Home Blog Page 961

PAYAL RAJPUT DONS A SPECIAL ROLE IN JAYANTH PARANJI’ Movie‘NARENDRA’

After the unprecedented success in her debut film ‘RX100’, Payal Rajput established herself as a performer with the Venkatesh – Naga Chaitanya starrer ‘Venky Mama’.

Payal now takes on an fascinating new avatar as a India’s first female fighter pilot in Director Jayanth Paranji’s new action slammer ‘Narendra’.
Is the Indian Air Force pilot’s courage and passion enough to combat the enemy as she tries to make her way across the border?

‘Narendra’ is a classic tale of prison break. Narendra, a retired Indian boxing champ is physically and emotionally tested as he makes a do or die attempt to escape from entrapment.

The Great Khali plays an Afghan prisoner, who sacrifices himself in his attempt to rescue the Indian prisoners. Izabelle Leite plays a human rights activist who supports their fight for
freedom.

Will the Indians achieve their last hope of freedom and fulfil their mission? Will the lie that the enemy has been secreting trigger their eventual downfall?

Jayant Paranji brings a refreshing new twist to an action thriller, having tasted phenomenal success with commercial cinema, it’s encouraging that Jayant reinvents himself to provide Telugu cinegoers with a story never seen before on Telugu screen.

Writer, Director: Jayanth C Paranji
Starring: Payal Rajput, The Great Khali, Izabelle Leite, Nilesh Eti
Music: Ram Sampath
Cinematographer: Viren Thambidorai
Produced by: Eshaan Entertainments
PRO: BA Raju

Shakeela Rasina Mottamodati Kutumba KathaChitram Movie Teaser Launch

ష‌కీల ప్రధానపాత్రధారిణిగా విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాత‌గా సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించిన  చిత్రం ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఆవిష్కరణ ఆదివారం ఫిల్మ్ చాంబర్లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో..

న‌టి షకీల మాట్లాడుతూ –
`’నేను నిర్మించిన ‘లేడీస్ నాట్ అలౌడ్’ సినిమా పది నెలలుగా సెన్సార్ అవడం లేదు. ఎంతో వల్గారిటీతో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ మా సినిమాకే సెన్సార్ వాళ్లు ఎందుకు అభ్యంతరాలు చెపుతున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ట్రిబ్యునల్ లో ఉంది. షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా.. ఫ్యామిలీ సినిమాలు చేయదా అనే విమర్శలున్నాయి. అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించడం కోసం కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా చేస్తున్నాను. షకీలా నిర్మాత అంటేనే సెన్సార్ ఇవ్వడం లేదు.. ఇది నేను రాసిన కథ అంటే ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో. కానీ ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స “ అన్నారు.
దర్శకుడు  సతీష్ వి.ఎన్ మాట్లాడుతూ  – ‘ కొత్తగా ప్రయత్నించాం. అన్ని వర్గాలకు నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఏప్రిల్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నాడు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ ‘గత చిత్రం ‘లేడీస్ నాట్ అలౌడ్’కి సహనిర్మాతగా పనిచేశాను. ఆ సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సాయిరాం దాసరి కొత్తగా ప్రయత్నించాడు. కచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం` అన్నారు
డిఓపి తరున్ కరామ్‌తోత్  మాట్లాడుతూ – సాయిరాంతో నాలుగు సినిమాలకు పని చేశా. ఈ చిత్రానికి మంచి డైలాగులు అందించడమే కాదు బాగా తెరకెక్కించారు. అందరినీ ఆకట్టుకుంది’అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మిత్ర, నటుడు హర్ష తదితరులు పాల్గొన్నారు.
 షకీలా, విక్రాంత్, పల్లవి ఘోష్, నల్లబెల్లి, తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
దర్శకత్వ పర్యవేక్షణ: సాయిరాం దాసరి,
దర్శకుడు: సతీష్ విఎన్,
నిర్మాత: సి హెచ్ వెంకట రెడ్డి,
సహ నిర్మాత: లండన్ గణేష్, ఆడియో గ్రాఫి: శ్రీ మైత్రా, ఎడిటర్: కెఆర్ స్వామి,
 డిఓపి: శ్యామ్ ప్రసాద్, తరున్ కరామ్‌తోత్‌.
పిఆర్ఒ: సాయి స‌తీష్.

Oka Chinna Viramam Movie Grand Release on February 14th

మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సందీప్ చేగురి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘ఒక చిన్న విరామం’. సంజయ్ వర్మ , గరీమ సింగ్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు, బిగ్ బాస్ కంటెస్టెంట్ పునర్నవి భూపాళం, నవీన్ నేని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం థ్రిల్లర్ కథాంశంతో ఉత్కంఠగా సాగుతుంది. ఒక మంచి సందేశం ఉన్న ఈ చిత్రం అందరూ కొత్త కళాకారులతో తెరకెక్కబడింది. రోడ్ ప్రయాణంలో సాగే కథ ఇది, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరో సంజాయ్ మాట్లాడుతూ….
ఇది ఒక థ్రిల్లర్ జానర్ లో వస్తోన్న సినిమా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. పునర్నవి, గరిమతో నటించడం హ్యాపిగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్న సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. అదే తరహాలో ఒక చిన్న విరామం సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.

ఆర్టిస్ట్ సన్నీ మాట్లాడుతూ...
కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతొంది. కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. డైరెక్టర్ సందీప్ డిఫరెంట్ గా తీసాడు, పునర్నవికి ఈ సినిమా మంచి బ్రేక్ వస్తుంది. సంజయ్, గరీమ, అల్విన్ ఇలా అందరూ బాగా చేశారు,

హీరోయిన్ గరీమ మాట్లాడుతూ
నేను ఈ సినిమాలో మంచి రోల్ చేశాను, మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్న. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని తెలిపారు

డైరెక్టర్ సందీప్ చేగురి మాట్లాడుతూ….
ఈ సినిమా ఎక్కువ నైట్ ఎఫెక్ట్ లో చేసాము, ఈ మూవీ ఎలా చేస్తాము అనే డౌట్ చాలా మందికి ఉండేది, కానీ సినిమా చాలా బాగా వచ్చింది. నైట్ షెడ్యూల్స్ ఉన్నా సరే అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాల్లో మా సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. ఫిబ్రవరి 14న మా సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి అన్నారు

హీరొయిన్ పునర్నవి మాట్లాడుతూ
బిగ్ బాస్ తరువాత మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ అన్నపూర్ణ స్కూల్ నుండి వచ్చిన వారు. కచ్చితంగా ఈ సినిమా ఒక కొత్త సినిమా అవుతుంది. భారత్ మచిరాజు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను ఈ సినిమాలో కథకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాను, డైరెక్టర్ సందీప్ మంచి కాన్సెప్ట్ తో వస్తున్నారని తెలిపారు.

నటీనటులు:
సంజయ్ వర్మ
నవీన్ నేని
పునర్నవి భూపాలం
గరిమ సింగ్
ఆల్విన్ బత్రం

దర్శకత్వం: సందీప్ చేగురి
కెమెరామెన్: రోహిత్ బెచు
మ్యూజిక్: భరత్ మాచిరాజు
ఎడిటర్: అస్వంత్ శివకుమార్
డిఐ & డబ్బింగ్: అన్నపూర్ణ స్టూడియోస్
టెక్నీకల్ హెడ్: సివి.రావు
కలరీస్ట్: వివేక్
ప్రొడ్యూసర్: సందీప్ చేగురి
ప్రొడక్షన్: మూన్ వాక్ ఎంటర్త్సైన్మెంట్స్

Crime,Thriller Movie “22” Teaser Launched by king Nagarjuna

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ’22’.  ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవ‌ల  డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ చేతుల‌మీదుగా  విడుద‌లైన హీరో ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను 2ఫిబ్రవరి2020న ఉద‌యం 8:59 నిమిషాలకు కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి ముఖ్య అతిథిగా పాల్గొని `22` మూవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కొండా కృష్ణం రాజు పాల్గొన్నారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “అందరికి ఎంతో ఇష్టమైన బి.ఎ.రాజు గారి, జయగారి అబ్బాయి శివ. జయగారు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి చాలా ఇష్టం. వాళ్ళిద్దరితో నేను బాగా క్లోజ్ గా ఉంటాను. జయగారు ఇప్పుడు మన మధ్య లేరు కానీ వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అవుతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆమె అందరికి బాగా తెలిసిన మహిళా దర్శకురాలు. శివ ద‌ర్శ‌కుడిగా జయగారి పేరు నిలబెట్టాలి. అలాగే  బి.ఎ.రాజు గారిది కూడా. రూపేష్ వెల్ కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ. బయట ఎన్నో సక్సెస్ ఫుల్ బిజినెస్ లు ఉన్నా సినిమా అంటే ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఇప్పుడే టీజర్  చూశాను. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ 22. టీజర్ విడుదలయింది 2-2-2020. అన్ని రెండులే ఉన్నాయి. న్యూమరాల‌జి ప్రకారం నాది కూడా రెండు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్” అన్నారు.

శివ ద‌ర్శ‌కుడిగా త‌ప్ప‌క స‌క్సెస్ అవుతాడు!!
సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ – శివ ద‌ర్శ‌కుడు కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఫ‌స్ట్ కాపీ కూడా వారం రోజుల్లో రెడీ అవుతుంద‌ని చెప్పాడు.  ఒక అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా నా వ‌ద్ద‌కు వ‌చ్చి ఓ సినిమా ప్రొస్ట్ ప్రొడ‌క్ష‌న్ అంతా హ్యాండిల్ చేశాడు. రాజుగారు ఎలా ఒక సినిమా స‌క్సెస్ అవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకొని క‌ష్ట‌ప‌డి  ప్ర‌మోష‌న్ చేస్తారో… అలా శివ కూడా చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. ద‌ర్శ‌కుడుగా స‌క్సెస్ కావ‌డానికి ఈ సినిమాతో ఒక మంచి ప్ర‌య‌త్నం చేశాడు. కొత్త‌గా  ద‌ర్శ‌కులు కావాల‌నుకునేవారు తొలుత ప్రేమ‌క‌థ‌ను తీయాల‌నుకుంటారు. కానీ శివ విభిన్నంగా ఆలోచించి ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌ను తీసుకుని ఇంత బాగా తీశాడంటే అత‌ని మెచ్యూరిటీ లెవ‌ల్ ఏంటో తెలుస్తోంది.  ఈ క‌థ‌ను న‌మ్మి, రూపేష్ హీరోగా న‌టించాడు. రూపేష్ కూడా చాలా హార్డ్ వ‌ర్క్ చేశాడ‌నిపిస్తోంది.  స‌లోనితో పాటు టీమ్ అంద‌రు బాగా చేశారు. టీమ్ అంద‌రికీ ఆల్‌దిబెస్ట్‌.అలాగే నాగార్జున‌గారు కొత్త‌వారిని ప్రొత్స‌హించ‌డంలో ఎప్పుడూ  ముందుఉంటారు. టీజ‌ర్ చూసి ఆయ‌న అంత మాట్లాడారు అంటే…రాజుగారిపై అభిమానం ఉన్న‌ప్ప‌టికీ టీజ‌ర్ ఆయ‌న‌తో మాట్లాడేలా చేసింది. నేను శివ చేసిన ఓ వెబ్‌సిరీస్ చూసి షాక్ అయ్యాను. టెక్నిక‌ల్‌గా  బాగా చేశాడు. ఒక‌ క‌థ రాసుకుని, ఇంత త‌క్కువ స‌మ‌యంలో దాన్ని స్క్రీన్‌మీద‌కు తీసుకురావ‌డం అంత సులువు కాదు. వి.వి.వినాయ‌క్‌గారు, నేను ఈ సినిమా లాంచ్ చేశాం. అప్పుడే ఈ సినిమా టీజ‌ర్ లాంచ్‌లో పాల్గొన‌డం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ద‌ర్శ‌కుడు ఇండ‌స్ట్రీకి చాలా అవ‌స‌రం. శివ ద‌ర్శ‌కుడిగా త‌ప్ప‌క స‌క్సెస్ అవుతాడు.  కో-డైరెక్ట‌ర్ పుల్లారావుగారు ఉంటే ఆ ప్రొడక్ట్ బాగా వ‌స్తుంది. ఆయ‌న సినిమాను సినిమాలాగే చూస్తారు చాలా సిన్సియ‌ర్‌గా వ‌ర్క్ చేస్తారు. ఇలాంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కులతో ప‌ని చేసే అవ‌కాశం శివ‌కు వ‌చ్చింది. ఈ సినిమాను ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాల‌నుకుంటున్నాను.  టీమ్ అంద‌రికీ ఆల్‌దిబెస్ట్‌“ అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ – “నాగార్జునగారు, పూరీ జ‌గ‌న్నాథ్‌గారు, మారుతిలాంటి ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులు ఈ సినిమాకు ముందుకొచ్చి శివ‌మీద వారికి ఉన్న‌ప్రేమ‌ను, న‌మ్మ‌కాన్ని తెలియ‌జేస్తుంటే శివ చాలా అదృష్ట‌వంతుడ‌నిపిస్తోంది. ఇంత‌మంది పెద్ద‌ల అశీస్సుల‌తో శివ‌కు, రూపేష్ గారికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవ్వాల‌ని, ఎంటైర్ యూనిట్‌కి ఈ ఇదొక  పెద్ద సినిమా అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

ఆదిత్య‌మ్యూజిక్ నిరంజ‌న్‌ మాట్లాడుతూ  – “రాజుగారు, జ‌య‌గారు మొద‌టి సినిమా నుంచి  మ‌మ్మ‌ల్ని ఆద‌రించి, వారి సినిమాల ఆడియో హ‌క్కుల‌ను మాకే ఇచ్చి మ‌మ్మ‌ల్ని ప్రోత్స‌హిస్తున్నారు. ఆ ప‌రంప‌ర‌ని అలాగే కొన‌సాగిస్తూ ఇప్పుడు వారి అబ్బాయి శివ‌గారు డైరెక్ట‌ర్‌గా రూపొందించిన ఈ సినిమా ఆడియో హ‌క్కుల‌ను కూడా మాకు ఇవ్వ‌డం చాలా సంతోషం. శివ‌గారికి జ‌య‌గారితో స‌హ మా అంద‌రి ఆశీస్సులు ఉన్నాయి. అలాగే బి.ఎ.రాజుగారు తోడుగా ఉన్నారు. భ‌విష్య‌త్‌లో ఇంకా మంచి సినిమాలు చేయాలి.  వీరి ప‌రంప‌ర ఇలాగే మాతోనే కొన‌సాగ‌ల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ల‌డానికి మాకు సాధ్య‌మైనంత స‌హాయం చేస్తామ‌ని స‌భాముఖంగా తెలియ‌జేస్తున్నాను“ అన్నారు.

కో డైరెక్ట‌ర్ పుల్లారావు కొప్పినీడి మాట్లాడుతూ  –  “శివ ఫ‌స్ట్ క‌థ చెప్పిన‌ప్పుడు ఎంత గొప్ప‌గా ఫీల‌య్యామో, సినిమాను కూడా అంతే గొప్ప‌గా తీశాడు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. టీజ‌ర్ అద్భుతంగా ఉంది. హీరోహీరోయిన్లు చాలా బాగా చేశారు. ఈ సినిమా త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుందని నేను పూర్తిగా న‌మ్ముతున్నాను.

హీరో రూపేష్‌కుమార్ చౌద‌రి మాట్లాడుతూ – ` మా అయి ఈ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లొగొ లాంచ్ కార్య‌క్ర‌మానికి మారుతిగారు వ‌చ్చి వారి ఆశీస్సులు  అందించారు. మ‌ళ్లీ ఈ సినిమా క్యాలెండ‌ర్ లాంచ్ చేసినందుకు మారుతిగారికి థ్యాంక్స్‌. నాగార్జున‌గారిచేతుల మీదుగా మా సినిమా టీజ‌ర్ లాంచ్ అవ‌డం  నెక్ట్స్ లెవ‌ల్ ఆనందంగా ఉంది“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు శివకుమార్‌ బి.మాట్లాడుతూ
– “నాగార్జున టీజ‌ర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రొత్స‌హించే నాగార్జున‌గారి చేతుల మీదుగా మా టీజ‌ర్ లాంచ్ కావ‌డం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంటైర్ 22టీమ్ త‌రఫున నాగార్జున‌గారికి థ్యాంక్స్‌. మారుతిగారు ఇటీవ‌ల ప్ర‌తిరోజూపండ‌గే సినిమాతో పెద్ద స‌క్సెస్ అందుకున్నారు. ఆ పండ‌గ‌ను ఈ పండ‌గ‌కి తీసుకువ‌చ్చారు. మా 22లో ఆ పండ‌గ జ‌రుగుతుంది. ఈ సినిమాకు ప‌ని చేసిన సాంకేతిక నిపుణులు అంద‌రికీ థ్యాంక్స్‌. కొండాకృష్ణంరాజుగారికి, మారుతిగారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. ఆడియో విష‌యంలో ఆదిత్య‌మ్యూజిక్ మాధ‌వ్‌గారు, నిరంజ‌న్‌గారు చాలా స‌పోర్ట్ చేశారు. క‌మ‌ర్షియ‌ల్‌గాకూడా ప్రొత్స‌హిస్తున్నారు. ఇప్పుడు ఈ టీజ‌ర్‌లాంచ్‌కి కూడా వారి స‌హ‌కారం అందించారు. క‌థ ప్ర‌కార‌మే 22 అనే టైటిల్ పెట్టాం. నాకు స‌పోర్ట్ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌“ అన్నారు.

హీరోయిన్ స‌లోని మిశ్రా మాట్లాడుతూ – ఇక్క‌డికి వ‌చ్చిన మారుతిగారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాలో భాగ‌మ‌వ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు కంఫ‌ర్ట్‌జోన్‌కు విభిన్న‌మైన మంచి పాత్ర ఇచ్చిన శివ‌గారికి థ్యాంక్స్‌. ఇదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. రూపేష్‌గారు బాగా న‌టించారు. ఈ సినిమా త‌ప్ప‌కుండా  ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది“ అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్  ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ -“ టీజ‌ర్ విడుద‌ల‌చేసిన నాగార్జున‌గారికి, ఇక్క‌డికి వ‌చ్చిన మారుతిగారికి  థ్యాంక్స్‌. మా సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. టీమ్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

ఆర్ట్ డైరెక్ట‌ర్ పెద్దిరాజు మాట్లాడుతూ  –  “సినిమా బాగా వ‌చ్చింది. మాకు సహాయం చేసిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

న‌టుడు కృష్ణ‌చైత‌న్య మాట్లాడుతూ – “టైటిల్ మాదిరిగానే సినిమా కూడా చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఈ సినిమాలో శివ నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. ఈ ఏడాదిలోనే నా కెరీర్‌లో ఇదొక బెస్ట్ క్యారెక్ట‌ర్‌ అని చెప్ప‌గ‌ల‌ను“ అన్నారు.

నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ – “ఎంతోమంది కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రొత్స‌హించి, వారు ఈ రోజు మంచి స్థాయిలో ఉండ‌టానికి కార‌ణ‌మైన నాగార్జున చేతులు మీదుగా టీజ‌ర్‌ను లాంచ్ చేయించాల‌ని వారిని క‌లిశాను. మా అబ్బాయి..శివ ఓ సినిమాను డైరెక్ట్ చేశాడు..అని చెబుతుండ‌గానే నాగార్జున‌గారు త‌ప్ప‌క లాంచ్ చేస్తాన‌ని ప్రోత్స‌హించి టీజ‌ర్ రిలీజ్ చేసి  ఆశీస్సులు అందించారు. అలాగే నాగ‌చైత‌న్య‌గారు ఆల్‌ది బెస్ట్ చెప్పారు.  డైరెక్ట‌ర్ మారుతి గారి దగ్గ‌ర శివ వ‌ర్క్ చేశాడు, శివ మీద అభిమానంతో మారుతి గారు విచ్చేసి క్యాలెండ‌ర్ లాంచ్ చేసినందుకు థాంక్స్‌. అలాగే మా ఆత్మీయులు కొండా కృష్ణంరాజుగారు రావ‌డం ఎంతో ఆనందం. శివ కు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చిన రూపేష్ గారికి స్పెష‌ల్ థాంక్స్. ఇండస్ట్రీ ప్ర‌ముఖుల స‌పోర్ట్‌తో ఈ సినిమా ముందుకు వెళుతోంది.టీజ‌ర్ చూసిన‌వారు శివ పెద్ద ద‌ర్శ‌కుడు అవుతాడ‌ని అంటున్నారు. అది త‌ప్ప‌క జ‌ర‌గాల‌ని  కోరుకుంటున్నాను. శివ‌కు జ‌య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి.“ అన్నారు.

రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌ జీత్‌ విర్క్‌, దేవిప్రసాద్‌, జయప్రకాష్‌, రవి వర్మ, శశిధర్‌ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్‌, పూజా రామచంద్రన్‌, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్‌ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్‌ తరుణ్‌, మాస్టర్‌ దేవాన్ష్‌, బేబి ఓజల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటింగ్‌: శ్యామ్‌ వాడవల్లి,  కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్‌: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్‌: జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్,  ప్రొడక్షన్‌ మేనేజర్‌: కిరణ్‌ కాసా, పిఆర్ఓ: బి.ఎ రాజు, చీఫ్‌ కో-డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్‌ బి.

O..Pitta katha Movie pre Release Teaser Laughed by Hero Rana Daggubati .‬

ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ బ్యానర్ భవ క్రియేషన్స్ ఆనందప్రసాద్ ఒక కొత్త ప్రాజెక్ట్ “ఓ పిట్టా కథ” తో ముందుకు వచ్చారు,  చెండు ముద్దు దర్శకత్వం వహించారు  . అలాగే, ఈ ఆకట్టుకునే క్రేజీ  కథను ప్రోత్సహించడానికి సినిమా బృందానికి ప్రత్యేకమైన వ్యూహం ఉన్నట్లు అనిపించింది.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాఫీ గ్లాసెస్ ద్వారా క్యారెక్టర్ పేర్లు మరియు వారి సామాజిక స్థితిగతులను కలిగి ఉన్న ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయగా, పాదరక్షల ద్వారా దీనిని వివరించిన కాన్సెప్ట్ పోస్టర్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ వెల్లడించారు.

 టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ఈ చిత్రం యొక్క ప్రీ-టీజర్‌ను విడుదల చేశారు,

ఈ చిత్రంలో విశ్వం దుద్దంపూడి, నటుడు బ్రహ్మజీ కుమారుడు సంజయ్ రావు, నిత్యా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించగా, బ్రహ్మాజీ, బలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ & సూర్య అకోండి సహాయక పాత్రల్లో నటించారు.

Comedian Santhanam New Movie ServerSundaram

స్టార్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న సంతానం హీరో గా నటిస్తున్న సినిమా సర్వర్ సుందరం.బల్కి దర్శకత్వంలో ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాధారవి నటిస్తుండడం విశేషం.ఇందులో సంతానం కు జంటగా వైభవి హీరోయిన్ గా నటిస్తుంది.కామెడీతో పాటు మాస్ కు కావాల్సిన యాక్షన్ సన్నివేశాలతో ఆడియన్స్ అలరించే విధంగా ఉంటున్న ఈ సినిమా ను తెలుగు,తమిళ భాషల్లో ఫిబ్రవరి 14 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు..

Jaanu Pre Release Event

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బిగ్ సీడీని ఆవిష్క‌రించారు. నేచుర‌ల్  స్టార్ నాని, వంశీ పైడిప‌ల్లి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా .

17 ఏళ్ల‌లో తొలి రీమేక్‌:  దిల్‌రాజు
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ‘‘మా బ్యాన‌ర్ స్టార్ట్ అయ్యి 17 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల‌లో మేం ఎప్పుడూ రీమేక్ చేయ‌నేలేదు. మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న తొలి రీమేక్ ఇది. రీమేక్ చేయాలంటే నాకు భ‌యం. ఎందుకంటే ఒరిజిల్ ఫీల్‌ను మిస్ కాకుండా తెర‌పైకి తీసుకురావ‌డం చాలా క‌ష్టం. త‌మిళంలో ‘96’ సినిమాను రిలీజ్ కంటే ఒక నెల ముందు చూశాను. చూసిన త‌ర్వాత ప్రివ్యూ థియేట‌ర్ నుండి బ‌య‌ట‌కు రాగానే ఈ సినిమాను నేను తెలుగులో రీమేక్ చేస్తానంటూ.. ప్రొడ్యూస‌ర్‌కి చెక్ ఇచ్చేశాను. అందుకు కార‌ణం సినిమా చూసే స‌మ‌యంలో ఎమోష‌న్స్‌తో గుండె బ‌రువెక్కింది. అప్పుడు మా ‘ఎంసీఏ’ షూటింగ్ జ‌రుగుతుంది. ‘96’ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నుకుంటున్నాన‌ని నానితో చెప్పాను. త‌ను కూడా చెన్నై వెళుతున్నాన‌ని చెప్పాడు. అప్పుడు త‌న కోసం ఓ షో ఏర్పాటు చేస్తే.. త‌ను సినిమా చూసి సినిమా ‘క్లాసిక్ సినిమా సార్‌! చాలా బావుంది’అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. త‌మిళంలో సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత మళ్లీ ఆడియెన్స్‌తో క‌లిసి సినిమా చూశాను. నాకు తమిళంలో పూర్తిగా రాకపోయినప్పటికీ ప్రేక్ష‌కుల నుండి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి ఎవ‌రు ఏమ‌నుకున్నా..ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని డిసైడ్ అయ్యాను. జానుగా స‌మంత‌ను ఈ సినిమాలో యాక్ట్ చేయించాల‌ని అనుకున్నాను. త‌నని త‌ప్ప‌.. ఆ పాత్ర‌లో మరొక‌రిని ఆ పాత్ర‌లో ఊహించుకోలేక‌పోయాను. ఈ మ‌ధ్య త‌ను చేస్తున్న సినిమాలన్నీ సూప‌ర్బ్‌గా సెల‌క్ట్ చేసుకుంటుంది. త‌న‌తో మాట్లాడి సినిమాకు ఒప్పించాను. ఇక నా బ్ర‌ద‌ర్ శ‌ర్వాకి ఫోన్ చేసి సినిమా చూడ‌మంటే సినిమా చూసి సూప‌ర్బ్‌గా ఉంద‌ని ఫోన్ చేశాడు. అలా శ‌ర్వా, స‌మంత ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. మా ఆర్య సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా ప‌నిచేసిన ప్రేమ్‌కుమార్ ‘96’ సినిమాకు డైరెక్ట‌ర్‌గా మారాడు. త‌మిళంలో సినిమా చేసిన త‌న‌తో మాట్లాడి తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పాను. త‌మిళంలో చేసిన టెక్నీషియ‌న్సే ఈ సినిమాకు ప‌నిచేశాను. సినిమా స్టార్ట్ చేసిన త‌ర్వాత కెన్యాలో శ‌ర్వా న‌డుపుతున్న జీపు బోల్తా పడింది.. దేవుడి దయవల్ల త‌న‌కు ఏమీ కాలేదు. త‌ర్వాత మ‌రో డిస్ట్ర‌బెన్స్ వచ్చింది. ఏంటి? ఇంత మంచి సినిమాకు ఇన్ని అడ్డంకులు? అని అనుకున్నాను. అయితే అన్నింటినీ ఒక్కొక్క‌టిగా దాటుకుంటూ వ‌చ్చి సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమాను చేస్తున్న‌ప్పుడు ‘దిల్‌రాజుకేమైనా మెంటలా? డ‌బ్బింగ్ చేయొచ్చు క‌దా?’ అని చాలా కామెంట్స్ విన్నాను. ఆ ఫీల్‌ను తెలుగులో అలాగే క్యారీ చేశాం. అదే ఫ్లేవ‌ర్‌ను డైరెక్ట‌ర్ ప్రేమ్ తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఫిబ్ర‌వ‌రి 7న మా ‘జాను’ సినిమాను చూసిన తెలుగు ప్రేక్ష‌కులు వావ్ అంటారు. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఈ సినిమా హ్యాంగోవ‌ర్‌లో ఉండిపోతాం. జాను సినిమా చూసిన త‌ర్వాత మ‌న లైఫ్‌లోని మెమొరీస్‌ను ఇంటికి తీసుకెళ్తాం. ఫిబ్ర‌వ‌రి 7న నేను చెప్పిన‌వ‌న్నీ నిజాలు అవుతాయి’’ అన్నారు.
మర్యాద ఉన్న సినిమా
వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ – ‘‘రాజుగారు ఈ రీమేక్ చేస్తున్నామ‌ని అనుకున్న‌ప్పుడు వ‌ద్ద‌ని వారించిన వారిలో నేనూ ఒక‌డ్ని. కానీ ట్రైల‌ర్‌ను చూసి షాక‌య్యాను. ప్రేమ్ అదే మూమెంట్స్‌ను తెలుగులో రీ క్రియేట్ చేశాడు. అందుకు కారణం ఈ సినిమా త‌న మ‌న‌సులో నుండి వ‌చ్చిన ఆలోచ‌న. అందుక‌నే అద్భుతంగా ఈ సినిమాను మ‌లిచాడు. ఇక తమిళంలో త్రిష‌..తెలుగులో స‌మంతగా న‌టించిన గౌరికి నేను పెద్ద ఫ్యాన్‌ని. భవిష్యత్తులో తెలుగు సినిమా గురించి రాసేట‌ప్పుడు స‌మంత గురించి కూడా కొన్ని పేజీలు రాసేంత స్థాయికి ఎదిగింది. అయినా స‌మంత విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమా ఫెయిలైతే నా కెరీర్ ఏంటి? అని ఇప్ప‌టికీ ఆలోచిస్తుంటుంది. ఆ భ‌యం, ప్యాష‌న్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తుంది.  నేను డైరెక్ట‌ర్‌గా మారే క్ర‌మం నుండి శ‌ర్వానంద్ తెలుసు. త‌ను అప్ప‌టికీ యాక్ట‌ర్ కాలేదు. ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ ఈ స్థాయికి చేరాడు. ‘జాను’ క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాదు.. మ‌ర్యాద ఉన్న సినిమా. అదే గౌర‌వం, మ‌ర్యాదతో రాజుగారు సినిమా చేశారు. ఆయ‌న డ‌బ్బు క‌న్నా గౌర‌వం సంపాదించాల‌నుకుంటారు. 96 సినిమా తమిళంలో ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలుగులోనూ అలాగే నిల‌బ‌డుతుంద‌ని న‌మ్ముతున్నాను’’ అన్నారు.
గర్వంగా ఫీలవుతారు
సమంత అక్కినేని మాట్లాడుతూ – ‘‘అభిమానుల‌ను డిస‌ప్పాయింట్ చేయ‌కూడ‌ద‌నే నేను ప్ర‌తీ సినిమాకు భ‌య‌ప‌డుతుంటాను. ప్ర‌తి సినిమాను.. షూటింగ్‌కి వెళ్లే ప్ర‌తిరోజుని నా మొద‌టి సినిమాకు మొద‌టి రోజు వెళ్లేలాగానే ఫీల్ అవుతాను. ప్రేక్ష‌కులు అందిస్తున్న స‌పోర్ట్‌కు థ్యాంక్స్‌. క్లాసిక్ సినిమా రీమేక్ ఇది. దీని గురించి ఇప్పుడు ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. ఫిబ్ర‌వ‌రి 7 త‌ర్వాత త‌ప్ప‌కుండా మాట్లాడుతాను. ప్ర‌తిరోజూ ఈ సినిమా షూటింగ్‌లో ఏదో ఒక మేజిక్ జ‌రుగుతూనే ఉండింది. దిల్‌రాజుగారు అడ‌గ్గానే నేను పారిపోయాను. అయినా కూడా ఆయ‌న రెండోసారి అడిగి గొప్ప అవ‌కాశాన్ని ఇచ్చారు. నా రామ్‌లాగా న‌టించిన శ‌ర్వాకు థ్యాంక్స్‌. నా పెర్ఫామెన్స్‌కు ఏదైనా క్రెడిట్ ద‌క్కితే అది శ‌ర్వా వ‌ల్ల‌నే కుదిరింది. ప్రేమ్‌కుమార్‌గారికి థ్యాంక్స్‌. ఆయ‌న మేజిషియ‌న్‌లా మ‌రోసారి మేజిక్‌ని క్రియేట్ చేశాడు. నేను మీ అందరినీ గ‌ర్వంగా ఫీల‌య్యేలా చేస్తాన‌నే అనుకుంటున్నాను’’ అన్నారు.
తొంబై ఏళ్ల వరకు కనెక్ట్ అయ్యే సినిమా
హీరో శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘కొంత మంది హీరోయిన్స్‌తో ప‌నిచేయాలంటే కాస్త ఆలోచించుకుంటాం. నిత్యామీన‌న్‌, సాయిప‌ల్ల‌వి..స‌మంత వంటి వాళ్లు సీన్స్‌ను తినేస్తారు. వీళ్ల‌తో సినిమా అన‌గానే కొంచెం మ‌నం అల‌ర్ట్‌గా ఉండాలి. స‌మంత‌తో తొలిసారి ప‌నిచేశాను. ప్ర‌తి సీన్‌ను వంద శాతం చెక్ చేసుకునే న‌టిస్తుంది. అందుకే త‌ను సూప‌ర్‌స్టార్ అయ్యింది. స‌మంత జానుగా చేయ‌కుంటే ఈ సినిమా లేదు. నాకు ఏదైనా క్రెడిట్ అంటూ వ‌స్తే.. దానికి కార‌ణం స‌మంతే. ఆరు నుండి 90 ఏళ్ల వ‌ర‌కు అంద‌రికీ ఈ సినిమా క‌నెక్ట్ అవుతుంది. ఫ‌స్ట్ ల‌వ్‌ను ఎవ‌రూ మార్చ‌లేరు. చాలా స్వీట్ మెమురీస్ ఉన్నాయి. ర‌మేశ్‌, కిషోర్ క్యారెక్ట‌ర్స్ మ‌న‌కు క‌న‌ప‌డ‌తాయి. నా టీమ్ అంద‌రికీ థ్యాంక్స్‌. ఇలాంటి అద్భుత‌మైన సినిమాను ఇచ్చిన శిరీషన్న‌, రాజన్న‌, హ‌ర్షిత్‌ల‌కు థ్యాంక్స్‌. నేను ఈ సినిమాను చూసి ‘క్లాసిక్ మూవీ క‌దా! మ‌నం చేయాలా?’ అన్నాను. ‘నువ్వు న‌న్ను న‌మ్ము’ అని దిల్‌రాజు అన్నారు. ఆయ‌న‌పై న‌మ్మకంతో సినిమా చేశాను. సార‌థి స్టూడియోలో నానితో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయ్యింది. నేను, న‌రేశ్‌, నాని క‌లిసి చాలా ట్రిప్స్‌కు వెళ్లాం. త‌న‌కు థ్యాంక్స్‌’’ అన్నారు.
మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ – ‘‘రాజుగారితో పాటు నాకు ఈ సినిమాను చూడ‌మ‌న్నప్పుడు.. ‘ఇంత మంచి సినిమా, ఎంతో బాగా చేశారు. దీన్ని ట‌చ్ చేయ‌కండి’ అని నా ఒపీనియ‌న్ చెప్పాను. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నార‌ని నా ద‌గ్గ‌ర ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ తెలుగులో ఈ సినిమాను తీయ‌కూడ‌ద‌ని నేను చెప్పేవాడిని. కానీ..  ఈ సినిమాలో శ‌ర్వానంద్‌, స‌మంత చేస్తున్నార‌ని అనౌన్స్ చేయ‌గానే ఈ సినిమాను తెలుగులో ఎప్పుడు చూస్తామా? అనిపించింది. ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు ఆ న‌మ్మ‌కం నిజ‌మైంది. త‌మిళంలో నేను ఏదైతే చూశానో అదంతా పోయింది. ఇప్పుడు రామ్, జాను అంటే శ‌ర్వా, సామ్‌లే గుర్త‌కొస్తున్నారు. త‌మిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమారే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కాబ‌ట్టి ఫీల్ ఎక్క‌డా మిస్ అయ్యుండ‌దు. శ‌ర్వా.. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చినప్పుడు నా తొలి ఫ్రెండ్. శ‌ర్వా, సామ్ ఇద్ద‌రూ మంచి పెర్ఫామెర్స్‌. పోటీ ప‌డి న‌టించారు. శ‌ర్వా ఏ సినిమా చేసినా స‌రే! వాడికి మాత్రం చాలా మంచి పేరు వ‌స్తుంటుంది. ఈ సినిమాకు మంచి పెర్ఫామర్ అవ‌స‌రం. అందుక‌నే త‌మిళంలో విజ‌య్‌సేతుప‌తిని, తెలుగులో శ‌ర్వానంద్‌ని తీసుకున్నారు. ఇక సామ్ గురించి చెప్పాలంటే.. త‌న‌ను చూసి.. త‌ను ఎంచుకుంటున్న సినిమాల‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. ప్ర‌తి సంవత్స‌రం ప‌ది మంచి సినిమాలున్నాయంటే అందులో రెండు, మూడు స‌మంత సినిమాలుంటున్నాయి. ఇప్పుడు త‌న లిస్టులో మ‌రొక‌టి జాయిన్ అవుతుంది. రాజుగారి కౌంటింగ్ సంక్రాంతి నుండి స్టార్ట్ అయ్యింది. మ‌ళ్లీ ఫిబ్రవ‌రి 7 నుండి మళ్లీ స్టార్ట్ అయ్యి మార్చి 25వ‌ర‌కు కంటిన్యూ అవుతుంది. అక్క‌డి నుండి నేను చూసుకుంటా. అలాగే శిరీష్‌గారికి కంగ్రాట్స్‌. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌రే కాదు.. రాజుగారికి ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కొన్ని సినిమాల‌ను చూసి ఎంజాయ్ చేస్తాం. కొన్నింటిని ఎంజాయ్ చేయ‌డ‌మే కాదు.. ఇంటికి కూడా తీసుకెళ‌తాం. అలా ఇంటికి తీసుకెళ్లే సినిమాల్లో ‘జాను’ ఒక‌టి. ఎంటైర్ యూనిట్‌కి కంగ్రాట్స్‌’’ అన్నారు.
జూనియర్ శర్వానంద్‌గా(రామ్ పాత్రలో) నటించిన సాయికిర‌ణ్ మాట్లాడుతూ – ‘‘నాకు అవ‌కాశం ఇచ్చిన దిల్‌రాజు, శిరీష్‌గారికి థ్యాంక్స్‌. ప్రేమ్‌కుమార్‌గారు మేజిషియ‌న్‌. నాకు ఎంతో స‌పోర్ట్ అందించారు. యంగ్ రామ్ పాత్ర‌లో న‌టించినందుకు హ్యాపీగా ఉంది. కిర‌ణ్‌గారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. స‌మంత‌గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో క‌లిసి సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది’’ అన్నారు.
జూనియర్ సమంతగా(జాను చిన్నప్పటి పాత్రలో) నటించిన గౌరి మాట్లాడుతూ – ‘‘96’ సినిమాను నా డెబ్యూ మూవీగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. జాను సినిమాతో అదే పాత్రను చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేమ్‌కుమార్‌గారు నా పాత్ర‌ను అద్భుతంగా మ‌లిచారు. స‌మంత‌గారి చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో న‌టించ‌డం గౌర‌వంగా ఉంది. మేం మేజిక్‌ను రీ క్రియేట్ చేశాం. ప్రేక్ష‌కుల అభిమానాలు, ఆశీస్సులు ఉంటాయ‌ని భావిస్తున్నాను’’ అన్నారు.
ఇంకా ఈ సినిమాలో ఎంటైర్ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

40 Years completed Kalathapasvi k.viswanath Movie Shankara bharanam

తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’. ఈ సినిమా విడుదలై ఫిబ్రవరి 2వ తేదీకి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. ఫిబ్రవరి 2 , 1980లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఈ కళాఖండం విడుదలైంది. కళా తపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై  ఏడిద నాగేశ్వరరావు – ఆకాశం శ్రీరాములు దీన్ని నిర్మించారు . శంకరశాస్త్రి, తులసి మధ్య అలవికాని అనుబంధం చక్కగా ఆవిష్కరించిన సినిమా ఇది. ఇది ఒక్క తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటక, కేరళ లలో కూడా అఖండ విజయం సాధించింది . అమెరికా లో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి చిత్రం ఇదే. అలాగే ప్రపంచ నలు మూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలై తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది . అప్పట్లో ఎవరి నోట విన్నా ‘శంకరాభరణం’ గురించే ప్రస్తావన .శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో  ఈ సినిమా విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు . ప్రతి తెలుగు వాడు ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు.ఇక అవార్డుల విషయానికి వస్తే , జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు , వినోదాత్మకం తో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కు ఉత్తమ నేపధ్య గాయకుడిగా తొలి సారి జాతీయ అవార్డు , శ్రీమతి వాణి జయరాం కు ఉత్తమ గాయకురాలి గా , కె.వి.మహదేవన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు లభించిన సినిమా ఇది .  అలాగే మన ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డులతోపాటు, దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి .

కథేమిటి?
శంకరశాస్త్రి (జె. వి. సోమయాజులు)  గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.  వేశ్య కూతురు, గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్త్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. ఈ కేసు నుంచి ఆమెను బయటకు తీసుకురావడానికి శంకర శాస్ర్తి అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో తులసిని విడిపిస్తాడు. వేశ్యకు ఆశ్రయం ఇచ్చారని శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూస్తారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.
కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరవై శంకరశాస్ర్తి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక పుత్రుడికి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర నేర్చుకోవడానికి అతన్ని నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును ఆయన సంగీతానికి వారసుడిగా నియమిస్తుంది. కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు ఆమె కూడా ప్రాణాలువిడుస్తుంది. సంగీతమే ప్రాణం ఈ సినిమాకి కె.వి. మహదేవన్ సంగీతం ప్రాణంగా నిలిచింది. జంధ్యాల మాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం పాటలు, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, బేబీ తులసి,అల్లు రామలింగయ్యల నటన… వెరసి ‘శంకరాభరణం’ అనే కళాఖండం.  ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వర రావు ఈ సినిమాపైనే మూడు రోజులు ప్రవచనాలు చేశారంటే ఈ సినిమా విశిష్టత ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకు వచ్చిందీ చిత్రం. ఈ సినిమా పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి. కాలం మారినా ఇది మాత్రం కలకాలం నిలిచి ఉండే సినిమా అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

నటీ నటులు
జె.వి .సోమయాజులు,మంజు భార్గవి,అల్లు రామలింగయ్య,చంద్ర మోహన్,రాజ్యలక్ష్మి,తులసి.

నేపధ్య గానం:ఎస్ .పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్. జానకి,వాణి జయరాం