Home Blog Page 15

Gripping Anthology Film ‘4va Adhyayam’ Gets Overwhelming Response On Aha

Vetri, Sakshi Agarwal, Ammu Abirami, Divya Duraisamy, and Sunil Reddy played the lead role in the revenge-driven anthology Adharma Kadhaigal, which earned strong acclaim during its Tamil release. Written and directed by Kamaraj Vel, the film has now made its way onto the popular Telugu OTT platform Aha under the title 4va Adhyayam, carrying the impactful tagline “Beyond Justice.” The project is produced by Kamaraj Vel himself under his banner Big Bang Movies.

4va Adhyayam unfolds across four gripping stories, each delving into different shades of revenge- its triggers, its consequences, and the emotional toll it leaves behind. The anthology examines complex ideas such as the human need for vengeance, the destructive nature of self-harm, and the liberating power of forgiveness. Through diverse characters and situations, Kamaraj Vel crafts a compelling narrative tapestry that keeps viewers invested from start to finish.

The director’s storytelling is backed by sharp twists, tight pacing, and an intensity that holds the audience on edge. Strong performances from the lead cast elevate the emotional impact of each segment, while the film’s technical finesse- crisp cinematography, gripping music, and precise editing, contributes to its overall immersive experience.

Following its Telugu premiere on Aha, 4va Adhyayam is receiving an overwhelmingly positive response from viewers. Many are praising it as one of the most engaging and well-crafted thrillers in recent times, solidifying its appeal across languages.

Therachaapa Movie Grand Releasing on April 17th

అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు.

అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్ చేయగా జీవన్ జార్జ్ కోరియోగ్రఫీ చేశారు. ప్రమోషన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

తారాగణం: నవీన్‌రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు, జగదీష్ ప్రతాప్ బండారి, రాజీవ్ కనకాల, రాకీ, నాగ మహేష్, పృధ్వీ రాజ్, ఫిష్ వెంకట్, అశోక్ జబర్దస్త్, నాగి జబర్దస్త్, అప్పారావు జబర్దస్త్, రైజింగ్ రాజు, రాజేష్ భూపతి, శ్రీనివాస్ నేస, మాయమచంద్ర, సకారం తదితరులు

సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ హౌస్: అనన్య క్రియేషన్స్
నిర్మాత: కైలాష్ దుర్గం
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జోయెల్ జార్జ్
సినిమాటోగ్రఫీ: అజీమ్ & వెంకట్
సంగీత దర్శకుడు: ప్రజాల్ క్రిష్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎంఎల్ రాజా
ఎడిటింగ్: రాజు బోడసింగి
డైలాగ్స్: జోయెల్ జార్జ్, మిద్దె మనోజ్ కుమార్ సాహిత్యం: మిద్దె మనోజ్ కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: బొడ్డు అమూల్య
కొరియోగ్రఫీ: జీవన్ జార్జ్
PRO: మధు VR

Pink Elephant Pictures ‘Raakaasa’ summer fantastic blockbuster success meet held grandly

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సమ్మర్ ఫన్‌టాస్టిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌‌ను నిర్వహించారు. ఈ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌కి హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘‘రాకాస’ టీంకి బిగ్ కంగ్రాట్స్. ఈ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి. నిహారిక చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఓ మూవీని ఆడియెన్స్‌కి ఎంత వరకు రీచ్ చేయాలో, ఎలా ప్రమోషన్స్ చేయాలో అన్నీ చేశారు. ఐపీఎల్ సీజన్‌లోనూ ‘రాకాస’ కోసం ఆడియెన్స్ వస్తుండటం గొప్ప విషయం. కామెడీ ఉంటే జనాలు కచ్చితంగా థియేటర్‌కు వచ్చి సినిమాని చూస్తారు. నేను ఇంకా ఈ మూవీని చూడలేదు. కాకపోతే చాలా ఎపిసోడ్స్ చూశాను. అవి చూస్తేనే సంగీత్, గెటప్ శ్రీను, నయన్, వెన్నెల కిషోర్ గారి కామెడీ చూసి పగలబడి నవ్వేశాను. అనుదీప్ బీజీఎం, పాటలు బాగున్నాయి. ఓ అమ్మాయి (మానస శర్మ) డైరెక్టర్‌గా వచ్చి ఇంకో అమ్మాయి (నిహారిక) నిర్మాతగా నిలబడి.. బ్లాక్ బస్టర్ కొట్టారంటే హ్యాట్సాఫ్. వారిద్దరూ అలా ముందుకు వెళ్తూనే ఉండాలి. మానస శర్మ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. సంగీత్ ఇలానే కంటిన్యూగా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. సమ్మర్‌లో రాబోతోన్న అన్ని చిత్రాల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘రాకాస’ని థియేటర్లో చూసి సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్. ‘రాకాస’ విజయంలో వెన్నెల కిషోర్ గారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో వెన్నెల కిషోర్ గారు షూట్ చేసి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ‘రాకాస’కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సుఖ్వేందర్ సింగ్ గారు కూడా రాకాస పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ టైంలో అనిల్ రావిపూడి గారు ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడు మళ్లీ మా కోసం ఆయన వచ్చారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కి కామెడీ అంటే అనిల్ రావిపూడి గారు గుర్తుకు వస్తారు. ఆయన సంక్రాంతికి సక్సెస్ కొట్టారు. ఇప్పుడు మేం సమ్మర్‌లో ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేశామని అనుకుంటున్నాం. క్లీన్ కామెడీ చిత్రంగా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రంగా ‘రాకాస’ నిలిచింది. ‘రాకాస’ విజయం ప్రేక్షకులదే’ అని అన్నారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. ‘అనిల్ రావిపూడి గారి సినిమాల్ని ఢీ కొట్టలేం గానీ.. ఆయన ప్రమోషన్స్‌ని ఢీ కొట్టాలని మేం అనుకున్నాం. మూవీని వీలైనంత వరకు ఆడియెన్స్ వరకు రీచ్ చేయగలగాలి. వెన్నెల కిషోర్ గారి పాత్రను సర్ ప్రైజ్‌గా ఇంట్రడ్యూస్ చేయాలని ముందు నుంచీ అనుకున్నాం. ఆయన ఎంట్రీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన నిహారిక గారు, మానస శర్మ గారికి థాంక్స్. మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ ఈవెంట్‌ను పెట్టాం. మహిళలు తరిలి వచ్చి మా సినిమాని చూస్తున్నారంటే మా కంటెంట్ వారికి నచ్చిందని భావిస్తున్నాం. మా మూవీని ఇంతలా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

నయన్ సారిక మాట్లాడుతూ .. ‘‘రాకాస’ని సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిహారిక, మానస శర్మకు థాంక్స్. థియేటర్లో చిన్న వాళ్లు, పెద్ద వాళ్లు మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తే నాకెంతో సంతోషంగా అనిపించింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్’ అని అన్నారు.

మానస శర్మ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ నాకు మొదటి ఫీచర్ ఫిల్మ్. థియేటర్లో ఆడియెన్స్‌తో కలిసి ఈ మూవీని చూశాను. నేను ఏదైతే రాసుకున్నానో.. ఏదైతో అనుకున్నానో.. ఆ సీన్లను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. నా నిర్మాతలు నిహారిక, జీ స్టూడియో, డిస్ట్రిబ్యూటర్లు సినిమా పట్ల, రిజల్ట్ పట్ల సంతృప్తిగా ఉన్నారు. వెన్నెల కిషోర్ గారి పాత్రను సర్ ప్రైజింగ్‌గా ఉంచాలని అనుకున్నాం. ఆ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. గెటప్ శ్రీను గారు మాకెంతో సపోర్ట్ చేశారు. ఈ జర్నీలో నాకు సపోర్ట్ ఇచ్చిన అన్వర్ గారు, అను… స‌మ్మర్ సెన్సేష‌న‌ల్ మూవీగా ‘రాకాస’.. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా మూడు రోజుల్లో రూ.15.80 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్‌ను సాధించిన చిత్రం

ఈ స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి థియేట‌ర్స్‌కు రప్పిస్తోన్న సినిమాగా ‘రాకాస‌’ సెన్సేష‌న్ క్రియేట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ ఈ చిత్రం అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. స‌మ్మ‌ర్‌లో ఎంటైర్ ఫ్యామిలీ థియేట‌ర్స్‌కు వ‌చ్చి సినిమాను చూసి ఎంజాయ్ చేస్తుండ‌టం ఈమ‌ధ్య కాలంలో అరుదైన‌ప్ప‌టికీ రాకాస సినిమా ఆ ఫీలింగ్‌ను మ‌ళ్లీ తీసుకొచ్చింది. ఆడియెన్స్ అంద‌రూ సినిమా చూసి కుటుంబంతో క‌లిసి చ‌క్క‌గా న‌వ్వుకుని వెళుతుండ‌టం మంచి ప‌రిణామం.

సినిమాకు ల‌భిస్తోన్న ఆద‌ర‌ణ క‌లెక్ష‌న్స్ రూపంలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌నిపిస్తోంది. రోజు రోజుకి సినిమా కలెక్ష‌న్స్ పెరుగుతుండ‌ట‌మే అందుకు కార‌ణం. మూడు రోజుల్లో రాకాస సినిమా రూ.15.80 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. సినిమాను ఆడియెన్స్ ఓన్ చేసుకున్నారు. కుటుంబంతో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లాలంటే ముందుగా ఈ సినిమాను ఆప్ష‌న్‌గా తీసుకుంటున్నారు. అందుకునే సినిమాను మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్నారు. సినిమాకు హిట్ మౌత్ టాక్ కూడా క‌లిసి రావ‌టం శుభ సూచ‌కం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్‌సీస్‌లోనూ ఈ సినిమాకు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తోంది. నార్త్ అమెరికాలో ఇప్ప‌టికే సినిమాకు 250K (రెండున్నర ల‌క్ష‌ల‌) డాల‌ర్ల వసూళ్ల‌ను సాధించ‌టం అక్క‌డ సినిమాకు ల‌భిస్తోన్నరెస్పాన్స్‌ను సూచిస్తోంది. సింపుల్ హ్యుమ‌ల్, రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతుండ‌టంతో వీకెండ్‌లో సినిమాకు తొలి ప్రాధాన్య‌మిచ్చారు.

రాకాస‌ సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. సినిమా చ‌క్క‌టి అర్థ‌వంత‌మైన కామెడీతో రూపొందింది. సంగీత్‌, గెట‌ప్ శీను ట్రాక్ ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యింది. ఇది అన్ని వ‌య‌సుల వారికి నవ్విస్తోంది. దీంతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్‌, న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. త‌న‌దైన యాక్టింగ్‌తో వెన్నెల కిషోర్ స‌న్నివేశాన్ని మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా మార్చారు.

ప్రేక్షకుల రెస్పాన్స్‌ సోషల్ మీడియాలో కూడా బలంగా కనిపిస్తోంది. థియేటర్లలో సినిమా ఎలా కనెక్ట్ అవుతుందో పోస్టులు, రియాక్షన్స్ రూపంలో స్పష్టంగా తెలుస్తోంది. వీడియోలు, కామెంట్స్‌లో పిల్లలు విజువల్స్, కామెడీ సీన్స్‌కి ఎగ్జైట్మెంట్‌తో రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అలాగే ఫ్యామిలీలు తమ థియేటర్ అనుభవాన్ని రిలాక్స్‌గా, నవ్వులతో నిండిన అవుటింగ్‌గా షేర్ చేస్తున్నారు. చాలామంది ఈ సినిమాను ‘నో-స్ట్రెస్ వాచ్’ అని, ‘పక్కా ఫ్యామిలీ థియేటర్ సినిమా’ అని అంటున్నారు. కుటుంబమంతా కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే సినిమాగా ఉండ‌ట‌మే సినిమాకు పెద్ద ప్లస్‌గా మారుతోంది.

‘రాకాస‌’ ప్రత్యేకంగా ఇంత మంచి విజ‌యాన్ని సాధించ‌టానికి కార‌ణం.. ఇది అన్ని తరాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కావ‌ట‌మే. పిల్లలు ఇందులోని ఫాంటసీ, ఊహాజనిత ఎలిమెంట్స్‌కి ఆకర్షితులవుతుంటే, పెద్దవాళ్లు హ్యూమర్, పాత్రల మధ్య ఉండే డైనమిక్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా బ్యాలెన్స్‌డ్‌గా సినిమాను రూపొందించ‌టంతో కుటుంబమంతా క‌లిసి థియేట‌ర్స్‌కు వ‌స్తోంది.

ఫ్యామిలీస్ రాకాస‌ సినిమాను బలంగా ముందుకు తీసుకెళుతుంటంతో సినిమాకు రోజు రోజుకీ ఆద‌ర‌ణ పెరుగి స‌మ్మ‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మెప్పిస్తోంది.ఇంత భారీ విజయానికి కార‌ణం కార‌ణం ఫ్యామిలీ ఆడియెన్స్ కార‌ణం. రోజు రోజుకి సినిమాకు ఆద‌ర‌ణ పెరుగుతూ సినిమా థియేట‌ర్స్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది.

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు.

Shikandi Movie Teaser Launch Event Held Grandly, Film Gearing Up for Summer Release

యువరాజ్ గౌడ, నిఖిల్, దీపక్ శెట్టి, ఖ్యాతి, నిఖిత స్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా శిఖండి. ఈ చిత్రాన్ని పోలా మూవీస్ బ్యానర్ పై పోలా ప్రవీణ్ కుమార్ నిర్మిస్తున్నారు. దర్శకుడు గురుమూర్తి.వి. రూపొందిస్తున్నారు. ఈ సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా శిఖండి సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

స్టోరీ రైటర్ సత్యదేవ్ మాట్లాడుతూ – నాకు రీసెంట్ గా తెలుగు యంగ్ హీరోతో కన్నడ తెలుగు ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఇప్పుడు ఈ ఈవెంట్ లో కన్నడ మూవీ టీమ్ ను కలుసుకోవడం హ్యాపీగా ఉంది. మహాభారతంలో శిఖండిది చాలా కీలక పాత్ర. భీష్మ పితామహుని అస్త్ర సన్యాసానికి కారణమైన పాత్ర శిఖండిది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కారణజన్ములే. ప్రతి ఒక్కరి జన్మకు కారణం ఉంటుంది. అలాంటి శిఖండి పాత్ర స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ నిఖిత స్వామి మాట్లాడుతూ – ఈ చిత్రంలో నాది శిఖండి పాత్ర అని మేకర్స్ చెప్పారు. నేను కన్నడలో హీరోయిన్ గా నటిస్తున్నాను. గ్లామర్ రోల్స్ చేస్తున్నాను. అలాంటి టైమ్ లో ఈ పాత్ర నాకు బాగుంటుందా లేదా అనే సందేహం వచ్చింది. అయితే డైరెక్టర్ గారు, ఇతర టీమ్ మెంబర్స్ విజువల్ గా మూవీ ఎలా ఉంటుందో వివరించారు. అప్పుడు నాకు ఈ క్యారెక్టర్ పై, ప్రాజెక్ట్ పై నమ్మకం ఏర్పడింది. రీసెంట్ గా కన్నడలో రిలీజ్ చేసిన ఈ చిత్ర మోషన్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్ కూడా మా సినిమాను బాగా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి నీతు వనజాక్షి మాట్లాడుతూ – శిఖండి చిత్రంలో నటిస్తుండటం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ ఈ సినిమా కథ ఎంత బాగా చెప్పారో అంత బాగా తెరకెక్కించారు. ఆయన చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ మూవీలో ఉన్నాయి. మా మూవీ టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. అన్నారు.

నటి చాందినీ మాట్లాడుతూ – శిఖండి మహాభారతంలోని పాత్ర అనే విషయం నాకు తెలియదు. నేను పెద్దగా చదువుకోలేదు. ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు భయంగా అనిపించింది. ఇప్పటిదాకా మమ్మల్ని కొజ్జా అని, చెక్క అని పిలుస్తున్నారు. ఈ సినిమా తర్వాత శిఖండి అని పిలుస్తారేమో అని భయపడ్డాను. కానీ దర్శకుడు గురుమూర్తి గారు మహాభారతంలోని ఈ పాత్ర గొప్పదనం గురించి చెప్పిన తర్వాత ఈ సినిమాలో నటించినందుకు గర్వంగా అనిపించింది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రద్యోత్తన్ మాట్లాడుతూ – నేను రామ్ గోపాల్ వర్మ గారి ఐస్ క్రీమ్ సినిమాకు మ్యూజిక్ చేశాను. ఇటీవల నా కన్నడ మూవీ ఒకటి మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రానికి బీజీఎం అందించాను. నేను తెలుగు వాడిని. మొదటిసారి నేను వర్క్ చేస్తున్న చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. నేను రచ్చ గెలిచి ఇంటికి వచ్చాను. మీరంతా మా శిఖండి మూవీని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు దీపక్ శెట్టి మాట్లాడుతూ – నేను నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిది. మా మూవీ టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమాకు టీమ్ అంతా ప్యాషనేట్ గా కష్టపడ్డారు. శిఖండి మూవీతో మీ అందరికీ గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నాం. అన్నారు.

రైటర్ ఆలపాటి మాట్లాడుతూ – నా స్నేహితుడు ప్రవీణ్ కుమార్ ఇలాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. మహాభారతంలోని శిఖండి పాత్రను ఇప్పటి వర్తమాన కాలంలోని కథకు ముడిపెట్టి ఒక మంచి మూవీని ఆయన నిర్మిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించి మరిన్ని మంచి చిత్రాలు చేసే ఉత్సాహాన్ని నా స్నేహితుడికి ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత పోలా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ – ప్రేక్షకులకు ఒక మంచిని చెప్పాలంటే సినిమా మాధ్యమమే సరైనది. శిఖండి లాంటి మంజి సబ్జెక్ట్ తో సినిమా నిర్మిస్తుండటం గర్వంగా ఉంది. ఈ సినిమాలో లవ్, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్..ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మా సినిమా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. మా మూవీ మోషన్ పోస్టర్ , టీజర్ ను దేశంలోని వివిధ నగరాల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. ఈ రోజు హైదరాబాద్ లో తెలుగు ఆడియెన్స్ ముందు మా మూవీ టీజర్ రిలీజ్ చేసుకున్నాం. మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఒక ఫ్యామిలీలా మూవీ కోసం కష్టపడ్డారు. త్వరలోనే శిఖండి చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.

నిర్మాత పోలా లక్ష్మి మాట్లాడుతూ – సినిమా చూసి మనం వెంటనే బాగా లేదు అనేస్తాం. కానీ ఒక సినిమా మేకింగ్ కు ఎంతమంది కష్టపడతారో చూస్తే అలా చెప్పడానికి మనసు రాదు. నేను కూడా ఏదైనా సినిమా చూడగానే బాగా లేదని చెప్పేదాన్ని. కానీ ఈ సినిమా సెట్ కి వెళ్లాక అలా చెప్పకూడదని నిర్ణయించుకున్నా. ఈ సినిమా షూటింగ్ ముగిశాక ఒక ఫ్యామిలీకి దూరమవుతున్న ఫీలింగ్ కలిగింది. అన్నారు.

హీరోయిన్ ఖ్యాతి మాట్లాడుతూ – శిఖండి సినిమాలో డాక్టర్ సంగీత క్యారెక్టర్ లో నటిస్తున్నాను. తను పేదల కోసం ఒక ఆస్పత్రి నిర్మించాలనుకున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి, ఆ సమస్యల్ని ఎవరెవరు ఎలా పరిష్కరించారు అనేది మూవీలో మా డైరెక్టర్ గురుమూర్తి ఆసక్తికరంగా తెరకెక్కించారు. అన్నారు.

నటుడు ఆనంద్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను కామెడీ రోల్ లో నటించాను. మా మూవీ టీమ్ అంతా తెలుగులో మాట్లాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటే వారికి తెలుగు వారు అన్నా, తెలుగు భాష అన్నా చాలా ఇష్టం. అన్నారు.

డైరెక్టర్ గురుమూర్తి.వి. మాట్లాడుతూ – మాలశ్రీ ప్రధాన పాత్రలో నటించిన మారణాస్త్ర నా తొలి సినిమా. ఆ మూవీ తెలుగులో మారణాయుధం పేరుతో రీమేక్ అయ్యింది. ఎలాంటి కథతో రెండో సినిమా చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో మహాభారతంలో శిఖండి పాత్ర నేపథ్యంగా చేయాలని అనిపించింది. మా ప్రొడ్యూసర్ గారికి రెండు సార్లు కథ చెప్పినా ఆయనకు కనెక్ట్ కాలేదు. మూడో సారి వెళ్లి సినిమా బిగినింగ్, ఇంటర్వెల్, ఎండింగ్ ఎలా ఉంటుందో డీటెయిల్డ్ గా చెప్పాను. వెంటనే మనం ఈ సినిమా చేద్దామని అంగీకరించారు. ఈ సినిమా విషయంలో మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. శిఖండి అంటే దైవ స్వరూపిణి. మహాభారతంలోని ఈ పాత్రకు ఇప్పటి కలియుగంలోని కథకు ముడిపెడుతూ ఎలా సినిమా చేశాం అనేది థియేటర్ లో చూడాలి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హార్ట్ టచింగ్ ఫీల్ తో బయటకు వస్తారు. అన్నారు.

హీరో యువరాజ్ గౌడ మాట్లాడుతూ – శిఖండి మూవీ కథ విన్నప్పుడు ఈ చిత్రంపై నాకు పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. కానీ ఇప్పుడు టీజర్ చూశాక వందరెట్లు నమ్మకం పెరిగింది. మేము శిఖండి అనే సినిమా చేశామని గర్వంగా చెప్పుకుంటాం. ఈ సినిమాలో మహాభారతం నుంచి ఒక గొప్ప విషయాన్ని మా డైరెక్టర్ గురుమూర్తి గారు చెబుతున్నారు. ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు నిఖిల్ మాట్లాడుతూ – నా దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ కథ వింటున్నప్పుడే సినిమా ఎలా ఉంటుందనేది ఊహించుకోగలిగాను. దీపక్ శెట్టి గారితో నాకు కాంబినేషన్స్ సీన్స్ ఉంటాయి. మేమిద్దరం యాక్షన్ సీక్వెన్సులు చేశాం. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. డబ్బుల కోసం, టైమ్ షెడ్యూల్స్ కోసం ఆలోచించలేదు. ప్రేక్షకులకు ఒక మంచి మూవీ ఇవ్వాలనే అంతా ప్రయత్నించాం. మా ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

నటీనటులు – యువరాజ్ గౌడ, నిఖిల్ మలియక్కల్, దీపక్ శెట్టి, నిఖితస్వామి, నీతు వనజాక్షి, రాఘవేంద్ర, ఖ్యాతి, నయన, విజయ్ చెందూర్, బలరాజవాడి, చాందినీ, తదితరులు

టెక్నికల్ టీమ్
యాక్షన్ – మారుతి
ఎడిటర్ – చక్రం సాయి
డీవోపీ – స్వామి మైసూర్
బీజీఎం – ప్రద్యోత్తన్
మ్యూజిక్ – మంజుకవి
డైలాగ్ రైటర్ – దయాశంకర్ జీఎం
బ్యానర్ – పోలా మూవీస్
ప్రొడ్యూసర్ – పోలా ప్రవీణ్ కుమార్
పీఆర్ఓ -రాధవాసంశెట్టి
డిజిటల్ హెడ్ రమేష్
స్క్రిప్ట్, డైరెక్షన్ – గురుమూర్తి. వి.

Grand Launch of “Kotha Kothaga” Song Album Directed, Produced, and Acted by Srija

యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సాంగ్ ఆల్బమ్ “కొత్త కొత్తగా”. ఈ సాంగ్ లో “దేవగుడి” మూవీ ఫేమ్ హీరో అభినవ్ శౌర్య హీరోగా నటించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతాన్ని అందించారు రఘురామ్. సింగర్ లిప్సిక పాడారు. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో

నిర్మాత డీవై చౌదరి మాట్లాడుతూ – శ్రీజ చాలా ప్రతిభావంతురాలు. మేము నిర్మించిన సీరియల్స్ లో నటించింది. ఇంకా ఏదో సాధించాలనే తపన ఆమెలో కనిపించేది. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లో తనే నటించి నిర్మించి, దర్శకత్వం వహించింది. ఈ సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్ లా రిచ్ గా రూపొందించింది శ్రీజ. ఆమెతో పాటు అభినవ్ శౌర్యకు కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటి పొట్టి విజయ మాట్లాడుతూ – శ్రీజ అందమైన హీరోయిన్ మాత్రమే కాదు అందమైన వ్యక్తిత్వం గల అమ్మాయి. ఆమె తనతో నటించే తోటి ఆర్టిస్టులను ఎంతో ఆదరంగా చూసుకుంటుంది. కొత్త కొత్తగా సాంగ్ చాలా బాగుంది. ఆమె ఇప్పుడు నిర్మాత, దర్శకురాలు అయ్యింది కనుక మాలాంటి వారికి అవకాశాలు ఇస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

నటి మేఘన చౌదరి మాట్లాడుతూ – శ్రీజ నాకు మంచి ఫ్రెండ్. ఆమె శ్రీజ మ్యూజిక్ అని ఛానెల్ పెట్టి మంచి సాంగ్స్ చేస్తోంది. తను నిర్మాతగా, డైరెక్టర్ గా మారడం గర్వంగా ఉంది. కొత్త కొత్తగా సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్ చూసిన ఫీల్ కలుగుతోంది. ఆమె ఇలాంటి మరిన్ని సాంగ్స్ చేయాలి. అన్నారు.

నటి సంధ్య మాట్లాడుతూ – కొత్త కొత్తగా సాంగ్ ఎంత బాగుందో, ఈ పాటలో శ్రీజ, అభినవ్ శౌర్య పర్ ఫార్మెన్స్ లు కూడా అంతే బాగున్నాయి. వీళ్లిద్దరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ సాంగ్ ను మ్యూజిక్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

నటుడు ఫణి మాట్లాడుతూ – శ్రీజ ఈ పాటలో సాఫ్ట్ గా కనిపిస్తుంది గానీ ఆమె చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది. మాతో జబర్దస్త్ షో చేసేప్పుడు శ్రీజ ఎంత ఎనర్జిటిక్ గా, అగ్రెసివ్ గా ఉంటుందో అర్థమైంది. జెమినీ టీవీలోనూ నాతో ఒక ప్రోగ్రాం చేసింది. మంచి స్థాయికి ఎదగాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటుంది. సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ తోనూ మనల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. శ్రీజ చేసిన ఈ సాంగ్ ఆల్బమ్ ఆమెకు పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ – దేవగుడి చిత్రంతో నాకు హీరోగా జన్మనిచ్చారు బెల్లం రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ కూడా ఆయన సపోర్ట్ తోనే చేయగలిగాను. శ్రీజతో కలిసి ఈ సాంగ్ చేయడం హ్యాపీగా ఉంది. ఆమెకు పట్టుదల ఎక్కువ. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా చాలా క్లారిటీగా ఉంటుంది. తను అనుకున్న ఔట్ పుట్ వచ్చేవరకు ప్రయత్నిస్తుంది. ఈ పాటకు స్టెప్స్ నేనే కొరియోగ్రాఫ్ చేశాను. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. హీరోగా స్క్రిప్ట్స్ వింటున్నా. మంచి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ చేయాలనుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ శ్రీజ మాట్లాడుతూ – మా కొత్త కొత్తగా సాంగ్ ను లాంఛ్ చేసిన ప్రొడ్యూసర్ డీవై చౌదరి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. వారి ప్రొడక్షన్ లో నేను సీరియల్స్ లో నటించాను. నాకు నటన అంటే ప్యాషన్. రంగస్థలం సినిమాలో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత మరికొన్ని మూవీస్ లోనూ నటించాను. టీవీ ఛానెల్స్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, జూ లకటక షోస్ చేశాను. శ్రీజ మ్యూజిక్ ఛానెల్ లో మేము చేసిన సాంగ్స్ అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ చేశాం. ఈ పాటను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశాం. బడ్జెట్ ఎంతయ్యింది అనేది చూసుకోలేదు. ఈ సాంగ్ లో కొంత షూట్ మా ఇంట్లోనే చేశాం. కొత్త కొత్తగా సాంగ్ ను మీరంతా విని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

బీఆర్ఎస్ మహిళా వింగ్ మణికొండ ప్రెసిడెంట్ పటోళ్ల రూప రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త కొత్తగా ఆల్బమ్ మంచి విజయం సాధించాలని తన బెస్ట్ విశెస్ అందించారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీజ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Veteran director V.N. Aditya released the first look of ‘Vichitra’

సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫైద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాత గా రూపొందించిన “విచిత్ర” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు..

ఈ సందర్బంగా దర్శకుడు మరియు నిర్మాత సైఫైద్దీన్ మాలిక్ మాట్లాడుతూ ..ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం, ముందుగా దర్శకుల సంఘం ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ గెలుపొందిన వి.ఎన్ ఆదిత్య గారికి ముందుగా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు, పోస్టర్ రిలీజ్ కు విచ్చేసిన దర్శకులు వి.ఎన్ ఆదిత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మా విచిత్ర సినీమా చాలా బాగా వచ్చింది..వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తుంది..మీ అందరి సపోర్ట్ కావాలని కోరారు.

ప్రముఖ దర్శకులు వి.ఎఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. విచిత్ర సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది..ఇంతకు ముందే ట్రయిలర్ చూసాను చాలా బాగుంది..ధనుంజయ్ రావ్ ఇలపండ లాంటి టెక్నీషియన్ పెట్టుకొని అద్బుతంగా తెరకెక్కించారు.. కడలి రాంబాబు పబ్లిసిటీ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతుంది.. తప్పకుండా విచిత్ర పెద్ద హిట్ అవుతోంది.. ఆల్ థ బెస్ట్ టీమ్ తెలిపారు

కో డైరెక్టర్ ధనుంజయ్ రావ్ ఇలపండ మాట్లాడుతూ…మీడియా మిత్రులకు నమస్కారం..విచిత్ర సినిమా చాలా కొత్తగా ఉంటుంది.. ప్రతి తల్లి గుండెకు హత్తుకునేల ఉంటుంది.. సెన్సర్ మెంబెర్స్ కూడా సినిమా ని మెచ్చుకున్నారు, మే 22 రిలీజ్ అవుతుంది..ప్రేక్షకుల దీవెనలు , మీడియా సపోర్ట్ కావాలని కోరారు

నటీనటులు జ్యోతి అపూర్వజ్, రవి , శ్రేయ తివారి, బేబీ శ్రీ హర్షిణి, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, జబర్దస్త్ ఉద్ధండులు అప్పారావు, త్రినాథ్, సత్తిపండు, బాబీ తదితరులు అద్భుతంగా నటించారు.

టెక్నీషియన్స్ స్టోరీ సీస్ ఫిలిమ్స్
కో డైరెక్టర్: ధనుంజయరావు ఇలపండ. ఎడిటింగ్ :కడిమిశెట్టి లక్ష్మీనారాయణ, సంగీతం: నిజాని అంజన్, పి. ఆర్. ఓ :కడలి రాంబాబు,
నిర్మాత దర్శకత్వం :సైఫుద్దీన్ మాలిక్

‘Vega Leela’ First Look Poster Released – Movie Grand Release in August

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న వేగ లీల సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్‌లో కనిపిస్తున్న డిజైన్, కలర్ టోన్ మరియు టైటిల్ స్టైలింగ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని ఘంటసాల నాగ విశ్వనాథ్ రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. స్ప్లాష్ కలర్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై, శ్రీ లక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్ ,జశ్రీత ప్రొడక్షన్స్ మరియు రితికా ఫిలిమ్స్ సంస్థలతో కలిసి ఈ చిత్రం రూపొందుతోంది. నిర్మాతలుగా సాయి కుమార్ మెడి మరియు జయ వేణు బాబు వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా ఆగష్టు లో విడుదలకు సన్నాహాలకు ప్లాన్ చేస్తున్నారు . సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. మరియు పవన్ చరణ్ అందిస్తున్నారు. అలాగే పవన్ చరణ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి సినిమా కావటం విశేషం. సినిమాటోగ్రఫీని దిలీప్ కుమార్ చిన్నయ్య హ్యాండిల్ చేస్తున్నారు.

మొత్తానికి, ఫస్ట్ లుక్‌తోనే వేగ లీలా సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కథ, నటీనటులు మరియు టీజర్/ట్రైలర్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

సాంకేతిక వర్గం :

డి ఓ పి :దిలీప్ కుమార్ చిన్నయ్య
ఎడిటర్ :దిలీప్ కుమార్
క్రియేటివ్ హెడ్ :వేణు నిఖిల్
కో డైరెక్టర్ :స్రవంతి
కో ప్రొడ్యూసర్స్ :శ్రీకాంత్ వేంపరాల (usa)విక్రమ్ గార్లపాటి (usa ),విశ్వనాధ్ మంచి కలపతి (usa),వెంకట్ చిలకాల (usa),మహీంద్ర అరవపల్లి (usa),స్వాతి.వై, రామ్ భూపతి, దిలీప్ కుమార్ చిన్నయ్య,
పబ్లిసిటీ డిజైనర్ :దేవ్ హీమ్ ఎడిట్స్
సమర్పణ :స్పలాష్ కలర్ మీడియా, శ్రీలక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్, రితిక ఫిలిమ్స్, జస్రిత ప్రొడక్షన్స్, సెటిలకింగ్, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్(CEO Rajeev)
మ్యూజిక్ :జి వి & పవన్ చరణ్
ప్రొడ్యూసర్స్ :సాయికుమార్ మేడి, జయ వేణు బాబు
రైటర్ & డైరెక్టర్ :ఘంటసాల నాగ విశ్వ నాథ్.

Raghu Kunche’s ‘Gedela Raju’ trailer launched by journalist friends.Movie releasing on April 17th

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం “గేదెల రాజు”. ఈ సినిమాలో రవి ఆనంద్‌ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. మోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మిస్తున్నారు. “గేదెల రాజు” సినిమా నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జర్నలిస్ట్ మిత్రుల చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో

నటి శ్రావ్య మాట్లాడుతూ – జర్నలిస్ట్ మిత్రుల చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. మా మూవీని మీరే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలి. రఘు కుంచె గారితో కలిసి నటించడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీ అందరినీ ఇంప్రెస్ చేసేలా ఉంటుంది. అన్నారు.

నటి మౌనిక మాట్లాడుతూ – మా “గేదెల రాజు” సినిమా ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో సినిమా అంతకంటే బాగా ఉంటుంది. ఈ సినిమాకు రఘు కుంచె గారి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. ఈ నెల 17న థియేటర్స్ లో సినిమా చూసి మీ రెస్పాన్స్ తెలియజేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు రవిఆనంద్ చిన్నిబిల్లి మాట్లాడుతూ – మా టీమ్ అంతా ఎంతో ప్యాషనేట్ గా కష్టపడి పనిచేసిన సినిమా ఇది. ఈ సినిమాకు దాదాపు అందరూ కాకినాడ వాళ్లే వర్క్ చేశారు. రఘు కుంచె గారు మా అందరికీ మంచి గైడెన్స్ ఇచ్చి ముందుండి నడిపించారు. మాలాంటి కొత్త వాళ్లకు మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.

కో ప్రొడ్యూసర్ తాడాల వీరభద్రరావు మాట్లాడుతూ – రఘు కుంచె గారు మంచి మ్యూజిక్ తో పాటు ఈ సినిమాలో తన నటనతో మనందరినీ ఆకట్టుకుంటారు. గేదెల రాజు సినిమా ప్రేక్షకులకు కావాల్సిన ఎన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా. మిమ్మల్ని థియేటర్స్ లో బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ వాణి రవికుమార్‌ మోటూరి మాట్లాడుతూ – డైరెక్టర్ చైతన్య మోటూరి మా అబ్బాయి. అతనికి సినిమా మీద ఉన్న ప్యాషన్ ను ఎంకరేజ్ చేయాలని ఈ సినిమా నిర్మించాం. ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. మా అబ్బాయిని దర్శకుడిగా మీరంతా ఆశీర్వదిస్తారని, మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

నటుడు రామచంద్రం మాట్లాడుతూ – నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పటి నుంచి ఈ మూవీ డైరెక్టర్ చైతన్య నాకు పరిచయం. నటుడిగా నాకు ఇది ఫస్ట్ మూవీ. మా సినిమా మీద పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. అందుకే మీడియా మిత్రులతో మా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశాం. ఈ నెల 17న థియేటర్స్ కు రండి, తప్పకుండా మూవీని ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

నటుడు కిష్టయ్య మాట్లాడుతూ – రఘు కుంచె గారికి రాని విద్య ఏదైనా ఉందా అని సందేహం. ఆయన నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. ఒక ఎస్వీఆర్ ను, కైకాల సత్యనారాయణ గారిని గుర్తుకుతెస్తారు. ఎస్పీ బాలు, ఘంటసాల గారిలా ఆయనది మంచి గాత్రం. ఆయన తన కంపోజింగ్ తో ఇళయరాజాను గుర్తుకుతెస్తారు. అన్నారు.

నటుడు, చిత్ర సమర్పకులు రఘు కుంచె మాట్లాడుతూ – ప్రతి సినిమాకు పనిచేసిన వారు మేము కష్టపడ్డామనే చెబుతుంటారు. మా సినిమా బాగుందనే అంటారు. మేము ఎవరెన్ని చెప్పినా థియేటర్స్ కి ప్రేక్షకుల్ని రప్పించేది కంటెంట్ మాత్రమే. సినిమా రిలీజ్ అయ్యాక ఆ మూవీలో కంటెంట్ ఉందని ప్రేక్షకులు అనుకుంటే తప్పకుండా సినిమాను ఆదరిస్తారు. మా మూవీలో మంచి కంటెంట్ ఉందని మేము నమ్ముతున్నాం. ఈ ట్రైలర్ తో మా మూవీ మీద మీకొక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ట్రైలర్ నచ్చి మా మూవీ బాగుంటుందని మీకు అనిపిస్తే ఈ నెల 17న థియేటర్స్ కు వచ్చి మా సినిమాను సక్సెస్ చేయండి. అన్నారు.

డైరెక్టర్ చైతన్య మోటూరి మాట్లాడుతూ – గేదెలరాజు కాకినాడ తాలూక ఈ సినిమాకు మేము పెట్టిన క్యాప్షన్ చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు. ఈ క్యాప్షన్ లోనే కథ సారం ఉంది. గేదెల రాజు కథ ఇదే. ఒక మర్డర్ మిస్టరీని, ఒక క్రైమ్ థ్రిల్లర్ ను రెండు గంటల ఒక్క నిమిషం నిడివిలో క్రిస్ప్ గా తెరకెక్కించాం. ఫస్ట్ సీన్ నుంచే కథలోకి వెళ్తారు. ఈ మూవీలో హీరోలు, విలన్స్ ఎవరూ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి. ఆ పాత్రల యొక్క లైఫ్ మాత్రమే ఉంటుంది. సినిమా చివరి 40 నిమిషాలు చాలా స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మేము ప్రేక్షకుల ఒక్క రూపాయి గానీ ఒక్క నిమిషం గానీ వృథా చేయాలనుకోవడం లేదు. అందుకే క్రిస్పీగా ఇంతమంచి సినిమా ఇచ్చేందుకు కష్టపడ్డాం. మలయాళ సినిమాలు బాగుంటాయని మనం అనుకుంటాం, మలయాళం వాళ్లు తెలుగు సినిమాలు బాగా తెరకెక్కిస్తారని అంటారు. అలా వాళ్లు చెప్పుకునేలా మా గేదెల రాజు సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం మేము చాలా ప్రయోగాలు చేశాం. పల్లెటూరి కొత్త గాయకులతో పాటలు పాడించాం. రఘు గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఈ సినిమాలో లీడ్ రోల్ తో పాటు మ్యూజిక్ ఇచ్చారు ఓ పాట పాడారు. ఆ పాటను నేను ఎన్నోసార్లు విన్నాను. అలాగే సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మేకింగ్ లో మేము ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 84 లొకేషన్స్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను సాధ్యమైనంత బాగా తెరకెక్కించాం. రెండున్నర నిమిషాల ఫైట్ సీక్వెన్స్ ను అరవై మంది కొత్తవాళ్లతో చేశాం. అలాగే కాకినాడలో రియల్ క్రౌడ్ మధ్య షూటింగ్ జరిపాం. ఈ సినిమాకు నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఓ పుస్తకం రాయాలి. సక్సెస్ మీట్ లో వారి గురించి మాట్లాడుతా. అన్నారు.

నటీనటులు – రఘు కుంచె, రవి ఆనంద్‌, చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక, తదితరులు

టెక్నికల్ టీమ్ – సహ నిర్మాతలు– రవిఆనంద్‌ చిన్నిబిల్లి, తాడాల వీరభద్రరావు, గీతార్థ్‌ కుంచె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌– కిరణ్‌ తాతపూడి , దివ్య మోటూరి, పబ్లిసిటి డిజైనర్‌– ఏజే ఆర్ట్స్‌ అజయ్, విఎఫ్‌ఎక్స్‌– కొత్తపల్లి సునీల్, లిరిక్స్‌– గిరిధర్‌ రాగోలు, లలిత కాంతారావు ఎడిటర్‌– సుధీర్‌ ఎడ్ల, కాస్ట్యూమ్‌ డిజైనర్‌– సింధూ ధిలీషా, పిఆర్‌ఓ– శివ మల్లాల, మూర్తి మల్లాల, ఆర్ట్‌– అమర్‌ తలారి, చీఫ్ అసోసియేట్- గౌరి శంకర్ కో డైరెక్టర్‌– శేఖర్‌ కుంపట్ల, సంగీతం– రఘు కుంచె, నిర్మాత– వాణి రవికుమార్‌ మోటూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే దర్శకత్వం– చైతన్య మోటూరి

Voice of Dalit organizations in support of Ayyanna ✊

దళిత సంఘాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో, గౌరవ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి మద్దతు ప్రకటించాయి.

ఇటీవల వెలుగులోకి వచ్చిన పరిణామాల నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే గణేష్ తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని సంఘాలు డిమాండ్ చేశాయి ⚠️

డాక్టర్ సుధాకర్ గారి మరణానికి ముందు జరిగిన ఘటనలపై సంచలన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంటూ, సంబంధిత వీడియోలను దళిత సంఘాలు విడుదల చేశాయి 🎥

ఈ విషయాన్ని సభాపతి అయ్యన్నపాత్రుడు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని సంఘాలు పేర్కొన్నాయి 🙏

ఇక సుధాకర్ కుటుంబానికి పరామర్శ తెలియజేసి, ఆర్థిక సాయం మరియు ప్రభుత్వ ఉద్యోగం అందించేందుకు ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు 🤝

సుధాకర్ మృతికి కారణమైన వారంతా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి 🔥

#YCPAntiDalit

Amba’s Revenge – First AI-Based Telugu Feature Film Announced

Marking a technological milestone in the Telugu film industry, “Amba’s Revenge” is set to become the first full-length Telugu feature film created with the support of Artificial Intelligence (AI). The title poster of the film was unveiled on the occasion of
Hanuman Vijayotsavam .

Produced by Srikanth Reddy Kunduru and co-produced by Rani Madison, the film is being developed under the creative direction of Jayavardhan Madi. The project draws inspiration from the powerful character Amba from the Mahabharata and presents her story through a fresh and innovative mythological narrative using advanced AI technology. The film is being jointly produced by Sri Lalitakala Chitralu and Nakka Thoka Films.

Speaking on the occasion, producer Srikanth Reddy Kunduru and creative director Jayavardhan Madi said that the project marks the beginning of a new experimental phase in Telugu cinema. They explained that cutting-edge AI tools are being used in visual design, character creation, and narrative development to present the story in a unique cinematic style. The title poster release on
Hanuman Vijayotsavam is the first step in introducing the project to audiences, and more details will be announced soon.

The film is being seen as a significant step toward AI-driven storytelling in Telugu cinema. By blending mythology with modern technology, “Amba’s Revenge” has already generated curiosity and interest among movie lovers and industry observers alike.

Producer: Srikanth Reddy Kunduru
Co-Producer: Rani Madison
Creative Director: Jayavardhan Madi
PRO: Ashok Dayyala