Home Blog Page 1010

Malkapuram Sivakumar, owns ”Hul Chal” Movie Rights.

రుద్రాక్ష్ ఉత్కం, ధన్య బాలకృష్ణ జంటగా శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా హల్ చల్. ఈ చిత్ర కథ కథనాలు నచ్చి రైట్స్ తీసుకున్నారు నిర్మాత మల్కపురం శివకుమార్. MSK డిజిటల్స్‌పై ఈ చిత్ర హక్కులను తీసుకున్నారు మల్కపురం శివకుమార్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇకపై కథ నచ్చితే తమ సంస్థలో సినిమాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు నిర్మాత మల్కపురం శివకుమార్. ఇప్పుడు హల్ చల్ సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుందని చెబుతున్నారు శివకుమార్. ఈ సినిమాలో ప్రీతి నిగమ్, కృష్ణుడు, మధు నందన్, రవి ప్రకాశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కొల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భరత్ మధుసూధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీపతి కర్రి తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

నటీనటులు:
రుద్రాక్ష్ ఉత్కం, ధన్య బాలకృష్ణ, ప్రీతి నిగమ్, కృష్ణుడు, మధు నందన్, రవి ప్రకాశ్..

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శ్రీపతి కర్రి
నిర్మాత: గణేష్ కొల్లూరి
విడుదల: మల్కపురం శివకుమార్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సంగీతం: భరత్ మధుసూధన్

Kalyan ram movie ”entha manchi vadavu raa” shooting compleated

నందమూరి కళ్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా భారీగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ
సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా
వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్
ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘శతమానం భవతి’ చిత్రంతో
జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని పాటలను
డిసెంబరులో విడుదల చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల
చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాటలకు ఎంతో ప్రాధాన్యముండేలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి
గోపీసుందర్ స్వరకల్పన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాట, రామజోగయ్య  శాస్ర్తి రెండు పాటలు,
శ్రీమణి ఒక పాట రాశారు. ఇందులో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయని దర్శకుడు సతీష్ వేగేశ్న
తెలిపారు. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ ను ఖర్చుకు వెనుకాడకుండా చాలా రిచ్ గా తీశామని, గోదావరి నదిలో
సాహోసోపేతంగా చిత్రీకరించిన ఈ సన్నివేశాల విషయంలో ఫైట్ మాస్టర్ వెంకట్ రిస్క్ తీసుకున్నారని
వివరించారు.  నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ సినిమా షూటింగ్ కారక్రమాలు పూర్తయ్యాయని,
జనవరి 15న విడుదల చేయనున్నామని చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయన్నారు.
‘‘కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదుచేస్తుందనడంలో
ఎలాంటి సందేహం లేదు. టీజ‌ర్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆఖరి షెడ్యూల్‌ కేరళలోని మున్నార్‌
తదితర  సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఆడియో రంగంలో మా సంస్థ ఎలా దూసుకుపోయిందో చిత్ర
నిర్మాణ రంగంలోనూ ఆ ఒరవడిని కొనసాగిస్తుంది.డిసెంబరు 1 నుంచి రీరికార్డింగ్ ప్రారంభమవుతుంది ’’
అని వివరించారు. చిత్ర సమర్పకులు  శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ  ‘‘అన్ని వర్గాల
ప్రేక్షకులనూ ఈ చిత్రం రంజింపజేస్తుంది. చాలా సంతృప్తికరంగా అవుట్ పుట్ వచ్చింది. డిసెంబరులో పాటలను
విడుదల చేస్తాం’’ అని వివరించారు.
న‌టీన‌టులు:
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా
లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
రచన, ద‌ర్శ‌క‌త్వం:
స‌తీశ్ వేగేశ్న‌
నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌  (ఇండియా ) ప్రైవేట్‌ లిమిటెడ్‌
నిర్మాతలు ‌:  ఉమేష్‌ గుప్తా, సుభాష్‌
గుప్తా ,
సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,
సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌
సంగీతం:  గోపీ సుంద‌ర్‌
ఎడిటింగ్‌:
త‌మ్మిరాజు
ఆర్ట్‌:  రామాంజ‌నేయులు
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్

”Sarileru neekevvaru” promotions in full swing

టీజర్ రాకముందు ఒక లెక్క వచ్చాక ఒక లెక్క అనిపిస్తున్నాయి ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్. అప్పటి వరకూ ప్రేక్షకుల్లో సినిమా మీదున్న అన్ని డౌట్స్ కి జస్ట్ టీజర్ తో క్లారిటీ ఇచ్చి సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసాడు సూపర్ స్టార్. ముఖ్యంగా అన్ లాక్ ది టీజర్ అంటూ ట్విట్టర్ లో మేకర్స్ చేసిన ఇన్నోవేటీవ్ ప్రమోషన్స్ నెవెర్ బిఫోర్ అనిపించి అందరినీ ఎట్రాక్ట్ చేసాయి.

విడుదలై 80 గంటలు దాటినా ఇంకా యూ ట్యూబ్ ట్రేండింగ్ లో నంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతూ భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది టీజర్. ప్రస్తుతం టీజర్ కి వచ్చిన భారీ రెస్పాన్స్, స్పీడందుకున్న ప్రమోషన్స్ తో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారని తెలుస్తుంది.

ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందని టాక్. టీజర్ లో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ తో సంక్రాంతికి అసలు సిసలైన మాస్ సినిమా అనే ముద్ర వేసేసుకుంది సరిలేరు. ఈ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో నిలిచి సినిమా రికార్డు కలెక్షన్స్ సాధించడం ఖాయమనిపిస్తుంది

Shakalaka shankar new movie  ‘2+1’

షకలక శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘2+1’చిత్రం
కోసం మాస్ పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ రెండు పాటలు రాస్తున్నారు.  కాచిడి గోపాల్ రెడ్డి దర్వకత్వంలో సురేష్ కొండేటి, ఎడవెల్లి వెంకటరెడ్డి సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఒక పాటను చిత్రీకరించారు. ఇందులో పక్కా మాస్ బీట్ తో సాగే రెండు పాటలను భాస్కరభట్ల రవికుమార్ రాస్తున్నారు. సంగీత దర్శకుడు హరిగౌర, దర్శకుడు కాచిడి గోపాల్ రెడ్డి, నిర్మాత సురేష్ కొండేటి, భాస్కర భట్ల కూర్చుని చర్చించి మరో రెండు పాటలకు సంబంధించిన ట్యూన్లను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ప్రస్తుతం మళ్లీ పాటల ట్రెండ్ వచ్చిందన్నారు. ‘ఒకప్పుడు సినిమా బాగుండక పోయినా పాటల కోసమైనా సినిమాలను మళ్లీమళ్లీ చూసేవారు. అలా చాలా సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మధ్యలో కొంతకాలం పాటలను అదనపు భారంగా భావించారో ఏమోగాని పాటలు లేకుండానే సినిమాలు వచ్చాయి. సినిమాలో పాటల సంఖ్య 6 నుంచి నాలుగుకు పడిపోయింది. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని లిరికల్ వీడియోల ట్రెండ్ వచ్చింది. ఆమధ్య వచ్చిన
‘గీతా గోవిందం’ దగ్గర నుంచి ఈ లిరికల్ వీడియోల ట్రెండ్ బాగా  ఎక్కువైంది. ట్రైలర్లకన్నా ఇవే ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. ఇటీవల ‘అల వైకుంఠపురం’లో పాటలు ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే. అందుకే మేము కూడా పాటల మీద ప్రత్యేక శ్రధ్ద పెట్టాము. ఒకప్పుడు ఆడియో విడుదల ట్రెండ్ ఉండేది. ఇప్పుడు అది పోయి సినిమా విడుదలకు నాలుగు నెలల ముందే పాటలు జనంలోకి వెళ్లిపోతున్నాయి. ఇది శుభపరిణామం. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు పాటలే సినిమాని బతికిస్తున్నాయి అని నా అభిప్రాయం’అని వివరించారు. ‘పాటలకు మాస్ మసాలా ఎలా జోడించాలో భాస్కరభట్ల రవికుమార్ కు బాగా తెలుసు. పైగా నాతో ఉన్న స్నేహం కారణంగా నా పాటల విషయంలో తను ప్రత్యేక శ్రద్ధతీసుకుని ఈ పాటలు రాస్తున్నారు’ అని చెప్పారు. ఈ సినిమాలో ఉండేది నాలుగు పాటలే అయినా నలభై ఏళ్ల పాటు గర్తుండేలా ఈ పాటలను
రూపొందిస్తున్నామన్నారు.

మరో నిర్మాత వెంకట రెడ్డి మాట్లాడుతూ  ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక పాట చిత్రీకరణ కూడా పూర్తయిందని అన్నారు. ఇది సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా వస్తుందన్నారు. మిగిలిన టాకీ పార్టు తో పాటుగా పాటల చిత్రీకరణ షూటింగ్ కూడా  డిసెంబరులో పూర్తవుతుందని వివరించారు. ఈ చివరి షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందని చెప్పారు. హీరోగా షకలక శంకర్ కు ఇది బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు.  సంగీత దర్శకుడు హరి గౌర మాట్లాడుతూ తాను ఇంతకుముందు కొన్ని తెలుగు, కన్నడ చిత్రాలకు సంగీతం అందించినట్లు చెప్పారు. సంగీత దర్శకుడిగా తనకిది మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందన్నారు.
దర్శకుడు కాచిడి గోపాల్ రెడ్డి  మాట్లాడుతూ మల్టీ జోనర్ సినిమాగా ఇది తెరకెక్కుతుందని చెప్పారు. ఒక పాటను సురేష్ ఉపాధ్యాయ రాశారని, రెండు మాస్ పాటలను భాస్కరభట్ల రవికుమార్ తో రాయిస్తున్నట్లు చెప్పారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు ఈ సినిమాలో ఉంటాయని వివరించారు.

Naga Chaitanya to that fan, Samantha Fida.

తాము అభిమానించే నటీనటులపై ఫ్యాన్స్ తమకున్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా వ్యక్తం చేస్తుంటారు.. తమ హీరో పుట్టిన రోజు వచ్చిందంటే చాలు.. కేక్‌లు కట్ చేసేవాళ్లు కొందరైతే.. స్వీట్లు, పండ్లు, బట్టలు పంచేవారు మరికొందరు.. ఇక, టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున వారసుడిగా తెరంగేట్రం చేసిన నాగచైతన్య.. తన కంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు.. ఆ తర్వాత సహ నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక, ఈ నెల 23వ తేదీన తన పుట్టినరోజును జరుపుకున్నాడు చైతు.. అయితే.. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఓ అభిమాని చేసిన పనికి చైతు, సమంతా ఫిదా అయిపోయారు.
చైతు పుట్టినరోజు సందర్భంగా సింహాచలం మెట్లు మెకాళ్లపై ఎక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు బొబ్బిలికి చెందిన సాగర్‌..

నాగచైతన్య నిండునూరేళ్లు క్షేమంగా ఉండాలని.. సమంత మేడం కూడా క్షేమంగా ఉండాలని.. వాళ్లకు పుట్టబోయేది బాబే కావాలని.. హ్యాపీ బర్త్‌డే చైతు బంగారం” అంటూ ఆ వీడియోలో విషెస్ చెప్పాడు సాగర్..

ఆ వీడియో కాస్త సోషల్ మీడియాకు ఎక్కవడంతో.. దానిపై స్పందించిన చైతు.. “నవీన్ ఏమి చెప్పాలో తెలియడంలేదు..! ఈ ప్రేమకు ధన్యవాదాలు…

జాగ్రత్త” అని ట్వీట్ చేస్తే.. “ధన్యవాదాలు.. ఇది నమ్మలేకపోతున్నా.. మాటలు రావడంలేదు.. దయచేసి మమ్మల్ని కలవండి” అంటూ సమంత ట్వీట్ చేశారు.

Satyam movie opening

సంతోష్ బాల్‌రాజ్ క‌థానాయ‌కుడిగా శ్రీ‌మాతాశ్రీ క్రియేష‌న్స్ ప‌తాకంపై అశోక్ క‌డ‌బ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స‌త్యం సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ఈ రోజు ఉద‌యం ( న‌వంబ‌ర్ 25 ) పదిన్న‌ర్ర‌కు అన్న‌పూర్ణా స్టూడియోలో జ‌రిగింది.
ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ క‌థానాయ‌కుడు సంతోష్ .. క‌థానాయిక ర‌జ‌నీ రాఘ‌వ‌న్ పాల్గొన్న స‌న్నివేశాన్ని చిత్రీక‌రించారు.. ఈ కార్య‌క్ర‌మంలో ముహూర్త‌పు దృశ్యానికి ప్ర‌ముఖ నిర్మాత దామోద‌ర ప్ర‌సాద్ క్లాప్ నివ్వ‌గా కెమెరా స్విచాన్ దాము బాలాజీ చేశారు.
త‌ద‌నంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో నిర్మాత మహంతేష్ కె మాట్లాడుతూ నేను క‌న్న‌డ‌లో ప‌లు సినిమాలు నిర్మించాను.. ఒక రాజ‌వంశానికి చెందిన క‌థ‌తో ద‌ర్శ‌కుడు నా ద‌గ్గ‌రికి వ‌స్తే ఈ సినిమా తెలుగులో అయితే బాగుంటుంది అనే ఉద్దేశ్వంతో ఈ సినిమాను తెలుగులో తీస్తున్నాము…ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు క‌థ మొత్తం ఆయ‌న చుట్టే తిరుగుతుంది అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత అంజి బాబు ఎదురూరి మాట్లాడుతూ ఒక వైవిధ్య‌మైన క‌థాంశంతో సినిమా రూపొందిస్తున్నాము… క‌థ డిమాండ్ బ‌ట్టి పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకున్నాము అన్నారు. న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ ఇది స్ట్ర‌యిట్ తెలుగు సినిమా ఒక రాజ‌వంశానికి చెందిన క‌థ .. నిర్మాత క‌థ‌ను న‌మ్ముకుని వ‌చ్చాడు సినిమా షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోనూ క‌రీం న‌గ‌ర్ అడ‌వుల్లోనూ జ‌రుగుతుంది అన్నారు..
ద‌ర్శ‌కుడు అశోక్ క‌డ‌బ మాట్లాడుతూ .. ఈ క‌థ ను నిర్మాత న‌మ్మి సినిమా తీస్తున్నందుకు ఆనందంగా ఉంన్నారు .. సినిమాలో న‌టిస్తున్న హీరో హీరోయిన్ లు సినిమాలో న‌టిస్తుండ‌టం ప‌ట్ల త‌మ ఆనందాన్ని తెలియ‌జేశారు.
న‌టీన‌టులుః సంతోష్ బాల్ రాజ్, ర‌జ‌నీ రాఘ‌వ‌న్‌, సుమ‌న్‌, స‌య్యాజీ షిండే, ప‌విత్ర లోకేష్‌, విన‌య‌ప్ర‌సాద్‌, మీనాక్షి క‌ళిత త‌దిత‌రులు న‌టిస్తున్నారు.
ఫోటోగ్ర‌ఫిః సినీటెక్ సూరి,సంగీతంః ర‌విబ‌స్రూన్ (కెజియ‌ఫ్ ఫేం) మాట‌లుః కెవిరాజు, ఆర్ట్ః వెంక‌ట్ ఆరె, ఎగ్జిక్యూటివ్ నిర్మాతః ఎదురూరి అంజిబాబు, నిర్మాతః మ‌హంతేష్ కె. క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః అశోక్ క‌డ‌బ‌.

Sai Tej is the supreme hero who gave a surprise gift to Star Music Director Taman

సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఈ పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తమన్, సాయి తేజ్ ఫ్రెండ్ షిప్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎంతో ఇష్టమైన తన ఫ్రెండ్ తమన్ కు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ తో నిజంగానే సర్ ప్రైజ్ చేసాడు సాయి తేజ్. తమన్ మ్యూజిక్ టేస్ట్ కి తగ్గట్టుగా  పెర్ల్ మాలెట్‌స్టేషన్ అనే మ్యూజిక్ ఇన్స్ర్టూమెంట్ గిఫ్ట్ గా అందించాడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ. వీరిద్దరి కాంబినేషన్లో పలు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. తనకు సాయి ఇచ్చిన గిఫ్ట్ గురించి  తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ ఈ లవ్‌లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్‌ప్రైజ్. ప్రతిరోజూ పండగే అన్న మాటను ఈయన నిజం చేసారు. సాయి చాలా మంచి వ్యక్తి ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నానంటూ ట్విట్టర్ లో ఫొటోతో సహా పోస్ట్ చేసాడు.

G Nageshwarareddy Starts at Srikarthikeya Cinemas and SK Pictures

విశాల్ హీరోగా ఇటీవల ‘యాక్షన్’ చిత్రాన్ని అందించిన శ్రీకార్తికేయ సినిమాస్ ఎస్.కె. పిక్చర్స్ తో కలిసి ఓ చిత్రనిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే ‘తెనాలి రామకృష్ణ’ చిత్రాన్ని రూపొందించిన జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ ప్రముఖ హీరోతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది. ఫిలింనగర్ లోని దైవసన్నిధానంలో  సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ఆడెపు శ్రీనివాస్, సురేష్ కొండేటి, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను వివరించారు.

నిర్మాతల్లో ఒకరైన ఆడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎగ్జిబిటర్ గా ఉన్న తను పంపిణీదారుడిగా మారి ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, రాజుగారి గది 3 తదితర చిత్రాలను అందించానన్నారు. విశాల్ హీరోగా ‘యాక్షన్’ చిత్రంతో నిర్మాతగా మారానన్నారు. ప్రేక్షకులకు  నచ్చే చిత్రాలను నిర్మించాలన్న లక్ష్యంతో ఈ రంగంలో అడుగుపెట్టానన్నారు. దర్శకుడిగా తనకు నాగేశ్వరరెడ్డి సినిమాలంటే చాలా ఇష్టమని, వినోదమే ప్రధానంగా ఆయన సినిమాలు ఉంటాయని, అదే కోవలో ఈ సినిమా కూడా తెరకెక్కబోతోందన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందన్నారు.
మరో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన తమ సంస్థ శ్రీకార్తికేయ సినమాస్ తో కలిసి ఈ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆడెపు శ్రీనివాస్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత అని,
అందుకే ఆయనతో కలసి ముందుకు వెళుతున్నామన్నారు. పంపిణీ దారుడిగా ఇటీవల ఆయన అందించిన చిత్రాలన్నీ మంచి విజయాలను నమోదు చేశాయని వివరించారు. తమ ఇద్దరి కలయికలో వచ్చే ఈ చిత్రం మరిన్ని విజయవంతమైన చిత్రాలకు నాంది పలుకుతుందని బావిస్తున్నానన్నారు.
దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇటీవల వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ కంటే  పూర్తి ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందన్నారు. నిర్మాత శ్రీనివాస్ మంచి స్నేహశీలి అని, ఆయన సక్సెస్ ఫుల్ పంపిణీదారుడిగా మాత్రమే
ఇప్పటివరకు తనకు తెలుసని, మంచి విజయవంతమైన నిర్మాతగా కూడా ఆయనను చూడబోతున్నామన్నారు. ఈ నిర్మాతలిద్దరి కలయికలో మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నానన్నారు. నిర్మాత సురేష్ కొండేటితో తనకు ఉన్న స్నేహం ఇప్పటిది కాదని, తమ ఇద్దరి మధ్య మంచి ఆత్మీయతానుబంధం ఉందని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.

Bellamkonda Srinivas, Santosh Srinivas Film Grand Launch On 29th

ఈ ఏడాది `రాక్ష‌సుడు`తో సూప‌ర్ హిట్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో సినిమా రూపొంద‌నుంది. న‌వంబ‌ర్ 29న హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈసినిమా గ్రాండ్ లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రారంభోత్స‌వానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు. రెగ్యుల‌ర్  షూటింగ్ డిసెంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ కోసం డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ ప‌ర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డబోతున్నారు. అందుకోసం బెల్లంకొండ శ్రీనివాస్ ప్ర‌త్యేకంగా 8ప్యాక్స్‌తో మేకోవ‌ర్ అయ్యారు. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాల సినిమాటోగ్ర‌ఫీ అందించిన డూడ్లే ఈ సినిమాకు కెమెరామెన్‌గా ప‌నిచేయ‌బోతున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌. రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. `అల్లుడుశీను`, `జ‌య‌జానకి నాయ‌క‌` చిత్రాల త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.