantastic Four: First Steps” is directed by Matt Shakman, produced by Kevin Feige and executive produced by Louis D’Esposito, Grant Curtis and Tim Lewis