Home Blog Page 996

Rashmika’s outstanding dance moves for Sarileru Neekevvaru

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు లేటెస్ట్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. యంగ్ అండ్ టాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్ప‌టికే  విడుదలైన టీజర్‌, ఫస్ట్ మాస్‌ సాంగ్‌, సెకండ్ మెలొడి సాంగ్ కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా ఈ చిత్రం నుండి అంద‌రూ ఎదురు చూస్తున్న రొమాంటిక్ సాంగ్‌ ` హీ ఈజ్ సో క్యూట్`ను ఈ సోమవారం సాయంత్రం 05.04 గంటలకు విడుద‌ల‌చేయ‌నుంది చిత్ర యూనిట్.

హీ ఈజ్ సో క్యూట్ అంటూ హీరోయిన్ రష్మిక మందన్న ఈ పాట‌కు డాన్స్ చేస్తున్న వీడియో గ్లింప్స్‌ను టిక్ టాక్‌లో విడుదల చేశారు. ఈ  పాటకు రష్మిక మందన్న అద్దిరిపోయే స్టెప్పులేసింది. ఆమె డ్యాన్స్‌కు మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రష్మిక, మహేష్  ఒకరినొకరు ఆటపట్టిస్తూ సాగే ఈ రొమాంటిక్ గీతానికి దేవిశ్రీ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. డిసెంబరు 16న‌ ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేయబోతోంది చిత్ర యూనిట్.  సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానున్న విష‌యంతెలిసిందే…

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Mathu vadalara Team doing Unique Publicity

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా  అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న  చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. కాగా ఈ చిత్ర పబ్లిసిటిని వినూత్నంగా ప్లాన్ చేశారు చిత్రం బృందం. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వైవిధ్యమైన ప్రచారానికి శుక్రవారం హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద శ్రీకారం చుట్టడంతో పాటు ఈ చిత్రానికి సంబంధించిన తొలి లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ వైవిధ్యమైన పబ్లిసిటి క్యాంపెయిన్‌కి అందర్ని నుండి మంచి స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ  ప్రేక్షకులకు చిత్రం చేరువ కావడానికి పబ్లిసిటిని వినూత్నంగా చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. అందుకే ఈ చిత్ర పబ్లిసిటిని సరికొత్త పంథాలో ప్లాన్ చేశాం.ఇటీవల మెగా పవర్‌స్టార్ విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. నూతన ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీశాం. వినోదం మేళవించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా ద్వారా కొత్త సాంకేతిక నిపుణుల్ని, నటుల్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తున్నాం. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది  అన్నారు.

నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, క్రియేటివ్ హెడ్: థోమస్‌జై, కొరియోగ్రాఫర్: యశ్వంత్, స్టయిలింగ్, స్టంట్ కో-ఆర్టినేటర్: శంకర్ ఉయ్యాల, కో-రైటర్: తేజ.ఆర్, సాహిత్యం: రాకేందుమౌళి, సంగీతం: కాలభైరవ, లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్ రావు, పబ్లిసిటీ డిజైనర్: ది రవెంజర్ట్, కథ, దర్శకత్వం: రితేష్ రానా.

HandsUp full video song from Rakshitshetty’s Athade SrimanNarayana released

ర‌క్షిత్ శెట్టి హీరోగా పుష్క‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ నిర్మిస్తోన్న చిత్రం `అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌`. స‌చిన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. 
చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబంధించి భారీ లెవ‌ల్లో ప్ర‌మోష‌న్స్‌ను ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన `హ్యాండ్స‌ప్‌…` అనే తొలి వీడియో సాంగ్‌ను గురువారం విడుద‌ల చేశారు. 
సాహోరే స‌భా ప్రాంగ‌ణం..వినుకో నా వీర ప్ర‌కర‌ణం
ఖాకీపై ప్ర‌మాణం.. నా ప్ర‌యాణం.. క‌త్తి అంచేగా ఒక్కో క్ష‌ణం
క‌ర్త‌వ్యం ధ‌ర్మ ర‌క్షణం.. పిస్తోలే హ‌స్త భూష‌ణం…
హ్యండ్స‌ప్ నా ప్ర‌తి శ‌బ్దం.. హ్యాండ్స‌ప్ నా నిశ్శ‌బ్దం.. హ్యండ్స‌ప్ ఓ అణుయుద్ధం
అనే ప‌ల్ల‌వితో మొద‌లైన పాట ఇది. పోలీస్ ఆఫీస‌ర్ అయిన హీరో విల‌న్స్‌కు త‌న క్యారెక్ట‌ర్ ఏంటి? త‌న ప‌నేంటి?  అనే విష‌యాల‌ను వివ‌రిస్తుంది..పురాణాల్లో విష్ణు మూర్తిలాంటివాడ‌నని.. దుష్ట శిక్ష‌ణ శిష్ట ర‌క్ష‌ణ చేస్తాన‌ని  ఈ పాట‌లో ఉంది. అదే హీరో పేరు. దాన్నే టైటిల్‌గా పెట్టారు.
ఆస‌క్తిక‌రంగా.. అర్థ‌వంతంగా.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఈ పాట‌ను రాశారు.
బి.అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమాలో టైటిల్ సాంగ్‌ను రామ‌జోగయ్య శాస్త్రి రాశారు.
భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ లెవ‌ల్లోఈ సినిమానువిడుద‌ల చేస్తున్నారు.

Aishwarya Rajesh As Vijay Devarakonda’s Wife In World Famous Lover

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో..సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై  కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న నిర్మిస్తోన్న చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`. వేలంటెన్స్ డే సంద‌ర్భంగా సినిమాను ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌ణాళిక ప్ర‌కారం చిత్ర యూనిట్ భారీ ప్ర‌మోష‌న్స్‌ను ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఇందులో న‌టిస్తోన్న న‌లుగురు హీరోయిన్స్‌లో ఒక్కొక్క‌రి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. ఇందులో హీరోతో ఆ న‌లుగురు హీరోయిన్స్‌కు ఉన్న సంబంధాన్ని తెలియ‌జేస్తారు.
`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర పేరు శీన‌య్య‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌  భార్య సువ‌ర్ణ‌ పాత్ర‌లో ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తున్నారు. వీరిద్ద‌రూ కిచెన్‌లో ఉన్ రొమాంటిక్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ యంగ్ లుక్‌లో క‌న‌ప‌డుతుంటే.. ఐశ్వ‌ర్యా రాజేష్ హోమ్లీ లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు.
అలాగే  ఈ నెల 13న ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖ‌న్నాల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 3న విడుద‌ల చేస్తున్నారు.
ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీతం, జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Megastar chiranjeevi Condolences on Gollapudi Maruthi Rao Demise

గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.  ఆయన మరణం పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ఆ మధ్య  తన కుమారుడు పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్  అవార్డ్ ఫంక్షన్‌కి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను  ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. గురు శిష్యుల్లాంటి సంబంధం. నేను 1979లో ఐలవ్‌యూ అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ భావన్నా రాయణగారు నాకు గొల్లపూడి మారుతిరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతిరావుగారు చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టు గా కూడా పనిచేశారు. సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. ఆ రకంగా గొల్లపూడి మారుతిరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాస్‌లు తీసుకున్నారు. ఈ విధంగా ఆయన నాకు గురువనే చెప్పగలను. ఆ సరదా పరిచయం మాకు స్నేహంగా మారింది. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను టి.నగర్‌లో వాళ్ళింటికి వెళ్తుండేవాడిని. ఆయన నాతో ఎన్నో సాహిత్య పరమైన విషయాలు చెప్పేవారు. తన గతం గురించి,  గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటుండేవాడిని. నాకుకూడా సాహిత్యం పట్ల, గొప్ప రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయన ద్వారానే కలిగింది. 1982లో కోడిరామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో క‌ృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆకథలో ఈ పాత్రని గొల్లపూడి మారుతిరావుగారు వేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా అది మంచి చాయిస్ అనిపించింది.  ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్ .  ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్బుతం గా నటించి అందరి మన్ననలు పొందారు, ఆ విధంగా నా సహనటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి నాకు. ఆ తర్వాతనుంచి ‘ఆలయ శిఖరం‘ , ‘అభిలాష’, ’ఛాలెంజ్‘ లాంటి వరుసగా ఎన్నో సినిమాలు నాతో కలిసి నటించారు. మేం ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాాల ా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్నాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత అయిన గొల్లపూడి మారుతిరావుగారు దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అన్నారు.

Tollywood Actress Kajal Agarwal Grand Launch of Vidhatri Shopping Mall @ Vijayawada

స్వచ్ఛమైన విలక్షణమైన కంచి పట్టు వస్త్ర సోయగాలు ఇప్పుడు విజయవాడ వస్త్ర అభిమానులకు విధాత్రి అందుబాటులోకి తెచ్చింది. మనసులు దోచే కంచి పట్టు వస్త్రాలను ధరలకే  విక్రయించేందుకు 
గాను విధాత్రి షాపింగ్ మాల్ శుక్రవారం విజయవాడ మొగలాజపురం లోని యం.జి.రోడ్డు పివిపి లేన్ లో ప్రారంభించింది. 
 
ప్రముఖ సినీ తార కాజల్ అగర్వాల్ ఈ షోరూమ్ ని ప్రారంభించింది. 
షోరూం ప్రతినిధులు సందీప్, మైత్రియా మరియు సింధు మాట్లాడుతూ …..
విధాత్రి షాపింగ్ మాల్ లో స్వచ్ఛమైన ఒరిజినల్ కాంచీపురం పట్టు వస్త్రాలను హోల్ సేల్ ధరలకే వినియోగదారులకు అందిస్తున్నామని 
తెలిపారు. ఇక ఇప్పుడు పట్టు వస్త్రాల కొనుగోలు కోసం అందరూ కంచి 
కాదు… విజయవాడకు వస్తారని పేర్కొన్నారు. కంచి, ఉప్పాడ, బెనారస్,పోచంపల్లి ఇంకా మరెన్నో రకాల పట్టు చీరలు విధాత్రి షో రూమ్ లో లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఇంతేకాక కాలేజీ విద్యార్థుల కోసం లేటెస్ట్, వెరైటీ డ్రెస్సులు కూడా హోల్ సేల్ ధరలకే తమ వద్ద లభిస్తాయని అన్నారు. యువకుల కోసం షేర్వానీ లు కూడా విధాత్రి షోరూంలో లభిస్తాయని తెలిపారు. అన్ని వయసుల వారికి… అన్ని  వేడుకలకు శుభకార్యాలకు కావలసిన వస్త్రాల నీటిని హోల్ సేల్ 
ధరలకే అందిస్తున్నాంమని ఈ చక్కటి అవకాశాన్ని  విజయవాడ ప్రాంతవాసులు వినియోగించుకోగలరు అని నిర్వాహకులు తెలిపారు.

‘Johar’ Movie first look launched

ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ‘జోహార్’. భాను సందీప్ మార్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకుడు. జోహార్ చిత్ర యూనిట్ తాజాగా జోహార్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది.ఈ  ఫస్ట్ లుక్ లో తాజా రాజకీయ మరియు సాంఘిక పరిణామాలని ఎత్తి చూపుతూ, విగ్రహ రాజకీయం కాళ్ళ కింద నలిగిపోయిన 5 జీవితాల కథనాలే ఇతివృత్తం గా సాగించిన ఎమోషనల్ డ్రామా జోహార్ అని తెలుస్తుంది.

ఈ సందర్భంగా దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ ‘‘నేను ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘వంగవీటి’ చిత్రానికి దర్శకత్వ శాఖలో, అలాగే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌గారి వద్ద రచనా విభాగంలో పనిచేశాను. డైరెక్టర్ గా నా తొలి చిత్రం ‘జోహార్’. పొలిటికల్ సెటైర్‌గా రూపొందిస్తూ ఐదు పాత్రల చుట్టూ అద్భుతంగా తిరిగే ఎమోషనల్ డ్రామాగా దీన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావాలనుకుంటున్నాను. ప్రస్తుతం చిత్ర షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ నుండి ఊహించిన దానికంటే మా చిత్రంలో చాలా కంటెంట్ ఉంది. అందుకే విజయంపై మా యూనిట్ మొత్తానికి పూర్తి నమ్మకముంది” అన్నారు.

‘దృశ్యం’ చిత్రంలో వెంకటేశ్ కూతురిగా నటించిన ఈస్తర్ అనిల్, ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు, రోహిణి, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చిత్ర కథనం ప్రకారం వారణాసి, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది.

దర్శకుడు: తేజ మార్ని
నిర్మాత: భాను సందీప్ మార్ని
సంగీతం: ప్రియదర్శన్
ఎడిటర్: సిద్ధార్థ్
సినిమాటోగ్రఫీ: జగదీశ్
పాటలు: చైతన్యప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్‌: గాంధీ

Crazy RamRam song from ‘ Oollaala Oollaala’is Highlight For the film -A GuruRaj

సీనియర్ నటుడు సత్యప్రకాష్  దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై ‘లవర్స్ డే’  ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం “ఊల్లాల ఊల్లాల”. సత్యప్రకాష్ తనయుడు నటరాజ్ హీరోగా పరిచయమౌతున్నారు. నూరిన్‌, అంకిత‌ కథానాయికలు.తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా “ఊల్లాల  ఊల్లాల” చిత్రం లో ‘రాం రాం’ పాట పాడుతూ నటించడమే కాక,  హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది.’రాం రాం’ అనే ఈ  పాటను  ప్రముఖ కమెడియన్ రఘు బాబు , పాపులర్ ర్యాప్ సింగర్ రోల్ రైడా కూడా ఆలపించడం విశేషం . ఈ పాట పూర్తి  వీడియోను ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ద్వారా హైదరాబాద్ లో రిలీజ్ చేసారు.
 
  ఈ సందర్భంగా సింగర్ మంగ్లి  మాట్లాడుతూ, “నిర్మాత గురురాజ్ అన్న తన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎన్ని కష్టాలు , నష్టాలు పడ్డా చిత్ర పరిశ్రమకి దూరమవ్వకుండా మంచి మంచి చిత్రాలని సుఖీభవ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆయన చాలా ఇష్టంతో నిర్మించారు. ఇందులో నన్ను కూడా భాగం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నపుడు సత్యప్రకాష్ గారిని విలన్ గా చూసి చూసి మొదట్లో సెట్లో భయంగా అనిపించినా ఆయన తెరవెనుక స్వభావం, తెలుగు భాష ఫై  పట్టు చూసాక ఆశ్చర్యపోయాను. ఆయన దర్శకత్వం చాలా బాగా చేశారు. ఈ చిత్రంలో ఒక పాట నేను పాడి, ఆ పాటలో నేను  నటించాను.  నాతో పాటు నటించిన రోల్ రైడా మరియు సంగీతం అందించిన జాయ్, డాన్స్ మాస్టర్ శేఖర్ గారు నాకు చాలా సహకరించారు. రచయిత కాసర్ల శ్యామ్ గారు రాయగా  నేను పాడిన పాటలన్ని ఇప్పటివరకు హిట్ అవుతూనే ఉన్నాయి. ఈ పాటతో చిత్రం కూడా అంతే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. ఇందులో హీరోయిన్  నూరిన్ కి నేను డబ్బింగ్ చెప్పాను.  ఆ అమ్మాయి చాలా అద్భుతంగా నటించింది.  అలాగే హీరో నటరాజ్ఈ చిత్రంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. మొత్తంగా ఈ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది…  మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
  నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ “మా చిత్రం జనవరి 1న విడుదల అవుతుంది. కాసర్ల శ్యామ్ మా ప్రతి చిత్రంలో ఒక్క పాట అయినా కచ్చితంగా రాసి  తీరుతారు. గమ్మత్తుగా అయన పాడిన పాటే చిత్రానికి హైలైట్ గా మారుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన రాసిన ఇస్మార్ట్ శంకర్ , అలవైకుంఠపురంలో పాటలు ఎలా హిట్ అయ్యాయో, మా ‘రామ్ రామ్’ పాట కూడా  అలానే మంచి విజయం సాధిస్తుంది అని అనుకుంటున్నాను. అలాగే సింగర్ మంగ్లి ఈ ప్రత్యేక గీతం పాడింది, నటించింది . అదే విధంగా హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ కూడా చెప్పింది. మా సంగీత దర్శకుడు జాయ్ మంచి బాణీలు సమకూర్చారు. ఈ సినిమాని మా డైరెక్టర్ సత్య ప్రకాష్ చాల మంచిగా తీర్చిదిద్దారు . అలాగే డాన్స్ మాస్టర్ శేఖర్, ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్ మరియు ఇతర ఆర్టిస్టులు అందరు  చాలా బాగా పని చేశారు” అన్నారు.
 

 తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ “నా మిత్రుడు గురురాజ్ కి , చిత్ర సమర్పకురాలు  ముత్తమ్మకి ఈ సినిమా మంచి విజయం సాధించడమే గాక మంచి లాభాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ సత్యప్రకాష్, ఆయన తనయుడు నటరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ జాయ్ మరియు చిత్రానికి పనిచేసిన వారందరికీ మంచి పేరు తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు సత్యప్రకాష్  మాట్లాడుతూ ” నాలా అవకాశం కోసం ఎదురుచూసే వాళ్ళు ఎందరో ఉన్నా, నాకు మాత్రం గురురాజ్ అనే వ్యక్తి ”సత్య ప్రకాష్ నువ్వు డైరెక్షన్ చెయ్యి” అని అంటూ, నాకేం తెలుసో తెలియదో కూడా అడక్కుండా నన్ను నమ్మి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు నాకప్పగించారు. మా నిర్మాత గురురాజ్ గారే ఈ చిత్రం అవ్వడానికి కర్త కర్మ క్రియ. ఆయనతో పాటు రామకృష్ణ గౌడ్ గారు కూడా అండగా నిలబడ్డారు.  వీరిద్దరి సహకారంతోనే అనుకున్నది సాధ్యమైంది. డిసెంబరు 1 న చిత్రం విడుదలవుతుంది. మంచి చిత్రం తీశామని నమ్మకం మాలో ఉంది ” అని అన్నారు.

రచయిత కాసర్ల శ్యామ్  మాట్లాడుతూ ” నిర్మాత గురురాజ్ గారితో నాకు గత 15 సంవత్సరాలుగా, సోదర మిత్ర ఆత్మీయ అనుబంధం ఉంది. చిత్రంలో ఒక ముఖ్యమైన సన్నివేశానికి తగ్గట్టుగా మంగ్లి గారు మరియు రోల్ రైడా గారు పాడే విధంగా ప్రస్తుత సమాజ పరిస్థితులని, సోషల్ మీడియాలో ట్రెండ్ అయినా విషయాలని అలాగే బయటొకలాగా సోషల్ మీడియాలో ఒకలాగా ప్రవర్తించే ఆధునిక పోకడల్ని హాస్యాస్పదంగా మేళవిస్తూ ఒక రాప్ సాంగ్ రాయటం జరిగింది. దానికి తగ్గట్టుగా బాణీలు అందించి మంచి పెప్పీ సాంగ్ గా మలిచారు సంగీత దర్శకుడు జాయ్. సత్య ప్రకాష్ గారి ఆలోచనకి తగ్గట్టుగా ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది ఈ సినిమా ద్వారా సత్య ప్రకాష్ గారి కుమారుడు నటరాజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు, మంచి నటనని కనబరిచాడు. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను ”  అన్నారు.
సంగీత దర్శకుడు జాయ్ మాట్లాడుతూ, “సినిమాలకి పనిచేయడం ప్రతి సంగీత దర్శకుడి కల. అది నిజం చేస్తూ, నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు సత్యా ప్రకాష్ గారికి,  గురు రాజ్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ పాటకి సహకరించిన మంగ్లీ, రోల్ రైడా, రఘు బాబు గారికి మరియు ముఖ్యంగా కాసర్ల శ్యామ్ గారికి ధన్యవాదాలు” అన్నారు. ఈ చిత్రాన్ని నూతన సంవత్సర కానుక గా జనవరి 1 న విడుదల చేస్తున్నామని చిత్ర సమర్పకురాలు  ముత్తమ్మ తెలిపారు. ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ప్రతినిధులు నిరంజన్, మాధవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తారాగ‌ణం:

న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత‌, గురురాజ్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, `అదుర్స్` ర‌ఘు, జ‌బ‌ర్ధ‌స్త్ న‌వీన్‌, లోబో, మ‌ధు, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, జ‌య‌వాణి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి ఎ.ముత్త‌మ్మ‌
ఛాయాగ్ర‌హ‌ణం: జె.జి.కృష్ణ‌, దీప‌క్‌
సంగీతం: జాయ్‌
ఎడిటింగ్‌: ఉద్ధ‌వ్‌

నృత్య ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దిలీప్ కుమార్‌
యాక్ష‌న్‌: డ్రాగ‌న్ ప్ర‌కాష్‌
ఆర్ట్: కె.ముర‌ళీధ‌ర్‌
పాట‌లు: కాస‌ర్ల శ్యామ్‌, గురుచ‌ర‌ణ్‌
క‌థ –  స్క్రీన్ ప్లే-మాటలు- నిర్మాత‌: ఎ.గురురాజ్‌.

ద‌ర్శ‌క‌త్వం: స‌త్య‌ప్ర‌కాష్‌.

Aswatthama Movie Grand Release on jan 31

యంగ్ హీరో నాగ శౌర్య‌,  మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై ప్రొడ‌క్ష‌న్ నెం 3గా శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం`అశ్వథ్థామ‌`.నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించే విధంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు- అరివు మాస్ట‌ర్స్ ఈ సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం. ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ సంస్థ కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు..ఈ సందర్భంగా..

చిత్ర‌ నిర్మాత ఉష మూల్పూరి మాట్లాడుతూ -“ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 3గా ` అశ్వథ్థామ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా కథాంశం ఉండబోతొంది. నాగ శౌర్య చాలా మంచి కథ రాశాడు, దాన్ని డైరెక్టర్ తెరమీద అంత‌కన్నా బాగా చూపించాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది“ అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కులు శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ – “అశ్వథ్థామ‌` షూటింగ్ పూర్తి చేసుకొని జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మీరు స‌రి కొత్త నాగ శౌర్య ను చూస్తారు. కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేశారు సినిమాకు అది పెద్ద అసెట్ కానుంది.త్వరలో ఈ సినిమకు సంభందించిన మరిన్ని విశేషాలు తెలుపుతాం“ అన్నారు.

డైరెక్టర్ రమణ తేజ మాట్లాడుతూ – “నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐరా క్రియేషన్ వారికి థాంక్స్, శౌర్య నన్ను నమ్ము ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యమని చెప్పారు. జనవరి 31న వస్తోన్న మా సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి ప్రేత్యేక ధన్యవాదాలు.

కో ప్రొడ్యూసర్ బుజ్జి మాట్లాడుతూ – “అనుకున్న టైమ్ లో సినిమాను పూర్తి చేశాము. మేము అనుకున్న దానికంటే ఔట్ ఫుట్ బాగా వచ్చింది.
కేజీఎఫ్ కు కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్టర్స్ నాగసౌర్య సినిమాకు తెలుగు లో మొదటిసారి గా యాక్షన్ కొరియోగ్రఫీ చెయ్యడం సినిమాకు ప్లస్ అవుతుందన్నారు మా సినిమాకు వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసారు“ అన్నారు.

Ala Vaikunthapurramuloo Teaser Release

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం టీజర్ ఈ రోజు (11-12-19) నాలుగు గంటల ఐదు నిమిషాలకు సామాజిక మాధ్యమం లో విడుదలైంది. టీజర్ విడుదల అయిన ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ టీజర్,వారి ఆనందానికి ఆకాశమే హద్దు అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ టీజర్ లో “నువ్వు ఇప్పుడే కార్ దిగావ్, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా” అని చెప్పే డైలాగ్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.

నటీనటులు :
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,
సంగీతం: థమన్.ఎస్,
ఎడిటర్: నవీన్ నూలి:
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
పీఆర్వో : లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)