Home Blog Page 979

Raw Movie Poster Launch

కార్తిక్ క్రియేషన్స్ సమర్పణలో రాజ్ డొక్కర దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘RAW'(రా). ఇర్ఫాన్, చంటి, మనోహర్, లోహిత లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు పోస్టర్ లాంచ్ ను నూతన సంవత్సరం సందర్బంగా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి దర్శకుడు త్రినాధ్ నక్కిన, జబర్దస్త్ అవినాష్, సతీష్ బోట్ల ముఖ్య అథితులుగా పాల్గొని RAW (రా) పోస్టర్ ను విడుదల చేశారు.

అనంతరం త్రినాధ్ నక్కిన మాట్లాడుతూ.. RAW (రా) అనే టైటిల్ ను చూడగానే కొత్తగా అనిపించింది. అలానే పోస్టర్ లో కూడా కొత్తదనం కనపడుతోంది. సినిమాలో ఏదైనా విషయం ఉంటేనే వర్కౌట్ అవుతాయి దానికి బెస్ట్ కంటెంట్ చెప్పుకుంటే హారర్ కామెడీ లేదా లవ్ స్టోరీ ఉండాలి అవే ఈ RAW (రా) సినిమాలో ఉన్నాయని అర్థమవుతోంది. డైరెక్షన్, ప్రొడక్షన్ చేయడం చాలా కష్టమైన పని. ఈ రెంటిని బ్యాలేన్స్ చేయడమంటే సాధారణమైన విషయం కాదు అలాంటి బాధ్యతను తీసుకున్న రాజ్ డొక్కర నిజంగా గ్రేట్ అని చెప్పాలి. టీమ్ అందరిదీ వైజాగ్ అని అర్థమవుతోంది. షూటింగ్ కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే చేశారని చెబుతున్నారు. అక్కడ అన్నీ సౌకర్యాలు ఉండంతో ఇటీవల అందరూ వైజాగ్ లోనే షూట్ చేస్తున్నారు. మెచ్చుకోదగ్గ విషయమే.. ఇక ఈ సినిమా ను చాలా ఫ్యాషనేట్ తో తీశారు. పెద్ద సక్సెస్ అందుకోవాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

దర్శకుడు, నిర్మాత రాజ్ డొక్కర మాట్లాడుతూ.. RAW (రా) సినిమాను ఒక ట్రూ స్టోరీ ని బేస్ చేసుకొని చేసిన సినిమా. మా సినిమా లో RAW( రా) అంటే ఏంటి అనేది ఇంటర్వెల్ లో అబ్రివేషన్ తో పాటు రివీల్ చేయడం జరుగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. రెండు పాటలు, రెండు ఫైట్స్ మిగిలి ఉన్నాయి. త్వరలో అవికూడా పూర్తి చేసి ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇక మా టీమ్ అందరూ ఎంతో ఇష్టం తో కస్టపడి పని చేశారు. 25 డేస్ లో సినిమా షూటింగ్ పూర్తి చేయగలిగాము అంటే అది వీరిచ్చిన సపోర్ట్ కారణం అని తెలిపారు.

హీరోయిన్ లోహిత మాట్లాడుతూ.. నాలో ఇంత టాలెంట్ ఉందని నాకే తెలియదు. డైరెక్టర్ గారు చాలా ఎంకరేజే చేశారు. థ్రిల్లర్ జోనర్. సినిమా చాలా బాగొచ్చింది. అందరం చాలా కష్టపడి పనిచేశాము మీకు కూడా మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను అని చెప్పారు.

హీరో మనోహర్ మాట్లాడుతూ.. RAW (రా) అంటే ఫుల్ ఫార్మ్ ఏంటి అనేది సినిమా లోనే చెబుతాము. ఆర్టిస్టులతో కలసిపోయి టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఈ సినిమాలో ఒక పాప ఉంది. ఆ పాప పాత్రే ఈ సినిమాకు వెన్నెముక. సినిమా చాలా బాగుంటుంది. మమ్మల్ని ఆదరించండని అన్నారు.

హీరో చంటి మాట్లాడుతూ.. త్రినాధ్ నక్కిన గారు మా కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇచ్చే ప్రోత్సాహం వల్లే నేను ఇప్పుడు ఇక్కడున్నాను. అందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. మా సినిమాలో ప్రతి సీన్ ఆకట్టుకునేలా ఉంటుంది. చాలా ఇష్టం తో ఈజీ గా వర్క్ చేసాము. టీమ్ సపోర్ట్ చాలా బాగుందని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్, స్వీటీ, ఆజాద్ ఖాన్, సూర్య లతో పాటు తదితరులు పాల్గొని తమ అభినందనలు తెలియచేసారు.

చంటి, మనోహర్, లోహిత, ఇర్ఫాన్ , స్వీటీ, ఆజాద్ ఖాన్, సూర్య, వినోద్, హాడీ, నయీమ్, శ్రీనివాస్ ప్రధాన ప్రాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: రాజ్ డొక్కర, కెమెరా: రాజేష్ భూపతి, కో డైరెక్టర్: సురేష్ వాన పిల్లి, మ్యూజిక్: కె. వేద, లిరిక్స్: రామాంజనేయులు, మేకప్: గణేష్, స్టంట్స్: రాజేష్, కొరియోగ్రఫీ: గణేష్ స్వామి, ప్రొడక్షన్: పి. సంతోష్ కుమార్, వెంకీ (పార్వతి పురం ). ఆర్ట్: రాఘవ, అఖిల్.

‘Production No1’ Shooting Completed

‘తోలుబొమ్మల సిత్రాలు’ బ్యానర్ పై కొమారి జానకీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్1 చిత్రం స్పెషల్ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.కోమరక్క,,వేదం నాగయ్య,గోవింద్,జానపదం అశోక్,నల్లి సూదర్శనరావు తదితరులు నటిస్తున్నారు..

ఈ సందర్భంగా దర్శకుడు జానకిరామ్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ:-బాచుపల్లి దగ్గర వేసిన ప్రత్యేకమైన సెట్ లో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ తో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందని చెప్పారు..

శ్రష్టి వర్మ డాన్స్ పర్ఫార్మెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ ముఖ్యంగా ఈ పాట మద్యానికి బానిసైన వారికి సందేశాన్ని ఇస్తూనే అన్ని వర్గాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని,ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుందని అన్నారు.కథ విషయానికి వస్తే కామెడీ, హర్రర్,థ్రిల్లర్ బేస్ గా తయారవుతున్న

ఈ సినిమా ప్రేక్షకులను మంచి థ్రిల్లింగ్ తోపాటు మంచి మెసేజ్ ను కూడా ఇస్తుందని అన్నారు..

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్– డి.యాదగిరి,

ఎడిటింగ్– సునీల్ మహారాణా,

సంగీతం-యు.వి.నిరంజన్,

నిర్మాత– కొమారి జానయ్య నాయుడు,

కథ, మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం-కొమారి జానకిరామ్.

Superstar Fans New year Celebrations

ఆర్ టి సి క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35ఎంఎం థియేటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ” సరిలేరు నీకెవ్వరు ” చిత్రం జనవరి 11న విడుదల అవుతున్న సందర్భంగా 2020 జనవరి 1న సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు దిడ్డి రాంబాబు ఆధ్వర్యంలో థియేటర్ యజమాని బాలు గారు కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు .

ఈ సందర్భంగా దిడ్డి రాంబాబు మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మహేష్ బాబు 81 అడుగుల కటౌట్ ను విడుదలకు 50 రోజుల ముందే థియేటర్ లో నిలబెట్టడం ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచిందని , మురారి , ఒక్కడు , అతడు , పోకిరి నాలు చిత్రాలు సుదర్శన్ లో  సిల్వర్ జూబిలీ జరుపుకోవడం చాల ఆనందంగా ఉందని , మహేష్ కి సుదర్శన్ థియేటర్ కలిసొచ్చిందని అన్నారు. సుదర్శన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి , దేవి థియేటర్ మేనేజర్ కుమార్ లతో పటు అభిమానులు ప్రధాన కార్యదర్శి మల్లేష్ , యస్ రాజా రెడ్డి , వై నాగరాజు , యస్ వెంకటేష్ యాదవ్ , బ్యాంకు రాజు , రమేష్ యాదవ్ , యన్ మధు బాబు , కే సాయి కుమార్ , వెంకీ , శివ మయూరి , రాజు మయూరి , కే కిరణ్ తదితర అభిమానులు పాల్గొన్నారు

HulChul Movie Pre-Release Event

ఎమ్.ఎస్.కె డిజిటల్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ సమర్పించు, శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గణేష్ కొల్లూరి నిర్మించిన హల్ చల్ జనవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు దర్శకులు క్రాంతి మాధవ్, శివ నిర్వణ, నిర్మాతలు బెక్కం వేణు గోపాల్, మల్కాపురం శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ….
అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హాల్ చల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవ్వడం సంతోషంగా ఉంది. నేను ఈ సినిమా చూశాను, బాగుంది. రేవు సినిమా విడుదల తరువాత ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మంచి కంటెంట్ తో కూడుకున్న సినిమా ఇది. అందుకోసం నా వంతు సహాయం చేశానన్నారు.

హీరో రుద్రాక్ష్ మాట్లాడుతూ….
మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన క్రాంతి మాధవ్, శివ నిర్వణ గారికి థాంక్స్, మేము ఇష్టపడి ఈ సినిమా చేశాము. నన్ను నమ్మి ఈ సినిమా చేసిన నా నిర్మాతకు జీవితాంతం రుణపడి ఉంటాను. డైరెక్టర్ నాకు ఈ కథ చెప్పగనే నచ్చింది, చేసాను. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది, రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడం లేదు, అలాంటి సమయంలో శివకుమార్ గారు మాకు బాగా సపోర్ట్ చేశారు. కొత్త కాన్సెప్ట్స్ ను అలరించే ఆడియన్స్ ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది. మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రేక్షకులకు ఈ సందర్భంగా కోరుకుంటున్న అన్నారు.

బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ…
నేను ఈ సినిమా చూశాను, చూస్తున్నంత సేపు సినిమాను ఎంజాయ్ చేశాను. ఇలా కొత్త కంటెంట్ తో వస్తోన్న కొత్త సినిమాలు సక్సెస్ అవుతాయని నమ్ముతున్నాను. సినిమా చాలా ఎంగేజింగ్ ఉంటుంది. రుద్రాక్ష, ధన్య కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది. దర్శక నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతోందని నమ్ముతున్నాను అన్నారు.

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ…
రీసెంట్ టైమ్స్ లో కంటెంట్ బాగున్నా చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. అలాగే ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. రుద్రాక్ష నాకు మంచి ఫ్రెండ్, తనకు ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అలాగే చిత్ర యూనిట్ సభ్యులకు పెద్ద విజయం సాధించి పెడుతుందని భావుస్తున్నాను అన్నారు.

డైరెక్టర్ క్రాంతి మాధవ్ మాట్లాడుతూ…
రుద్రాక్ష్ నాకు మంచి ఫ్రెండ్, ఇండస్ట్రీలో ఉన్న తక్కువ ఫ్రెండ్స్ లో తాను ఒకడు, తాను ఎంతో కష్టపడి ఈ సినిమా తీసాడు. ఈ సినిమా హిట్ అయ్యి చిత్ర యూనిట్ సభ్యులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్న.

డైరెక్టర్ శ్రీపతి మాట్లాడుతూ….
మా సినిమా విడుదలకు హెల్ప్ చేసిన మల్కాపురం శివకుమార్ గారికి థాంక్స్, ఈ ఫంక్షన్ కు వచ్చిన డైరెక్టర్స్ క్రాంతి మాధవ్, శివ నిర్వణ గారికి ధన్యవాదాలు. హీరోయిన్ ధన్య మాకు బాగా సపోర్ట్ చేశారు, నన్ను నిర్మాతను కలిపింది రుద్రాక్ష్, తాను ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాడు. మదర్ అండ్ సన్ మధ్య సన్నివేశాలు ఈ సినిమాలో ఆడియన్స్ కు నచ్చుతాయి. ఎడిటర్ ప్రవీణ్ పూడి, కెమెరామెన్ రాజ్ తోట గారికి థాంక్స్, ఆడియన్స్ డబ్బు పెట్టి కొన్న టికెట్ కు ఈ హాల్ చల్ సినిమా పూర్తి న్యాయం చేస్తుందని తెలిపారు.

నిర్మాత గణేష్ మాట్లాడుతూ….
హాల్ చల్ మూవీని 3 ఏళ్ళ నుండి కష్టపడి తీశాము, ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి, అలాంటి సందర్భంలో నిర్మాత మల్కాపురం శివకుమార్ నాకు సపోర్ట్ చేశారు, ఆయనకు నా ప్రేత్యేక ధన్యవాదాలు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా అందరూ కష్టపడి సినిమా చేశారు. మా ప్రయత్నాన్ని మీరందరూ అభినందిస్తారని కోరుకుంటున్న అన్నారు.

హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ…
శివకుమార్ గారు మా సినిమాకు చేస్తున్న సపోర్ట్ కు స్పెషల్ తెలుపుతున్నాను. హాల్ చల్ సినిమాలో మంచి రోల్ చేశాను, అద్భుతమైన స్క్రిప్ట్ తో ఈ సినిమా ఆడియన్స్ దగ్గరకు రాబోతోంది.  ఈ సినిమాను థియేటర్ లో చూడండి ప్లీజ్ పైరసీని ఎంకరేజ్ చేయొద్దని తెలిపారు.

‘Cinema Katha Chitram’ Audio Launch

`వంశం` చిత్రానికి 13 అవార్డ్స్ సొంతం చేసుకున్న దర్శకుడు   రామ్ మధుసూదన్ దర్శకత్వం లో వస్తోన్న తాజా చిత్రం `సినిమా కథా చిత్రమ్’రామ్ ఫిలిమ్స్ పతాకం పై  మదన్మోహన్ నాయుడు , జి. తిమ్మా రెడ్డి గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  రుషి లక్ష్మణ్ , ఉమేష్, సాయికుమార్,  జాకీ షరాఫ్, షీనా రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ , తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆడియో లాంచ్ బుధవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి.రామసత్యనారాయణ , మోహన్ గౌడ్ , సాయివెంకట్ విచ్చేశారు.

టి. రామసత్యనారాయణ మాట్లాడుతూ... వంశం, ప్రేమ చరిత్ర  లాంటి మంచి చిత్రాలు చేశారు .  వంశం చిత్రానికి ఏకంగా 13 అవార్డ్స్ తీసుకున్నారు.  ఇక `సినిమా కథా చిత్రమ్ `. ,  సాంగ్స్ ,  ట్రైలర్ బావున్నాయి. రామ్ మధుసూదన్ సినిమాలు టెక్నికల్ వాల్యూస్ తో ఉంటాయి. ఈ సినిమా పెద్ద  సక్సెస్ అవ్వాలన్నారు`.

లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ…“రామ్ మధుసూదన్ గారు ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఈ సినిమా ట్రైలర్. పాటలు బావున్నాయి. సినిమా పెద్ద సక్సెస్ కావాలన్నారు.

మోహన్ గౌడ్ మాట్లాడుతూ …“ ట్రైలర్ చూసాక మంచి హార్రర్ సినిమా అని తెలుస్తోంది . పాటలు కూడా బావున్నాయి. మంచి టైటిల్ పెట్టారు. టీం అందరికి నా శుభాకాంక్షలు“ అన్నారు.

నటుడు ఉమేష్ మాట్లాడుతూ…“ డైరెక్టర్. ప్రొడ్యూసర్ నాకు మంచి మిత్రులు. ఈ సినిమాలో నేను మంచి క్యారక్టర్ చేశాను. తెలుగు, కన్నడ రెండు భాషల్లో మంచి సక్సెస్ కావాలన్నారు.

నిర్మాత  జి. తిమ్మా రెడ్డి గౌడ్ మాట్లాడుతూ …“డైరెక్టర్ రామ్ మధుసూదన్ మంచి  కాన్సెప్ట్ తో సినిమా చేసారు.  ఎక్కడా  రాజీ పడకుండా తెలుగు , కన్నడ భాషల్లో నిర్మించాము. జాకీ స్రాఫ్ గారు, సాయికుమార్ గారు చాలా సపోర్ట్ చేశారు. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని “ కోరుకుంటున్నాం“ అన్నారు.

డైరెక్టర్ రామ్ మధుసూదన్ మాట్లాడుతూ …“వంశం చిత్రానికి 13 అవార్డ్స్ వచ్చాయి. రామానాయుడు గారు అప్పట్లో పిలిచి అభినందిచడమే కాకుండా మనం కలిసి సినిమా చేద్దాం అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇక ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను.   లేటెస్ట్ గా రుషి ని హీరోగా పరిచయము చేస్తూ `సినిమా కథా చిత్రమ్ ` చేశాను.  అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాము“ అన్నారు.

MegaStars ‘Chiru152’ Movie shooting started

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ తిరు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌. సురేష్ సెల్వ‌రాజ‌న్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Thapassi movie Trailar launch

ఆర్.యస్ మూవీస్ పతాకంపై అభిరామ్,ఇంతియాజ్,భవ్య,మమతశ్రీ ,చిత్రం శ్రీను,జీవ,సుమన్ శెట్టి,ఫిష్ వెంకట్,ఛత్రపతి శేఖర్,చిట్టిబాబు నటీనటులుగా రాజు శెట్టి దర్సకత్వంలో పి. శ్రీ కృష్ణ,అజయ్ లు నిర్మిస్తున్న “తపస్సి” చిత్రానికి మిత్ర సంగీతం అందించాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన లయన్ సాయి వెంకట్,గొట్టిముక్కల పద్మారావు, మేడ్చెల్ యంపిపి జగన్,బి.వెంకటరెడ్డి,బాలాజీ,మరియు చిత్ర యూనిట్ తో కలసి ఈ సినిమా పాటలను,టీజర్,ట్రైలర్ ను విడుదలచేసారు**

*అనంతరం అతిధిగా వచ్చిన లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ* :-దర్శకుడు రాజు శెట్టి చిత్రం శీను దగ్గర పనిచేసి ఇప్పుడు ఆయన్నే తన సినిమాలో పెట్టుకొని రేమ్యూనిరేషన్ ఇవ్వడం అనేది ఒక సినిమా ఇండస్ట్రీ కు మాత్రమే సాధ్యం. ఇండస్ట్రీ లో చాలా మంది వాస్తవం చెప్పుకోరు,వాస్తవం చెప్పుకొన్నపుడే సినిమా రంగం లో ఎదుగుతారు, కానీ తను ఎలా ఎదిగాడో కల్మషం లేకుండా చెప్పడం,అభినందనీయం.దర్శకుడికి ఎంత టాలెంట్ ఉన్నా, నిర్మాత అవకాశం ఇవ్వక పోతే డైరెక్టర్ టాలెంట్ బయటకు రాదు.నిర్మాత శ్రీకృష్ణ, రాజు కు తన టాలెంట్ నిరూపించుకువడానికి అవకాశమిచ్ఛాడు.సినిమా చాలా బాగా తీసాడు. సినీపరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఏ స్థాయికి వెళతారో చెప్పలేం, నమ్ముకున్న సినీపరిశ్రమ లో ఎప్పుడైనా వారు ఒకరోజు సెలెబ్రిటీ అవుతారు.చిత్రం శ్రీను ను నేను గత 15 సంవత్సరాలుగా చూస్తున్నాను. చాలామంది ఆర్టిస్ట్ లు సినిమాల్లో నటిస్తూ కొంత కాలానికి ఔట్ డేటెడ్ అవుతుంటారు,కానీ చిత్రం సినిమాతో చిత్రం శ్రీను గా మారిన తను కంటిన్యూ గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో పాటలు,ట్రైలర్ తో పాటు థ్రిల్లర్, రొమాంటిక్, హరర్ ఇలా అన్ని కంటెంట్స్ ఉన్నాయి.హారర్ కు లాంగ్వేజ్ తో పనిలేదు అంతటా డిమాండ్ ఉంది. దర్శక,నిర్మాతలు అటువంటి కథలను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈసినిమా వారికీ మంచి పేరుతోపాటు ఆదాయం కూడా కలగాలని అన్నారు..

*గొట్టెముక్కల పద్మారావు మాట్లాడుతూ* :-హారర్ సినిమాలంటే నాకు భయం,నేను పెద్దగా చూడను.పెద్ద వంశీ మూవీ అన్వేషణ చూసి ఆయనే డైరెక్టర్ కావాలని ఒక నవల చదివి ఏప్రిల్ 1 విడుదల అను సినిమాను కొందరి మిత్రులతో కలిసి సినిమా తీసాను.ఈ సినిమా ట్రైలర్ ను చూసిన తరువాత హారర్ కు తగ్గట్లే మంచి ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు.చిన్న బడ్జెట్ అయినా నిర్మాతకు బడ్జెట్ పెరగకుండా పెద్ద అరిస్టులతో సినిమా బాగా తీశారు. ఇలాంటి టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశమిచ్చిన నిర్మాత కు థాంక్స్ చెప్పాలి. నేను ఈ సినిమా చూసాను,దర్శకుడు పెద్ద వంశీ అంతటి గొప్పవడవ్వాలని కోరుకుంటానని అన్నారు.

*మేడ్చెల్ యంపిపి జగన్ మాట్లాడుతూ* :-మేము ఎక్కువగా సినిమా ఫంక్షన్లకు రాము,ఇదే మొదటిసారి రావడం, ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి.’తపస్సి’ చిత్రం దర్శక, నిర్మాతలకు మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని సినిమాలు తీయాలని న్నారు.

*చిత్రం శ్రీను మాట్లాడుతూ* :-నా దగ్గర పనిచేసిన చాలా మంది డైరెక్టర్స్, యాక్టర్స్ అయ్యారు.అలా అయిన వారి లో రాజు శెట్టి ఒకరు.తను దర్శకత్వం చేస్తున్నానని చెప్పడంతో చాలా సంతోష పడ్డాను..ఇపుడు తన సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది.సినిమా కోసం దర్శక,నిర్మాతలు చాలా కష్టపడ్డారు వారిద్దరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు…

*దర్శకుడు రాజు శెట్టి మాట్లాడుతూ* :-నేను చిత్రం శ్రీనన్న దగ్గర అసిస్టెంట్ గా 300 రూపాయలకు పనిచేశాను,ఆయనకు గొడుగులు కూడా పట్టాను.ఇప్పుడు ఆ అన్ననే నా సినిమాలో పెట్టుకొని రేమ్యూనిరేషన్ ఇచ్చాను.ఇదంతా అన్న సపోర్ట్ వలనే..నేను తీసిన దేవి విఘ్నం సినిమా తరువాత చేస్తున్న 2వ సినిమా ఇంత బాగా రావడానికి కారణం..నా ఎడిటిండ్ టీం నుండి డైరెక్షన్ టీం వరకు అందరూ నాకు సపోర్ట్ చేస్తూ కష్టపడి పనిచేశారు. ఇందులో సీనియర్ ఆర్టిస్ట్ లను పెట్టాము ,వీరికి షూట్ టైం చెబితే మాకన్న ముందే వచ్చి మేకప్ వేసుకొని రెడి గా ఉండేవారు. వారంతా నేను ఏది చెప్పితే అది చేసారు. వీడు మా దగ్గర పనిచేశాడు కదా వీడి మాట నేను ఎందుకు వినాలనుకోకుండా..వీరు డైరెక్టుకు ఇచ్చే వ్యాల్యూ ఇస్తూ వీరంతా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ పనిచేసినందున ఈ సినిమా అంతా బాగా వచ్చింది.నాకింత సపోర్ట్ చేసిన శ్రీనన్నకు ప్రత్యేక అభినందనలుతెలుపుకుంటున్నాను.నిర్మాత ఇందులో మంచి కామెడీ రోల్ చేసాడని అన్నారు

*హీరో అభిరామ్ మాట్లాడుతూ* :-దర్శకుడు ఈ సినిమా కోసం వన్ మ్యాన్ ఆర్మీ లా పనిచేశాడు.నాకీ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత పి.శ్రీకృష్ణ మాట్లాడుతూ:-నామొదటి సినిమా లీల తరువాత చేస్తున్న 2వ సినిమా తపస్సి..ఈ 2019 సంవత్సరం నేను మరచిపోలేను.. నా మొదటి సినిమాకు కూడా ఇంత సపోర్ట్ రాలేదు.నేను ఇచ్చిన మాట తప్పను అనే పేరుంది,సారథి స్టూడియోలో ఒక ఫంక్షన్లో రాజును, కలిసినప్పుడు నా సినిమాలో డైరెక్షన్ అవకాశమిస్తామని చెప్పాను,ఇచ్చిన మాటను ఈ సినిమా ద్వారా నెరవేర్చుకొన్నాను అని అన్నారు..

Macho Star Gopichand,Director Sampath Nandi,Movie Has Completed Its First Schedule

Macho Star Gopichand’s next in Mass Director Sampath Nandi’s direction has kickstarted its regular shoot from December 14th. Srinivasaa Chitturi who has earlier produced Superhit film, ‘U-Turn’ under Srinivasaa Silver Screen banner is producing this biggie as ‘Production No 3’. Milky beauty Tammanah is playing the female lead while Digangana Suryavanshi is playing as another heroine in this prestigious film which will be made on a large scale with high technical values and a high budget. Mani Sharma is composing the music while Bhumika and Rao Ramesh are playing other key roles.

The first schedule which was kick-started recently has been completed. In this first schedule, The team has picturized crucial scenes at a lavish set erected at Aziznagar. The next schedule will commence very soon. Makers are planning to release the film as a summer special.

Macho Star Gopichand, Milky Beauty Tammanah, Digangana Suryavanshi, Bhumika, Rao Ramesh, and others are the principal cast

DOP: S Soundar Rajan, Music: Mani Sharma, Editor: Tammi Raju, Art Director: DY Satyanarayana,
Presents: Pavan Kumar
Producer: Srinivasaa Chitturi
Story, Dialogues, Screenplay & Direction: Sampath Nandi