Home Blog Page 9

Hemanth Ippalapalli’s ‘First Time’ Movie trailer will be released on April 28.

The trailer of the film “First Time” written produced and directed by Hemanth Ippalapalli, which is being made on a low budget and being produced as the biggest VFX film in India set to launch on the 28th of this month by the leading actress of “Mangalavaram”. Saurabh Dhingra is making his debut as the hero in this film, while ‘Bigg Boss’ fame Akhil Sarthak is the second lead, Anicka Vikraman is the heroine, and other important roles are played by Mime Gopi, Shiva, Bhuoopal Raju, Gayatri Gupta, Annapoornamma, Ajay Ratnam, and ‘Dhee’ Pandu. Sri Venkat and Sooraj S Kurup have composed the music, while Venu Muralidhar and Ram have worked as cinematographers.

Even though it is a small budget film, Hemanth Ippalapalli is making this film in a grand manner without compromising on technicalities and visuals. The film is being produced with high range graphics with HI (Human Intelligence) without involving AI anywhere. Meanwhile, the trailer launch of this film is going to be released on the 28th of this month by the leading actress of “Mangalavaram”.

Cast:
Saurabh Dhingra is the hero, Akhil Sarthak is the second lead, Anicka Vikraman is the heroine, while Mime Gopi, Shiva, Bhuoopal Raju, Gayatri Gupta, Annapoornamma, Ajay Ratnam, and ‘Dhee’ Pandu are playing other important roles.

Technicians:
Writer, Editor, VFX Lead, Producer and Director: Hemanth Ippalapalli
Music: Sri Venkat and Sooraj S Kurup
Cinematography: Venu Muralidhar and Ram
Executive Producer: P. Rajasekhar
P R O: S Nageswar Rao (SNR)
Marketing Partner: Pushyami Media
Publicity Designer: Venkat Majj

Meet Ferocious Simha From ‘Agadha’ Movie

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మహాదేవి గా కామాక్షి భాస్కర్ల నటించారు. ఆమె పాత్ర ను ఇటీవలే రివీల్ చేశారు. ఈసారి ఇందులో కీలకమైన సింహా పాత్ర ను విడుదల చేశారు. తాజా పోస్టర్‌లో శ్రవణ్ రెడ్డి ‘సింహ’గా కనిపిస్తున్నారు. ‘డర్టీ హరి’ చిత్రంతో శ్రవణ్ రెడ్డి ని తెలుగు చిత్రసీమకు ఎంఎస్ రాజే పరిచయం చేశారు.

చీకటి, పొగతో నిండిన నేపథ్యంలో, శ్రవణ్ రెడ్డి చేతిలో మండుతున్న కాగడాను పట్టుకుని ఉండగా, ఆ చీకటిని చీల్చుకుంటూ వస్తున్న ఏకైక కాంతి మూలం దాని జ్వాల మాత్రమే అని ఈ పోస్టర్ చిత్రీకరిస్తుంది. అతని తీవ్రమైన చూపు, అప్రమత్తమైన భంగిమ, మరియు నాటకీయమైన లైటింగ్ చూస్తే, సింహ భయం, రహస్యం, మరియు తెలియని శక్తుల మధ్య ప్రయాణిస్తున్న వ్యక్తి అని సూచిస్తున్నాయి. అతని చుట్టూ ఉన్న నీడలు మరియు అతను మోస్తున్న ప్రచండ జ్వాల, అతని పాత్ర ఒక ప్రమాదకరమైన మార్గంలో ఉందని, బహుశా సత్యాన్ని అన్వేషిస్తున్నాడని లేదా మానవ అవగాహనకు మించిన దేనినో ఎదుర్కొంటున్నాడని సూచిస్తున్నాయి.

పోస్టర్ డిజైన్, ముందుగా నెలకొల్పిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కొనసాగిస్తూ, పైన అగ్నిగోళాకారంలో ఉన్న ‘అగధ’ టైటిల్‌తో పాటు సస్పెన్స్ మరియు ఆధ్యాత్మిక ఉద్రిక్తతతో నిండిన వాతావరణాన్ని చూపిస్తుంది. సింహా యొక్క కఠినమైన రూపం మరియు దృఢమైన హావభావాలు, కథలోని దైవిక మరియు ఆధ్యాత్మిక అంశాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించడంలో అతను కీలక పాత్ర పోషిస్తాడని సూచిస్తున్నాయి.

85 రోజుల షూటింగ్, విస్తృతమైన సెట్ వర్క్, మరియు దాదాపు 45 నిమిషాల వి.ఎఫ్.ఎక్స్ (VFX) తో, ‘అగధ’ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని ఎంఎస్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది.
ఈ చిత్రానికి
రచన- దర్శకత్వం : M. S. రాజు
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: రాకేష్ వెంకటాపురం
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
అదనపు స్క్రీన్ ప్లే: చైతన్య వేగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ వి ఎన్ సుబ్బరాజు

Lavanya Tripathi Konidela and Dev Mohan’s ‘Sathi Leelavathi’ Grand Releasing on May 8, 2026

‘Sathi Leelavathi’, starring Lavanya Tripathi Konidela and Dev Mohan, presented by the renowned production house Anandi Arts Creations, is being produced by Nagaa Mohan (MNMB) under the Durga Devi Pictures banner. Directed by Tatineni Satya (of Bheemili Kabaddi Jattu and SMS fame), ‘Sathi Leelavathi’ is set for a grand release on May 8, 2026. The film has completed censor formalities and was awarded a clean U certificate. Arrangements are in full swing for a grand release.

Lavanya Tripathi Konidela and Dev Mohan play a couple in ‘Sathi Leelavathi.’ The film is a romantic and relationship drama where the leading lady exercises her power to control the husband. A popcorn entertainer with conflicts unfolding in a fun and humorous way, the story revolves around wife-husband dynamics.

“The bond and the conflicts between the couple are narrated in an emotional yet humorous way,” says producer Nagaa Mohan, adding that the film has been crafted as a feel-good entertainer that will appeal to all sections of the audience. “The two songs and the teaser from the film that were released so far have garnered good reception from the audience. We are starting the promotional activities and the film’s trailer will be released soon.”

Cast: Lavanya Tripathi, Dev Mohan, Naresh V.K., Sapthagiri, VTV Ganesh, Motta Rajendran, Jaffer and Joshi and others

Presented by: Anandi Art Creations
Banner: Durga Devi Pictures
Producer: Nagaa Mohan (MNMB)
Director: Tatineni Satya
Music: Mickey J. Meyer
Cinematography: Binendra Menon
Dialogues: Udhay Pottipadu
Art: Kosanam Vithal
Editor: Satish Surya
PRO: Mohan Tummala

RS Infotainment’s ‘MANDAADI’ Shoot Wrapped After an Intensive Schedule — Post-Production Work in Full Swing

RS Infotainment, led by Elred Kumar, has officially wrapped up the shooting of its upcoming sports action drama MANDAADI. The film was shot over a long and challenging schedule, with a major portion filmed in the coastal regions of Ramanathapuram. The team worked in tough conditions to bring a realistic and powerful feel to the story. From intense action scenes to emotional moments and visually appealing sailboat race sequences, every part of the film was shot with great care and effort.

Directed by Mathimaran Pugazhendhi, MANDAADI is set in a unique sports backdrop and tells a story that is deeply connected to its setting. With filming now finished, the movie has entered the post-production stage, and work is moving ahead quickly. Actor Soori plays the lead role and has put in a lot of hard work for the film, especially in terms of physical preparation. His performance is expected to be one of the main highlights.

The film also marks the Tamil debut of Suhas, who steps into a strikingly different space with a negative-shaded role. Sporting a complete makeover, the actor put in intense preparation to convincingly portray the character. Demonstrating strong commitment, he dedicated nearly 100 days of call sheets to the project and is now looking to expand his presence in the Tamil market with this film. Mahima Nambiar stars as the female lead, while seasoned performers Sathyaraj, Ravindra Vijay, Mithun, and Bala Saravanan play key supporting roles, further elevating the film’s ensemble strength.

The film has a strong technical team as well. Music is composed by GV Prakash Kumar, while SR Kathir handles the cinematography. The production design is by DRK Kiran, editing by Pradeep E Ragav, and action sequences are choreographed by Peter Hein, Dilip Subbarayan, and Mahesh Mathew.

At present, the team is busy with post-production work such as editing, sound design, visual effects, and music. They are working carefully to make sure the film turns out to be engaging and high in quality.

MANDAADI is set in the world of coastal fishing communities. The title refers to a skilled leader who guides fishing trips using knowledge of the sea, winds, and waves. This idea of leadership, experience, and survival forms the heart of the story.

After creating curiosity with its first look, the film is now moving ahead to its next stage, building excitement among audiences. More updates about MANDAADI are expected soon.

Cast : Soori, Suhas, Mahima Nambiar, Sathyaraj, Ravindra Vijay, Mithun, Bala Saravanan and others.

Technical Crew:

Banner: RS Infotainment
Presented by: Elred Kumar
Creative Producer: Vetri Maaran
Producer: Elred Kumar
Co-Producer: Manikandan
Director: Mathimaran Pugazhendhi
Music: G. V. Prakash Kumar
Cinematography: S. R. Kathir
Editing: Pradeep E. Raghav
Action: Peter Hein, Dilip Subbarayan, Mahesh Mathew
Production Design: D. R. K. Kiran
PRO: Sai Satish

Concept Poster Released on the Occasion of Hero Keshava Kalavapalli’s Birthday

భజరంగి క్రియేషన్స్, ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ సంయుక్తంగా పాపిరెడ్డి కాలవపల్లి, రామిరెడ్డి అల్లూరి నిర్మాతలుగా రాయలసీమ కడప బ్యాక్ డ్రాప్ లో జరిగిన సరికొత్త ప్రేమ కథతో నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఏపీ04 రామాపురం సినిమాతో ప్రేక్షకుల మన్నన పొందిన దర్శకుడు యు హేమారెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ కేశవ కాలవపల్లి అనే కొత్త హీరోని పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకి వినోద్ వైలా సంగీతం అందిస్తున్నారు. హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా కాన్సెప్ట్ పోస్టర్ను మూవీ టీం విడుదల చేసింది.

ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని జూన్ మొదటి వారం నుంచి షూటింగ్ మొదలవుతుందని మూవీ టీం పత్రికా ముఖంగా తెలియజేసింది.

నటీనటులు : కేశవ కాలవపల్లి తదితరులు.

సాంకేతిక నిపుణులు :
బ్యానర్స్ : భజరంగి క్రియేషన్స్, ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్
నిర్మాతలు : పాపిరెడ్డి కాలవపల్లి, రామిరెడ్డి అల్లూరి
రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : యు హేమారెడ్డి
సంగీతం : వినోద్ వైలా
కో డైరెక్టర్ : మిట్ట చెన్నారెడ్డి
పి ఆర్ ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం

Youthful Entertainer ‘KANNA’ Movie Teaser launched held grandly

మాధురి ప్రజెంట్స్, పాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం కన్న. ఎస్ఎన్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం కన్న టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మఖ్యఅతిథిగా హీరో చైతన్య రావు, హీరో కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్, సినిమా యాక్టర్స్, టెక్నీషన్స్ తదితరులు పాల్గొన్నారు. చైతన్యరావు చేతులు మీదుగా విడుదలైన కన్న టీజర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో కార్తీక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, కిట్టయ్య, రూపేష్, ప్రేమ్ కృష్ణ , సూరజ్, రామ్ పటాస్, వేణు, డైరెక్టర్ నాని కాసరగడ్డ, రవీంద్ర, వెంకీ, మురళి, బంటు, మంజు వెంకట్, దేవా, బృందావనం మూవీ టీమ్, మేకర్స్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యాక్టర్ వెంకీ మాట్లాడుతూ... ఇది చిన్న సినిమా కావచ్చు కానీ అందరు గుర్తు పెట్టుకునే సినిమా అవుతుంది అన్నారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. హీరోయిన్ గీతికా రథన్ మాట్లాడుతూ..టీజర్ చుస్తే చిన్న సినిమాలా అనిపించడం లేదన్నారు. ఈ సినిమాలో తాను సత్య పాత్ర పోషించినట్లు చెప్పారు. ఈ మూవీ చూసిన తరువాత అందరూ తనను సత్య అని గుర్తుపెట్టుకుంటారు అని చెప్పారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి కి థాంక్స్ చెప్పారు. అందరు సినిమాకు సపోర్ట్ చేయాలని కోరారు.

హీరో కార్తిక్ శివన్ మాట్లాడుతూ.. పిలవగానే వచ్చిన హీరో చైతన్య రావుకు థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం తనకు ఏ సినిమా బ్యాగ్రౌండ్ లేదన్నారు. ఇప్పటి వరకు తన వెన్నంటి నడిపిన తన తండ్రినే తనకు బ్యాగ్రౌండ్ అని చెప్పారు. అలాగే సినిమా చుసిన తరువాత ఈ మూవీ తనకు బ్యాగ్రౌండ్ అవుతుందని చెప్పారు. ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుందని చెప్పారు. క్రికెట్, లవ్, ఎమోషనల్ స్టోరీ ఈ మూడు ఎమోషన్స్ ప్రధానంగా సినిమాలో చూపించినట్లు చెప్పారు. ఇక ఈ కన్న చిత్రం పరిశ్రమలో నిలిచిపోతుంది చెప్పారు. సినిమాకు సపోర్ట్ చేస్తూ.. ప్రొడ్యూస్ చేసిన నిర్యాత శ్రీను కు థాంక్స్ చెప్పారు. సినిమా అద్భుతంగా తీర్చిదిద్దిన డైరెక్టర్ రాజశేఖరరెడ్డి కి థాంక్స్ చెప్పారు. సొంత అన్న గురించి ఇంతకన్న ఎక్కువ చెప్పలేనని తెలిపారు. అలాగే హీరోయిన్ గీతికా ప్రాణం పెట్టి చేశారు అని చెప్పారు. తనకు కూడా మంచి పేరు వస్తుందని తెలిపారు. మా టీమ్ అంతా ఈ పరిశ్రమలో ఇప్పుడు ఎంట్రీ పాస్ తీసుకున్నామని, మా నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ చాలా బాగుంటాయని నమ్మకం వ్యక్తం చేశారు

ప్రొడ్యూసర్ కృష్ణ మాట్లాడుతూ..డైరెక్టర్ ఎంతో సహనంతో ఈ సినిమాను తెరకెక్కించారని చెప్పారు. సినిమా ఒక నిర్మాతగా ఉన్నా అసిస్టెంట్ గా వర్క్ చేసినట్లు వెల్లడించారు. సినిమా అంటే ఎంతో ఇష్టం అందుకే సినిమాకు సంబంధించిన ఏ పని అయినా చేస్తా అని చెప్పారు. కన్న సినిమాలో యాక్ట్ చేసిన ప్రతీ ఒక్క నటీనటులకు, టెక్నిషన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ నాని కాసరగడ్డ మాట్లాడుతూ.. ఈ టీజర్ లా కాదు ఒక ట్రైలర్ చుసినట్లు తృప్తిగా ఉందన్నారు. ఈ సినిమా ప్యాషనెట్ తో తెరకేక్కించనట్లు అర్థం అవుతుందని చెప్పారు. ఈ ఐపిఎల్ సీజన్ లో కన్న రైట్ సినిమా, కచ్చింతంగా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు.

డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... పిలువగానే వచ్చిన హీరో చైతన్య రావు కి థాంక్స్ చెప్పారు. ఆయన సినిమాలకు ఏడి గా పనిచేసానని చెప్పారు. ఆయన మెథడ్ యాక్టింగ్ చాలా నచ్చుతుందని చెప్పారు. ఆయనతో పనిచేయాలని ఉందని, భవిష్యత్తు ఆ అవకాశం వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే మంజు వెంకట్ కు థాంక్స్ చెప్పారు. చిన్న సినిమా అని చెప్పగానే సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారని చెప్పారు. అల్లరి నరేష్ తో సినిమా చేసిన డైరెక్టర్ నాని కాసరగడ్డ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ చెప్పారు. స్పిరిట్ కు పనిచేస్తున్న డీఓపీ గుణశేఖర్ మా సినిమాకు పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మా కాంబినేషన్ మంచి హిట్ అవుతుందని చెప్పారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ సాంగ్స్ అద్భుతంగా ఇచ్చారు అని చెప్పారు. అలాగే ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ స్టైల్ అందరికి నచ్చుతుందని చెప్పారు. యాక్టర్ రూపేష్ ఒక అద్భుతమైన యాక్టర్ అని చెప్పారు. ఆయన విలన్ కాదు యాంటీహీరో రోల్ చేసారని చెప్పారు. సినిమాలో యాక్ట్ చేసిన ప్రతీఒక్కరు ప్రాణం పెట్టి చేశారు అని చెప్పారు.

అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్, టెక్నికల్ టీమ్ కూడా చాలా కష్టపడ్డారని చెప్పారు. హీరోయిన్ గీతికా చూడడానికి అందంగా ఉండటం మాత్రమే కాదు చాలా ప్రతిభ ఉందని, ప్రతి విషయంలో కష్టపడుతుందని చెప్పారు. క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉందన్నారు. మంచి పేరు వస్తుందన్నారు. ఇక హీరో కార్తిక్ శివన్ సొంత తమ్ముడు అని కాదు చాలా కష్టపడే వ్యక్తి అన్నారు. మంచి యాక్టర్ అవుతారని, రేపటి రోజు కార్తిక్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు అని చెప్పారు. సినిమా క్రికెట్ చుట్టూ సీరియస్ గా కాదు చాలా సరదాగా, మన చిన్నతనంలోని చాలా విషయాలను గుర్తు చేస్తుందని చెప్పారు. ఈ సినిమాలో కార్తిక్ క్యారెక్టర్ కూడా చాలా మందికి కనెక్ట్ అవుతుందని చెప్పారు. సినిమాలో కన్న లాంటి క్యారెక్టర్ ప్రతీ ఊరిలో ఒక్కడు ఉంటాడు అని చెప్పారు. కన్న సినిమా టీజర్ ఎంతలా నచ్చిందో సినిమా కూడా అదే స్థాయిలో అలరిస్తుందని తెలిపారు.

హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. డైరెక్టర్ రాజశేఖర్ ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి అన్నారు. కచ్చితంగా మంచి డైరెక్టర్ అవుతారు అని చెప్పారు. ఆయనతో కలిసిపనిచేస్తానని చెప్పారు. మనం పని చేసుకుంటూ పోవడమే ఫలితంతో సంబంధం లేదన్నారు. ఈ టీజర్ చూస్తుంటే మలయాళం సినిమా చూసినంత ఫీల్ ఉందని, విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందన్నారు. ఎడిటింగ్ కట్స్ కూడా చాలా బాగున్నాయరు. హీరోగా యాక్ట్ చేసిన కార్తీక్ చాలా పోటెన్షల్ ఉన్న యాక్టర్ లా కనిపిస్తున్నాడు అని, ప్రతీ ఫ్రేమ్ లో కన్న క్యారెక్టర్ కనిపిస్తుందని చెప్పారు. ఇక హీరోయిన్ గీతికాకు ఈ సినిమా మంచి పేరును తీసుకొస్తుందని చెప్పారు. ఇలాంటి చిన్న సినిమాలు ఇండస్ట్రీలో నిలబడాలని.. ఈ సినిమాకోసం ఏ విధంగానైన తాను సాయం అందిస్తానని చెప్పారు.

చిత్రం: కన్న
బ్యానర్ : ప్యాషనట్ ఫిలిం మేకర్, సినిమాటిక్ విజువల్ స్టూడియో
నటీనటులు : కార్తీక్ శివన్, గీతికా రథన్, కిట్టయ్య, రూపేష్, సూరజ్, పటాస్ రామ్, ప్రసాద్ తదితరులు
రచన- దర్శకత్వం : ఎస్ ఎన్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాత : సిరివిరెడ్డి నరసింహారెడ్డి, ఎడమ శ్రీను
ఎడిటర్ : కోడటి పవన్ కళ్యాణ్
డి ఓ పి: గుణశేఖర్
సంగీతం : శరవణ వాసుదేవన్
ఆర్ట్ : గిరి
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎడమ కృష్ణ
ఫైట్స్ : శంకర్
కోరియోగ్రాఫర్ : మురళి
కాస్ట్యూమ్స్ : శివ
గ్రాఫిక్స్ : సినిమాటిక్ విజువల్ స్టూడియో
పి ఆర్ ఓ : హరీష్ అప్పరాల

Gedela Raju Pre-release event held grandly, Movie releasing on April 24th

రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు వీ వీ వినాయక్, వీఎన్ ఆదిత్య, నిర్మాత, రైటర్ కోన వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ వీ వినాయక్ మాట్లాడుతూ – రఘు కుంచె ఇండస్ట్రీలో అందరికీ మిత్రుడు. ఎంతోమంది స్నేహితులను సంపాదించుకున్నాడు. మా కన్నా ఇండస్ట్రీకి ముందు వచ్చాడు. ఆర్టిస్టుగా, హీరోగా ప్రయత్నించాడు. మ్యుజీషియన్ గా , సింగర్ గా పేరు తెచ్చుకున్నాడు. సోలో హీరోగా నటించాలనే ఆయన కల ఈ చిత్రంతో నెరవేరుతోంది. రిలీజ్ కు మంచి డేట్ దొరికింది. సినిమా నచ్చి మైత్రీ లాంటి సంస్థ రిలీజ్ చేయడమే ఈ సినిమాకు మొదటి విజయం. రఘు కుంచె క్యారెక్టర్ నే టైటిల్ గా పెట్టి ఎంతో ప్యాషనేట్ గా చేశారు. ఈ సినిమా విజయం సాధించి రఘుకు గొప్ప పేరు తీసుకురావాలని కోరుతున్నా. అలాగే దర్శకుడు చైతన్యకు సక్సెస్ దక్కి, పెద్ద దర్శకుడు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అన్నారు.

రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ మాట్లాడుతూ – ఇంతమంది ఫ్రెండ్స్ ఉండటం రఘు కుంచె సంపాదించుకున్న ఆస్తి. ఆయన తన కొడుకును త్వరలో హీరోను చేయబోతున్నాడు. ఆ లోగా తను హీరోగా సినిమా చేసేశాడు. గేదెలరాజు సినిమా కంటెంట్ నేను చూశాను చాలా బాగుంది. ఈ రోజు స్టార్ హీరో కొత్త వాళ్లు అనే తేడా లేదు. కంటెంట్ బాగుంటే ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. కంటెంట్, ప్యాషన్ తో రఘు ఈ సినిమా చేశారు. సినిమా తీసేందుకు డబ్బు కంటే ముఖ్యం కంటెంట్, ప్యాషన్. అవి రెండు ఈ టీమ్ లో కనిపిస్తున్నాయి. ప్రతి టెక్నీషియన్ లో 24 క్రాఫ్టుల గురించి ఎంతోకొంత అభిరుచి, అవగాహన ఉంటాయి. అలాంటి టెక్నీషియన్స్ అంతా తమ బెస్ట్ వర్క్ ఈ సినిమాకు ఇచ్చారు. సినిమాకు ఐపీఎల్ అని, పైరసీ అని చాలా అడ్డంకులు ఉంటాయి. కానీ మంచి సినిమాను ఇవేమీ ఆపలేవు. మనం రిలీజ్ చేసే ట్రైలరో పాటో ఆడియెన్స్ నచ్చితే సినిమా చూస్తారు. మా బ్యాండ్ మేళం మూవీ ఇటీవల దీన్ని ప్రూవ్ చేసింది. గేదెలరాజు సినిమా కూడా మంచి విజయం సాధించి, ఈ టీమ్ లోని వారికి ఇంటిపేరుగా మారాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – గేదెలరాజు సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది. రఘు కుంచె గారు మంచి నటుడు. ఆయన సినిమాలు సెన్సార్ లో చూసి ఫోన్ చేసే అభినందించేవాడిని. రఘు గారి మొహంలో అనేక ఎమోషన్స్ పలుకుతాయి. నటుడిగా ఆయన పెద్ద కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఈ చిత్ర నిర్మాత వాణి గారు తన కొడుకు చైతన్యను డైరెక్టర్ ను చేయడం గొప్ప విషయం. సినిమా ఇండస్ట్రీకి వద్దనే తల్లిదండ్రులను చూస్తుంటాం. కానీ ఆమె తమ సొంత డబ్బులతో కొడుకును దర్శకుడిని చేశారు. ఈ సినిమా పరీక్షలు పూర్తయి హాలీడేస్ వచ్చిన మంచి టైమ్ లో రిలీజ్ అవుతోంది. మైత్రీ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఈ చిత్రంలోని పాత్రధారులు అందరికీ గుర్తింపు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ – ఇండస్ట్రీలో పేరున్న పెద్దలతో కలిసి ఈ వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం మా అబ్బాయి చైతన్య వల్లే మాకు కలిగింది. నా శ్రీమతి మా ఇంటికి మూలస్తంభం. ఆమె సపోర్ట్ తోనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయగలిగాను. రఘు కుంచె గారు ఒక సోదరుడిలా మాకు సహకారం అందించారు. ఈ సినిమా మంచి విజయం సాధించి మాకు పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. అన్నారు.

జర్నలిస్ట్ టీవీ5 మూర్తి మాట్లాడుతూ – రఘు కుంచె నాకు మంచి మిత్రులు. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. రఘు బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతం, గానం, నటన..ఇలా ఎన్నో విభాగాల్లో ప్రతిభ కనబర్చారు. ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం రఘు కుంచెది. ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ చూశాను. చాలా బాగున్నాయి. తన కలల్ని ప్రోత్సహించే పేరెంట్స్ ఉన్న దర్శకుడు చైతన్య అదృష్టవంతుడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు

దర్శకుడు చైతన్య మోటూరి మాట్లాడుతూ – గేదెలరాజు సినిమాతో కొత్త వాళ్లను, నాకు తెలిసిన వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను. మా మూవీ ఇంత పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ జరుపుకుని, గ్రాండ్ రిలీజ్ కు వస్తుందని ఊహించలేదు. ఈ రోజు ఇంతమంది పెద్దలు మా సినిమాకు సపోర్ట్ చేసేందుకు అతిథులుగా రావడం సంతోషంగా ఉంది. నా లైఫ్ లో రఘు గారిని కలవడం పెద్ద అదృష్టంగా భావిస్తాను. ఆయన మా సినిమాకు ఎంత సపోర్ట్ చేశారో మా టీమ్ లోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ నెల 24న మీ ముందుకు వస్తున్నాం. మా గేదెలరాజు చిత్రాన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

నటి శ్రావ్య మాట్లాడుతూ – మా గేదెల రాజు సినిమాలో మాస్, ఎమోషన్, లవ్ వంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ నెల 24న మీరంతా మా సినిమాకు వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు వికాస్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను విజయ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ పాత్రకు మంచి లవ్ స్టోరీ ఉంటుంది. గేదెలరాజు సినిమాకు మీరు ఇప్పటిదాకా చూడని ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్ కథను చూపించబోతోంది. అన్నారు.

యాక్టర్ రఘు కుంచె మాట్లాడుతూ – కళారంగమైన సినిమా ఇండస్ట్రీకి తమ వారసులు వెళ్లాలని కోరుకునే తల్లిదండ్రులు చాలా తక్కుమంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరికీ గ్యారెంటీ ఉండదు. ప్రతి శుక్రవారం జీవితాలు మారిపోతుంటాయి. పైకి ఎదిగినవాళ్లు కిందపడటం, కిందనున్న వాళ్లు పైకి వెళ్లడం చూస్తుంటాం. మా డైరెక్టర్ చైతన్య పేరెంట్స్ మాత్రం అతన్ని చిత్ర పరిశ్రమకు తీసుకొచ్చారు. నేను చిన్నప్పుడు చదువుకున్న భగవద్గీత శ్లోకం ఒకటి బాగా గుర్తుంది. జీవితంలో ప్రతిరోజూ మనం కురుక్షేత్ర యుద్ధం చేయాల్సిందే. గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం. ఈ రెండే ఉంటాయి. అలాగని మనం యుద్ధం చేయకుండా ఉండొద్దు. మన సినిమా ఇండస్ట్రీ పద్మవ్యూహం లాంటిది. ఇందులోకి రావడమే గానీ బయటకు వెళ్లడం ఉండదు. ఏది ఏమైనా ఇక్కడే ఉండి ప్రయత్నాలు చేస్తుంటాం. అలా సినిమా ఇండస్ట్రీ అనే పద్మవ్యూహంలోకి అభిమన్యుడిలా వచ్చిన దర్శకుడు మా చైతన్య మోటూరి గెలవాలని, మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఆయన తల్లిదండ్రులు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో, ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చెప్పాలంటే ఒక పుస్తకం రాయాలి. ఈ శుక్రవారం వారు కోరుకున్న ప్రతిఫలం దక్కాలని ఆశిస్తున్నా. మా సినిమా గురించి చెప్పాలంటే దాదాపు అందరం కొత్తవాళ్లమే. కొత్త వాళ్ల సినిమాలో చూసేందుకు ఏముందని మీరు అనుకోవచ్చు. ఈ మూవీలో ఒక మంచి కథ ఉంది. అది మన నేటివిటీ ఉన్న కథ. కాకినాడ అనే పట్టణంలో ఉండే ఒక రౌడీ, అతని క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న కథ. గేదెలరాజు చుట్టూ ఉన్న అనేక కథలు ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 20 నిమిషాల్లో అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. మొదటి నుంచి సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఊహించని ట్విస్ట్ అది. ఆ ట్విస్ట్ కు వచ్చే సర్ ప్రైజింగ్ రియాక్షన్ సినిమాను కాపాడుతుందని నమ్ముతున్నాను. మైత్రీ సంస్థ వందకుపైగా స్క్రీన్స్ లో మా సినిమాను రిలీజ్ చేస్తోంది. ఎగ్జిబిటర్స్ మీ సినిమాను అడుగుతున్నారు అని మైత్రీ శశి గారు అనడం సంతోషాన్నిచ్చింది. మీరు సినిమా చూస్తే తప్పకుండా మరికొందరికి బాగుందని చెబుతారు. అన్నారు.

నటీనటులు – రఘు కుంచె, రవి ఆనంద్‌, చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాస్, మౌనిక, తదితరులు

టెక్నికల్ టీమ్ – సహ నిర్మాతలు– రవిఆనంద్‌ చిన్నిబిల్లి, తాడాల వీరభద్రరావు, గీతార్థ్‌ కుంచె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌– కిరణ్‌ తాతపూడి , దివ్య మోటూరి, పబ్లిసిటి డిజైనర్‌– ఏజే ఆర్ట్స్‌ అజయ్, విఎఫ్‌ఎక్స్‌– కొత్తపల్లి సునీల్, లిరిక్స్‌– గిరిధర్‌ రాగోలు, లలిత కాంతారావు ఎడిటర్‌– సుధీర్‌ ఎడ్ల, కాస్ట్యూమ్‌ డిజైనర్‌– సింధూ ధిలీషా, పిఆర్‌ఓ– శివ మల్లాల, మూర్తి మల్లాల, ఆర్ట్‌– అమర్‌ తలారి, చీఫ్ అసోసియేట్- గౌరి శంకర్ కో డైరెక్టర్‌– శేఖర్‌ కుంపట్ల, సంగీతం– రఘు కుంచె, నిర్మాత– వాణి రవికుమార్‌ మోటూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే దర్శకత్వం– చైతన్య మోటూరి

Director Chaitanya Moturi Interview about ‘GedelaRaju KakinadaTaluka’ Movie

రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ చైతన్య మోటూరి.

– మా స్వస్థలం అమలాపురం. నేను డాక్టర్ కావాలనేది మా కుటుంబ సభ్యుల కోరిక. ఇంటర్ అయ్యాక ఫిజియోథెరపీ చేశాను. ఒక క్లినిక్ ప్రారంభించాను. చదువుల్లో ముందున్నా, సినిమా, సాహిత్యం మీద ఆసక్తి ఉండేది. చిన్నప్పటి నుంచే కథలు, కవిత్వాలు రాసేవాడిని. ఆ ఆసక్తి అలా పెరుగుతూ వచ్చింది. క్లినిక్ నిర్వహిస్తున్నప్పుడే షార్ట్ ఫిలిం క్లబ్ ఏర్పాటు చేసి స్థానికంగా ఆసక్తి ఉన్నవారిని చేర్చుకుంటూ వచ్చాను. అలా నాకంటూ ఒక టీమ్ తయారైంది. అందులో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉండేవారు. ఇలా కాకినాడలో షార్ట్ ఫిలింస్ చేస్తున్న టైమ్ లో డియర్ కామ్రేడ్ దర్శకుడు భరత్ కమ్మను సంప్రదించాను. ఆయన అమలాపురం, కాకినాడలో కొన్ని ప్లెజెంట్ విజువల్స్ తీసుకురమ్మని చెప్పారు. డ్రోన్ షాట్స్ తో సహా మంచి విజువల్స్ తీసుకెళ్లి చూపించాను. ఆయనకు నచ్చి నన్ను డైరెక్షన్ టీమ్ లోకి ఏడీగా తీసుకున్నారు. అలా చిత్ర పరిశ్రమలో నా జర్నీ మొదలైంది. డియర్ కామ్రేడ్ టైమ్ లో సినిమా వర్క్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకు కూడా వర్క్ చేశాను. నేను మూవీ ట్రయల్స్ చేస్తూ ప్రొడ్యూసర్స్ కు కథలు చెప్పేవాడిని. వాళ్లకు నా కథలు నచ్చినా రెండో సినిమా చేద్దామని అనేవారు. మొదటి సినిమా ఎవరో ఒకరు అవకాశం ఇవ్వాలి కదా అనిపించేది. కొంతకాలం అయ్యాక ఇక బయట ప్రొడ్యూసర్స్ తో చాలా టైమ్ పడుతుందని మా నాన్నకు ఫోన్ చేసి నేనే తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పాను. ఆయన ఓకే అన్నారు. అలా గేదెల రాజు సినిమాకు అడుగుపడింది.

– మొదట గేదెల రాజు చిత్రాన్ని చిన్న బడ్జెట్ లో చేయాలని అనుకున్నా. అయితే కథ స్పాన్ పెరగడం, ఇంట్రెస్టింగ్ గా స్క్రిప్ట్ రావడంతో కొంత కొంతగా బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. లోకల్ గానే సినిమా అంతా చేయాలనుకున్నాం. యారీ కెమెరాలు వాడాం. గెదెల రాజు క్యారెక్టర్ కు మాత్రం నోటెడ్ ఆర్టిస్టును తీసుకోమని దర్శకులు భరత్ కమ్మ, దుశ్యంత్ సలహా ఇచ్చారు. అలా మా సెర్చింగ్ రఘు కుంచె గారి దగ్గరకు వచ్చింది. అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ , గేదెల రాజు క్యారెక్టర్ కోసం ఎవర్నీ తీసుకోలేదు. రఘు కుంచె గారితో కథా చర్చలు చేశాక ఆయనలోని సింప్లిసిటీ నచ్చింది. పలాస లాంటి చిత్రాలు నేను చూశాను. గేదెల రాజు అనే రౌడీ షీటర్ క్యారెక్టర్ కు రఘు కుంచె గారు పర్పెక్ట్ గా సెట్ అవుతారని అనిపించింది. అలా ఆయన మా మూవీలోకి వచ్చారు.

– కాకినాడ పరిసర ప్రాంతాల్లో రౌడీల గురించి నాకు తెలిసిన విషయాలు, స్థానికంగా జరిగిన ఘటనలు..ఇవన్నీ కలిపి ఈ కథ రాసుకున్నాను. ఇది ఏ ఒక్కరి కథ కాదు. నాకు తెలిసిన విషయాలెన్నో ఈ కథగా రాశాను. నేను కొత్త దర్శకుడిని కాబట్టి విలన్ నే మెయిన్ గా పెట్టి సినిమా చేస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అనిపించింది. మనం సోషల్ మీడియోలో ఎన్నో క్రైమ్ స్టోరీస్ చూస్తున్నాం, యూట్యూబ్ లో క్రిమినల్స్ ఇంటర్వ్యూస్ చూస్తున్నాం. అలా నేను విన్నవే ఈ కథకు స్ఫూర్తి. డెయిర్ ఫామ్ నడిపే గేదెల రాజు అనే రౌడీ షీటర్ కథ ఇది. మా తాతయ్య రోజూ మహాభారతం చదివి వినిపించేవారు. ఆయన చెప్పిన వాటిలో కనికుడి పాత్ర నాకు గుర్తుండిపోయింది. ధృతరాష్ట్రుడి పక్కనే ఉండే కనికుడు దుర్మార్గుడు. అతని నీతి ఏంటంటే నేనే గొప్ప, ఎదురొచ్చినవాడిని సమయం చూసి దెబ్బకొట్టాలి అనేది. ఇదే కనికనీతి. అడ్డొచ్చినవాడు కొడుకైనా కనికుడు ప్రతీకారం తీర్చుకోకుండా వదిలేవాడు కాదు. దీని గురించి ఇప్పటిదాకా మన మూవీస్ లో ఎవరూ చెప్పలేదు. కొత్తగా ఉంటుందని గేదెలరాజు సినిమాలో పెట్టాను.

– మా మూవీకి ప్రధాన ఆకర్షణగా రఘు కుంచె గారి మ్యూజిక్ నిలుస్తుంది. ఆయన ఈ సినిమాకు మంచి బీజీఎం చేశారు. మాకున్న బడ్జెట్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీ సౌండింగ్ ఇచ్చారు. సినిమా చూసిన వాళ్లు బీజీఎం గురించి, సాంగ్స్ గురించి మాట్లాడుకుంటారు. డాల్బీ అట్మాస్ లో సౌండింగ్ చేయించాం. మూడు పాటల్లో మెలొడీ సాంగ్, సెలబ్రేషన్ సాంగ్, గేదెలరాజు పోయినప్పుడు ఒక సరదా సెటైరికల్ సాంగ్ ఉంటాయి. గేదెలరాజు వుమైనజర్. అతను ఎంతోమందికి నగలు ఆశజూపి లోబర్చుకుంటాడు. ఆ మాట నెరవేర్చుకోడు. అలాంటి వాళ్లంతా గేదెలరాజు పోయినప్పుడు తిడుతుంటారు. కొందరు పొగుడుతుంటారు. అలాంటి వాళ్లందరి తిట్లు, పొగడ్తల నేపథ్యంతో ఈ పాట ఉంటుంది. గేదెలరాజు గా రఘు కుంచె గారు రియలిస్టిక్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక రౌడీ షీటర్ ఎలా నవ్వుతాడో, ఎలా మాట్లాడుతాడో, ఎలా కోపంగా చూస్తాడో అవన్నీ రఘు గారి పర్ ఫార్మెన్స్ లో సహజంగా చూస్తారు.

– నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగే మర్డర్ మిస్టరీ స్టోరీ ఇది. వర్తమానంలో గతంలో జరిగినవి చూపిస్తూ మర్డర్ మిస్టరీ కథను ఆసక్తికరంగా తెరకెక్కించాను. ఇందులో రెండు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కూడా చూపిస్తున్నాం. మొత్తం ఐదు కథలు గేదెలరాజు చుట్టూ జరుగుతుంటాయి. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు అనే క్యాప్షన్ కూడా మా మూవీకి పర్పెక్ట్ గా పెట్టాం. మా సినిమా చూసిన ఎవరూ కూడా కథలోని ట్విస్ట్ ను కనిపెట్టలేకపోయారు. మేము ఎక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా పూర్తిగా నేచురల్ గా వెళ్లాం. ప్రతి పాత్ర మీరు ఎక్కడో చూసినట్లు, విన్నట్లు ఉంటుంది. గేదెలరాజు వేసుకుని డ్రెస్సులు కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కొన్నవే. ఇంత నేచురల్ గా తెరకెక్కించాం కాబట్టే సినిమా ఆడియెన్స్ కు నచ్చుతుందనే నమ్మకం పెట్టుకున్నాం.

MRP Movie Teaser Launched by Producer Sahu Garapati

ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల కావడం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.టీజర్ విడుదల చేసిన అనంతరం టీం అందరికి విషెస్ చెప్తూ మూవీ సక్సెస్ కావాలి, అని అన్నారు.

పాంచజన్య ఫీచర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ చూస్తే వినోదంతో నిండిన వినూత్న కథను చూపించబోతుందనే భావన కలుగుతోంది. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథ, వారి మధ్య ఉండే సరదా సంఘటనలు, స్టైలిష్ మేకింగ్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ చిత్రానికి శ్రవణ్ జేష్ఠ దర్శకత్వం వహిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. టీజర్‌లో కనిపించిన ఎనర్జీ, ప్రెజెంటేషన్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
సంగీతాన్ని అజయ్ అరసాడ అందించగా, విజువల్స్‌కి మరింత ఆకర్షణను తీసుకొచ్చింది. టెక్నికల్ టీమ్ పని కూడా ప్రశంసనీయంగా కనిపిస్తోంది.

టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. వినోదంతో పాటు కొత్తదనం చూపించబోతున్న ఎంఆర్పీ సినిమా నుంచి త్వరలో మరిన్ని విశేషాలు తెలియనున్నాయి.

ఈ చిత్రం లో నరేష్ అగస్త్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, సుదర్శన్, డొనాల్ బిష్త్, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్,గగన్ విహారి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

నటి నటులు:

నరేష్ అగస్త్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, సుదర్శన్, డొనాల్ బిష్త్, వెన్నెల కిషోర్,హర్షవర్ధన్,గగన్ విహారి తదితరులు

టెక్నికల్ టీం:

డైరెక్టర్ & ప్రొడ్యూసర్ : శ్రవణ్ జేష్ఠ
బ్యానర్ : పాంచజన్య ఫీచర్స్
మ్యూజిక్ : అజయ్ అరసాడ
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
డీ ఓ పీ : రాకేష్ కొలంచి
మార్కెటింగ్ : కీ మీడియా
పీ అర్ ఓ : దినేష్ కోయ

Paramapada Sopanam Pre Release event held grandly,Movie Releasing on April 24th

అర్జున్ అంబటి హీరోగా ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా… పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథా నాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో..

*ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ* ..‘‘ప్రసన్న ఈ ‘పరమపద సోపానం’ చిత్రం గురించి నాకు చెప్పారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవుతానని ప్రసన్న నా దగ్గరకు వచ్చాడు. ఓ మూవీకి కూడా పని చేశాడు. దర్శకుడిగా కంటే ప్రొడక్షన్ సైడ్ వెళ్తే, ప్రొడక్షన్ మేనేజర్‌గా వెళ్తే బాగుంటుందని సలహా ఇచ్చాను. ఇప్పుడు మంచి స్థాయిలోకి వచ్చాడు. ఈ చిత్రంతో కొత్త వారు తెరకు పరిచయం కాబోతోన్నారు. నాగ శివ గారికి మంచి విజయం దక్కాలి. అర్జున్, జెన్నీఫర్‌లకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*ప్రముఖ దర్శకులు సముద్ర మాట్లాడుతూ* .. ‘అచ్చ తెలుగులో ‘పరమపద సోపానం’ అని టైటిల్ పెట్టారు. ప్రసన్నతో నాకెన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. నాగ శివ తీసిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అర్జున్ లుక్స్, యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. అర్జున్ పెద్ద హీరో అవుతాడు. జెన్నిఫర్‌కి తెలుగులో మంచి భవిష్యత్తు ఉండాలి. దేవ్ గారు మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జనాలు ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*ప్రముఖ దర్శకులు వీర శంకర్ మాట్లాడుతూ* .. ‘పూరి గారి వద్ద పని చేయడం వల్ల శివకి సహనం ఎక్కువగా వచ్చినట్టుంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సినిమాని ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. ఫైనాన్షియల్ పరంగా నిర్మాతలు ఎప్పుడూ తెలివిగా ప్రవర్తించాలి. శివ తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి. అర్జున్ ప్రతీ ఫ్లాట్ ఫాం మీద తన సత్తాను చాటుకుంటూ వస్తున్నారు. ఆయన మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈశ్వర్ మంచి విజువల్స్ ఇస్తారు. దేవ్ గారు మంచి సంగీతం అందిస్తారు. ఏప్రిల్ 24న రాబోతోన్న ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ* .. ‘లెజెండరీ డైరెక్టర్స్ భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర గారు మా ‘పరమపద సోపానం’ ఈవెంట్‌కి రావడం ఆనందంగా ఉంది. ఈ దర్శకులు తీసిన సినిమాల టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న రోజుల నుంచి ఈ రోజు నా సినిమాకు వాళ్లు గెస్టులుగా రావడం ఆనందంగా ఉంది. ప్రసన్న, శివ, వీర శంకర్ గారి వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. దేవ్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈశ్వర్‌తో నేను ఇది వరకు మూడు సినిమాలు చేశాను. రాంబాబు గారు మాకు మంచి పాటల్ని ఇచ్చారు. ‘పరమపద సోపానం’తో మేం మంచి ప్రయత్నం చేశాం. థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఏప్రిల్ 24న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

*జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ* .. ‘‘పరమపద సోపానం’ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాగ శివ గారు నా పాత్రను అద్భుతంగా రాశారు. ఇలాంటి ఓ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. అర్జున్ అంబటితో కలిసి మళ్లీ మళ్లీ పని చేయాలని ఉంది. మా మూవీని అందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*దర్శకుడు నాగ శివ మాట్లాడుతూ* .. ‘మా కోసం వచ్చిన భీమనేని శ్రీనివాసరావు గారు, వీర శంకర్ గారు, సముద్ర గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అర్జున్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. మా ఈ చిత్రం ఏప్రిల్ 24న రాబోతోంది. అందరూ చూసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

*రాంబాబు గోసాల మాట్లాడుతూ* ..‘‘పరమపద సోపానం’లో అన్ని పాటలు రాయడం ఆనందంగా ఉంది. దేవ్ గారు ఈ చిత్రానికి మంచి పాటల్ని, అద్భుతమైన ఆర్ఆర్‌ను ఇచ్చారు. శివ గారు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. అర్జున్ గారితో నేను ఇది వరకు పని చేశాను. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*నిర్మాత గణపర్తి నారాయణరావు మాట్లాడుతూ* .. ‘శివ మా అబ్బాయి. హైదరాబాద్‌కి వచ్చి సెటిల్ అయ్యాడు. సినిమానే జీవితంగా మార్చుకున్నాడు. మా సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*నిర్మాత తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు మాట్లాడుతూ* .. ‘మా కోసం ఇక్కడకు వచ్చిన భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర గారికి థాంక్స్. నేను ఈ రోజు ఎక్కువ మాట్లాడను. ఏప్రిల్ 24న మా చిత్రం రాబోతోంది. ఆ రోజు మాట్లాడతాను’ అని అన్నారు.

*మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ మాట్లాడుతూ* .. ‘నాకు శివతో పదిహేనేళ్ల బంధం ఉంది. ఎప్పుడూ కథలు, స్క్రిప్ట్‌ల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఈ మూవీ కోసం శివ ఎంతో కష్టపడ్డారు. అర్జున్ అంబటి, జెన్నిఫర్ అద్భుతంగా నటించారు. ఇదొక ఎమోషనల్ మూవీ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*డీఓపీ ఈశ్వర్ మాట్లాడుతూ* .. ‘‘పరమపద సోపానం’ అద్భుతమైన థ్రిల్లర్. అర్జున్‌లో అందరూ ఓ కొత్త యాంగిల్ చూస్తారు. జెన్నీఫర్ చక్కగా నటించింది. మా మ్యూజిక్, విజువల్స్ కొత్తగా ఉంటాయి. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్లంతా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఏప్రిల్ 24న మా చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.