Home Blog Page 10

Surya Be Positive movie Teaser Launched by Directors Koushik Pegallapati & Muralikanth Devasoth

The teaser for the upcoming film “Surya Be Positive” was grandly launched by Dandora director Muralikanth Devasoth and Kishkindhapuri director Koushik Pegallapati, who graced the event as chief guests.
Produced under the banners of Kaali Krafts and Nirmalam Dramaz, the film is written and directed by Subba Madhavarapu. It features Charan Pesarla as the lead actor, with Annie Diana and Divya Vishwakarma playing the heroines. Key roles are portrayed by Rohith Satyan, Sujatha Deekshith, Chandra Gautam, Balagam Satya, Surabhi Lalitha, and Geethan Sai Teja. The technical team includes DOP Arun Kumar Parvataneni, Music Director Gyani, and Editor Muralikrishna Manyam.

On this occasion, Actor Balagam Satya said... “Hello everyone. I was surprised when the hero, Charan, personally approached me for this role. He believed in me and gave me a very unique character. We acted together and had a great time. A very good movie is coming to the audience, and I request everyone’s blessings.”

Actor Rohith Satyan said… “I thank our chief guests, Kaushik Pegallapati and Muralikanth Devasoth. I have been acting in minor roles since 2017, but this is the first time I am speaking on stage thanks to this film. The director gave me a challenging role that is much older than my actual age. Even while in the US, he made sure everything was handled perfectly. The audience must experience this fresh content in theaters. Telugu audiences always encourage good content, and I hope they support us.”

Actress Sujatha Deekshith said… “Thank you to the guest directors. Usually, I am a very loud and talkative person, but in this film, my character is completely silent. Unlike my previous roles filled with dialogue, the director made me act with my eyes here. It is a completely contrasting role for me. Everyone worked incredibly hard. It is a relatable, everyday story being brought to the screen.”

Actress Divya Vishwakarma said... “Thank you to everyone who attended. Standing on this stage for a Telugu film feels very special. Even though Telugu is not my native language, the love, acceptance, and opportunity I have received make me overjoyed. I sincerely thank the directors for trusting me, as well as my co-stars and the technical team for their immense support.”

Actress Annie Diana said… “Thanks to the guests and the media for attending our teaser launch. I want to express my special gratitude to the director, cast, and crew. I hope everyone liked our teaser. This is my debut film, and I hope you all support us.”

Lead Actor Charan Peesarla said… “Hello everyone. I am forever grateful to directors Kaushik Pegallapati and Muralikanth Devasoth for taking the time to support our film, never forgetting the struggles of making a new movie. Our director managed his job in the US while working on this film day and night. Our producer has invested years of hard work and trust in us. I am introducing myself as an actor and asking for the audience’s validation. I have acted in three films before this, but due to unavoidable reasons, they weren’t released. This is my fourth film, and I hope the audience appreciates me. I will never stop; I will keep moving forward. I believe any insults faced today will turn into honors tomorrow.”

Lyricist Rambabu Gosala said... “The main reason I wrote songs for this film is Music Director Gyani. He provided excellent tunes. Charan worked very hard, and I hope he establishes himself as a great hero in Tollywood. The director gave me continuous inputs, resulting in great songs that will be released soon. I hope the movie becomes a big hit.”

Director Muralikanth Devasoth (Chief Guest) said… “When I was invited, I learned about the immense effort put into this project. Making a film in today’s circumstances is very difficult. I was amazed by Rohit Satya’s performance. The team captured even the smallest details beautifully. Director Subba Madhavarapu working from the US and executing this is highly commendable; I don’t think I could have done that. The DOP visuals are great, and I wish the film a grand success.”

Director Koushik Pegallapati (Chief Guest) said… “The teaser cut is exceptional. I came here mainly because Murali is my senior and Charan is my junior from the same college. The audience will definitely love this film. Becoming a hero is not easy; the audience needs to connect with the character’s struggles and feel a personal victory when the hero wins on screen. I hope the audience feels that victory watching Charan. I cannot believe the director flew from the US and completed the film in six months. Thanks to the media for supporting the film.”

Cast : Charan Peesarla, Annie Diana, Divya Vishwakarma, Rohith Satyan, Sujatha Deekshith, Chandra Gautam, Balagam Satya, Surabhi Lalitha, Geethan Sai Teja, and others.

Technical Crew :
Writer & Director: Subba Madhavarapu
Screenplay & Dialogues: Brijesh Tangi, Charan Peesarla
DOP: Arun Kumar Parvataneni
Editor: Muralikrishna Manyam
Music Director: Gyani
Lyricist: Rambabu Gosala
Teaser Editor: Rishikeshwar Yogi
Line Producer: M Sandeep Varma
PRO: Somisetti Nageswara Rao(SNR)

Thanks to Chadalavada Srinivasa Rao for producing 10 films with ₹30 crores – TFDA President V.N. Aditya

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) ఆధ్వర్యంలో ముప్పై కోట్ల బడ్జెట్‌తో పది సినిమాల్ని నిర్మించనున్నారు. ఈ మేరకు టీఎఫ్‌డీఏ సోమవారం నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చదలవాడ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య, ట్రెజరర్ సాయి రాజేష్, వైస్ ప్రెసిడెంట్ సముద్ర, ప్రముఖ దర్శకులు నవీన్ మేడారం, అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ తదితరలు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో..

*వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ* .. ‘మా కమిటీ కొత్తగా ఎన్నికైంది. మేం విద్య, వైద్యం, ఉపాధి అనే అంశాల మీదే ఫోకస్ పెట్టాం. చదలవాడ శ్రీనివాసరావు గారు ఉగాది నాడు ఓ గొప్ప ఆలోచనను మాతో పంచుకున్నారు. నిర్మాతలుంటేనే మా దర్శకులు మనుగడ కొనసాగించగలరు. టాలెంట్ ఉండి కూడా యూనియన్ మెంబర్ షిప్ కోసం కష్టపడాల్సి వస్తుంది. చదలవాడ శ్రీనివాసరావు గారు వారి బ్యానర్ మీద ముప్పై కోట్లతో పది సినిమాల్ని నిర్మిస్తున్నారు. మా అసోసియేషన్‌లోని మెంబర్లకు ఆయన గొప్ప అవకాశం ఇస్తున్నారు. దీని ద్వారా పది మంది దర్శకుల కంటే.. వంద, నూట యాభై మంది అసిస్టెంట్ దర్శకులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ సినిమాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో సీనియర్ దర్శకులు అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ వంటి వారు కీలకంగా వ్యవహరిస్తారు. మా డైరెక్టర్ అసోసియేషన్‌లోని మెంబర్లు చెప్పిన కథలు, బౌండెడ్ స్క్రిప్టుల్ని ఫిల్టర్ చేస్తున్నాం. ఈ మేరకు కమిటీ ఆల్రెడీ పని చేస్తోంది. ఒకరికి ఒక అవకాశం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. కానీ చదలవాడ శ్రీనివాసరావు గారు ఒకేసారి ఎంతో మందికి అవకాశం ఇస్తున్నారు. ఆ సినిమాల్లో లాభాలు వస్తే.. యూనియన్‌కే ఇస్తాను అని ఆయన అన్నారు. ఇది మాకు అవకాశం కాదు.. వరం.. ఆయనకు శతసహస్ర కృతజ్ఞతాభివందనాలు’ అని అన్నారు.

*సాయి రాజేష్ మాట్లాడుతూ* .. ‘టీఎఫ్‌డీఏకి ట్రెజరర్‌గా ఉండటం గర్వంగా ఉంది. విద్య, వైద్యం, ఉపాధి అనే నినాదంతో మేం ఎన్నికల్లో గెలిచాం. ఉపాధి ఎలా కల్పించాలనే మథనం మా అందరిలో ఉండేది. అయితే ఉగాది నాడు చదలవాడ శ్రీనివాసరావు గారు దేవుడి రూపంలో మాకు వరమిచ్చారు. ముప్పై కోట్లతో పది సినిమాలు నిర్మిస్తానని, లాభాల్ని కూడా మా యూనియన్‌కే ఇస్తానని ఆయన అన్నారు. ఆయన ఇచ్చిన అవకాశంతో ఎంతో మంది కొత్త టెక్నీషియన్స్, కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తామని, లాభాల్ని కూడా తెచ్చి పెడతామని హామీ ఇస్తున్నాం. బెస్ట్ కథల్ని ఎంచుకుంటున్నాం. ప్రసన్న గారి డైరెక్షన్‌లో ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి చిత్రాల్ని అందిస్తామ’ని అన్నారు.

*చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ* .. ‘మీడియా నాకు ఎన్నో ఏళ్ల నుంచి సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇలా పబ్లిసిటీ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. కానీ వీఎన్ ఆదిత్య గారు మాత్రం నా చేతుల మీదుగానే ఈ ప్రకటన జరగాలని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించలేకపోయినా.. కళామతల్లికి చేసిన సేవతో నాకు సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం కలుగుతుంది. ఏఎన్నార్ గారు, శోభన్ బాబు గార్ల దగ్గరి నుంచి నేను ఎంతో మందితో ఎన్నో సినిమాలు తీశాను. నాకు అజయ్ అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్‌. ఆయన నాకు ‘జీవిత ఖైదు’ 75 లక్షల్లో తీసి పెట్టారు. అప్పట్లో నాకు ఏడు కోట్ల షేర్ వచ్చింది. నేను అప్పట్లో ప్రతీ సినిమాని 30 నుంచి 40 రోజుల్లో తీశాను. నాకు ఇప్పుడున్న ఇండస్ట్రీ కన్నా అప్పుడున్న ఇండస్ట్రీ అంటేనే ఇష్టం. శోభన్ బాబు గారు, ఏఎన్నార్ గారు లాంటి హీరోలు మాకెంతో సపోర్ట్ చేస్తుండేవారు. ఇప్పుడు సినిమా పరిశ్రమలో అన్నీ పెరిగాయి.. థియేటర్లు మాత్రం తగ్గుతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకి కూడా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మంచి విలువలు, మంచి కథలు, కమర్షియ్ అంశాలుండే గొప్ప సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నాను. క్వాలిటీ సినిమాలు తీయాలి.. క్రమశిక్షణతో కచ్చితంగా ఉదయం ఏడు గంటలకు షాట్ తీయాలి. మంచి సినిమాలు తీసి.. వాటి ద్వారా హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడితే నాకు అదే చాలు’ అని అన్నారు.

*ప్రముఖ దర్శకులు అజయ్ కుమార్ మాట్లాడుతూ* .. ‘ఇలాంటి ఓ నిర్ణయం, ఇలాంటి ఓ గొప్ప కార్యక్రమం ఇంత వరకు ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. చదలవాడ శ్రీనివాసరావు గారితో ‘జీవిత ఖైదు’ తీసి.. ఆయన ఇంట్లోనే జీవిత ఖైదీ అయ్యాను. కోదండ రామిరెడ్డి గారి వద్ద నేను ముఖ్య శిష్యుడ్ని. 30, 40 రోజుల్లోనే క్రమశిక్షణతో సినిమాని తీసేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు దర్శకులే బడ్జెట్స్ వేస్తున్నారు. కానీ మాకు మాత్రం అప్పట్లో లావాదేవీల గురించి ఏ మాత్రం తెలిసేది కాదు. స్క్రిప్ట్ కరెక్ట్‌గా ఉంటే బడ్జెట్ కూడా పరిధిలోనే ఉంటుంది. చదలవాడ శ్రీనివాసరావు గారికి ఇలాంటి ఓ గొప్ప ఆలోచన రావడం ఎంతో మందికి వరంగా మారింది’ అని అన్నారు.

*ప్రసన్న కుమార్ మాట్లాడుతూ* .. ‘చదలవాడ శ్రీనివాసరావు గారు కరోనా సమయంలో ఎంతో మంది నిర్మాతలకు, సినీ కార్మికులు, శ్రామికులకు నేరుగా డబ్బుల్ని పంపించారు. చిత్రపురిలో నాలుగు వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడకూడదని కొన్ని కోట్ల రూపాయల్ని ఇచ్చారు. జర్నలిస్ట్‌ల సోదరులకు కూడా వంద ఫ్లాట్స్ ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన బ్లెస్ చేసిన అందరూ డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచారు. ఆ తరువాత ఆయన ఇంటికి డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్స్ వెళ్తే ముప్పై కోట్లు ఇస్తాను.. పది సినిమాలు తీయండని ఈ ప్రపోజల్ పెట్టారు. అందరికీ అండగా ఉంటానని ఆయన భరోసా ఇస్తున్నారు. ఇలాంటి వారిని మనం కాపాడుకోవాలి.. వాళ్లు మన ఇండస్ట్రీని కాపాడుకుంటారరు’ అని అన్నారు.

*ప్రముఖ దర్శకులు సముద్ర మాట్లాడుతూ* .. ‘ఎన్నికలయ్యాక మేం చదలవాడ శ్రీనివాసరావు గారికి ఇంటికి వెళ్లి కలిశాం. ఉగాది నాడు మాకు ఆయన ఇచ్చిన వరమే ఇది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయండని ఆయన అన్నారు. పది సినిమాలు తీయండి.. నష్టమొస్తే పట్టించుకోకండి.. లాభం వస్తే యాభై శాతం టీఎఫ్‌డీఏకి ఇస్తానని ఆయన అన్నారు. బడ్జెట్, సబ్జెక్ట్ పరంగా మేమంతా జాగ్రత్తగా ఉంటాం. పది సినిమాల్ని హిట్ చేస్తామని హామీ ఇస్తున్నామ’ని అన్నారు.

*నవీన్ మేడారం మాట్లాడుతూ* .. ‘సాయి రాజేష్ గారి ప్రోత్సాహంతో నేను ఇక్కడకు వచ్చాను. ‘90స్ మిడిల్ క్లాస్ మెలోడీస్’ సిరీస్‌ని నేను రెండున్నర కోట్లతో 25 రోజుల్లో తీశాం. నాతో ఆ సినిమాకి పని చేసిన దర్శకుడు ‘లిటిల్ హార్ట్’ అని రెండున్నర కోట్లతోనే తీశాడు. అలాంటిది ముప్పై కోట్లు ఇచ్చి పది సినిమాలు తీయమనడం గొప్ప వరం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

Producers Dundigalla Balakrishna, Akula Suresh Patel, and F.M. Murali Interview about ‘Pithapuramlo… Ala Modalaindi’

మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ‘పిఠాపురంలో … అలా మొదలైంది’ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ దర్శకులు మహేష్ చంద్ర దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాని మే 1న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలో..

*నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ మాట్లాడుతూ* .. ‘మా దర్శకుడు జన సేన అభిమాని పార్టీ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు. ఆయనది చేబ్రోలు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే ఇదే ప్రాంతంలో షూటింగ్ చేస్తానని మాటిచ్చారు. అందుకే అక్కడే చిత్రీకరణ చేశాం. దాదాపు 75 శాతం షూటింగ్ అక్కడే చేశాం. హైదరాబాద్, గోవాల్లోనూ కొంత పార్ట్ షూట్ చేశాం. మహేష్ చంద్ర గారితో మాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. ఆకుల సురేష్ గారితో మహేష్ చంద్ర గారు ఓ సినిమా చేయాలని అనుకున్నారు. ఆ తరువాత మేం జాయిన్ అయ్యాం. భారీ తారాగణంతో కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రం. ఇందులో రాజకీయ అంశాలేవీ ఉండవు. తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించాం’ అని అన్నారు.

*నిర్మాత ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) మాట్లాడుతూ* .. ‘నేను జర్నలిస్ట్‌గా పిఠాపురంలో పని చేస్తుంటాను. సినిమాలో చూపించే అందమైన గ్రామీణ ఇల్లులానే మా ఇల్లు ఉంటుంది. దర్శకుడు మా ఇంటిని చూసి షూటింగ్‌కి కావాలని అడిగారు. ఒకసారి లీవ్ పెట్టుకుని మరీ షూటింగ్‌ను చూశాను. ఎంతో సహజంగా అనిపించింది. ఆ తరువాత నాకు కథలో భాగం అవ్వాలని అనిపించింది. కారెక్టర్ కాదు.. నేను నిర్మాతగా ఇందులో పార్ట్ అవ్వాలని అనుకున్నాను. మహేష్ గారి టేకింగ్ నాకు నచ్చి ఇందులోకి వచ్చాను. ‘ప్రేయసిరావే’ లాంటి గొప్ప మూవీని తీసిన మహేష్ గారితో వర్క్ చేయడం నా అదృష్టం’ అని అన్నారు.

*నిర్మాత ఆకుల సురేష్ పటేల్ మాట్లాడుతూ* .. మహేష్ చంద్ర గారు తీసిన ‘ప్రేయసి రావే’ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కథ ఆయనకు వినిపించాం. డైరెక్టర్ గారు రైటర్ శ్రీరామ్ గారు ఈ కథ మీద బాగా వర్క్ చేసి అద్భుతం గా డైలాగ్ వర్షెన్, స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు. కరోనా వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రెసిడెంట్ గారి పాత్రకు రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకున్నాం. ఆయన ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. మంచి సినిమా తీశామని ఆడియెన్స్ చెబుతారు. ప్రీమియర్‌లో చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. మౌత్ టాక్‌తో మా సినిమా ముందుకు వెళ్తూనే ఉంటుంది’ అని అన్నారు.

Actor Babu Mohan garu has won the prestigious ‘Relangi Award’ by Telugu Film Television Welfare Farm & Bharat Cultural Academy

తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత రేలంగి అవార్డు వచ్చిన సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. సుమారు 2000 చిత్రాలలో నటించి ఆయనకు ఉన్న సామాజిక స్పృహతో రాజకీయాలలో అడుగు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కేబినెట్ లో సేవలు అందించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు, శ్రీ నాగ బాల సురేష్, హీరో రాంకీ, నటుడు 30 ఇయర్స్ పృథ్వి రాజ్, సినీ జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగ బాల సురేష్ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నేడు మన అందరి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం, గొప్ప గుణం గల బాబు మోహన్ గారు ఇప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టీ 41 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 2000కు పైగా సినిమాలలో నటించిన ఆయనకు రేలంగి అవార్డు రావడం చాలా సంతోషించదగిన విషయం. ఆయన నటనా రంగంలో, రాజకీయ రంగంలో ఇప్పటికీ ఎన్నో చూసేసారు. ఆయన మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ... “నాకు ధర్మయుద్ధం చిత్ర సమయంలో పరిచయం అయిన బాబు మోహన్ గారు ఆ తర్వాత ఎంత ఎత్తుకు ఎదిగినా, మంత్రిగా పని చేసినా అదే సామాన్య వ్యక్తిత్వంతో ఉన్న వ్యతి. సాధారణంగా రామారావు గారితో కలిసి నటించడమే ఎంతో మందికి కలగా ఉండేది కాని ఆయతో కలిసి కేబినెట్ లో మంత్రిగా లంచాన్ని అరిగట్టే విధంగా పని చేసే అదృష్టం ఆయనకే కలిగింది. కేలవం సేవ మాత్రమే చేసే గొప్ప వ్యక్తిత్వంతో ఆయన రాజకీయాలలో మంచి సేవ చేశారు. మానసిక పరిస్థితుల వల్ల కడిసిపోయిన వారు ఒక డాక్టర్ లా ఆయన హాస్యాన్ని చూసేవారు. అంతటి గొప్ప వ్యక్తి మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో రాంకీ గారు మాట్లాడుతూ... “రేలంగి గారు అంటే చాలా గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి పేరిట అవార్డులు తగ్గ అర్హత ఉన్న వారికే వస్తాయి. అలా రేలంగి అవార్డు మన బాబు మోహన్ గారికి రావడం చాలా సంతోషంగా ఉంది. 2000 పైగా సినిమాలలో నటించినా ఆయనకు మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ప్రముఖ జర్నలిస్టు సురేష్ కొండేటి మాట్లాడుతూ… “నా సినీ జర్నలిస్టుగా ప్రయాణం మొదలైన తొలి దశ నుండి బాబు మోహన్ గారిని చూస్తున్నాను. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. జర్నలిస్టులను దగ్గరకు తీసుకుని ఎంతో ప్రేమగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఎన్ని అవార్డులు రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు 30 ఇయర్స్ పృథ్వి రాజ్ గారు మాట్లాడుతూ… “నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మా బాబు మోహన్ గారికి రేలంగి అవార్డు వచ్చిందని చాలా సంతోషించాను. తెలుగు చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, బ్రహ్మానందం అనే వ్యక్తులు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం వంటి మంచి త్రయం. రేలంగి గారు మా ఊరు కాబట్టి వ్యక్తిగతంగా ఆయన గొప్పతనం నాకు బాగా తెలుసు. కార్మిక శాఖ మంత్రిగా రామారావు గారి పాలనలో ఆయన మంత్రిత్వానికి వన్నె తెచ్చే విధంగా సేవలు అందించారు. ఆయనతో కలిసి నటించడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఆరోజుల్లో ఆరోగ్యకరమైన మంచి హాస్యాన్ని బాబు మోహన్ గారు పండించారు. అటువంటి హాస్యం మరోసారి తిరిగి రావాలంటే బాబు మోహన్ గారిని ఫాలో అవ్వాలి” అన్నారు.

బాబు మోహన్ గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య వ్యక్తులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ప్రజాస్వామ్యం పుట్టిన తరువాత లేబర్ యాజమాన్య మంత్రిగా చాలా అరుదుగా చేశారు. అటువంటి మంత్రిగా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. నేను మొత్తం ఆ వ్యవస్థ అంతా కాపాడుకోవాలి, చాలా కఠినంగా పని చేసేవాడిని. అప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పని చేయడం వల్ల నాకు సులభం అయిపోయేది. నాకు ఎందుకో తొలిసారి ఛాంబర్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరికీ ధన్యవాదాలు తెలియచేయాలి అనిపించింది. నాటి మాయాబజార్ చిత్రంలో రేలంగి గారి పాత్ర వేయడం చాలా అద్భుతంగా అనిపించింది. నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు కూడా కొన్ని సినిమాలలో నటిస్తున్నాను. ఆ చిత్రాలలో నా పాత్రలు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి. నా తొలి చిత్రాలలో నా నటన చూసి అందరూ నన్ను మరింత ప్రోత్సహించారు. నాకు వివిధ చిత్రాలలో వివిధ పాత్రలు ఇచ్చి, నన్ను నా దర్శకులు మంచి నటుడుని చేశారు. ఎంతో మందికి సేవలు చేశాను, చదివించాను, పెళ్ళిళ్ళు చేశాను. రాజకీయాలకు దూరం అయిన తర్వాత ఒక ట్రస్ట్ పెట్టి, సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాను. ఇలా చేస్తున్నందుకు, మీ అందరితో కలిసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు రేలంగి అవార్డు వచ్చిన సందర్భంగా రేలంగి గారి ఇంటి వద్ద బాణసంచారాలు పేలాయి అనే విషయం తెలిసిన సంతోషం. నాకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి, అంతకంటే ప్రజల ఆశీస్సులే నాకు గొప్ప దీవెనగా తీసుకుంటాను. ఇక పద్మ అవార్డు వస్తే సంతోషం, రాకపోయినా పర్వాలేదు” అన్నారు.

అయితే 2000 చిత్రాలకు పైగా నటించిన వ్యక్తికి మన తెలుగు రాష్ట్రాల తరపున పద్మశ్రీ అవార్డు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తూ రానున్న అవార్డు సమయంలో ప్రభుత్వాలు, సంస్థలు డిమాండ్ చేయవలసిందిగా మనం కోరుకుందాం అంటూ ప్రముఖులు ముగించారు.

‘O Thandri Katha’ Movie Grand Releasing on May 1st 2026

తండ్రి అంటే నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపం… కుటుంబానికి అచంచలమైన ఆధారం… పిల్లల భవిష్యత్తు కోసం తన భావాలను దాచుకుని అహర్నిశలు శ్రమించే త్యాగమూర్తి. అలాంటి తండ్రి గొప్పతనాన్ని హృదయాన్ని తాకేలా ఆవిష్కరించిన భావోద్వేగ చిత్రం ‘ఓ తండ్రి కథ’. కుటుంబ విలువలు, తండ్రి–పిల్లల మధ్య అనుబంధం, బాధ్యతల వెనుక దాగి ఉన్న త్యాగాన్ని ప్రతిబింబించే ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.

వైఎస్‌కె, నిహారిక చౌదరి, వరేణ్య ఆగ్రా, అశోక్ రెడ్డి లెంకల, విజయలక్ష్మీ ,తోట సుబ్బారావు, వి. కరుణాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించగా, LV క్రియేషన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ఆడియో, ప్రచార చిత్రాల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో దర్శకులు వి. సముద్ర, సంజీవ్ కుమార్ మేగోటి ముఖ్య అతిథులుగా పాల్గొని ట్రైలర్, పాటలను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ“ప్రతి తరం మధ్య పిల్లలు–తల్లిదండ్రుల మధ్య భావోద్వేగ సంఘర్షణలు సహజం. మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. తక్కువ బడ్జెట్‌లోనూ మాట నిలబెట్టుకుని సినిమా పూర్తి చేయడం వెంకట్ రెడ్డి గారి నిబద్ధతకు నిదర్శనం” అన్నారు.

దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ…“తండ్రి విలువను చూపించే ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా సాహసం. ఈ సినిమాలో అశోక్ రెడ్డి గారు తండ్రి పాత్రలో జీవించారు. పాటలు కూడా ఎంతో హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఈ సినిమా పాటలను మా అన్విక ఆడియోస్ ద్వారా విడుదల చేస్తున్నాం. వెంకట్ రెడ్డి గారు కొద్ది సంవత్సరాల్లోనే 17 సినిమాలు పూర్తి చేయడం అభినందనీయం” అని అన్నారు.

నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ…“బంధాలు, అనుబంధాల విలువను గుర్తు చేసే మంచి కాన్సెప్ట్‌తో సినిమా రూపొందింది. ప్రతి ఒక్కరిని కదిలించే భావోద్వేగ చిత్రం ఇది” అన్నారు.

నిర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ…“ఈ సినిమాను ఎంతో మనసుపెట్టి రూపొందించాం. తండ్రి కష్టం, త్యాగం, బాధ్యతలను ప్రతిబింబించే ఈ కథ యువతకు కూడా దగ్గరవుతుంది. ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం” అన్నారు.

దర్శకుడు దొరరాజు మాట్లాడుతూ…“టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా అనుబంధాల విలువ మారదు. తండ్రి–పిల్లల మధ్య ఉన్న బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించారు” అని పేర్కొన్నారు.

కళా రాజేష్ మాట్లాడుతూ…“నాన్న గొప్పతనాన్ని మరింత బలంగా చెప్పే చిత్రం ఇది. భావోద్వేగం ఉన్న సినిమా ప్రేక్షకుల హృదయాలను తప్పకుండా గెలుస్తుంది” అన్నారు.

ఈ కార్యక్రమంలో మోహన్, దొరరాజు, ఘర్షణ శ్రీనివాస్, అడ్వకేట్ లింగంపల్లి శ్రీనివాస్, కళ రాజేష్, వనం చంద్రమౌళి, వినయ రాజ్ తదితరులు పాల్గొని చిత్రాన్ని ఆదరించాలని కోరారు. భావోద్వేగంతో కూడిన కుటుంబ కథాచిత్రంగా రూపొందిన ‘ఓ తండ్రి కథ’ మే 1న ప్రేక్షకుల మనసులను తాకేందుకు సిద్ధంగా ఉంది.

ప్రధాన నటీనటులు: అశోక్ రెడ్డి లెంకల,విజయలక్ష్మీ , వైఎస్‌కె, నిహారిక చౌదరి, వరేణ్య ఆగ్రా
బ్యానర్: LV క్రియేషన్స్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత: అశోక్ రెడ్డి లెంకల
దర్శకుడు: నంది వెంకట్ రెడ్డి
సంగీతం: డ్రమ్స్ రాము
ఎడిటర్ : శ్రీశైలం
DOP : యాదగిరి
స్టంట్స్ : మధు డైమండ్
పీఆర్‌ఓ: అశోక్ దయ్యాల

Actress Kamakshi Bhaskarla powerful Mahadevi from MS Raju Upcoming Movie ‘Agadha’

‘దేవి’, ‘శత్రువు’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘మనసంతా నువ్వే’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి కల్ట్ చిత్రాల నిర్మాత , ‘డర్టీ హరి’, ‘ మళ్లీ పెళ్లి ‘ చిత్రాల దర్శకుడు ఎం.ఎస్. రాజు మరో సూపర్ ఇంట్రెస్టింగ్ చిత్రంతో మీ ముందుకు వస్తున్నారు.
ఆయన తాజా చిత్రం ‘అగధ’లో మహాదేవి పాత్ర పరిచయం ఈ మర్మమైన, దైవిక థ్రిల్లర్‌కు కొత్త ఉత్కంఠను జోడిస్తుంది.
‘అగధ’ ఫస్ట్ లుక్‌తో రేగిన ఉత్సుకత ఇప్పుడు తదుపరి వెల్లడికి దారితీసింది. మునుపటి పోస్టర్‌లో దైవ విగ్రహం ముందు నిలబడి కనిపించిన ఆ రహస్య యువతి మరెవరో కాదు, కామాక్షి భాస్కర్ల అని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆమె ఈ చిత్రంలో కీలక కథానాయిక మహాదేవి పాత్రను పోషిస్తున్నారు.

ఈ ప్రకటనతో, మొదటి పోస్టర్ ద్వారా ఎంఎస్ రాజు సృష్టించిన దృశ్యరూపానికి ఇప్పుడు ఒక ముఖం, శక్తివంతమైన తెరపై ఉనికి లభించాయి. త్రిశూలాలు, దీపాలు, ఎత్తైన విగ్రహంతో కూడిన ఆధ్యాత్మిక నేపథ్యం ముందు, సాంప్రదాయ నల్ల చీర కట్టుకుని గంభీరంగా కూర్చున్న కామాక్షి భాస్కర్ల రూపమే, కథనంలో ఆమె పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని సూచిస్తోంది. ఆమె ప్రచండమైన హావభావం, సాంప్రదాయ రూపం, ఆ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణం, మహాదేవి కేవలం ఒక సాధారణ పాత్ర కాదని, కథ యొక్క ఆధ్యాత్మిక మూలంతో గాఢంగా ముడిపడి ఉన్న వ్యక్తి అని తెలియజేస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఫస్ట్ లుక్‌కు వస్తున్న స్పందనతో ఉప్పొంగిపోయిన ఎంఎస్ రాజు, ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, దర్శకులు, నటీనటులు అందించిన ప్రోత్సాహకరమైన మాటలకు, ప్రశంసలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక హృదయపూర్వక లేఖను విడుదల చేశారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా ద్వారా వెల్లువెత్తుతున్న ప్రేమ, తాను చెబుతున్న కథపై తన నమ్మకాన్ని మరింత బలపరిచిందని ఆయన పంచుకున్నారు. ఒక రచయితగా, దర్శకుడిగా, ఈ ప్రోత్సాహం తన అత్యుత్తమ ప్రతిభను కనబరచడానికి, ‘అగధ’లోని ప్రతి అంశం అంచనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి తనను ప్రేరేపిస్తుందని ఆయన అన్నారు.

నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు, శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ‘అగధ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 45 నిమిషాల విఎఫ్‌ఎక్స్, విస్తృతమైన సెట్ వర్క్ మరియు 85 రోజుల షూటింగ్‌తో, ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీలలో ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది.

‘అగధ’ యొక్క సాంకేతిక బృందం:

రచయిత మరియు దర్శకుడు: M. S. రాజు
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు:
రాకేష్ వేంకటాపురం,
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
అదనపు స్క్రీన్ ప్లే: చైతన్య వేగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్వీఎన్ సుబ్బరాజ్

Charlie Chaplin Award for Viva Reddy, the artist who filled letters with soul

సినిమా తెరపై కనిపించే ప్రతి అక్షరానికి ఒక జీవం ఉంటే, ఆ జీవానికి రూపం ఇచ్చే కళాకారుడు వివ రెడ్డి (విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు). అక్షరాలను అలంకరించే చేతి గీతల్లో భావాలను పలికించగల అరుదైన సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచిన ఆయనకు, ప్రపంచ హాస్య చక్రవర్తి చార్లీ చాప్లిన్ 137వ జయంతి సందర్భంగా ప్రతిష్ఠాత్మక చార్లీ చాప్లిన్ అవార్డు లభించింది. ర‌వీంద్ర‌భార‌తీ వేదికగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో రోజా క్రియేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో, తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షులు డా. బండ ప్ర‌కాష్, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి చేతుల మీదుగా ఈ గౌరవం వివ రెడ్డి కి అందించి స‌త్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఈ వేడుక‌లో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ, మూడు దశాబ్దాలకు పైగా సాగుతున్న సృజనాత్మక ప్రయాణంలో అక్షరాలకు అందం, సినిమాకు ఆత్మ, ప్రేక్షకుడికి అనుభూతి ఇచ్చిన కళాకారుడిగా వివ రెడ్డి నిలిచార‌ని కొనియాడారు. ప్రపంచ హాస్య చక్రవర్తి చార్లీ చాప్లిన్ జయంతి సందర్భంగా అందుకున్న ఈ గౌరవం, తెలుగు సినీ అక్షర రూపకల్పన కళకు లభించిన గుర్తింపుగా నిలిచింద‌ని అన్నారు. వివ రెడ్డి కళా కాంతి మరింత విస్తరించి, ఆయన సృజనాత్మక ప్రయాణం కొత్త శిఖరాలను అధిరోహించాలని రోజా క్రియేషన్స్ నిర్వ‌హ‌కులు ఆకాంక్షించారు.

ఆరు వందల చిత్రాలకు అక్షర శిల్పం
చిన్ననాటి చిత్రలేఖనపు అమాయక ఆసక్తితో ప్రారంభమైన ప్రయాణం.. కాలక్రమేణా లోగో రూపకల్పనలో నైపుణ్యంగా వికసించి, పబ్లిసిటీ రూపకల్పనలో ప్రత్యేక గుర్తింపును సాధించి, నటనలోనూ తన అభిరుచిని ప్రతిబింబించిన కళాకారుడిగా వివ రెడ్డి ఎదిగారు.

“దిల్”తో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం, “శివమణి”, “అర్జున్”, “చంద్రముఖి”, “సింహ”, “ఒక్కమగాడు”, “పరమవీరచక్ర”, “బొమ్మరిల్లు”, “పరుగు”, “శంకర్ దాదా జిందాబాద్”, “గుడుంబా శంకర్”, “దేశముదురు”, “పోకిరి”, “రక్తచరిత్ర”, “సూపర్”, “రెడీ”, “ప్రస్థానం”, “బ్లేడ్ బాబ్జీ”, “ఆర్య 2”, “ఆపరేషన్ దుర్యోధన” వంటి అనేక విజయవంతమైన చిత్రాల వరకు విస్తరించింది. సుమారు ఆరు వందలకు పైగా చిత్రాలకు ఆయన రూపొందించిన టైటిల్స్ తెరపై పదాలుగా మాత్రమే కాకుండా భావాల ప్రతిరూపాలుగా నిలిచాయి. వివ రెడ్డి చేతుల్లో పుట్టిన ప్రతి అక్షరం ఒక కథ. ప్రతి సినిమా ప్రేక్షకుడి మనసును తాకే తొలి అనుభూతి.

పబ్లిసిటీ రూపకర్తగా కూడా వివ రెడ్డి తన ప్రత్యేక శైలిని ప్రతిష్ఠించారు. “బంగారుకొండ”, “జై బోలో తెలంగాణ”, “లగ్గం”, “బాపు”, “రుద్రంగి”, “సోదర సోదరీమణులారా” వంటి వందకు పైగా చిత్రాలకు ఆయన అందించిన రూపకల్పనలు సినిమాకి ముందే ప్రేక్షకుల హృదయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

నాలుగు రంగాల్లో ప్రతిభా వైవిధ్యం
చిత్రలేఖనం, లోగో రూపకల్పన, పబ్లిసిటీ రూపకల్పన, నటన.. ఈ నాలుగు రంగాల్లోనూ ఆయన చూపిన ప్రతిభ కళా వైవిధ్యానికి ప్రతీకగా నిలిచింది. ఫైన్ ఆర్ట్స్ విద్యతో పదును పెట్టుకున్న నైపుణ్యం, కృషి, పట్టుదలతో అవకాశాలను ఆహ్వానించుకుని ఆయన సాగించిన ప్రయాణం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తోంది.

‘Agaadham Anukulam’ movie trailer launched by Nata kireeti Padma sri Rajendra prasad

ఐటీ కంపెనీ లో జాబ్ చేసుకుంటూ సినిమా మీద వున్న ప్యాషన్ తో అందరు కొత్త నటి నటులతో చేసిన ప్రయత్నం ఈ ఆగాదం అనుకూలం మూవీ, ఈ మూవీ ట్రైలర్ ని పద్మ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు చూసి మూవీ టీమ్ కి తన శుభాకాంక్షలు తెలిపి భసవిష్యత్తు లో మరిన్ని సినిమాలు తీయాలని మూవీ టీమ్ ని అభినందించారు.

ఈ మూవీ త్వరలో ప్రముఖ ఓ టి టి అమెజాన్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కాబోతుంది అని మూవీ టీమ్ తెలీపింది అలాగే తెలుగు ప్రేక్షకులు మా మూవీ ని త్వరలో చూసి మా ప్రయాతన్ని సపోర్ట్ చేయవలిసింది గా కోరారు.

తారాగణం:

కియాన్,ప్రవీణ్,వినయ్,తిలక్,సౌందర్య లహరి,మధు వర్షిత,మధు వుడుగు,గణేష్ యాదవ్,గణేష్ తోట,సంజీవ్,మనోభిరామ్,అభి వర్ధన్,ఉదయ్ క్రోవ్విడి,వల్లభ నీలకాంత్,గొడ్డెన్ల వినయ్,రాజు,రాథోడ్
,దేవరుషి కొత్వాల్,అజయ్,వెంకట్

టెక్నిసియన్స్ :

అసిస్టెంట్ డైరెక్టర్ – సోహన్
అసిస్టెంట్ డైరెక్టర్ – దేవరుషి కొత్వాల్
DOP – అబ్బూరి ఆదర్శ్
కలర్ గ్రేడింగ్ – మిథున్ కుమార్ జానా
టైటిల్ డిజైన్ – లక్ష్మణ్ రాజ్
ఎడిటింగ్ – కెసి (కాశియా చారి)
సంగీత దర్శకుడు – జగదీష్
SFX – వినీత్
కథ – విష్ణు తేజ సల్లా
దర్శకులు – విష్ణు తేజ సల్లా, సంజీవ్ ధరణి
సమర్పణ :ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్
ప్రొడక్షన్ :సావి ప్రొడక్షన్స్

Heroine Faria Abdullah launches ‘Wild Waters – Water & Amusement Theme Park!!!

వైల్డ్ వాటర్స్‌లో భారతదేశంలో తొలిసారిగా వాటర్ & అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఇమర్సివ్ 360° డోమ్ సమ్మర్ ఫెస్ట్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా శంకరపల్లి లో ప్రారంభం

వైల్డ్ వాటర్స్ – వాటర్ & అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ తన ఇమర్సివ్ 360° డోమ్ అనుభవాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ డోమ్‌ను ప్రముఖ నటి ఫారియా అబ్దుల్లా (జాతి రత్నాలు) అధికారికంగా ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ఏండి కిలారు సందీప్ మరియు కిలారు అదితి పాల్గొన్నారు.

కృష్ణ సందీప్ కిలారు మరియు స్వాతి కిలారు స్థాపించిన వైల్డ్ వాటర్స్, గత 9 సంవత్సరాలుగా ప్రతి సీజన్‌లో కొత్త వినోదాలను అందిస్తూ హైదరాబాద్‌లో ప్రముఖ వినోద కేంద్రంగా ఎదిగింది.

ఈ సందర్బంగా ఎండి కిలారు స్వాతి మాట్లాడుతూ….ఈ డోమ్‌లో గోడలు మరియు పైకప్పు మొత్తం ఒకే స్క్రీన్‌లా పనిచేస్తూ, సరౌండ్ సౌండ్‌తో కలిసి సందర్శకులకు పూర్తి ఇమర్సివ్ అనుభవాన్ని అందిస్తుంది. చుట్టూ కనిపించే విజువల్స్ ద్వారా, సందర్శకులు నిజంగా ఆ అనుభవంలో ఉన్నట్టు భావిస్తారు. రోజంతా వివిధ షోలు ప్రదర్శించబడతాయి. ఏప్రిల్ 18 నుండి జూన్ 14, 2026 వరకు వైల్డ్ వాటర్స్ సమ్మర్ ఫెస్ట్ నిర్వహించనుందని తెలిపారు.

కిలారు అదితి మాట్లాడుతూ….ఈ కొత్త ఆకర్షణలతో, వైల్డ్ వాటర్స్ సాంకేతికత, వినోదం, కుటుంబానికి అనుకూలమైన అనుభవాలను కలిపి పూర్తి రోజంతా వినోదాన్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు

ఒకే టికెట్‌తో సందర్శకులు ఆస్వాదించగల వినోదాలు:

● 50కి పైగా వాటర్ & అమ్యూజ్‌మెంట్ రైడ్స్
● లైవ్ డాన్స్ షోలు & DJ ప్రోగ్రామ్స్
● వేవ్ పూల్ అనుభవం
● మ్యాజిక్ షోలు
● విభిన్న రకాల ఆహార వసతులు
ఈ సంవత్సరం ప్రత్యేకంగా DJ ఫోమ్ పార్టీను కూడా ప్రవేశపెట్టారు, ఇది వేసవిలో సందర్శకులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది.

Thimmarajupalli TV is an honest film; everyone is praising it as a good attempt: Producer Kiran Abbavaram at the success meet

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్నిసొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ అక్షయ్ రామ్ పొదిశెట్టి మాట్లాడుతూ – సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే నన్ను ఎంకరేజ్ చేసిన మా పెరెంట్స్ కు, నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచిన నా వైఫ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. మేము సక్సెస్ అందుకున్నాం, సక్సెస్ దక్కడం అంటే మామూలు విషయం కాదు. సినిమా చూసిన ఆడియెన్స్ తమకు నచ్చిన సీన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. వారి ప్రశంసలు వింటుంటే హ్యాపీగా ఉంది. అన్నారు.

నటుడు అమ్మ రమేష్ మాట్లాడుతూ- మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ముందుగా హ్యాట్సాఫ్ చెప్పాలి. థియేటర్స్ లోకి వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ చూశాము. మా మూవీ గురించి వాళ్లకున్న ఎగ్జైట్ మెంట్, ప్రతి క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతున్నవిధానం చూస్తుంటే మా జన్మ ధన్యమైంది అనిపిస్తోంది. అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ – ఈ రోజు ఈ వేదిక మీద నిల్చుని మాట్లాడటం గర్వంగా ఉంది. ప్రతిభ గల దాదాపు 50 మంది కొత్త వాళ్లను కిరణ్ అన్న నమ్మి ఈ సినిమా నిర్మించారు. వాళ్లు ఈ రోజు కిరణ్ అన్న నమ్మకాన్ని నిలబెట్టారు. వీళ్లంతా ఇండస్ట్రీలో మంచి పొజిషన్ కు వస్తారనే ఆశిస్తున్నాం. ప్రతి క్యారెక్టర్ తమ కళ్ల ముందు నిజంగా ఉందా అనేంతగా ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. అన్నారు.

డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ – ప్రీమియర్స్ మొదలైనప్పటి నుంచి మా చిత్రానికి యూనానమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. 40 ఫ్లస్ ఏజ్ ఉన్న వాళ్లు, మహిళలు, పురుషులు తమ మెమొరీస్ గుర్తుచేశావని చెప్పడం హ్యాపీగా అనిపించింది. ఇది తిమ్మరాజుపల్లి ఊరి కథ మాత్రమే కాదు ప్రతి ఊరి కథ. పేర్లు మారుతుంటాయి కానీ ప్రతి ఊరిలో దాదాపు ఇవే పాత్రలు కనిపిస్తాయి. నేను నేటివిటీ ఉన్న చిత్రాలు చేస్తాను. మా కుప్పం దగ్గర ఎన్టీఆర్ విగ్రహం ముందు కూర్చుంటే వంద కథలు వస్తాయి. అవే తెరకెక్కిస్తాను. ఈ తరం ప్రేక్షకులు మీ పేరెంట్స్ అప్పుడెలాంటి లైఫ్ చూశారో తెలుసుకునేందుకైనా ఈ చిత్రానికి వెళ్లండి. మేము థియేటర్స్ కు వెళ్లి చూస్తే మా సినిమాలోని పాత్రల పేర్లను ప్రేక్షకులు పలుకుతున్నారు. మా మూవీలోని క్యారెక్టర్స్ అన్నీ ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యాయి అనేందుకు ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఇంకేం కావాలి. అన్నారు.

నటుడు ప్రదీప్ కొట్టె మాట్లాడుతూ – నిన్నటితరంలో లైఫ్ ఎలా ఉండేది అనే ఎక్సీపిరియన్స్ మా సినిమా ఇచ్చిందనే ప్రశంసలు వస్తున్నాయి. ఇంకా చూడని వాళ్లు మా మూవీకి వెళ్లండి. మీరు కూడా అదే ఫీల్ అవుతారు. మాకెంతో సపోర్ట్ అందిస్తున్న మీడియా మిత్రులకు థ్యాంక్స్. అన్నారు.

హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ – కొత్త వాళ్లం అందరం కలసి ఒక హోప్ తో సినిమా చేస్తే అది బ్లాక్ బస్టర్ అయితే ఎలా ఉంటుందో ఈ రోజే మాకు అర్థమైంది. పెద్దలతో పాటు ఈ తరం పిల్లలు కూడా వచ్చి మీ మూవీ వరల్డ్ ఎలా ఉందో చూద్దామని వచ్చాం అంటుంటే హ్యాపీగా అనిపించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ కంటే సంతోషమైంది ఏదీ లేదు. మా ప్రయత్నం సక్సెస్ అయ్యిందని నమ్మకం కుదిరింది. ఈ సినిమాకు ముందు, తర్వాత మా జీవితాల్లో ఉన్న వంతెన కిరణ్ గారు. ఎన్నో ఎమోషన్స్ ఉన్న మా మూవీ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. అన్నారు.

హీరో సాయితేజ్ మాట్లాడుతూ – కేవలం కిరణ్ అన్న వల్లే మేమంతా ఇక్కడిదాకా రాగలిగాం. ఈ విజయం వెనక ఎలాంటి కృషి జరిగిందే నాకు తెలుసు. తెలిసిన వాళ్లు లేరు, ఈ సినిమాను ఓటీటీకి ఇవ్వమని కొందరు కిరణ్ అన్నకు చెప్పారు. కానీ ఆయన కొత్త వాళ్లు నాపై నమ్మకం పెట్టుకున్నారు. వాళ్లలో టాలెంట్ ఉందని చెప్పి థియేటర్స్ ద్వారా రిలీజ్ చేశారు. మేము కిరణ్ అన్నకు ఏమీ కాము. సినిమా బాగుండాలి, కొత్త వాళ్లు నిలబడాలనే ఆయన ముందుకొచ్చారు. ఇది మా సక్సెస్ కాదు. మాలాంటి కొత్త వాళ్ల సక్సెస్, వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చిన సక్సెస్. అన్నారు.

నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – నేను చేసిన సినిమా బాగా లేకుంటే మనం ప్రయత్నించాం, సక్సెస్ కాలేదని అనుకుని నెక్ట్స్ డే నుంచి సైలెంట్ గా ఉండిపోతాను. కానీ మా తిమ్మరాజుపల్లి టీవీ సినిమా చూసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మీడియా, ఇండస్ట్రీ పెద్దలు, సెలబ్రిటీస్ మంచి ప్రయత్నం చేశారని మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రీమియర్స్ నుంచి బయటకు రాగానే మా మూవీ కాస్ట్ అండ్ క్రూలోని వాళ్ల నెంబర్స్ అడుగుతున్నారు. మా సినిమా రిలీజైన ఒక్కరోజులోనే మా మూవీలోని ఐదారుగురికి ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వచ్చేశాయి. ఇవన్నీ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఈ జర్నీ అంత సులువుగా జరగలేదు. ముని ఈ కథ చెప్పినప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ మూవీ, రూటెడ్ గా కొత్తగా ఉంటుందని అనిపించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే అందరికీ స్కోప్ ఉంది, మంచి ఫ్లేవర్ ఉంది, ఆడియెన్స్ మూవీకి బాగా కనెక్ట్ అవుతారని నమ్మాను. ఈ రోజు ప్రేక్షకులు అదే ప్రూవ్ చేశారు. సినిమా చూసిన వాళ్లంతా చాలా బాగుందని అంటున్నారు. అయితే కొత్త వాళ్లు కాబట్టి ప్రేక్షకులు ఇంకా థియేటర్స్ కు రావాలి అంటున్నారు. కొత్త వాళ్లతోనే ఒక హానెస్ట్ అటెంప్ట్ చేద్దామని ప్రయత్నించాం. మా సినిమాను ఇంకా ఎక్కువ మంది చూస్తారు, రేపు ఓటీటీలో ఇంకా ఎక్కువమంది చూస్తారు. వీళ్లందరికీ మంచి పేరొస్తుంది. ఇది గొప్ప సినిమా అని నేను చెప్పను. కానీ ఇది ఒక మంచి సినిమా. తిమ్మరాజుపల్లి టీవీ అనే అనేది ఒక థియేట్రికల్ ఎక్సిపీరియన్స్. ఒక ఊరికి వెళ్లి రెండు గంటల పాటు క్యూట్, నాస్టాల్జిక్ మూవ్ మెంట్స్ చూస్తారు. థ్రిల్ ఫీల్ ఉంటుంది. మీకు ఎక్కడా బోర్ కొట్టదు. నేను నెక్ట్స్ చేయబోయే మూవీ కూడా కొత్తవాళ్లతోనే చేస్తాను. కొత్త వాళ్లు రావాలి, సినిమా నిలబడాలి. అన్నారు

నటీనటు లు –సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు

టెక్నికల్ టీమ్
————-
కాస్ట్యూమ్స్ డిజైనర్ – విశాల్య
ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ – చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
డీవోపీ – అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
సీఈవో – రహస్య కిరణ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – తేజ వేల్పుచర్ల
ప్రొడ్యూసర్ – కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు