Home Blog Page 976

Director Maruthi Launched Intense First Look Poster Of Sathyaraj In Emergency

From the very point of inception, everything pertaining to Emergency starring Sathyaraj has been making huge waves. From the top-notch cameras that are used in Telugu industry for the first time followed by Sathyaraj’s mind-boggling action blocks, everything has been setting the momentum of expectations to the pinnacle.

Today, director Maruthi who worked with Sathyaraj in recent blockbuster Prati Roju Pandaage has launched the film’s first look poster. “Happy to present #Emergency 1st Look Starring our dear #Sathyaraj sir. Best wishes to the entire team👍😊 @hbc_films @iamsmrdoha @Dheran_22 @Sibi_Sathyaraj @DopAnji @prasad_sn_ @NoufalAbdulla13 @TheSaiSatish @DoneChannel1 @CtcMediaboy ,” weeted Maruthi.

On the other hand, the crew has completed the dubbing portions of the film, where director Dheran is in awe of Sathyaraj’s remarkable feat of completing dubbing in a single stretch of 12 hours.

“Working with Sathyaraj sir has now injected in me an insatiable passion for cinema with more doses. To be frank, I felt that he would be apt for the role that I have crafted on the script papers. But after working with him, I have become a much bigger fan of his hard work and dedication. It isn’t just about his passion and professionalism, but his emotional adherence to the art of acting. Beyond the professional ethics and artiste, he has inspired everyone around him on the sets as a human. His dedicated performance is sure to become the major strength and pillar of Emergency. We have successfully completed the dubbing phase of the film and it was really marvelous to see Sathyaraj sir complete the Film. We are very elated with the way; the film has shaped up and will be soon presenting the teaser.”

Emergency is an edge-seated thriller with high octane action blocks performed by Sathyaraj. The film is bankrolled by Sajeev Meerasahib Rawther for HoneyBee Creations and marks the directorial debut of Dheran. Prasad SN (Music) ‘Garudavega’ Anji (Cinematography), Dinesh Subarayan (Stunts) and Noufal Abdullah (Editor) are the prominent technicians involved in the film.

Young Tiger Tarak will grace the pre-release event of EnthaManchivaadavuraa

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత మంచివాడ‌వురా`. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.జాతీయ అవార్డ్ గ్ర‌హీత మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీత సారథ్యం వ‌హిస్తోన్నఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ‌రీన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, శ్రోతల నుండి విశేషమైన స్పందనను అందుకోవడం జరిగింది. ఇకపోతే ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ని కాసేపటి క్రితం సినిమా యూనిట్ విడుదల చేసింది.ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో జరుగనున్న ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వారు తమ ప్రకటనలో తెలిపారు

Young Tiger @tarak9999 will grace the pre-release event of #EnthaManchivaadavuraa

Date: January 8th, JRC Convention Hyd, 7pm onwards.

Ala Vaikunta Puramulo Musical Concert tomorrow at Yousufguda Police Grounds

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం 2020, జనవరి 12న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో “అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్ ను ” వైభవంగా, వినూత్నంగా జరుపుతున్నారు.

“అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్ ఈవెంట్ ను శ్రేయస్ మీడియా డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. 52 అడుగుల పొడవు, 162 అడుగుల వెడల్పు తో స్టేజి డెకరేట్ చేయనున్నారు. సౌత్ ఇండియాలో ఇంత భారీగా స్టేజ్ వెయ్యడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ఫంక్షన్ లో తమన్, శివమణి, సిద్ శ్రీరామ్, అర్మాన్ మాలిక్, రాహుల్ సిప్లిగoజ్, రోల్ రైడ, లేడి కాశ్, రాహుల్ నంబియర్, అనురాగ్ కులకర్ణి, ప్రియ సిస్టర్స్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అలాగే ఎమ్.జె5 డాన్స్ , ఇండియన్ రాగా వారు స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు.

సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్ నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Uttara Movie Success Meet

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందినసినిమా ‘ఉత్తర’. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఉత్తర కు రెస్సాన్ బాగుంది.మంచి సినిమా గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా  కు వస్తున్న స్పందనను మీడియా
తో పంచుకుంది చిత్ర యూనిట్..

ఈ సందర్భంగా దర్శకుడు తిరుపతి యస్ ఆర్ మాట్లుడుతూ : ‘ ఉత్తరకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చూసిన ప్రేక్షకులు నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్ మాకుచాలా ఆనందాన్ని కలిగించింది.సినిమా పబ్లిసిటీ, రిలీజ్ విషయాల్లో కొందరి వ్యక్తులనునమ్మి మోసపోయాను ఆ విషయంలో బాధ పడుతున్నాను.  మా సినిమా కు రెస్పాన్స్ బాగున్నా థియేటర్స్ విషయంలో పోరాటం చేయాల్సి వస్తుంది.వరంగల్, కరీంనగర్ లలో థియేటర్స్ పెరుగుతున్నాయి.  సినిమా నిర్మాణం లో రిలీజ్ అనేది చిన్న సినిమాలకు పెద్ద యుద్దంగా మారింది. ఈ పోరాటంలో ఇండస్ట్రీ లోని కొందరి మనుషుల నిజ స్వరూపాలు చూసాను,  మంచి సినిమాలను బ్రతికించాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకూ మా సినిమా ఇంతలా రీచ్ అయ్యిందంటే కారణం మీడయా నే.. మాకు సహాకరించిన వారికి ధన్యవాదాలు ’అన్నారు.

హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ:
‘ నిన్న శుక్రవారం విడుదలైన మా ఉత్తరకు చాలా మంచి స్పందన వస్తుంది. నేను ప్రేక్షకులతో ఈ సినిమాను చూసాను అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడింది విని చాలామంది కి వచ్చిన సందేహాలను సినిమా తీర్చింది. నా నటన, హీరోయిన్ నటన బాగుందని సోషల్ మీడియాలో
వస్తున్న రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంది.  ఒక తెలంగాణా బ్యాక్ డ్రాప్ వచ్చిన సహాజమైన ప్రేమకథ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ’ అన్నారు.

హీరోయిన్ కారుణ్య కత్రేన్  మాట్లాడుతూ:
‘ ఈ సినిమా విషయంలో నేను ముగ్గురు కు థ్యాంక్స్ చెప్పాలి.. ఒకరు మా డైరెక్టర్ తిరుపతి యస్ఆర్ గారు. స్వాతి లాంటి మంచి పాత్రను నాకు ఇచ్చినందకు, రెండు మీడియాకి మాసినిమాను ఇంతవరకూ సపోర్ట్ చేసినందుకు,మీడియా ఇచ్చిన ప్రోత్సాహంతోనే మా సినిమా ప్రేక్షకులకు తెలిసింది. మూడు ప్రేక్షకులకు సినిమా రిలీజ్ తర్వాత నాకు వస్తున్న రెస్పాన్స్ చాలా బాగుంది. స్వాతి, అశోక్ ల ప్రేమకథ అందరికీ నచ్చుతుంది. స్వాతి పాత్ర నాకు
చాలా సంతృప్తి నిచ్చింది ’ అన్నారు.

సమర్పణ: రవికుమార్ మాదారపు.
బ్యానర్స్: లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్స్.
సినిమాటోగ్రఫీ: చరణ్ బాబు
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
ఎడిటర్: బొంతుల నాగేశ్వర రెడ్డి
రైటర్: ఎన్. శివ కల్యాణ్
రచన మరియు దర్శకత్వం : తిరుపతి యస్ ఆర్
ప్రొడ్యూసర్స్ : తిరుపతి యస్ ఆర్. శ్రీపతి గంగదాస్.

నటీ నటలు: శ్రీరామ్ నిమ్మల, కారుణ్య కత్రేన్, అజయ్ ఘోష్, వేణు, అభినవ్,
అభయ్ తదితరులు.

The Great Gambler Tailer Launch in the presence of Vasavi Business Group

పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు సమర్పణలో శ్రీ సింహ వాహిని పతాకంపై…ధర్మ కీర్తిరాజ్,అర్చన రావ్,సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్ నటినటులుగా మహేష్ సి..దర్శకత్వంలో మడి పడిగే రాజు నిర్మాతగా మనోజ్,ప్రవీణ్, అఖిల్,ఆధ్య,చరణ్ లు సహ నిర్మాతలుగా కలసి నిర్మిస్తున్న”ది గ్రేట్ గ్యాంబ్లర్” సినిమా ట్రైలర్ ను 

వాసవి బిజినెస్ గ్రూప్ కార్పొరేట్ ఆఫీస్ లో ఫౌండర్స్ ప్రసాద్ గారు.శ్రీహరి గారి సమక్షంలో చిత్ర యూనిట్ సభ్యుల మధ్య రామ సత్యనారాయణ గారు విడుదల చేసారు..

ఈ సందర్భంగా నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ :-ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ “ది గ్రేట్ గ్యాంబ్లర్” సినిమా ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో వినోదకుమార్ యాక్షన్ బాగుంటుంది. గతంలో నేను వినోదకుమార్ తో మాట్లాడినప్పుడు సినిమా బాగుందన్నారు.ఈ చిత్రం ద్వారా దర్శకుడికి మంచి పేరు వస్తుంది.. ఇది తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు..

నిర్మాత మడి పడిగేరాజు మాట్లాడుతూ :-నిర్మాత అవ్వాలని చాలా ప్రయత్నం చేసి విఫలం అయ్యాను.రామ సత్యనారాయణ గారిని చూసి ఇన్స్పెర్ అయ్యాను అందుకనే రామసత్యనారాయణ గారి చేతులు మీదు గా విడుదల చేయటం అనందంగా ఉంది.ట్రైలర్ లాగే సినిమా కూడా బాగుంటుంది.. మీ రందరూ ఈ సినిమా ను చూసి ఆదరించండి అని అన్నారు..

సహనిర్మాతలు మాట్లాడుతూ:ఒక మంచి సినిమా కు నిర్మాత మడి పడిగే రాజు గారి తో నిర్మించడం ఆనందంగా ఉంది.

నటీనటులు
ధర్మ కీర్తిరాజ్,అర్చన రావ్,సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్

సాంకేతిక వర్గం
Di. ఎడిటర్..శివ వై ప్రసాద్.
మ్యూజిక్ డైరెక్టర్:అభిమాన్ రాయ్.
నిర్మాత:-మడి పడిగే రాజు
సహనిర్మాతలు:-మనోజ్,ప్రవీణ్, అఖిల్,ఆధ్య,చరణ్
డైరెక్టర్:-మహేష్ సి,
పి.ఆర్.ఓ:-మధు వి.ఆర్.                           Designer. వెంకట్.ఎం

Producers Guild (ATFPG) Press Meet about Release dates

నిర్మాత‌ల శ్రేయ‌స్సు కోసం ఏర్ప‌డిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ సినిమాల రిలీజ్‌ల విష‌యంలో నిర్మాత‌ల‌కు త‌న వంతు స‌హ‌కారాన్ని అందిస్తుంది. సినిమాల రిలీజ్ విష‌యంలో క్లాష్ రాకుండా కీల‌క పాత్ర పోషించిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్…. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `సరిలేరు నీకెవ్వ‌రు`, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ `అల‌..వైకుంఠ‌పుర‌ములో..`  సినిమా రిలీజ్ డేట్స్ క్లాష్ రాకుండా  మ‌రోసారి కీల‌క పాత్ర పోషించింది. రెండు చిత్రాల నిర్మాత‌లు అనిల్ సుంక‌ర‌, ఎస్‌.రాధాకృష్ణ‌ల‌తో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్  చ‌ర్చ‌లు జ‌రిపింది. చ‌ర్చ‌ల అనంత‌రం సూప‌ర్ స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం జ‌న‌వ‌రి 11న విడుల‌వుతుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ` అల‌..వైకుంఠ‌పుర‌ములో..` జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌వుతుంది.  అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో గిల్డ్ త‌ర‌పున నిర్మాత‌లు దిల్‌రాజు, కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌, రాజీవ్ రెడ్డి పాల్గొన్నారు.  
కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “రెండు, మూడు రోజులుగా సంక్రాంతి సినిమాల విడుద‌లపై చిన్న పాటి సస్పెన్స్ ఉంది. చ‌ర్చ‌ల అనంత‌రం సినిమా విడుద‌ల తేదీపై క్లారిటీ వ‌చ్చింది. కార‌ణాలు ఏవైనా కావ‌చ్చు. చివ‌ర‌కి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌క‌డ‌మే ముఖ్యం. స‌మ‌స్య‌లుంటే చాలా మంది ఇబ్బందులు ప‌డ‌తారు. ఈరోజు జ‌రిగిన మీటింగ్‌లో అంద‌రూ పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారు“ అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “నాలుగైదు రోజులుగా స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో సినిమా విడుద‌ల గురించి సోష‌ల్ మీడియాలో డిస్క‌ష‌న్ జ‌రుగుతుంది. అంత‌కు ముందు జ‌రిగిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ మీటింగ్‌లో స‌రిలేరు నీకెవ్వ‌రుని జ‌న‌వ‌రి 11న‌, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాన్ని జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌ల‌తో మాట్లాడి అనౌన్స్ చేశాం. అయితే త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో జ‌న‌వ‌రి 10 లేదా 11న అల వైకుంఠ‌పుర‌ములో విడుద‌ల‌వుతుందని వార్త‌లు వినిపించాయి. దాంతో మ‌రోసారి గిల్డ్ చ‌ర్చ‌లు జ‌రిగాయి. నిర్మాత‌ల‌ను క‌న్విన్స్ చేశాం. పెద్ద సినిమాలు విడుద‌ల‌వుతున్న‌ప్పుడు అంద‌రూ బావుండాల‌నే ఉద్దేశంతో గిల్డ్ ఇంత‌కు ముందు చ‌ర్చ‌లు జ‌రిపింది. ఆరోజు అనుకున్న‌ట్లే ఇప్పుడు జ‌రిగిన గిల్డ్ చ‌ర్చ‌ల్లోనూ జ‌న‌వ‌రి 11న స‌రిలేరు నీకెవ్వ‌రు.. జ‌న‌వ‌రి 12న అల వైకుంఠ‌పుర‌ములో సినిమాను విడుదల చేయ‌డానికి రెండు సినిమాల నిర్మాత‌ల‌ను ఒప్పించాం. హీరోలతో కూడా మాట్లాడాం. రెండు పెద్ద సినిమాల‌తో పాటు మ‌రో రెండు సినిమాలు కూడా విడుద‌ల‌వుతున్నాయి. గ‌త సంక్రాంతికి స‌క్సెస్‌ఫుల్ మూవీస్ చూశాం. ఈసారి కూడా అన్నీ సినిమాలు బాగా ఆడాల‌ని కోరుకుంటున్నాం. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ఇలాంటి చిన్న చిన్న స‌మ‌స్య‌లు వ‌స్తే.. పరిష్క‌రించ‌డానికి గిల్డ్ ఎప్పుడూ ముందుంటుంద‌ని తెలియ‌జేస్తున్నాం. ఎందుకు ఈ క‌న్‌ఫ్యూజ‌న్ వ‌చ్చింద‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే, స‌మ‌స్య ఎందుకు వ‌చ్చింది అని ఆలోచించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డ‌మే మా గిల్డ్ టార్గెట్‌. ప్ర‌తి సినిమా ఆడాలి. బాగా రెవెన్యూ రావాల‌నే ఆలోచిస్తాం. ఈ మీటింగ్ ఇంత సామ‌ర‌స్యంగా జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మైన హీరోలు, నిర్మాత‌లు స‌హా ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్‌“ అన్నారు.

Amma Nanna Guruvu Shathaka Padyarchana Poster launched by K.Viswanath

తెలుగు కనుమరుగవుతున్న తరుణంలో తెలుగు యొక్క గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తముగా చాటి చెప్పేలా “జనవరి 6న లక్షలాది మంది విద్యార్థులతో ‘అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” అనే వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు శత శతకకవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా అధ్యక్షులు శ్రీ తాళ్లూరు శేఖర్. ఈ సందర్భం గా ‘అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” పోస్టర్ ని ఈ రోజు ప్రముఖ దర్శకులు కె. విశ్వనాధ్ చేతుల మీదుగా లాంచ్ చేసారు.

ఈ కార్యక్రమం లో కె .విశ్వ నాథ్ మాట్లాడుతూ…“ శత శతక కవి చిగురుమళ్ల శ్రీనివాస్ గారు కొన్ని పద్యాలూ పాడి వినిపించారు. ఎంతో అర్ధవంతం గా, వేమన పద్యాలూ గుర్తు చేసేలా ఉన్నాయి. వారికి తెలుగు మీద ఎంత అవగాహన, అమ్మ నాన్న , గురువు ల పై ఎంత భక్తి ఉందో పద్యాలు విన్నాక తెలుస్తుంది. ఇవి భావి తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ కార్య క్రమముతో పిల్లలను తీర్చిదిద్దాలని కంకణము కట్టుకున్నారు వీరు. లక్ష మంది పిల్లలు పాడుతున్నారంటే నిజంగా ఇదొక చారిత్రాత్మకమైన సంఘటనగా చెప్పొచ్చు. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసి ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో, అలా భాషాభిమానముతో ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని హితోధికముగా చేస్తోన్న తాళ్లూరు శేఖర్, చిగురుమళ్ళ శ్రీనివాస్ ని అభినందిస్తున్నాను“అన్నారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు శత శతకకవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహణలో “అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” జనవరి 6న జరుగుతుందని, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తానా అధ్యక్షులు శ్రీ తాళ్లూరు రాజశేఖర్ గారు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ …“భద్రాద్రి కవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన అమ్మ శతకం, నాన్నశతకం, గురువు శతకాల లోని పద్యాలను విద్యార్థులచే కంఠస్థం చేయించి ఎవరి పాఠశాలలో వారు సమావేశమై సామూహిక గానం చేసే బృహత్ యజ్ఞం ఇది“అన్నారు.

అమ్మానాన్న గురువుల పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం కలిగించడం, తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించటం, విలువలను భావితరాలకు అందించటం, వంటి సదుద్దేశాలతో తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశ విదేశాలలో ఈ పద్యార్చన జరగబోతుందని, ఈ కార్యక్రమంలో లక్షలాదిగా విద్యార్థులు పాల్గొనాలని ఆయన తెలియజేశారు.

“అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” కు ప్రముఖ సాహితీ వేత్తలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, నటుడు తనికెళ్ళ భరణి సపోర్ట్ చేస్తున్నారు.

Lady Amitabh Vijayashanthi Making Her Entry On The Big Screen After 13 Years

National Award Winner As The Best Actress, lady Amitabh Vijayashanthi who created a sensation with films like ‘Neti Bharatham’, ‘Prathighatana’, ‘Karthavyam’, ‘Osey… Ramulamma’ is making a grand re-entry as Bharathi in Superstar  Mahesh’s ‘Sarileru Neekevvaru’. The emotional scenes between Mahesh and Vijashanthi stand as a highlight of ‘Sarileru Neekevvaru’. The film’s team is saying that Vijayashanthi did the role like no other can match her performance in that role except her. Superstar Mahesh and Vijayashanthi acted together in ‘Koduku Diddina Kapuram’ while Mahesh was a child actor in that film. Now after many years, Lady Amitabh Vijayashanthi is making her re-entry with Superstar Mahesh starrer ‘Sarileru Neekevvaru’. During the shoot of this film itself, Big banners are trying to cast Lady Amitabh Vijayashanthi in their films.

Superstar Mahesh’s out and out entertainer ‘Sarileru Neekevvaru’ is Presented by Dil Raju in Sri Venkateswara Creations banner, Produced by Ramabrahmam Sunkara in GMB Entertainments and AK Entertainments in Young Talented Director Anil Ravipudi’s Direction is getting ready for a grand release on Jan 11th as Sankranthi gift. Rashmika Mandanna is playing as a heroine.

Ali Shows towards Web Series Construction -Aliwood Logo Launch

టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా మనం ఇప్పటికే చాలా వుడ్ లను చూశాం. ఇకముందు ‘అలీవుడ్’ ను కూడా చూడబోతున్నాం. అదేంటి అలీవుడ్ అనుకుంటున్నారా… ప్రముఖ కామెడీ హీరో, హాస్యనటుడు అలీ కూడా ఓ నిర్మాణ సంస్థను పెడుతున్నారు… దాని పేరే అలీవుడ్. అలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఆయన ఈ సంస్థను ఏర్పాటుచేశారు. నూతన సంవత్సరంలోనే దాన్ని ఆయన ప్రారంభించారు. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నిర్మాణాలు ప్రారంభించాలన్నది ఈ సంస్థ సంకల్పం. మణికొండలోని తన నివాసానికి దగ్గరగా ఈ సంస్థ కార్యాలయం ఉంటుంది. వెబ్ సిరీస్, టీవీ షోలు, డైలీ సీరియల్స్, వాణిజ్య చిత్రాలు రూపొందించే పనిలో ఉన్నారు. అలీకి వెన్నెముక అయిన శ్రీబాబా నేతృత్వంలో క్రియేటివ్ డైరెక్టర్ మనోజ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ సంస్థ కార్యకలాపాలు ఉంటాయి.  ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి , నిర్మాత అచ్చిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, ప్రొడ్యూసర్ జయచంద్ర, అలీ బ్రదర్ ఖయ్యూం, హీరో రవివర్మ ఇతర సినిమా ప్రముఖులు విచ్చేసి లోగో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డా.అలీ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో వెబ్ సీరీస్‌కు మంచి ఆదరణ లభిస్తుందని, నష్టాలు లేకుండా నిర్మాతలకు అదాయం లభించే అవకాశం మా అలీవుడ్ సంస్థ కల్పిస్తుందన్నారు. 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన సేవలను తమ సంస్థలో కల్పిస్తున్నామని, తాను తీయబోయే వెబ్ సిరీస్, టీవీ షోలను అభిమానులు ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు.