Home Blog Page 1009

“MERAA DOSTH” Teaser launch

పవన్, శైలజ జంటగా వి.ఆర్ ఇంటర్నేషనల్ పతాకం పై  పి .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం `మేరా దోస్త్`. ఈ చిత్రం టీజర్ ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో  ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భం గా రాజ్  కందుకూరి  మాట్లాడుతూ…“టీజర్ చాలా  బావుంది. నిర్మాత ఎంతో అభిరుచి తో సినిమాను నిర్మిస్తున్నారు. ఆయన మంచి డాక్టర్, సోషల్ రెస్పాన్స్ బిలిటీ తో ఉండే వ్యక్త్తి. మంచి కంటెంట్ తో సినిమా  తీసి ఉంటారని అనుకుంటున్నా . డైరెక్టర్ కి, యూనిట్  అందరి కీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా“అన్నారు.

నిర్మాత పి.వీర రెడ్డి  మాట్లాడుతూ …“డైరెక్టర్ చెప్పిన స్టోరీ నచ్చి సినిమా తీసాను. సినిమా చా లా  బాగా వచ్చింది. డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

డైరెక్టర్ జి. మురళి మాట్లాడుతూ…“నిర్మాత  ఎంతో   క్లారిటీ తో సినిమా తీశారు.  ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ సినిమా అనుకున్న విధంగా తీయడానికి సహకరించారు. ప్రేమ , ఫ్రెండ్ షిప్ మధ్య నడుస్తుం దీ  సినిమా. ఒక  ఫ్రెండ్ ప్రేమ కోసం మరో ఫ్రెండ్ ఎలాంటి రిస్క్ చేసాడు. ఆ ప్రేమికుల  జంటను ఎలా కలిపాడు అన్నది ఇంట్రస్టింగ్ పాయింట్. డిసెంబర్ 6న సినిమా వస్తుంది “అన్నారు.

నటుడు అమిత్ మాట్లాడుతూ..“నేను ఇందులో మెయిన్ విలన్ గా నటిస్తున్నా“  అన్నారు.

హీరోయిన్ శైలజ మాట్లాడుతూ…“డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ చాలా  బాగా డిజైన్ చేసారు. పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర . డిసెంబర్ 6 న సినిమా  వస్తుంది. అందరూ  చూసి బ్లెస్ చేయండి “ అన్నారు.

పాశం యాదగిరి మాట్లాడు తూ …“ టీజర్ బావుంది. సినిమా కూడా బావుంటుందని నమ్ముతున్నా. నిర్మాత తొలిసారి చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించాలి “ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమం లో పాశం యాదగిరి, ధర్మాసనం, సుధీర్ పాల్గొన్నారు.

కాశీవిశ్వనాధ్ , బెనర్జీ, అమిత్, వీరారెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ : చిన్న; ఎడిటర్ : నందమూరి హరి; కెమెరా: సుధీర్; నిర్మాత: పి. వీరారెడ్డి; డైరెక్టర్: జి.మురళి.

“Wife” i Trailer creating sensation

ఇటీవ‌ల సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఏడుచేప‌ల క‌థ లో టెంప్ట్ రవి గా దూసుకుపోయిన అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా జంట‌గా, ఏడు చేప‌ల క‌థ చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన జి.చ‌రితా రెడ్డి నిర్మాతగా ల‌క్ష్మి చ‌రిత ఆర్ట్స్  మ‌రియు జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో రేష్మి హీరోయిన్ గా అంతం అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుడిగా నిర్మిస్తున్న చిత్రం వైఫ్. ఈ చిత్రానికి నైఫ్ బెట‌ర్ దెన్ వైఫ్ అనే క్యాప్ష‌న్ ని పెట్టారు.. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాన్సెప్ట్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. డైరెక్టర్ వీరభద్రం చౌదరి, నిర్మాత సురేష్ కొండేటి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

మా ఈసీ మెంబర్ సురేష్ కొండేటి మాట్లాడుతూ…. ఈ సినిమాను లేడీ ప్రొడ్యూసర్ నిర్మించారు కాబట్టి మంచి మెసేజ్ ఉంటుందని అనుకుంటున్న. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అని అన్నారు.

దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ… వీరు తీసిన ఏడు చేపల కథ కు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా హీరో అభిషేక్ కి మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. హీరో అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. ఈ సినిమాతో నిర్మాత సుచరిత సక్సెస్ కావాలని కోరుకుంటున్న. అని అన్నారు.

హీరో అభిషేక్ మాట్లాడుతూ…. ఏడు చేపల కథకు 4 కోట్ల గ్రాస్ వచ్చింది. నటుడిగా నాకు మంచి పేరు తీసుకొచ్చింది.
అన్ని వర్గాల్ని మెప్పించలేదు. కానీ ఈ సినిమా నిరాశ పర్చదు. మా దర్శకుడి వన్ మ్యాన్ షో. ఏలూరు సీను డైరెక్టర్ ని నాకు పరిచయం చేశాడు. వైఫై సినిమాకు నిర్మాతలు సుచరరిత గారు, లక్ష్మి రెడ్డి గారు బాగా సపోర్ట్ చేశారు. నామీద నమ్మకంతో నిర్మాతలు డబ్బు పెట్టారు. అందరూ నవ్వాలనే కసిగా చేశాం. ప్రతీ సీన్ నవ్వించే ప్రయత్నం చేసాం. ఎవ్వరూ నిరాశ పడరు. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు జి.ఎస్‌.ఎస్‌.పి క‌ళ్యాణ్ మాట్లాడుతూ… 2015 లో అంతం సినిమా చేసాను. చాలా గ్యాప్ తో వైఫై సినిమా తీసాను. వైఫై సినిమా నిర్మాత సుచరిత గారు బాగా సపోర్ట్ చేశారు. ఏడు చేపల కథ నిరాశ పరిచింది. కానీ ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా అధ్యతం నవ్వుకుంటారు. టైం కూడా తెలీకుండా సినిమా ఎంజాయ్ చేస్తారు. తక్కువ టైం లో తీసాం. ఎక్కువ కష్టపడి చేసాం. నా టీమ్ చాలా సపోర్ట్ చేసింది. అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ…. ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది. డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ నాకు ఈ క‌థ చెప్పిన‌ప్ప‌డు వెంట‌నే ఒకే చేశాను., ఎందుకంటే ఇలాంటి క‌థ‌లు ఈ జెన‌రేష‌న్ లో రావాలి.. అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాలి.. అభిషేక్ రెడ్డి, సాక్షి ఈ క‌థ కి చాలా చ‌క్క‌గా సెట్ అయ్యారు. అని అన్నారు.

బ్యాన‌ర్‌.. ల‌క్ష్మి చ‌రిత ఆర్ట్స్ మ‌రియు జిఎస్ఎస్‌పికె స్టూడియోస్
నిర్మాత‌. ..జి చ‌రితా రెడ్డి
క‌థ‌, స్క్నీన్‌ప్లే, ఎడిటింగ్‌, కెమెరా,ద‌ర్శ‌క‌త్వం  .. జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్‌
పీ ఆర్ ఓ – ఏలూరు శ్రీను
మ్యూజిక్‌.. వినోద్ యాజ‌మాన్య‌
లిరిక్స్‌.. రాంబాబు గోసాల‌

న‌టీన‌టులు.. అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా, కావ్య‌, సునీల్ న‌గ‌రం, సూర్య ఆకోండి, మ‌హేష్ విట్ట‌, అప‌ర్ణ త‌దిత‌రులు

“RAJAVAARU RANIVAARU” Pre Release Event

ఎస్ఎల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డి. మ‌నోవికాస్ నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. ర‌వికిర‌ణ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోకిర‌ణ్ అబ్బావ‌ర‌మ్‌, ర‌హ‌స్య‌గోర‌క్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం జెఆర్‌సీలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇక్క‌డ‌కి గెస్ట్‌లుగా విచ్చేసిన రాజ్‌కందుకూరి, మ‌ధుర శ్రీ‌ధ‌ర్ సాంగ్స్‌ను విడుద‌ల చెయ్య‌గా, హీరో విశ్వ‌క్‌సేన్‌, డైరెక్ట‌ర్ త‌రుణ్‌భాస్క‌ర్ బిగ్‌సీడీని లాంచ్ చేశారు. ఇదే వేదిక పై హీరో విశ్వ‌క్‌సేన్ ప‌ద‌కొండువేలు పెట్టి బిగ్ టికెట్‌ను కొనుగోలుచేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో…

ప్ర‌ముఖ నిర్మాత రాజ్‌కందుకూరి మాట్లాడుతూ… ఈ మ‌ధ్య వ‌చ్చిన చిన్న సినిమాల్లో ఇంత బ‌జ్‌ని క్రియేట్ చేసింది ఈ సినిమానే. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే చాలా హార్డ్‌వ‌ర్క్ హానెస్టీ క‌నిపిస్తుంది. నేను ఈ సినిమా చూశాను. చాలా బావుంది. ర‌వికిర‌ణ్ ఏజ్‌కి చాలా మెచ్చూర్డ్‌గా డీల్ చేశాడు అనిపించింది. హీరో హీరోయిన్లు కూడా చాలా బాగా న‌టించారు. ఓవర్ ఆల్‌గా ఇది ఒక హానెస్టీ విలేజ్ ల‌వ్‌స్టోరీ అనే చెప్పాలి. ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్ ఎలా ఉందంటే చిన్న సినిమాలు కూడా పెద్ద వాటితో స‌హా రాజ్యం ఏలుతున్నాయి. మెయిన్‌గా కంటెంట్ ఈజ్ కింగ్ ఈ సినిమాలో నాకు ఆ పాజిటివిటీ క‌నిపిస్తుంది. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. ఎంటైర్‌టీమ్ కి నా ఆల్ ద బెస్ట్ పాటలు కూడా చాలా బావున్నాయి అని అన్నారు.

మ‌ధుర శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ… వెంక‌ట్ సిద్ధా రెడ్డి ఫోన్ చేసి ఈ సినిమా చాలా బావుంటుంది చూడాలి అని చెప్పినప్పుడు చూశాను. నాకు చాలా బాగా న‌చ్చింది. సింపుల్‌, హానెస్ట్‌గా ఉంటుంది. మ్యూజిక్ చాలా బావుంటుంది. ర‌వికిర‌ణ్ చాలా బాగా తీశారు. మ‌నో వికాస్ బాగా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వెంక‌ట్‌సిద్ధారెడ్డి… సినిమా చాలా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడికి నా కృత‌జ్ఞ‌త‌లు. సినిమా అయిపోయింది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌ల్లే సినిమాని నెక్స్‌ట్‌లెవ‌ల్‌కి తీసుకెళ్ళాడు. ఒక హీరో లాగా కాకుండా చాలా క‌ష్ట‌ప్డాడు. సినిమాని సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్ చేతిలో పెట్టాడు. మ్యూజిక్ చాలా బాగా వ‌చ్చింది. సినిమా మీఅంద‌రికి బాగా న‌చ్చింది.

మ‌నోవికాస్ ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ… చాలా ఆనందంగా ఉంది. రాజావారురాణిగారు చాలా గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. నేను రెండు బిజినెస్‌లో లాస్ అయినా నా త‌ల్లిదండ్రులు న‌న్నుఈ సినిమా తియ్య‌డానికి ప్రోత్స‌హించారు. కిర‌ణ్‌ప్ర‌తిదీ నేర్పిస్తున్నాడు. కిర‌ణ్‌తోనే త‌ర్వాత ఏ సినిమా అయినా చేస్తాను. టీమ్ అంద‌రికీ చాలా ధ్యాంక్స్‌.

హీరోయిన్ ర‌హ‌స్యగోర‌క్‌ మాట్లాడుతూ… ఒక మూవీ ఇంత వ‌ర‌కు రావ‌డానికి దాని వెన‌కాల చాలా మంది ఉంటారు. మా డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌, ప్రొడ‌క్ష‌న్ డిపార్ట్‌మెంట్ చాలా క‌ష్ట‌ప‌డేవారు. ముఖ్యంగా వాళ్ళంద‌రికీ చాలా థ్యాంక్స్ మా ప్రొడ్యూస‌ర్ చాలా బాగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశారు. సినిమాలో టెక్నీషియ‌న్లకి చాలా థ్యాంక్స్‌. మీ అంద‌రికీ సినిమా బాగా న‌చ్చుతుంది. నాకు ఇంత మంచి ప్రామినెంట్ క్యారెక్ట‌ర్ ఇచ్చినందుకు మా డైరెక్ట‌ర్ కి చాలా థ్యాంక్స్. నేను చూసిన యాక్ట‌ర్స్‌లో కిర‌ణ్ చాలా డెడికేటెడ్ ప‌ర్స‌న్‌. ప్ర‌తిదీ డిటెయిల్డ్‌గా తెలుసుకుని సినిమాల్లోకి ఎంట‌ర్ అయ్యాడు. సినిమా తియ్యడం ఒక ఎత్తు రిలీజ్ చెయ్య‌డం ఒక ఎత్తు. సురేష్‌బాబు సార్ చాలా థ్యాంక్యూ మా సినిమాని విడుద‌ల చేస్తున్నందుకు. ఇది ఫ్యామిలీ మొత్తం క‌లిసి చూడ‌ద‌గ్గ సినిమా. ఇది ఒక ప్యూర్ ల‌వ్ స్టోరీ. మీ అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది అని అన్నారు.

డైరెక్ట‌ర్ ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ… స్క్రిప్ట్‌ని న‌మ్మి మ‌నోవికాస్ డ‌బ్బులు పెట్టాడు. ఆర్టిస్ట్‌లంద‌రూ కెరియ‌ర్‌ని ప‌న్నంగా పెట్టి న‌టించారు. టెక్నీషియ‌న్స్ కూడా చాలా టాలెంటెడ్‌. టీజ‌ర్ విడుద‌ల‌య్యాక ఇండ‌స్ట్రీలో ప్రతి ఒక్క‌రూ ఫోన్ చేసి సినిమా ఇంత బాగా తీశారేంటి అన్నారు. సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్‌, మీడియా 9 మాకు చాలా స‌పోర్ట్ చేశారు. ఈ సినిమాని న‌డిపించింది వీళ్ళంద‌రూ నేను చేసింది ఏమీ లేద‌నిపించింది. న‌న్నుస‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఒక జ‌న్యూన్ స‌బ్జెక్ట్ అంద‌రూ క‌లిసి చూడ‌ద‌గ్గ చిత్రం ఇది. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చస్తున్నారు. విలేజ్‌లో చిన్న‌ప‌ల్లెటూరులో జ‌రిగే ల‌వ్‌స్టోరీ. అన్ని ర‌కాలుగా ఈ సినిమా క‌చ్చితంగా న‌చ్చుతుంది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

బిగ్‌బాస్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ…నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక స్టేజ్ మీద నాకు ఇంత క్రేజ్ వ‌స్తుంద‌ని. ట్రైలర్ చాలా బావుంది. మొట్ట మొద‌టిసారి నేను ఆడియో లాంచ్ లో మాట్లాడ‌టం. సాంగ్స్ కూడా చాలా బావున్నాయి. టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్యూ సో మ‌చ్ అన్నారు.

విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ… ఏ బిజినెస్‌లోనైనా స‌రే వెన‌క్కి లాగ‌డం ఉంటుంది కాని. సినిమా విష‌యానికి వ‌స్తే కంటెంట్ బావుంటే ఎవ్వ‌రూ లాగినా ఆగ‌దు. థియేట‌ర్‌కి ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడండి. సినిమా ర‌వి చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా తీశాడు. హీరో కూడా చాలా బాగా చేశాడు. నాకుఈ సినిమా బాగా న‌చ్చింది. నేను వీళ్ళు పిల‌వ‌క‌పోయినా వ‌చ్చేవాడ్ని టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

హీరో కిర‌ణ్‌ అబ్బ‌వ‌ర‌పు మాట్లాడుతూ… ముందుగా ఇక్క‌డ‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ చాలా థ్యాంక్స్‌. టీమ్ గురించి చెప్పాలంటే డైరెక్ష‌న్ టీమ్‌, ప్రొడ‌క్ష‌న్‌టీమ్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమాని బాగా న‌మ్మాము. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమా చాలా బావుంది. న‌వంబ‌ర్ 29 మీ అంద‌రికీ మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటుంది. మీ చిన్న‌ప్ప‌టి విష‌యాల‌న్నీ గుర్తుకువ‌స్తాయి. టెక్నీషియ‌న్స్ చాలా బాగా వ‌ర్క్ చేశారు. థ్యాక్యూ సోమ‌చ్ విక్కీ మ‌నోజ్ అన్నా. సురేష్ కి కూడా సినిమా చాలా బాగా న‌చ్చింది. నేను చాలా హ్యాపీ ఫీల‌య్యాను. సినిమా మీ అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. మేము కొత్త వాళ్ళం కాబ‌ట్టి కొంచం డ‌వుట్ త‌ప్పించి సినిమా మాత్రం చాలా బావుంటుంది. వ‌ర్ల‌డ్ వైడ్ గా ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. అంద‌రికీ థ్యాంక్యూ సోచ్ అని అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్‌, జ‌ర్న‌లిస్ట్ టిఎన్ ఆర్, యాద‌గిరి, మీడియా9 మ‌నోజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Do you know how many crores Hero Vijay Devarakonda bought a House ?

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఒక ఇల్లును ఫిలింనగర్ ప్రాంతంలో కొనుక్కున్న విషయం తెలిసింద,అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ పొందిన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఈ యంగ్ హీరోకి మన దగ్గరే కాదు వేరే రాష్ట్రాలలోను మంచి క్రేజ్ ఉంది. అయితే మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలని ఎంపిక చేసుకుంటూ వరుస హిట్స్ సాధిస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. మొన్నటి వరకు శ్రీనగర్ కాలనీలో నివసిస్తున్న విజయ్ ఫ్యామిలీ రీసెంట్‌గా ఫిలిం నగర్‌లోని శ్రీకాంత్ ఇంటికి సమీపంలో ఉన్న కొత్త ఇంటికి షిప్ట్ అయ్యారు. దాదాపు 20 కోట్లు పెట్టి ఈ ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి విజయ్ గృహప్రవేశం చేశారు.. అయితే ఈ ఇల్లు కొనుక్కునే విషయంలో విజయ్ దేవరకొండ అనుసరించిన విధానం అతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది అంటూ కొందరు అతడి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్థుతం వాస్తు నమ్మకాలు ప్రజలలో విపరీతంగా పెరిగిన నేపధ్యంలో వాస్తు సలహాలు తీసుకోవడం దాన్ని ఆచరించడం ఒక అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతం విజయ్ కొన్న ఇల్లు వెనుక స్థలం బాగా లోతుగా వుంటుందని అది విజయ్ ఇంటికి నైరుతి దిశలో ఉందని వాస్తు రీత్యా అది అంతమంచిది కాదు అన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు ఇప్పటికే విజయ్ కొనుక్కున్న ఇల్లు రెండు సార్లు చేతులు మారింది అన్న ప్రచారం కూడ జరుగుతోంది.వాస్తవానికి ఈ విషయాలు విజయ్ సన్నిహితులు అతడి దృష్టికి ఈ ఇల్లు కొనేముందు తీసుకు వచ్చినా విజయ్ పట్టించుకాలేదని టాక్. అంతేకాదు తనకు వాస్తు జాతకాల పై పెద్దగా నమ్మకం లేదు అంటూ తన సన్నిహితులు వద్ద కామెంట్ చేసినట్లు కూడ వార్తలు వినిపిస్తున్నాయి.
దీనితో విజయ్ దేవరకొండ నటించే పాత్రల విషయంలోనే కాదు అతడి లైఫ్ స్టైల్ లో కూడ చాల విభిన్నంగా ఉంటాడు అంటూ కామెంట్స్ ఉన్నాయి. ఈ కొత్త ఇంటిలోకి విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ వారిని ఎవర్ని పిలవకుండా అతి నిరాడంబరంగా తన కొత్త ఇంటి గృహప్రవేశం కార్యక్రమాన్ని ముగించాడు. ప్రస్తుతం విజయాలకు బ్రేక్ పడ్డ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విజయ్ తన కొత్త ఇంటిలోకి మారిన తరువాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. దీనితో విజయ్ దేవరకొండకు మూఢనమ్మకాలు సెంటిమెంట్స్ లేని ఈ కొత్త ఇల్లు ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి అన్న మాటలు వినిపిస్తున్నాయి..విజయ్ సినిమాలతోనే కాదు బిజినెస్ రంగంలోను రాణిస్తున్నారు. రౌడీ బ్రౌండ్ పేరుతో బట్టల వ్యాపారం చేయగా, వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక పలు బ్రాండ్లకి అంబాసిడర్‌గా ఉంటూ అడపాదడపా ప్రకటనలలో నటిస్తున్న విజయ్ లాభాలు బాగానే రాబడుతున్నాడని చెబుతన్నారు. రీసెంట్‌గా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిన విజయ్ ‘మీకు మాత్రమే చెప్తాను’ నిర్మించారు. ఈ చిత్రం కూడా బాగానే లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే రొమాంటిక్ డ్రామా చిత్రం చేస్తున్నాడు. తన తొమ్మిదవ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మిస్తున్నారు.ఈ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు

Hero Sampurnesh Babu injured in road accident

తెలంగాణలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి. ప్రైవేట్ డ్రైవర్ల నిర్లక్ష్యం.. వాళ్ల అనుభవరాహిత్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. హైదరాబాద్ బస్సు ప్రమాదం మరిచిపోకముందే హీరో సంపూర్ణేష్ బాబుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన కారుకు పెద్ద ప్రమాదమే తప్పింది. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో సంపూర్ణేష్‌తో పాటు కారులో ఆయన భార్య, కూతురు కూడా ఉన్నారు
వెనక సీట్లో ఉన్న సంపూ చిన్న కూతురు ఎగిరి ముందు సీట్‌కు వచ్చింది.
ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు సంపూర్ణేష్ బాబు. ఈ ఘటనపై స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంపూ.. ప్రమాద ఘటన గురించి చెప్పాడు. ఇదేంటని డ్రైవర్‌ను అడిగితే చూసుకులేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని..

అలా అయితే ఎలా అంటూ ప్రశ్నించాడు సంపూ. కాస్త చూసుకుని నడపాలి కదా బ్రదర్ అంటూ డ్రైవర్‌కు చెప్పాడు సంపూ. అంతేకాదు.. రోడ్లపైకి వస్తున్నపుడు అనుభవరాహిత్యం ఉన్న డ్రైవర్స్ కాస్త చూసుకుని నడపాలంటూ విజ్ఞప్తి చేసాడు.

Dhee’ Team Launches The Trailer of ‘Software Sudheer’

జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా లేటెస్ట్ గా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ మాస్టర్ విడుదల చేసి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నటి పూర్ణ, శేఖర్ మాస్టర్, సుడిగాలి సుధీర్, ప్రదీప్, రష్మీ, వర్షిణి, హైపర్ ఆది, దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల, నిర్మాత శేఖర్‌ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ..

నటి పూర్ణ మాట్లాడుతూ – “ట్రైలర్ చాలా బాగుంది. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ ‘అన్నారు.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ – “కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ పలికించగల సుధీర్ హీరోగా చేస్తున్న మొదటి సినిమా. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. సుధీర్ మంచి డాన్సర్ కూడా..ట్రైలర్ లో కూడా డాన్స్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.

ప్రదీప్ మాట్లాడుతూ – “సుధీర్ ఈ సినిమాతో పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా. ట్రైలర్ కొత్తగా ఉంది. సుధీర్ కామెడీ టైమింగ్ గురించి మీ అందరికీ తెలిసిందే..ఈ సినిమాలో కామెడీ తో పాటు యాక్షన్, సెంటిమెంట్ కూడా బాగా చేశాడని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. `సాఫ్ట్ వేర్ సుధీర్` సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా ‘అన్నారు

రష్మీ మాట్లాడుతూ – ” టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా ట్రైలర్ మాత్రం చాలా హాట్ గా ఉంది. సుధీర్ డాన్సులు, ఫైట్స్ ఇరగదీసాడు. డైలాగ్స్ ట్రెండీ గా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా ద్వారా సుధీర్ పెద్ద స్టార్‌
అవ్వాలని కోరుకుంటున్నా. రాజశేఖర్ గారి టేకింగ్ చాలా బాగుంది. అలాగే ప్రొడ్యూసర్ గారికి ఇది ఫస్ట్ మూవీ. తప్పకుండా పెద్ద సక్సెస్ అవ్వాలని  కోరుకుంటున్నా” అన్నారు.

హైపర్ ఆది మాట్లాడుతూ – ” జబర్దస్త్ షో లో కమెడియన్స్ చాలా మంది ఉన్నాం కానీ  హీరో మెటీరియల్ మాత్రం సుధీర్ ఒక్కడే. సుధీర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడి డాన్సులు, ఫైట్స్ చేశాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా” అన్నారు.

యాంకర్ వర్షిణి మాట్లాడుతూ – ” సాఫ్ట్ వేర్ సుధీర్ ట్రైలర్ చూశాను  చాలా  బాగుంది. ముఖ్యంగా సుధీర్ పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ చాలా చాలా  బాగున్నాయి. మ్యూజిక్ కూడా బాగుంది. ఈ సినిమాతో సుధీర్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు” అన్నారు.

హీరో సుధీర్ మాట్లాడుతూ – ” మా సినిమాలోని మొదటి పాటను జబర్దస్త్ టీమ్ విడుదల చేసింది. ఇప్పుడు మా మూవీ ట్రైలర్ ను ‘ఢీ’ టీమ్ తో లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. నన్ను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన మా అమ్మ నాన్న లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా”అన్నారు.

దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల మాట్లాడుతూ – ” మా ట్రైలర్ లాంచ్ చేసిన చిన్ని ప్రకాష్ మాస్టర్ కి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా సక్సెస్ సాధిస్తాం” అన్నారు.

చిత్ర నిర్మాత కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ – ”మా బేనర్ లో ఫస్ట్‌ మూవీ. కథ  నచ్చి ఈ సినిమా ప్రొడ్యూస్‌ చేశాను. సుధీర్‌గారిని  మా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్ లో హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటించారు. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, డా. ఎన్‌. శివప్రసాద్‌, పృథ్వీ, సంజయ్‌ స్వరూప్‌, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్‌, ఆర్ట్‌: నారాయణరావు, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, నందు, స్టంట్‌ జాషువ, అంజి, డాన్స్‌: అనీష్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: గద్దర్‌, సురేష్‌ ఉపాధ్యాయ, నిర్మాత: కె.శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.

“ARJUN SURAVARAM’’ pre release event

యువ క‌థానాయ‌కుడు నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. న‌వంబ‌ర్ 26న ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పీపుల్స్ ప్లాజాలో నిర్వ‌హింంచారు. ఈ వేడుక‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. బిగ్ టికెట్‌ను చిరంజీవి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – “ఈ ఫంక్షన్‌కి నేను రావడం చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను బిజీగా ఉంటాను కాబట్టి నన్ను ఫంక్షన్‌కి రమ్మని ‘ఠాగూర్‌’ మధు ఇబ్బంది పెట్టరు. మరి ఎవరి ప్రభావంతో..  ఎవరి ప్రమేయంతో వచ్చానన్నది చాలా మందికి అనుమానం ఉండొచ్చు. ఇప్పటి వరకూ ఏ ఫంక్షన్‌కైనా నన్ను పిలిస్తే వెళ్లాను. కానీ, ‘అర్జున్‌ సురవరం’ సినిమాకి ఫంక్షన్‌ పెట్టుకోండి, ముఖ్య అతిథిగా వస్తానని చెప్పి మరీ పెట్టించుకున్నా(న‌వ్వుతూ). నిజం చెప్పాలంటే ఈ సినిమా ప్రీమియర్‌ షో చూసిన తర్వాత నేనే రావాలనుకున్నా. ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని వచ్చా. నిర్మాత రాజ్‌కుమార్‌ మరొక ప్రధానమైన కారణం. ఎక్కడైనా పైరసీ జరుగుతుంటే సైబర్‌ పోలీసుల్లా వెళ్లి తనకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని పూర్తీగా ధ్వంసం చేసి, ఇండస్ట్రీకి గొప్ప సహాయం చేస్తున్నాడు. తను సినిమా తీస్తున్నాడనే విషయం, తన వెనక ‘ఠాగూర్‌’ మధు ఉన్నాడనే విషయం నాకు తెలియదు. ఓ రోజు వచ్చి సినిమా తీశాననగానే ఆశ్చర్యంగా అనిపించింది.. ప్రివ్యూ చూశాక ఫంక్షన్‌కి పిలుస్తారేమో అనుకుంటే పిలవలేదు. నన్ను పిలవడానికి కూడా తనకి మొహమాటం. ఈ సినిమా గురించి ప్రజలకు చెప్పాలంటే నా వంతు స‌పోర్ట్ చేస్తాన‌ని చెప్పాను. అలాగే హీరో నిఖిల్‌ సినిమాలు గతంలో ఒకటి, రెండు చూశా. కానీ, కలిసే సందర్భం రాలేదు. ఈ సినిమా ప్రీమియ‌ర్ షోలో నన్ను చూడగానే తను ఎగ్జైట్ అయిన విధానం చూస్తే నాకు మరో తమ్ముడు, శిష్యుడు దొరికాడని సంతోషం కలిగింది. ప్రేమించే మనుషులు దొరకడం బ్యాంక్‌ బ్యాలెన్స్‌గా భావిస్తా. నిఖిల్‌ వల్ల నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మరింత పెరిగిందనుకుంటున్నాను. ఇక ద‌ర్శ‌కుడు సంతోష్‌ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు సినిమా చేశాడు. కథ బాగుంటే భాషతో సంబంధం లేదు.. ఎవరైనా ఆదరిస్తారు. లవర్‌బాయ్‌గా ఉండే నిఖిల్‌ ఈ సినిమాతో యాక్షన్‌ హీరోగా మారాడనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఇది. ఎందుకంటే కంటెంట్‌తో కనెక్ట్‌ అవుతారు. స్మార్ట్‌ ఫోన్స్‌ వాడుతున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పే చిత్రమిది. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత చూడాలి. ఇలాంటి మంచి సినిమాల ఫంక్షన్స్‌కి నేనున్నాను అంటూ ముందుకొచ్చే నా సోదరుడు తలసానిగారికి అభినందనలు. ఈ సినిమాలోని ‘చేగువేరా..’ పాట చూస్తున్నప్పుడు నా తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ గుర్తొచ్చాడు’’ అన్నారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ – ‘‘ఇదొక మంచి కథ. తప్పకుండా ప్రేక్షకులు మంచి చిత్రాన్ని ఆదరించి హిట్‌ చేయాలి. ‘బాహుబలి, సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ సత్తా చాటాయి. చిరంజీవిగారు టీవీ సీరియల్స్, సినిమా ఫంక్షన్స్‌తో పాటు ఇలాంటి చిన్న సినిమాల వేడుకలకు రావడం చాలా సంతోషం. ఆయన రావడం వల్ల చిన్న సినిమాల స్టామినా పెరిగి జనాల్లో క్రేజ్‌ వస్తుంది.. అందుకే ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు’’ అన్నారు.

చిత్ర నిర్మాత రాజ్‌కుమార్‌ అకెళ్ల మాట్లాడుతూ– ‘‘మెగా స్టార్ గారిని కలవడమే ఒక కల. అలాంటిది నేను ఓ సినిమా నిర్మించడం, ఆ ఫంక్షన్‌కి చిరంజీవిగారు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకడిని. ఆయన ‘ఛాలెంజ్‌’ సినిమా స్ఫూర్తి నన్ను ఈ రోజు వరకూ ముందుకు నడిపిస్తోంది. చాలా సమస్యలను అధిగమించి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము. తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను’’ అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ” నా దేవుడు చిరంజీవి గారి ముందు ఇక్కడ మాట్లాడడం హ్యాపీ గా ఉంది. నేను వచ్చింది ఆయనదగ్గరనుండే. రాజ్ కుమార్ గారు నాకు చాలా కాలంగా తెలుసు రాజ్ కుమార్ గారు, ఠాగూర్ మధు గారు కలిసి ఈ సినిమా నిర్మించడం చాలా సంతోషం. యూత్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ .తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది” అన్నారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ – ” అభిమానుల మధ్య కూర్చొని నేను కూడ సందడి చేయాలనుకున్నాను. ఇది నిజమో, కలా అర్థం కావడంలేదు. మాటలు రావడం లేదు. నాలుగు రోజుల నుంచి ఏం జరుగుతుందో తెలియడం లేదు. లెజెండ్ ఆఫ్ఇండియన్ సినిమా మెగస్టార్ చిరంజీవి గారు మా సినిమా ప్రీ-రిలీజ్ కు వస్తారంటే నమ్మలేకపోయాను. కానీ ఆయన వచ్చారు. సాక్షాత్తు సైరా నరసింహారెడ్డి, మా గ్యాంగ్ లీడర్, మా ముఠామేస్త్రీ మా మెగాస్టార్ట్ చిరంజీవి గారు వేదిక పై ఉన్నారు. ఒక సినిమా విడుదల చేయడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇన్ని అడ్డంకులు వచ్చిన కానీ, మంచిసినిమా, ముందుకు వెళ్లాలి అని చిన్న ఆశతో ఉన్న మాకు దేవుడు రూపంలో మా మెగాస్టార్ చిరంజీవి…మా హీరో దేవుడిలా వచ్చిమీ సినిమా పబ్లిక్ లోకి వెళ్లాలి. ప్రేక్షకులు చూడాలి అని వచ్చారు. మా సినిమా షో మూడు గంటలకు అంటే ఐడునిమిషాలు ముందే వచ్చారు ఆయన, అది చూస్తుంటే మాలాంటి యువ హీరోలకు భయం వేస్తుంది. అదీ చూస్తుంటే ఎంత కష్టపడితే, అసలు మేం చేయగలుగుతామా? అనే డౌట్ కూడా ఉంది. చిరంజీవిగారికి థ్యాంక్స్, చిరంజీవి గారు మా సినిమా చూసి హగ్ ఇచ్చారు. ఆ రోజును ఎప్పటికి మర్చిపోలేను. మొన్నటి వరకు నేను చిరంజీవి గారి అభిమానిని. నేటి నుంచి ఆయన భక్తుడ్ని. ఈ చిత్రం ఎప్పటికీ నాకు గుర్తిండిపోతుంది. చాలా నిజాయితీగా తీశాం. మంచి సినిమా థియేటర్స్ లో చూడండి. అలాగే ఇక్కడికి వచ్చిన తలసానిగారికి ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.

చిత్ర దర్శకుడు టి.సంతోష్‌ మాట్లాడుతూ – ‘‘ తెలుగులో నా తొలి చిత్రమిది. మమ్మల్ని సపోర్ట్‌ చేసేందుకు ఇక్కడికి వచ్చిన చిరంజీవిగారికి, ఆయన అభిమానులకు థ్యాంక్స్‌. చాలా మంది నన్ను అడిగారు అర్జున్ సురవరం అంటే ఏంటి? అని అర్జున్ అంటే క్లీన్. ఈ సినిమాలో అర్జున్ క్యారెక్టర్ క్లీన్, ప్యూర్ రిపోర్టర్. సురవరం అనేది సీనియర్ జర్నలిస్ట్ సురవరం ప్రతాప రెడ్డి గారి ఇన్స్పిరేషన్ తో తీసుకోవడం జరిగింది. అలాగే మా నిర్మాతలు మధు, రాజ్ కుమార్ గారికి థాంక్స్” అన్నారు.

ద‌ర్శ‌కుడు చందు మొండేటి మాట్లాడుతూ – “నిఖిల్ గురించి ఎంత మాట్లాడినా నా స్వంత త‌మ్ముడి గురించి మాట్లాడినట్టే ఉంటుంది. కాబ‌ట్టి నిర్మాత రాజ్‌కుమార్‌గారి గురించి మాట్లాడుతాను. సినిమాపై ఆయ‌నకున్న త‌ప‌న‌, ప్యాష‌న్ నాకు 12 ఏళ్లుగా తెలుసు. ఆయ‌న త‌ప‌న గుర్తించాడు కాబ‌ట్టి మెగాస్టార్ చిరంజీవిగారు ఈ ఫంక్ష‌న్‌కి వ‌చ్చారు. ఆయ‌న వ‌చ్చారంటే ఆటోమెటిక్‌గా ప్రేక్ష‌కులు కూడా వ‌స్తారు. దాంతో పాటు స‌క్సెస్ కూడా వ‌స్తుంది“ అన్నారు.

హీరోయిన్ లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది విడుదలవుతున్న నా మొదటి తెలుగు సినిమా ఇది.. రిలీజ్‌ కోసం ఎగ్జైటెడ్ గా ఉన్నా’’ అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో రాజా ర‌వీంద్ర‌, నిర్మాతలు అభిషేక్ అగ‌ర్వాల్‌, వివేక్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

న‌టీన‌టులు:
నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టి.సంతోష్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు
నిర్మాత‌: రాజ్‌కుమార్ అకెళ్ల‌,
సంగీతం: సామ్ సి.ఎస్‌,
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య‌,
ఎడిట‌ర్: న‌వీన్ నూలి.

”90 ML” movie will not Encourage Alcohol…..”90 ML” Directer shekar reddy

ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరో కార్తికేయ. మొద‌టి చిత్రంతోనే యూత్‌లో మంచి పేరు సాధించిన ఈ హీరో ప్ర‌స్తుతం మ‌రో చిత్రంలో న‌టిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వ‌ర్స్ త‌న సొంత బ్యాన‌ర్‌లో మ‌రో చిత్రంలో న‌టిస్తున్నారు ఆ చిత్రం పేరు 90 ఎం.ఎల్‌. యంగ్ హీరో కార్తికేయ, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాత‌గా లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా దర్శకుడు శేఖర్ రెడ్డియెర్రా మీడియాతో ముచ్చ‌టించారు.

’90 ఎం.ఎల్’ గురుంచి చెప్పండి ?

టైటిల్ ’90 ఎం.ఎల్’ అని పెట్టడం వలన ఇది ఓ తాగుబోతుల చిత్రం లేదా ఆల్కహాల్ కి సంబంధించిన చిత్రం అనుకోవచ్చు. కాని ఇది అలా కాదు. మందు ఖచ్చితంగా తాగాల్సిన అవసరం ఉన్న ఒక పేషెంట్ పాత్రను తీసుకొని సినిమా తీయడం జరిగింది. ఇది కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసం తీసిన కల్పిత కథ మాత్రమే.

దర్శకుడిగా మీరు చేస్తున్న మొదటి చిత్రమా ?

అవును…, దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. గతంలో ఐదు సినిమాలకు అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్ గా చేశారు. సుమారు 70 సినిమాలకు రైటర్ గా పనిచేసిన అనుభవం ఉంది. దర్శకత్వ మరియు రైటింగ్ డిపార్ట్‌మెంట్స్ లో పనిచేసిన అనుభవం వుంది.

కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ మూవీ లో చేసే అవకాశం ఎలా వచ్చింది.?

ఆర్ఎక్స్ 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి నాకు మిత్రుడు. ఆ మూవీ చిత్రీకరణ సమయం నుండే నాకు కార్తికేయతో పరిచయం ఉంది. నేను ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాత ఆయనకు వినిపించడంతో ఈ మూవీ ఒకే చేశారు.

టైటిల్ 90ఎంఎల్ అని పెట్టడం వలన ఒక వర్గపు ఆడియెన్స్ సినిమా చూడరేమో కదా?

అంటే ఏ సినిమా అయినా మార్నింగ్ షో పడ్డాక, ఆ మూవీ సబ్జక్ట్ ఏమిటనేది తెలిసిపోతుంది. అలాగే అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా సినిమా తీయలేం. కొన్ని సినిమాలు యూత్ కి నచ్చితే మరికొన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతాయి.

ఈ చిత్రంతో మద్యపానాన్ని ప్రోత్స‌హిస్తున్నారా?

ఈ చిత్రంలో హీరోకి ఆరోగ్య రీత్యా ఆల్కహాల్ తప్పనిసరి అని చెప్పడం జరిగింది. అంతేకాని సినిమాలో మద్యపానాన్ని ప్రోత్సహించేలా సన్నివేశాలు కానీ, కామెడీ సన్నివేశాలు కానీ తీయలేదు. 90ఎం ఎల్ కంప్లీట్ లవ్ స్టోరీ. టైటిల్ అలా పెడితే, మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదు.

హీరో కార్తికేయ పాత్ర ఎలా ఉంటుంది?

కార్తీకేయ నటించిన గత చిత్రాలైన గుణ 369, ఆర్ఎక్స్ 100 లలో యాక్షన్ మరియు ఎమోషనల్ కోణంలోనే అతన్ని ఎక్కువగా చూపించడం జరిగింది.కార్తికేయ కథ వినగానే పెద్దగా మార్పులు చేయమని అడగలేదు,ఆర్ ఎక్స్ 100 సినిమా ప్రభావం ఇందులో చూయించలేదు. అంతకుముందు తను చేసిన యాక్షన్ మరియు ఎమోషనల్ తో పాటు ఈ మూవీ లో కామెడీ కూడా కార్తీకేయ చేయడం జరిగింది. కార్తీక్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

హీరో, నిర్మాత ఏమైనా మార్పులు చేర్పులు చెప్పారా?

అలా ఏమి చెప్పలేదు. నేను మొదట వారికి నెరేట్ చేసిన స్క్రిప్ట్ యధాతథంగా తెరకెక్కించాను.

ఈ సినిమా ఎవ‌రికి ప్ల‌స్ అవుతుంది హీరోకా మీకా?

కార్తికేయ‌కి ఇది ఒక మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా గా మంచి హిట్ అవుతుంది. అలాగే మంచి విజ‌యం సాధిస్తే ఒక కొత్త ద‌ర్శ‌కుడిగా నాకు హిట్ అనే చెప్పాలి.

తమిళ్ లో ఇదే టైటిల్ తో ఒక సినిమా వచ్చింది.. దానికి ఈ సినిమాకు ఏదేమైనా సంబంధం ఉందా?

మేము ముందే 90ML అనే టైటిల్ రిజిస్ట్రేట్ చేసుకున్నాం. ఆ సినిమాకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అదొక అయిదుగురి అమ్మాయిల కథ. ఇది హీరో చుట్టూ తిరిగే కథ. కంప్లీట్ డిఫరెంట్ మూవీ. మీరెప్పుడు చూడని కొత్త తరహా కాన్సెప్ట్ ని ఈ సినిమాలో చూస్తారు.

అజర్ భాయిజాన్ మూవీ సెట్‌లో షూటింగ్‌ గురించి?

అజ‌ర్ భాయిజాన్ సెట్‌లో ఈ చిత్రంలోని 4 పాట‌ల చిత్రీకర‌ణ జ‌రిగాయి. దానికి కార‌ణం మాకు ఆ ప్లేస్ బాగా న‌చ్చింది దాంతో అక్క‌డ షూట్ చెయ్య‌వ‌ల‌సి వ‌చ్చింది.

నెక్స్‌ట్‌ ఎవరితో చేస్తున్నారు?

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్ అనేది ఇంకా ఎవరితో కన్‌ఫ‌ర్మ్‌ కాలేదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా ఈ చిత్రంపైనే. నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టారు. అందుకే ఈ చిత్రం విడుదల తరువాత నెక్స్‌ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తా.

First Single ‘Nenera Ika Meeda Unna Chote Darbaaru…’ From Superstar Rajinikanth’s ‘Darbar’ Is Out !!!

దుమ్ము- ధూళి…నేనేరా ఇక మీద ఉన్న చోటే దర్బారు.. ఉన్నా నీ గ్యాంగు నేనేరా లీడు….అంటూ రజినీకాంత్ ‘దర్బార్’ ఎలా రౌడీల అంతు చూడబోతున్నారు అనే విషయాన్ని తెలిపే విధంగా సాగే ఈ మాస్ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా  గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం తనదైన శైలిలో ఆలపించారు.  రజిని మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ పాట ఆయ‌న స్టైల్ కు తగ్గట్టుగా ఫాస్ట్ బీట్లో ఉండేలా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ స్వరపరిచారు.  ఈ పాటతో అనిరుద్ మరోసారి తన మాస్ అప్పీల్‌ను  చూపించాడు.  ‘దర్బార్’ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్ పక్కా మాస్ సాంగ్ కావడంతో రజిని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు
రజనీకాంత్ దాదాపు ఇరవై ఏళ్ళ తరువాత చేస్తున్న పోలీస్ పాత్ర ఇది.దర్బార్ చిత్రం కోసం ముంబై పోలీస్ స్టేషన్ లో ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచాలంగా ఛార్జ్ తీసుకొన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్.. నయనతార కథానాయకిగా,రజినీకాంత్ కూతురిగా నివేథా దామస్ గా నటించారు..

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రజిని  ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు.  లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే  రిలీజ్ అయిన రజిని పోస్టర్స్ కు ట్రెమండ‌స్  రెస్పాన్స్ వ‌స్తోంది.  ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజ్ చేయనున్నారు