Cinemarangam. Com
సినిమా : “టాప్ గేర్ ”
విడుదల : 30.12.22
రివ్యూ రేటింగ్ : 3/5
ప్రెజెంట్స్: ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్
బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్: K. V. శ్రీధర్ రెడ్డిf
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.శశికాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి
నటీనటులు : ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు
సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్
మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: రామాంజనేయులు
కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి
పీఆర్వో: సాయి సతీష్, పర్వతనేని

యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ:
“టాప్ గేర్” సినిమా ఒక్క నైట్ లో జరిగే కథ. ఒక క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న అర్జున్ (ఆది సాయికుమార్) కు ఆధ్య(రియా సుమన్) తో పెళ్లవుతుంది. దాంతో తను కొత్త జీవితాన్ని మొదలుపెడతా డు. మరో వైపు సిద్ధార్థ్(మైమ్ గోపి) ముంబయి కి చెందిన ఓ పెద్ద డ్రగ్ డీలర్ కాగా అతడికి చెందిన కోట్లు విలువజేసే డ్రగ్స్ తో సింగపూర్ కి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు.మరో వైపు ఏ.సి.పి విక్రమ్ (శత్రు ) సిద్దార్థ్ ను పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. సింగపూర్ కు పారిపోవాలనే ప్లానింగ్ లో డీల్ నిమిత్తం హైదరాబాద్ కి వస్తాడు.అయితే అనూహ్యంగా అతడి క్యాబ్ నుండి డ్రగ్స్ ఉన్న బ్యాగ్ మిస్సవ్వడంతో ఆ బ్యాగ్ కొరకు సిద్దార్థ గ్యాంగ్ అర్జున్ వెంట పడతారు. డ్రగ్స్ బ్యాగ్ తెచ్చివ్వక పొతే ఆద్య ను చంపేస్తామని బెదిరిస్తారు. అయితే తాను ఈ డ్రగ్ రాకెట్ లో చిక్కుకోగా నెక్స్ట్ తన భార్య ఆధ్య(రియా సుమన్) ని కాపాడుకోవడం కోసం ఆ క్రిమినల్స్ చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుంది. మరి ఈ రాకెట్ నుంచి తాను ఎలా బయట పడ్డాడు ? తన భార్యని కాపాడుకోగలిగాడా ? సిద్దార్థ్ కోసం వెతుకున్న పోలీసులకు ఆ ముఠాని ఎలా పట్టించాడా లేదా అనేది తెలియాలి అంటే టాప్ గేర్ సినిమా కచ్చితంగా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు
ఆది ఓక సాధారణ క్యాబ్ డ్రైవర్ గా… ఓ భర్తగా మంచి ఎమోషన్స్ ని పండించాడు. తన లుక్స్ పరంగా కూడా డీసెంట్ గా కనిపించాడు. అలాగే నటి రియా సుమన్ కూడా గుర్తింపు వుండే పాత్రలో నటించింది. హీరో, హీరోయిన్స్ ఆది, రియా లిద్దరూ చాలా బాగా నటించారు.ఇక వీరితో పాటు సినిమాలో సత్యం రాజేష్, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇందులో ట్విస్టులు బాగా వున్నాయి. సినిమా ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా సాగుతూ…ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేసే విధంగా…ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఉంది.ఇంకా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు..

సాంకేతిక నిపుణుల పనితీరు
థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్నీ ఏమోషన్స్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకున్న దర్శకుడు శశికాంత్ తను రాసుకున్న కథ… కథనాలను బాగున్నాయి..ఎన్నో హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన సాయి శ్రీరామ్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ఈ సినిమాకు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం చాలా ఇంట్రస్టింగ్ గా నడుస్తుంది. రామజాగయ్య శాస్రి రాసిన వెన్నెల వెన్నెల సాంగ్ చాలా బాగుంది.థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్నీ ఏమోషన్స్ ఉన్న ఇలాంటి మంచి కథ ఉన్న సినిమాను
ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాపై ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. హర్ష వర్ధన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాలో డీసెంట్ గా ఉంది. అలాగే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. అలాగే డైలాగ్స్, ఎడిటింగ్ బాగున్నాయి .థ్రిల్లర్, సస్పెన్స్ తో పాటు ఏమోషన్స్ ఉన్న కథలు ఇష్టపడే వారికి టాప్ గేర్ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.
Cinemarangam. Com Review Rating.. 3/5









