పవర్ స్టార్ మళ్లీ నటించబోతున్నారన్న దానిపై బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ప్రకటించారు.. పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ న్యూస్ ని కన్ఫామ్ చేశారు.. పవన్ కళ్యాణ్ “పింక్” సినిమాని రీమేక్ చేయడం పక్కా అంటూ ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చారు. కాగా, బాలీవుడ్‌లో “పింక్” మూవీ సూపర్ హిట్ అందుకుంది. బిగ్‌బీ అమితాబ్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ మూవీని బోనీ కపూర్ నిర్మించారు. ఆ తర్వాత తమిళంలో అజిత్‌ను హీరోగా పెట్టి రీమేక్ చేసి మరోసారి హిట్ అందుకున్నారు. ఇక టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దిల్ రాజుతో కలసి బోనీకపూర్ ఈ రీమేక్‌ను నిర్మించనున్నారు. వేణూ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. మరోవైపు 2018లో వచ్చిన “అజ్ఞాతవాసి” సినిమాయే పవన్ కల్యాణ్ నటించిన చివరి సినిమా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీకి మాటల మాంత్రికుడే మాటలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ పని పూర్తిచేశారని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన “సైరా నరసింహారెడ్డి” మూవీకి పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
‘యాక్షన్’ ట్రైలర్ చాలా చాలా బాగుంది.. డెఫినెట్‌గా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్
మాస్ హీరో విశాల్ హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’యాక్షన్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆడెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ’యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శుక్రవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ “మా ఇస్టార్ట్ డిస్ట్రిబ్యూటర్, ఇస్మార్ట్ శ్రీను శ్రీకార్తికేయ సినిమాస్ బేనర్‌పై ‘యాక్షన్’ సినిమాతో ఫస్ట్‌టైమ్ ప్రొడ్యూసర్ అవుతున్నాడు. ‘యాక్షన్’ సినిమా ట్రైలర్ ఇప్పుడే చూశాను. చాలా చాలా బాగుంది. విశాల్ హీరో, తమన్నా హీరోయిన్‌గా చేసిన సినిమా. సుందర్ సి. తన డైరెక్షన్‌తో చింపేశారు. ఫోటోగ్రఫీగానీ, ఎడిటింగ్‌గానీ, ప్రొడక్షన్ వేల్యూస్‌గానీ, చాలా చాలా బాగున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మా శ్రీనుకి ప్రొడ్యూసర్‌గా పెద్ద సూపర్‌హిట్ రావాలి. మంచి డబ్బులు రావాలి. బెస్ట్ ఆఫ్ లక్ టు ది టీమ్” అన్నారు.
నిర్మాత శ్రీనివాస్ ఆడెపు మాట్లాడుతూ “నా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసినందుకు పూరి జగన్నాథ్‌గారికి చాలా థాంక్స్. ఆయన చేతులమీదుగా మా సినిమా ట్రైలర్ లాంచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి సినిమాతో నిర్మాతగా మారుతున్నాను. ఈ సినిమాలో మాస్ హీరో విశాల్ యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ ఎంతో డెడికేటెడ్‌గా చేశారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. హిప్‌హాప్ తమిళ అందించిన సంగీతం సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. సుందర్ సి. ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అండర్ కవర్ మిషన్‌లో పనిచేసే మిలటరీ కమాండోగా విశాల్ కనిపిస్తారు. విశాల్ కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌లోనే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. పూరిగారి బ్లెస్సింగ్స్‌తో సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
మాస్ హీరో విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్, నిర్మాత: శ్రీనివాస్ ఆడెపు, దర్శకత్వం: సుందర్ సి.
తొంగి తొంగి చూడమాకు చందమామ టీజర్ లాంఛ్
దిలీప్, శ్రావణి జంటగా నటిస్తున్న సినిమా తొంగి తొంగి చూడమాకు చందమామ. జెమినీ సురేష్, ఈరోజుల్లో సాయి, కార్తీక్ అయినాల, రాజ్ బాలా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురు రాఘవేంద్ర సమర్పణలో హరి వల్లభ ఆర్ట్స్ సంస్థ తొంగి తొంగి చూడమాకు చందమామ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏ సునీత మోహన్ రెడ్డి నిర్మాత. యూత్, ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ కానుమోలు. యువతకు నచ్చే అంశాలతో ఆద్యంతం నవ్విస్తూనే మహిళల గొప్పదనం చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తొంగి తొంగి చూడమాకు చందమామ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ఫిలిం చాంబర్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ కానుమోలు మాట్లాడుతూ…చిన్న చిత్రాలకు అనేక సమస్యలుంటాయి. మాకు ఇబ్బంది కలిగిన సందర్భాల్లో నిర్మాత మోహన్ రెడ్డి గారు మాతో ఉండి ధైర్యం చెప్పారు. మమ్మల్ని ముందుకు నడిపించారు. నన్ను దర్శకుడిని చేసిన నిర్మాతకు ముందు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కోరుకున్న అమ్మాయిని దక్కించుకోవాలంటే ముందు ఆ అమ్మాయి మనసు గెల్చుకోవాలి అని చెప్పే చిత్రమిది. ఆకర్షణల మోజులో పడి అసలైన ప్రేమను నేటి యువత మర్చిపోతున్నారు. అలాంటి వారికి ప్రేమ గొప్పదనం తెలియజేసే సినిమా అవుతుంది. సందేశంతో పాటు ఆద్యంతం వినోదాత్మకంగా మా చిత్రం ఉంటుంది. అన్నారు. హీరో దిలీప్ మాట్లాడుతూ..మా నాన్న గోవిందరావు గారి ప్రోత్సాహంతో నేను హీరోగా ఇవాళ మీ ముందున్నాను. ప్రయత్నించి చూడు అంటూ ఆయన నన్ను ముందుకు నడిపించారు. దర్శకుడు ఆనంద్ గారు నేను ఈ పాత్రను చేయగలనా అనే సందేహం నుంచి ధైర్యాన్నిచ్చి, అంతా కొత్తవాళ్లమే చేసుకుంటూ వెళ్దాం అంటూ భరోసా ఇచ్చారు. ఇవాళ్టి యువతకు ఒక ప్రతినిధిగా ఈ చిత్రంలో కనిపిస్తా. కథలో నాకు ఎదురయ్యే కొన్ని సంఘటనల తర్వాత నిజమైన ప్రేమంటే ఏంటో తెలుసుకునే యువకుడిగా నటిస్తున్నా. అన్నారు.
నిర్మాత మోహన్ రెడ్డి మాట్లాడుతూ…దర్శకుడు ఓ భిన్నమైన ప్రేమ కథతో మా దగ్గరకు వచ్చారు. కథను, దర్శకుడి ఆలోచనలు నమ్మి ఈ సినిమా నిర్మించాము. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ పూర్తి చేసి, నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
అనంత్, లావణ్య, మహేంద్రనాథ్, మాధవీ ప్రసాద్, శ్రీనివాసరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, ఎడిటర్ – ఈశ్వర్ 57, సినిమాటోగ్రఫీ – వివేక్ రఫీ ఎస్కే, సాహిత్యం – బాలాజీ, ఆర్ట్ – రమేష్, కొరియోగ్రఫీ – శ్రీనివాస్, వినయ్, ఫైట్స్ – రియల్ సతీష్
రివ్యూ: మీకు మాత్రమే చెప్తా
చిత్రం : ‘మీకు మాత్రమే చెప్తా’
యాక్టర్స్: తరుణ్ భాస్కర్, అభినవ్, వాణి భోజన్ ,అనసూయ భరద్వాజ్, అవంతిక తదితరులు
సంగీతం: శివకుమార్
నిర్మాత: విజయ్ దేవరకొండ – వర్ధన్ దేవరకొండ
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్
పెళ్లి చూపులు’ సినిమా కథను తనకు దగ్గరకు తీసుకుకొచ్చిన.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను మెయిన్ లీడ్‌గా.. ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రొడ్యూస్ చేశాడు విజయ్. కాగా.. ఇందులో.. గోమఠం, అనసూయ, వాణి భోజన్, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అంతికా మిశ్రా నటించారు. షమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
కథ:
రాకేశ్ (తరుణ్ భాస్కర్), కామేశ్ (అభినవ్ గోమటం) ఇద్దరూ బెస్ట్ ప్రెండ్స్. ఒక టీవీ చానెల్‌లో ఇద్దరూ పనిచేస్తుంటారు. రాకేశ్, కామేశ్ ఇద్దరూ డాక్టర్లను ప్రేమిస్తారు. రాకేశ్ ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తుంటాడని ప్రతి విషయంలోనూ అతని లవర్ స్టెఫీ అనుమానిస్తూ ఉంటుంది. పెద్దవాళ్లను ఒప్పించి రాకేశ్ స్టెఫీని పెళ్లాడేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో పెళ్లికి రెండురోజుల ముందు రాకేశ్ ఫోన్‌కు ఒక వీడియో వస్తుంది. ఒక అమ్మాయితో హానీమూన్‌లో గడుపుతున్నట్టు ఆ వీడియో ఉంటుంది. అది ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంతో రాకేష్ టెన్షన్ పడిపోతాడు. అప్పటికే పలుమార్లు స్టెఫీ దగ్గర అబద్ధాలు చెప్పి దొరికిపోయిన రాకేష్.. ఈ వీడియో సంగతి దాచి పెట్టే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు స్టెఫీని లవ్ చేస్తున్న ఆమె బావ జాన్సన్ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. అసలు ఈ వీడియో ఎక్కడిది? నిజంగానే ఓ యువతితో రాకేశ్ గడిపాడా?.. దాన్ని ఇంటర్నెట్ నుంచి తొలగించడానికి అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు.. ఈ లోపు వీడియో ఎలా వైరల్ అయింది.. చివరికి స్టెఫీకి నిజం తెలిసిందా లేదా.. తదుపరి పర్యవసానాలేంటి అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
చిన్న అబద్ధం చెప్పడం దాన్ని కప్పి పుచ్చడానికి మరో అబద్ధం దాని కోసం పెద్ద రచ్చ చేయడం అనే లైన్ లో చాలా కథలు తెలుగులో వచ్చాయి. కానీ కాస్త కొత్తగా ఫ్రెష్ గా ఇప్పుడు ఇలాంటి కథతోనే వచ్చాడు కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్. సింపుల్ లైన్ ని స్క్రీన్ ప్లేతో మాయ చేసే ప్రయత్నం చేసాడు ఈ దర్శకుడు. ముఖ్యంగా ఈ సినిమాను తాను అనుకున్నది అనుకున్నట్టుగా తెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ లోనే కథ అంతా బయట పెట్టేసినా కామెడీ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఫ్రెష్ ఫేసులు కావడంతో కూడా సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చాలా సన్నివేశాలను అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు.
కానీ కథ చాలా చిన్నది కావడంతో ముక్కేది అంటే చుట్టూ తిప్పి చూపినట్టుంది. ఇంటర్వెల్ వరకు బాగానే లాక్కొచ్చినా ఆ తర్వాత అంతా బ్లాంక్ అనే ఫీలింగ్ తెప్పించాడు. తరుణ్ భాస్కర్, అతని ఫ్రెండ్స్ తో వచ్చే కామెడీ బాగానే వర్కవుట్ అయినా కథ లేకపోతే ఎంత కామెడీ చేసినా తేలిపోతుందనిపించింది. అనసూయ అంటూ ప్రచారం చేసి ఆమె పాత్రని కూడా తేల్చేయడంతో ఆమె ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు డైరెక్టర్. ఒక చిన్న వీడియో పెళ్లికి ముందు ఎన్ని తంటాలు తెచ్చిపెట్టిందనే అంశాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు.
దేశ వ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారిన డైరక్టర్
పన్నేండేళ్ల సినీ జర్నీలో ఇప్పటిదాకా తీసింది ఐదే ఐదు సినిమాలు..అన్నీ ఆడియెన్స్‌ని కదిలించే కథలు.. పైగా బ్లాక్‌బస్టర్ హిట్స్ కూడా..
ఒక స్ట్రాంగ్ స్టోరీని, అంతే పవర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయగలిగే దమ్మున్న దర్శకుడతను. అందుకే వెట్రిమారన్ పేరు కోలీవుడ్‌లోనే కాదు.. యావత్ దేశంలోనూ ఇంట్రెస్టింగ్ డైరెక్టర్‌గా మారుమ్రోగుతోంది..
అంజలి ఫస్ట్ లుక్ – ‘నిశ్శబ్దం’!
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్ లతో పాటు అంజలి, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. కాగా తాజాగా ఈ సినిమా నుండి అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. పోస్టర్ లో అంజలి వెరీ స్టైలీష్ లుక్ లో చేతిలో గన్ తో సీరియస్ మూడ్ లో కనిపిస్తోంది. అంజలి లుక్ చూస్తుంటే.. సినిమాలో ఆమె క్యారెక్టర్ కీలకమైనదని అనిపిస్తోంది.
టికెట్లు అమ్మిన విజయ్ దేవరకొండ
డిఫరెంట్ స్టైల్ , ట్రెండ్ తగ్గట్టు డ్రెస్సింగ్ తో తనకంటూ ఓ ఇమేజ్ సెట్ చేసుకున్న విజయ్ దేవర కొండ.. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరో. అభిమానులు ముద్దుగా రౌడీ అని పిలుచుకుంటారు. ఈ రౌడీ ఎక్కడికెళ్లినా అందరినీ అట్రాక్ట్ చేస్తుంటాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తున్న విజయ్ నిర్మాతగా మీకు మాత్రమే చెప్తా అనే సినిమా నిర్మించాడు. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా షమ్మీర్ సుల్తాన్ డైరెక్టర్. అనసూయ, అభినవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇవాళ ( శుక్రవారం) రిలీజ్ అయ్యింది. ఇవాళ ఉదయం ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ కు వెళ్లిన విజయ్ అక్కడ అభిమానులతో సందడి చేశాడు. కాసేపు అక్కడ కౌంటర్లో సినిమా టికెట్లు అమ్ముతూ అందరిని అట్రాక్ట్ చేశాడు.
బిగ్ బాస్3 విన్నర్?
‘బిగ్‌బాస్–3’ ఫైనల్‌కు చేరింది. ఈ వారం శివజ్యోతి ఎలిమినేట్ కాగా, మిగిలిన ఐదుగురు ఫైనల్‌కు చేరుకున్నారు. శ్రీముఖి, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, అలీ రెజా టైటిల్ కోసం పోటీపడుతున్నారు. వీళ్లలో చివరకు టాప్–3లో నిలిచిన వారిలోంచి ఒకరిని విజేతగా ఎంపిక చేస్తారు.అయిదుగురిలోంచి ఎవరు టైటిల్ గెలుస్తారని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అంతేకాకుండా.. బిగ్‌బాస్ 3 విన్నర్ వీళ్లే అంటూ.. సోషల్ మీడియాలో.. వారికిష్టమైన వారికి ఫుల్ ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే.. వాటన్నింటికీ.. చెక్ పడుతూ.. బిగ్‌బాస్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది. అందరూ అనుకుంటున్నట్టుగానే.. శ్రీముఖినే.. బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్. ఏంటీ షాక్ అవుతున్నారా..! నిజమో.. అబద్ధమో.. తెలీదు కానీ… శ్రీముఖీనే.. బిగ్‌బాస్ 3 విన్నర్ అని ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. బిగ్‌బాస్ 3 ట్రోఫీని.. చేతితో పట్టుకుని.. ఎంతో హ్యాపీగా.. కింగ్ నాగ్‌ని హగ్ చేసుకుంది శ్రీముఖి. దీంతో.. అందరూ శ్రీముఖినే విన్నర్ అని వారి సెల్‌ఫోన్స్‌లో స్టేటస్‌లు పెట్టుకుంటున్నారు.
ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు మీకు మాత్రమే చెప్తా చిత్రంలో చాలా ఉన్నాయి – ఆర్టిస్ట్ అభినవ్ గోమటం
తరుణ్ భాస్కర్ హీరోగా షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ చిత్రంలో నటించిన అభినవ్ గోమటంతో ఇంటర్వ్యూ…
నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే, సినిమాలంటే ఆసక్తితో మొదట థియేటర్ ఆర్టిస్ట్ గా చేశాను తరువాత సినిమాల్లోకి వచ్చాను. నేను నటించిన ఈ నగరానికి ఏమైంది బాగా సక్సెస్ కావడమే కాకుండా నా పాత్రకు మంచి గుర్తింపు లభించింది. యస్ సినిమా తరువాత కొన్ని చిత్రాల్లో నటించడం జరిగింది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తా సినిమాలో చెయ్యమని ఆడినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. తరుణ్ తో నా జర్నీ అలాంటిది.
మీకు మాత్రమే చెప్తా డైరెక్టర్ షమ్మీర్ సుల్తాన్ ఈ సినిమా కాన్సెప్ట్ మొదట విజయ్ కు చెప్పాడు, అప్పడికి అర్జున్ రెడ్డి విడుదల కాలేదు. అర్జున్ రెడ్డి విడుదల తరువాత విజయ్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ ఇది, కానీ అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది కావున విజయ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు, తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో నటించాడు. షూటింగ్ టైమ్ లో తరుణ్ లోని ఇంకో స్కిల్ బయటపడింది, అతనికి డైరెక్షన్ స్కిల్స్ తో పాటు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని తెలియడంతో ఆయనే ఈ సినిమాలో హీరో గా నటించాడు.
ఈ చిత్రానికి మొదట ఎవరికి చెపొద్దు అనే టైటిల్ అనుకున్నాం. కానీ ఆ టైటిల్ తో మరో సినిమా విడుదలకు సిద్దంగా ఉండడంతో మేము మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ ఖరారు చేశాం. టైటిల్ కు అందరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. సినిమా 2 గంటల 4 నిమిషాలు ఉంటుంది, ఎక్కడా బోర్ లేకుండా డైరెక్టర్ షమ్మీర్ సుల్తాన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాను తెరకెక్కించడం జరిగింది.
మొబైల్ వాడకం ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అందరూ చేస్తున్న పని. ఆ మొబైల్ వాడకం వల్ల మా సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఇబ్బందులు పడ్డారు అనే విషయాన్ని ఎంటర్టైన్ పద్దతిలో చెప్పడం జరుగింది. ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ట్రైలర్ లో మేము కొంతే చూపించాము. సినిమాలో ఆడియన్స్ థ్రిల్ అయ్యే అనేక అంశాలు ఉంటాయి.
విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో నేను నటించడం లక్కీగా భావిస్తున్నాను. నా రోల్ ఎంటర్టైన్ గా ఉంటుంది. మీకు మాత్రమే చెప్తా అనే డైలాగ్ సినిమాలో నేనే చెబుతాను. ఈ నగరానికి ఏముంది సినిమా తరువాత ఈ మూవీలోనే అంత హిలెరియర్ రోల్ చేశాను. సినిమా చూశాక ఆడియన్స్ తప్పకుండా ఆలోచిస్తారు, సినిమాకు కనెక్ట్ అవుతారు.
నితిన్ రంగ్ దే, జయంత్ సి పరాంజీ గారి సినిమా తో పాటు హీరో సుశాంత్ సినిమాలో నాటిస్తున్నాను. నాకు, ఒకే తరహా పాత్రలు చెయ్యడం ఇష్టం ఉండదు, అన్నీ రకాల పాత్రలు చెయ్యాలని ఉంటుంది. భవిషత్తులో మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్త్సైన్ చెయ్యాలనేదే న కోరికని ఇంటర్వ్యూ ముగించారు.
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటం నా బాధ్యత-విజయ్ దేవరకొండ
‘‘విజయ్ వాళ్ల నాన్న గోవర్థన్‌తో వర్క్ చేశాను. చాలామంచి వ్యక్తి. ఈ చిత్రం ట్రైలర్ చూశాను, బావుంది. సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ చిత్రంతో పాటు విజయ్ చేస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవ్’ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు పూరి జగన్నాథ్. ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్ హీరోగా ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా షామీర్ సుల్తాన్ దర్శకునిగా చేసిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’.
ఈ వేడుకలో పూరి జగన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘విజయ్, తరుణ్ ఎదిగిన తీరు చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది. ఈ చిత్రం ట్రైలర్ చూశాను. చాలా బాగుంది’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఐదారేళ్ల క్రితం టీవీలో సెలబ్రిటీలందరినీ చూసి నటుడవ్వాలనే కోరిక ఉండేది. అప్పుడు మా నాన్న నన్ను పూరిగారి దగ్గర వర్క్ చేయమని చెప్పారు. ఇప్పుడు నేను పూరిగారితో వర్క్ చేయటం మర్చిపోలేని అనుభూతి. కలలు కనండి, వాటిని నిజం చేసుకోవటానికి కష్టపడండి.
నన్ను చాలామంది సపోర్ట్ చేయటంతో ఈ స్థానంలో ఉన్నాను. అందుకే నేను కొత్తవారిని సపోర్ట్ చేస్తున్నాను. నా సక్సెస్‌కు కారణం సందీప్‌రెడ్డి వంగా. నిర్మాత సురేశ్‌బాబు గారు నా మొదటి సినిమా నుండి సపోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు.















