Home Blog Page 14

Sensational Director Harish Shankar Releases ‘Gods and Soldiers’ TRAISER

‘Gods and Soldiers’ is a prestigious Tamil–Telugu bilingual film produced by Rough Note Production. The film has completed shooting and is currently progressing rapidly with post-production work. Directed by noted filmmaker and cinematographer Vijay Milton, the movie is shaping up as a commercial mass entertainer and has already created pre-release buzz.

The team has released a video titled “TRAISER,” which was unveiled by sensational director Harish Shankar through his social media platform. The teaser is attracting attention with its mix of mass elements, emotions, and action sequences.

On this occasion, director Vijay Milton said, “We thank director Harish Shankar for releasing our TRAISER and encouraging us. This film, made on a grand scale with an emotional backdrop, will offer a cinematic experience blending realistic storytelling with commercial elements. Talented actors will be seen in new avatars. Aari Arujunan will appear as a police officer for the first time. Raj Tarun is making his Tamil debut with this film, while Bharath plays a key emotional role. Amu Abhirami and Kishore will be seen in important roles.”

He added that the entire team worked hard physically and emotionally for the film. As a special attraction, independent music artist Vedan will also be seen in an important role. Known for his unique voice and socially relevant songs, Vedan’s presence adds cultural and musical depth to the film.

The movie has been shot extensively in various locations and is currently in post-production. Produced by Rough Note Production, the film is being made as a blend of action, emotion, and social elements to appeal to both Tamil and Telugu audiences.

‘Chinthamani Sontha Katha’ New Movie Pooja Ceremony Held grandly

శ్రీరామ్, మహిమా గుప్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “చింతామణి సొంతకథ”.
ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రేమ్ రాజ్ రూపొందిస్తున్నారు. మిత్రా మూవీ మేకర్స్ బి.రాజీవ్ కుమార్, రాకేష్ కర్రె, డా. ఎన్ వీ రావు, శ్రీనివాస్ పసుపులేటి నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ డా. అద్దంకి దయాకర్, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

డా. అద్దంకి దయాకర్ క్లాప్ ఇవ్వగా, జీహెచ్ఎంసీ రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ వందనకుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సోషల్ యాక్టివిస్ట్ డా. శ్రీనివాస్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
నటుడు కాశీ విశ్వనాథ్, రచయిత నివాస్ కలిసి దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా

నిర్మాత బి.రాజీవ్ కుమార్ మాట్లాడుతూ – మా మిత్రా మూవీ మేకర్స్ బ్యానర్ పై రెండవ సినిమా గా “చింతామణి సొంతకథ” చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దర్శకుడు ప్రేమ్ రాజ్ ఒక మంచి కథను మాకు చెప్పారు. కథలోని స్ట్రాంగ్ కంటెంట్ ను నమ్మి మేము సినిమా చేసేందుకు ముందుకొచ్చాం. మా సినిమాకు హీరో హీరోయిన్స్ శ్రీరామ్, మహిమా గుప్త పర్పెక్ట్ గా సరిపోయారు. మేము మా బ్యానర్ లో ఏడాదికో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. అన్నారు.

నిర్మాత డా.ఎన్ వీ రావు మాట్లాడుతూ– ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు చేయాలనే ఉద్దేశంతో మిత్రా మూవీ మేకర్స్ సంస్థను స్థాపించి నేను నా ఫ్రెండ్స్ కలిసి సినిమాలు నిర్మిస్తున్నాం. “చింతామణి సొంతకథ” సినిమాను ప్రేమ్ రాజ్ లాంటి అనుభవం ఉన్న దర్శకుడితో నిర్మించడం సంతోషంగా ఉంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.

నిర్మాత రాకేష్ కర్రె మాట్లాడుతూ- “చింతామణి సొంత కథ” అంటే సీఎస్ కే. ఐపీఎల్ సీఎస్ కే లాగే మా సినిమా కూడా విజయం సాధిస్తుంది. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రేమ్ రాజ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంచి సాంగ్స్ ఆకట్టుకుంటాయి.అన్నారు.

లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ గారితో కలిసి పాటలు రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. పాటలకు మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. ఈ సినిమాలో ఒక సాంగ్ నేను రాస్తున్నా. మా మూవీకి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ- దర్శకుడిగా నాకు నాలుగో చిత్రమిది. గతంలో నేను చేసిన మూడు చిత్రాలు మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంటాయి.ఇప్పుడు నాలుగో చిత్రంగా కమర్షియల్ పంథాలో క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా చేస్తున్నాను. క్రైమ్ థ్రిల్లర్ కథైనా ఇందులో భార్య భర్తల మధ్య మంచి డ్రామా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. యూత్ ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. ఇప్పుటి ట్రెండ్ కు అనుగుణంగా రూపొందిస్తున్నాం. ప్రేక్షకులు సినిమాను కొత్తగా ఫీలవుతారు. తెలుగు, హిందీ భాషల్లో స్ట్రైట్ మూవీ ఇది. తమిళ, మలయాళ, కన్నడలో డబ్ చేస్తాం. మా ప్రొడ్యూసర్స్ నలుగురు నాలుగు పిల్లర్స్ లా నిలబడి ఈ మూవీ నిర్మిస్తున్నారు. హీరోయిన్ మహిమా గుప్తకు ఈసినిమాతో మంచి పేరొస్తుంది. హీరో శ్రీరామ్ మా మూవీకి ముఖచిత్రం లాంటివారు. కథ విన్న వెంటనే ఈ సినిమా చేస్తానంటూ ముందుకొచ్చారు. మీ అందరి సహకారం మాకు ఉంటుందని ఆశిస్తున్నాం.అన్నారు.

హీరోయిన్ మహిమా గుప్త మాట్లాడుతూ – తెలుగులో నాకు తొలి చిత్రమిది. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. శ్రీరామ్ గారి సరసన నటించే అవకాశం దక్కడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా.అన్నారు.

నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ- ప్రేమ్ రాజ్ నాకు మిత్రుడు.ఈ కథ నాకు తెలుసు. చాలా మంచి స్టోరీ.ఈ చిత్రంలో నేను ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నాను. క్రైమ్ థ్రిల్లర్ తో పాటు సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా అంశాలు ఆకట్టుకుంటాయి.అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ – మా డైరెక్టర్ ప్రేమ్ రాజ్ లాగే నేను కూడా ప్రతి సినిమా మొదటి సినిమాగానే భావించి నటిస్తాను. “చింతామణి సొంత కథ” సినిమా మిత్రా మూవీ మేకర్స్ కు హిట్ మూవీ అవుతుంది. వాళ్లు ఇంకా చాలా సినిమాలు చేయాలి. అందరికీ పని కల్పించాలి. టీమ్ అంతా ప్యాషనేట్ గా కష్టపడి ఒక మంచి సినిమా చేయాలనుకుంటున్నారు. ట్విస్ట్స్, ఎమోషన్స్, యాక్షన్ తో సాగే ‘మీనింగ్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్’ చిత్రమిది. మీ అందరికీ నచ్చే సినిమా ఇవ్వబోతున్నాం. తొలి చిత్రంతోనే టైటిల్ రోల్ దక్కించుకుంది మా హీరోయిన్ మహిమా. తెలుగు ఆడియెన్స్ ప్రతిభ ఉండి కష్టపడే ప్రతి ఒక్కరినీ ఆదరిస్తారు. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్, తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ అధ్యక్షులు నాని, తదితరులు పాల్గొన్నారు

నటీనటులు – శ్రీరామ్, మహిమా గుప్త,నాజర్, కాశీ విశ్వనాథ్, వడ్లమాని శ్రీనివాస్, మురళీధర్ గౌడ్, రవికాలే, శ్రీలక్ష్మి , నర్రా శ్రీనివాస్, తదితరులు

టెక్నికల్ టీమ్
—————–
డైరెక్టర్ : ప్రేమ్ రాజ్
నిర్మాతలు : బి. రాజీవ్ కుమార్, రాకేష్ కర్రె, డా. ఎన్ వీ రావు, శ్రీనివాస్ పసుపులేటి
డీవోపీ : ప్రతాప్
ఫైట్స్ : సుబ్బు
లిరిక్స్ – సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, మెట్టపల్లి సురేందర్
కో. డైరెక్టర్ : జీవన్ కుమార్
పీఆర్ఓ – మూర్తి మల్లాల

‘Raaka’ title and first look poster released on the occasion of Icon Star Allu Arjun’s birthday

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం ముందు వరుసలో ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తిగా క్రియేట్ చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

ఇక ‘రాకా’ టైటిల్‌తో పాటుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఈ అప్డేట్‌లతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ ఇంత వరకు కనిపించని ఓ కొత్త అవతారంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గుండుతో, వింత శరీరాకృతితో అందరిలోనూ అంచనాల్ని పెంచేశారు. అల్లు అర్జున్ చూపుల్లో వాడివేడి, పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు అందరిలోనూ అంచనాల్ని రెట్టింపు చేసింది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అభిమానులు ఐకాన్ స్టార్ పుట్టినరోజును ఈ అప్డేట్లతో ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటున్నారు. దాదాపు ఏడాది పాటు అభిమానులను ఎదురుచూసేలా చేసిన తర్వాత అట్లీ, అల్లు అర్జున్ ఈ అప్డేట్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ‘రాకా’తో సిల్వర్ స్క్రీన్ మీద ఏం క్రియేట్ చేయబోతోన్నారో అనే చర్చను మరోసారి లేవనెత్తారు.

‘పుష్ప: ది రూల్’ ప్రపంచవ్యాప్త విజయం తర్వాత జాతీయ అవార్డు గ్రహీత నటుడు అల్లు అర్జున్ ‘రాకా’తో అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ‘రాకా’ ఒక భారీ సాంకేతిక చిత్రంగా ఉంటుందని, హాలీవుడ్ దిగ్గజాలకు దీటుగా విజువల్ ఎఫెక్ట్స్, ప్రపంచ నిర్మాణాన్ని సృష్టించాలని అట్లీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

‘జవాన్’, ‘తేరి’, ‘బిగిల్’, ‘మెర్సల్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్‌లతో సక్సెస్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా అట్లీ నిలిచారు. అలాంటి అట్లీ భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన మీడియా పవర్‌హౌస్‌లలో ఒకటైన సన్ టీవీ నెట్‌వర్క్‌తో కలిసి ‘రాకా’ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, అద్భుతమైన విజువల్స్, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథనాన్ని మేళవించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందేలా ‘రాకా’ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

‘Lenin’ Movie grand Releasing on June 26th: Akhil Akkineni’s Birthday Special Poster Released

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ‘లెనిన్’ ఓ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌తో మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భావోద్వేగాలతో పాటుగా ఆకట్టుకునే కథనంతో కంప్లీట్ సినిమాటిక్ ప్యాకేజీగా ‘లెనిన్’ రూపుదిద్దుకుంటోంది.

అఖిల్ అక్కినేని పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా నిర్మాతలు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పవర్ ఫుల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అఖిల్ కొత్త లుక్‌లో కనిపించగా, ఆయన చిరునవ్వు మరింత అట్రాక్టివ్‌గా ఉంది. అభిమానుల్లో ఇప్పటికే ఎన్నో అంచనాల్ని క్రియేట్ చేసిన ఈ చిత్రం జూన్ 26, 2026న విడుదల కానుంది.

మురళీ కిషోర్ అబ్బూరు ‘లెనిన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆయన మ్యూజిక్, ఆర్ఆర్‌తో సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుందని టీం చెబుతోంది. అభిమానులకు, సినీ ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ‘లెనిన్’ మూవీని తెరకెక్కిస్తున్నారు.

నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్స్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్లు: మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు : అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
సమర్పణ : అన్నపూర్ణ స్టూడియోస్
రచన & దర్శకత్వం : మురళీ కిషోర్ అబ్బూరు
మ్యూజిక్ : థమన్ ఎస్
ఎడిటర్ : నవీన్ నూలి
DOP : లియోన్ బ్రిట్టో
ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా
పీఆర్వో : వంశీ కాకా

Applause Entertainment & Temple Town Pictures Hero Allari Naresh ‘KANAKADURGA’ Movie Pooja Cermony Held grandly

తమిళ సినీ ఇండ‌స్ట్రీలో విజ‌య‌వంత‌మైన ప్రముఖ కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా టెంపుల్ టౌన్ పిక్చ‌ర్స్‌తో క‌లిసి చేయ‌బోతున్న సినిమా ‘కనక దుర్గ’ను శ‌నివారం రోజున పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. వెర్స‌టైల్ స్టార్ అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో కాజ‌ల్ చౌద‌రి హీరోయిన్‌. ఈ సినిమాలో న‌టుడు సుబ్బ‌రాజు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ భక్తి ప్రధాన కథా చిత్రానికి బి.వి.ఎస్. రవి కథ అందిస్తుండ‌గా..ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. స‌మీర్ నాయ‌ర్‌, దీపక్ సెహ‌గ‌ల్‌, అజిత్ ఠాకూర్‌, బి.వి.ఎస్‌.ర‌వి నిర్మాత‌లు.

భారతీయ దేవతల ఆధారంగా ఒక దివ్యమైన ప్రపంచాన్ని ఆవిష్క‌రిస్తూ ఈ సినిమా భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం ఇలా అన్ని అంశాల‌తో ప్రేక్ష‌కుల‌కు ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నుంది. అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ‌ర్ప‌ణ‌లో టెంపుల్ టౌన్ పిక్చ‌ర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ రెండు సంస్థ‌ల‌కు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది.

ఘనంగా జరిగిన కార్య‌క్ర‌మంలో సురేఖ‌ కొణిదెలతో పాటుగా ప్ర‌ముఖ నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి, హ‌రీష్ శంక‌ర్‌, మిక్కిలినేని సుధాక‌ర్‌, కోన వెంక‌ట్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌, మ‌ధుర శ్రీధ‌ర్‌, స్వ‌ప్నాద‌త్‌, సుప్రియ‌, విద్యా కొప్పినీడు, ప‌ద్మ క‌స్తూరి రంగ‌న్‌, అనురాధ గూడూరు, దివ్య విజ‌య్‌, హ‌న్షిత రెడ్డి, జాన్వీ నారంగ్, స్ర‌వంతి చొక్కార‌పు, వైఘా రెడ్డి, విరుప తదితరులు అతిథులుగా విచ్చేశారు. సినిమా భావాన్ని ప్రతిబింబిస్తూ పూజా కార్యక్రమం చివర్లో కనకదుర్గ అమ్మవారి దివ్య స్త్రీ శక్తిని ప్ర‌త్యేకంగా స్మ‌రించుకున్నారు. హాజరైన మహిళలు కలిసి అమ్మ‌వారి శక్తి, కరుణ, మహిమలను గౌరవించారు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా, సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్వ‌ప్న ద‌త్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు.

అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీస్ బిజినెస్ హెడ్ సునీల్ చైనాని మాట్లాడుతూ “దక్షిణ భారత సినిమా ఎప్పటికీ కథలను చెప్పడంలో అత్యంత ఆసక్తికరమైన వేదికలలో ఒకటిగా నిలుస్తోంది. తమిళంలో మా ప్రయాణం ఎంతో ప్రోత్సాహకరంగా, విజయవంతంగా సాగింది. ఇప్పుడు ‘కనక దుర్గ’తో తెలుగులోకి అడుగుపెడుతుండ‌టం ఎంతో ఆనందంగా ఉంది. భ‌క్తి, సంస్కృతి, భావోద్వేగాల క‌ల‌యిక‌ల‌తో ఈ సినిమా రూపొందుతోంది. అజిత్ ఠాకూర్‌, బి.వి.ఎస్‌.ర‌వి, అల్ల‌రి న‌రేష్, ప్ర‌దీప్ మ‌ద్దాలితో క‌లిసి ప‌ని చేయ‌టం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

టెంపుల్ టౌన్ పిక్చ‌ర్స్ నిర్మాతలు అజిత్ ఠాకూర్ మరియు బి.వి.ఎస్. రవి మాట్లాడుతూ “‘కనక దుర్గ’ కథ తెలుగు నేలకు సంబంధించిన ఆధ్యాత్మికత, సంస్కృతిలో బలంగా నాటుకుపోయింది. దీంతో మా ప్ర‌యాణం ప్రారంభం కావటం ఎంతో ప్ర‌త్యేకం. మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న తొలి తెలుగు సినిమా ఇది. మంచి క‌థ‌తో పాటు మంచి భాగ‌స్వామ్యంలో సినిమా చేస్తుండ‌టం అదృష్టంగా భావిస్తున్నాం. మా ప్ర‌యాణంలో తోడుగా నిలుస్తోన్న అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి థాంక్స్‌. దైవ అనుగ్ర‌హంతోనే ఈ ప్ర‌యాణం సాగుతున్న‌ట్లు అనిపిస్తోంది. అమ్మ‌వారి ఆశీర్వాదంతోనే ఈ సినిమాను రూపొందిస్తోన్న భావ‌న క‌లుగుతోంది” అన్నారు.

దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ ‘‘‘కనక దుర్గ’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దర్శకుడిగా మాత్రమే కాదు, ఆ అమ్మవారిపై నాకు ఉన్న భక్తి కూడా దీనికి కార‌ణం. ఈ సినిమా నా హృదయానికి ఎంతో దగ్గరైంది. ఈ సినిమా అసలు కథ భక్తి గురించి మాత్రమే కాదు..జీవితంలో చిద్రమైన ఒక మనిషి, తనకంటే గొప్పదైన శక్తిని ఎదుర్కొన్నప్పుడు ఏమి జరుగుతుందో చెప్పే కథే ఇది. మా క‌థ‌ను నమ్మి ‘అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్’ లాంటి సంస్థ ముందుకు రావడం, అలాగే ‘టెంపుల్ టౌన్ పిక్చర్స్’ ఈ ప్రాజెక్ట్‌ను ఇంత నమ్మకంతో ముందుకు తీసుకెళ్లడం చాలా ఆనందంగా, ఉత్సాహంగా,భావోద్వేగం కూడా ఉండి, విజువల్‌గా కూడా భారీ స్థాయిలో ఉండే ఈ సినిమాతో మా ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు చాలా గర్వంగా ఉంది” అన్నారు.

న‌టీన‌టులు:

అల్ల‌రి నరేష్‌, కాజ‌ల్ చౌద‌రి, సుబ్బ‌రాజు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
స‌మ‌ర్ప‌ణ‌: అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
టెంపుల్ టౌన్ పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్‌
నిర్మాత‌లు: స‌మీర్ నాయ‌ర్‌, దీప‌క్ సెహ‌గ‌ల్‌, అజిత్ ఠాకూర్‌, బి.వి.ఎస్‌.ర‌వి
ద‌ర్శ‌క‌త్వం: ప్రదీప్ మ‌ద్దాలి
రైట‌ర్‌: బి.వి.ఎస్‌.ర‌వి

‘Diamond Decoyit’ to Release on April 10 — Free Shows Announced for Women

The much-awaited complete family emotional drama Diamond Decoyit is set for a grand theatrical release on April 10 across Andhra Pradesh and Telangana. Adding to the film’s buzz, legendary filmmaker K. Raghavendra Rao watched the trailer and appreciated the efforts of the film’s team.

On this special occasion, the makers have announced an attractive offer for women audiences. Four shows of the film will be screened free of cost for women in theatres where the movie releases across both Telugu states. The team has invited women viewers to make use of this opportunity and enjoy the film on the big screen.

The film features Partha Gopal as the lead actor, who has also produced the project, while Meghana Reddy plays the female lead. Written and directed by Surya G. Yadav, the movie is presented as a heartfelt family entertainer packed with strong emotional elements.

According to the makers, the film has already received encouraging feedback from several film personalities during preview screenings.
Speaking about the film, hero-producer Partha Gopal said that Diamond Decoyit is a complete family emotional drama with a story that every family can relate to. He added that the scenic locations of Kadapa district, where the film was extensively shot, will be a special visual attraction. He also reiterated that four free shows have been arranged for women audiences and invited everyone to watch the film in theatres.

Director Surya G. Yadav stated that the film carries strong emotional depth and has been crafted to connect with all sections of the audience. He expressed pride in the fact that the movie was shot entirely in Kadapa district and requested viewers to support and bless the film.

One of the major highlights of Diamond Decoyit is that it was filmed across more than 60 picturesque locations in Kadapa district, promising audiences a fresh visual experience along with touching emotional storytelling.

Technical Crew:
Story, Screenplay, Dialogues & Direction: Surya G. Yadav
Producer & Hero: Partha Gopal
Heroine: Meghana Reddy
Chief Advisor & Writer: Sai Raju
Music: PR
Editor: Shiva Sarvani
Cinematography: Shiva Achanta
PRO: Ashok Dayyala

Sampradayini Suppini Suddapoosani Trends on Netflix – A Perfect Blend of Family Fun & Crime Comedy Thrills

సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ఫైవ్ ట్రెండింగ్ లిస్టులో స్థానం సంపాదించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శివాజీ, లయ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఒక సర్పంచ్ ఎదుర్కొనే రహస్యాలు, సవాళ్లను హాస్య రూపంలో చూపిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. నియమబద్ధమైన గ్రామాధికారి ఒక కుట్రలో చిక్కుకుని తన కుటుంబంతో కలిసి ఒక అనిశ్చిత ప్రయాణం చేయడం ద్వారా స్థానిక పోటీలు, రహస్యాలు బయటపడతాయి. ఈ చిత్రం థ్రిల్లర్ మరియు హాస్య అంశాలను సమతుల్యంగా మిళితం చేసి, ఆకర్షణీయమైన కథనంతో ఆద్యంతం ఆసక్తిని కొనసాగిస్తుంది. మార్చి 6న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా దృష్టి సాధించింది. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండటం విశేషం.

ఈ చిత్రం గ్రామీణ జీవితాలను హాస్యాత్మకంగా, యథార్థపూర్వకంగా చూపించి, తెలుగు సినిమా ప్రమాణాలను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. శివాజీ సర్పంచ్ పాత్రలో చూపించిన సహజ నటన, లయ కుటుంబ సభ్యురాలిగా ప్రదర్శించిన భావోద్వేగాలు, రోహన్ ఉత్సాహం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డార్క్ కామెడీ శైలిలో రూపొందిన ఈ సినిమా స్థానిక వైవిధ్యాలు, కుట్రలను ఆసక్తికరంగా వివరిస్తూ సమాజంలోని చిన్న చిన్న విషయాలను కూడా హైలైట్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ టాప్ ఫైవ్‌లో నిలవడం ద్వారా తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపిస్తోందో, ఈ సినిమా ద్వారా మరోసారి రుజువయ్యింది. ప్రయాణ సన్నివేశాలు, ఆకస్మిక ట్విస్టులు, కుటుంబ బంధాలు ఈ చిత్రాన్ని ప్రత్యేకం చేశాయి. ఇప్పుడు ఇంట్లోనే ఆనందించాలనుకునే ప్రేక్షకులకు, ఈ సినిమా సరైన ఎంపికగా నిలిచింది. ఈ సినిమా హాస్యం, సస్పెన్స్, యాక్షన్ మూడింటినీ సమానంగా అందించి, చక్కటి వినోదం కలిగిస్తుంది.

One Chance Please says Actress PALLAVI GOUD

“చిన్నప్పుడు ఒకసారి వినాయక చవితి ఉత్సవం సందర్భంగా స్టేజి ఎక్కి డాన్స్ చేశాను. అప్పుడు వినిపించిన ఈలలు చప్పట్లు ఇప్పటికీ నాకు గుర్తు. ఆ క్షణమే… ఎప్పటికైనా వెండి తెరపై నన్ను నేను చూసుకోవాలని ఆశపడ్డాను. ఒకసారి వచ్చిన ఒక మంచి ఛాన్స్ చేజేతులారా జారవిడుచు కున్నాను. కానీ ఇప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలను కుంటున్నాను” అంటుంది పల్లవి గౌడ్.

కుటుంబ బాధ్యతల కారణంగా తనలోని కళాతృష్ణను ఇన్నాళ్లు తనలోనే అణచివేసుకున్న ఈ “అచ్చ తెలుగు తెలంగాణ ఆడపడుచు” ఇప్పుడిప్పుడు రీల్స్, ఫోక్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తో తన ప్రతిభను చాటుకుంటూ సినిమా రంగం వైపు స్థిరంగా అడుగులు వేస్తోంది.

ప్రముఖ దర్శకుడు కర్రి బాలాజీ రిఫరెన్స్ తో త్వరలో విడుదల కానున్న “హుషారు పిట్ట” చిత్రంతో పెద్దతరపై బుల్లి అడుగు వేసిన పల్లవి… ఈ రంగంలో తనకంటూ “చిన్న గుర్తింపు” తెచ్చుకోవాలని ఆశపడుతోంది. పల్లవిని ప్రోత్సహించాలనుకునేవారు 9160513151 నంబర్లో సంప్రదించవచ్చు!!

KA Productions & Sumaira Studios ‘Thimmarajupalli TV’ Trailer released on April 9th

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ట్రైలర్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ట్రైలర్ ఈనెల 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ పై మూవీ లవర్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

నటీనటులు – సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ డిజైనర్ – విశాల్య
ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ – చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
డీవోపీ – అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
సీఈవో – రహస్య కిరణ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – తేజ వేల్పుచర్ల
ప్రొడ్యూసర్ – కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు

Gaali Movie Grand Releasing on April 17th

సంధ్య ఫిలిం బ్యానర్ పై రాంప్రసాద్ గురజాడ, అంజలి రామవతు, శ్రీకాంత్ పెరుమండ్ల యస్. చంద్ర కళ,చందా రోజా రాణి, బివి సుబ్బారెడ్డి నటీనటులుగా నాటక రంగంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత మరియు నంది గరుడ వంటి అవార్డులు పొందిన టి రాము దర్శకత్వంలో నిర్మాత చందా లక్ష్మీనారాయణ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం “గాలి”. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన టీజర్, సాంగ్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నాం..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నాకు సినిమా ఫీల్డ్ కొత్తయినా రాము గారు రాసుకున్న షోషియో ఫాంటషీ కథ నచ్చడంతో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 17న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా గాలి చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు.

చిత్ర దర్శకుడు రాము మాట్లాడుతూ.. కలి పురుషుడికి అమ్మవారికి మధ్య జరిగే భీకర పోరాటమే ఈ “గాలి” చిత్రం. సస్పెన్స్ తో సాగే ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషియో ఫాంటసీతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

సినిమా పేరు : గాలి

నటీ నటులు : రాంప్రసాద్ గురజాడ, అంజలిరామవతు, శ్రీకాంత్ పెరుమండ్ల యస్. చంద్ర కళ,చందా రోజా రాణి, బివి సుబ్బారెడ్డి తదితరులు

సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : సంధ్యా ఫిలిమ్స్
నిర్మాత : చందా లక్ష్మీనారాయణ
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : తీడ రాము
ఎడిటర్ : వేణు చౌదరి
కెమెరామెన్ : కే ప్రకాష్
సంగీతం : అనిల్ కుమార్ మద్రాసు