Home Blog Page 960

This film might be titled a ‘Pitta Katha’ but I believe it has a big story :Koratala Siva

This film might be titled a ‘Pitta Katha’, but I believe it has a big story and immense content in it, said ace filmmaker Koratala Siva. It is already known that Bhavya Creations is bankrolling ‘O Pitta Katha’ and the title poster of the film is recently released by Trivikram. Chandu Muddu is is directing this feature film. Koratala Siva released the characters poster of the film today. addressing the gathering at the event,
Koratala Siva said, “This is an excellent title. they had given a glimpse of the characters through the first poster I strongly believe it has a big story and immense content. Just like the senior director Vamsi garu’s films in the past, Chandu has presented this film in such an excellent manner. Every visual of the film is heart-stealing. This movie will definitely win the hearts of Telugu audience this summer. I wish all the very best to the entire unit.”
The producer, V Anand Prasad said, “I felt the story was very exciting when Chandu narrated the story to me and we took it onto the sets with no delay. The film came out very well.”
 
Executive producer,  Anne Ravi  said, “This film has good comedy and thrilling elements. It has a gripping screenplay as well. We wrapped up the shoot and post-production is going on now. We will be releasing it this summer.”
 
The director,  Chandu Muddu   said, “This story takes place in a village and every scene is as pure as it has to be. It has gripping elements and equal dose of comedy. It keeps the viewers engaged till the rolling titles. It mainly runs on the screenplay.”
 
Cast:
 
Viswant Duddumpudi, Sanjay Rao, Nitya Shetty, Bramhaji, Balaraju, Srinivas Bhogireddy, Bhadradri, Ramana Chalkapalli, Sirisri, Surya.
 
Technicians:
 
Songs: Srijo, Arts: Vivek Annamalai
Editor: D Venkatprabhu
 Cinematographer: Sunil Kumar
Music:Praveen Lakkiraju
Executive producer: Anne Ravi
Producer: V Anand Prasad
Story, screenplay, direction: Chendu Muddu

Samantha Akkineni interview about Jaanu

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు.  ఈసంద‌ర్భంగా హీరోయిన్ సమంత అక్కినేనితో ఇంటర్వ్యూ…

‘జాను’ ప్రయాణం ఎలా అనిపించింది?
‘జాను’ సినిమాలో సినిమా అంతా ప్రధానంగా రెండు క్యారెక్టర్స్ మధ్యనే సాగుతుంది. ఇప్పటి వరకు చాలా పెద్ద సినిమాలు చేశాను. సీన్‌లో ముప్పై, నలభై మంది ఆర్టిస్టులతో పనిచేశాను. కానీ..వాటికి ఈ సినిమా పూర్తి భిన్నమైనది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ పెర్ఫామెన్స్ మెయిన్‌గా ఉంటుంది. రిస్క్ చాలా ఎక్కువ. మొత్తంగా చెప్పాలంటే ‘జాను’ గ్రేట్ టీమ్ ఎఫర్ట్. తొలిరోజునే నాకు ఏదో మేజిక్ జరుగుతుందని అర్థమైంది. ఆ మేజిక్ ప్రతిరోజూ కంటిన్యూ అయ్యింది. ఆ విధంగా చూస్తే జాను ఆల్రెడీ పెద్ద సక్సెస్ అయినట్లే. షూటింగ్ సమయంలో ప్రతిరోజూ బాగా ఎంజాయ్ చేశాను. నేను నా వంద శాతం ఎఫర్ట్ పెట్టాననిపించింది. రేపు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు కూడా ఆ మేజిక్‌ని ఫీల్ అవుతారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో త్రిషగారిని కలిశారా?
– లేదు… త్రిషగారిని కలవలేదు. సినిమా చూస్తున్నప్పుడు దిల్‌రాజుగారు ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నారని తెలియదు. ఓ ఆడియన్‌లా ‘96’ సినిమా చూశాను. విజయ్ సేతుపతి, త్రిష అత్యద్భుతంగా నటించారు. అందరూ విజయ్ సేతుపతిగారి గురించి  ఎక్కువగా మాట్లాడారు. కానీ.. నాకైతే ఇది త్రిషగారి సినిమా అనిపించింది. అప్పుడు ట్విట్టర్‌లో ఈ సినిమాను రీమేక్ చేయకూడదని కూడా రాశాను. అందుకనే నేను చాలా రోజుల వరకు రీమేక్ గురించి దిల్‌రాజుగారిని కలవలేదు. ఏవేవో కారణాలు చెబుతూ తప్పించుకున్నాను. అందుకు కారణం, దిల్‌రాజుగారు నన్ను వచ్చి అడిగితే నేను నో చెప్పలేనని నాకు తెలుసు.  ఆయన నన్ను రెండోసారి కలిసి సినిమా చేయమని అన్నప్పుడు చేస్తానని చెప్పాను. నిజంగా నేను ఓకే చెప్పకుంటే నా కెరీర్‌లో ఓ మంచి సినిమాను మిస్ చేసుకుని ఉండే దాన్నేమో. చాలా పశ్చాతాప పడేదాన్నేమో. పెర్ఫామెన్స్ పరంగానే కాదు..ఎలా చూసిన నా కెరీర్‌‌లో స్పెషల్ మూవీ.
త్రిష, సమంతలలో ఎవరు బాగా చేశారని భావిస్తున్నారు? ఎందుకు భయపడ్డారు?
– ఎవరు బాగా చేశారనేది ఇక్కడ ముఖ్యం కాదు. నేను త్రిషను కాపీ కొట్టాలనే ప్రయత్నించలేదు. నేను 96 సినిమాను ఒకసారి మాత్రమే చూశాను. తర్వాత చూడాలనుకోలేదు. ఆమె అద్భుతంగా నటించింది. ఆమె పెర్ఫామెన్స్‌ను కాపీ కొట్టాలని చూస్తే.. వర్కువుట్ కాదు. ‘జాను’ సినిమా కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుని నా తరహాలో నటించాను. డైరెక్టర్ ప్రేమ్ నా పెర్ఫామెన్స్ త్రిషతో పోల్చితే డిఫరెంట్‌గా ఉందని అన్నారు. రేపు సినిమా చూసిన వారు కూడా నేను డిఫరెంట్ వేలో చేశానని ఒప్పుకుంటారు. ఇంతకు రీమేక్ చేసిన ఓ బేబీ కొరియన్ సినిమా. కానీ ‘96’ తమిళ సినిమా. చాలా మంది చూశారు. క్లాసిక్ లవ్ స్టోరీ. అలాంటి లవ్ స్టోరీని రీమేక్ చేయడం చాలా కష్టం. కానీ ‘జాను’ విషయానికి వస్తే, తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టరే పనిచేశాడు. అదే డైరెక్టర్ అనడంతో నాకు నమ్మకం కలిగింది. యూత్‌కే కాదు.. అందరూ బాగా కనెక్ట్ అవుతారు. స్క్రిప్ట్‌ చాలా సార్లు చదివాను. జాను బ్యాక్ స్టోరీ ఏంటో కూడా డైరెక్టర్‌ని అడిగి తెలుసుకున్నాను. దాన్ని తెరపై తేవడానికి చాలా కష్టపడ్డాను. ఎంత వరకు వర్కవుట్ అయ్యుందో తెరపై చూడాల్సిందే. ప్రతి సీన్ చేసే ముందు డైరెక్టర్‌తో డిస్కస్ చేసేదాన్ని.
శర్వానంద్ గురించి..?
– సినిమాలో మా పెర్ఫామెన్స్‌లే ప్రధానం. ఒకరి పెర్ఫామెన్స్ పై మరొకరి పెర్ఫామెన్స్ ఆధారపడి ఉంటుంది. బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ఒకరినొకరు ప్రొత్సహించుకున్నాం. రామ్ పాత్రలో శర్వా తప్ప మరొకరిని ఊహించుకోలేను. మరొకరు ఉండుంటే ఈ మేజిక్ రీ క్రియేట్ అయ్యేది కాదేమో.
వరుసగా పెర్ఫామ్నెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తున్నారు? మీ పైన మీరే భారం పెంచుకుంటున్నట్టు అనిపిస్తోందా?
– సవాళ్ళను ఎదుర్కొని పాత్రలు చేసినప్పుడే అవి ఆడియన్స్ హృదయాల్లో నిలిచిపోతాయి. అలాగే నేను ఈ రంగం లోకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది. ఇంకా రెండు మూడు సంవత్సరాలు మాత్రమే నటిస్తానేమో…కానీ దాని తర్వాత కూడా నా గురించి మాట్లాడాలి కదా. దాని కోసమే అలాంటి పాత్రలే చేస్తూ వస్తున్నాను. నా కెరీర్ స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఇప్పటివరకు నేను ఏ పాత్ర కూడా డబ్బు కోసం చేయలేదు. కేవలం పేరు కోసమే పని చేశాను. ఏ స్క్రిప్ట్ ఎంచుకున్న నా పాత్ర ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది మాత్రమే పరిగణలోకి తీసుకున్నాను. ఆతర్వాత డబ్బు ఆటోమాటిక్ గా వచ్చేసింది(నవ్వుతూ).
ఇటీవల ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ సమంత నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పింది. మీరు యంగ్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఈ జనరేషన్ హీరోయిన్స్ కి కూడా స్ఫూర్తి గా ఉండడం ఎలా అనిపిస్తోంది?
– చాలా సంతోషంగా ఉంది. మాములుగా హీరోయిన్ స్పాన్ చాలా తక్కువ అయినప్పటికీ కొంత మంది హీరోయిన్స్ ఎప్పటికి గుర్తుంటారు. అలాంటి వారిలో నేను ఒకరు అయినందుకు హ్యాపీ. కేవలం నటన అన్నదే కాదు ఇప్పటివరకు నేను చేసిన అన్ని సినిమాలలో నా ప్రవర్తన ద్వారా ఎవరైనా ఇబ్బంది పడ్డారా లేదా అన్నది కూడా నాకు ఇంపార్టెంట్. రివ్యూస్ ఏ కాదు నాతో పాటు ఉన్న టీమ్ మెంబర్స్ కూడా పాజిటివ్ గా ఉండాలి.
మంచి పెర్ఫార్మర్ అని పేరు వచ్చాక మంచి పాత్రలు వాటంతట అవే వస్తాయి అనుకోవచ్చా?
– తప్పకుండా.. ఎలాగంటే ‘రంగస్థలం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు. కానీ నేను ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు ఆ కథేంటి అన్నది నాకు పూర్తిగా తెలీదు. కేవలం నా పాత్ర గురించి మాత్రమే తెలుసుకున్నాను. అలాగే కమర్షియల్ సినిమాలకి విభిన్నంగా ‘ఈగ’ లాంటి సినిమాలు చేశాను. అది అప్పుడు నేను పెట్టిన ఇన్వెస్టిమెంట్ దాని ఫలితమే ఇలాంటి రోల్స్ అంటే సమంత చేస్తుంది అని నాకొస్తున్న మంచి పాత్రలు. అందుకే ప్రతి పాత్రకి నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నాను.
ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ ఇంకా రెండు మూడు సంవత్సరాలు అన్నారు..రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారా?
– రిటైర్మెంట్ అని కాదు కానీ చాలా పాత్రలు చేశాను. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ కావాలి.
ఈ విషయంలో చైతన్య సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది?
– చైతన్య నాకు పది సంవత్సరాలుగా తెలుసు. మేము ఇద్దరం ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ అన్ని విషయాలలో సపోర్టింగ్ గా ఉంటాం.
ఈ సినిమా రీమేక్ చేస్తున్నార‌న్నప్పుడు చైతన్య ఏమన్నారు?
– మేము ఇద్దరం కలిసే ఈ సినిమా చూశాం. అప్పుడే ఈ సినిమాను రీమేక్ చేయకూడదు అనుకున్నాం. కానీ ఇప్పుడు టీజర్. ట్రైలర్ చూసి మా అభిప్రాయం కొంత మారింది. కానీ సినిమా విడుదలైన తర్వాత పూర్తిగా నమ్ముతారు. ఆ మ్యాజిక్ మళ్ళీ రీ క్రియేట్ అయింది.
మీ పెర్ఫామెన్స్ ప‌రంగా అప్రిషియేషన్స్ రాక‌పోతే ఫీల్ అవుతుంటారా?
– 100 శాతం ఫీల‌వుతాను. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో వంశీ పైడిప‌ల్లిగారు  చెప్పిన‌ట్లు ప్ర‌తి సినిమాను నా తొలి సినిమాగా భావిస్తాను. ఆసినిమా పోతే..  నా కెరీర్ అయిపోతుంద‌ని భావిస్తుంటాను. ఉదాహ‌ర‌ణ‌కు ఓబేబీ రిలీజ్ అప్పుడు కూడా చాలా టెన్ష‌న్ ప‌డ్డాను. సినిమా టాక్ వ‌చ్చిన త‌ర్వాత నేను డిస్ క‌నెక్ట్ అయిపోతాను.
హీరోయిన్‌గా యాక్ష‌న్ ఓరియెంటెడ్ రోల్ చేసే అవ‌కాశ‌మేమైనా ఉందా?
– ఇప్పుడు ఫ్యామిలీ మేన్ సీజ‌న్ 2 వెబ్ సిరీస్‌లో న‌టించాను. దాంట్లో కొత్త స‌మంత‌ను చూస్తారు. బాగా ట్రైనింగ్ తీసుకున్నాను. చాలా క‌ష్ట‌ప‌డ్డాను. యాక్ష‌న్ సీక్వెన్స్‌లో న‌టించాను. అది చేసేట‌ప్పుడు హీరోలు ఇంత క‌ష్ట‌ప‌డి ఫైట్స్ చేస్తున్నారా? అనిపించింది. ఒక సీన్‌లో కూడా డూప్‌ను పెట్టుకోలేదు. నేనే స్వ‌యంగా చేశాను. క్ర‌మాగా అనే ఫైట్ మాస్ట‌ర్ దగ్గ‌ర యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను శిక్ష‌ణ తీసుకున్నాను.
వెబ్‌సిరీస్‌లో ఏదైనా స‌ర్‌ప్రైజ్ ఉంటుందా?
– ఉండొచ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని యాక్ష‌న్‌, నెగ‌టివ్ రోల్‌లో న‌న్ను చూస్తారు.
బాగా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటున్నారుగా?
– నేను ప్ర‌మోష‌న్స్ చేస్తే ప‌ది మంది టికెట్స్ కొంటారంటే.. నేను టూర్స్‌కెళ్లైనా ప్ర‌మోష‌న్స్ చేస్తాను. ఎందుకంటే నా నిర్మాత నాపై న‌మ్మకంతో సినిమా చేస్తున్నాడు.  సినిమా స‌క్సెస్ మీట్‌కైనా రాక‌పోవ‌చ్చునేమో కానీ.. సినిమా రిలీజ్ ముందు ప్ర‌మోష‌న్స్‌లో బ్యాక్‌స్టెప్ తీసుకోను.
మీరు..మీతో చ‌దువుకున్న స్నేహితుల‌తో ఇప్ప‌టికీ మాట్లాడుతుంటారా?
– స్కూల్ డేస్‌, కాలేజ్ డేస్‌లో నా స్నేహితుల‌తో ఇప్ప‌టికీ మాట్లాడుతుంటాను. నా సినిమాలు చూసి ఫోన్ చేస్తుంటారు.

Hero Jeeva interview about Stalin Movie

రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన జీవా హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `స్టాలిన్`. అందరివాడు ఉపశీర్షిక. నవదీప్ ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో నటించడం విశేషం. రతిన శివ దర్శకత్వంలో తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి. ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న భారీగా విడుదలకానున్న సందర్భంగా జీవా ఇంట‌ర్య్వూ..

తెలుగులో `స్టాలిన్`చిరంజీవి టైటిల్ తో రావ‌డానికి రీజ‌న్ఏంటి?
– త‌మిళ టైటిల్ `సీర్‌`. అంటే గ‌ర్జ‌న‌. `స్టాలిన్`అనేది చిరంజీవిగారి సినిమా టైటిల్ కూడా కావ‌డంతో మాకు ఆడియ‌న్స్ అటెన్ష‌న్ కూడా ఉంటుంద‌నుకుంటున్నాం. ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ పేరు కూడా స్టాలినే. `అంద‌రివాడు` అనేది ఉప శీర్షిక‌. `అంద‌రివాడు` కూడా చిరంజీవిగారి సినిమా టైటిలే. నిర్మాత చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్ అయి ఉంటార‌ని నేను ఊహిస్తున్నాను. ఇటీవ‌ల వ‌చ్చిన కార్తి `ఖైదీ`కూడా చిరంజీవిగారి టైటిలే. మా సినిమా కూడా అంత‌టి ఘ‌న‌ విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను.

ఈ సినిమా క‌థాంశం గురించి?
– ఓ గ్రామంలో కుటుంబంతో సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతున్న ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువకుడు ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కుంటాడు. అత‌ను ఎలాంటి స‌మ‌స్య‌లో చిక్కుకున్నాడు? ఈ స‌మ‌స్య‌కు మ‌హిళా సాధికారిత అంశం ఎలా లింక్ అయ్యింద‌న్న‌దే క‌థాంశం. కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. మ‌హిళ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై ద‌ర్శ‌కుడు చాలా ప‌రిశోధ‌న చేశాడు.
కుటుంబ‌మంతా క‌లిసి చిత్రం ఇది.

`స్టాలిన్` సినిమా ఏ జోన‌ర్‌లో ఉంటుంది?
-ఈ సినిమాలో యాక్ష‌న్, ఫ్యామిలీ సెంటిమెంట్‌, ఫ్రెండ్‌షిప్‌, ఎమోష‌న్స్ ఇలా అన్ని అంశాలు మిళిత‌మై ఉన్నాయి. మ‌హిళా సాధికార‌త వంటి సామాజిక అంశాల‌ను కూడా ప్ర‌స్తావించాం. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. యూత్ కెనెక్ట్ అయ్యే అంశాలు కూడా ఉన్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేందుకు వాణిజ్య అంశాల‌ను కూడా జోడించాం. ఈ సినిమాకు ప్రేక్ష‌కులు త‌ప్ప‌క రిలేట్ అవుతారు.

రంగం తర్వాత తమిళ్, తెలుగులో ఒకే రోజు విడుదలవుతున్న సినిమా కదా?
– అవును! నేను న‌టించిన `రంగం` సినిమాకు తెలుగులో మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. మ‌ళ్ళీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కావాల‌సిన అంశాల‌న్ని ఈ సినిమాలో ఉన్నాయి. తెలుగు నేటివిటీ, తెలుగు ప్రేక్ష‌కులును దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌, డైలాగ్స్ ఉంటాయి. అందుకే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చుతుంద‌ని గ్యారెంటీగా చెప్ప‌గ‌ల‌ను. ఆ న‌మ్మ‌కంతోనే ఈ సినిమాను త‌మిళంతో పాటు తెలుగులో కూడా ఒకే స‌మ‌యంలో విడుద‌ల చేస్తున్నాం.

తెలుగులో స్ట్ర‌యిట్ సినిమా ఎప్పుడు చేస్తారు?
– తెలుగు ప్రేక్ష‌కులు సినిమా ల‌వ‌ర్స్‌. కంటెంట్ బాగుంటే ఏ భాష సినిమానైనా ఆద‌రిస్తారు. నేను తెలుగు భాష‌ను అర్థం చేసుకోగ‌ల‌ను. త‌మిళంలో అయితే ఇంకా బాగా మాట్లాడ‌తాను. తెలుగులో స్ట్ర‌యిట్ సినిమా చేయ‌డానికి మంచి క‌థ కుద‌రాలి. రంగం త‌ర్వాత స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలు చేసే మ‌ని నాన్న‌గారు చెబుతూనే ఉంటారు. కానీ త‌మిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. మ‌న‌కు పూర్తిగా భాష తెలిసిన‌ప్పుడే మంచి క‌థ‌ల‌ను ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది. నాకు తెలుగు అంత‌గా రాదు. నేను త‌మిళంలో మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. ఈ ఏడాది మూడు త‌మిళ‌ సినిమాలు విడుద‌ల అవుతాయి. వాటిలొ `జిప్సీ` చిత్రానికి ప్యాన్ ఇండియా అప్పీల్ ఉంది.

త‌మిళ సినిమాల‌కు తెలుగులో మంచి ఆద‌ర‌ణ ల‌బిస్తోంది క‌దా?
– తెలుగు సినిమా త‌మిళంలో విడుద‌లైనా, త‌మిళం సినిమా తెలుగులో విడుద‌లైనా ప్రేక్ష‌కుల‌నుండి మంచి స్పంద‌నే ల‌భిస్తోంది. సౌత్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ నార్త్‌లో వ‌ర్కౌట్ అవుతోంది. అక్క‌డి సినిమాలు ఇక్క‌డ కూడా ఆడుతున్నాయి. అల్లుఅర్జున్‌, బాహుబ‌లి సినిమాల‌కు జాతీయ‌స్థాయిలో మంచి గుర్తుంపువ‌స్తున్నాయి. ఎక్క‌డైనా మంచి కంటెంట్‌కు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు.

మీకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది క‌దా! మీ సినిమాలు రెండు భాష‌ల్లో ఎందుకు రీలీజ్ చేయ‌డం లేదు?
– తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా చేయాల‌ని నాకు ఉంది. అన్ని భాష‌ల సినిమాల‌ను అన్ని ప్రాంతాల యాక్ట‌ర్స్‌, ప్రేక్ష‌కులు చూస్తున్నారు. ఇప్పుడు నేను ర‌ణ్‌వీర్‌సింగ్ 83 సినిమాలో క్రికెట‌ర్ కృష్ణ‌మాచార్య పాత్ర పోషించాను. ఇది కేవ‌లం బాలీవుడ్ సినిమా కాదు. ఒక ప్యాన్ ఇండియా సినిమా. తెలుగు ప్రేక్ష‌కులు సినిమా ల‌వ‌ర్స్‌. అన్ని భాష‌ల సినిమాల‌ను ఆద‌రిస్తారు.

భ‌విష్య‌త్‌లో డైరెక్ట‌ర్ అయ్యే ఆలోచ‌న ఉందా?
– ప్ర‌స్తుతం యాక్ట‌ర్‌గా సంతోషంగానే ఉన్నాను. భ‌విష్య‌త్‌లో డైరెక్ట‌ర్‌ని కావాల‌నుకుంటున్నాను. రైట‌ర్ కావాలంటే చాలా ఆలోచ‌న‌లు ఉండాలి. బాలీవుడ్‌, టాలీవుడ్ అని కాదు..టెక్నిషియ‌న్స్ అంద‌రూ బాలీవుడ్‌లో ఎక్కువ‌గా న‌టిస్తున్నారు. త‌మిళ యాక్ట‌ర్స్ తెలుగులో, తెలుగువారు త‌మిళంలో చేస్తున్నారు. ప్ర‌తిభ ముఖ్యం.

MS Raju’s new directional venture ”Dirty Hari” Re-Recording begins!!

Renowned Producer/Director MS Raju’s new directional venture “Dirty Hari” created a buzz in the T-town with its bold first look.
As per the insights from the movie team, Dirty Hari is said give everyone an unforgettable experience while watching its poetic cinematic narration with the blend of emotions to engage audience.
As the movie Post-production works are rolling up, director paced up the Re-Recording session with music director Mark K Robin at a popular studio.
Also, while speaking about the music, director MS Raju shared his nostalgic memory of working with KV Mahadevan in 1987 for his 1st film & continuing the journey with Raj Koti, introducing Devi Sri Prasad, working with Mani Sharma, Kamalakar, Chakri, Karthik Raja & now with Mark K Robin. He even added that he immensely loved the work of Mark K Robins for Awe, Mallesham & Agent Sai Srinivas Athreya and so decided to sign him in for his Dirty Hari.
Presented by Guduru Shiva Rama Krishna & Produced by Guduru Sateesh Babu & Guduru Sai Puneeth under SPJ creations banner, Dirty Hari Teaser & Release date are expected to be announced soon.

Grand Pre Release Event of Savaari

నందు, ప్రియాంకా శర్మ జంటగా నూతన దర్శకుడు సాహిత్ మోత్కూరి రూపొందించిన ‘సవారి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి హోటల్ దసపల్లా కన్వెన్షన్స్ లో కన్నుల పండుగగా జరిగింది. ఈ చిత్రాన్ని కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదలవుతోంది. చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రి రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా విచ్చేసి, సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపి, ‘సవారి’ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆకాక్షించారు. ‘సవారి’ బిగ్ టికెట్ ను హీరోలు కార్తికేయ, విష్వక్ సేన్ సంయుక్తంగా లాంచ్ చేశారు. ఇద్దరూ రూ. 10 వేలకు టికెట్లను కొనుగోలు చేశారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ
, “చాలా రోజుల క్రితమే ఈ సినిమా చూశాను. చాలా పర్ఫెక్టుగా తయారైంది. ఒక డైరెక్టర్ కి మంచి ఆర్టిస్టులు దొరికితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో హీరోగా నందు చూపించాడు. అతని నటన చూసి నేను చాలా ఆశ్చర్యపోయా. అలాగే హీరోయిన్ ప్రియాంకా శర్మ నటన కూడా నన్ను ఆశ్చర్యపరిచింది. బెస్ట్ యాక్ట్రెస్ అనిపించింది. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చిన అన్ని పాటలూ బాగున్నాయి. కచ్చితంగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సాహిత్ పడ్డ కష్టానికి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, అతనికి డబ్బులు రావాలి” అని చెప్పారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ, “సవారి అనేది చాలా పెప్పీ టైటిల్. ఆ పేరు వినగానే చాలా బాగా అనిపించింది. ట్రైలర్ చూస్తే, సాహిత్ లో బాలీవుడ్ శైలి డైరెక్టర్ కనిపించాడు. పాయింట్ కొత్తగా ఉంది. నందు సూపర్ టాలెంటెడ్ యాక్టర్. తనకి చక్కటి అందం, ఒడ్డూ పొడుగా, ప్రతిభ అన్నీ ఉన్నాయి. ఇప్పుడతనికి బ్లాక్ బస్టర్ కొట్టే టైమొచ్చింది. ‘సవారి’తో అది అవుతుందని అనుకుంటున్నా. స్క్రీన్ మీద ప్రియాంక్ అద్భుతంగా ఉంది” అన్నారు.

నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ
, “నందు నాకు స్పెషల్ ఫ్రెండ్. అతనితో నాకు సన్నిహిత అనుబంధం ఉంది. ఇటీవల నేను చూసిన చక్కని సినిమా టీజర్, ట్రైలర్లలో ‘సవారి’ సినిమావి ఉన్నాయి. లిమిటెడ్ బడ్జెట్ లో ఇంత చక్కని ఫిల్మ్ తీసిన సాహిత్, అతని బృందానికి అభినందనలు. టీజర్, ట్రైలర్ చూసినప్పుడే వాటిలోని విజువల్స్ మన మైండ్ లో నిలిచిపోయేట్లు ఉన్నాయి. సాహిత్ డైరెక్షన్ లో కన్విక్షన్, కాన్ఫిడెంట్ కనిపిస్తున్నాయి. శేఖర్ చంద్ర పాటలతో ఇప్పటికే ఈ సినిమా విన్నర్ అయ్యింది” అని చెప్పారు.

కమెడియన్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
, “ట్రైలర్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది. నేను ‘ఇడియట్’లో అండర్ వేర్ తో నటించాక, మళ్లీ ఇప్పుడు నందు అలా నటించాడు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చిన ప్రతి సినిమా పాటలూ సిక్సరే. సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా” అన్నారు.
గేయరచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, “ఈ సినిమాకు హిట్ కళ కనిపిస్తోంది. సాహిత్ ఈ సినిమా కోసం అందర్నీ మోశాడు. ఆయన కృషికి కచ్చితంగా ఫలితం లభిస్తుంది. సినిమా హిట్టు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అన్నారు.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ, “ఇందులో శేఖర్ చంద్ర నాచేత పాడించిన పాట ఇవాళ ఎక్కడ దావత్ జరుగుతుంటే అక్కడ వినిపిస్తోంది. కాసర్ల శ్యామ్ చాలా బాగా దాన్ని రాశారు. నందుకు ఈ సినిమా బ్లాస్టింగ్ హిట్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ, “సినిమాలోని అన్ని పాటల్నీ సంగీతప్రియులు ఎంకరేజ్ చేస్తున్నారు. నేనిచ్చిన ట్యూన్స్ కి కాసర్ల శ్యామ్ రాసిన పాట చూసి దీనికి ఇంత కిక్ వస్తుందా అని నేనే ఆశ్చర్యపోయా. పూర్ణాచారి ఎంతో చక్కని మెలోడీ సాంగ్ రాశారు. సూఫీ సాంగ్ ను శ్రీరాం, సవారీ టైటిల్ సాంగ్ ను రామాంజనేయులు చాలా బాగా రాశారు. డైరెక్టర్ మంచి సందర్భాలు, మంచి కథ ఇవ్వడం వల్లే పాటలూ బాగా వచ్చాయి. సోషల్ మీడియాలో, ముఖ్యంగా టిక్ టాక్ లో ఈ సినిమా పాటలకు పెడుతున్న వీడియోలు చూస్తుంటే నాకు అవార్డులు తీసుకున్నంత ఆనందగా అనిపిస్తోంది.  సినిమా తప్పకుండా హిట్టవుతుందని ఆశిస్తున్నా. నందు ఇలా నటిస్తాడని నేను ఊహించలేదు” అని చెప్పారు.

డైరెక్టర్ సాహిత్ మోత్కూరి మాట్లాడుతూ, “ఈ సినిమాను మా అన్నయ్య సంతోష్, మా ఫ్రెండ్ నిషాంక్ ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. యు.ఎస్.లో ఈ సినిమా 25 స్క్రీన్స్ లో రిలీజవుతోంది. గత 25 రోజులుగా మా యూనిట్ మెంబర్స్ ఎవరూ నిద్రపోకుండా ఈ సినిమా కోసం కష్టపడుతూ వస్తున్నారు. మోనిష్ భూపతిరాజా సినిమాటోగ్రఫీ వల్లే విజువల్స్ ఇంత బాగా వచ్చాయి. షూటింగ్ పూర్తయిన దగ్గర్నుంచీ నాకంటే ఎక్కువగా ఎడిటర్ సంతోష్ పనిచేస్తూ వచ్చాడు. నేను సినిమా డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడే శేఖర్ చంద్రను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నా. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నందు ఒక అండర్ రేటెడ్ యాక్టర్ అని అనుకుంటున్నా. ఆడిషన్ చేసేవరకు తనలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలీదు. సీన్ ఇస్తే చింపేసేవోడు. స్క్రీన్ మీద తన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. తెలంగాణా యాసలో డైలాగ్స్ బాగా చెప్పాడు. తన పర్ఫార్మెన్స్ కు నేనైతే షాకైపోయి చాలా సార్లు క్లాప్స్ కొట్టాను. ఈ సినిమా తర్వాత తను ఇంకో స్థాయికి వెళ్తాడని గట్టిగా నమ్ముతున్నా. నా ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘బందం రేగడ్’లో చేసిన ప్రియాంక ఈ సినిమాతో తనదైన ముద్ర వేస్తుందని నమ్ముతున్నా. కొత్త ఫిలింలు రావాలని అందరూ అంటుంటారు. కచ్చితంగా ‘సవారి’ కొత్త కథతో వస్తున్న మూవీ. ప్రేక్షకులు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను. కచ్చితంగా హిట్ కొడతామని అనుకుంటున్నా. ఈ సినిమాను నైజాంలో ఏషియన్ ఫిలింస్ వాళ్లు, ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో సుధా శ్రీ పిక్చర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7న మా సినిమాని థియేటర్లలో చూడండి” అని చెప్పారు.

హీరోయిన్ ప్రియాంకా శర్మ మాట్లాడుతూ, “సాహిత్ గారు నా కెరీర్ లోని మోస్ట్ మెమరబుల్ ఫిలింస్ లో ఒకటిగా నిలిచే ‘సవారి’ని ఇచ్చారు. నందు చాలా సపోర్ట్ చేసే, ఎంకరేజ్ చేసే సహనటుడు. ఇలాంటి హీరో, డైరెక్టర్, టీం లభించినందుకు నేను చాలా లక్కీ. ఫిబ్రవరి 7న ఈ సినిమా చూసినవాళ్లు గర్వంగా ఫీలవుతారు” అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ, “నందు నటుడిగా చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. అతనిది స్ఫూర్తిదాయక ప్రయాణం. నేనొచ్చి ఒకటిన్నర ఏడాదే అయినా, ఏకొంచెం తేడా వచ్చినా భయమేస్తుంటుంది. పదేళ్ల నుంచి ఫైటింగ్ స్పిరిట్ తో నందు ముందుకెళ్తున్నాడు. అతని నుంచి ఆ స్పిరిట్ ను నేర్చుకోవాలనుకుంటున్నా. ‘ఆర్ ఎక్స్ 100’లో ‘పిల్లా రా’ సాంగ్ క్లిక్ అవడంతో అది హిట్టని అర్థమైపోయింది. అలాగే ఈ సినిమాలో రెండు పాటలు బాగా క్లిక్ అయ్యాయి. అంటే ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని రాసేసి ఉంది. ట్రైలర్ చాలా బాగా క్లిక్ అయ్యింది. సినిమాల్లో షర్ట్ తీసేస్తుంటావని సాధారణంగా నన్నందరూ వెక్కిరిస్తుంటారు. అందుకని షర్ట్ విప్పడం ఆపాను. కానీ ఈ సినిమాలో నందు షర్టు, ప్యాంటు కూడా తీసేశాడు కాబట్టి నేను మళ్లీ ధైర్యంగా షర్ట్ తీసేస్తా (నవ్వుతూ). ఈ సినిమా రిలీజయ్యాక సాహిత్ ను పెద్ద పెద్ద హీరోలు అడుగుతారు. అందుకని ముందుగానే అడుగుతున్నా, నాకు ఏదైనా స్క్రిప్ట్ ఉంటే చెప్పమని. ప్రియాంక అందంగా ఉంది, ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమాని చూస్తాను” అన్నారు.

హీరో విష్వక్ సేన్ మాట్లాడుతూ, “ఈ సినిమాకీ, నాకూ కొన్ని కనెక్షన్లున్నాయి. మొదటి కనెక్షన్ సాహిత్. మేం కలిసి పనిచేయాల్సి ఉండింది. కానీ నేను రెండు మూడు సినిమాల్లో స్టక్కయిపోయి ఉండటం వల్ల కుదరలేదు. తను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. నందు, నేను దిల్ సుఖ్ నగర్ బ్యాచ్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు తను జిమ్ కు వెళ్తూ సిక్స్ ప్యాక్ చేసేవాడు. ఇండస్ట్రీలో ఎవ్వరూ ఛాన్సులియ్యరు. మనమే తీసుకోవాలి. అల్రెడీ నందు తీసుకున్నాడు. నేనూ అట్లానే తీసుకున్నా. సాహిత్ కూడా ఎవరి దగ్గరా చెయ్యిచాపకుండా తన బ్రదర్, ఫ్రెండ్ తో కలిసి ఈ సినిమా చేశాడు. ఇలాంటి వాళ్లు తమ డబ్బుపెట్టి, తమ టాలెంట్ చూపించాలని గుడ్ ఇన్టెన్షన్ తో సినిమాలు తీస్తారు. మంచి ఇన్టెన్షన్ తో సినిమా తీసేవాడికెప్పుడూ తప్పు జరగదు. నేనూ అలాంటి ఇన్టెన్షన్ తోటే సినిమాల్లోకి వచ్చినా. చాలామంది విష్వక్ డబ్బులెక్కువయ్యి సినిమా తీశాడనుకుంటారు. అది తప్పు. చాలామంది దగ్గర కొంచెం కొంచెం డబ్బులు తీసుకుని, అందరికీ వాళ్ల డబ్బులు ఇచ్చేస్తే చాలనే ఇన్టెన్షన్ తో, ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూపిద్దామనే ఉద్దేశంతో సినిమా తీసినా. సాహిత్ కు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పట్నుండీ నందు ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటుంది. చాలామంది హీరోలతో పాటు చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. ఆ డైరెక్టర్లకు మనం అందుబాటులో ఉంటే చాలు. శేఖర్ చంద్ర మ్యూజిక్ కు నేను అభిమానిని. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు.

‘సవారి’ హీరో నందు మాట్లాడుతూ, “ఫిలిం నగర్ లో సెటిల్ అవనీకి బ్యాగ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. కార్తికేయ, విష్వక్ సేన్ అలా కంటెంట్ తో, దిల్ సుఖ్ నగర్ నుంచి వచ్చారు. నేనూ అక్కడ్నుంచి వచ్చినా. అర్హుడైన యాక్టర్ కు ఏదైనా రావాలంటే ఒక మంచి స్క్రిప్ట్ రావాలి. ఈసారి ఆ స్క్రిప్ట్ 100 శాతం వచ్చిందని పక్కాగా చెప్తున్నా. ఫిబ్రవరి 7న ‘సవారి’ రిలీజవుతోంది. ఈ సినిమాకి అసలైన హీరో సాహిత్. అసాధారణ స్క్రిప్ట్ రాశాడు. నందులో మంచి యాక్టర్ ఉన్నాడని, అతనికి చాన్స్ రావాలని చాలమంది అంటుంటారు. ఫైనల్ గా ఒకడు సాహిత్ రూపంలో ముందుకొచ్చి నాకు చాన్స్ ఇచ్చాడు. అతను నా దేవుని లెక్క. ఈ సినిమా హిట్టవుతుందని పక్కా చెప్తున్నా. సినిమా 2 గంటల 19 నిమిషాల రన్ టైమ్ వచ్చింది. షార్ప్ గా ఉంటుంది. చూసినోళ్లందరూ మెచ్చుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో చూసి స్పందించిన నాగచైతన్య, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, మంచు మనోజ్, సుకుమార్, సురేందర్ రెడ్డి గార్లకు చాలా థాంక్స్. మన సినిమా చూసి అందరూ మెచ్చుకోవాలని దేనికోసమైతే కలలు కంటున్నానో, ఎదురు చూస్తున్నానో అది ఈ సినిమాతో వచ్చిందనిపిస్తోంది. కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుందని ఈ సినిమా ట్రైలర్ ప్రూవ్ చేసింది. 100 పర్సెంట్ బ్లాక్ బస్టర్ మూవీతో మీ ముందుకు వస్తున్నాం” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నటులు వీరేన్ తంబిదొరై, శ్రీకాంత్ రెడ్డి, శివ, జీవన్, బల్వీందర్, మ్యాడీ, టీఎన్నార్, గేయరచయితలు పూర్ణాచారి, రామాంజనేయులు, సింగర్ నోయల్, ఎడిటర్ సంతోష్ మీనం తదితరులు మాట్లాడారు.

Hero Nikhil is going to marry Dr. Pallavi Varma

రీసెంట్ గా అర్జున్ సురవరం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు.. భీమవరం అమ్మాయి ని గోవా లో ప్రొపొజ్ చేసి తనని మెప్పించి పెద్దల్ని ఒప్పించి ఎక్కడైతే ప్రొపొజ్ చేసాడో అదే గోవా లో నిశ్చితార్థం చేసుకున్నాడు..

వివరాల్లోకి వెళితే డాక్టర్ పల్లవి వర్మ ని ప్రేమించిన నిఖిల్ అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు.. గోవా లో నిన్న (1st feb) పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు.. ఏప్రిల్ 16 న వివాహం చేసుకోబోతున్నాడు.. అర్జున్ సురవరం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత నిఖిల్ పెళ్లి కొడుకు కావటం శుభసూచకం..

Stalin Audio launch

జీవా. నటించిన తాజా చిత్రం పేరు స్టాలిన్. దీనికి అందరివాడు ఉపశీర్షిక. జీవా సరసన రియా సుమన్ నాయికగా నటించింది.మరో కథానాయకిగా గాయిత్రి కృష్ణ కనిపిస్తుంది. ప్రముఖ తెలుగు హీరో నవదీప్ ఇందులో విలన్ పాత్రలో నటించడం ఓ విశేషం. రతిన శివ దర్శకత్వం వహించారు. తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులోఅందిస్తున్నాయి. ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న ఒకే రోజున ఈ చిత్రం భారీగా విడుదలకానున్న సందర్భంగా ‘స్టాలిన్’ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది గా విచ్చేసిన రాంగోపాల్ వర్మ బిగ్ సిడి ని ఆవిష్కరించారు* .

*అనంతరం రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ* …స్టాలిన్ అనే వర్డ్ నాకు ఫేవరేట్ వర్డ్.ఈయన ఒక రష్యన్ డిక్టేటర్,తరువాత చిరంజీవిగారి స్టాలిన్,మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత వింటున్నాను.ట్రైలర్ బాగుంది.జీవా చాలా ఈజీ గా నటించాడు.. ఇందులో నవదీప్ విలన్ గా చేస్తున్న లుక్ డీఫ్రెంట్ గా ఉంది.నాకు నీ గెటప్ నచ్చింది.నాకు హీరోలకన్నా విలన్స్ అంటేనే ఇష్టం.అందుకే నాకు నువ్వంటే ఇష్టం..హీరోయిన్ రియా చక్కగా నటించింది.
దర్శకుడు సినిమాను బాగా హ్యాండిల్ చేసాడు.నట్టి ఫామిలీ కు,వేల్స్ శ్రవణ్ కు ఈ మూవీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

*జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ..* జీవా తండ్రి ఆర్.బి.చౌదరి బ్యానర్ నుంచి రాజశేఖర్ కు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు.వారి ఫాథర్ పేరు నిలబెట్టాలని జీవా మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు.రంగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ మూవీ అంతకంటే పెద్ద హిట్ అవ్వాలి.ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం ఈజీ..ఎందుకంటే రాంగోపాల్ వర్మ గారు వచ్చారు.ఆయన వస్తే ఆటోమిటిక్ గా జనాల్లోకి వెళ్తుందని అన్నారు…

*హీరో జీవా మాట్లాడుతూ* …నాకు మొదటి నుండి తెలుగు ఆడియోన్స్ తో మంచి అనుబంధముంది.రంగం నుండి నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.ఆర్.జి.వి.సినిమాలంటే నాకు చాలా ఇష్టం.మా డాడీ ను అడిగాను,ఆర్.జి.వి గారి దగ్గర డైరెక్షన్ నేర్చుకోవాలని,ఆయన దగ్గర వర్క్ చేస్తే యాక్టింగ్ తో పాటు అన్ని నేర్చుకుంటాము.తర్వలో తెలుగులో స్ట్రెయిట్ మూవీ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము.ఈ సినిమా అందరి హార్ట్స్ ని టచ్ చేస్తుంది ఫామిలీ సెంటిమెంట్, ఫైట్ సీక్వెన్స్ తో పాటు ఆడియోన్స్ కు కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి.ఈ నెల 7 న 300 నుండి 400 థియేటర్స్ లలో విడుదలవుతున్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని అన్నారు..

*హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ..* నేను తెలుగు లో చేస్తున్న మొదటి సినిమా ఇది.ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అన్నారు..

నటుడు నవదీప్ మాట్లాడుతూ* .. 5 సంవత్సరాల క్రిందట జీవా తమిళ్ నుండి తెలుగు లోకి డబ్ చేసిన రంగం సినిమా లోని పాటలు వస్తే ఇప్పటికి ఈలలు వేస్తారు. సినిమా బాగుంటే తెలుగు ఆడియోన్స్ కు తెలుగు,తమిళ్ అనే బేధం లేకుండా అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తారు.ఇందులో మంచి సోల్ ఉంటుంది.ఈ రోజు గర్ల్స్ సొసైటీ లో ఎలా ఉండాలో అనే పాయింట్ కూడా ఇందులో ఉంటుంది.మొదటి సారి ఫుల్ లెంగ్త్ విలన్ గా నటిస్తున్నాను అందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

చిత్ర దర్శకుడు రతిన శివ మాట్లాడుతూ* ..ఇది తమిళ్ మూవీ అయినా మేము తెలుగు ఆడియోన్స్ ను దృష్టి లో పెట్టుకొని రాసుకొన్నాను.ఇందులో మంచి సోషల్ మెసేజ్ ఉంది.తెలుగు ఆడియోన్స్ కు ఈ మూవీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు..

టి. అంజయ్య మాట్లాడుతూ** …నట్టికుమార్ నాకు గత 20 సంవత్సరాలుగా పరిచయం ఉంది.ఆర్.జి.వి గారితో సక్సెస్ ఫుల్ గా రెండు సినిమాలు చేసాం..ఈ స్టాలిన్ అనే టైటిల్ నా ఫ్రెండ్ బ్లాక్ చేసి పెట్టాడు.అయితే నట్టికుమార్ ఒక్క ఫోన్ చేసి అడిగిన వెంటనే ఆయన మీద ఉన్న అభిమానంతో వెంటనే తీసుకొమ్మని క్లియరెన్స్ ఇచ్చాడు.నట్టి ఫామిలీ కు ఈ సినిమా పెద్ద విజయం చేకూరాలని అన్నారు..

చిత్ర నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతిలు మాట్లాడుతూ.* .మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు.మమ్మల్ని నమ్మి మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా డాడీ కు కృతజ్ఞతలు..ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న విడుదలవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని అన్నారు..

*నట్టికుమార్ మాట్లాడుతూ* ..మంచి పాయింట్ తో ఈ చిత్రాన్ని తీశారు..అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో భారీగా విడుదల చేస్తున్నామని అన్నారు.

వేల్స్ శ్రవణ్,నటీనటులు శివ బాలాజీ, మధుమిత,వరుణ్, దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సంగీతం: డి.ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ: ప్రసన్నకుమార్, నిర్మాతలు: డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, దర్శకత్వం: రతిన శివ

Degree college Pre Release Event

శ్రీ లక్ష్మీ నరశీంహ సినిమా పతాకంపై వరుణ్, దివ్య రావు జంటగా నరశింహనంది స్వీయ దర్శకత్వం లో రూపొందించిన చిత్రం డిగ్రీ కాలేజ్.ఈ నెల 7 న ఈ చిత్రం విడుదల అవుతుంది. కాగా డిగ్రీకాలేజ్ ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్ లో ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ,నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ లు ముక్యా అతిధులు గా వచ్చి ఈ చిత్రము యోక్క ట్రైలర్ ను లాంచ్ చేసారు.*

*అనంతరం, సి కళ్యాణ్ మాట్లాడుతూ* – ఈ సినిమా లో రొమాన్స్ మోతాదుకు మించి ఉన్నా.. ఇందూలో ఏదో పాయింట్ ఉనట్లూ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. నరసింహ నంది కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తాడు, కులాలాను కుడా ఇందులో టచ్ చెసినట్లు ఉన్నాడు .డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు గారు సినిమా బాగుంటేనే తీసుకుంటాడు. అలాంటిది అతను ఈ సినిమాను తన బుజాలపైన వెసుకోని. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుంది అని అర్థమవుతుంది. ఈ సినిమా ద్వారా చిత్ర యూనిట్ కు,నరసింహ కు మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని సినిమాలు చెయ్యాలని అన్నారు.

*మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ* – నేను, తమ్మారెడ్డి భరద్వాజ ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాచ్‌మేట్స్.సినిమా అంటే చైతన్యమ్, వినోదం, విజ్ఞానం,స్ఫూర్తిదాయకం ఉందని మెము బావిస్తున్నాము. ఈ సినిమా లో వినోధం ఎక్కువ ఉన్నా అది సినిమా లో కథను దృష్టిలో పెట్టుకొని తీశామన్నాడు దర్శకుడు.నేను గత 30 సంవత్సరాలుగా సినిమాలు చూడలేదు.అంతకు ముందు అప్పుడప్పుడు సినిమాలు చూసేవాడిని .నేను 1951 లో నేను చూసిన మొదటి సినిమా రోజులు మారాయి.అది కూడా ఆ సినిమా 100 వ రోజున 6 అణాల టికెట్ ను 9 అణాలకు కొని చూసాను.దేశంలో తెలుగు సినిమాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.అందులో అత్యంత
ఎక్కువ సినిమాలు హైదరాబాద్ లోనే తీస్తున్నారు. ఆస్కార్ అవార్డు వచ్చిన ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా ను కూడా హైదరాబాద్ లో 90% షూటింగ్ చేశారు.కాబట్టి ప్రతిభకు అవకాశాలు కలిపిస్తే నాన్యతకు,సందేశాలను అవకాశం ఏర్పడుతుంది.ప్రతిభకు అవకాశం ఇవ్వడమే ఈ సినిమా యొక్క గొప్పతనం.ఏ సందేశం తోనో,స్ఫూర్తి తో సినిమా తీశారో ..చూసే ప్రేక్షకుడికి వినోదంతో పాటు చైతన్య స్పూర్తి కూడా జోడిస్తే బాగుంటుంది.ఈ చిత్రం ద్వారా చిత్ర యూనిట్ తోపాటు దర్శక,నిర్మాతలకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు.

*తమ్మ రెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ* …ఈ చిత్ర ట్రైలర్స్ యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.దర్శకుడు యూత్ ని ఆకర్షించే సీన్స్ బయటపెట్టి అసలు కథను దాచిపెట్టాడు.సినిమాలో కంటెంట్ ఉంటే 100 రోజులైనా ఆడుతుంది.అలాంటి కంటెంట్ ను నమ్ముకొని తీస్తున్న నరసింహనంది కి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని అన్నారు..

*దర్శకుడు నరసింహనంది మాట్లాడుతూ* –ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసి 6 నెలలు అయింది.ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది, ఈ ట్రైలర్ చూసినా తరువాత
చాలామంది ఈ నరసింహనంది ఎవ్వరిని గూగుల్ లో సెర్చ్ చేశారు.“1940′ అనే సినిమా తీసి జాతీయ అవార్డు,నంది అవార్డ్ తెచ్చుకున్న దర్శకుడైన మీరు ఎందుకు ఇలాంటి సినిమా తీశారని చాలా డిబేట్స్ లో ఛానెల్స్ వారు అడిగారు. అయితే ఈ సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఇందులోబలమైన కథ ఉంది, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కి నిజజీవితం లో జరిగిన యదార్థ సంఘటన విని ఉద్వేగనికి లోనై.. వారి ప్రేమ ఎక్కడ మొదలై, ఎక్కడ పూర్తయిందనే విషయాన్ని ప్రేక్షకులతో పంచు కోవాలని చెస్తున్న సినిమానే’ డిగ్రీ కాలేజ్.ఇందులో ఒక మంచి కంటెంట్ ఉంది.ఇందులో మోతాదుకు మించి సీన్స్ ఉన్నాకుడా..ఇందులో పెట్టిన ప్రతి సీన్ కథకు బలమైన కారణం ఉండే తీశాము. ఈ సినిమా ఎక్కడ తీశావు అని అందరూ అడుగుతున్నారు. ఇది 1 వ భాగం మాత్రమే, 2 వ భాగం లో షూటింగ్ ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియజేస్తాము. మా టీమ్ ఈ సినిమా కోసం 2 సంవత్సరాలు కష్ట పడ్డారు. ఈ సినిమాను 105 రోజులు షూట్ చేశాము.ఈ సినిమా రన్నింగ్ 16 గంటలు ఉంటే దాన్ని 8 గంటలకు మార్చి మా టీంకు చూయించాను,తరువాత అది 4 గంటలకు ఆతరువాత ఫైనల్ గా 2 1/2 గంటలకు చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు మొదటి భాగాన్ని
ఈ నెల 7 న విడుదల విడుదల చేస్తున్నాము.ఈ సినిమాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా.నాకు సహకరించిన ,నిర్మాతలకు, సాంకేతిక నిపుణులు, నటీనటులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

*హీరో వరుణ్ మాట్లాడుతూ.* ..-షార్ట్ ఫిల్మ్ తో నా ప్రయాణం ప్రారంభం అయింది. నరసింహ నంది సార్ తో నేను ఇంతకు ముందు “లజ్జ” సినిమా చేసాను, అయన దర్శకత్వంలో నేను 2 వ సినిమా చెస్తున్నాను.ఇది ఒక యదార్థమైన ప్రేమకథ. ఈ సినిమాలో నాతో పాటు నటించిన వారందరు నాకు ఫ్రెండ్లీ గా సహకరించారు. వారందరికీ నా కృతజ్ఞతలు అన్నారు..

*హీరోయిన్ దివ్య రావు మాట్లడుతూ* … డిగ్రీ కాలేజ్ అనేది సినిమా కాదు ఒక ఎమోషనల్ మూవీ .ఈ సినిమాలో నాకీ అవకాశమిచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

*ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ* .. నేను ఈ సినిమాను చూశాను,ఇందులో ఉద్వేగ భరితమైన స్టోరీ ఉంది.సినిమా నచ్చడంతో స్పందించి ఈ సినిమాను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చాను అని అన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో సహా నిర్మాత అలేటి శ్రీనివాసరావు, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు

*ఆర్టిస్ట్స్* :

హీరో-వరుణ్
హీరోయిన్-దివ్య రావు, దువ్వాసి మోహన్, జయవాని, ఆర్.కె, రవిరెడ్డి, అనిల్ మైవిలేజ్ షో, మదన్, శ్రీనివాస్, సలీం, మల్లేశ్ తెల్జేరి, చంద్రముఖి మువ్వల, యోగి భూచేపల్లి, వీర భద్రమ్.

*సాంకేతిక నిపుణులు*

సాహిత్యం-వనమాలి
సంగీత-సునీల్ కశ్యప్
D.O.P- S. మురళి మోహన్ రెడ్డి
ఆర్ట్స్-బాబ్జి. ఎడిటింగ్-వ్.నాగిరెడ్డి
కో-డైరెక్టర్-ఆర్.జాననికుమార్ రెడ్డి, దుద్దు గుంట మహేందర్‌రెడ్డి

లైన్ ప్రొడ్యూసర్స్ -కె .కిషన్, బద్దల హరిబాబు, రవి,ఎ. పుల్లయ్య

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్-ఎండి.సలీమ్, మల్లెష్ తెల్జేరి, పి.సుధాకర్ (లడ్డు), కొడుకు కనకయ్య.

అసోసియేట్ నిర్మాతలు-శ్రీలం శ్రీనివాస్ రెడ్డి

సహ నిర్మాతలు-ఆలేటి శ్రీనివాస్ రావు, బత్తుల కొండయ్య, రవిరెడ్డి

నిర్మాత-శ్రీ లక్ష్మి నరసింహ సినిమా

కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం-నరశింహ నంది

Dilraju interview about Janu

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజుతో ఇంట‌ర్వ్యూ…

రీమేక్‌ల‌కు మీరు వ్య‌తిరేక‌మా?
– రీమేక్ సినిమాలు చేయ‌కూడ‌ద‌ని కాదు.. దిల్ సినిమా నుండి స్క్రిప్ట్‌లో కూర్చునేవాడిని.  అలా ట్రావెల్ చేస్తే ఆ మేజిక్ బావుంటుంద‌ని నేను ఎప్పుడూ రీమేక్‌ల గురించి ఆలోచించ‌లేదు. మ‌ధ్య‌లో `ప్రేమ‌మ్‌`, `బెంగ‌ళూర్ డేస్` చిత్రాల‌ను తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకున్నాను. వాటిని చూసిన‌ప్పుడు ఎగ్జ‌యిట్ అయ్యాను. ముఖ్యంగా `బెంగళూరు డేస్` సినిమా రీమేక్ చేయ‌డానికి చాలా వ‌ర్క‌వుట్ చేశాను. అప్పట్లో నాని, శ‌ర్వా ఇద్ద‌రూ ఆ సినిమాలో చేస్తామ‌ని చెప్పారు. అయితే మూడో క్యారెక్ట‌ర్ ఎందుక‌నో మాకు శాటిస్పాక్ష‌న్‌గా అనిపించ‌లేదు. సరే! ఎందుక‌లే అని డ్రాప్ అయ్యాం. త‌ర్వాత `ప్రేమ‌మ్` చేద్దామ‌ని అనుకుంటే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నాగ‌వంశీ అన్నా! నేను రీమేక్ చేసుకుంటా అన్నాడు. స‌రేనని అప్పుడు కూడా కామ్ అయ్యాను. రీమేక్ చేయాలంటే ఎక్స్‌ట్రార్డిన‌రీ ఫీలింగ్ రావాలి. ఈ సినిమాను మ‌నం మిస్ అవ‌కూడ‌ద‌నే ఫీలింగ్ వ‌చ్చిన‌ప్పుడే రీమేక్ చేయాలి. యాదృచ్చికంగా ఈ ఏడాది మూడు సినిమాలు రీమేక్ చేస్తున్నాం. త‌మిళ `96` చిత్రాన్ని తెలుగులో `జాను`గా రీమేక్ చేస్తుంటే..తెలుగులో హిట్ట‌యిన జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్నాం. అలాగే హిందీ చిత్రం `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నాం. ఈ మూడు హార్ట్  ట‌చింగ్ మూవీస్‌. దేనికి అదే ప్ర‌త్యేక‌మైన సినిమా. `జాను` విష‌యానికి వ‌స్తే.. త‌మిళ చిత్రం `96` టీజ‌ర్‌ను చూడ‌గానే ఆస‌క్తిగా అనిపించింది. అప్ప‌టి నుండి నేను దాన్ని ఫాలో అవుతూ వ‌చ్చాను. మా నెల్లూరు డిస్ట్రిబ్యూట‌ర్ హ‌రి ద్వారా నిర్మాత‌ను సంప్ర‌దించాను. ప్రివ్యూ చూశాను. నేను, హ‌రి సినిమా చూశాం. నాకు త‌మిళంలో పెద్ద‌గా అర్థం కాదు.. కానీ సినిమా చూస్తున్న‌ప్పుడు నాకు విప‌రీత‌గా ఎక్కేసింది. థియేటర్ బ‌య‌ట‌కు రాగానే.. అక్క‌డే నిర్మాతతో మాట్లాడాను. తెలుగులో నేను రీమేక్ చేయాల‌నుకుంటున్నానని చెప్పాను. అలా సినిమా నాకు బాగా ఎక్కేసింది.
సినిమా అంత బాగా న‌చ్చ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణ‌మేమైనా ఉందా?
– ప్ర‌త్యేక‌మైన కార‌ణమేమీ లేదు. సినిమాలో ఫ్లో ఉంది. అద్భుత‌మైన సన్నివేశాలున్నాయి. అంతే కాకుండా.. చిన్న‌ప్ప‌టి ఫ్రెండ్స్‌, రీ యూనియ‌న్ అన‌గానే మ‌నం పాత రోజుల‌కు వెళ్లిపోతాం. సాధార‌ణంగా ల‌వ్, క్ర‌ష్ ఉంటుంది. అది బ్రేక‌ప్ అయిపోతుంది. ప‌ద‌వ త‌ర‌గ‌తి ప్రేమ అనేది ఎప్పుడూ స‌క్సెస్ కాదు. అలాంటి ప్యూరిటీ ఉన్న ప్రేమ‌క‌థ 96. అలాంటి ప్రేమ‌క‌థ ఉన్న‌వారంద‌రూ క‌నెక్ట్ అవుతారు. అదే చూసే ఎగ్జ‌యిట్ అవుతారు. ఇది తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అవుతుంద‌ని సినిమా చూస్తున్న‌ప్పుడే అనిపించింది.
రీమేక్ చేసేట‌ప్పుడు మాతృక‌లోని మేజిక్ క్రియేట్ అవుతుందో కాదోన‌నే టెన్ష‌న్ ఫీల‌య్యారా?
– నేను చేసిన మంచి పనేంటంటే త‌మిళ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమార్‌నే ఈ సినిమాకు తీసుకురావ‌డం. హ‌లోగురు ప్రేమ‌కోస‌మే కెమెరామెన్ విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి నేను 96 సినిమా చూడ‌టానికి చెన్నై వెళుతున్నాన‌ని తెలియ‌గానే.. ఆ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారు? మ‌న ఆర్య సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా ప‌నిచేశాడ‌ని చెప్పాడు. ప్రివ్యూ చూసిన‌ప్పుడు నిర్మాత‌తో పాటు డైరెక్ట‌ర్‌తోనూ మాట్లాడాను. మీకు ఆస‌క్తి ఉంటే తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పాను. త‌మిళంలో సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌తో క‌లిసి చూశాను. ఆ స‌మ‌యంలో డైరెక్ట‌ర్‌తో నువ్వు సినిమా చెయ్యాల‌ని అన్నాను.
రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది?
– నేను `96` రీమేక్ గురించి అనౌన్స్ చేయ‌గానే అదొక క్లాసిక్ ఎందుకు చెడ‌గొడుతున్నారంటూ చాలా మంది అన్నారు. హీరోల్లో నాని సినిమా చూసి సూప‌ర్బ్ మూవీ అన్నాడు. త‌ర్వాత సినిమాను బ‌న్నీకి చూపించాను. అప్ప‌టికి త‌మిళంలోనూ సినిమా రిలీజ్ కాలేదు. త‌ను సినిమా చూసొచ్చిన త‌ర్వాత క్లాసిక్ మూవీ అన్నాడు. అప్పుడు నాకు న‌మ్మ‌కం పెరిగింది.
రీమేక్ చేసే సంద‌ర్భాల్లో మీరెలాంటి టెన్ష‌న్ ప‌డ్డారు?
– త‌మిళంలో `96` సినిమాకు అప్రిషియేష‌న్‌తో పాటు అద్భుత‌మైన కలెక్ష‌న్స్ వ‌చ్చాయి. సినిమా ఆడియెన్స్‌కు ఎంత క‌నెక్ట్ అయ్యిందంటే చాలా మంది తెలుగు వాళ్లు కూడా ఈ సినిమా రింగ్ టోన్‌ను పెట్టుకున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ప్రేమ్‌తో డిస్క‌ష‌న్ చేస్తున్న‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టు ఐదారు పాయింట్స్ చేంజ్ చేస్తే బావుంద‌నుకున్నాం. అలాగే చేంజ‌స్ చేశాం. కంపేరిజ‌న్ వ‌స్తాయ‌ని.. స‌మంత అయితే భ‌య‌ప‌డింది. అలాగే శ‌ర్వాను కూడా ఒప్పించాను. ఈ సినిమాకు ఒక మీట‌ర్ ఉంది. కాబ‌ట్టి డైరెక్ట‌ర్‌ను మేకింగ్ ప‌రంగా ఎక్క‌డా తొంద‌ర‌పెట్టలేదు. సినిమాను ఓ హృద‌యంతో చూశాను. రేపు త‌మిళంలో సినిమాను చూసిన ఆడియెన్స్ కూడా అదే ఫీల్ అవుతారు.
త‌మిళంలో స‌న్నివేశాల‌ను తెలుగు మేకింగ్‌లో ఉప‌యోగించారా?
– లేదు.. ఫ్రెష్ సినిమా చేసిన‌ట్లు చేశాను. త‌మిళంలో చూసిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యానో.. తెలుగులో చూసిన‌ప్పుడు అలాగే ఫీ
స‌మంత గురించి ?
– ముందు `జాను`లో న‌టించ‌డానికి భ‌య‌ప‌డ్డ స‌మంత‌.. షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజుల త‌ర్వాత ప్ర‌తిరోజూ మేజిక్ జ‌రుగుతుందంటూ నాకు మెసేజ్‌లు పెట్టింది. మీరు న‌న్ను ఒప్పించ‌కుంటే.. నేను చాలా మిస్ అయ్యుండేదాన్ని అని కూడా చెప్పింది. స‌మంత‌, శ‌ర్వానంద్ ఇద్ద‌రూ  చిన్న‌వాళ్లేం కాదు.. సినిమాను ఓన్ చేసుకుని అద్భుతంగా న‌టించారు.
ఇప్పుడు రీమేక్ .. స‌్ట్ర‌యిట్ సినిమాల్లో ఏదీ చేయ‌డం సుల‌భ‌మ‌నుకుంటున్నారు?
– స్ట్ర‌యిట్ సినిమా చేయ‌డ‌మే సుల‌భం
డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ గురించి?
– సాధార‌ణంగా ఓ డైరెక్ట‌ర్ ఓ సినిమాను చేసిన త‌ర్వాత అదే సినిమాను మ‌రోసారి చేస్తున్న‌ప్పుడు అక్క‌డేం చేశాడు..ఇక్క‌డేం చేస్తున్నాడ‌ని చూస్తాం. ప్రేమ్ ఆ విష‌యంలో ఎలాంటి డిస‌ప్పాయింట్ కాలేదు. విజ‌య్ సేతుప‌తి ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్ఫామ‌ర్‌. శ‌ర్వానంద్ చాలా హ్యాపీ. స‌మంత ఎలాగూ చేస్తుందని…శ‌ర్వా విష‌యంలో ప్రేమ్ కాస్త టెన్ష‌న్ ప‌డేవారు. విజ‌య్ సేతుప‌తి మ్యాచ్ చేయ‌డం అంత సుల‌భం కాదు.. అయితే శ‌ర్వా క‌థ‌ను ఓన్ చేసుకుని అద్భుతంగా బాలెన్స్ చేశాడు. సినిమా చూసిన త‌ర్వాత త‌ను నాపై న‌మ్మ‌కంతో ఒక‌రోజు మాత్ర‌మే టైమ్ తీసుకుని సినిమాకు ఓకే చెప్పేశాడు.
త్రిష తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితురాలే క‌దా! ఆమెను ఎందుకు తీసుకోలేదు?
– నేను సినిమా చూస్తున్న‌ప్పుడు స‌మంతే గుర్తుకొచ్చింది. ఇక త‌మిళంలో చేసిన త్రిష‌తోనే మ‌ళ్లీ చేస్తే అందులో మేజిక్ ఏముంటుంది?. అందుక‌నే స‌మంత‌ను తీసుకున్నాను.
సంక్రాంతి సినిమాల గురించి చెప్పండి?
– ఈ సంక్రాంతి తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ గెలిచింది. ఎందుకంటే ఇద్ద‌రు స్టార్స్ క్రేజీ సినిమాలు ఒకేసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఇద్ద‌రు స్టార్స్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ప్పుడు ఇద్ద‌రూ హిట్ అవుతారు లేక‌పోతే యావ‌రేజ్ అవుతారు.. లేదా ఒక‌రే అవుతారు. కానీ ఈసారి సంక్రాంతి సినిమాలు ఇద్ద‌రు హీరోల‌కు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచాయి . రెండు సినిమాల‌కు సెన్సేష‌న‌ల్ ఫిగర్స్ వ‌చ్చాయి. స‌రైన సినిమాలొస్తే ఇలా ఉంటుందా? అని మాకే మైండ్ బ్లాక్ అయ్యాయి.
ప్ర‌భాస్ సినిమాకు `జాన్` అనే టైటిల్ విన‌ప‌డుతుందిగా?
– టైటిల్ విష‌యంలో ప్ర‌భాస్‌, యువీ క్రియేషన్స్‌కు స్పెష‌ల్ థ్యాంక్స్‌. నిజానికి మా సినిమాకు జాను అనే టైటిల్ పెట్టాల‌నుకున్న‌ప్పుడు.. వంశీని సంప్ర‌దించాను. తాను కాస్త స‌మ‌యం తీసుకున్నా..`జాను` టైటిల్‌ను పెట్టుకోమ‌ని అన్నాడు. వారి సినిమా రిలీజ్‌కు టైమ్ ఉంద‌ని వాళ్లు ఒప్పుకున్నారు. ప్ర‌స్తుతం వాళ్ల సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. అయినా ఇప్పుడు సినిమాకు నాలుగు వారాల లైఫే. ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత జాను సినిమా గురించి ప్రేక్ష‌కులు మ‌రిచిపోతారు. త‌ర్వాత వాళ్లు జాన్ అనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తే ప్రేక్ష‌కులు దాన్నే ఫాలో అవుతారు.  ఎందుకంటే అది ప్ర‌భాస్ సినిమా.
`పింక్‌` రీమేక్ గురించి?
– ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారితో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటే ఇప్ప‌టికి కుదిరింది. పింక్ సినిమాను రీమేక్ చేస్తున్నాం. ఈ సినిమా టైటిల్‌పై ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమాను మే 15న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. మే 11న గ‌బ్బ‌ర్ సింగ్ విడుద‌లైంది. కాబ‌ట్టి స‌మ్మ‌ర్‌లోనే రావాల‌ని అనుకుంటున్నాం. టైటిల్ విష‌యంలో అధికారికంగా ఏమీ అనుకోలేదు. ఉగాది టైటిల్‌ను అనౌన్స్ చేస్తాం. `వి` సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ప‌వ‌న్ సినిమా ప్ర‌మోష‌న్స్ గురించి ఆలోచిస్తాం. హిందీ, త‌మిళంలో చూసిన‌ట్టు కాకుండా సినిమాను మ‌రో కోణంలో చూపిస్తాం.
మ‌హేష్‌తో సినిమా ఎప్పుడు?
– వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్‌గారితో సినిమా ఉంటుంది. మ‌హేశ్‌గారు నెక్ట్స్ సినిమా అదే. స్క్రిప్ట్ రెడీ అవుతుంది. అంతా ఓకే అయిన త‌ర్వాత సినిమా టేకాఫ్ అవుతుంది.

Vijay Deverakonda World Famous Lover Trailer To Be Released On Feb 6

Youth sensation Vijay Deverakonda will next be seen in World Famous Lover which is all set for grand release on February 14th as Valentine’s Day special. Aishwarya Rajesh, Raashi Khanna, Catherine Tresa and Izabelle Leite are the heroines in the film directed by Kranthi Madhav and produced by KA Vallabha while KS Rama Rao presents it.

World Famous Lover Trailer date has been locked now. The makers will release the theatrical trailer of the film on February 6th at 4:05 PM, nearly a week days ahead of the theatrical release. In the announcement poster, Vijay Deverakonda and Aishwarya are seen dismayed.

Lead Cast: Vijay Deverakonda, Raashi Khanna, Aishwarya Rajesh, Catherine Tresa and Izabelle Leite.

Crew:

Story, Screenplay, Direction: Kranthi Madhav
Producer: K. A. Vallabha
Presenter: K. S. Rama Rao
Music: Gopi Sundar
Cinematography: Jaya Krishna Gummadi
Editing: Kotagiri Venkateswara Rao
Banner: Creative Commercials
PRO: Vamshi Shekar