Home Blog Page 26

Director Gopi Achhara interview about Nandipati Entertainments and Bunny Vas Works ‘Hey Bhagavan’

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు గోపీ అచ్చర మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే..

మీ నేపథ్యం ఏంటి? సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు?
కన్నడలో ఎస్. నారాయణ అనే దర్శకుడి వద్ద పని చేశాను. సుహాస్ నాకు స్కూల్‌లో జూనియర్. ‘కలర్ ఫోటో’ నుంచి సుహాస్‌తో జర్నీ చేస్తూనే ఉన్నాను. ‘రైటర్ పద్మభూషణ్‌’కి కూడా నేను పని చేశాను.

సుహాస్ కోసమే ఈ కథను రాసుకున్నారా?
ఈ కథను సుహాస్‌ని దృష్టిలో పెట్టుకునే రాశాను. స్క్రిప్ట్‌లో సుహాస్ ఇన్వాల్మ్మెంట్ ఏమీ లేదు. కానీ సెట్స్ మీద మాత్రం తన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని పంచుకుంటూ ఉండేవాడు.

ఈ కథలోకి శివానీ నగరం ఎలా వచ్చారు?
‘అంబాజీపేట’తో సుహాస్, శివానీ హిట్ పెయిర్‌గా నిలిచారు. ఆల్రెడీ ఆ జంట జనాల్లో ఓ ముద్రను వేసింది. అందుకే తెలిసిన జంటతోనే వెళ్దామని, శివానీని ఈ చిత్రంలో తీసుకున్నాను.

‘హే భగవాన్‌’కి స్పూర్తి ఏంటి?
సుహాస్ బలమే కామెడీ. అందుకే ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాసుకున్నాను. కామెడీతో పాటుగా ఇందులో మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ని చాలా కొత్తగా చూపించాం. అందరినీ ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది.

‘హే భగవాన్’ అనే టైటిల్‌కి న్యాయం చేశారా?
మన జీవితంలో ‘హే భగవాన్’ అని అనుకునే సందర్భాలెన్నో ఎదురవుతాయి. ఈ చిత్రంలోని పాత్రలకి కూడా అలాంటి ఘటనలెన్నో ఎదురవుతాయి. ఈ సినిమాకి ఈ టైటిల్ వంద శాతం సెట్ అవుతుంది.

‘హే భగవాన్’ ఎలా ఉంటుంది?
‘హే భగవాన్’లో ఎలాంటి కాంట్రవర్సీలను టచ్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అంతా కూడా నవ్విస్తాం. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్‌గానే ఉంటుంది. చివర్లో ఓ ఎమోషనల్ టచ్ ఇస్తాం. ఫస్ట్ సీన్‌లోనే కథను ఓపెన్ చేస్తాం.

నిర్మాతల గురించి చెప్పండి?
నిర్మాత ఇది వరకు కన్నడలో ఓ సినిమాని చేశారు. తెలుగులో ఆయనకు ఇదే మొదటి సినిమా. ఈ ప్రయాణంలో ఆయన మాకెంతో సపోర్ట్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాకి ఏం కావాలో, ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు.

వంశీ నందిపాటి గారు ఈ సినిమాలోకి ఎలా వచ్చారు?
వంశీ గారు స్క్రిప్ట్ దశ నుంచీ ఈ ప్రయాణంలో ఉన్నారు. ఆయన సహకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ మూవీని కేవలం 36 రోజుల్లోనే పూర్తి చేశాం. వారికి సినిమా చాలా నచ్చింది. అందుకే ఈ మూవీని తీసుకునేందుకు ముందుకు వచ్చారు.

సుహాస్ పాత్ర గురించి చెప్పండి?
ఇంత వరకు సుహాస్ పాత్రలు అంటే జనాల్లో ఓ అభిప్రాయం ఉంది. కానీ ఈ సారి వారి అంచనాల్ని తలకిందులు చేసేలా ఉంటుంది. ఇంత వరకు సుహాస్ చేసిన పాత్రల్లా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఇందులోని కారెక్టర్ ఉంటుంది.ఈ మూవీలో సుహాస్ ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాడు. నరేష్ గారు, వెన్నెల కిషోర్, హర్ష వర్దన్, అజయ్ ఘోష్ ఇలా అన్ని పాత్రలు అందరినీ అలరిస్తాయి. నరేష్ గారితో పని చేయడం ఓ గొప్ప అనుభూతి.

‘హే భగవాన్’ మ్యూజిక్ గురించి చెప్పండి?
‘హే భగవాన్’ పాటలకు మంచి స్పందన వస్తోంది. ఆల్రెడీ అన్ని పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే ఉన్నాయి.

‘హే భగవాన్’ మీద ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పండి?
‘హే భగవాన్’ మూవీని ఇప్పటికే చాలా మందికి చూపించాం. సినిమాని చూసిన వారంతా కూడా చాలా ఎంజాయ్ చేశారు. కడుపుబ్బా నవ్వించే చిత్రమని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అని ప్రశంసలు కురిపించారు.

Distributor Dheeraj Mogilineni interview about ‘Couple Friendly’ Movie

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు ధీరజ్ మొగిలినేని.

– పదిహేను రోజుల క్రితం “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా చూశాను. మూవీ బాగా నచ్చింది. ప్రమోద్ అన్నకు వంశీ అన్నకు కాల్ చేసి ఈ సినిమా నేను డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నా అని అడిగాను. వారు ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాను. ఇది చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే మంచి లవ్ స్టోరీ మూవీ. టైటిల్ చూసి ఇదోదే ఓన్లీ యూత్ చూడాల్సిన సినిమా అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. శివ, మిత్ర అనే రెండు క్యారెక్టర్స్ జర్నీ చూస్తారు.

– “కపుల్ ఫ్రెండ్లీ” మూవీలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి కేవలం 15 నిమిషాలు మాత్రమే సీన్స్ ఉంటాయి. మిగతా అంతా మిత్ర, శివ అనే జంట ఒకరికొకరు పరిచయం అయ్యాక వారి జీవితాలు ఎలా మారాయి. వీళ్లు ఒకరి కొకరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు అనేదే చూపిస్తున్నాం. హీరో నెల్లూరు నుంచి వచ్చి చెన్నైలో ఇంటీరియర్ డిజైనర్ గా సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. హీరోయిన్ చిత్తూరు నుంచి చెన్నై జాబ్ కోసం వస్తుంది. వీళ్లు కలిశాక ఏమైంది అనేది కథ

– హీరోయిన్ ప్రతి సందర్భంలో చెప్తాను చెప్తాను అని హీరోతో అంటూ ఉంటుంది. కొంచెం సస్పెన్స్ దాచేందుకే ఆమె అలా చెబుతుంటుంది. ఈ సినిమా టైటిల్ విషయంలో సెన్సార్ అభ్యంతరం చెప్పారు. టైటిల్ మార్చమని అన్నారు. కానీ మేము ఇప్పుడు టైటిల్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేమని చెప్పాం. టైటిల్ రిజిస్ట్రేషన్ విషయంలో మొదటి నుంచే సెన్సార్ వారి అనుమతి ఇచ్చేలా ఒక కొత్త పద్ధతి రావాల్సిన అవసరం ఉంది. మాకే కాదు ఈ మధ్య చాయ్ వాలా అనే సినిమాకు కూడా సెన్సార్ వారు అభ్యంతరం తెలిపారు.

– “కపుల్ ఫ్రెండ్లీ”లో శివ పాత్రలో సంతోష్ శోభన్ పర్ ఫార్మెన్స్ మనందరికీ చాలా నచ్చుతుంది. ఎంతో సెటిల్డ్ గా ఆయన నటించారు. సంతోష్ శోభన్ కు మంచి హిట్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ సినిమాతో ఆయనకు హిట్ రావాలి. అలాగే మంచి స్టార్ కావాలని మేము కోరుకుంటున్నాం. సంతోష్ లాంటి యంగ్ హీరోలకు సక్సెస్ వస్తే వాళ్లు మరిన్ని మూవీస్ చేస్తారు. ఇండస్ట్రీ బాగుంటుంది.

– ఈ సినిమా కోసం చెన్నై నగరంలో షూటింగ్ చేశారు. చెన్నైలో షూటింగ్ చేయడం చాలా కష్టం. పర్మిషన్స్ ఇవ్వరు. తమిళ చిత్రాలకు కూడా పర్మిషన్స్ ఉండవు. కానీ ఈ సినిమా టీమ్ మాత్రం గెరిల్లా పద్ధతిలో షూటింగ్ చేశారు. ఇటీవల మేము చెన్నై లవ్ స్టోరీ సినిమా కోసం చెన్నైలో ఇలాగే షూటింగ్ చేయాల్సివచ్చింది.

– “కపుల్ ఫ్రెండ్లీ” ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండే మంచి లవ్ స్టోరీ. మేము మా చిత్రాలతో ప్రేక్షకులు ఎమోషన్ తో ఏడిపిస్తాం. అయితే ఈ చిత్ర దర్శకుడు అశ్వన్ ప్రేక్షకుల్ని ఏడిపించలేదు గానీ హార్ట్ టచింగ్ గా మూవీ చేశారు. ఆయన ఈ సినిమాకు చేసిన స్క్రిప్ట్ పర్పెక్ట్ గా ఉంది. ప్రతి సీన్ కు మరొక సీన్ తో లింకు ఉండేలా పక్కాగా స్క్రిప్ట్ చేసుకున్నారు. స్క్రిప్ట్ తో పాటు ఆ కథను అందరికీ నచ్చేలా తెరకెక్కించారు. అయితే సినిమా చూశాక మేము ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ లో ఉంటే ఇంకో పది పర్సెంట్ ఇంటెన్స్ గా చేయగలిగి ఉండేవాళ్లం. డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మూవీలో మార్పులు చెప్పడం కరెక్ట్ కాదు. ఇది డైరెక్టర్, హీరో, ప్రొడక్షన్ హౌస్ మొదటి నుంచి నమ్మి చేసిన కథ.

– నా మనసుకు నచ్చిన మూవీస్ ను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. ఎలాంటి హర్రీ లేకుండా బాగుంది అనిపించినవే పంపిణీ చేస్తాను. ఇప్పుడు మా కపుల్ ఫ్రెండ్లీ మూవీకి సితార వారి ఫంకీ మూవీకి మధ్య పోటీ ఉంది. థియేటర్స్ విషయంలోనూ కాంపిటేషన్ కనిపిస్తోంది. వాలెంటైన్స్ డే కు మనసంతా నువ్వే, లవ్ స్టోరీ రిలీజ్ అవుతున్నాయి. మాది కొత్త సినిమా కాబట్టి మా మూవీకి ఉండే ఆడియెన్స్ మాకుంటారు. ఆ చిత్రాలకు ఉండే ఆడియెన్స్ వాటికి ఉంటాయి. రీ రిలీజ్ అంటే ఆ ప్రొడ్యూసర్స్ ఇష్టం. అయితే ఐదారుగురు స్టార్ హీరోల విషయంలో తప్ప మిగతా హీరోలకు రీ రిలీజ్ లు పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించడం లేదు.

– ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ జరుగుతోంది. సంగీత్ శోభన్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అలాగే చిన్న పిల్లలతో ఓ చిల్డ్రన్ మూవీ చేస్తున్నాం. అది సమ్మర్ లో రిలీజ్ చేస్తాం. కొందరు స్టార్ హీరోలతో స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఒక స్టార్ తో మా సంస్థలో మూవీ అనౌన్స్ చేస్తాం.

Hero Santosh Soban’s ‘Couple Friendly’ Pre-release event held grandly

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా టైటిల్ మార్చమని సెన్సార్ వారు అడిగారు. అయితే ఈ టైటిల్ తోనే సినిమా తెరకెక్కింది, ఈ టైటిల్ తోనే పబ్లిసిటీ చేశాం. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు టైటిల్ మార్చడం సరికాదని ఇదే టైటిల్ కొనసాగిస్తామని చెప్పాం. దాంతో ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. తమిళంలో మాత్రం ఇదే టైటిల్ తో యూఏ సర్టిఫికేషన్ సెన్సార్ నుంచి దక్కింది. ఈ సినిమాలో పెద్దలు చూసే కంటెంట్ ఉంటుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. “కపుల్ ఫ్రెండ్లీ” ఒక ప్యూర్ లవ్ స్టోరీ. చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనుకోవచ్చు. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ కు ఒక మంచి ఫ్యామిలీ నేపథ్యం, కుటుంబ సభ్యులు ఉంటారు. వారి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మా సినిమాను ఇబ్బందిపడకుండా చూడొచ్చు. ఈ చిత్రంతో మా హీరో సంతోష్ శోభన్ కు ఘన విజయం దక్కుతుందని, ఆయన స్టార్ హీరోల సరసన చేరుతారని ఆశిస్తున్నాం. సంతోష్ పర్ ఫార్మెన్స్ తో ప్రతి యువకుడు కనెక్ట్ అవుతాడు. మనమంతా అతని ఎమోషన్ ను మన ఎమోషన్ గా భావిస్తాం. మానస వారణాసి తన పాత్రకు లైఫ్ ఇచ్చింది. ఎక్కడా ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు. తెలుగు అమ్మాయి తను, ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. అలాగే యూవీ సంస్థకు ఈ చిత్రంతో పాటు రాబోయే సినిమాలు కూడా సక్సెస్ ఇవ్వాలి. గురువారం చెన్నైతో పాటు హైదరాబాద్, తిరుపతి, నెల్లూరు, వైజాగ్, విజయవాడలో ప్రీమియర్స్ వేయాలని ప్లాన్ చేస్తున్నాం. మా మూవీ 14న రిలీజ్ అయితే 13న సాయంత్రం నుంచే అన్ని థియేటర్స్ లో షోస్ వేస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ట్రైలర్ బాగుందంటూ కాల్స్, మెసేజ్ లు వచ్చాయి. మా డైరెక్టర్ తమిళ్ లో స్క్రిప్ట్ రాస్తే, మేము తెలుగులో డైలాగ్స్ మార్చుకుని ఆ డైలాగ్స్ లోని రిథమ్, టైమింగ్ పోకుండా ప్రాక్టీస్ చేసేవాళ్లం. ప్రతి మూవీలో తమకు పేరు రావాలని కష్టపడుతుంటారు. కానీ ఈ చిత్రంలో టీమ్ వర్క్ అంటే ఏంటో చూశాను. అందరికీ పేరు రావాలి, సినిమా ఆడియెన్స్ కు నచ్చాలని టీమ్ లోని ప్రతి ఒక్కరూ ప్రయత్నించారు. సంతోష్ శోభన్ ఈ మూవీ కోసం పడిన కష్టం మీకు మూవీలో కనిపిస్తుంది. ధీరజ్ గారు మా టీమ్ లోకి వచ్చాక చాలా ఎనర్జీ వచ్చింది. మా సినిమాను థియేటర్స్ లో తప్పకుండా చూడండి. అన్నారు.

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” మూవీకి ప్రతి ఒక్కరూ తమ సపోర్ట్ అందిస్తున్నారు. రీసెంట్ గా మేము చేసిన ప్రమోషనల్ టూర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు సక్సెస్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ లోకి ధీరజ్ గారు వచ్చాక కొత్త స్ట్రెంత్ వచ్చినట్లు ఫీలయ్యాం. ఈ సినిమాకు నేను, మా ప్రొడ్యూసర్ అజయ్ అన్న, అశ్విన్ ఎంతో ధీరజ్ కూడా అంతే. ఈ సినిమా టైటిల్ చెప్పినప్పుడు నాలో కూడా డౌట్స్ ఉండేవి. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. ఈ కథకు యాప్ట్ టైటిల్ ఇది. ఈ కథలోని సోల్ ను మేము రివీల్ చేయకుండా ఉంచాం. అదేంటి అనేది థియేటర్ లోనే చూడాలి. మిత్ర, శివ జర్నీ ఈ సినిమా. మిత్ర తనకు పరిచయం అయ్యాక శివ లైఫ్ ఎలా మారింది, మిత్ర కోసం శివ ఎంతవరకు వెళ్లాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా చూపించబోతున్నాం. ఈ సినిమా ద్వారా మేము ఏం చెప్పాలనుకున్నది మాత్రం థియేటర్ లోనే చూడాలి. ప్రభాస్ అన్నను మేము అడగకముందే మా ట్రైలర్ ను ఇన్ స్టాలో షేర్ చేశారు. అది మా మీద ఉన్న ఫ్యూర్ లవ్ అనిపించింది. అంతకంటే అదృష్టం మాకు ఏముంటుంది. అన్నారు.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్ 

I feel lucky to have the opportunity to act in the song ‘Shivoham’ – Tanikella Bharani

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివుడిని పూజిస్తూ రూపొందిన “శివోహం” పాట ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ పాటను రాధాకేశవ్ సమర్పణలో పొత్తపు కేశవరెడ్డి నిర్మించారు. దామురెడ్డి దర్శకత్వం వహించారు. యశోకృష్ణ సంగీతాన్ని అందించిన శివోహం పాటను ప్రసిద్ధ మలయాళ గాయకుడు మధు బాలకృష్ణన్ పాడారు. ఈ పాట తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కీర్తన టీవీలో అందుబాటులో ఉండనుంది. శివోహం పాట ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, నటుడు గౌతమ్ రాజు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

సంగీత దర్శకుడు యశోకృష్ణ మాట్లాడుతూ – మహాశివరాత్రి సందర్భంగా శివోహం పాటను విడుదల చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ పాటకు సంగీతాన్ని అందించే అదృష్టం నాకు దక్కింది. ఈ పాటకు సంగీతం చేసే అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. అన్నారు.

దర్శకుడు దామురెడ్డి మాట్లాడుతూ – శివోహం పాటను మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం. హిందీతో పాటు అన్ని ప్రధాన దక్షిణాది భాషల్లో రూపొందించాం. ఈ క్రమంలో నిర్మాత కేశవరెడ్డి గారు, నటులు తనికెళ్ల భరణి గారు ఎంతో సహకరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని మరింత భక్తి పారవశ్యంతో జరుపుకునేలా మా శివోహం పాట ఉంటుంది. అన్నారు.

నిర్మాత పొత్తపు కేశవరెడ్డి మాట్లాడుతూ – శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామివారు సమక్షంలో మా శివోహం పాటను ఆవిష్కరించుకోవడం, ఈ కార్యక్రమానికి తనికెళ్ల భరణి గారు, సుద్దాల అశోక్ తేజ గారు అతిథులుగా రావడం సంతోషంగా ఉంది. భక్తి భావంతో పాటు ఒక గొప్ప సందేశాన్ని భక్తులకు ఇచ్చేలా శివోహంను నిర్మించాం. అన్నారు.

ప్రముఖ నటులు తనికెళ్ల భరణి మాట్లాడుతూ – నేను పాతికేళ్ల క్రితం ఆటగదరా శివ అనే పుస్తకం రాశాను. అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మహాశివుడి గురించి కార్యక్రమం జరిగినా నన్ను అతిథిగా పిలుస్తున్నారు. శివోహం పాటలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. శివ భక్తితో లీనమై ఈ పాటలో నటించాను. ఈ పాటను ఈషా ఫౌండేషన్ ప్రాంగణంలో చిత్రీకరించే అవకాశం కలిగింది. ఈషా శైలజతో మాట్లాడి నేనే పర్మిషన్ ఇప్పించాను. ఈ పాటను వీలైనంత అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు దామురెడ్డి. యశోకృష్ణ బాగా కంపోజ్ చేశారు. సామాన్య పదాలతో అద్భుతమైన పాట రాశారు సుద్దాల అశోక్ తేజ. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేలా పాడారు మధు బాలకృష్ణన్. శివోహం పాట భక్తులందరినీ అలరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ – నాతో తొలి పాట రాయించిన వారు తనికెళ్ల భరణి. ఆయన ప్రోత్సాహం లేకుంటే నేను ఇండస్ట్రీకి రాకపోయేవాడిని. ఆయన సమక్షంలో, శంకరభారతి స్వామివారి సమక్షంలో శివోహం పాట ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది. ఈపాటను ఇంత మంది పెద్దల సమక్షంలో ఆవిష్కరించుకుంటాం అని నేను ఊహించలేదు. బ్రహ్మ కనిపించే తీరు వేరు, శ్రీవిష్ణువు కనిపించే తీరువేరు అయితే శివుడు కనిపించే తీరు నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది. శివ రాజధాని కైలాసంలో అందరూ సమానమే. సమసమాజం ఉన్న చోటు అది. అక్కడ పాము ఉంటుంది, ఎలుకా ఉంటుంది. అయితే అవి గొడవలు పడవు. కలిసే ఉంటాయి. ఇలాంటి సమసమాజం మరే దేవుడి రాజధానిలోనూ ఉండవు. అర్థనారీశ్వరుడిలా మనకు శివుడు ఎందుకు దర్శనమిస్తాడంటే భార్య భర్త ఎలా కలిసి ఉండాలో చెప్పేందుకు. ఇలాంటి గొప్ప సందేశం శివుడు మనకు అందిస్తాడు. ఈ పాట నేను రాసిన తర్వాత యశోకృష్ణ స్వరపర్చాడు. ఇలాంటి ఒక మంచి భక్తి గీతాన్ని మీరంతా విని ఆనందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామివారు మాట్లాడుతూ – శివోహం పాట మీ చేతుల మీదుగా జరగాలని తనికెళ్ల భరణి గారు నాకు ఫోన్ చేశారు. సోమవారం మా పీఠంలో అనేక అర్చన కార్యక్రమాలు ఉంటాయి. ఈ పాట కూడా శివుడి కోసమే రూపకల్పన చేసింది కాబట్టి నా దృష్టిలో రెండూ సమానమే అనుకున్నాం. అందరూ సమానమే అనే అద్వైత భావన కైలాసంలో ఉంటుంది. ప్రమదగణాలన్నీ శివుడిని పూజిస్తుంటాయి. శివోహం పేరుతో మహాశివరాత్రికి ఈ పాటను విడుదల చేయడం మనందరి అదృష్టం. అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

‘SON OF’ Movie Trailer Launch Event held grandly

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రిని హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ మూవీని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌, పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్ర‌ముఖ రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్, సముద్ర, వి.ఎన్ ఆదిత్య, రామ సత్య నారాయణ రాజు, రఘు కుంచె తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన ఈవెంట్‌లో..

ప్ర‌ముక రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘సినిమాలోని నటీనటులు, టెక్నికల్ టీంను బట్టి ఆ మూవీ మీద ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఈ మూవీకి కాస్ట్ అండ్ క్రూ బాగా సెట్ అయింది. సాయి ఈ మూవీ కోసం హీరో అయి నిర్మాత అయ్యాడా?.. నిర్మాత అయ్యాక హీరోగా మారాడా? తెలీదు. కానీ ఈ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది. ప్రతీ శుక్రవారం పదుల సంఖ్యలో చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు హిట్ అయితే ఇంకా చాలా మంది కొత్త వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వస్తారు. ‘సన్ ఆఫ్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో, నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ .. ‘నేను ఎన్నో కథల్ని విన్నాను. సతీష్ బత్తుల చెప్పిన ‘సన్ ఆఫ్’ కథ నాకు చాలా నచ్చింది. యాక్టింగ్ పట్ల శిక్షణ తీసుకున్నాను. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తాను. భాస్కర భట్ల గారితోనే ఈ కథ కోసం ఎక్కువగా చర్చించాం. అప్పుడే నాకు మ్యూజిక్ డైరెక్టర్ రిషిని పరిచయం చేశాడు. రిషి ఈ మూవీకి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. కిట్టు మాకు గొప్ప విజువల్స్‌ను ఇచ్చాడు. శోభా గారు అమ్మోరులా నా చేతిని పట్టుకుని మా సినిమాని ఇంత దూరం తీసుకు వచ్చారు. ఈ సినిమాకి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. ‘సన్ ఆఫ్’ ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతోంది. ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో కలిసి ఈ మూవీని చూడండి. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కన్నీరు కార్చకుండా మాత్రం థియేటర్ నుంచి బయటకు వెళ్లలేరు’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్, నిర్మాత‌ శోభా రాణి మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ అనే టైటిల్‌లోనే ఎంతో ఎమోషన్ ఉంది. సాయి నాకు చూపించిన ట్రైలర్ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యాను. ఇది చాలా మంచి చిత్రం అవుతుందని అప్పుడే చెప్పాను. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ ట్రైలర్ చూశాను. ఈ చిత్రంలో సాయి చక్కగా నటించాడు. మా వినోద్ గారు ఇందులో తండ్రి పాత్రను పోషించారు. శోభా గారు సినిమాను రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రముఖ దర్శకుడు వి. ఎన్. ఆదిత్య మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ విషయంలో సాయి గురించి, ఆయన శ్రీమతి గురించి మేం ఎక్కువగా ఆలోచించాం. సాయికి సినిమాలంటే చాలా ప్యాషన్. సాయి న్యూయార్క్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో యాక్టింగ్, మేకింగ్ గురించి నేర్చుకున్నాడు. ఈ మూవీని ఆల్రెడీ చూశాను. ఇదొక విచిత్రమైన కథ. ఈ కథకు స్క్రీన్ ప్లే రాయడం చాలా కష్టం. సాయి పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి’ అని అన్నారు.

నిర్మాత రామ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ సినిమా శోభా రాణి గారి వల్లే ఇక్కడి వరకు వచ్చింది. సాయి గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఓ మంచి సినిమాకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. ‘సన్ ఆఫ్’ మూవీ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాను. ఇది నాకు తొలి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సతీష్ గారికి థాంక్స్. ఇది నాకు సుదీర్ఘమైన ప్రయాణం. మా హీరో సాయి గారి ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. రిషి మ్యూజిక్, కిట్టు విజువల్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

భాస్కర భట్ల మాట్లాడుతూ .. ‘సాయి నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం. నచ్చిన టెక్నిషియన్లను తీసుకుని సాయి ఈ మూవీని గొప్పగా నిర్మించాడు. ఇందులో రెండు మంచి పాటల్ని రాశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి, సతీష్ గారికి థాంక్స్. ఈ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్‌ రిషిని నేను పరిచయం చేసినట్టు అయింది. ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రైటర్ లక్ష్మీ భూపాల మాట్లాడుతూ .. ‘సాయి నాకు పదిహేనేళ్ల క్రితం హీరో అవుతానని చెప్పాడు. ఇప్పుడు ఇలా ఓ మంచి కథతో ఆడియెన్స్ ముందుకు వస్తుండటం ఆనందంగా ఉంది. ఫాదర్ ఎమోషన్‌తో తీసిన ‘సన్ ఆఫ్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రఘు కుంచె మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’ ప్రాజెక్ట్ గురించి సాయి నాకు ముందే చెప్పాడు. నేను ఆల్రెడీ ఈ మూవీని చూశాను. నాన్న ఎందుకు వెనకపడ్డాడో ఈ సినిమాని చూస్తే తెలుస్తుంది’ అని అన్నారు.

కెమెరామెన్ కిట్టు మాట్లాడుతూ .. ‘సింగిల్ షెడ్యూల్‌లో దాదాపు 30, 40 రోజుల్లో ‘సన్ ఆఫ్’ మూవీని పూర్తి చేశాం. సాయి గారు అన్నీ సింగిల్ టేక్‌లోనే చేసేశారు. ఈ మూవీని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రిషి మాట్లాడుతూ .. ‘‘సన్ ఆఫ్’తో ఇండస్ట్రీలోకి రావడం గర్వంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన సాయి, సతీష్ గారికి థాంక్స్. భాస్కరభట్ల గారి వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

* నైజాం డిస్ట్రిబ్యూట‌ర్‌ రిషికేశ్వ‌ర్ ఫిల్మ్స్ వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘సన్ ఆఫ్ సినిమాను నేను చూశాను. చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను. వెంట‌నే ఈ సినిమాను నైజాం డిస్ట్రిబ్యూట్ చేయ‌టానికి ఓకే చెప్పాను. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని గొప్ప‌గా చూపించే సినిమా.. మీ అంద‌రి స‌హకారంతో పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో త్వ‌ర‌లోనే తెలుగులో డెబ్యూ అవుతున్న ముంబై న‌టి మిస్ సింబుల్ ఆసిఫ్‌, ముంబై డిస్ట్రిబ్యూట‌ర్ క‌మ‌లేష్ పాల్గొని సాయి సింహాద్రి హీరోగా, నిర్మాత‌గా రూపొందిన స‌న్ ఆఫ్ మూవీ పెద్ద విజ‌యం సాధించాల‌ని చిత్ర యూనిట్‌ను అభినందించారు.

Director K.V. Anudeep interview about “Mass Ka Das” Vishwak Sen’s ‘Funky’ Movie

జాతిరత్నాలు’తో హాస్య చిత్రాలలో కొత్త పంథాను సృష్టించిన దర్శకుడు కె.వి. అనుదీప్, ఇప్పుడు ‘ఫంకీ’తో మరోసారి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడానికి వస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్‌ కథానాయిక. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 
ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న విడుదలవుతున్న ‘ఫంకీ’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాల విందుని అందించడానికి ‘ఫంకీ’ చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెడుతున్న నేపథ్యంలో తాజాగా దర్శకుడు కె.వి. అనుదీప్ మీడియాతో ముచ్చటించి సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమాకి ‘ఫంకీ’ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? 
‘ఫంకీ’ టైటిల్ వినడానికి క్యాచీగా ఉంటుంది. అలాగే ఈ తరం అభిరుచులకు తగ్గట్టుగా ఉంటుందని ఈ టైటిల్ ను ఎంచుకోవడం జరిగింది. హీరో పాత్రకు కూడా ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది.
విశ్వక్ సేన్ పాత్ర ఎలా ఉండబోతుంది?
విశ్వక్ సేన్ ఇందులో ఒక సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రను రాసుకున్నప్పుడే విశ్వక్ అయితే బాగుంటారు అనిపించింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది.
‘ఫంకీ’ సినిమా జానర్, కథాంశం ఏమిటి? జాతిరత్నాలకు భిన్నంగా ఉంటుందా?
‘జాతిరత్నాలు’తో పోలిస్తే ‘ఫంకీ’ చిత్రం పూర్తి కొత్తగా ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సరదాగా చూపించడం జరిగింది. అలాగే ప్రేమ కథతో పాటు కుటుంబానికి సంబంధించిన మంచి భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయి. నిజ జీవితంలో ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే సీన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది ఈ సినిమా ఉంటుంది.
‘ఫంకీ’ సినిమాలో లాజిక్ ఉంటుందా?
ఖచ్చితంగా లాజిక్ ఉంటుంది. నా సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, లాజిక్ ఉండదని మీకు అనిపించవచ్చు. కానీ అన్ని సినిమాల్లో లాజిక్ ఉంటుంది.
‘జాతిరత్నాలు’ తరహా హాస్యం ప్రయత్నించి కొందరు విఫలమయ్యారు.. దానిపై మీ అభిప్రాయం?
మన సృష్టించే ప్రపంచం, పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి. హాస్య సన్నివేశాల్లో సహజత్వం ఉట్టిపడాలి. అప్పుడే అది ప్రేక్షకులకు చేరువ అవుతుందని నేను నమ్ముతాను. ‘ఫంకీ’ కూడా సినీ నేపథ్యం అయినప్పటికీ, సాధారణ ప్రేక్షకులకు చేరువ అయ్యేలా రూపొందించడం జరిగింది.
ఈ సినిమాలో మీరు నటించారా? భవిష్యత్తులో పూర్తిస్థాయి నటుడిగా మారే ఆలోచన ఉందా?
‘ఫంకీ’లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. నాకు నటుడిగా కంటే దర్శకుడిగా సినిమాలు చేయడమే ఆసక్తి. పూర్తిస్థాయి నటుడిగా మారే ఆలోచన లేదు. చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. దర్శకుడిగానే మరిన్ని సినిమా చేయాలని ఉంది.
ట్రైలర్ లో కామెడీ పంచ్ లు బాగా పేలాయి. మీరిలా కామెడీ సినిమాలు మాత్రమే చేస్తారా?
విభిన్న తరహా సినిమాలు చేయాలని ఉంది. ట్రైలర్ అనేది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం పూర్తి వినోదభరితంగా రూపొందించడం జరుగుతుంది. ‘ఫంకీ’లో హాస్యంతో పాటు అందమైన ప్రేమ కథ, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. అన్ని అంశాలు చక్కగా కుదిరాయి. ఇందులో కొన్ని సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయి.
ఈ సినిమాలో అతిథి పాత్రల్లో ఎవరెవరు కనిపిస్తారు? 
ఈ సినిమాలో దర్శకులు హరీష్ శంకర్ గారు, కళ్యాణ్ శంకర్, నిర్మాతలు దిల్ రాజు గారు, నాగవంశీ గారు అతిథి పాత్రల్లో కనిపిస్తారు. అయితే ఆ పాత్రలు కథలో భాగంగానే వస్తాయి. ఆ పాత్రలతో కూడా సహజమైన సంభాషణలతో హాస్యాన్ని పుట్టించే ప్రయత్నం చేశాము.
మీ గత చిత్రం ‘ప్రిన్స్’ ఫలితం మీపై ఏమైనా ప్రభావం చూపిందా?
జయాపజయాలు సహజం. ఏ సినిమాకి అయినా ఒక మంచి సినిమా చేస్తున్నామనే ఉద్దేశంతోనే శాయశక్తులా కృషి చేస్తాము. అయితే ‘ప్రిన్స్’ స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి అప్పుడు తగిన సమయం లేదు. ఇప్పుడు ‘ఫంకీ’కి తగిన సమయం తీసుకొని, మంచి స్క్రిప్ట్ ని సిద్ధం చేశాము.
‘ఫంకీ’ కథ మొదట ఎవరికి వినిపించారు?
నిర్మాత నాగవంశీ గారికి మొదట ఈ కథ వినిపించాను. ఆయనకు కథ నచ్చి, వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారు.
త్రివిక్రమ్ గారు సినిమా చూశారా? 
నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ గారు సినిమా చూశారు. ఆయనకు సినిమా నచ్చింది. కొన్ని విలువైన సూచనలు చేశారు.
నిర్మాత చినబాబు(ఎస్.రాధాకృష్ణ) గారి గురించి?
ఈ సినిమా కోసం చినబాబు గారితో ఎంతగానో ప్రయాణం చేశాను. సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు ఆయనతో చర్చించేవాడిని. ఆయన పలు సలహాలు, సూచనలు ఇచ్చేవారు.
నరేష్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది?
నరేష్ గారి పాత్ర చాలా బాగుంటుంది. ఆ పాత్ర రాసుకునేటప్పుడే ఆయనైతే బాగుంటుంది అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి నరేష్ గారంటే అభిమానం. ‘జాతిరత్నాలు’ కోసం ఆయనతో కలిసి పనిచేశాను. ఇప్పుడు మరోసారి కలిసి పని చేయడం సంతోషంగా ఉంది.
భీమ్స్ సిసిరోలియో సంగీతం గురించి?
భీమ్స్ గారితో పనిచేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఆయన దర్శకులకు విలువ ఇస్తారు, ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఫంకీ సినిమాకు ఆయన అద్భుతమైన సంగీతం అందించారు.
సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది?
సినిమా నిడివి 2 గంటల 5 నిమిషాలు. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా చూసి చాలా బాగుంది అన్నారు.
మీ తదుపరి చిత్రాలు?
మూడు నిర్మాణ సంస్థలలో సినిమాలు చేయాల్సి ఉంది. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథ రాస్తున్నాను. అలాగే, వెంకటేష్ గారి కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాను.

“Nuvve Undipo ila”, “Nuvvele” Songs Launched Grandly in the Presence of Tollywood Celebrities.

అదోనై పిక్చర్స్ క్రియేషన్స్ సమర్పణలో ప్రముఖ కొరియగ్రాఫర్ సత్య మాస్టర్ దర్శకత్వంలో అంకిత జాదవ్, రోహిత్ భోగ హీరో హీరోయిన్స్ గా నటించిన “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పేరుతో రెండు సాంగ్స్  రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పాటలకు కెకె రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. జయంత్ ఆర్యన్ సంగీతాన్ని సమకూర్చిన “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలకు రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించారు. సింగర్స్ లిప్సిక, అదితి భావరాజు పాడారు.  ఈ కార్యక్రమంలో దర్శకులు సాయి రాజేశ్, శైలేష్ కొలను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఆషురెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ – నేను ఒక ఈవెంట్ కోసం యూఎస్ కు వెళ్లినప్పుడు ప్రొడ్యూసర్ కేకే రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఈ సాంగ్స్ హిందీ వెర్షన్ రెడీగా ఉన్నాయి. తెలుగులో చేయాలనే ఆలోచనను వారు నాతో షేర్ చేసుకున్నారు. అలా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ ను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించాం. అతి తక్కువ మంది క్రూతో రెండు సాంగ్స్ ను తక్కువ టైమ్ లో కంప్లీట్ చేశాం. అన్నీ మేమే అయ్యి ఈ పాటలను చిత్రీకరించాం. ప్రొడ్యూసర్ కేకే రెడ్డి గారు ఎంతో ప్యాషనేట్ గా ఈ పాటలను ప్రొడ్యూస్ చేశారు. జయంత్ మ్యూజిక్, లిప్సిక, అదితి పాడిన తీరు, రాంబాబు గారి సాహిత్యం అన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి అన్నారు.
నిర్మాత కేకే రెడ్డి మాట్లాడుతూ – మా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మంచి లవ్ ఫీల్ తో ఈ పాటలను బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు మా డైరెక్టర్ సత్య గారు. ఆయన కొరియోగ్రఫీ కూడా ఈ పాటలకు హైలైట్ అవుతుంది. లిప్సిక, అదితి ఈ పాటలను పాడిన విధానం చూస్తే వారికి గానకోకిల అని పిలవాలని అనిపిస్తోంది. జయంత్ మంచి ట్యూన్ తో కంపోజ్ చేశారు. ఈ పాటలు మళ్లీ మళ్లీ వినేలా ఉంటాయి. మీ అందరి ఆదరణ మా సాంగ్స్ కు దక్కుతుందని ఆశిస్తున్నాం అన్నారు.
హీరోయిన్ అంకిత జాదవ్ మాట్లాడుతూ – నేను బాలీవుడ్ నుంచి వచ్చాను. అక్కడ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంటాను. నేను చేసిన ఐదో మ్యూజిక్ ఆల్బమ్ ఇది. “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలను న్యూయార్క్, షికాగోలో షూటింగ్ చేశాం. అక్కడ అననుకూల వాతావరణంలో సాంగ్స్ ను కష్టపడి చిత్రీకరించాం. సత్య మాస్టర్ డైరెక్షన్ లో ఈ సాంగ్స్ చేయడం సంతోషంగా ఉంది. మా పాటలను మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ జయంత్ ఆర్యన్ మాట్లాడుతూ – ఈ సాంగ్స్ ను మేము హిందీలో చేశాం. తెలుగులోకి తీసుకురావాలని అనుకున్నప్పుడు ఇక్కడ మ్యూజిక్ లవర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సందేహించాం. కానీ మా సాంగ్స్ లాంఛ్ కు ఇంతమంది పెద్దలు గెస్ట్ లుగా వచ్చాక చాలా నమ్మకం కలుగుతోంది. మా సాంగ్స్ ను తప్పకుండా తెలుగు ఆడియెన్స్ అంతా ఇష్టపడతారు అన్నారు.
నటి అషురెడ్డి మాట్లాడుతూ – “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ చాలా బాగున్నాయి. సత్య మాస్టర్ బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. హీరోయిన్ అంకితకు ఈ సాంగ్స్ తర్వాత తెలుగులో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా అన్నారు.
లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ – “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ జయంత్ గారికి, సింగర్ లిప్సిక, ప్రొడ్యూసర్ కేకే రెడ్డి గారికి కంగ్రాట్స్ చెబుతున్నా. తక్కువ మంది క్రూతో, తక్కువ టైమ్ లో సత్య మాస్టర్ ఈ పాటల్ని అందంగా చిత్రీకరించారు. ఆయన త్వరలో సినిమాలకు కూడా దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నా అన్నారు.
సింగర్ లిప్సిక మాట్లాడుతూ – “నువ్వే ఉండిపో ఇలా” సాంగ్ పాడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సాంగ్ కు రాంబాబు గారి లిరిక్స్, జయంత్ గారి మ్యూజిక్, సత్య మాస్టర్ డైరెక్షన్, కొరియోగ్రఫీ హైలైట్స్ గా నిలుస్తాయి. “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” బ్యూటిఫుల్ సాంగ్స్ గా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి అన్నారు.
డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ లో అంకిత జాదవ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. ప్రొడ్యూసర్ కేకే రెడ్డి గారు ఇలాంటి సాంగ్స్ మరిన్ని చేయాలి. మా వెల్ విషర్ సత్య మాస్టర్ డైరెక్షన్ చాలా బాగుంది. ఆయన సినిమాకు కూడా డైరెక్షన్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.
డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ – సత్య మాస్టర్, ఆయన టీమ్ అంటే నాకు చాలా ఇష్టం. మాతో కూడా సత్య మాస్టర్ డ్యాన్సులు చేయించారు. “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ మంచి విజువల్స్ తో ఆకట్టుకుంటున్నాయి. చిన్న టీమ్ తీసుకుని ఈ పాటలను ఇంత బాగా తెరకెక్కించారు సత్య మాస్టర్. ఆయన కష్టం ఈ పాటలో తెలుస్తోంది. సత్య మాస్టర్ తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నా. ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇండస్ట్రీ మంచి పొజిషన్ లో ఉందిప్పుడు. మా చిన్నప్పుడు కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ ఎంజాయ్ చేసేవాళ్లం. కథలో మాత్రమే ఫిట్ అయ్యే సాంగ్స్ మేము రూపొందిస్తాం. కానీ ఇండిపెండెంట్ ఆల్బమ్ లో ఆ పాట కోసం ఒక థీమ్ క్రియేట్ చేస్తారు. ఈ సాంగ్స్ ఈ టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలి అన్నారు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాట్లాడుతూ – ఒక మంచి పాటకు ముందు రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ కు క్రెడిట్ ఇవ్వాలి. ఈ రోజు వీళ్లిద్దరిది. “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” సాంగ్స్ రాసిన రాంబాబు గోసాల, మ్యూజిక్ డైరెక్టర్ జయంత్ లకు ఫస్ట్ కంగ్రాట్స్. నేను ఈ సాంగ్స్ చూడలేదు. వీళ్లంతా చెబుతుంటే చాలా బాగున్నాయని తెలుస్తోంది. సత్య మాస్టర్ ఏ రిజల్ట్ కోసం ఈ సాంగ్స్ చేశారో అంతమంచి సక్సెస్ ఇవ్వాలి అన్నారు.
నటీనటులు – అంకిత జాదవ్, రోహిత్ భోగ
టెక్నికల్ టీమ్:
ఎడిటర్ – కిషోర్ మద్దాలి
డీవోపీ – శ్రీకాంత్ పెన్మెత్స
మ్యూజిక్ – జయంత్                                                                                                 
లిరిక్స్ – రాంబాబు గోసాల 
సింగర్స్ – అదితి భావరాజు, లిప్సిక
ప్రొడ్యూసర్ – కేకే రెడ్డి
కొరియోగ్రఫీ, డైరెక్షన్ – సత్య మాస్టర్
పీఆర్ఓ – చందు రమేష్

‘Nawab Cafe’ Movie Grand Releasing on February 20th

శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు.  ఈక్రమంలో చిత్రయూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..

*హీరో శివ కందుకూరి మాట్లాడుతూ* .. ‘‘చాయ్ వాలా’ అంటూ మా జర్నీని ప్రారంభించాం. ‘చాయ్ వాలా’ని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా కష్టపడ్డాం. సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్‌‌ని గౌరవిస్తూ మేం మా టైటిల్‌ను ‘నవాబ్ కేఫ్’గా మార్చాం. ప్రమోద్ ముందుగా నాకు ఈ కథను చెప్పినప్పుడు ‘నవాబ్ కేఫ్’ అని టైటిల్ అనుకున్నాం. నా ఫోన్‌లో ప్రమోద్ పేరు కూడా అదే ఉంటుంది. ఇప్పుడు విధి చివరకు ‘నవాబ్ కేఫ్’ టైటిల్‌ను పెట్టేలా చేసింది. ‘నవాబ్ కేఫ్’ టైటిల్ మా సినిమాలోని స్టోరీని, ఆత్మని తెలియజేస్తుంది. టైటిల్ చేంజ్ అయినా, సెన్సార్ సమస్యలు వచ్చినా మా నిర్మాత వెంకట్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా నిలబడ్డారు. ‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తోనే మళ్లీ ప్రమోట్ చేద్దామని టీం అంతా ముందుకు వచ్చింది. ఎంతో నిజాయితీతో, జెన్యూన్‌గా ఈ మూవీని చేశాం. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. చిత్రం చూసి బయటకు వచ్చిన తరువాత కచ్చితంగా నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతారు.  ఫిబ్రవరి 20న ‘నవాబ్ కేఫ్’ అనే కొత్త పేరుతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం. ఇంత వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా, ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.
 
*నిర్మాత వెంకట్ మాట్లాడుతూ* .. ‘అసలు మాకు టైటిల్ మార్చమని అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. నేను ముంబైకి వెళ్లాను. సెన్సార్ టీంతో మాట్లాడాను. ‘చాయ్ వాలా’ అనే టైటిల్ వద్దు అని చెప్పారు. ఆ తరువాత మేం చాలా టైటిల్స్ అనుకున్నాం. కానీ మేం వర్కింగ్ టైటిల్‌గా పెట్టుకున్న ‘నవాబ్ కేఫ్’నే చివరకు ఫిక్స్ చేశాం. మా ఈ ‘నవాబ్ కేఫ్’ టైటిల్‌ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మాకు మీడియా సపోర్ట్ ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

*దర్శకుడు ప్రమోద్ హర్ష మాట్లాడుతూ* .. ‘‘చాయ్ వాలా’ టైటిల్‌ను మేం కొన్ని కారణాలతో మార్చాం. సెన్సార్ వారి గైడ్ లైన్స్, రూల్స్ ప్రకారం కొత్త టైటిల్‌ను పెట్టాం. నేను చూసిన, అనుభవించిన సంఘటనల్ని ఆధారంగా చేసుకునే ఈ కథను రాసుకున్నాను. మా ఈ ‘నవాబ్ కేఫ్’ టైటిల్‌ను ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లాలని మీడియాని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*హీరోయిన్ తేజు అశ్విని మాట్లాడుతూ* .. ‘ఏ టైటిల్ పెట్టినా కంటెంట్ బాగుంటే, సినిమా నచ్చితే ఆడియెన్స్ ఆదరిస్తారు. ఇది నా మొదటి చిత్రం. మా ‘నవాబ్ కేఫ్’ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓ మంచి ప్రొడక్ట్ బయటకు రావాలనే ఇలా దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఫిబ్రవరి 20న మా సినిమా రాబోతోంది. మీడియా, ఆడియెన్స్ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

తారాగణం: శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్ : హర్షిక ప్రొడక్షన్స్
రచయిత & దర్శకుడు: ప్రమోద్ హర్ష
నిర్మాత : రాధా వి పపుడిప్పు
సహ నిర్మాత: వెంకట్ ఆర్ పాపడిప్పు
సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్ విహారి
DOP: క్రాంతి వర్ల
ప్రొడక్షన్ డిజైనర్: సుప్రియ బట్టెపాటి
ఎడిటర్: పవన్ నరవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శశి కె నారాయణ
పీఆర్వో : వంశీ కాకా

Historic Overseas Deal for ‘Toxic’ as Phars Film Locks Record-Breaking Deal for its Indian Language versions

Even before it sets the box office on fire, Toxic has already rewritten the rules of the game. The film first made headlines by becoming the first non-Telugu film to seal a historic ₹120 crore distribution deal with Dil Raju’s powerhouse banner Sri Venkateswara Creations (SVC) in the AP–TG market – a move that sent shockwaves across the Indian film industry. And now, the phenomenon has grown even bigger.

On the international front, Toxic has been acquired by Phars Film, one of the leading and most dominant overseas distributors, marking yet another colossal milestone in the film’s extraordinary pre-release journey. The deal is being touted as one of the highest-ever overseas acquisitions for an Indian film, with ₹105 crore secured as advance on a commission basis—a staggering vote of confidence from the global market. The numbers show confidence of the market in the film and Rocking Star Yash, indicator of ground level buzz. even without teaser, the film is garnering massive numbers

Importantly, this landmark deal applies exclusively to the Indian-language versions (Kannada, Tamil, Telugu, Hindi, Malayalam) of Toxic, and does not include the English version – a crucial distinction that further underscores the immense standalone strength of the film’s Indian-language appeal overseas.

The faith placed in Toxic isn’t without precedent. Yash’s previous outing, KGF: Chapter 2, delivered phenomenal and historic business across global markets, emerging as the highest-grossing Indian film in the GCC region and clocking extraordinary numbers across several international territories. That roaring global success has now laid the foundation for Toxic to aim even higher.

The Yash starrer is now gearing up for what is being planned as the widest international rollout ever for an Indian film, with releases scheduled across the entire world, except Nepal, Japan, and China. It’s an audacious move that firmly positions Toxic as a global cinematic event in the making.

Mr Ahmad Golchin CEO & Founder of Phars Films says,
“With Toxic, our goal was to tell a story that resonates beyond borders. We are proud to bring this film to international audiences and to see its themes connect across cultures. This overseas release marks an important milestone for Phars Film, and we’re excited for viewers worldwide to experience the intensity and emotional depth of Toxic.”

Venkat K Narayana from KVN Productions adds,
“Toxic has been envisioned as a film that speaks a universal cinematic language, and for a vision of this scale, we needed a partner with extraordinary global strength and credibility. Phars Films has consistently demonstrated an unparalleled ability to position Indian cinema powerfully across international markets, and we are proud to join hands with them for what is truly a landmark overseas distribution deal.
With their expansive reach and strategic expertise, we are confident that Toxic will open to audiences worldwide with the scale, impact, and momentum it deserves, setting new benchmarks for global releases from Indian cinema.”

After a a record-shattering domestic deal(Telugu), a ₹105 crore overseas acquisition by Phars Film, and the towering global legacy of KGF 2 backing it, Toxic is cementing its status as a worldwide phenomenon long before release. Mounted on a grand international canvas, Toxic promises a visually explosive cinematic universe powered by world-class technicians, cutting-edge VFX, a compelling storytelling world, and a stellar ensemble, foreshadowing its future as a 1000 crore mega blockbuster.

Written by Yash and Geetu Mohandas and directed by Geetu Mohandas, Toxic: A Fairytale for Grown-Ups has been simultaneously shot in Kannada and English, with dubbed versions planned in Hindi, Telugu, Tamil, Malayalam, and several other languages, underscoring the film’s global ambition.

The film boasts a formidable technical lineup, with National Award-winning cinematographer Rajeev Ravi behind the lens, music composed by Ravi Basrur, editing by Ujwal Kulkarni, and production design by TP Abid. The action sequences are mounted on a grand scale, choreographed by Hollywood action director JJ Perry (John Wick), alongside National Award-winning action directors Anbariv and Kecha Khamphakdee.

Renowned Actress Indraja in a Key Role ‘Viplava Veerudu’ Movie Shooting Begins

Viplava Veerudu, a film portraying the heroic role of common people in India’s freedom struggle, has officially commenced shooting with grand pooja ceremonies held at a divine venue in Filmnagar Temple.

Directed by S. Nagaraj Rao, the film stars Indraja in a pivotal role, with Jaiswar and Sonali as the lead pair. The movie is being produced by AV Jayaram under the banner of AVJR Productions. Eminent writer Paruchuri Gopalakrishna gave the first clap on Indraja for the muhurat shot, formally launching the shoot.

Speaking on the occasion, Indraja said,
“This film beautifully and realistically portrays a story from the freedom struggle era. It highlights how ordinary people actively participated in the independence movement. The story revolves around a common man who transforms into a revolutionary hero and fights valiantly for freedom. I will be seen in the role of Rani Bhavani Devi. The narrative focuses on how Indians confronted British rule. Producer Jayaram is making a meaningful film with a strong message, and I seek everyone’s blessings.”

Hero Jaiswar stated,
“I will be appearing before audiences in the role of Viplava Veerudu. This character is very special to me, and I believe the film will leave a lasting mark in cinematic history.”

Heroine Sonali setti said,
“I am extremely grateful for this wonderful opportunity. This is my debut film, and I seek the blessings and support of everyone.”

Director S. Nagaraj Rao shared,
“This is my dream project. We are presenting a historical story set during the British era. Indraja garu plays a very significant role in this film.”

Producer AV Jayaram added,
“The story is set during the period of Tipu Sultan. The film depicts how the British exploited India under the guise of trade and the resulting consequences. It will be a film with a powerful message.”

Actor Patel Ashok Reddy remarked,
“The freedom we enjoy today is the result of the sacrifices made by great warriors of the past. This film brings such unsung heroes to the silver screen.”

Film Details:
Banner: AVJR Productions
Cast: Indraja, Jaiswar, Sonali Shetty, Kishore, Raghini Prajwal, Patel Ashok Reddy, and others
Producer: AV Jayaram,
Director: S. Nagaraj Rao
Technical Director & DOP: Mathew Rajan
Music: Uday
Editor: MNR
PRO: Ashok Dayyala