Home Blog Page 24

Hero Santosh Shoban’s ‘Couple Friendly’ Success Celebretions held grandly

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా డే 1 వరల్డ్ వైడ్ 1.89 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. “కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు. ఈ రోజు ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో

డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా రిలీజ్ ముందు ఇది ప్రేక్షకులకు గుర్తుండిపోయే ప్రేమ కథ అవుతుందని చెప్పాను. నా మాటను నిజం చేస్తూ ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించారు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొదటగా దర్శకుడు అశ్విన్ కే ఇవ్వాలి. హానెస్ట్ గా సినిమాను రూపొందించాడు. యూవీ వంశీ, విక్కీ ఎంతో ప్యాషనేట్ గా ఈ సినిమాను నిర్మించారు. ఓ పెద్ద సినిమాకు తీసుకున్న శ్రద్ధ ఈ సినిమాకూ తీసుకుని దగ్గరుండి అన్ని వర్క్స్ చూసుకున్నారు. సంతోష్ శోభన్ టాలెంటెడ్ యాక్టర్. ప్రేమ కథా చిత్రాలకు ఆయన చిరునామా కావాలి. నాతో మాట్లాడిన దర్శక నిర్మాతలు సంతోష్ తో లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని అంటున్నారు. సంతోష్, వారణాసి, యూవీ సంస్థ నేనూ కలిసి మరో ప్రేమ కథను చేయబోతున్నాం. ఆ సినిమా వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకు రిలీజ్ చేస్తాం. ఈ లవ్ ను ప్రేక్షకులకూ పంచేందుకు ఓ కాంటెస్ట్ రన్ చేస్తాం. మీకు మీ పార్టనర్ కు ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోయిన గిఫ్ట్ ను మేము అందించాలని అనుకుంటున్నాం. సంతోష్, మానసతో ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాజు.పి. మాట్లాడుతూ – కపుల్ ఫ్రెండ్లీ మూవీ కథ విన్నప్పుడే ఈ చిత్రాన్ని హానెస్ట్ గా, జెన్యూన్ గా నిర్మించాలని అనుకున్నాం. సంతోష్, మానస కూడా వేరే మూవీస్ చేయకుండా కేవలం ఈ ప్రాజెక్ట్ మీదే దృష్టిపెట్టారు. ఆర్నెళ్ల ముందు ఈ మూవీ రెడీ అయినా, వాలెంటైన్స్ డేకు కరెక్ట్ గా ఉంటుందని ఆగి రిలీజ్ చేశాం. మా మూవీకి సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ – మా మూవీని ప్రేక్షకుల దగ్గరకు బాగా రీచ్ చేసిన మీడియాకు థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్లే మా సినిమా ఇంకా పెద్ద రేంజ్ కు వెళ్తోంది. మా టీమ్ తో పాటు థియేటర్స్ కు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ చూశాను. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ ఉంది. ఈ ఆదరణ ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ – ప్రీమియర్స్ నుంచే మా మూవీకి మీరు ఇస్తున్న రెస్పాన్స్ మాకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్, మీడియా నుంచి వస్తున్న రివ్యూస్, సోషల్ మీడియాలో మా మూవీ గురించి వస్తున్న స్పందన ఇవన్నీ చూసి మా మనసు నిండిపోతోంది. మీ పర్సనల్ లైఫ్ లోని లవ్ మూవ్ మెంట్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు. సంతోష్ లాగే నేనూ ఓ మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ వచ్చాం. మేము కోరుకున్న సినిమా, మేము చేయాలనుకున్న కథ ఈ సినిమాతో మాకు దక్కింది. ధీరజ్ గారు మా మూవీకి ఎనర్జీ తీసుకొచ్చారు. అజయ్ గారు ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఈ విజయానికి కారణం. అన్నారు.

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ – థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాలి అనేది మా కల. ఈ రోజు ఇన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సక్సెస్ కోసం కొన్నేళ్లుగా వేచి చూస్తున్నా. ఒక మంచి కథను హానెస్ట్ గా తెరకెక్కిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. నా ఫ్యామిలీ లాంటిది యూవీ సంస్థ. మా అజయ్ అన్నకు ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం ఇవ్వాలి. మా కంటే ఎక్కువ ఎనర్జీతో మా ధీరజ్ థియేటర్స్ విజిట్ కు వస్తున్నారు. మానస ఇంకా మరెన్నో మంచి మూవీస్ చేస్తుంది. ఆమె మా సినిమాకు ప్రాణంలా నిలిచింది. ఒక మంచి దర్శకుడు అశ్విన్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశామనే అప్రిషియేషన్స్ వస్తున్నాయి. కపుల్ ఫ్రెండ్లీ విజయం ఒక బాధ్యతను ఇచ్చింది. ఈ బాధ్యతను గుర్తుపెట్టుకుంటూ మీకు నచ్చే మంచి మూవీస్ చేయాలనుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్

“Couple Friendly” Collects ₹1.89 Crores Worldwide on Day 1

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు డే 1 వరల్డ్ వైడ్ 1.89 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. హార్ట్ టచింగ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ అందరి ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

“కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్

Rebel Star Prabhas Praises “Couple Friendly” Movie in Instagram Post

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశారు రెబల్ స్టార్ ప్రభాస్. తనకు వర్షం సినిమాలా, సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ గుర్తుండిపోయే మూవీ అవుతుందని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

ఇదొక లవ్ లీ బ్యూటిఫుల్ ఫిలిం అని, ఈ చిత్రాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేశానంటూ ప్రభాస్ తెలిపారు. సంతోష్, మానస జోడీ అద్భుతంగా ఉందని, అశ్విన్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించారని ప్రభాస్ ప్రశంసించారు. ఇలాంటి మంచి కథలను తెరపైకి తీసుకొచ్చిన కో ప్రొడ్యూసర్ అజయ్, యూవీ క్రియేషన్స్ కు ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు.

కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ రూపొందించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేశారు

I Felt Like I Won When Prabhas Appreciated ‘Couple Friendly’ – Hero Santosh Shobhan at Success Celebrations

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు. “కపుల్ ఫ్రెండ్లీ” సక్సెస్ సాధించిన నేపథ్యంలో మూవీ టీమ్ హైదరాబాద్ గోకుల్ థియేటర్ లో ప్రేక్షకుల సమక్షంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ – గోకుల్ థియేటర్ లో ఎన్నో సినిమాలు చూశాను. ఈ రోజు నేను నటించిన మూవీని ప్రేక్షకులందరితో కలిసి చూడటం సంతోషంగా ఉంది. మా సినిమాను ప్రభాస్ అన్న చూసి ప్రశంసించారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రభాస్ అన్న అప్రిషియేట్ నేను గెలిచాను అనే ఫీల్ కలిగించింది. ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఇది కంప్లీట్ లవ్ స్టోరీ, వాలెంటైన్ డే సీజన్ లో వస్తున్న పర్పెక్ట్ జానర్ మూవీ ఇది అని చెబుతూ వచ్చాం. ఇలాగే మా సినిమాను థియేటర్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.

హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ – కపుల్ ఫ్రెండ్లీ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మీ అందరి ఎనర్జీ చూస్తుంటే హ్యాపీగా ఉంది. వాలెంటైన్ డేను మా మూవీ చూస్తూ ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కు మా సినిమా చూసిన ఫీల్ ను షేర్ చేయండి. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – మా సినిమాను ప్రభాస్ గారు చూసి తన ప్రశంసలు అందించారు. ఆయనకు వర్షం సినిమాలా సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ అని ఆయన పోస్ట్ చేశారు. ప్రభాస్ గారి అప్రిషియేషన్ తో మేమంతా చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం. ఈ సినిమాతో సంతోష్ 2.ఓ స్టార్ట్ అవుతోంది. ఈ ఏడాది ఆయన పెద్ద హీరో అవుతారు. మానస వారణాసి పర్ ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెబుతున్నారు. డైరెక్టర్ అశ్విన్ నెక్ట్స్ తెలుగులోనే మూవీ చేయాలి. ఆయన హైదరాబాద్ షిఫ్ట్ కావాలి. నేను ఈ సినిమా చూసినప్పుడు బాగా నమ్మాను. ఖచ్చితంగా హిట్ అవుతుందని డిస్ట్రిబ్యూట్ చేశాను. కపుల్ ఫ్రెండ్లీతో నేను ఈ ఏడాది సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేశాను. ఈ వీక్ అంతా ప్రేక్షకుల్ని కలుస్తూనే ఉంటాం. మీరంతా ఇలాగే మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ – మా కపుల్ ఫ్రెండ్లీ సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీరంతా వాలెంటైన్స్ డేను మా మూవీ చూస్తూ సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే హ్యాపీగా ఉంది. మా సినిమాను చూసి అప్రిషియేట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి కృతజ్ఞతలు. అన్నారు.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్

”Band Melam Will Definitely Become a Blockbuster” – Successful Director Bobby at the Glimpse Launch Event

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. ఈ మూవీని మార్చి 13న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ని వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ గ్లింప్స్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌‌కి దర్శకుడు బాబీ, రచయిత బీవీఎస్ రవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్‌ని వాలెంటైన్స్ డేకి రిలీజ్ చేయండి అని నేను ఒత్తిడి చేశాను. గ్లింప్స్ చూసిన వెంటనే రోషన్ నంబర్ కనుక్కుని ఫోన్ చేసి మాట్లాడాను. ఫ్యూచర్‌లో రోషన్ పెద్ద స్టార్ అవుతాడు. ఎంతో కూల్‌‌గా నటించేశాడు. నా లవ్ స్టోరీ అంటే సుకుమార్ గారికి చాలా ఇష్టం. ‘నీ కథని నువ్వు తీస్తావా? నేను తీయాలా?’ అని సుకుమార్ గారు అంటుంటారు. ‘సార్ నేనే తీస్తాను అని’ ఆయనతో చెబుతుంటాను. నేను లవ్ స్టోరీ తీస్తే కచ్చితంగా రోషన్‌తోనే తీస్తాను. శ్రీదేవీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ చిత్రంలో ఆమె అద్భుతంగా నటించింది. ఇలానే ఆమెకు ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. సతీష్ జవ్వాజీ చూస్తే సైలెంట్‌గా ఉంటాడు కానీ మంచి సెటైర్లు వేస్తుంటాడు. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా తరువాత మగాళ్ల మెడల్లో తాళిబొట్టు కనిపిస్తుందేమో అని కంగారు పడుతున్నాను. ఆయన రైటింగ్, కన్విక్షన్ అన్నీ కూడా అక్కడే అర్థం అవుతున్నాయి. విజయ్ బుల్గానిన్‌తో త్వరలోనే పని చేయాలని కోరుకుంటున్నాను. సతీష్ ముత్యాల గారి విజువల్స్ బాగున్నాయి. కోన గారికి డబ్బులు వస్తే మాకు డబ్బులు వచ్చినట్టే. ‘నిన్ను కోరి’ టైంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో మళ్లీ ఇప్పుడు అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా చాలా పెద్ద స్థాయిలో సౌండ్ చేస్తుంది’ అని అన్నారు.

నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘శివ నిర్వాణ 2017లో నా ఆఫీస్‌కు వచ్చాడు. శివ తుర్లపాటి శివ నిర్వాణని పరిచయం చేశాడు. శివ నిర్వాణ చెప్పిన కథ చాలా నచ్చింది. అది గుర్తుండిపోయే చిత్రం అవుతుందని అప్పుడే అనుకున్నాను. అదే ‘నిన్ను కోరి’ అయింది. మళ్లీ అలాంటి ఫీలింగే సతీష్ జవ్వాజీ చెప్పినప్పుడు అనిపించింది. ‘నిన్ను కోరి’ చిత్రానికి ‘అన్ని అలవాట్లున్న అబ్బాయిని ప్రేమిస్తారు.. ఏ అలవాటు లేని అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు’ అనే డైలాగ్‌తో ప్రోమోని రిలీజ్ చేశాం. మళ్లీ ఇప్పుడు ‘తాళి కట్టడం కలిసి ఉండటం కోసమే అయితే.. మధ్యలో విడిచి పెట్టిన దానికి కాదురా.. చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్న వీడికి కట్టాలిరా’ అనే డైలాగ్‌తో ఈ ‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్ రిలీజ్ చేశాం. ఈ ఒక్క డైలాగ్ విన్న తరువాతే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. నేనేమీ రెగ్యులర్ ప్రొడ్యూసర్‌ని కాదు. మనసుకి నచ్చిన కథ వస్తేనే సినిమాని తీస్తాను. మంచి కథతో మంచి దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయితే ఎంతో మందికి పని లభిస్తుంటుంది. ఈ కథ విన్నప్పుడే నాకు రోషన్, శ్రీదేవీ కనిపించారు. ఆ ఇద్దరినీ ఒప్పిస్తేనే సినిమా తీస్తాను అని సతీష్‌కి చెప్పాను. ఆ తరువాత విజయ్ బుల్గానిన్, సతీష్ ముత్యాల ఇలా అందరూ ఫిక్స్ అయ్యారు. కనిపించని నాలుగో సింహం టైపులో శివ ముప్పరాజు రైటర్ కమ్ ఎడిటర్‌గా పని చేశాడు. సాంగ్‌ని రిలీజ్ చేద్దామని అనుకుని చివరి నిమిషంలో గ్లింప్స్‌‌ని వదిలాం. త్రివిక్రమ్‌‌ని అడిగిన వెంటనే మాకు సపోర్ట్ చేశారు. నా జీవితంలో బీవీఎస్ రవి, బాబీ చాలా ఇంపార్టెంట్. జీవితాంతం గుర్తుండిపోయే సినిమాగా ‘బ్యాండ్ మేళం’ నిలుస్తుంది. గ్లింప్స్ చూసి బాబీ షాక్ అయ్యాడు. ఫ్యూచర్ నాని అవుతాడు అంటూ బాబీ ప్రశంసించాడు. ఈ కథ ప్రారంభించడానికి కారణం నా కజిన్ శివరాజు రాజశేఖర్ కారణం. ఈ చిత్రం ఆడియెన్స్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

బీవీఎస్ రవి మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ సినిమాని ఆల్రెడీ నేను చూశాను. కథని నేను ముందే విన్నాను. విన్నప్పటి కంటే మూవీని చూసిన తరువాత ఆశ్చర్యపోయాను. చిత్రాన్ని చాలా గొప్పగా తీశాడు. సతీష్ చాలా మంచి దర్శకుడు అవుతాడు. కెమెరామెన్ సతీష్ ముత్యాల విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. విజయ్ బుల్గానిన్ మరోసారి అందరినీ ఆకట్టుకుంటాడు. హర్ష్ రోషన్, శ్రీదేవీ ఇద్దరూ కూడా అద్భుతంగా నటించారు. మార్చి 13న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ .. ‘‘కోర్ట్’తో నన్ను నిలబెట్టిన వాల్ పోస్టర్ టీంకి, నాని అన్నకి, ఆడియెన్స్‌కి అందరికీ థాంక్స్. ‘బ్యాండ్ మేళం’ అనే పేరుని అందరూ వినే ఉంటారు. మా సినిమాతో ఆ పేరు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతుంది. మా వెన్నంటే నిలబడి నడిపించిన కోన వెంకట్ గారికి థాంక్స్. మా కోసం వచ్చిన బాబీ గారికి, బీవీఎస్ రవి గారికి థాంక్స్. మా గ్లింప్స్ లాంచ్ చేసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సతీష్ గారికి థాంక్స్. మార్చి 13న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ నాకెంతో ప్రత్యేకం. ‘కోర్ట్’ తరువాత నేను విన్న కథ ఇదే. ఇప్పటికీ నన్ను జాబిలిగానే అందరూ గుర్తిస్తున్నారు. ఇకపై ఈ చిత్రంతో రాజమ్మగా అందరూ గుర్తు పెట్టుకుంటారు. ఇందులో నా పాత్రతో అందరినీ నవ్విస్తాను, ఏడిపిస్తాను. ఇంత మంచి కథలో నాకు పాత్రను ఇచ్చిన సతీష్ గారికి థాంక్స్. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. మమ్మల్ని నమ్మి సినిమాను నిర్మించిన కోన గారికి థాంక్స్. రోషన్‌తో మళ్లీ వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మార్చి 13న మా సినిమా రాబోతోంది. గత ఏడాది మార్చి 14న ‘కోర్ట్’ వచ్చింది. ‘కోర్ట్’ కంటే ‘బ్యాండ్ మేళం’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు సతీష్ జవ్వాజీ మాట్లాడుతూ .. ‘నా లైఫ్ అయిపోయిందని అనుకున్న టైంలో హీరోలా వచ్చి నన్ను సపోర్ట్ చేసిన కోన వెంకట్ గారికి థాంక్స్. నేను ప్రతీ సీన్‌ను ఎంతో ఎమోషన్‌తో రాశాను. అంతే ఎమోషన్‌తో ప్రతీ సీన్‌ను తెరకెక్కించాను. రోషన్, శ్రీదేవి నటనలతో ఆ ఎమోషన్స్ మరింత పండాయి. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు మంచి ఆల్బమ్ ఇచ్చారు. అన్ని పాటలు అద్భుతంగా వచ్చాయి. మార్చి 13న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ కథని సతీష్ చాలా ఇష్టపడి రాశాడు. నాకు ఆల్రెడీ కథ చెప్పాడు. ఆ కథ నాకు చాలా నచ్చింది. నేను ఈ కథను కోన గారి వద్దకు పంపాను. కోన గారు దర్శకుడు సతీష్‌కి, టీంకి వెన్నంటే నిలిచి సపోర్ట్ చేశాడు. మార్చి 13న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కాబోతోంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ .. ‘నన్ను నమ్మి ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన కోన గారికి థాంక్స్. కోన గారు, సతీష్ గారితో మ్యూజిక్ సిట్టింగ్స్ నాకు చాలా నచ్చాయి. రోషన్, శ్రీదేవీ చక్కగా నటించారు. మార్చి 13న ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ ..‘‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్ బాగుంది. పాటలు ఇంకా బాగుంటాయి. మాకు ఆడియో రైట్స్ ఇచ్చిన కోన గారికి థాంక్స్. మార్చి 13న ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

తారాగణం: హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
కోన వెంకట్ ప్రొడక్షన్
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్
సమర్పణ :మ్యాంగో మాస్ మీడియా
నిర్మాతలు: కావ్య, శ్రావ్య
సహ నిర్మాత: శివరాజు ప్రణవ్
రచయిత, దర్శకుడు: సతీష్ జవ్వాజి
సంగీతం: విజయ్ బుల్గానిన్
స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు
DOP: సతీష్ ముత్యాల
గీతరచయిత: చద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్: నార్ని శ్రీనివాస్
కాస్ట్యూమ్ డిజైనర్: నంధన గాయత్రి
PRO: వంశీ కాకా

A Soulful Melody Chaatu Chaatu From ‘Purushaha’ Unveiled By Students At Kasturba Gandhi College For Women

When everyday married life is narrated with humour and an honest slice-of-life tone, it naturally turns into a far more entertaining ride. Purushaha seems to be walking exactly on that path- rooted, funny, and instantly relatable. The film is already sparking curiosity with its trendy, offbeat promotional style. Backed by Battula Saraswathi and produced by Battula Koteswara Rao under Kalyan Productions, the film marks the debut of Pavan Kalyan Battula, directed by Veeru Vulavala.

The first single Jaali Padedevvadu sung by Oscar winner MM Keeravani was already a chartbuster. Today, the film’s second single has been dropped. The students at Kasturba Gandhi Degree & PG College for women unveiled the song.

This song captures a college girl revealing the depth of her feelings for her beloved. She admires Pavan silently from a distance, cherishing him in her heart. Yet, she lacks the courage to express her love, choosing instead to hold it within. Lyricist Ananta Sriram beautifully conveys that sweet ache and unspoken affection.

Shravan Bharadwaj’s music adds a classic, soulful touch to this love song, with brilliant instrumentation enhancing its emotional pull. Chinmayi Sripaada’s vocals elevate the track even further, bringing grace and warmth to every note. Rayancha Kokkuri performs her role wonderfully, while Pawan impresses with the dignity and restraint his character demands.

On Valentine’s Day, the makers deliver the perfect song, one that’s poised to climb straight to the top of every music chart.

The film’s cinematography is by Satish Muthyala, music is by Sravan Bharadwaj, editing is by Koti, and art direction is by Ravibabu Dondapati. Post-production is currently in full swing, and the release date will be announced soon.

Cast: Pavan Kalyan, Saptagiri, Kasireddy Rajkumar, Rayancha Kokkuri, Vishika, Hasini Sudheer, Sri Sandhya, Gabi Rock, Anaira Gupta, Vennela Kishore, Rajeev Kanakala, Pammi Sai, VTV Ganesh, and others.

Technical Crew:
Banner: Kalyan Productions
Producer: Battula Koteswara Rao
Director: Veeru Ulavala
Music Director: Shravan Bharadwaj
Cinematography: Satish Muthyala
Editor: Koti
Art Director: Ravibabu Dondapati
Lyrics: Ananth Sriram
PRO: Sai Satish

Successful producer Vamsi Nandipati interview about ‘Hey Bhagavan’ Movie

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిర్మాత వంశీ నందిపాటి విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

‘హేభగవాన్‌’ ఎలాంటి సినిమా?
హేభగవాన్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా.. స్టోరీ లెవల్‌ నుంచి ఈ ప్రాజెక్టులో ఉన్నాను. ప్రజెంటర్‌గా ఉన్నాను. ఈ సినిమా పాయింట్‌లో ఫన్‌ ఉంటుంది. సినిమాలో బిజినెస్‌ అనేది ఒక ఎలిమెంట్‌ ఉంది. ఒక కొడుకు తన తండ్రి గురించి అర్థం చేసుకోవడానికి ఆ ఎలిమెంట్‌ ఉపయోగపడుతుది. ఫన్‌ ప్లస్‌ ఎమోషన్‌ ఈ సినిమాలో ఉంటుంది. ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించడంతో పాటు హృదయానికి హత్తుకునే సినిమా ఇది.

సినిమా ట్రైలర్‌, టీజర్‌లో బిజినెస్‌ అంటూ ఓ ఆసక్తికరమైన టాపిక్‌ పెట్టారు ఎందుకని?
ఆసక్తి, బజ్‌ పెంచడానికి అలా పెట్టాం. అయితే ఆ బిజినెస్‌ ఏమిటనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు.

‘హేభగవాన్‌’ టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏమిటి?
సినిమాలో ఫాదర్‌ పాత్ర పేరు భగవాన్‌ అందుకే హే భగవాన్‌.. టైటిల్‌ పెట్టాం. అయితే తాజాగా సెన్సారు అభ్యంతరం వల్ల టైటిల్‌ మారే అవకాశం ఉంది. సెన్సిటివ్‌ టైటిల్‌ అంటున్నారు. గతంలో ఇలాంటి టైటిల్స్‌ వచ్చాయి. కానీ ఇప్పుడు వద్దు అంటున్నారు.సెన్సారు బోర్డు వాళ్లతో చర్చలు జరగుతున్నాయి. ఒకవేళ హే భావన్‌గా మారే అవకాశం ఉంది.

సుహాస్‌కు ఈ సినిమా ఎంత వరకు ప్లస్‌ అవుతుంది?
గత కొంతకాలం నుంచి సుహాస్‌ ఎదురుచూస్తున్న కమర్షియల్‌ సక్సెస్‌ ఈసినిమాతో సాధించబోతున్నాడు. ఖచ్చితంగా ఆయన కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌గా నిలుస్తుంది. ఈసినిమా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది.

సత్యదేవ్‌తో, శ్రీవిష్ణుతో కూడా సినిమాలు ఉన్నాయి.

సినిమా పూర్తియన తరువాత మీరు సినిమాలను మంచి బజ్‌ తీసుకొచ్చి విడుదల చేస్తున్నారు? మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది?
ప్రొడ్యూసర్‌గా మీ స్ట్రాటజీ ఏమిటి?
మోర్‌ దెన్‌ ప్రాపర్‌గా క్రియేటివ్‌ స్ట్రాటజీస్ట్‌గా అనేది కరెక్ట్‌ పదం. అన్నీ దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. దర్శకుడికి ఎక్కడైనా అనిపించిన దగ్గర సలహా ఇస్తాం. వాళ్లు ఓకే అంటేనే మార్పులు చేశాం. దర్శకుడు హ్యపీ అయితే సినిమా బాగుంటుందనేది నా నమ్మకం. మొత్తం వాళ్ల అనుమతి మేరకే జరుగుతుంది.

మీరు చెప్పిన మార్పులకు దర్శకులు ఎలా కన్వీన్స్‌ అవుతున్నారు?

క్రియేటివి ఫ్రీడమ్‌ దర్శకులకే. కన్వీన్సింగ్‌గా చెప్పినట్లయితే వాళ్లు కూడా ఒప్పుకుంటారు. లేదా మాకు ముందు ఉన్న సక్సెస్‌లను కావొచ్చు. అయితే దర్శకుడికే పూర్తి ఫ్రీడమ్ ఇవ్వాలి. కంటెంట్‌లో బలం ఉంటేనే మనం కూడా ఏమైనా చేయగలం.

ఇప్పుడు చిన్న సినిమాల నిర్మాణం బాగా తగ్గిందనుకోవచ్చా?
లిటిల్‌ హార్డ్స్‌, రాజు వెడ్ష్‌ రాంబాయ్‌ తరువాత చిన్న సినిమాలు పెరిగాయి. ఇటీవల ఛాంబర్‌లో ఒక నెలలోనే 300 సినిమాల టైటిల్స్‌ రిజిష్టర్‌ అయ్యాయి. ఓటీటీ బిజినెస్‌లు కావడం లేదని ఓ క్లారిటీ వచ్చింది. అయితే కేవలం ఓటీటీ కోసం కూడా చేసే సినిమాలు పెరిగాయి.

మీరు భవిష్యత్‌లో దర్శకత్వం చేస్తారా?
దర్శకత్వం చేయను. నిర్మాతగా మంచి చిత్రాలు అందించాలనేది నా లక్ష్యం.

బన్నీ వాసు గారితో మీ అనుబంధం?
బన్నీ వాసుగారు నాకు బ్రదర్‌లాంటి వాడు. ఆయనతో మొదట్నుంచీ కలిసి ట్రావెల్‌ అవుతున్నాం. ఆయన ఓకే చేసిన నేను ఓకే చేసినట్లే..మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేవిధంగా ఉంటాయి

పోలీమేర-3 డిటైల్స్‌ చెప్పండి?
పోలీమేర-3 ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఏప్రిల్‌ లేదా మేలో ప్రారంభింస్తాం. హిందీలో మినహా దక్షిణాది సినిమాల్లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఈ సినిమాకు లీడ్‌ రోల్‌లో ఎవరైనాస్టార్‌ యాడ్‌ అయితే బాగుంటుంది అనుకున్నాం. త్వరలోనే తెలియజేస్తాం.

మీ భవిష్యత్‌ ప్రణాళికలు?
ఈటీవీవిన్‌తో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నాను. ఈ నెల 27 అది అనౌన్స్‌మెంట్‌ చేస్తాను. ఈటీవీతో మరికొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాను.

శివాజీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని మీరు థియేటర్‌లో విడుదల చేస్తున్నారా?
మార్చి 6న ఆ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్‌గా సినిమాను విడుదల చేస్తున్నాను.

‘Seetha Payanam’ Movie Review (Heartfelt watch)

Cinemarangam
Banner: Shree Raam Films International
Movie Name : ‘Seetha Payanam’❤️
Review Rating: 3/5
Release Date : 14.02.2026
Story – Screenplay – Producer – Director : Action King Arjun
Cast : Niranjan, Aishwarya Arjun, Sathyaraj, Prakash Raj, Kovai Sarala, Action King Arjun, Action Prince Dhruva Sarja & others
Dialogues: Dr. Sai Madhav Burra
Music: Melody King Anup Rubens
Cinematography: G. Balamurugan
Editor: Ayub Khan
Art Directors: Mohan B. Keri, Shiva Kamesh D., CH Krishna
Fights: Kick Ass Kali
Line Producer: UL. Murthy
Choriography: Lalitha shobi, Shresti Verma 
PRO: Sai Satish
Digital Marketing: Star Circle
Action King Arjun returns to the director’s chair with Seetha Payanam, produced under his banner Shree Raam Films International. The film marks the debut of his daughter Aishwarya Arjun, leading an impressive ensemble that includes Niranjan, Sathyaraj, Prakash Raj, and Kovai Sarala. Arjun himself appears in a key cameo, while his nephew, Action Prince Dhruva Sarja, boosts the excitement with a special appearance. Seetha Payanam, a heartfelt road-trip drama The film released on February 14 in Telugu and has been dubbed into other South Indian languages. Let’s see how the movie fares.

Story:
The film revolves around Seetha (Aishwarya Arjun) and Abhi (Niranjan Sudhindra), two strangers who unexpectedly begin a long journey together. What starts as a simple road trip slowly turns into an emotional tale about relationships, love, trust, and family bonding. As their journey progresses, hidden emotions and personal conflicts surface. What challenges do they face? What is the real turning point in their relationship? The answers form the core of the story.

Plus Points:

Aishwarya Arjun is the major highlight of the film. She performs confidently and handles emotional and family scenes with ease. Her screen presence is pleasant and she delivers expressive acting in key moments.

Niranjan Sudhindra gives a decent performance and supports the narrative well. Arjun Sarja appears in a short cameo and leaves a good impact with his look and performance. Dhruv Sarja’s special appearance stands out, and the action sequence featuring him is energetic and crowd-pleasing.

Minus points:

The basic theme chosen by Arjun is good and has emotional value. However, the film lacks a strong central conflict. While the narration is engaging in parts, the story feels predictable at times. A more powerful conflict and tighter emotional drama could have elevated the overall impact.

Technical Aspects:
Sai Madhav Burra’s dialogues are meaningful and connect with the audience, especially in the family-oriented scenes. Anup Rubens provides soothing music, and his background score supports the emotional tone of the film.
Cinematographer G. Balamurugan captures the visuals neatly and presents the journey beautifully. Editing by Ayoob Khan is decent and keeps the runtime controlled. Considering the budget, the production values are satisfactory.

Verdict:

In an overview, Seetha Payanam is a simple and pleasant emotional love drama filled with warm family moments. The performances, particularly Aishwarya Arjun’s acting in emotional scenes, stand as the film’s main strength. It may not offer a strong conflict, but it works as a feel-good watch and suits the Valentine’s Day weekend audience.

Cinemarangam.com Review Rating .. 3/5

‘Couple Friendly’ Movie Review (Emotionally hard-hitting)

Cinemarangam
Presentation – UV Creations
Production – UV Concepts, Ajay Kumar Raju P
Movie Name : ‘CoupleFriendly ❤️
Review Rating: 3/5
Release Date : 14.02.2026
Written and Directed by : Ashwin Chandrasekhar 
Cast :Santosh Soban, Manasa Varanasi, and others 
Director of Photography (DOP): Dinesh Purushothaman
Editor: Ganesh Shiva
Music Director: Aditya Ravindran
Art Director: Michael BFA
Executive Producers: SS Varma
PROs: GSK Media (Suresh – Sreenivas)

Young hero Santosh Sabhan is waiting for a proper hit since long time. Not disappointed with his films performance at the box office, Santosh Sabhan came up with a love story titled, Couple Friendly. Co-starring Manasa Varanasi as the female lead, the movie is scheduled for a February 14,2026 with the night premiers on February 13th itself. Let’s see how it goes.

Story:

Mithra(Manasa Varanasi) who’s Native from Chittor in Andhra Pradesh goes to Chennai in search of a job. On the other hand, Shiva( Santosh Sobhan) being an interior designer by profession comes to Chennai in search of business opportunities from Nellore. How the young couple crosses the paths? Due to circumstances they both decide to live-in relationship? What are the circumstances?What happened when their parents get to know about their love story, forms the crucial crux.

Plus points:

Firstly, the film has no built-up shots on the hero. He is presented in a natural manner just like boy-next-door kinda of character which can be considered as a biggest plus points of the movie.

On the other hand, the romantic chemistry between the lead pair is so good in such a way that one will start loving the characters within no time after starting the movie.

There is nothing much to say about Santosh Sabhan ‘s performance because he is already proven actor but the girl Manasa Varanasi is outstanding in her role and did cent percent justice in her multi-layered character.

Other supporting artists such as Rajeevi Kanakala and who acted as the both family members are superb in their given roles.

Minus points:

There are no specific minus points for the film but to mention about the minus points lack of entertainment in the key second especially during the last half an hour comes a minus points for the film.

The movie runs on a serious note during the last 20 minutes which is unexpected from the film which is usually considered as a simple rom-com entertainer.

Technical Aspects:

The Cinematography work is beautiful as the locations in and around Chennai City area captured in an authentic manner. The editing work is sharp.

Music is outstanding as it hooks the audience to the narrative instantly. The production values for this tight budget movie are nice.

Verdict:

In an overview, Couple Friendly is an emotional feel good love drama that attracts the targetted youth audience to the core. Adding to fantastic work by the director, the movie has a strong performances from lead pair. Plus the padding artists such as Rajeevi Kanakala got an impactful role, makes Couple Friendly a must watch during this Valentine’s Day weekend.

Cinemarangam.com Review Rating : 3/5

Mass Ka Das Vishwak Sen ‘Funky’ pre-release Event held grandly, Movie Releasing on Feb 13

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలో కయాదు లోహర్‌ కథానాయిక.

ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెడుతోన్న ‘ఫంకీ’ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేశాయి. మరికొద్ది గంటల్లో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడానికి ‘ఫంకీ’ వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులకు వినోదాల విందుని అందించి, ఘన విజయాన్ని సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది.

‘ఫంకీ’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ..”ముందుగా భీమ్స్ గారి గురించి మాట్లాడాలి. మా సినిమాకు అద్భుతమైన సంగీతం అందించారు. మామూలుగా నా సినిమాల్లో పాటలు బాగుంటాయి అంటారు. అయితే నా గత రెండు చిత్రాలలో పాటలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఇప్పుడు ‘ఫంకీ’ సినిమాకి భీమ్స్ గారు అన్నీ మంచి పాటలు ఇచ్చారు. సినిమా విడుదల తర్వాత పాటలకు ఆదరణ ఇంకా పెరుగుతుందనే నమ్మకం ఉంది. రేపు(ఫిబ్రవరి 13) ఫంకీ థియేటర్లలోకి వస్తోంది. స్నేహితులు, కుటుంబం సభ్యులతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. రెండు గంటలు ఎలా అయిపోయాయో కూడా తెలియనంతగా సినిమా మీకు వినోదాన్ని పంచుతుంది.” అన్నారు.

కథానాయిక కయాదు లోహర్‌ మాట్లాడుతూ..”ఫంకీ ఎలా ఉండబోతుందో ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయింది. మా సినిమాని మీకు చూపించడం కోసం ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నాము. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. దర్శకుడు అనుదీప్ గారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా నేను పని చేసిన దర్శకులలో అనుదీప్ గారిది విభిన్న శైలి. విశ్వక్ సేన్ అద్భుతమైన నటుడు. ఎంతో ప్రతిభ ఉంది. చాలా కూల్ గా ఉంటాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ స్థాయికి ఎదగటం అంటే మామూలు విషయం కాదు. ఫంకీ నా కెరీర్ లో మొదటి కామెడీ సినిమా. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫిబ్రవరి 13న విడుదలవుతున్న మా సినిమాని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.

దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ..”ముందుగా మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు. కథ వినగానే ఈ సినిమా చేయడానికి అంగీకరించిన విశ్వక్ సేన్ కి కృతఙ్ఞతలు. కయాదు లోహర్‌ కి తెలుగు రాకపోయినా.. అప్పటికప్పుడు ఏవైనా డైలాగులు రాసినా నేర్చుకొని చెప్పింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. భీమ్స్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నవీన్ నూలి గారు తన ఎడిటింగ్ తో సినిమాని ఇంకా బెటర్ చేశారు. కెమెరామ్యాన్ సురేష్ గారు, సహ రచయిత జగన్, అలాగే చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఫిబ్రవరి 13న ఫంకీ విడులవుతోంది. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు కుటుంబంతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..“సినీ నేపథ్యంలో జరిగే కథ ఇది. అలా అని సీరియస్ గా ఉండదు. దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య జరిగే సరదా కథ ఇది. క్యూట్ కామెడీ ఫిల్మ్. ప్రతి సన్నివేశం హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు రెండు గంటల పాటు మీ ముఖంలో నవ్వు ఉంటుంది. నవ్వుకోడానికి థియేటర్ కి రండి. మీరు అసలు నిరాశచెందరు. నవ్వుతూ థియేటర్ నుండి బయటకు వస్తారు.” అన్నారు.

చిత్రం: ఫంకీ
తారాగణం: విశ్వక్ సేన్, కయాదు లోహర్‌, నరేష్, వీటీవీ గణేష్ తదితరులు
దర్శకత్వం: అనుదీప్ కె.వి.
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
రచన: అనుదీప్ కె.వి, మోహన్
కళా దర్శకుడు: జానీ షేక్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్