Home Blog Page 30

‘Amaravathiki Ahwanam’ to post-production events; new poster released on the occasion of Christmas

ప్ర‌జెంట్ ట్రెండ్‌లో హార‌ర్ సినిమాలు హ‌వా న‌డుస్తోంది. ఈ ఏడాది విడుద‌లైన అన్నీ హార‌ర్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం అదే త‌ర‌హాలో ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ క‌థ, క‌థ‌నంతో ప్రేక్ష‌కుల‌కి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌ అనుభూతినిచ్చే విధంగా రూపొందిన చిత్రం అమ‌రావ‌తికి ఆహ్వానం. ఈ సినిమా టైటిల్ కి ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి ఆధ‌రణ ల‌భించింది. శివ కంఠంనేని,ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్త‌ర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ప‌లు లొకెష‌న్స్‌లో షూటింగ్స్ జ‌రుపుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర వేగంగా జ‌రుపుకుంటోంది. అతి త్వ‌ర‌లో భారీ ఎత్తున ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి థియేట‌ర్స్‌లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్‌. తాజాగా క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌ల‌తో స‌రిక్రొత్త పోస్టర్ మ‌రియు గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేక‌ర్స్‌..ఈ సంద‌ర్భంగా..

హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ – ఇప్ప‌టికే అనౌన్స్ చేసిన మా టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ప‌లు లొకేష‌న్స్‌లో షూటింగ్ పూర్తి చేశాం. ధ‌న్య‌, ఎస్త‌ర్‌,సుప్రిత వంటి మంచి క్యాస్టింగ్‌తో పాటు అశోక్ కుమార్‌, జెమిని సురేష్, భ‌ద్ర‌మ్‌ లాంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్ మా సినిమాలో భాగం అవడం చాలా సంతోషంగా ఉంది. ద‌ర్శ‌కుడు జీవికే త‌న విజ‌న్ తో ఈ సినిమాకు మంచి ఔట్‌పుట్ తీసుకువ‌చ్చారు. అన్ని పాత్ర‌ల‌కి ప్రాధాన్య‌త ఉండేలా మంచి క‌థ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్ర‌స్తుతం వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి. త‌ప్ప‌కుండా థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ని సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ అనుభూతినిస్తుంది. అతి త్వ‌ర‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసి థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు

ద‌ర్శ‌కుడు జివికె మాట్లాడుతూ – `ఈ మ‌ధ్య కాలంలో రిలీజైన అన్ని హార‌ర్ సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. అదే త‌ర‌హాలో మ‌రో డిఫ‌రెంట్‌ హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాశంతో వ‌స్తోన్న చిత్రం అమ‌రావ‌తికి ఆహ్వానం. శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్త‌ర్‌, సుప్రిత, శివ హ‌రీశ్‌, అశోక్ కుమార్‌, జెమిని సురేశ్, భ‌ద్ర‌మ్‌ కీల‌క పాత్ర‌లు పోషించారు. మంచి ఆర్టిస్టుల‌తో పాటు ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ‌, క‌థ‌నంతో ఈ సినిమా తెర‌కెక్కింది. సీనియ‌ర్‌ సినిమాటోగ్రాఫ‌ర్‌ జె ప్రభాక‌ర్ రెడ్డి గారి విజువ‌ల్స్, హ‌నుమాన్ ఫేమ్ సాయిబాబు త‌లారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్ల‌స్ అవుతాయి. పద్మ‌నాబ్ బ‌ర‌ద్వాజ్ గారి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేట‌ర్స్‌లో ఆడియ‌న్స్‌ని హార‌ర్ మూడ్ క్యారీ చేసే విధంగా చేస్తుంది` అన్నారు

శివ కంఠంనేని, ఎస్త‌ర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

నిర్మాణ సార‌థ్యం: ముప్పా వెంక‌య్య చౌద‌రి
స‌మ‌ర్ప‌ణ‌: జి. రాంబాబు యాద‌వ్‌
బేన‌ర్‌: లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌
నిర్మాత‌లు: కెఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావు
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: జివికె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: వై. అనిల్ కుమార్‌, కె. శ్రీ‌నివాస్‌రావు
డిఓపి: జె ప్ర‌భాక‌ర్ రెడ్డి
మ్యూజిక్‌: ప‌ద్మ‌నాబ్‌ భ‌రద్వాజ్‌
ఎడిటింగ్‌: సాయిబాబు తలారి
ఫైట్స్‌: అంజి మాస్ట‌ర్
లిరిక్స్‌: ఉమా వంగూరి
కొరియోగ్ర‌ఫి: రాజ్‌ కృష్ణ‌
పిఆర్ఓ: సిద్ధు

‘Gandhi Talks’ Trailer Released, Movie Releasing on January 30th

Zee Studios, in association with Kyoorius Digital Pvt Ltd, Pincmoon Meta Studios and Movie Mill Entertainment, unveils the trailer of Gandhi Talks a film that powerfully reinforces the makers belief in courageous, content-led cinema and storytelling that dares to break convention.

In an industry dominated by noise and spectacle, Gandhi Talks arrives with restraint and confidence. The trailer speaks volumes without dialogue, relying on evocative imagery, charged silences, and emotional depth. It is a cinematic statement that trusts its audience to listen not just with their ears, but with their instincts.

Headlined by a stellar ensemble cast featuring Vijay Sethupathi, Arvind Swami, Aditi Rao Hydari and Siddharth Jadhav, the trailer offers glimpses of performances rooted in nuance and internal conflict. With no spoken words to lean on, expressions and presence take centre stage.

Sharing his experience, Vijay Sethupathi says, “Gandhi Talks challenged me to express emotion without words. It’s a rare film where silence becomes the strongest dialogue.”

Echoing this sentiment, Arvind Swamy adds, “In a world drowning in noise, Gandhi Talks reminds us that silence can still shake a conscience.
This is a film where words step aside and truth walks in quietly. Rahman’s genius music becomes its language.”

Aditi Rao Hydari reflects on the film’s emotional core, saying, “What moved me most was how emotions are felt rather than spoken. The film allows vulnerability and silence to coexist beautifully.”

For Siddharth Jadhav, the film reaffirmed cinema’s universal language. “Being part of a film that communicates so powerfully without dialogue was truly special. It reminds you why cinema speaks beyond words,” he shares.

Directed by Kishore Pandurang Belekar, Gandhi Talks is further elevated by the evocative music and background score of A R Rahman, where music becomes the emotional voice of the narrative. His compositions breathe life into the silences, while the voices of accomplished singers add depth and resonance to the film’s unspoken moments.

In a bold and unconventional move, the makers released the trailer three days ahead of its musical culmination an A R Rahman concert marking a rare and thoughtful convergence of cinema and live music. This distinctive promotional approach mirrors the film’s own philosophy immersive, experiential, and driven by artistic intent.

With Gandhi Talks, Zee Studios and the producers once again reaffirm their commitment to films that challenge norms, celebrate nuanced performances, and push the boundaries of Indian cinema.

Gandhi Talks releases in theatres on 30th January 2026.

“It’s amazing to see the entire industry come together to celebrate 30 years of Rani’s iconic legacy with ‘Mardaani 3’ : Ranbir Kapoor.

Ranbir Kapoor is really happy to see the entire film industry of India come together to celebrate his favourite actor Rani Mukerji’s 30th year in cinema with Mardaani 3!

Rani was RK’s co-star in his debut film Saawariya and was there for him when he needed someone the most. So, Ranbir roots for Rani to win with every film, every performance.

Ranbir says, “Rani is the co-star of my first film Sawaariya and she is the first person who told me that if I worked hard, I would go a long way. I will never forget that interaction because it gave me so much confidence when I needed it the most. I have seen her as a person closely, I have seen her work closely and have been bowled over by her grace, charm and brilliance.”

He adds, “It is really amazing to see the entire industry come forward to celebrate 30 years of her iconic legacy. I have always felt that Rani is one for the ages, one of the greatest ever actors in India and someone who has defined our industry through her work. Her choice of projects and roles have shaped how women are portrayed on the screen today.”

Ranbir reveals Rani only wants to spread joy through her cinema. He says, “Thank you Rani for the movies, the memories, the nostalgia and the powerhouse performances. She is an entertainer who has dedicated her life to make people happy and I don’t have words to describe the impact her films have had on me.”

Rani Mukerji’s Mardaani 3 has broken the internet and has become the most talked-about film. The acclaimed Mardaani franchise that focusses on crimes against women with every instalment, will now highlight the issue of young girls aged 8-9 years, from low income groups, being kidnapped for a specific reason from across our country.

Directed by Abhiraj Minawala and produced by Aditya Chopra, Mardaani 3 continues the franchise’s tradition of socially relevant cinema. While Mardaani exposed the grim realities of human trafficking and Mardaani 2 explored the disturbing psyche of a serial rapist who challenged the system, Mardaani 3 delves into another dark and brutal reality of our society, further strengthening the franchise’s legacy of impactful, issue-based storytelling.

‘Blood Roses’ trailer released by Nata Kiriti Padma Shri Rajendra Prasad

టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను నటకిరీటి పద్మశ్రీ రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు.

బ్లడ్ రోజస్ టీజర్ ను చూసి నటుడు సుమన్, నటుడు అజయ్ ఘోష్ చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. టీజర్ ఆసక్తికంగా ఉందని, త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీ విజయం సాధించాలని వారు కోరారు.

ఈ సినిమాలో కీలక పాత్రలో శ్రీలు, క్రాంతి కిల్లి నటించగా,సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , ధ్రువ, అనిల్, నరేంద్ర , ప్రగ్యా, నవిత, జబర్దస్త్ జీఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, మమత రెడ్డి, జ్యోతి, ఆచార్యలు తదితరులు నటించారు. దర్శకుడు ఎంజిఆర్ ఈ సినిమాను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యే విధంగా చిత్రీకరణ చేశారు.

ఈ సందర్భంగా నటకిరీటి పద్మశ్రీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...
బ్లడ్ రోజస్ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది, ఫిబ్రవరి 6న విడుదల కాబోతున్న ఈ మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను, మంచి థ్రిల్లింగ్, క్రైమ్ ఎలిమెంట్స్ తో వస్తోన్న ఈ సినిమాతో డైరెక్టర్ ఎంజిఆర్ , నిర్మాత హరీష్. కె కు అలాగే ఈ చిత్రంలో పనిచేసిన అందరూ ఆర్టిస్ట్స్ టెక్నీషియయన్స్ కు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్న అన్నారు.

బ్లడ్ రోజస్ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ మరియు యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది, ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిత్రానికి కెమెరామెన్ ఒగి రెడ్డి శివకుమార్ సంగీతం పెద్దపల్లి రోహిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్. ఈ చిత్రం దాదాపు షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఎం.జి మూవీస్ ద్వారా అచ్చిబాబు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.

నటీనటులు:
ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి హీరో హీరోయిన్లు గా నటిస్తోన్న ఈ సినిమాలో సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, శ్రీలు, క్రాంతి కిల్లి, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , ధ్రువ, అనిల్, నరేంద్ర, ప్రగ్యా, నవిత జబర్దస్త్ జీఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, మమత రెడ్డి, జ్యోతి, ఆచార్యలు,బేబీ అనుష్క, బేబీ శ్రీయ, బేబీ గౌతమి తదితరులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: టిబీఆర్ సినీ క్రియేషన్స్
సమర్పణ: కె,నాగన్న మరియు కె,లక్ష్మమ్మ నిర్మాత: హరీష్ కె
కో ప్రొడ్యూసర్: ఎల్లప్ప
రచన, దర్శకత్వం: ఎంజిఆర్
సంగీతం: పెద్దపల్లి రోహిత్ (పిఆర్)
ఎడిటర్: రవితేజ సిహెచ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మణికుమార్
కెమెరామెన్: ఓగిరెడ్డి శివ కుమార్
డిఐ: సంజీవ్ మామిడి
సౌండ్ ఎఫెక్ట్: శ్రీను నాగపూరి
కాస్ట్యూమ్ డిజైనర్: గీతిక మందాటి
ఫైట్: నందు, హుసేన్, రాజేష్ లంక
పబ్లిసిటీ డిజైనర్: శక్తి గ్రాఫిస్తే
పిఆర్ఓ: శ్రీధర్

Director & Producer Bellam Ramakrishna Reddy, Actor Raghu Kunche interview about ‘DEVAGUDI’ Movie

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం “దేవగుడి”. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. “దేవగుడి” సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి, నటుడు రఘు కుంచె.

దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ
– నేను ఉద్యోగం చేస్తున్న టైమ్ లో భగవద్గీత ఆధారంగా యధాతథం అనే కాన్సెప్ట్ తో సినిమా చేయాలని అనుకున్నాను. భగవద్గీత మతగ్రంథం అనుకుంటారు గానీ అది సైంటిఫిక్ గా నిజమని ఐన్ స్టీన్, అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఆ కాన్సెప్ట్ తో మూవీ నిర్మించాలని శ్రీకాంత్ గారిని హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేశాం. ఆ టైమ్ లో శ్రీకాంత్ గారు సినిమాలో నా ఇన్వాల్వ్ మెంట్ చూసి మీలో దర్శకుడు కూడా ఉన్నారు. మీరే డెరెక్ట్ చేయొచ్చు కదా అని ఎంకరేజ్ చేశారు. ఆ మూవీ తర్వాత దృశ్యకావ్యం సినిమాను నా దర్శకత్వంలో తెరకెక్కించాను. ఇప్పుడు “దేవగుడి” సినిమా రూపొందించాను. ఇది దర్శకుడిగా నా రెండో మూవీ

– సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్లను ఎలా యూజ్ చేసుకుంటారో మీకు తెలుసు. గత చిత్రాల విషయంలో నాకు ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈ సినిమాను జాగ్రత్తగా రూపొందించాను. నేను ఇంజినీర్ ను కాబట్టి పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైమ్ లోనే షూటింగ్ కంప్లీట్ చేశఆం. జస్ట్ ఓ 10 పర్సెంట్ బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువైంది.

– ఇటీవల రిలీజ్ చేసిన మా మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిత్ర గారు పాడిన ఆరో ఆరారో పాటకు పెద్ద సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్ లో మా చిత్రానికే డిజిటల్ వ్యూస్ ఎక్కువగా ఉన్నాయి. సినిమాకు సెన్సార్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కాస్త వయలెన్స్, రొమాంటిక్ సాంగ్ ఉందని రెండు కట్స్ తో ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. నేనే దర్శకుడిని, నిర్మాతను కావడం వల్ల అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించగలిగాను. సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఉంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బిజినెస్ పరంగా మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి.

– ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇప్పటిదాకా మనకు చాలా సినిమాలు వచ్చాయి. 30 ఏళ్ల క్రితం ట్రెండ్ అది. అయితే మా మూవీలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా, అది కొంత వరకే చూపించాం. మెయిన్ గా స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కథ ట్రావెల్ అవుతుంది. దేవగుడి వీరారెడ్డి పాత్రలో రఘు కుంచె గారు నటించారు. ఆయన ఆ ప్రాంతంలో మంచి పేరున్న వ్యక్తి. ఆయనకు కూతురు, కొడుకు ఉంటారు. ఆ ఇద్దరు పిల్లలు, వాళ్ల ఇంటి డ్రైవర్ కొడుకు. ఈ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీళ్ల బాల్యంలో జరిగిన సన్నివేశాలు చూపిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. కాసేపటికే వాళ్లు పెద్దవాళ్లు కావడం, మెయిన్ స్టోరీలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్తాం. ఆ ముగ్గురి స్నేహితులు ఎందుకు విడిపోవాల్సివచ్చింది అనేది ఆకట్టుకునే భావోద్వేగాలతో సాగుతుంది.

– “దేవగుడి” మూవీలో 11 నిమిషాల ఒక స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. దాంతో పాటు కొన్ని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ప్లాన్ చేస్తూ వెళ్లాం. ఎక్కడా మూవీ ల్యాగ్ అనిపించదు. నిజ జీవిత ఘటనల ఆధారంగా మంచి కథా కథనాలతో ఈ సినిమాను రూపొందించాను. స్క్రీన్ ప్లే చాలా షార్ప్ గా ఉంటుంది. సినిమాలోని ఒక్కో సీన్ అలా వెళ్తూ ఉంటుంది. మంచి సాంగ్స్ ఉంటాయి. మదీన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించారు. మా “దేవగుడి” మూవీకి నార్మల్ టికెట్ రేట్స్ పెడుతున్నాం. సినిమా చూడాలని అనుకునే ప్రేక్షకులను ఎంకరేజ్ చేసేందుకు టికెట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. సినిమాకు వీళ్ల ద్వారా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందని ఆశిస్తున్నాం.

నటుడు రఘుకుంచె మాట్లాడుతూ
– ఈ నేను దేవగుడి వీరారెడ్డి అనే పాత్రలో నటించాను. ఆయన ఆ చుట్టు పక్కల ఏరియాలో పవర్ ఫుల్ వ్యక్తి. నాకు పలాస సినిమా తర్వాత అలాంటి రోల్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో వీరారెడ్డి పాత్ర కోసం దర్శకుడు రామకృష్ణా రెడ్డి గారు ఎలా చెబితే అలా పర్ ఫార్మ్ చేశాను. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పాను. ఈ సినిమా షూటింగ్ అంతా రియల్ లొకేషన్స్ లో చేశాం. ఎక్కడైతే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయని దర్శకుడు స్క్రిప్ట్ రాశారో అక్కడే షూటింగ్ చేశాం. దర్శకుడిగా, నిర్మాతగా బెల్లం రామకృష్ణా రెడ్డి గారు ఆయన జాబ్ పర్పెక్ట్ గా చేశారు. సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారు. అలాగే దర్శకుడిగా ప్రతి సీన్ చాలా క్లారిటీగా రూపొందించారు.

– నేను జీబులో వెళ్తుంటే నా పక్కన ఓ ఇరవై సుమోలు, జీబ్స్ వస్తుంటాయి. అన్ని వాహనాలతో కాన్వాయ్ లా వెళ్లడం పర్సనల్ గా గర్వంగా అనిపించేది. నాకు రియల్ లైఫ్ లో అలాంటి సందర్భం రాదు కదా. కాబట్టి వీరారెడ్డి పాత్రలో నటించడాన్ని రోజూ ఎంజాయ్ చేశాను. యాక్షన్ సీక్వెన్సుల్లో మాత్రం కొన్ని బాంబ్ బ్లాస్ట్స్ ఉన్నాయి. అప్పుడు మాత్రం భయమేసేది.

– స్నేహం, ప్రేమ, పగ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ మూవీ ఆకట్టుకునేలా సాగుతుంది. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా దాన్నొక బ్యాక్ డ్రాప్ లా మాత్రమే పెట్టుకున్నారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డెడికేషన్ తో వర్క్ చేశారు. సెట్ కు వెళ్లే సరికి ప్రతీది రెడీగా ఉండేది. లోకల్ ఆర్టిస్టులు కూడా బాగా నటించారు. ఈ సినిమాలో నేను ఒక పాట కంపోజ్ చేసి పాడాను. మదీన్ మంచి సాంగ్స్ చేశాడు. అతనికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఫ్యూచర్ ఉంటుంది.

– యాక్టర్ కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలా జరిగిపోయింది. సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటిస్తున్నాను. నటుడిగా పెద్ద ప్రతిభావంతుడిని అనుకోవడం లేదు. అయితే సిన్సియర్ గా నా పాత్రకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నాను. మనోజ్ బాజ్ పాయ్ ఫ్యామిలీ మ్యాన్ లో చేసినట్లు అలాంటి క్యారెక్టర్స్ లో నటించాలని ఉంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నా.

‘CAT’ Movie first look launched by ‘Peddi’ director Buchibabu

VRGR మూవీస్ బ్యానర్ పై Y. గంగాధర్ IPS సమర్పణలో, రజని గొంగటి నిర్మాతగా నూతన దర్శకుడు G.V. నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ” CAT “…. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకులు బుచ్చి బాబు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఇప్పుడే CAT మూవీ పోస్టర్ లాంచ్ చేసాము, దర్శకుడు కమ్ యాక్టర్ జి.వీ నాయుడు నాకు ఎప్పటినుంచో తెలుసు, CAT స్టోరీ కూడా చెప్పారు. వినూత్నంగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అందరికి పేరు తీసుకురావాలని, త్వరలొ విడుదలకు సిద్దమైన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.

దర్శక, నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి CAT చిత్ర విజయం పొందాలని బుచ్చి బాబు ఆకాంక్షించారు. డ్రామా, థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన

ఈ చిత్రంలో G.V. నాయుడు , V.J. బాలు , లావణ్య , కళ్యాణి రాణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ :- పంకజ్ తొట్టాడ
ఎడిటింగ్ :- D.వెంకటప్రభు
మ్యూజిక్ :- మారుతి రాజా
కథ, స్క్రీన్ ప్లే, మాటలు :- V.CH. శేఖర్ ముద్దు
దర్శకత్వం :- G.V. నాయుడు (గొంగటి వీరాంజనేయులు)

‘Zamana’ Pre-Release Event held grandly, Movie Releasing on Jan 30

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు హీరో ఆకాష్ పూరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ…జమాన ట్రైలర్ బాగుంది, చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, మంచి కాన్సెప్ట్ తో జనవరి 30న విడుదల కాబోతున్న ఈ మూవీని అందరూ థియేటర్స్ లో చూసి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను, క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తోన్న ఈ సినిమా అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలనుకున్తున్నాను అన్నారు.

దర్శకుడు భాస్కర్ జక్కుల మాట్లాడుతూ…జమాన సినిమా డిఫరెంట్ గా ఉంటుంది, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి, నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత తేజస్వి అడప గారికి కృతజ్ఞతలు, మా చిత్ర యూనిట్ కు మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కేశవ కిరణ్ మాట్లాడుతూ…జమాన సినిమాను దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నను. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి కృతఙ్ఞతలు, మా సినిమాను సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన హీరో ఆకాష్ పూరికి కృతజ్ఞతలు తెలిపారు.

హీరో సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... కష్టపడి చేసిన జమాన సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది, చాలా నమ్మి, ప్రాణం పెట్టి మేము ఈ సినిమా చేశాం మా వర్క్ మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాము అన్నారు.

‘నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. జమాన చిత్రంలో చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది’ . నేటి యూత్‌కి కనెక్ట్‌ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. స్వాతి కశ్యప్‌, జారా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగన్‌ ఏ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సంగీతం: కేశవ కిరణ్‌, రచన-దర్శకత్వం: భాస్కర్‌ జక్కుల.

Srinivasaa Silver Screen, VI Anand & Hero Nithiin’s 36 Unique Sci-Fi Entertainer Shoot Begins Soon

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్ త‌న 36 సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్‌ శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు .

విభిన్న‌మైన క‌థ‌లు, క‌థ‌నాల‌తో సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మ‌రోసారి ఈ భారీ ప్రాజెక్ట్‌తో క్రియేటివ్ బౌండ‌రీస్ రేంజ్‌ను మ‌రింత పెంచ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. సినీ ప్రేక్ష‌కుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా ఈ క్రేజీ సినిమా రూపొంద‌నుంది. ఊరు పేరు భైర‌వ‌కోన చిత్రం త‌ర్వాత ఈ విజ‌న‌రీ డైరెక్ట‌ర్ హై కాన్సెప్ట్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు.

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్ హీరోగా న‌టిస్తుండ‌టంతో ఈ మూవీపై ఎగ్జ‌యిట్‌మెంట్ మ‌రింత‌గా పెరిగింది. వెర్స‌టైల్‌, ప‌వ‌ర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునే నితిన్ వంటి క‌థానాయ‌కుడితో..క్వాలిటీ సినిమాల‌ను గ్రాండ్ స్కేల్‌లో సినిమాను రూపొందించే శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ సంస్థ‌ చేతులు క‌ల‌ప‌టం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆస‌క్తిని పెంచుతోంది.

ఈ ప్రెస్టీజియ‌స్ కాంబోను చూస్తుంటే సినిమాపై నిర్మాత శ్రీనివాస చిట్టూరికి ఉన్న ప్యాష‌న్ క‌నిపిస్తోంది. ఆదివారం (జ‌న‌వ‌రి 25) ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. టాలెంటెడ్ హీరో, వైవిధ్యంగా సినిమాను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు, గ్రాండ్‌గా సినిమాను నిర్మించే సంస్థ క‌ల‌యిక‌లో రూపొంద‌బోయే ఈ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్ నితిన్ కెరీర్‌లో అత్యంత ఆస‌క్తిక‌ర‌మై ప్రాజెక్ట్స్‌లో ఒక‌టిగా మార‌నుంది.

నితిన్ 36వ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నారు.

న‌టీన‌టులు:

నితిన్‌

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వి.ఐ.ఆనంద్‌
నిర్మాత‌: శ్రీనివాస చిట్టూరి
బ్యాన‌ర్‌: శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్‌
స‌మ‌ర్ప‌ణ‌: ప‌వ‌న్ కుమార్‌
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా
మార్కెటింగ్: విష్ణు తేజ్‌ పుట్ట

‘Zamana’ movie completed censor, in theaters from January 30

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత గా వ్యవహరించారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల గ్రాండ్ గా జరిగింది, తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, యు/ఏ సట్టిఫికెట్ పొందిన ఈ మూవీ జనవరి 30న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

జమాన సినిమా డిఫరెంట్ గా ఉంటుంది, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఎమ్. జి మూవీస్ అచ్చిబాబు ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ ఎడిటర్ ఎం అర్ వర్మ ఎడిటింగ్ చేశారు, అతని వర్క్ సినిమాకు అదనపు ఆకర్షన కానుంది.

‘నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. జమాన చిత్రంలో చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది’ . నేటి యూత్‌కి కనెక్ట్‌ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. స్వాతి కశ్యప్‌, జారా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగన్‌ ఏ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సంగీతం: కేశవ కిరణ్‌, రచన-దర్శకత్వం: భాస్కర్‌ జక్కుల.

Acting alongside Megastar Chiranjeevi is my good fortune : Actor Karate Karthi

నటన అంటే ఎంతో ఇష్టం కావడంతో సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టి.. కమల్‌ హాసన్‌ నటించిన ‘దశావతారం’ చిత్రంలో జూనియర్‌ ఆర్టిస్టుగా తొలిసారి నటనకు శ్రీకారం చుట్టారు కరాటే కార్తి. ‘సింగం-3’, ‘దబాంగ్‌-3’, ‘బిగిల్‌’, ‘పేట’, ‘ఖైదీ’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.

సినీ రంగంలో తన 14 యేళ్ళ పోరాటానికి తగిన గుర్తింపు, విజయం ‘డాక్టర్‌’ చిత్రం ద్వారా దక్కిందని నటుడు కరాటే కార్తి అంటున్నారు. ఈ క్రమంలో హీరో శివ కార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’తో మంచి గుర్తింపుతో పాటు విజయం కూడా వరించిందని కార్తి పేర్కొన్నారు.

తాజాగా కరాటే కార్తి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవితో నటించడం అదృష్టమని అతని దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానని, అసలు మెగాస్టార్ చాలా సాధారణ మనిషిలా ఉంటాడని అలా ఉండడం అతని గొప్పదనమని అలాగే అనిల్ రావిపూడి తో వర్క్ చేయడం చాలా ఎనర్జీ ఇచ్చిందని అతను చెప్పినట్లు చేస్తే చాలు ఎవరైనా మంచి ఆర్టిస్ట్ అవ్వొచ్చని ఆయన అన్నారు.

సీఆర్‌పీఎఫ్‌లో పనిచేసిన తనకు బాక్సింగ్‌‌లో గోల్డ్‌ మెడల్‌ సైతం వచ్చిందన్నారు. అఖిల భారత కరాటే పోటీల్లో ఏకంగా 13సార్లు చాంపియన్‌గా నిలిచిన ఆయన జిమ్నాస్టిక్‌, సిలంబాట్టం, జూడో, కిక్‌ బాక్సింగ్‌ క్రీడల్లో శిక్షణ తీసుకున్నట్టు పేర్కొన్నారు. కానీ, తనకు నటన అంటే ఎంతో ఇష్టం కావడంతో సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తనకు మంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి అన్నారు. హీరో సూర్య మరియు వెంకీ అట్లూరి సినిమాలో తాను మంచి రోల్ లో నటిస్తున్నట్లు తెలిపారు.