Home Blog Page 29

​Akshay Kumar’s ‘Bhoot Bangla’ Copied a Shot from My Film: *‘Creative Star’ Suman Babu

“Erra Cheera” Grand Release on February 6 – Movie Team Announces Bumper Offers for B & C Center Audiences.​The upcoming film Erra Cheera – The Beginning is a unique cinematic blend of motherly sentiment, horror, and action. Jointly produced by Sri Padmayala Entertainments and Sri Suman Venkatadri Productions, presented by Baby Damari, the film is set for a grand theatrical release on February 6.
​The film features Baby Sai Tejaswini (granddaughter of veteran actor Rajendra Prasad) in a pivotal role. Creative Star Suman Babu has not only directed the film but also played a key character. Speaking to the media ahead of the release, he shared several sensational details about the project.

​Highlights from Creative Star Suman Babu’s Media Interaction:
​The Copy Claim
In a statement that has sparked discussion, Creative Star Suman Babu claimed that a specific shot of a child drinking milk in the trailer of Akshay Kumar’s upcoming Bollywood film Bhoot Bangla was directly copied from the Erra Cheera trailer.
A Real-Life Inspiration
The director revealed that the story is based on a real incident that occurred near his friend’s house in the Chintal area. While 20% of the film is a true story, the rest has been fictionalized for the screen.
​No Compromise on VFX: Although the shoot was wrapped in 37 days, the release was delayed to ensure high-quality CG. “We aimed for Hanu-Man level quality. We worked with three different studios until the graphics were perfect,” said Suman Babu.
​Ensemble Cast:
The movie features 23 prominent actors, including Sriram, Kamal Kamaraju, Ajay, Karunya Chowdhury, Ayyappa P. Sharma, Raghu Babu, and others.

​Saree Giveaway: In a unique promotional move for B & C centers, the team will hold a Lucky Draw during every show, gifting sarees to 10 winners per show.
​36 Kisses Concept Addressing the buzz around a particular song, the director clarified that the 36 Kisses concept was included solely because the story demanded it to appeal to the youth.

​Future Slate
​Creative Star Suman Babu is already planning for the future. He announced a sequel titled Ambika (Erra Cheera-2) based on a tribal incident in Araku, and a romantic comedy called Ramuda? Krishnuda?. He plans to release a new film every six months.
​Technical Team & Cast

Cast: Baby Sai Tejaswini, Creative Star Suman Babu, Sriram, Kamal Kamaraju, Karunya Chowdhury, Ayyappa P. Sharma, Raghu Babu, Jeeva, and others.

​Story, Screenplay & Direction: Creative Star Suman Babu
​Producers: N.V.V. Subba Reddy, Ch. Venkata Suman
​Music: Pramod Puligilla (BGM: S. Chinna)
​Cinematography: Chandu
​PRO: Suresh Kondeti

Hero Santosh Shobhan’s ‘Couple Friendly’ Movie Trailer Launch Event held grandly

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో

హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” చిత్రంలో మిత్ర అనే క్యారెక్టర్ లో నటించాను. ఇలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ లో నటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. మిత్ర క్యారెక్టర్ తో నేను పర్సనల్ గా బాగా కనెక్ట్ అయ్యాను. ఈ పాత్ర కూడా నాలాగే లైఫ్ లో ఏదైనా చేయాల్సివస్తే ముందు యాక్షన్ లోకి దిగేస్తుంది. ఎలాంటి డౌట్స్ పెట్టుకోదు. ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్రెష్, యంగ్ లవ్ స్టోరీ. మేము చెన్నైలోని అనేక ప్రాంతాల్లో గెరిల్లా టైప్ లో షూటింగ్ చేశాం. సంతోష్ శోభన్ చాలా మంచి యాక్టర్. ఆయన డెడికేషన్, ప్రతి సీన్ లో ఇంకా బాగా నటించాలనే తపన చూశాను. నేను ఆయన నుంచి నేర్చుకున్నా. ఆదిత్య బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి ఛాట్ బస్టర్స్ అయ్యాయి. నా ఫేవరేట్ సాంగ్స్ ఇంకా రిలీజ్ చేయాల్సిఉంది. మా సినిమాను ధీరజ్ గారు డిస్ట్రిబ్యూట్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన ప్రొడ్యూస్ చేసిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నా ఫేవరేట్ మూవీ. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా కపుల్స్ కోసమే కాదు సింగిల్స్, కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం ఈ నెల 14న థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ – మీ అందరికీ “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ ట్రైలర్ నచ్చిందని నమ్ముతున్నాను. నిజాయితీ గల ఒక టీమ్ నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. నేను చేసిన షార్ట్ ఫిలింస్ సంతోష్ శోభన్ గారు చూశారు. ఆయనకు నేను ఈ మూవీ స్క్రిప్ట్ పంపాను. స్క్రిప్ట్ చదివిన వెంటనే ఈ మూవీ చేద్దామని ఓకే చేశారు. అలా “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. నేను షార్ట్ ఫిలింస్ చేసినప్పటి నుంచి డీవోపీ దినేష్, ఎడిటర్ గణేష్, మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య ఫ్రెండ్స్. నేను ఫస్ట్ మూవీ చేసేప్పుడు ఈ ముగ్గురు నా మూవీలో ఉండాలనుకున్నాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక హానెస్ట్ అటెంప్ట్ చేశారు అనే ఫీల్ మీ అందరిలో తప్పకుండా కలుగుతుంది. నేను ఈ కథ రాసినప్పుడు శివ, మిత్రతో పాటు కథ జరిగే చెన్నై నగరాన్ని కూడా ఒక పాత్రలా అనుకున్నాను. అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – యూవీ క్రియేషన్స్ అంటే ఎంతో ప్యాషనేట్ గా మూవీస్ చేసే ప్రొడక్షన్ హౌస్. ఈ సంస్థ జర్నీ ఇన్స్ పైర్ చేస్తుంటుంది. ఈ రోజు వారితో కలిసి సినిమా చేస్తుండటం గర్వంగా ఉంది. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నేను చూశాను. ఇంటర్వెల్ వరకు చూసేప్పటికే ఈ సినిమా మనసుకు హత్తుకుంది. సినిమా కంప్లీట్ గా చూశాక మూవీ అదిరిపోయింది అంటూ చాలా మందికి కాల్స్ చేసి చెప్పాను. డైరెక్టర్ ను కలుద్దామని అనుకుంటే ఆయన చెన్నైలో ఉన్నారని చెప్పారు. ఈ సినిమా చూసిన ఫీల్ లో చాలా రోజులు ఉండిపోయాను. సంతోష్ శోభన్ సినిమా అంతా సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ చేశారు. ఆయన పర్ ఫార్మెన్స్ చూస్తుంటే ఒక్కో సీన్ లో కన్నీళ్లు వచ్చాయి. మానస వారణాసి తెలుగమ్మాయి. ఈ మూవీలో బాగా నటించింది. మనం ఎన్నో ప్రేమ కథలు చూస్తుంటాం. కానీ ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇలాంటి కొత్త తరహా ప్రేమ కథలు రావాలి. “కపుల్ ఫ్రెండ్లీ” బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా తర్వాత సంతోష్ శోభన్ స్టార్ అవుతారు. అన్నారు.

కో ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాజు మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. మా యూవీ సంస్థలో చేసిన మరో మంచి లవ్ స్టోరీ మూవీ ఇది. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుంది. ధీరజ్ మాతో గతంలో కలిసి వర్క్ చేశారు. మా సినిమాలను రిలీజ్ చేశారు. ఆయనకు ఈ సినిమాను మేమే చూపించాం. సినిమా చూశాక చాలా బాగుంది అన్నా, నేను మొత్తం తెలుగు స్టేట్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తాను అన్నారు. మా మధ్య మంచి బాండింగ్ ఉంది. కాబట్టి ఆయనకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాం. అన్నారు.

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ – యూవీ క్రియేషన్స్ నా ఫ్యామిలీ లాంటిది. ఈ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమా మాది అనుకుంటాం. డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ చేయబోయే ఎన్నో మంచి చిత్రాల్లో మొదటిదిగా “కపుల్ ఫ్రెండ్లీ” రిలీజ్ కు వస్తోంది. ప్రపంచ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించి పేరు తీసుకొచ్చింది మానస వారణాసి. ఆమెతో కలిసి ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. మా సినిమాలో మిత్ర క్యారెక్టర్ ను ఆమె కంటే బెటర్ గా ఎవరూ చేయలేరేమో అనిపించింది. మా అజయ్ అన్నకు థ్యాంక్స్. ధీరజ్ గారు మా మూవీని రిలీజ్ చేస్తున్నారంటే మా టీమ్ అందరిలో పది రెట్లు ఉత్సాహం వచ్చింది. నేను చిన్న గ్యాప్ తీసుకున్న మాట నిజమే. ఈ సారి నేను చూపించబోయే కథ ఇరవై ఏళ్ల పాటు మీకు గుర్తుండిపోవాలి అనుకుని ఈ సినిమా చేశాను. శివ అనే క్యారెక్టర్ కు ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తా. శివ నెల్లూరు నుంచి వచ్చిన అబ్బాయి, మిత్ర చిత్తూరు నుంచి వస్తుంది. వాళ్లు చెన్నైలో కలుస్తారు. చెన్నైలో షూటింగ్ చేయడం బ్యూటిపుల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. శివ, మిత్ర అనే పాత్రలు మిమ్మల్ని నవ్విస్తాయి, కదిలిస్తాయి. కాస్త ఏడిపిస్తాయి. “కపుల్ ఫ్రెండ్లీ” ఒక జెన్యూన్ ఇంటెన్షన్ తో, హానెస్ట్ గా చేసిన సినిమా. ఇది నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది. అన్నారు.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్

‘Hreem’ Movie Hero Pawan tata has great talented : actor Nandu during Pawan’s birthday celebrations.

పవన్‌ తాతా, చమిందా వర్మ జంటగా నటించిన చిత్రం ‘హ్రీం’. శివమ్‌ మీడియా పతాకంపై సుజాత మల్లాల సమర్పించగా శివమల్లాల నిర్మించారు. రాజేష్‌ రావూరి ఈ చిత్రానికి దర్శకుడు. సోమవారం చిత్ర హీరో పవన్‌ తాతా జన్మదినం సందర్బంగా చిత్ర కార్యాలయంలో జరిగిన బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు ‘దండోరా’, ‘సైక్‌ సిద్ధార్థ’ చిత్రాల హీరో శ్రీనందు.

ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ–‘‘ ఇప్పుడే ‘హ్రీం’ సినిమా పోస్టర్స్, గ్లింప్స్‌ చూశాను. చూడగానే నన్ను ఎంతో ఎక్సైట్ చేసిన కంటెంట్‌ ఇది అనిపించింది. త్వరలోనే మీ అందరూ కూడా ఈ కంటెంట్‌ను చూస్తారు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాతతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్నో ఏళ్లుగా మా ట్రావెల్‌ కొనసాగుతుంది. నాకు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా సందేహాలు ఉంటే నేను ఏమి ఆలోచించకుండా శివమల్లాల అన్నతో షేర్‌ చేసుకుంటాను. ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆయన వెల్‌ విషర్‌. ఈ సినిమాతో తమ కెరియర్‌లను గొప్పగా ప్లాన్‌ చేసుకుంటున్న హీరో పవన్‌ తాతాకు, హీరోయిన్‌ డాక్టర్‌ చమిందా వర్మలకు నా కృతజ్ఙతలు. మాటీవిలో పనిచేసి దర్శకునిగా మారబోతున్న రాజేష్‌కు ఇది చక్కని అవకాశం. అందరికి ఆల్‌ ది బెస్ట్‌ ’’అన్నారు.

హీరో పవన్‌ మాట్లాడుతూ–‘‘ ఈ బర్త్‌డే నాకు ఎంతో ప్రత్యేకం. నాకు ‘హ్రీం’ సినిమా ద్వారా మంచి అవకాశం అభించింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌. ఈ వేడుకలో నా కుటుంబ సభ్యులు మా మేనత్త రేణుకమ్మ, గోపి, రేఖ అందరూ పాల్గొనటం చాలా హ్యాప్పిగా ఉంది. కంటెంట్‌ చూసిన తర్వాత మీ అందరూ కూడా నన్ను ప్రశంసిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు.

హీరోయిన్‌ చమిందా వర్మ మాట్లాడుతూ– నా ఫస్ట్‌ సినిమా కో స్టార్‌ పవన్‌ ఎంతో బాగా నటించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు. నందు గారు ఈ వేడుకలో పాల్గొని మా టీమ్‌ని విష్‌ చేసినందుకు ఆయనకు థ్యాంక్‌ యూ’’ అన్నారు.

నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ–‘‘ నేను అడగ్గానే మా హీరో పవన్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొని మా టీమందరికి ఎనర్జీ ఇచ్చిన నందుకి థ్యాంక్‌యూ. ఎప్పుడూ నాతో ఒక కుటుంబ సభ్యునిలా మెలుగుతూ ఉంటాడు. ‘హ్రీం’ సినిమా మొన్నీమధ్యే షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది. పనులన్నీ ఎంతో వేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు.

ఈ జన్మదిన వేడకల్లో సుజాత మల్లాల, శైలజా పద్మరాజు, దర్శకుడు రాజేష్‌ రావూరి, దర్శకుడు కృష్ణ కాంత్, వీఎఫ్‌ఎక్స్‌ డైరెక్టర్‌ రాజ్‌పవన్‌ కొమ్మోజు, ఎడిటర్‌ డిఐ కలరిస్ట్‌ వైఎస్‌ఎస్‌ శివప్రకాష్, నిర్మాత శ్రీనివాస్‌ బొప్పన, ఐయస్‌ రాజు, నిర్మాత ముని శివ తదితరులు పాల్గొన్నారు.

Star Actor Vijay Deverakonda’s “Ranabaali” Title Glimpse Creates a Sensation with 15+ Million Views

Star Actor Vijay Deverakonda teams up with Rashmika Mandanna for the highly anticipated period action drama Ranabaali, directed by Rahul Sankrityan. Presented by T-Series and produced by the prestigious banner Mythri Movie Makers, the film is being mounted on a massive scale by producers Naveen Yerneni and Y. Ravi Shankar.

Scheduled for a grand worldwide release on September 11, Ranabaali has already created strong buzz with its recently released title glimpse, which has crossed 15 million+ views and continues to trend across social media platforms. The overwhelming response is being seen by the makers as the first major step toward the film’s expected success.

In the title glimpse, Vijay Deverakonda appears in a powerful and captivating avatar as the warrior Ranabaali, leaving a strong impression on audiences. Director Rahul Sankrityan’s choice of subject, his passionate storytelling, and Mythri Movie Makers’ rich production values stand out as key highlights. Rashmika Mandanna attracts attention in the role of Jayamma, adding emotional depth to the narrative.

Set in the 19th century, Ranabaali is inspired by real historical events that occurred between 1854 and 1878, during the British colonial era. The film is being crafted as a large-scale pan-India historical epic, combining intense drama, action, and authenticity.

Cast

Vijay Deverakonda, Rashmika Mandanna, Arnold Vosloo, and others.

Technical Crew

Banner: Mythri Movie Makers
Presented by: Gulshan Kumar, Bhushan Kumar – T-Series Film
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar
Story & Direction: Rahul Sankrityan
Co-Producers: Anurag Parvathaneni, Shiv Chanan
CEO: Cherry
Music: Ajay–Atul
Cinematography: Nirav Shah
Writer: Pramod Thammineni
Production Designer: Shivam Rao Nagasani
Editor: Karthika Srinivas R
Chief Executive Producer: R. Chandrasekhar
Executive Producer: Chembolu Sai Aditya
Choreography: Kruti Mahesh
Costume Designer: Archana Rao
Art Director: Vithal Kosanam
VFX Supervisor: Sunil Raju Chinta
Action Choreographers: Yannick Ben, Andy Long Nguyen, Robin Subbu
Sound Designer: Raghunath Kemmisetty
Publicity Designer: Kabilan Chelliah
PRO: GSK Media (Suresh – Sreenivas)
Marketing: First Show

“One by Four” (One/4) Movie Success meet held grandly

తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌గా నటించిన యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం “వన్ బై ఫోర్” (One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. ఇటీవల రిలీజైన “వన్ బై ఫోర్” (One/4) సినిమా మంచి విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో అన్ని సెంటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

డైరెక్టర్ బాహుబలి పళని మాట్లాడుతూ – మా “వన్ బై ఫోర్” (One/4) సినిమాను ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేశారు. ప్రతి థియేటర్ లో కలెక్షన్స్ బాగున్నాయి. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రానికి కూడా మంచి విజయం అందిస్తామని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు. మా హీరో వెంకటేష్ తన ఫైట్స్, పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతను కన్నడలో యాక్షన్ సినిమా చేశాడు. తెలుగులో వెంకటేష్ కు మంచి అవకాశాలు వస్తాయి. మా ప్రొడ్యూసర్స్ రంజన, రోహిత్ ముంబై నుంచి సినిమా మీద ప్యాషన్ తో టాలీవుడ్ కు వచ్చారు. వారు మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. సినిమా ప్రారంభంలో అవకాశాల కోసం వచ్చే నటీనటులు, సినిమా ప్రమోషన్ లో కనిపించరు. వారు తమ సినిమా అనే కృతజ్ఞతతో ప్రమోషన్ చేయాలి అన్నారు.

ప్రొడ్యూసర్ రంజన రాజేష్ గుంజల్ మాట్లాడుతూ – ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఉన్న మా “వన్ బై ఫోర్” (One/4)సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉండటం వల్లే ఈ విజయం దక్కింది. ఈ చిత్రంలో పవిత్ర అనే క్యారెక్టర్ కు అప్రిషియేషన్ వస్తోంది. హీరో వెంకటేష్ పర్ ఫార్మెన్స్ బాగుందని అంటున్నారు. బ్లాక్ మెయిలింగ్ వల్ల ఓ మహిళ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది మా సినిమాలో చూపించాం. ఈ సినిమా మనల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. మా చిత్రానికి హీరోయిన్స్ నుంచి ప్రమోషన్ కోసం సపోర్ట్ లభించకపోవడం బాధగా ఉంది. హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా సినిమాకు నష్టాన్ని తీసుకొచ్చారు. అన్ని సౌకర్యాలు కల్పించినా వారు సినిమా పట్ల కృతజ్ఢత చూపించలేదు. ఇలాంటి నార్త్ హీరోయిన్స్ కంటే తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా తీసుకుని వారిని ప్రోత్సహించడం మంచిది అని అనిపిస్తోంది అన్నారు.

ప్రొడ్యూసర్ రోహిత్ రాందాస్ గుంజల్ మాట్లాడుతూ – తెలుగు సినిమాలపై అభిమానంతో మేము ముంబై నుంచి టాలీవుడ్ కు వచ్చాం. మా తొలి ప్రయత్నంలోనే మంచి విజయం దక్కింది. మేము ఈ చిత్రం ద్వారా ఇవ్వాలనుకున్న సందేశం ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. కలెక్షన్స్ బాగున్నాయి. ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడూ మోసం చేయరు. కానీ మా చిత్రంలోని నటీనటులే ప్రమోషన్ కు రాకుండా ఇబ్బందిపెట్టారు. లేకుంటే మా సినిమా మరింతగా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లేది అన్నారు.

హీరో వెంకటేష్ పెద్దపాలెం మాట్లాడుతూ – “వన్ బై ఫోర్” (One/4) సినిమా కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. బయట ఇండస్ట్రీలోని ఇతర పెద్ద సినిమాల వల్ల రిలీజ్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ మా ప్రొడ్యూసర్స్ పట్టుదలగా ఈ అడ్డంకులన్నీ దాటుకుని సినిమాను విడుదల చేశారు. అన్ని థియేటర్స్ నుంచి మంచి టాక్ ఉంది. మహిళలు చూడాల్సిన చిత్రమిది. మంచి సినిమా చేశారని అంటున్నారు. ఇంకా ప్రమోషన్స్ చేద్దామంటే మా హీరోయిన్స్ ప్రెస్ మీట్స్ కు రావడం లేదు. ఎంతో ప్యాషన్ తో సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రమోషన్స్ కు రాని నటీనటులు ఆలోచించుకోవాలి అన్నారు.

నటీనటులు: వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని, టెంపర్ వంశీ, ఆర్ ఎక్స్ 100 కరణ్, నరేంద్ర వర్మ, రాజు, అపర్ణ శెట్టి, మధుసూదన్ రావు, సునీత మనోహర్, శ్రీనివాస్ భోగిరెడ్డి, వేడిష్ జవేరి, కుష్బూ, సుజాత, ఎస్ ఆర్ ఎస్ వర్మ, సుహాని వ్యాస్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్
నిర్మాతలు: రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్
దర్శకుడు: బాహుబలి పళని కె
సంగీతం: సుభాష్ ఆనంద్
డి ఓ పి: గుణ శేఖర్
లిరిక్స్: సాగర్ నారాయణ ఎమ్. నాగేంద్ర గోపు
డాన్స్: సాగర్ వేలూరు
స్టంట్ మాస్టర్: కుంగ్ ఫు చంద్ర, జాషువా
వి ఎఫ్ ఎక్స్: నవీన్ ఏ, పవన్ నారావా
ఎస్ ఎఫ్ ఎక్స్: పురుషోత్తం రాజు
మిక్సింగ్: జయంతం సురేష్
పీఆర్ఓ – చందు రమేష్

I hope ‘Barabar Premistha’ gives Chandra Hass a strong breakthrough: Aadi Saikumar at the Pre-Release Event

Barabar Premistha, starring Attitude Star Chandra Hass in the lead, is directed by Sampath Rudra. Presented by Kakarla Satyanarayana, the film is produced by Geda Chandu, Gayatri Chinny, and AVR under the banners of CC Creations and AVR Movie Wonders. Miss India finalist Meghna Mukherjee plays the female lead, while Arjun Mahi (of Ishtamga fame) essays the antagonist’s role. The film is all set for a grand theatrical release on February 6th.

Ahead of the release, the makers hold a pre-release event on Sunday (February 1). The event was graced by chief guests Jayanth C Paranjee, JD Chakravarthy, and Aadi Saikumar, along with the film’s cast and crew.

Chandra Hass said: “I am a big fan of Jayanth sir’s films like Teen Maar and Shankar Dada. Aadi anna has made an incredible comeback—he is truly an inspiration to me. JD Chakravarthy sir looks the same even today. I’m deeply grateful that so many people came here for me.

I can never repay the debt of my father Prabhakar, who gave birth to me and raised me. Meghna will become a big heroine in Telugu cinema. Dhruvan is extremely talented and has delivered fantastic songs for this film. My thanks to Chinny garu, Chandu garu, and Venky garu for producing this movie without any compromises. Special thanks to cinematographer Shekhar anna, who played a key role in bringing this project to me.
This film will not bore the audience even for a second. With countless and unimaginable twists, it will keep viewers glued from start to finish. Director Sampath has made this film beautifully and presented me really well. I hope audiences watch and support Barabar Premistha on February 6.”

Aadi Saikumar stated: “I worked with Prabhakar anna on Next Nuvve. Even back then, he spoke highly of Chandra Hass and said he would become a good hero—and I believed it. I’ve seen how hard Chandra Hass works with complete honesty. I sincerely wish him a big hit.

I hope Barabar Premistha becomes a major turning point in Chandra Hass’ career. I urge audiences to watch the film in theatres on February 6 and support the team.”

Jayanth C Paranjee said: “The title Barabar Premistha itself reflects attitude, confidence, and swagger—just like Chandra Hass, our Attitude Star. He is also a good singer. Meghna too has great energy and attitude. Sampath has directed the film wonderfully, and I really liked all the songs composed by Dhruvan.
I strongly believe this film will be a big hit. I request everyone to watch Barabar Premistha on February 6 and support the team.”

Prabhakar acknowledged: “Aadi is my first hero. When Shambhala became a hit, I was happier than even Sai Kumar garu. I’m delighted that Aadi attended this event. DOP Shekhar brought this story to me, and the entire team worked extremely hard on this film.

I hope their efforts are rewarded on February 6. Dhruvan has given excellent music. Chandra Hass never lets negativity affect him—he always moves forward positively. Meghna is extremely passionate about cinema. I request audiences to watch and encourage this film.”

JD Chakravarthy stated : “Whatever Chandra Hass does naturally attracts people. I will definitely watch this film for Prabhakar. Starting his life as a constable and rising to become a television star, Prabhakar’s journey is truly inspiring. Meghna looks impressive, and Dhruvan’s music is excellent. My best wishes to the entire team. Don’t miss Barabar Premistha in theatres on February 6.”

Director Sampath Rudra said: “I’ve always admired Aadi garu’s love stories, and I’m happy he came to support us today. Producer Venky is my classmate—without him, this film wouldn’t exist. Chandu and Chinny joined the project later. Chinny and I worked together as assistant directors on Rechipo.
Dhruvan has delivered outstanding music. No commercial film like this has come with a Telangana backdrop before. The climax will shock everyone—you’ll walk out of the theatre still under its impact. Please watch Barabar Premistha on February 6.”

Meghna Mukherjee affirmed: “Thank you to all the guests who came to support us. Chandu, Chinny, and Venky sir stood like the backbone of this project. I’m thankful to Sampath garu for giving me a lovely role like Bujji. Working with Chandra Hass has been a joy. Dhruvan’s music is amazing. Our film releases on February 6—please watch it in theatres.”

Arjun Mahi said : “I played the hero in Sampath’s first film, and now I’m back as the villain in Barabar Premistha. I hope this film gives Chandrahas a big hit. Meghna makes her Tollywood debut with this film. Please watch and support it on February 6.”

Pooja Bedi stated: “Thank you to everyone who invited me to the Barabar Premistha event. I wish Chandra Hass great success with this film. The movie releases on February 6—please support it.”

Producer & Distributor Vamsi Nandipati speaks:“I’ve watched the footage of Barabar Premistha. After this film, Prabhakar won’t just be known as someone’s son—he’ll proudly be known as the father of Attitude Star Chandrahas. Please watch the film in theatres on February 6.”

Music Director RR Dhruvan speaks:“My thanks to the director and producers for giving me this opportunity. I loved Sampath’s story. The song ‘Reddy Mama’ has already gone viral. With this film, Chandra Hass is sure to score a hit on February 6.”

Producers Chandu, Chinny & Venky said:“Thank you to all the guests and media friends who attended this event. Special thanks to Chandra Hass for standing by us throughout this journey. We made this film with great effort and conviction. Sampath has directed it brilliantly. Barabar Premistha releases on February 6. We hope audiences will support and encourage our film.”

Cast : Attitude Star Chandra Hass, Meghna Mukherjee, Arjun Mahi, Muralidhar Goud, Lakshman Meesala, Madhunandan, Abhay Naveen, Rajasekhar Anningi, Dr. Bhathini, Keerthi Latha Goud, Sunitha Manohar, and others.

Technical Crew:

Banner: CC Creations, AVR Movie Wonders
Producers: Geda Chandu, Gayatri Chinny, AVR,
Director: Sampath Rudra
Screenplay: Sampath Rudra, MA Tirupati
Story: MA Tirupati
Dialogues: Ramesh Roy
Cinematography: YR Shekhar
Music: RR Dhruvan
Editor: Bonthala Nageswara Reddy
PRO: Sai Satish

‘Mr. Work From Home’ Movie Pre Release event held grandly in Bheemili.

శనివారం భీమిలి తిమ్మాపురం లో విశాఖ ఫిల్మ్ నగర్ సెంటర్ లో మిస్టర్ వర్క్ ఫ్రొమ్ హోమ్ సినిమా బృందం ప్రీ రిలీజ్ వేడుక ను ఘనంగా నిర్వహించారు . ఈ సినిమా ను అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మధు దర్శకత్వం వహించగా, త్రిగున్ హీరోగా పాలయి రాధా కృష్ణ హారోహిన్ గా నటిస్తున్నారు.

దర్శకుడు మధు మాట్లాడుతూ ఈ సినిమా వ్యవసాయంలో నూతన యంత్ర పరికరాలు వినియోగ ఆధారిత నేపథ్యంలో కధ నడుస్తుంది అని అన్నారు. గ్రామీణ వ్యవసాయ కుటుంబం లో జన్మించిన ఒక యావకుడు, యువతి ప్రేమ పెళ్లి వ్యవహారం, వినోదం కుటుంబ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అని అన్నారు. హీరో త్రిగున్ మాట్లాడుతూ ఈ సినిమా నేటి తరానికి చాలా అవసరం అని భావి తరాలకు ఈ సినిమా ఒక మెస్సేజ్ అందించే లా ఉంటుంది అని అన్నారు.

సినిమా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రం ప్రజలు ప్రశంసలు అందుకునేలా ఉంటుంది అని దర్శకుడు మధు ఈ సినిమా బాగా వచ్చే లా సినిమా తీశారు అని చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరి 13 న రిలీజ్ ఉంటుంది అని తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో చిత్ర బృందం పాల్గొంది.

“Sky” Pre Release event held grandly, Movie grand theatrical release on February 6th

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా “స్కై”. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. “స్కై” సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ – సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ తో చిన్న స్థాయి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాను. ఈ చిత్రానికి వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల గారికి థ్యాంక్స్. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ సినిమాకు మంచి మ్యూజిక్ చేయగలిగాను. పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అన్నారు.

నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – ఈ ఈవెంట్ కు వచ్చే ముందు “స్కై” సినిమా కంటెంట్, సాంగ్స్ చూశాను. ఆ కంటెంట్ చూస్తుంటే ఈ మూవీలో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చూడబోతున్నామని తెలుస్తోంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. రసూల్ ఎల్లోర్ గారి విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమాకు పెట్టిన క్యాప్షన్ తోనే మూవీ ఎస్సెన్స్ తెలుస్తోంది. “స్కై” సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గుంటక మాట్లాడుతూ – ఈ రోజు మా మూవీ ప్రెస్ మీట్ కు వచ్చిన మధుర శ్రీధర్ గారికి థ్యాంక్స్. “స్కై” సినిమాను మేమంతా ఎంతో కష్టపడి ప్రొడ్యూస్ చేశాం. టీమ్ అందరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్న ఒక కొత్త ప్రేమ కథను మా మూవీలో మీరంతా చూడబోతున్నారు. ఫిబ్రవరి 6న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ – “స్కై” సినిమా షూటింగ్ కు ముందే అన్ని సాంగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. డీవోపీ రసూల్ గారు ఇచ్చిన సజెషన్స్ తో సినిమాను అనుకున్న టైమ్ లో కంఫర్ట్ గా కంప్లీట్ చేయగలిగాం. ఆయన గైడెన్స్ మాకు చాలా ఉపయోగపడింది. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

హీరో మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ – ఈ సినిమా ద్వారా నేను హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. వాస్తవంగా ఈ చిత్రానికి నిజమైన హీరోలు మా డైరెక్టర్ పృథ్వీ, నిర్మాతలు నాగిరెడ్డి, శ్రీలక్ష్మి. మా సినిమా కోసం టీమ్ చాలా కష్టపడింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ కు తీసుకొస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శివ ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ తన ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి రాగలిగాడు. మా సినిమా నుంచి రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ అన్నింటికీ మంచి ఆదరణ దక్కింది. థియేట్రికల్ గా కూడా ఇదే సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటి కేఎల్ కే మణి బామ్మ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను సోది చెప్పే బామ్మ క్యారెక్టర్ లో నటించాను. రసూల్ గారు అందరితో పాటు నన్ను కూడా అందంగా స్క్రీన్ మీద చూపించారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ – ఈ చిత్రంలో హీరోయిన్ ది చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. అలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ నేను పర్ ఫార్మ్ చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. రసూల్ గారు మా అందరినీ కలర్ ఫుల్ గా చూపించారు. ఈ సినిమాలో నటించడం మా అందరికీ ఒక బ్యూటిఫుల్ జర్నీ ఇచ్చింది. మీరంతా థియేటర్స్ లో మూవీ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

డీవోపీ రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ – “స్కై” సినిమాకు అంతా కొత్త వాళ్లు పనిచేశారు. నాకున్న ఎక్సిపీరియన్స్ తో వాళ్లకు గైడెన్స్ ఇచ్చాను. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు వర్క్ చేయడం ఒక ఫ్యామిలీ ఫీల్ కలిగింది. మంచి లవ్ స్టోరీతో వస్తున్న చిత్రమిది. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. ఈ టీమ్ తో మళ్లీ కలిసి వర్క్ చేయాలని ఉంది. అన్నారు.

నటీనటులు – మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ – వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – పృథ్వీ పెరిచెర్ల
డీవోపీ – రసూల్ ఎల్లోర్
ఎడిటర్ – సురేష్ ఆర్స్
పబ్లిసిటీ డిజైనర్ – కృష్ణ డిజిటల్స్
డిజిటల్ మీడియా – వినీత్ గౌడ్
ప్రొడ్యూసర్స్ – నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు
డైలాగ్స్ , స్టోరీ – పృథ్వీ పెరిచెర్ల, మురళీ కృష్ణంరాజు
మ్యూజిక్ – శివ ప్రసాద్
లిరిక్స్ – పృథ్వీ పెరిచెర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – స్వాతి పెన్మెత్స, లిఖిత గుంటక
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

Hero Thiruveer’s “Bhagavanthudu” movie teaser launched by Heroes Sundeep Kishan and Vishwak Sen

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా “భగవంతుడు”. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న “భగవంతుడు” సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో చిత్ర టీజర్ ను ఈ రోజు హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ – రవి పనస నాకు మంచి మిత్రుడు. ఒకప్పుడు నన్ను ప్రొడక్షన్ వద్దు అనేవాడు. ఇప్పుడు తనే సినిమా చేస్తున్నాడు. బిజినెస్ మ్యాన్ గా రవి పనస సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రంతో ప్రొడ్యూసర్ గా కూడా మంచి హిట్ అందుకోవాలి కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు క్రిష్ మాట్లాడుతూ – “భగవంతుడు” సినిమాలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. మూవీలో నా మేకోవర్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా మేకింగ్ దగ్గర నుంచి చూశాం. సినిమా పెద్ద హిట్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకునే మూవీగా నిలుస్తుంది. అన్నారు.

నటుడు జబర్దస్త్ అభి మాట్లాడుతూ – “భగవంతుడు” మూవీ టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. నా కెరీర్ లో చేసిన ఒక డిఫరెంట్ మూవీ ఇది. టీజర్ లో నన్ను చూసి కొందరు గుర్తుపట్టకపోవచ్చు. మనం కాంతార మూవీ గురించి మాట్లాడుకుంటాం. అలాగే “భగవంతుడు” రిలీజ్ అయ్యాక ఈ సినిమా గురించి కూడా అలాగే అందరు గొప్పగా మాట్లాడుకుంటారు. అన్నారు.

నటుడు రవీందర్ విజయ్ మాట్లాడుతూ – వేణు ఊడుగుల అన్న నన్ను ప్రోత్సహిస్తుంటారు. మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పారు. ఆయన చెప్పినట్లే ఈ మూవీలో మంచి రోల్ ఇప్పించారు. భగవంతుడు సినిమా సక్సెస్ మీట్ లో ఈ సినిమా గురించి మాట్లాడాలని ఉంది. అన్నారు.

నటుడు మైమ్ మధు మాట్లాడుతూ – “భగవంతుడు” నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ చిత్రంలో క్యారెక్టర్స్ ను డిజైన్ చేసిన విధానం, డైరెక్టర్ పర్ ఫార్మెన్స్ చేయించిన తీరు సూపర్బ్ గా ఉంటుంది. మేము చెప్పడం కాదు సినిమా చూశాక మీరంతా ఇదే మాట అంటారు. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ గోపి విహారి, ప్రొడ్యూసర్ రవి గారికి థ్యాంక్స్. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కేపీ మాట్లాడుతూ – “భగవంతుడు” సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం కావడం హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గోపి విహారి గారికి, నిర్మాత రవి పనస గారికి థ్యాంక్స్. సాంగ్స్, బీజీఎం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మీరంతా మా “భగవంతుడు” సినిమాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకనిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – రవి పనస నాకు 2005 నుంచి తెలుసు. మేమిద్దరం ఒకేసారి ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ చేశాం. మాతో పాటు ఎన్నో మూవీస్ కు వర్క్ చేశారు రవి పనస. ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేస్తానంటే నేనే ప్రొడక్షన్ రిస్క్ వద్దు అని చెప్పేవాడిని. 20 ఏళ్ల తర్వాత ఆయన కల నెరవేరుతుండటం సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలో ఒక మంచి కథ దొరికి, ప్రాజెక్ట్ సెట్ కావడం అరుదు. నేను “భగవంతుడు” సినిమా చూశాను కాబట్టి చెబుతున్నా, ఇలాంటి సినిమా కుదరటం రవి పనస అదృష్టం. మా మధుర ఆడియో ద్వారా ఈ మూవీ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాం. తిరువీర్ లైనప్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మంచి మూవీస్ చేస్తున్నాడు. ఈ సినిమాతో డైరెక్టర్ గా, రైటర్ గా గోపి విహారికి గుర్తింపు దక్కుతుంది. “భగవంతుడు” సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ – డైరెక్టర్ గోపి నాకు మంచి మిత్రులు. ఆయన నా విరాటపర్వం మూవీకి రైటర్ గా వర్క్ చేశారు. మీడియాలో పనిచేస్తున్న గోపిని ధైర్యంగా ఇండస్ట్రీకి రమ్మని నేనే ప్రోత్సహించాను. ఆయన దగ్గర ఉన్న రెండు మూడు కథలు విన్నాను. “భగవంతుడు” కథ నాకు బాగా నచ్చింది. ఇలాంటి కథ తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇది చెప్పాల్సిన స్టోరీ అనిపించింది. నాకు మంచి ఫ్రెండ్ రవి పనస అన్నతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ కుదిర్చాను. తిరువీర్ నాకు ఇష్టమైన నటుడు. ఆయనకు కథ పంపగానే చదివి నేను చేస్తా అన్నాడు. ఈ సినిమాతో డైరెక్టర్ గోపికి, మ్యూజిక్ డైరెక్టర్ కె.పి.కి మంచి పేరొస్తుంది. ఈ సినిమా నేను చూశా కాబట్టి చెబుతున్నా మీ అందరి ఆదరణతో ఘన విజయం సాధిస్తుంది. అన్నారు.

డైరెక్టర్ జి.జి. విహారి మాట్లాడుతూ – నేను సినిమా పాత్రికేయుడిగా కెరీర్ స్టార్ట్ చేశా. “భగవంతుడు” మూవీ టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. నాతో ట్రావెల్ చేసిన నాకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్. నేను ఈ సినిమా విషయంలో వేణు ఊడుగుల అన్నకు, రవి పనస అన్నకు కృతజ్ఞతలు చెప్పాలి. చిన్నగా మొదలైన ఈ కథతో క్రమంగా చాలా బిగ్ మూవీ చేశాం. ఈ కథను తిరువీర్ కు నెరేట్ చేసినప్పుడు ఫస్టాఫ్ విని సెకండాఫ్ నీకు నచ్చితే చెప్పు లేకుంటే లేదు అన్నారు ఆయనకు అంత బాగా స్టోరీ మీద నమ్మకం కుదిరింది. ఫరియా అబ్దుల్లా గారి నెంబర్ తీసుకుని స్క్రిప్ట్ ఆమెకు మెసేజ్ చేశా. వెంటనే ఆఫీస్ కు వచ్చారు. అలా ప్రతి ఒక్కటీ ఈ మూవీకి కుదిరాయి. మనల్ని మనం అర్థం చేసుకునేందుకు, మన చుట్టూ ఉన్న, సమాజం ఉన్న వైరుధ్యాలు తెలుసుకునేందుకు కథలు చెబుతాం. ఈ అవగాహనతో నేను రూపొందించిన చిత్రమిది. తిరువీర్, రిషి, ఫరియా అబ్దుల్లా ..ఈ ముగ్గురూ సినిమాకు ఫిల్లర్స్ లా ఉన్నారు. పల్నాడు యుద్ధాన్ని తెలుగు మహాభారతం అంటారు. మన రూట్స్ అన్నీ పల్నాడులోనే ఉన్నాయి. తెలుగు వారు మర్చిపోయిన వైరుధ్యాలు పల్నాడులోనే పుట్టాయి. ఇప్పటికీ అక్కడ కత్తుల్ని దైవాలుగా కొలుస్తారు. వెయ్యేళ్ల కిందటే మన సమాజంలోని అంతరాలకు సమాధానం పల్నాడులో చెప్పడం జరిగింది. అందుకే ఈ సినిమాకు పల్నాడు బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. అన్నారు.

నటుడు రిషి మాట్లాడుతూ – సైతాన్ వెబ్ సిరీస్ తర్వాత నేను తెలుగు చేస్తున్న చిత్రమిది. ఈ కథను డైరెక్టర్ గోపి విహారి గారు చెప్పినప్పుడు ఇందులోని సారాంశం అర్థమైంది. సమాజంలోని గొంతు విప్పలేని వాళ్లకు గొంతుకగా నిలవాలి. ఆ ప్రయత్నమే ఈ మూవీ. ఇలాంటి సినిమాలో తప్పకుండా నటించాలని నిర్ణయించుకున్నా. గోపి విహారి గారి షార్ట్ డివిజన్, మేకింగ్ అన్నీ ఆకట్టుకుంటాయి. రవి పనస ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయన సినిమాకు ఏం కావాలో అన్నీ ఇచ్చారు. బడ్జెట్ పెరిగినా రాజీ పడలేదు. ఈ టీమ్ తో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. “భగవంతుడు” సినిమాతో త్వరలోనే థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ – “భగవంతుడు” సినిమాలో నేను కొత్తగా కనిపిస్తాను. స్క్రిప్ట్ విన్న వెంటనే ఈ సినిమా చేయాలి ఫిక్స్ అయ్యాను. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు గోపి విహారి గారికి థ్యాంక్స్. రవి పనస గారు ఎంతో పట్టుదలగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. జాతిరత్నాలు తర్వాత అలాంటి హ్యూమర్ ఉన్న మూవీస్ చేస్తున్నారు, కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తున్నారా అని నన్ను అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు సమాధానంగా “భగవంతుడు” సినిమా నిలుస్తుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ రవి పనస మాట్లాడుతూ – సినిమా పరిశ్రమతో నాకు మంచి అనుబంధం ఉంది. కొంతకాలం బిజినెస్ లోకి వెళ్లినా, నా మనసు సినిమాల మీదే ఉండేది. ఒక మంచి మూవీ చేయాలని అనుకునేవాడిని. అలాంటి టైమ్ లో వేణు ఊడుగుల అన్న ఈ కథ గురించి చెప్పారు. డైరెక్టర్ గోపి విహారి “భగవంతుడు” కథ చెప్పినప్పుడు అసురన్, కాంతార, కర్ణన్, జైభీమ్ వంటి సినిమాలు గుర్తొచ్చాయి. ఇలాంటి కథకు స్టార్ హీరోల కంటే కొత్త వాళ్లు కావాలి, స్టేజ్ ఎక్సిపీరియన్స్ ఉండాలని తిరువీర్, ఫరియాను తీసుకున్నాం. సైతాన్ వెబ్ సిరీస్ చూశాక రిషి మా మూవీకి బాగుంటాడని అనుకున్నాం. మేము అనుకున్న దాని కంటే బడ్జెట్ ఎక్కువైనా మూవీ బాగా వచ్చింది. మేము చెప్పడం కాదు సినిమా చూసి ఏ స్థాయి సక్సెస్ అనేది ఆడియెన్స్ చెబుతారు. ఏప్రిల్ లో “భగవంతుడు”మూవీని రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నాం. నన్ను ఒక బ్రదర్ లా సపోర్ట్ చేస్తున్న సునీల్ నారంగ్ అన్నకు థ్యాంక్స్. అన్నారు.

హీరో తిరువీర్ మాట్లాడుతూ – ది ప్రీ వెడ్డింగ్ షో సినిమా తర్వాత మళ్లీ మీ అందరినీ కలవడం హ్యాపీగా ఉంది. ఒకరోజు వేణు ఊడుగుల గారు కాల్ చేసి మంచి స్టోరీ ఉంది విను అని పంపారు. ఆ కథ విన్న 5 నిమిషాలకే ఎంత గొప్ప మూవీ అవుతుంది అనేది అర్థమైంది. నాకు ఇక స్క్రిప్ట్ చెప్పడం వద్ద షూటింగ్ ఎప్పుడు చెప్పండి అన్నాను. అప్పటికి మసూద రిలీజైంది. ఆ మూవీ హిట్ అయినా తిరువీర్ మీద ఎంత పెట్టొచ్చు, ఎంత వస్తుందని అంతా మాట్లాడుకుంటున్నారు. “భగవంతుడు” కథకు చాలా బడ్జెట్ అవుతుంది నా మీద అంత బడ్జెట్ పెడతారా అనే సందేహం ఉండేది. నటుడిగా నువ్వు ఈ కథకు కావాలని చూస్తున్నామని వేణు అన్న, డైరెక్టర్ గోపి విహారి గారు నాతో చెప్పారు. నాకు డ్యాన్స్ రాదు గోవింద్ గారు డ్యాన్స్ నేర్పించారు. అలాగే మహేశ్ మాస్టర్ డబ్బు కొట్టడం నేర్పారు. ఈ సినిమాలో మేమంతా ఒకరితో ఒకరం పోటీ పడి నటించాం. నన్ను నమ్మండి “భగవంతుడు” చాలా గొప్ప సినిమా అవుతుంది. అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – నేను స్నేహగీతం సినిమా చేస్తున్న టైమ్ నుంచి రవి పనస మంచి మిత్రులు. నాకు ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉండేవారు. ఆయన “భగవంతుడు” సినిమా నిర్మిస్తుండటం గర్వంగా ఉంది. ఏషియన్ సునీల్ గారితో కలిసి పక్కా ప్లానింగ్ తో రవి పనస అన్న ఈ మూవీ నిర్మిస్తున్నారు. టీజర్ చాలా బాగుంది. ఇంత బాగుంటుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. తిరువవీర్ నటనను ఇష్టపడతాను. ఆయన మసూద సినిమాను అనేక సార్లు చూశా. ఫరియా నాతో సిగ్మా అనే మూవీలో నటిస్తోంది. ఆమె మంచి కోస్టార్. డైరెక్టర్ విహారి గారికి కంగ్రాట్స్. అలాగే రాజ్ తోట మా ఊరు పేరు భైరవ కోన సినిమాకు వర్క్ చేశాడు. ఇప్పుడు స్పిరిట్ మూవీకి పనిచేస్తున్నారు. “భగవంతుడు” సినిమా ఘన విజయం సాధించాలని టీమ్ అందరికీ విశెస్ అందిస్తున్నా. అన్నారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – నేను ఇండస్ట్రీకి రాకముందు ప్రతి ప్రమోషన్ ఈవెంట్ లో హీరోల పక్కన రవి పనస అన్న కనిపించేవారు. సినిమా అవకాశాల కోసం ఫిలింనగర్ వచ్చి ఆయనను కలిసివాడిని. “భగవంతుడు” సినిమా టీజర్ ఈవెంట్ గురించి చెప్పగానే నేను తప్పకుండా వస్తానని వచ్చాను. ఈ రోజు ఈ నగరానికి ఏమైంది 2 షూటింగ్ జరుగుతోంది. అక్కడి నుంచే వచ్చాను. అలాగే హీరో తిరువీర్ నాకు మంచి మిత్రుడు. అన్నీ కుదిరితే ఫలక్ నుమా దాస్ సినిమాలో తిరువీర్ నటించేవాడు. టీజర్ చాలా బాగుంది. డైరెక్టర్ కు ఆల్ ది బెస్ట్. నేను అర్బన్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చేస్తుంటా గానీ నాకు ఇలాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఇష్టం. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. “భగవంతుడు” మూవీ రవి పనస అన్నకు మంచి రిటర్న్స్ తీసుకొచ్చి..నాతో సినిమాకు అడ్వాన్స్ ఇవ్వాలి. ఈ మూవీకి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషిలతో పాటు రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు

టెక్నికల్ టీమ్
————————
కాస్ట్యూమ్ డిజైనర్ – ఆయేషా మరియం
యాక్షన్ – రామ్ కిషన్, రాబిన్ సుబ్బు
లిరిక్స్ – చంద్రబోస్, గోరెటి వెంకన్న, కాసర్ల శ్యామ్,
కొరియోగ్రఫీ – ఈశ్వర్ పెంటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రవితేజ పూదారి
సినిమాటోగ్రఫీ – రాజ్ తోట
మ్యూజిక్ – కె.పి
ప్రొడక్షన్ డిజైనర్ – గాంధీ నడికుడికర్
ఎడిటర్ – ప్రవీణ్ పూడి
సమర్పణ – ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్
బ్యానర్ – రవి పనస ఫిలిం కార్పొరేషన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – రవి పనస
స్టోరీ, డైరెక్షన్ – జి.జి.విహారి

“Amaravathiki Aahwanam” Teaser Released by Actor & Producer Murali Mohan Garu, Movie Releasing on Feb 13th

శివ కంఠమనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా “అమరావతికి ఆహ్వానం”. ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీల‌క‌ పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్ ను ప్రఖ్యాత నిర్మాత – నటులు మురళీ మోహన్ గారు రిలీజ్ చేశారు. “అమరావతికి ఆహ్వానం” సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో..

నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ – ”నిర్మాత వెంకటేశ్వరరావు గారు మా బావగారు. ఆయన అడగటంతో ఈ సినిమాలో నటించాను. సినిమాలో నటిస్తున్నప్పుడు తెలియలేదు గానీ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే కంటెంట్ చాలా బాగుందని అనిపిస్తోంది. అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ జీవీకేగారు ఈ సినిమాను రూపొందించాడు. “అమరావతికి ఆహ్వానం” సినిమా మా టీమ్ అందరికీ విజయాన్ని అందించాలి” అన్నారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ – “అమరావతికి ఆహ్వానం” చిత్రంలో నేను ఫ‌స్ట్‌టైమ్‌ ఒక‌ పిచ్చివాడి క్యారెక్టర్ లో నటించాను. ఆ క్యారెక్టర్ మీకు బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ మూవీస్, హారర్ మూవీస్..ఈ మూడు జానర్ మూవీస్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. మా “అమరావతికి ఆహ్వానం” సినిమాను కూడా మీరంతా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ – “అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ ” అన్నారు.

ప్రముఖ నటులు -నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ – “అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ మూవీ కంటెంట్ చూస్తుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కలుగుతోంది. ఈ నిర్మాతలు గతంలో కూడా చిన్న బడ్జెట్ లో మంచి చిత్రాలు చేశారు. మా గురువు గారు దాసరి గారు చెప్పినట్లు చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ప్రాణం. కొత్త దర్శకుడిగైనా జీవీకే ప్రతిభావంతంగా సినిమాను చక్కగా తెరకెక్కించారు. టీజర్ తోనే భయం కలిగించారు. ఈ చిత్ర నిర్మాతలు వెంకటేశ్వరరావు గారు, శంకర్ రావు గారితో నాకు చాలాకాలంగా స్నేహం ఉంది. వాళ్లు మా రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు. గతంలో తెలుగు సినిమా అంటే తెలుగు వారికి మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం సంతోషంగా ఉంది. “అమరావతికి ఆహ్వానం” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ – ”మాకు సినిమా ఇండస్ట్రీతో 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. సినిమాలు చేయాలంటే డబ్బులు కావాలని రియల్ ఎస్టేట్ మార్గాన్ని ఎంచుకున్నాం. అప్పుడే మురళీమోహన్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా పనిచేశారు. రియల్ ఎస్టేట్ లో సంపాదనతో చిన్న బడ్జెట్ లో సినిమాలు చేద్దామని ముందుకొచ్చాం. మా సంస్థలో “అమరావతికి ఆహ్వానంష‌ ఆరవ సినిమా. మేము నిర్మించిన గత చిత్రాలన్నీ థియేట్రికల్ గానే రిలీజ్ చేశాం. భోజ్ పూరిలో ఒక సినిమా చేసి అక్కడ విడుదల చేశాం. హారర్ జానర్ లో అందరికీ నచ్చేలా మా సినిమాను నిర్మించాం. ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ మా మూవీకి ఉంటుందని నమ్ముతున్నాం” అన్నారు.

హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ – “అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ చూస్తున్నప్పుడు అందులోని యాక్టర్స్ అంతా నిజంగానే ఒక ఫ్యామిలీ కావొచ్చనే ఫీలింగ్ మీకు ఎలా కలిగిందో షూటింగ్ చేసేప్పుడు మా యూనిట్ అందరం ఒక ఫ్యామిలీ అనే భావన మా అందరిలో కలిగింది. అంతమంచి వాతావరణంలో పనిచేసిన మా అందరికీ ఇలాంటి మేకర్స్ కు సక్సెస్ రావాలనే అనిపిస్తుంది కదా. ఈ సినిమా మా ప్రొడ్యూసర్స్ కు సక్సెస్, డబ్బును తీసుకురావాలని కోరుకుంటున్నా. మా డైరెక్టర్ కు సినిమా మీదున్న ప్యాషన్, ఆయన స్క్రిప్ట్ నెరేట్ చేసేప్పుడే తెలిసింది. హారర్ ఎలిమెంట్స్ తో పాటు మీకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది” అన్నారు.

డైరెక్టర్ జీవీకే మాట్లాడుతూ – ‘‘ప్రొడ్యూసర్ శంకర్ రావు గారి ప్రోత్సాహంతో ఈ సినిమాను రూపొందించాను. ఆయన మేము గతంలో ఓ మూవీ చేసినప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తాను నువ్వు కథ రెడీ చేసుకో అన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. అనుకున్న బడ్జెట్ లో అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం ప్లాన్డ్ గా ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం. వీఎఫ్ఎక్స్ దగ్గరే మాకు కొంచెం డిలే అయ్యింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా నిర్మాతలకు, యూనిట్‌ సభ్యులకు, సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు.. ప్రేక్షకులు ఫలానా సినిమానే చూడాలని ఫిక్స్ అయి ఉండరు. వాళ్లకు కంటెంట్ నచ్చితే ఏ సినిమా అయినా చూస్తారు. మా మూవీ మంచి కంటెంట్ తో వస్తోంది. మా సినిమాకు మీ అంద‌రి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు.

హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ – ”మేము కలిసి గతంలో ‘అక్కడొకడుంటాడు, మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి, బిగ్ బ్రదర్’ వంటి మూవీస్ చేశాం. ఇప్పుడు “అమరావతికి ఆహ్వానం” చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారు అన్నట్లు సినిమా అనుకున్న బడ్జెట్ లో చేయడమే సగం సక్సెస్. అలా మా సినిమాను కూడా డైరెక్టర్ జీవీకే ఎక్కడా వృథా లేకుండా అనుకున్న బడ్జెట్ లో ఇన్ టైమ్ లో కంప్లీట్ చేశాడు. మా సినిమాలో ఎస్తేర్, ధన్య, సుప్రియ దెయ్యాల పాత్రల్లో భయపెడతారు. ఎస్తేర్ పెర్ఫార్మెన్స్‌ మంచి హైలైట్ అవుతుంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఎలా సక్సెస్ అయ్యాయో, అలాగే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చే సినిమాలు, మాతో పాటు 13న రిలీజ్ అయ్యే సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో న‌టులు శివ హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ జె.ప్ర‌భాక‌ర్ రెడ్డి, సంగీత ద‌ర్శ‌కులు ప‌ద్మ‌నాబ్‌ భ‌రద్వాజ్‌, నిర్మాతలు ఘంటా శ్రీనివాస్, ర‌వి శంక‌ర్ కంఠంనేని, కొమ్మ‌ల‌పాటి సాయి సుధాక‌ర్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు, ప‌ర్వ‌త‌నేని రాంబాబు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొని ప్ర‌సంగించారు.

నటీనటులు – శివ కంఠమనేని, ఎస్తేర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్, తదితరులు

టెక్నికల్ టీమ్
—————–
నిర్మాణ సార‌థ్యం: ముప్పా వెంక‌య్య చౌద‌రి
స‌మ‌ర్ప‌ణ‌: జి. రాంబాబు యాద‌వ్‌
బేన‌ర్‌: లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌
నిర్మాత‌లు: కెఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావు
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: జీవీకే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: వై. అనిల్ కుమార్‌, కె. శ్రీ‌నివాస్‌రావు
డిఓపి: జె ప్ర‌భాక‌ర్ రెడ్డి
మ్యూజిక్‌: ప‌ద్మ‌నాబ్‌ భ‌రద్వాజ్‌
ఎడిటింగ్‌: సాయిబాబు తలారి
ఫైట్స్‌: అంజి మాస్ట‌ర్
లిరిక్స్‌: ఉమా వంగూరి
కొరియోగ్ర‌ఫి: రాజ్‌ కృష్ణ‌
పిఆర్ఓ: సిద్ధు