Home Blog Page 27

Sri Chaitanya student suicide incident – what is really happening?

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీచైతన్య శారదా భవన్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మొల్లి పవన్‌కుమార్‌ (17) మృతి ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు, పెనమలూరు సీఐ జె. వెంకట రమణ ఈ వివరాలను వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం… తోటి విద్యార్థి హేమంత్‌తో ఏర్పడిన వివాదం నేపథ్యంలో జనవరి 5, 30 తేదీల్లో పవన్‌కుమార్‌పై ఆరుగురు విద్యార్థులు దాడి చేశారు. ఆ దాడి దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో పవన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చివరకు జనవరి 31న హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంఘటన అనంతరం కాలేజీ ప్రిన్సిపల్‌తో పాటు సిబ్బంది సాక్ష్యాలను చెరిపివేసి ఘటనను దాచేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పవన్ ఆత్మహత్యకు కారణమైన ఆరుగురు విద్యార్థులు, సాక్ష్యాలు తారుమారు చేసిన ఆరుగురు సిబ్బందిని అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా, పవన్‌కుమార్‌ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని, మృతుని కుటుంబానికి శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, బంగారుమెట్ట గ్రామస్తులు అనకాపల్లిలోని శ్రీచైతన్య కాలేజీ వద్ద ఇటీవల ధర్నా నిర్వహించారు.

సీనియర్‌ విద్యార్థులు పవన్‌ను దారుణంగా కొట్టి చంపారని, ఈ ఘటనను కాలేజీ యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ మృతుని కుటుంబాన్ని తప్పుదోవ పట్టిస్తోందని వారు ఆరోపించారు.

Dr. Rajendra Prasad’s first film to be released after the Padma Shri award is ‘Pithapuramlo’

“ ప్రేయసి రావే, అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం, రెడ్ అలర్ట్” వంటి చిత్రాలతో దర్శకునిగా మంచి గుర్తింపు సంపాదించారు మహేష్ చంద్ర . తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉపశీర్షిక ‘అలా మొదలైంది’ .

ఈ చిత్రంలో ‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K.A. పాల్ రాము, జబర్దస్త్ శేషు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మహేష్ చంద్ర సినిమా టీమ్ బ్యానర్‌పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్‌.ఎం. మురళీ (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ, “ఇది ముగ్గురు అమ్మాయిల కథలా అనిపించే ముగ్గురు తండ్రుల వ్యధ. ఈ ఇంటర్ నెట్ తరం తెలుసుకోవాల్సిన అసలైన కథ ఇది. ఈ సినిమా చూస్తుంటే, చుట్టూ ఉన్న సమాజాన్ని, చాలా కుటుంబాల్ని, ఎంతోమంది జీవితాలను చూస్తున్నట్టే ఉంటుంది. అలాగని ఇదేదో పక్తు సెంటిమెంట్ సినిమా అనుకోవద్దు. ఇందులో ప్రేమ ఉంది. రొమాన్స్ ఉంది. వినోదం ఉంది. మంచి ఫంచ్ డైలాగులు ఉన్నాయి. చక్కటి పాటలు ఉన్నాయి. అటు యువతని, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఇటీవల కాలంలో ‘పిఠాపురం’ పేరు ఎంతలా చర్చల్లో నిలిచిందో అందరికీ తెలుసు. ఆ నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని ఈ కథను మలిచాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని తెలిపారు.

పద్మశ్రీ పురస్కారం పొందిన 

డా. రాజేంద్రప్రసాద్‌కు శుభాకాంక్షలు

‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్ ఇటీవల ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం పొందిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ వచ్చిన ఈ గౌరవాన్ని పురస్కరించుకుని చిత్రబృందం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. పద్మశ్రీ అవార్డు తర్వాత విడుదలయ్యే డా. రాజేంద్రప్రసాద్  తొలి చిత్రం ‘పిఠాపురంలో’ కావడం తమ అదృష్టమని మహేష్ చంద్ర సంతోషం వ్యక్తంచేశారు. ఈ సినిమా క్లైమాక్స్ లో రాజేంద్ర ప్రసాద్ నటన అద్భుతం అని మహేష్ చంద్ర ప్రశంసించారు. 

ప్రసిద్ధ ఆదిత్యా మ్యూజిక్ సంస్థ కి ఆడియో హక్కులు

ఈ చిత్రానికి సంగీతాన్ని G.C. క్రిష్ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ ‘ఆదిత్యా మ్యూజిక్’ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ప్రతీ పాట కూడా ప్రత్యేక శైలిలో, విభిన్నమైన ట్యూన్స్‌తో రూపొందినట్లు చిత్రబృందం తెలిపింది. గోవా, హైదరాబాద్, సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ లొకేషన్లలో పాటల చిత్రీకరణ జరిగింది.

సాంకేతిక విభాగం

• కథ: ఆకుల సురేష్ పటేల్

• స్టోరీ డెవలప్‌మెంట్ & డైలాగ్స్: శ్రీరామ్ ఏదోటి

• ఎడిటర్: B. సత్యనారాయణ

• మ్యూజిక్: G.C. క్రిష్

• ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అంజి సండ్రాల

• నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య)

• స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: మహేష్ చంద్ర

Reba Monica John as IPS Seetha Parasuram in Investigative Thriller “Mrithyunjay”

The King of Entertainment Sree Vishnu, is currently bringing an investigative thriller titled “Mrithyunjay” directed by Hussain Sha Kiran. The film is produced by Sandeep Gunnam and Vinay Chilakapati under the banners of Lightbox Media and Picture Perfect Entertainment. Ramya Gunnam presenting the film.

The blockbuster Samajavaragamana duo is all set to share the screen once again. Reba Monica John is playing the female lead in Mrithyunjay. Today, the makers dropped her first-look poster, which has raised curiosity about her role. In the striking poster, Reba is seen as a police officer, IPS Seetha Parasuram.

Reba John’s intriguing look is getting a solid response. The youth heartthrob, who bowled over Telugu audiences with her beauty and acting, takes on this interesting role. Everyone is eager to witness her performance and the kind of thrills she brings to this investigative thriller.

Mrithyunjay is hitting the big screens on February 27, 2026. With proper promotions and exciting content, Mrithyunjay is all set to impress the audience. This Sree Vishnu-styled thriller promises another intriguing entertainer. The cinematography is managed by Vidhya Sagar, Kaala Bhairava is composing the music, Sreekar Prasad is in charge of editing, and Manisha A. Dutt overseas production design.

Uday Kiran’s ‘Manasantha Nuvve’ is being grandly re-released as a Valentine’s Day special.

ప్రముఖ నిర్మాత శ్రీ ఎమ్.ఎస్.రాజు తన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన
” మనసంతా నువ్వే ” చిత్రం 2001 లో విడుదలై, అశేష తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొంది, రెండొందల యాభై రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడింది. ఉదయ్ కిరణ్, రీమాసేన్, తనూరాయ్, ప్రధాన పాత్రలు పోషించిన ఈ సున్నితమైన ప్రేమకథా చిత్రానికి వీ.ఎన్.ఆదిత్య తొలిసారి దర్శకత్వం వహించారు. పాతికేళ్ల తర్వాత ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి, చైతన్యారెడ్డి,
శ్రీ మాత క్రియేషన్స్ పై రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఈ నెల 14 వ తేదీన, వేలంటైన్స్ డే సందర్భంగా మరలా థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ జెనరేషన్ యూత్ కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకత్వం చేసిన ఈ మ్యూజికల్ హిట్ చిత్రానికి సిరివెన్నెల గీత రచన, పరుచూరి బ్రదర్స్ రచన, సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీ, ఎస్.గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం, రాజేష్ టచ్ రివర్ కళ అదనపు ఆకర్షణలు. తెరమీద సునీల్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, పరుచూరి వేంకటేశ్వరరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, శివపార్వతి, సుధ, రజిత, శిరీష , కౌశల్, మాస్టర్ ఆనందవర్ధన్, బేబీ సుహానీ లిఖిత తమ పాత్రలకు జీవం పోశారు.

Vishwak Sen & Anudeep KV ‘FUNKY’ Trailer Released held grandly

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్‌ కథానాయిక.

ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగు పెట్టనున్న ‘ఫంకీ’ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది.

‘ఫంకీ’ ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. కె.వి. అనుదీప్ శైలి కామెడీతో నవ్వులు పూయించింది. ప్రతి ఫ్రేమ్‌లో వినోదం ఉట్టిపడేలా రూపొందించిన ఈ ట్రైలర్, థియేటర్లలో నవ్వుల తుఫాన్ చూడబోతున్నామనే హామీ ఇచ్చింది. విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కలిసి తెరపై చురుకుగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరి.. చిత్రానికి కొత్త ఉత్సాహాన్ని, మరింత అందాన్ని జోడించింది. ప్రధాన తారాగణంతో పాటు ఇతర పాత్రలు కూడా నవ్వులు పూయిస్తూ ‘ఫంకీ’ని పూర్తి స్థాయి వినోదభరిత చిత్రంగా మలిచాయి. మొత్తానికి ట్రైలర్ తో ‘ఫంకీ’ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “మీ అందరినీ కలిసి దాదాపు సంవత్సరం అవుతుంది. ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే ఈ విరామం తీసుకోవడం జరిగింది. ఫంకీ సినిమా రెండు గంటల పది నిమిషాల పాటు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటుంది. ఫోన్ పెట్టుకోవాలనే ఆలోచనే రాదు. ప్రతి సన్నివేశం చూస్తూ నవ్వుకుంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్ కి రండి. కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.

కథానాయిక కయాదు లోహర్‌ మాట్లాడుతూ.. “మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. ట్రైలర్ చూశారు కదా ఎంత కామెడీగా ఉందో. సినిమా దీనికి వంద రెట్లు ఉంటుంది. అనుదీప్ గారి ట్రేడ్ మార్క్ కామెడీ చూస్తారు. నాకు ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి ధన్యవాదాలు. ఫిబ్రవరి 13న విడుదలవుతున్న మా ఫంకీ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ..”ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫిబ్రవరి 13న థియేటర్ కి రండి. ఫంకీ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.” అన్నారు.

సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..“ట్రైలర్ మీ అందరికీ నచ్చింది కదా. పంచ్ లు బాగా పేలాయి కదా. సినిమా అంతా ఇలాగే ఉంటుంది. ప్రతి సన్నివేశం మిమ్మల్ని నవ్విస్తుంది. కామెడీ కోసం థియేటర్ కి రండి. దర్శకుడు అనుదీప్ మిమ్మల్ని అసలు నిరాశపరిచాడు. జాతిరత్నాలుతో ఎలా ఆకట్టుకున్నాడో ఫంకీతో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటాడు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఫంకీ సినిమా ఖచ్చితంగా నవ్విస్తుంది.” అన్నారు.

స్వచ్ఛమైన హాస్యానికి పర్యాయపదంగా నిలిచిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జాతిరత్నాలు’ను అందించిన దర్శకుడు కె.వి. అనుదీప్, తన శైలి కామెడీ విందుతో తిరిగి వచ్చారు. ఈసారి రెట్టింపు వినోదంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు.

భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. కాలు కదిపే పాటలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలతో ఆ విషయాన్ని రుజువు చేశారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీతనానికి, విజయవంతమైన చిత్రాలకు పేరుగాంచిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ఫంకీ’పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.

విభిన్న పాత్రలు, విశ్వక్ సేన్-కయాదు లోహార్ సరికొత్త జోడి, ఉత్సాహభరితమైన సంగీతం, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి పేరుగాంచిన దర్శకుడు వంటి అంశాలన్నీ తోడై ‘ఫంకీ’ చిత్రం వెండితెరపై అపరిమిత వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెడుతున్న ‘ఫంకీ’ చిత్రం, ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాల విందుని అందించనుంది.

చిత్రం: ఫంకీ
తారాగణం: విశ్వక్ సేన్, కయాదు లోహర్‌, నరేష్, వీటీవీ గణేష్ తదితరులు
దర్శకత్వం: అనుదీప్ కె.వి.
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
రచన: అనుదీప్ కె.వి, మోహన్
కళా దర్శకుడు: జానీ షేక్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Action King Arjun’s Directorial Venture Seetha Payanam Trailer Unveiled, Promises Love, Action & Drama

Action King Arjun returns to the director’s chair with Seetha Payanam, produced under his banner Shree Raam Films International. The film marks the debut of his daughter Aishwarya Arjun, leading an impressive ensemble that includes Niranjan, Sathyaraj, Prakash Raj, and Kovai Sarala. Arjun himself appears in a key cameo, while his nephew, Action Prince Dhruva Sarja, boosts the excitement with a special appearance. The film hits theatres on February 14th, and the makers have just dropped the theatrical trailer.

The story revolves around a young chef raised by her overprotective father. During a long drive, she reluctantly offers a lift to a stranger- on the condition that every phone call he receives is on loudspeaker. What starts off as a breezy journey gradually takes a darker turn, leading to an unexpected twist.

Arjun’s experience is evident in both his writing and direction. The fresh narrative, clean storytelling, and his impactful special appearance stand out. Niranjan makes an impressive debut as the male lead, while Aishwarya Arjun looks charming and delivers a confident, mature performance.

Sathyaraj shines as the protective father, and Prakash Raj brings emotional weight- particularly in a poignant sequence about the real meaning of marriage. Dhruva Sarja’s action-packed cameo adds extra punch.

G Balamurugan’s cinematography offers vibrant visuals, while Melody King Anup Rubens elevates the mood with a soulful score. Sai Madhav Burra’s dialogues land effectively. Ayub Khan handles the editing, and Kick Ass Kali amps up the action with dynamic stunt choreography.

With just a week to go for its Valentine’s Day release, the trailer has set high expectations for Seetha Payanam.

Cast: Niranjan, Aishwarya Arjun, Sathyaraj, Prakash Raj, Kovai Sarala, Action King Arjun, Action Prince Dhruva Sarja & others

Technical Crew:
Banner: Shree Raam Films International,
Story – Screenplay – Producer – Director: Action King Arjun
Dialogues: Dr. Sai Madhav Burra
Music: Melody King Anup Rubens
Cinematography: G. Balamurugan
Editor: Ayub Khan
Art Directors: Mohan B. Keri, Shiva Kamesh D., CH Krishna
Fights: Kick Ass Kali
Line Producer: UL. Murthy
Choriography: Lalitha shobi, Shresti Verma
PRO: Sai Satish
Digital Marketing: Star Circle

‘Sri Chidambaram Garu’ Success Celebretions held grandly

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అందరి హృదయాలను హత్తుకుంటూ ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా అందరి ప్రశసంలు అందుకుంటోంది. ఈసందర్భంగా చిత్ర యూనిట్‌ బ్లాక్‌బస్టర్‌ థ్యాంక్స్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా

దర్శకుడు వినయ్‌ రత్నం మాట్లాడుతూ ” ఈ రోజు నా సక్సెస్‌కు కారణం నా టీమ్‌. ఈ వేదికపై ఈ రోజు నేను ఉండటానికి, సినిమా జనాల్లో రావడానికి ప్రధాన కారణం మా నిర్మాత గోపాల కృష్ణారెడ్డి గారు. ఈసినిమాకు ప్రీమియర్స్‌ దగ్గర నుంచే మంచి ఫీడ్‌బ్యాక్‌ వస్తుంది. ఇప్పుడు సినిమా విడుదల తరువాత అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. కానీ ఇంకా ఆడియన్స్‌ నుంచి మరింత సపోర్ట కావాలి. ఈ సినిమా చూసి మలయాళం నుంచి అప్రిషియేషన్‌ వస్తుంది. ఇంతకు ముందు తెలుగు నుంచి మలయాళ వాళ్లకు ప్రశంసలు వచ్చేవి. ఇప్పుడు మా సినిమాకు మలయాళం నుంచి ఫోన్స్‌ వస్తున్నాయి. సినిమా చూసిన వాళ్లు మీ మౌత్‌టాక్‌తో మరింత మందికి చెప్పండి. ఈ సినిమా ఈరోజు ఇంత అప్రిషియేషన్‌ వస్తుందంటే మా టెక్నిషియన్స్‌ కూడా కారణం. వాళ్లకు నా కృతజ్క్షతలు’ అన్నారు.

చింత గోపాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ” కొత్త టీమ్‌తో చేసిన సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. సినిమా చూసిన వాళ్లు బాగుందని ఫోన్‌ చేస్తున్నారు. కొత్త టీమ్‌ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. ఈ విజయానికి కారణమైన అందరికి థ్యాంక్స్‌. నిర్మాతగా ఈ సినిమా కమర్షియల్‌గా కూడా హ్యపీగా ఉన్నాను. మా ప్రయత్నంలో ఉన్న నిజయితీని గుర్తించారు. త్వరలో మరో కొత్త దర్శకుడితో మరో సినిమాతో మీ ముందుకు వస్తాను’ అన్నారు.

వంశీ తుమ్మల మాట్లాడుతూ ” నా మొదటి సినిమాకే ఇంత మంచి అప్లాజ్‌ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ స్టేజీ మీద ఉన్న ప్రతి ఒక్కరూ హీరోనే. నా పర్‌ఫార్మెన్స్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా ఫోటోగ్రఫీతో, సంగీతంతో మరో లెవల్‌కు వెళ్లిపోయింది. ఈ సంగీతాన్ని, విజువల్స్‌ని థియేటర్‌లో అందరూ ఎక్స్‌పీరియన్స్‌ చేయాలి. చిదంబరం ప్రపంచంలోకి వచ్చిన అందరూ కొత్త అనుభూతికి లోనవుతున్నారు’ అన్నారు.

సంధ్య వశిష్ట మాట్లాడుతూ ” శ్రీ చిదంబరం గారు’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌. సినిమాకు అందరూ పాజిటివ్‌ రివ్యూస్‌ రాశారు. లీల పాత్ర అందరికి నచ్చుతున్నందుకు ఆనందంగా ఉంది. మా నిర్మాత మా లాంటి కొత్త టాలెంట్‌ను మరింత మందిని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. ఇదొక క్లీన్‌ రీఫ్రెషింగ్‌ స్టోరీ తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుంది అన్నారు.

ఈ హార్ట్‌ విన్నింగ్‌ బ్లాక్‌బస్టర్‌ థాంక్యూ మీట్‌లో బాలనటుడు శశికిరణ్‌, నిర్మాత రమణా రెడ్డి, డీఓపీ అక్షయ్‌ రామ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి, చందు తదితరులు పాల్గొన్నారు.

‘Amaravathiki Aahwanam” Pre-Release Event Held Grandly; Worldwide Movie Releasing on Feb 13th

శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా “అమరావతికి ఆహ్వానం”. ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీల‌క‌ పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ సినిమాను నిర్మించారు. “అమరావతికి ఆహ్వానం” సినిమా ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శనివారం హైదరాబాద్ లోని ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధులుగా ప్ర‌ముఖ న‌టులు, నిర్మాత ముర‌ళి మోహ‌న్‌గారు, యంగ్ హీరో అశ్విన్ బాబు హాజ‌ర‌య్యారు…ఈ కార్య‌క్ర‌మంలో…

డీఓపీ జె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ – అమరావతికి ఆహ్వానం అంటే ఇది ఏపీలోని అమరావతి అనుకుంటున్నారు. కాదు ఇది నలుగురు ఏంజిల్స్ ఉండే అమరావతి. వాళ్లు తమ అందంతో ఆకట్టుకుంటారు, అలాగే డెవిల్స్ గా భయపెడతారు“ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ్ భరద్వాజ్ మాట్లాడుతూ – మా మూవీలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం కలిగింది. ఈ సాంగ్ మీకు నచ్చుతుంద‌ని నమ్ముతున్నాను. బీజీఎం కూడా నాకు మంచి పేరు తెస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ జీవీకే గారికి, ప్రొడ్యూసర్ వెంకటేశ్వరావు గారికి థ్యాంక్స్. అన్నారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ – ఆదిపర్వం సినిమాలో శివ గారితో కలిసి వర్క్ చేశాను. ఈ సినిమాలో ఒక పిచ్చివాడి క్యారెక్టర్ కు నేనే కావాలని పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. మనం రెగ్యులర్ క్యారెక్టర్స్ ఎన్నో చేస్తుంటాం కానీ ఈ క్యారెక్టర్ లో నటించడం డిఫరెంట్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. అన్నారు.

ప్ర‌ముఖ న‌టులు, నిర్మాత‌ మురళీ మోహన్ గారు మాట్లాడుతూ – తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. మనం ఆస్కార్ రేంజ్ సినిమాలు చేస్తున్నాం. అయితే అలాంటి భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా పరిశ్రమకు అవసరం. అలా రెగ్యులర్ గా చిన్న మూవీస్ నిర్మిస్తూ పరిశ్రమలో అందరికీ ఉపాధి కల్పిస్తున్నారు మా మిత్రులు శివ కంఠంనేని, వెంకటేశ్వరరావు… వారు నిర్మించిన “అమరావతికి ఆహ్వానం” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు రఘుబాబు మాట్లాడుతూ – నాకు ప్రొడ్యూసర్స్ శివ కంఠంనేని, వెంకటేశ్వరరావు మంచి మిత్రులు. వారు నిర్మించిన చిత్రాల్లో నటించాను. ఈ సినిమాను దర్శకుడు జీవీకే బాగా తెరకెక్కించాడని నిర్మాతలు చెప్పారు. ఆది తర్వాత వినాయక్ గారికి ఎంత పేరొచ్చిందో ఈ సినిమా తర్వాత డైరెక్టర్ జీవీకేకు అంత గుర్తింపు దక్కాలి. ఈ సినిమాలో ముగ్గురు అందమైన ప్రతిభ గల హీరోయిన్స్ నటించారు. వారితో పాటు శివ గారికి ఇతర టీమ్ కు “అమరావతికి ఆహ్వానం” విజయాన్ని ఇవ్వాలి. అన్నారు.

నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ – ఇవాళ అమరావతికి ఎంతో ఖ్యాతి వస్తోంది. అలాంటి నగరం పేరుతో మేము హారర్ మూవీ చేశాం. మా హీరోయిన్స్ తమ అందంతో పాటు నటనతో మీ అందరినీ ఆకట్టుకుంటారు. మాకు ఈ చిత్రంతో సక్సెస్ దక్కుతుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు ట్రైలర్ చూశాక మరింత పెద్ద హిట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. మా డైరెక్టర్ జీవీకే గారు మరిన్ని మూవీస్ చేయాలి. మా హీరో శివ గారికి ఇతర టీమ్ అందరికీ గుడ్ లక్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ జీవీకే మాట్లాడుతూ – అమరావతికి ఆహ్వానం అనే టైటిల్ చూసి ఇదోదే పొలిటికల్ మూవీ అనుకుంటున్నారు. కాదు ఇందులో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. రెండున్నర గంటలు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఎవరు చెప్పే వ్యూస్ నమ్మకండి. మా హీరోయిన్స్ ఎస్తేర్, ధన్య, సుప్రిత ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే శివ గారి డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయాను. మా ప్రొడ్యూసర్స్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మా మూవీ ట్రైలర్ నచ్చితే వచ్చి థియేటర్స్ లో చూడండి. అన్నారు.

హీరో శివకంఠంనేని మాట్లాడుతూ – అమరావతికి ఆహ్వానం సినిమా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసుకున్నాం. ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నాం. ఎంటర్ టైన్ మెంట్ కు మేము గ్యారెంటీ ఇస్తున్నాం. రెండున్నర గంటలు మూవీని ఎంజాయ్ చేస్తారు. మా సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఎస్తేర్, ధన్య, సుప్రిత పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. వాళ్లంతా డెడికేటెడ్ గా ఈ సినిమాకు వర్క్ చేశారు. టెక్నికల్ గా మా మూవీ చాలా క్వాలిటీగా ఉంటుంది. చిన్న చిత్రాలకు ప్రేక్షకులు రావాలి. అప్పుడే మరిన్ని మూవీస్ చేయగలుగుతాం. ఏడాదికి దాదాపు 300 చిన్న చిత్రాలు తెరకెక్కుతాయి. వాటితోనే ఇండస్ట్రీ రన్ అవుతుంటుంది. అన్నారు.

హీరోయిన్ సుప్రిత మాట్లాడుతూ – అమరావతికి ఆహ్వానం సినిమాలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. నేను బయట ఎంత అల్లరిగా, సరదాగా ఉంటానో ఈ సినిమాలోనూ అలాంటి క్యారెక్టర్ చేశాను. ఈ పాత్రకు నేను బాగా రిలేట్ అయ్యాను. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు ధన్య, ఎస్తేర్ గారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. శివ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.

హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ – మంచి కథతో చేసిన చిత్రమిది. నేను కూడా మీతో పాటు ఈ నెల 13న థియేటర్స్ లో సినిమా చూడబోతున్నా. మా అందరికీ ఎగ్జైటింగ్ గా ఉంది. మూవీ తప్పకుండా మీకు నచ్చుతుందని నమ్ముతున్నాం. నేను బాగా నటించగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ థ్యాంక్స్. అమరావతికి ఆహ్వానం సినిమాను మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ – మీ కళ్లు బాగుంటాయి, రొమాంటిక్ మూవీస్ చేయండి, ట్రెడిషనల్ ఫ్యామిలీ మూవీస్ చేయండి అని అంటుంటారు కానీ మా డైరెక్టర్ జీవీకే మీ కళ్లు బాగుంటాయి మీరు హారర్ మూవీ చేయాలని వచ్చారు. నేను రాజా రాణి మూవీ చేసినప్పుడు అట్లీ గారు ఎంత టాలెంటెడ్ గా అనిపించారో ఈ సినిమా చేశాక జీవీకే గారిపై అలాంటి అభిప్రాయమే కలిగింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నాం. వాళ్లకు కావాల్సినంత స్పేస్ ఇవ్వండని శివ గారు చెప్పడం ఆయనకు మూవీ మీద ఉన్న ప్యాషన్ ను తెలియజేస్తుంది. అమరావతికి ఆహ్వానం సినిమాలో మంచి కంటెంట్ ఉంది. మీరంతా థియేటర్స్ కు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ – అమరావతికి ఆహ్వానం సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ తోనే సినిమా చూడాలనే ఆసక్తిని డైరెక్టర్ గారు క్రియేట్ చేశారు. ముగ్గురు హీరోయిన్స్ తో ఇలాంటి మూవీ చేయడం సులువైన పని కాదు. మేము రాజు గారి గది సినిమా చేసినప్పుడు ఇలాంటి చిన్న బడ్జెట్ తోనే చేశాం. ఆ మూవీని మీరంతా ఆదరించారు. ఈ చిత్రానికి కూడా అలాంటి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముగ్గురు హీరోయిన్స్ ఎస్తేర్, ధన్య, సుప్రిత, హీరో శివ గారికి ఆల్ ది బెస్ట్. అన్నారు.

నటీనటులు – శివ కంఠమనేని, ఎస్తేర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్, తదితరులు

టెక్నికల్ టీమ్
నిర్మాణ సార‌థ్యం: ముప్పా వెంక‌య్య చౌద‌రి
స‌మ‌ర్ప‌ణ‌: జి. రాంబాబు యాద‌వ్‌
బేన‌ర్‌: లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌
నిర్మాత‌లు: కెఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావు
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: జీవీకే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: వై. అనిల్ కుమార్‌, కె. శ్రీ‌నివాస్‌రావు
డిఓపి: జె ప్ర‌భాక‌ర్ రెడ్డి
మ్యూజిక్‌: ప‌ద్మ‌నాబ్‌ భ‌రద్వాజ్‌
ఎడిటింగ్‌: సాయిబాబు తలారి
ఫైట్స్‌: అంజి మాస్ట‌ర్
లిరిక్స్‌: ఉమా వంగూరి
కొరియోగ్ర‌ఫి: రాజ్‌ కృష్ణ‌
పిఆర్ఓ: సిద్ధు

Grand Success Meet of “Sumathi Sathakam” Held in a Celebratory Manner

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుమతి శతకం’ సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కింది. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా విడుదల అయింది. మహేష్ విట్ట, శైలజమ్మ, టేస్టీ తేజ, జెడివి ప్రసాద్, కరణ్ విజయ్, మిర్చి కిరణ్, ఆకెళ్ళ గోపాల్ కృష్ణ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి హలేష్ డిఓపిగా పని చేశారు. ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్ర సక్సెస్ మీట్ అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా సీనియర్ నటి మలక్పేట్ శైలజమ్మ మాట్లాడుతూ… “మా చిత్రానికి సపోర్ట్ చేస్తూ మాకు ఇంత మంచి విజయం అందించిన ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మంచి కంటెంట్ వస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని మరొకసారి నిరూపించడం జరిగింది. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం సుమతీ శతకం” అన్నారు.

సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ… “మా చిత్రం ఇంత మంచి విజయం సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాము. ప్రతి విషయాన్ని తమ భుజస్కాంతాలపైన వేసుకుని ముందుకు తీసుకువెళ్లిన హీరో అమర్దీప్ గారికి, దర్శకనిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాను మరింత బాగా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. ఆదిత్య మ్యూజిక్ వారు మమ్మల్ని ప్రోత్సహించడం చేయడం సంతోషకరం” అన్నారు.

రచయిత బండారు నాయుడు మాట్లాడుతూ… “మా సినిమాను చూసి సినిమా ఎంత బాగుందో సినిమాలోని డైలాగులు కూడా అంతే బాగున్నాయని అంటున్నారు, నాకు సంతోషంగా ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సుమతీ శతకం చిత్రం చాలా పాజిటివ్ గా ముందుకు వెళుతుంది. ప్రేక్షకులంతా మా సినిమాను చూసి మమ్మల్ని మరింత ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు మహేష్ విట్టా మాట్లాడుతూ… “ఒక ఆర్టిస్టుకు సరైన పాత్ర రావాలంటే మంచి రచయిత, దర్శకుడు, నిర్మాత తో పాటు సరైన క్యారెక్టర్ కూడా రావాలి. అలా నాకు అన్నీ కలిసి వచ్చిన సినిమా సుమతీ శతకం. నాకు సరైన అవకాశం లేదని అనుకుంటున్న సమయంలో నాకు ఈ సినిమా వచ్చింది. నా క్యారెక్టర్ కు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన చిత్ర బృందంలో అందరికీ నా ధన్యవాదాలు. సుమారు 15 సంవత్సరాల తర్వాత సెన్సార్ వాళ్లు ఒక కట్, ఒక మ్యూట్, ఒక బ్లర్ లేకుండా సినిమాను సర్టిఫై చేశారు. అటువంటి అద్భుతమైన కథ రాసి, దర్శకత్వం చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు ధన్యవాదాలు అనుకుంటున్నాను. త్వరలోనే మరిన్ని చిత్రాలతో మీ ముందుకు రాబోతున్నాను” అన్నారు.

దర్శకుడు ఎంఎం నాయుడు మాట్లాడుతూ… “మా సినిమా సుమతీ శతకం ఇంత మంచి విజయం సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మాకు సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్. మా నిర్మాత సాయి సుధాకర్ గారు ప్రతి విషయంలో అండగా ఉన్నారు. సినిమాకు మంచి సంగీతం అందించినందుకు సుభాష్ గారికి థాంక్స్. నాతో పాటు ప్రయాణించిన నా టీంకు, సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాలో అమర్దీప్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఉన్నారు, సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అలాగే హీరోయిన్ శైలి గారు తెలుగు రాకపోయినా కూడా సినిమా కోసం తెలుగు నేర్చుకుంటూ పని చేశారు. శ్రీధర్ గారికి, సాయి సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి మాట్లాడుతూ... “సుమతీ శతకం చిత్ర సక్సెస్ మీట్ కు వచ్చిన అందరికీ నమస్కారం. కొత్త వారితో ఒక చిన్న సినిమాగా మొదలై ఈరోజు ఇంత మంచి విజయం సాధించి మీ ముందుకు వచ్చింది. సినిమా చూసిన అందరూ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం అని అంటున్నారు. ఈ సినిమాలో నటించిన అందరికీ ఒక సంతృప్తి ఉంది. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఎంతోమంది హాస్య నటీనటులు ఉన్నప్పటికీ వారంతా వేడివేరు పాత్రలు చేయడంలో కాస్త బిజీగా ఉన్నారు. మరి కొంతమంది నటులకు అవకాశాలు కూడా రావడం లేదు. ప్రతిభావంతులైన నటులకు అవకాశాలు తగ్గిపోయాయి. అటువంటి నటీనటులకు విజన్ మూవీ మేకర్స్ అవకాశం ఇస్తుంది. అవకాశం వచ్చినప్పుడు తమను తాము నిరూపించుకోవడానికి ఎంతోమంది ఆర్టిస్టులు సిద్ధంగా ఉన్నారు. అటువంటి వారికి అవకాశం ఇచ్చేందుకు విజన్ మూవీ మేకర్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులు తమదైన శైలిలో సినిమా కోసం బెస్ట్ అందించారు. సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరూ వారి పాత్రకు 100% అవుట్ పుట్ ఇస్తూ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. దర్శక బృందం అందరూ పట్టుదలతో పనిచేశారు. నటి శైలి ఈ సినిమాలో టైటిల్ పాత్ర పోషిస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. సినిమాలో తన పాత్ర తనకు బాగా కనెక్ట్ అయింది అంటూ తెలుగు రాకపోయినా కూడా నేర్చుకుంటూ ఈ సినిమాలో నటించారు. నటుడు అమర్దీప్ ప్రతిభ ఉన్న వ్యక్తికి అవకాశం వస్తే ఎలా ఉంటుంది అని చూపించారు. సుమతీ శతకం చిత్రం ద్వారా అతనికి సరైన అవకాశం వచ్చింది అని భావించి తన బెస్ట్ అందించారు. ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ప్రేక్షకులు ఈరోజు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. యువతతో పాటు కుటుంబ సమేతంగా వచ్చి ఈ సినిమాలకు చూడడం అనేది సంతోషకరం. అమర్ కు ఇకపై మంచి సినిమా అవకాశాలు ఈ సినిమా నుండి వస్తాయని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ శైలి చౌదరి మాట్లాడుతూ... “అందరికీ నమస్కారం. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మొదటి రోజు షూటింగ్ చేసిన విషయం కూడా ఈరోజుకి గుర్తుంది, మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ముఖ్యంగా నేను ఈ చిత్ర దర్శకునికి, నిర్మాతకు, అమర్దీప్, ఇతర నటీనటులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రేక్షకులకు, మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి ధన్యవాదాలు. సుమతీ సాంగ్ ద్వారా ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. నాకు షూటింగ్ సమయంలో సహాయం చేసిన చిత్రబంధం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

హీరో అమర్దీప్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నా దర్శకుడు నాయుడు గారికి, నా నిర్మాత సాయి సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సుభాష్ ఆనంద్ గారికి ఇంత మంచి సంగీతం అందించినందుకు థాంక్స్. ఈ సినిమాకు పనిచేసిన దర్శక బృందం, సాంకేతిక నిపుణులు అలాగే వేరువేరు పాత్రలో నటించిన నటీనటులు అందరికీ నా ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్ ఉండబట్టి ఈ సినిమా ఎంత మంచిగా వచ్చింది. వీరంతా ఈ సినిమాకు నిలబడబట్టి ఈరోజు సినిమా ఇంత అద్భుతంగా రావడం జరిగింది. మమ్మల్ని ఎంత అందంగా చూపించినందుకు హలేష్ గారికి థాంక్స్. ప్రేక్షకులను మెప్పించేందుకు నాకు తెలిసిన ప్రతి విషయంలోను కష్టపడి పని చేశాను. కష్టపడితేనే ఫలితం వస్తుందని మా నాన్నగారు నాకు నేర్పించారు, నేను అదే పాటిస్తున్నాను. ఈ చిత్రబంధం అందరితోనూ కలిసి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాతో కలిసి నటించిన శైలి గారు చాలా కష్టపడి తనకి రానివి కూడా నేర్చుకుని ఈ సినిమా కోసం పనిచేశారు. అందుకు ఆమెను ప్రశంసించాలి. డాన్స్ స్టెప్స్ అందించిన గోవింద్ మాస్టర్ కు థాంక్స్. మరొకసారి నా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఒక్క ఛాన్స్ అడిగినందుకు అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరింత మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను” అంటూ ముగించారు.

Sensational Director Guna Shekhar’s ‘Euphoria’ Movie Success Celebrations held grandly

భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఏర్పాటు చేసిన స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో…

డైరెక్ట‌ర్ గుణశేఖర్ మాట్లాడుతూ ‘‘యుఫోరియా’ మూవీ సినిమాకు మార్నింగ్ షో నుంచే మంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఈ టైటిల్ చూసి యూత్ వ‌స్తార‌ని అనుకున్నాను. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వ‌స్తున్నారు. భూమిక‌గారు, సారా అర్జున్ అందుకు కార‌ణం కావ‌చ్చు. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమా నుంచి ఏదైతే ఆశించామో అది వ‌స్తుంది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ పంథాలో కాకుండా, ఎలాంటి ఫార్ములా ఫాలో కాకుండా హార్డ్ హిట్టింగ్ చెప్పాల‌ని అనుకునే ప్ర‌య‌త్నించాం. దానికి మంచి స్పంద‌న వ‌స్తుంది. మిత్రులంద‌రి నుంచి అభినందిస్తున్నారు. రెగ్యుల‌ర్ ఫార్మేట్‌ను వ‌దిలేసి కొత్త న‌టీన‌టుల‌తో ఇంత పెద్ద స్కేల్‌లో సినిమా చేయ‌టం సాహ‌స‌మ‌ని అందరూ భావిస్తున్నారు. ఇంత బోల్డ్ కంటెంట్‌ను ఎక్క‌డా ఇబ్బంది లేకుండా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కులు అభినందించేలా సినిమాను చేశామ‌ని అంటున్నారు. గుణ‌శేఖ‌ర్‌ను కొత్తగా చూస్తున్నామ‌ని అప్రిషియేట్ చేస్తుంటే చాలా గొప్ప ప్ర‌శంస‌గా అనిపిస్తుంది. నన్ను నేను కొత్త‌గా ఆవిష్క‌రించుకోవాల‌ని యుఫోరియాతో ప్ర‌య‌త్నించాను. ఆ ప్ర‌య‌త్నాన్ని ఈరోజు చాలా మంది అభినందిస్తున్నారు. ఓ కొత్త ద‌ర్శ‌కుడిలా ఆలోచించి తీశాన‌ని అంటున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ముందు నుంచి అడోల‌సెన్స్‌, పేరెంటింగ్, సోష‌ల్ ఇంపాక్ట్ అనే అంశాల‌ను చ‌క్క‌గా రియ‌లిస్టిక్‌గా, క‌మ‌ర్షియ‌ల్ అప్రోచ్‌తో రూపొందించాం. తల్లి కొడుకు మధ్య ఉన్న సంఘ‌ర్ష‌ణ‌ను చూపించాం. సినిమా సెకండాఫ్‌లో ఉత్కంఠ‌త‌ను ఎంజాయ్ చేస్తున్నామ‌ని ఫ్యామిలీ ఆడియెన్స్ చెబుతున్నారు. ఈ మ‌ధ్య ఇలాంటి స్టాండ‌ర్డ్ క్లైమాక్స్‌ను చూడ‌లేద‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు. తొలి ఫ్రేమ్ నుంచి చివ‌రి ఫ్రేమ్ వ‌ర‌కు సినిమా ఎంగేజింగ్‌గా న‌డిచింది. మా సినిమాను ప్రేక్ష‌కుల‌తో పాటు రివ్యూవ‌ర్స్ కూడా చ‌క్క‌గా అర్థం చేసుకుని విశ్లేషించారు. ఈ సినిమాను థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల్సింది. మౌత్ టాక్‌ను మేం న‌మ్ముతాం. దాన్ని మ‌రింత పాజిటివ్‌గా అంద‌రికీ స్ప్రెడ్ చేయాలి. ఇంటిల్లిపాది అంద‌రూ చూడ‌టం కోసం మేం అందం చేసిన సినిమా’’ అన్నారు.

పృథ్వీ అడ్డాల మాట్లాడుతూ ‘‘ఉద‌యం నుంచి ‘యుఫోరియా’ మూవీకి వ‌స్తోన్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది. హార్డ్ హిట్టింగ్, బోల్డ్ మూవ్. గుణ‌శేఖ‌ర్‌గారి డేర్ ఏంట‌నేది సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఫ‌స్టాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంద‌ని అంటున్నారు. ఇక సెకండాఫ్‌లో త‌ల్లి కొడుకు మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌నల్ సీన్స్ చూసి సంతోషంగా అనిపించింది. ఇలాంటి సినిమాతో మీ ముందుకు సైకో సాహిల్‌గా రావ‌టం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. అంద‌రికీ థాంక్స్’’ అన్నారు.

విఘ్నేశ్ గ‌విరెడ్డి మాట్లాడుతూ ‘‘మార్నింగ్ షోస్ చూసిన ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నామ‌ని అప్రిషియేట్ చేస్తున్నారు. ‘యుఫోరియా’ సినిమాను గుణ‌శేఖ‌ర్‌గారు చాలా కొత్త‌గా తెర‌కెక్కించార‌ని అంద‌రూ అంటున్నారు. నాతోపాటు కొత్త‌గా న‌టించిన ఇత‌ర నటీన‌టులు, భూమిక‌గారు, సారా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. దీన్ని కూడా అంద‌రూ మెచ్చుకుంటున్నారు. ఫ‌స్టాఫ్ అంతా థ్రిల్ల‌ర్‌లా అయ్యింద‌ని, సెకండాఫ్ అంతా తల్లి కొడుకుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌ను చూపించారు. సినిమాను అంద‌రూ థియేటర్స్‌కు వ‌చ్చి చూడాల‌ని కోరుకుంటున్నాను. నాకు ఇలాంటి అవ‌కాశాన్ని ఇచ్చిన గుణ శేఖ‌ర్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.

నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘యుఫోరియా సినిమా చూసిన త‌ర్వాత ఆడియెన్స్ నాకు చేస్తోన్న ఫోన్స్ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంద‌రూ సినిమాకు ఎంతో క‌నెక్ట్ అయ్యారు. అమ్మాయిలు, అమ్మ‌లు.. క‌నెక్ట్ అవుతున్నారు. వైజాగ్‌, న‌ర్సిపట్నం ఏరియాల నుంచి నాకు ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. మంచి రివ్యూస్ వ‌చ్చాయి. త‌ల్లి, కొడుకు మ‌ధ్య ఉన్న బంధం, సంఘ‌ర్ష‌ణ‌ను చ‌క్క‌గా చూపించార‌ని అంటున్నారు. క్లైమాక్స్‌ను అప్రిషియేట్ చేస్తున్నారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. విఘ్నేష్‌, పృథ్వీ, లిఖిత పెర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు. భూమిక‌గారు న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సారా అర్జున్ బ్ర‌లియంట్ పెర్ఫామర్‌. త‌ప్ప‌కుండా అంద‌రూ థియేట‌ర్స్‌లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు.