Home Blog Page 23

GSR Movie Makers “Amma… Naaku Aa Abbayi Kaavali” Songs Recording Completed!!

జి.ఎస్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ… ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి.శైలజా రెడ్డి నిర్మిస్తున్న ముక్కోణపు ప్రేమకథాచిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ వినూత్న ప్రేమ కథాచిత్రం షూటింగ్ కి ముందే పాటల రికార్డింగ్ పూర్తి చేసుకుని సంగీత సౌరభాలు వెదజల్లుతోంది. పవన్ మహావీర్ సరసన సుహాన జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని మరో హీరోయిన్ ను త్వరలో రివీల్ చేస్తారు!!

ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ స్వర సారధ్యంలో… దర్శకుడు శివాల ప్రభాకర్ సమకూర్చిన సాహిత్యానికి సుప్రసిద్ధ గాయనీగాయకులు చిత్ర, హరిణి, బృంద, అరుణ్, సాయి చరణ్, కృష్ణతేజస్వి గాత్రమందించారు. హైదరాబాద్, సారధి స్టూడియోలో అత్యంత ఘనంగా అతిరథమహారధుల సమక్షంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఈనెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. రాజమండ్రి సమీపంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పట్టిసీమలో ప్రారంభమయ్యే ఈ షూటింగ్ తదుపరి వైజాగ్, అరకు ప్రాంతాలకు షిఫ్ట్ కానుంది!!

జి.ఎస్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత్రి శ్రీమతి జి.శైలజా రెడ్డి మాట్లాడుతూ.… “మా దర్శకుడు శివాల ప్రభాకర్ ఒక యజ్ఞంలా ఈ చిత్ర రూపకల్పన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీత సారధ్యంలో ప్రభాకర్ రాసిన పాటలు అద్భుతంగా కుదిరాయి. హీరోగా పరిచయమవుతున్న పవన్ మహావీర్ కు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది” అని అన్నారు!!

సీనియర్ హీరో సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎడిటర్: నందమూరి హరి, రచనా సహకారం: రమేష్ – మురళి, కో-డైరెక్టర్: రావుశ్రీ, నిర్మాత: జి. శైలజా రెడ్డి, కథ – మాటలు – పాటలు – చిత్రానువాదం – దర్శకత్వం: శివాల ప్రభాకర్!!

“I believe ‘Hey Balwanth’ will become the biggest commercial blockbuster hit of my career”: Hero Suhas

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బల్‌వంత్‌’ ( హే భగవాన్‌ చిత్రం టైటిల్‌ మార్పు) అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నాగారం , సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంకు సంబంధించి నాట్‌ ఏ టైటిల్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సందీప్‌ కిషన్‌ విచ్చేశాడు. ఈసందర్భంగా

సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘ ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు హ్యపీగా ఉంది. వంశీ నందిపాటి పేరు గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆయన కాన్ఫిడెంట్‌ నచ్చుతుంది. సుహాస్‌ నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు అన్నీ చూశాను. కథను నమ్మి సినిమాలు చేసే హీరో. నిజయితీగా కష్టపడతాడు. ఈ సినిమాకు టైటిల్‌ మారిన అందరూ సుహాస్‌ సినిమా అంటారు. ఈ సినిమాతో సుహాస్‌ ఆడియన్స్‌ మనసులు మరోసారి గెలుచుకుంటాడు. ఈ సినిమా టీజర్‌ చూడగానే నాకు ఆసక్తికరంగా అనిపించింది. సినిమాను ప్రమోట్‌ చేసిన విధానం బాగుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

కథానాయకుడు సుహాస్‌ మాట్లాడుతూ ” నన్ను ఎప్పుడూ ఎంకరైజ్‌ చేసే హీరో సందీప్‌కిషన్‌కు నా కృతజ్క్షతలు. టీమ్‌ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. నా తోటి ఆర్టిస్టులు ఈ సినిమా కోసం ఎంతో హార్డ్‌ వర్క్‌ పెట్టారు. ఈ సినిమా సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్‌ మ్యూజికల్‌ నైట్‌లా ఉంటుంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేశాడు. సినిమా షూటింగ్‌ అంతా ఎంతో పాజిటివ్‌గా జరిగింది. వంశీ నందిపాటి గురించి ఇంతకు ముందు విన్నాను. ఈసినిమాతో ఆయనెంటో తెలిసింది. ఆయన మంచి ప్లానింగ్‌తో సినిమా మీద బజ్‌ తీసుకొచ్చాడు. దర్శకుడు గోపీ ఈ సినిమాతో ఆయన డ్రీమ్‌ నెరవేర్చుకున్నాడు. ఎంతో కష్టపెట్టి ఓ మంచి సినిమా తీశాడు. శివానీ, సుదర్శన్‌లు ఇద్దరూ సూపర్‌గా యాక్ట్‌ చేశారు. నా కెరీర్‌లో మజిలీ సినిమాతో బ్రేక్‌ వచ్చింది. మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ సమయంలోనే పెద్ద హీరోయిన్‌తో ఓ సినిమాలో ఆఫర్‌ వచ్చింది. సినిమాలో హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అది. నా ముందే ఒకాయన సెట్‌లో ఇంతనెందుకు పిలిచారు? కానీ కట్‌ చేస్తే కీర్తిసురేష్‌తో కలిసి ఉప్పు కప్పురంబు అనే సినిమా చేశాను. నేను గ్రేట్‌గా ఫీలయిన మూమెంట్‌ అది. ఎవరైనా మిమ్మలను తక్కువ చేసి మాట్లాడితే మీరు నవ్వి ఊరుకోండి.. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ఇక ‘హే బల్‌వంత్‌’తో నాకు పెద్ద హిట్‌ వస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు.

శివానీ నాగారం మాట్లాడుతూ ‘‘ ఈ సినిమా టైటిల్‌ మారగానే అందరం టెన్షన్‌ పడ్డాం. కానీ ఆ భగవాన్‌ బల్‌వంత్‌గా మార్చాడు. అందరూ చాలా ఎంజాయ్‌ చేసే సినిమా. అందరూ నవ్వుకుంటారు. వినోదం, ఎమోషన్‌, అన్నీ ఉన్నాయి. ఈ సినిమా మా టీమ్‌ అందరికి స్పెషల్‌. తప్పకుండా ఈసినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సుహాస్‌తో నాకు స్పెషల్‌ సినిమా. అంబాజీ పేట సినిమాలో మనం చాలా సినిమాలు చేయాలి. నీ ప్రతి బ్లాక్‌బస్టర్‌లో నేనుండాలి అన్నాను. సో.. తప్పకుండా ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’ అన్నారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ ” డేట్‌లు మారినా, టైటిల్‌ మారినా, ఫిబ్రవరి 20న మా సినిమా క్రియేట్‌ చేసే ఇంపాక్ట్‌ మారదు. ఈసినిమాలో లవ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌ ఉన్నాయి. ఇవి అందరికి బాగా నచ్చుతాయి. మన లైఫ్‌లో ఫాదర్‌ అండ్‌ సన్ ఎమోషన్‌ ఈ సినిమా ఉంటుంది. ఇది హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌. సినిమా చూసి వెళ్లేటప్పుడు అందరి హృదయాలు బరువెక్కుతాయి. ఇటువంటి సినిమాలు చూసినప్పుడు మన రియల్‌లైఫ్‌లో కూడా కనెక్ట్‌ అవుతాం. ఈ సినిమా చూసిన వాళ్ల డబ్బులకు న్యాయం జరుగుతుంది. ఆడియన్సకు పైసా వసూల్‌ సినిమా. హాండ్రెడ్‌ పర్సెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే సినిమా ఇది. ఈ సందర్బంగా ఈ చిత్ర దర్శకుడు గోపీకి మీ అందరి సమక్షంలో రెండో సినిమా అడ్వాన్స్‌ ఇస్తున్నాను. ఇది హేబల్‌వంత్‌ మీద ఉన్నా నా నమ్మకం’ అన్నారు.

నిర్మాత బి.నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ” మా బ్యానర్‌ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇది. ఇరవై కథలు విన్న తరువాత గోపీ చెప్పిన కథ నచ్చి. త్వరితగతిన షూటింగ్‌ పూర్తిచేశాం. వంశీ నందిపాటి ఇన్‌ అయిన తరువాత ఈ సినిమా విషయంలో నేను రిలాక్స్‌ అయ్యాను. ఈ సినిమా విషయంలో ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ఎంతో సహకరించారు’ అన్నారు.

దర్శకుడు గోపీ అచ్చర మాట్లాడుతూ ” హేభగవాన్‌ కాస్త హే బల్‌వంత్‌గా మార్చాం. మారింది టైటిలే. కంటెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కాదు. సుహాస్‌ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచున్నానని అనుకుంటున్నాను. ఎంతో బిజీగా ఉన్నా ఈ సినిమా విషయంలో సహకారించాడు. ఎంతో సపోర్ట్‌ చేశాడు. నిర్మాత నరేంద్ర రెడ్డికి సినిమా అంటే ఎంతో పాషన్‌. అన్నీంట్లో ఇన్‌వాల్వ్‌ అయ్యేవాడు. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అయ్యే సినిమా ఇది’ అన్నారు.

ఈ కార్యక్రమంలో లిరిక్‌ రైటర్‌ కె.కె. ఎడిటర్‌ విప్లవ్‌, డీవోపీ, మహిరెడ్డి, రైటర్‌ మిథున్‌, నటుడు హర్షవర్థన్‌, సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్‌, దర్శకుడు సందీప్‌ రాజ్‌, నిర్మాత ధీరజ్‌ మొగలినేని, నటులు దివ్య, విద్య, నిర్మాత, ఛాయ్‌బిస్కట్‌ ఫాండర్‌ అనురాగ్‌ రెడ్డి, నటుడు సుదర్శన్‌, నటి స్రవంతి చొక్కారాపు, లావణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Hero Suhas interview about full-length out-and-out entertainer ‘Hey Balwanth’

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బల్‌వంత్‌’ ( హే భగవాన్‌ చిత్రం టైటిల్‌ మార్పు) అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సుహాస్‌ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

‘ హే భగవాన్‌’ నుండి హే బల్‌వంత్‌ టైటిల్‌ మార్చడానికి కారణమేమిటి?
భగవాన్‌ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది కాబట్టి టైటిల్‌ మార్చాలని సెన్సారు వారు సూచించడంతో హేబల్‌వంత్‌గా మార్చాం. సినిమాలో నరేష్‌ క్యారెక్టర్‌ పేరు మార్చాం. సినిమా టైటిల్‌తో పాటు సినిమా కాన్సెప్ట్‌ను కూడా సెన్సారు వాళ్లు పరిగణనలోకి తీసుకున్నారు.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
చిన్నప్పటి నుంచి బిజినెస్‌ చేయాలని ఆలోచించే కుర్రాడు, నాన్న బిజినెస్‌ను టేకప్‌ చేయాలని అనుకుంటాడు. అప్పుడు అతనికి ఎదురైన పరిణామాలు ఏమిటి? నాన్న బిజినెస్‌ ఏమిటి? ఇలా సినిమా పూర్తి ఎంర్‌టైన్‌మెంట్‌గా, నా పాత్ర కూడా వినోదాత్మకంగా ఉంటుంది.

ఈ సినిమా చాలా తక్కువ వర్కింగ్‌ డేస్‌లో ఈ సినిమాను పూర్తి చేశారట?
అవునండి.. నా కెరీర్‌లో సినిమా ఓకే కాగానే పూర్తిచేసి చాలా త్వరితగతిన విడుదల చేస్తున్న సినిమా ‘హే బల్‌వంత్‌’ సినిమా కూడా ఎంతో క్వాలిటీగా ఉంటుంది. నా కెరీర్‌లో మళ్లీ ఇంత ఫాస్ట్‌గా సినిమా జరుగుతుందా అనిపించింది.

సినిమా ఓకే చేయడానికి కారణం?
కథ వినగానే నచ్చింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌గా కనెక్ట్‌ అయ్యాను. సినిమా మేము అనుకున్నదాని కంటే వందరెట్లు బెటర్‌గా ఉంది.

ఈ సినిమా సుహాస్‌ 2.0 అనుకోవచ్చా?
అంత పెద్ద పదాలు వాడకండి. కాకపోతే ఈ సినిమా అయితే నాకు విజయాన్ని అందిస్తుందనే నమ్మకం ఉంది.

ప్రతి సినిమా కోసం మీ ఎఫర్ట్‌ పెడుతున్నారు? కానీ సరైన సక్సెస్‌ రాలేకపోతే ఎలా అనిపిస్తుంది?
విజయం కోసం ఎదురుచూడటమే.. బాధగా అనిపిస్తుంది. కానీ వెంటనే తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాను.

హే బల్‌వంత్‌ పట్ల ఎలాంటి అంచనాలు ఉన్నాయి?
ఈ సినిమాపై అందరికి నమ్మకం ఉంది. వంశీ నందిపాటి గారు మాకు ఈ సినిమాకు ఎంతో ధైర్యం ఇస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్‌ తరువాత అందరూ కంట్రోల్‌గా ఆలోచించి చేయమని అన్నారు., ఇంట్లో మా శ్రీమతి కూడా చెప్పింది. అందుకే మంచి సినిమాలు చేయాలని కొంత బ్రేక్‌ ఇచ్చి హేబల్‌వంత్‌ చేశాను. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది.

తమిళ్‌ సినిమా మందాడిలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది.
మందాడిలో మెయిన్‌ విలన్‌ తమిళ్‌ సినిమా. సినిమా రిజల్ట్‌ తరువాత తమిళంలో బిజీ అయ్యే అవకాశం ఉంది. నేను వెయిట్‌ చేసిన లుక్‌ అండ్‌ క్యారెక్టర్‌. అంబాజీ పేట సినిమా చూసి ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్‌ అయ్యారు.

మీకు సక్సెస్‌ రావాలని అందరూ కోరుకుంటున్నారు? మీరు గమనించారా?
అందరూ మంచి యాక్టర్‌. మంచి సినిమా పడాలి అనే సానుభూతి అందరిలో ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.

తమిళ సినిమాలు చేయడం ఎలా ఉంది?
విలన్‌ పాత్రలే చేస్తున్నాను. చాలా డిఫరెంట్‌ లుక్‌, ఆ లుక్‌ను ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే టెన్షన్‌ ఉంది.

ఇంతకు ముందు దాదాపుగా అన్నీ సీరియస్‌ పాత్రలే చేశారు. తొలిసారిగా హేబల్‌వంత్‌లో మీ పాత్రలో కామెడీ కనిపిస్తుంది?
నా కెరీర్‌ ప్రారంభంలో షార్ట్‌ఫిల్మ్‌స్‌లో నేను కామెడీ పాత్రలే చేశాను. ఈ సినిమాలో నా పాత్రను చూసి మా ఆవిడ కూడా ఇలాంటి సినిమాలు చేయమని కోరింది. లక్కీగా నాకు ఈ సినిమా వచ్చింది.

కెరీర్‌ ఎలా అనిపిస్తుంది?
నేను పూర్తి శాటిస్‌ఫాక్షన్‌గా ఉన్నాను. ఈ సినిమా హిట్‌ అయితే అది ఇంకా పెరుగుతుంది. అందరూ సినిమా మీద ఫుల్‌ కాన్పిడెంట్‌గా ఉన్నాను. పెద్ద విజయం రాబోతుంది. ఈ సినిమా మా వైఫ్‌ కూడా చూసి ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది. ఇలాంటి సినిమాలు కదా నువ్వు చేయాల్సింది అంది.

మీ తదుపరి సినిమా ?
కార్తీక్‌ సుబ్బరాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఆయన కథ అందిస్తున్నాడు. వాళ్ల అసోసియేట్‌ దర్శకుడు. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను.త్వరలోనే ఫైలన్‌ అవుతాయి.

‘Rayudu Gari Thaluka’ Trailer Launched by Director Kurasala Kalyan Krishna

సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు, డైరెక్టర్ కురసాల కళ్యాణకృష్ణ గారి చేతులు మీదుగా ప్రతిష్టాత్మిక చిత్రం రాయుడు గారి తాలూకా ట్రైలర్ ఘనo విడుదల చెయ్యడం జరిగింది .ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది .

కల్యాణ్ కృష్ణ గారు మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతంగా ఉంది ,సినిమా గురించి చాలా మంది మాటలో విన్నాను ఈరోజుల్లో ఇలాంటి కథాత్రం రాలేదు ఒక మంచి కథ తో రాబోతున్నారు టీం అందరికీ నా బెస్ట్ విషెస్ అని చెప్పారు .

హీరో నిర్మాత ఉలిశెట్టి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. ఇది ఒక చక్కటి కుటుంబ చిత్రం అని కుటుంబ విలువలు తెలిపే ఒక మంచి చిత్రం అలాగే సినిమా ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటదీ ,ఇలాంటి ఒక మంచి చిత్రం తీసినందుకు చాలా ఆనందం గా ఉంది అంటూ ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం నా అదృష్టం గా భావిస్తున్నాను ప్రేక్షకుల ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను. సినిమా మార్చి 6 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు శ్రీనివాస్ ఉలిశెట్టి గారు తెలిపారు

“Hey Balwanth” will fully entertain the audience: Heroine Shivani Nagaram

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బలవంత్‌’ ( హే భగవాన్‌ చిత్రం టైటిల్‌ మార్పు) అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో శివానీ నగరం సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

‘హే బలవంత్‌’ ఎలాంటి సినిమా?
నాది సుహాస్‌తో రెండో సినిమా.. నా కెరీర్‌లో మూడోసినిమా.. సుహాస్‌తో ఇంతకు ముందు చేసిన సినిమాలో చాలా ఇంటెన్స్‌ క్యారెక్టర్‌. ఇంటెన్స్‌ స్టోరీ.. ఈ సినిమాలో చాలా లైటర్‌ వెయిన్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్ర. చాలా ఎంజాయ్‌ చేస్తూ చేసిన పాత్ర నాది. సినిమా మొత్తం ఆడియన్స్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అవుతారు. చివర్లో ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషన్‌ కూడా అందర్ని అలరిస్తుంది. సినిమాను అందరూ ఎంజాయ్‌ చేస్తారు. నాపాత్రలో ఇన్నోసెన్స్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది.

ఈ సినిమాతో హ్యాట్రిక్‌ హిట్‌ను పూర్తిచేస్తారా?
. సినిమా చాలా బాగుంటుంది. తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది.
సుదర్శన్‌, సుహాస్‌, నాపాత్రలు మిమ్ములను బాగా నవ్విస్తుంది. ఇక నరేష్‌, వెన్నెల కిషోర్‌ క్యారెక్టర్స్‌ హిలేరియస్‌గా ఉంటాయి. సినిమాలో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మీకు సర్‌ఫ్రైజ్‌ ఉంటుంది. బాగా ఎంజాయ్‌ చేస్తారు.

ఈ సినిమా ఒప్పుకుంటానికి రీజన్‌ ఏమిటి?
నాకు వచ్చిన కథలో దిబెస్ట్‌ పిక్‌ చేసుకుంటున్నాను. ఫస్ట్‌ సినిమాలో కామెడీలో లేదు. సెకండ్‌ సినిమాలో ఫుల్‌ కామెడీ, ఈ సినిమాలో కూడా కామెడీ ఉంది. వినగానే కథతో పాటు నా పాత్ర కూడా బాగా నచ్చింది.

ఈ సినిమాలో బిజినెస్‌ ఏమిటి? ఆ బిజినెస్‌తో మీకు ఏమైనా సంబంధం ఉంటుందా?
లేదండి.,. అది సినిమాలో నరేష్‌ గారి ఫ్యామిలి బిజినెస్‌ అది నాకు సంబంధం లేదు. అది థియేటర్‌లో చూసి మీరు ఎంజాయ్‌ చేస్తారు. కడుపుబ్బా నవ్వుకుంటారు

ఈ సినిమా ఎలా ఉండబోతుంది?
.ఈ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలో కలర్‌ఫుల్‌ విజువల్స్‌, మ్యూజిక్‌ బాగుంటుంది. వెన్నెల కిషోర్‌. నరేష్‌ కామెడీ అలరిస్తుంది. ప్రతి పాత్ర మిమ్ములను నవ్విస్తుంది.

మీరు సింగర్‌ అని విన్నాం?
కూచిపూడి, సంగీతం నేర్చుకున్నాఉ. సింగర్‌ టర్నింగ్‌ యాక్టర్‌ని. లిటిల్‌ హార్డ్స్‌లో చిన్న హమ్మింగ్‌ ఉంటుంది. ఆరంభం సినిమాలో ఓ పాట పాడాను. సింగింగ్‌ కూడా ఓపెన్‌గా ఉన్నాను. అవకాశాలు వస్తే పాడతాను.

సుహాస్‌తో రెండో సినిమాలో చేయడం ఎలా అనిపించింది?
నాకు చాలా ఫ్రెండ్లీ.. నాకు సపోర్ట్‌, చాలా మంచి నటుడు. ఈ సినిమాలో మా కాంబినేషన్‌ అలరిస్తుంది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలను ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు.

సినిమాల్లోకి వెళుతున్నా అన్నప్పుడు మీ ఇంట్లో ఒప్పుకున్నారా?
మా ఇంట్లో వెరీ సపోర్టింగ్‌.. వాళ్లు ఇచ్చిన అవకాశాన్ని మంచి సినిమాలతో ప్రూవ్‌ చేసుకున్నాను. వాళ్లు కూడా ఎంతొ హ్యపీగా ఉన్నారు.

లిటిల్‌హార్ట్స్‌తో వచ్చిన సక్సెస్‌తో వచ్చిన ఆఫర్లను ఎలా మేనేజ్‌ చేస్తున్నారు?
వచ్చిన సక్సెస్‌ను అడ్వాంటేజీగా తీసుకుని తదుపరి సినిమా కమిట్‌ అవుతాను. కానీ కథ నచ్చితేనే కాంబినేషన్‌తో సంబంధం లేకుండా సినిమా ఒప్పుకుంటాను. విన్నప్పుడు నేను కథతో కనెక్ట్‌ అవుతున్నానా? నా పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి అనేది చూసుకుంటాను. సినిమాలో నా ప్రాధాన్యత ఎమిటనేది చూసుకుంటాను. అది నాకు ముఖ్యం

ఎలాంటి సినిమాలు చేయాలని వుంది?
లిటిల్‌హార్ట్స్‌లో నేను చివరిలో సెలెక్ట్‌ అయ్యాను. జెన్యూన్‌గా నేను యాక్టర్‌గా అనుకోవాలని అనుకోలేదు. కానీ ఇప్పుడ ఓ గుర్తింపు వచ్చింది. నాకు లక్కీగా మంచి సినిమాలు పడ్డాయి. మంచి టీమ్‌ దొరికంది. మంచి సహానటులు దొరికారు. నాకు వచ్చిన వాటిలో దిబెస్ట్‌ పిక్‌ చేసుకుంటాను నాకు 100 సినిమాలు చేయాలని లేదు. చేసినవి ఐదు సినిమాలు అయినా మంచి కథలతోనే చేస్తాను.

స్టార్‌ హీరోలతో ఆఫర్‌ వస్తే కథతో సంబంధం లేకుండా ఒప్పుకుంటారా?
సినిమా అంటే సినిమా. నాకు కథ, నా పాత్ర నచ్చితే ఒప్పుకుంటాను. . ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చాను. ఆడియన్స్‌ ఇచ్చిన వాల్యూను నిలుపుకోవటమే ముఖ్యం.

తెలుగు హీరోయిన్‌గా మీకు వస్తున్న అవకాశాలు ఎలా ఉన్నాయి?
వెరీ హ్యపీ. ప్రస్తుతం నటులతో పాటు రైటర్స్‌, దర్శకులు ఎక్కువయ్యారు. తెలుగు అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. చిన్న పెద్దా సిపిమా అనే తేడా ఉండదు. చిన్న సినిమాలు కూడా ఆడియన్స్‌ పెద్ద సినిమాలు చేస్తున్నారు. చాలా మంది వెంట వెంటనే సినిమాలు చేయాకపోతే కనిపించకుండ పోతావు అన్నారు. కానీ నాకు మాత్రం సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట అందరినోట వినాలని ఉంది. చాలా మంది హీరోయిన్‌లు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తారు. వారి బాటలోనే నేను కూడా పయనిస్తాను.

పర్సనల్‌గా మీకు ఎలాంట సినిమాలు ఇష్టం?
అన్ని రకాల సినిమాలు చేయాలని రొమాంటిక్‌ కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. మూడ్‌ అప్‌సెట్‌లో ఉన్న ఇలాంటి ఎంటర్‌టైన్‌ సినిమాలు చూస్తే మూడ్ సెట్‌ అవుతుంది. అన్నీ తరహా సినిమాలు చేస్తాను.

మీ తదుపరి సినిమాలు?
నేను నటించిన సినిమాలు ఓటీటీలో రావడం వల్ల అన్ని భాషల నుండి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Mani Ratnam Praises Bejoy Nambiar’s ‘Tu Yaa Main’ Calls It a ‘Big-Screen Experience’!

With Shanaya Kapoor and Adarsh Gourav’s survival thriller, Tu Yaa Main hitting the big screens recently, the film has been drawing strong reactions from both audiences and critics for its gripping storyline and compelling suspense. The excitement reached a new high at a special screening held in the South, attended by master filmmaker Mani Ratnam, who also shared his words of appreciation for the film.

The audience reaction video captures the excitement that followed the special screening of Tu Yaa Main, as they stepped out brimming with praise. While some called it a fantastic film, others described it as a breath of fresh air, applauding its energy, nail biting moments, and gripping storytelling. Adding to the buzz, legendary filmmaker Mani Ratnam shared his appreciation, saying, “Bejoy Nambiar has brought a kinetic energy to the film that is best seen on the big screen with an audience.”

Packed with pulse pounding moments and an ever-present sense of danger, Tu Yaa Main is clearly striking a chord and reaffirming its place as a gripping theatrical watch.

Directed by Bejoy Nambiar, Tu Yaa Main is produced by Aanand L Rai and Himanshu Sharma under the banner of Colour Yellow, along with Vinod Bhanushali and Kamlesh Bhanushali of Bhanushali Studios Limited. The film speaks directly to today’s youth, blending raw emotion with edge-of-the-seat storytelling, and is currently running in cinemas near you.

Gordhan Singh is looking impressive in his villain role in the film ”Maa Oori Bavi’

గోర్ధన్ సింగ్ హిందీ మరియు తెలుగు సినిమాలలో నటిస్తున్నారు,2022లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన “డేంజరస్” సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో ఆయన “కుకీ” అనే పాత్రను పోషించారు.

రాబోయే చిత్రం “మా ఊరి బావి” (2026). ఈ తెలుగు హారర్-డ్రామా సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రమోద్ కులకర్ణి నిర్మిస్తున్నారు మరియు శశాంక్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా పోస్టర్‌ను 2025 నవంబర్‌లో గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ భారతీయ చిత్రోత్సవం (IFFI)లో NFDC విడుదల చేసింది.

ఇదేకాకుండా, రాబోయే హిందీ సినిమా దుల్హనియాన్ లే అ ఎంగే (2026)లో మహేష్ మంజ్రేకర్, పీయూష్ మిశ్రా, ఓంకార్ కపూర్లతో కలిసి నటించారు.

ప్రస్తుతం ఆయన ఒక తెలుగు థ్రిల్లర్ సినిమా పై పని చేస్తున్నారు, అది ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

నటనపై ఉన్న గాఢమైన ఆసక్తితో, ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD), న్యూఢిల్లీలో శిక్షణ పొందారు.
2025 డిసెంబర్ 11న ఆయన దూరదర్శన్ DD మోర్నింగ్ షోలో అతిథిగా పాల్గొని, తన జీవిత ప్రయాణం గురించి మాట్లాడి, తన రాబోయే సినిమా “మా ఊరి బావి”ని ప్రచారం చేశారు.

14 ఏళ్ల వయసులో, కేవలం ₹300 మరియు రెండు సిఫార్సు లేఖలతో పంజాబ్ నుండి ముంబైకి వెళ్లారు. సినీ పరిశ్రమలోకి రావడానికి ముందు, ఆయన ముంబై, గోవా మరియు సముద్ర తీర ప్రాంతాల్లోని ఆఫ్‌షోర్ ప్రదేశాలలో 15 సంవత్సరాలు హాస్పిటాలిటీ రంగంలో పనిచేశారు.

‘Green Park Resort and Spa’ inaugurated in Coorg, Karnataka Kashmir…Inauguration by Chinna Jeeyar Swamy and Rajinikanth…

ప్రకృతి అందాల నడుమ కనుల పండువగా గ్రీన్ పార్క్ రిసార్ట్ మరియు స్పా ప్రారంభమైంది.
డెన్మార్క్ ఆర్కిటెక్చర్ ని తలపించే అద్భుతమైన ఇంటీరియర్స్తో 37విల్లాలు 54 రూమ్స్తో దాదాపు 35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ రిసార్టు ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అట్లూరి పూర్ణ చంద్రరావు గారు నిర్మించారు. ఆయన 90 వ జన్మదినం సందర్భంగా ఈ స్పా రిసార్ట్ మొదలైంది. ఈ ప్రారంభోత్సవానికి చిన్న జీయర్ స్వామి గారు, రజనీకాంత్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ ~ పది రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి విషయం చెప్పారు. 90 ఏళ్ల వయసులో అట్లూరి పూర్ణ చంద్రరావు గారి పట్టుదల చూసి ఆశ్చర్యపోయాను. ఈ రిసార్ట్స్ ని చూసిన తర్వాతఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అని చెప్పాలి అనిపించింది. ప్రకృతి అందాల నడుమ ఏర్పాటు చేసిన ఈ రిసార్ట్స్ సకల ప్రాణి సేవగా భావిస్తున్నాను అన్నారు. రజనీకాంత్ గారు మాట్లాడుతూ నన్ను అంధ కానున్ చిత్రంతో హిందీ సినిమాకు పరిచయం చేసిన వ్యక్తి అట్లూరి పూర్ణ చంద్రరావు గారే. అ తర్వాత కూడా నాతో కొన్ని సినిమాకి తీశారు. నికార్సైన మనిషి. చెప్పిందే చేస్తారు. అందుకే ఆయన పిలవగానే వచ్చి ఈ ఫంక్షన్లో పాల్గొన్నాను. ఆయన 90 ఏళ్ల వయసులో ఇలాంటి అద్భుతమైన రిసార్ట్ కట్టటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు ఆయన పుట్టినరోజు మరియు మహా శివరాత్రి వంటి గొప్ప పర్వదినం కావటం దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియచేయటం చూస్తుంటే ఇంత కంటే గొప్ప విషయం ఏముంటుంది అని అనిపిస్తుంది అన్నారు. ఆయన 120 ఏళ్లు బతకాలి అని కోరుకుంటున్నాను అన్నారు రజనీకాంత్.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ– శివరాత్రి పర్వదినంగా పాటు పూర్ణ చంద్రరావు గారి పుట్టినరోజున ఈ రిసార్ట్ కి రావటం ఎంతో ఆనంద దాయకం. ఆయన బతికున్నంతకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

మురళీ మోహన్ గారు మాట్లాడుతూ- 53 ఏళ్ల క్రితం ఇదే కూర్గ్లో నటునిగా పరిచయం చేసిన వ్యక్తి పూర్ణ చంద్రరావు గారు. రాజా రామ్ మోహన్ రాయ్ అనే నన్ను మురళీమోహన్ ని చేసింది కూడా ఆయనే. అప్పటి నుండి ఈ రోజు వరకు 52 ఏళ్లుగా నటిస్తున్నానే ఉన్నాను. అది ఆయన చేతి చలవే వల్ల ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాను.

మరో అతిధి నిర్మాత దిల్ రాజు గారు మాట్లాడుతూ– నిర్మాతగా పూర్ణ చంద్రరావు గారు ఎంతో స్ఫూర్తి. ఆయన 90 ఏళ్ల వయసులో కూడా ఇంత యాక్టివ్ గా ఉండటం చూసి ఆయన సమర్పణలో నేను ఒక సినిమా నిర్మిస్తాను అని తన జన్మదినం సందర్భంగా మాట ఇస్తున్నాను అన్నారు.

ఈ వేడుకలో పూర్ణ చంద్రరావు గారి ఆహ్వానం మేరకు అటు అమెరికా ఇటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుండి పలువురు సినీ,రాజకీయ, వైద్య, వ్యాపార రంగ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేయటంతో పాటు రిసార్ట్స్ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇదే వేడుకలో మురళీమోహన్ కు పద్మశ్రీ ప్రకటించిన నేపథ్యంలో సత్కరించారు పూర్ణచంద్ర రావు గారు.

Raashii Khanna Offers a Soulful Prayer to Mahadev This Maha Shivratri with ‘Shiv Kailashon Ke Waasi’

మహా శివరాత్రి పర్వదినాన దేశవ్యాప్తంగా శివ కీర్తనలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక మహా దేవుడిపై తాజాగా రాశీ ఖన్నా పాడిన పాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. శివుడిపై తనకున్న భక్తిని చాటుకునేలా రాశీ ఖన్నా ఈ పాటను ఆలపించారు. భారత దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న రాశీ ఖన్నా ప్రస్తుతం శివ భక్తితో ఆడియెన్స్‌కి మరింత దగ్గరయ్యారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌‌లతో ఆకట్టుకున్న రాశీ ఖన్నా ప్రస్తుతం శివుడిపై తన భక్తిని చాటుకునేలా పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

తాను పాడిన పాటకు వస్తున్న ప్రశంసలపై రాశీ ఖన్నా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ‘‘శివ్ కైలాషోం కే వాసి’ అనేది అహంకారాన్ని నాశనం చేయడం, అంతరంగాన్ని మేల్కొల్పడం, అతీంద్రియత శక్తి అయిన అయిన మహా దేవుడి మీద భక్తిని చాటే ప్రార్థనగా నిలుస్తుంది. ‘మహా శివరాత్రి’ అత్యంత పవిత్రమైన పర్వదినం కావడం, ఇలాంటి ఓ విశిష్టమైన రోజున పాట పాడటం ఎంతో ఆనందంగా ఉంది’ అని రాశీ తెలిపారు.

ఈ పాటలో రాశీ కనిపించిన తీరు, ఆమె వినయం, పలికించిన భావోద్వేగాలు అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆమె స్వరం సైతం ఎంతో వినసొంపుగా, వినడానికి మనసుకు ఎంతో హాయిగా అనిపించేలా ఉంది. ఆమె పాడుతున్న విధానంలో ఒక నిశ్శబ్ద ప్రకాశం, ప్రశాంతత ఉంది. ఇదొక భక్తిపూర్వకమైన నిజాయితీ ప్రదర్శనలా కాకుండా ప్రార్థనలా అనిపిస్తుంది.

అక్షయ్ కుమార్‌తో ప్రస్తుతం రాశీ ఖన్నా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో కలిసి ‘ఫర్జీ 2’, విక్రాంత్ మాస్సేతో కలిసి ‘తలఖోన్ మే ఏక్’, ఆర్. మాధవన్‌తో కలిసి ‘థ్రిల్లర్ బ్రిడ్’తోజ్ అనే చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం “శివ్ కైలాషోన్ కే వాసి” ద్వారా రాశీ ఖన్నా అభిమానుల్లో మరింత పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

Action King Arjun Sarja’s ‘Seetha Payanam’ Movie Thank You Meet held grandly

Arjun Sarja, popularly known as Action King, has produced and directed the film Seetha Payanam. Through this film, he introduced his daughter Aishwarya Arjun and Niranjan, son of actor Upendra’s elder brother, to the screen. Produced under the Shri Ram Films International banner, the film was released on February 14 and has received overwhelming appreciation from audiences and the media alike. On this occasion, the film unit hosted a Thank You Meet on Sunday.

Arjun Sarja said, “The story of Seetha Payanam revolves around gratitude and mindful thinking. My heartfelt thanks to everyone who showered love and appreciation on our film, and special thanks to the media for standing by us throughout this journey. Thirteen years ago, I witnessed an accident—had it been even ten seconds earlier or later, it wouldn’t have happened. That incident planted the seed for this story. Everyone who watches the film says it feels like a reflection of their own life. The characters gradually realize that even within negativity, there is goodness. Life itself is a journey.

I entered films without knowing what acting truly meant, and learned it along the way. Later, I felt compelled to direct as well. Winning the State Best Actor Award for Gentleman only increased my sense of responsibility. I am extremely happy with the output and the response to Seetha Payanam. Many are praising my daughter’s performance—I passed right there itself. I’m not claiming this is a great film, but what we intended has connected with people.

Niranjan delivered a wonderful performance. Prakash Raj, Sathyaraj, and Kovai Sarala are outstanding actors. Bitthiri Satti, Siri, and Charan also performed very well. The cinematographer, music director, and dialogue writer are the film’s greatest strengths. Murthy and I completed this film together. Dhruva Sarja appeared in a powerful cameo. We made this film with complete honesty. I believe everyone will like it. Those who haven’t watched it yet—please do so soon. Wishing everyone a very Happy Maha Shivaratri.”

Aishwarya Arjun stated, “Seetha Payanam is very special to all of us. The love we are receiving from the audience makes it even more special. Thank you to both the audience and the media. Those who haven’t watched the film yet, please go with your family—it will definitely appeal to everyone. Anup Rubens’ music is absolutely beautiful. My heartfelt thanks to my father—my director and producer—for trusting me and giving me this opportunity, and to everyone who supported me throughout this journey.”

Niranjan affirmed, “My sincere thanks to Telugu audiences for supporting newcomers like me. We worked extremely hard on this film. It’s a perfect family watch. I’m grateful to Arjun sir for giving me such a meaningful role and film. This movie is filled with values and will connect with everyone. Working with Aishwarya was a wonderful experience. We’re getting good openings everywhere, and I hope audiences continue to support our film.”

Music Director Anup Rubens said, “Making a film with such a story requires immense courage. Arjun sir made this film with the sole intention of giving audiences a meaningful cinema experience. Gratitude is something everyone should carry in life. Films rooted in family emotions like this are what we truly need today. I’m glad people are appreciating the songs and background score. Aishwarya and Niranjan performed brilliantly. This is a film everyone must watch.”

Dialogue Writer Sai Madhav Burra avowed, “I thank Arjun sir for giving me the opportunity to write dialogues for such a meaningful film. Every character in this story connects with us, and every scene carries depth. I got the chance to write impactful dialogues throughout the film. Audiences are walking out of theatres with the feeling that they’ve watched something truly special. Films like this are what people are longing for today.”

Associate Director Murthy stated, “Seetha Payanam is a remarkable film. Arjun sir has revealed a new dimension of himself through this movie. I closely witnessed his dedication during this journey. Every dialogue feels like a pearl. Anup sir’s songs and their lyrics beautifully reflect strong values. My thanks to all the audiences who are supporting our film.”