Home Blog Page 41

Grand Launch of suspense thriller   ‘Indravathi’ Movie Poster and Teaser

Giving importance to novelty while combining the experience of senior artistes, director–producer Nandi Venkat Reddy is bringing a gripping suspense thriller to Telugu audiences. Titled “Indravathi,” the film is being produced under the Sri Shiva Sai Films banner, with Venkat Reddy himself handling both direction and production duties.

The film features Mooram Reddy Venkateswarlu, Vadla Siddharth, Yenduri Niharika Chowdhary, and Eedi Sushma in lead roles. Senior artistes Suman, Lankela Ashok Reddy, Gharshana Srinivas, Tarzan, Dil Ramesh, Chitra Srinu, Archana, Dhanunjay, Nagesh and others play key roles in the movie.

Recently, the film’s first look poster and teaser were unveiled at a special event held at the Telugu Film Chamber, Hyderabad.

Speaking as the chief guest, director–producer Sanjeev Kumar Megoti said,“The teaser looks fantastic. The film is being made with great quality. We earlier released the songs of Venkat Reddy garu’s film ‘Tarakeswari’ through our Anvika Audio label. Sri Shiva Sai Films started with small films, and now it is growing to a bigger scale. The entire team is working together like a family. I sincerely wish ‘Indravathi’ becomes a big success. Best wishes to the entire team!”

Senior actor Gharshana Srinivas said,
“Venkat Reddy garu always uses the resources he has in the best possible way and never compromises on quality. Those who work with such dedication are the true creative persons. While respecting senior artistes, he also encourages new talent and brings meaningful films to the audience. He is a good human being who values everyone. My heartfelt wishes to the entire ‘Indravathi’ team.”

Director–producer Nandi Venkat Reddy shared,“This film features brilliant performances from new talent. The newcomers have excelled, and the senior artistes added great strength with their experience. We will soon organise the audio launch. The release date and remaining details will be announced shortly.”

Lead actors Mooram Reddy Venkateswarlu, Vadla Siddharth, and heroines Yenduri Niharika Chowdhary, Eedi Sushma expressed gratitude to Nandi Venkat Reddy for giving them a valuable opportunity.

Chief guests Dr. Vamsi Krishna (CEO, Soumit Media) and actor–producer Moosa Ali Khan congratulated the team and wished the film a successful journey. They expressed confidence that the suspense thriller “Indravathi” will surely impress audiences and become a super hit.

Film Unit Details:

Cast:
Mooram Reddy Venkateswarlu, Vadla Siddharth, Yenduri Niharika Chowdhary, Eedi Sushma, Senior artistes Suman, Lankela Ashok Reddy, Gharshana Srinivas, Tarzan, Dil Ramesh, Chitra Srinu, Archana, Dhanunjay, Nagesh and others.

Director & Producer: Nandi Venkat Reddy
Music: Drums Ramu
Dialogues: Vikram Kumar
DOP: D. Yadagiri
Editing: Saikumar
PROs: Kadali Rambabu, Dayyala Ashok

Actor Shivaji Raja Launches Trailer of ‘Dakshina Kali’ Starring Archana in keyrole

శ్రీనిధి క్రియేషన్స్ పతాకంపై అర్చన అమ్మవారిగా ప్రధాన పాత్రలో చంద్రగిరి సుబ్బు, ప్రియాంక శ్రీ, చంద్రకళ, ఆఫ్జాద్ అజాద్ నటీనటులుగా తోట కృష్ణ దర్శకత్వంలో మీసాల వాణిగారు నిర్మిస్తున్న చిత్రం “దక్షిణ కాళీ”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర టైలర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి నటుడు శివాజీ రాజా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు ఈసీ మెంబర్ పద్మినిగారు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర టైలర్ ను విడుదల చేశారు అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ఎంత దమ్ముంటే ఒక లేడీ ఈ సినిమా తీస్తారండి. డబ్బు కాదు ముఖ్యం దమ్ము కావాలి. ఆ కాళీమాతే ఆవిడని ఆవహించి ఈ సినిమా తీసిందేమో అన్నట్టుంది ఈ సినిమా ట్రైలర్.అలాగే ఇందులో నటించిన అర్చన అద్భుతంగా నటించింది.హీరో హీరోయిన్స్ చక్కటి నటనను ప్రదర్శించారు . మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా డైరెక్టర్ కృష్ణ గారికి, నిర్మాత మీసాల వాణిగారికి ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ.. మా తోట కృష్ణ గారు 50 లక్షలు సినిమా తీసి 50 కోట్ల రేంజ్ తీయగలిగిన అద్భుతమైన మనిషి. ప్లస్ కమర్షియల్ గా అతనికి హిందీ మార్కెట్ పై కూడా మంచి పట్టుంది. ఎన్నో సినిమాలు తీసిన శ్యాం ప్రసాద్ రెడ్డి గారే ఒక స్టేజ్ లో ఇబ్బంది పడ్డారు. అటువంటి తనను బయట పడేసిన సినిమా అరుంధతి.ఆ తరువాత ఆయన మనకింక సినిమా ఇండస్ట్రీ వద్దురా బాబు అని ఆయన టీవీలకి వెళ్ళిపోయి వెరీ హ్యాపీగా ఉన్నారు. ఇంతకుముందు సినిమాలు చేసిన మీసాల వాణి గారు ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. తన సెకండ్ ఇన్నింగ్ లో వస్తున్న ఈ సినిమా అరుంధతి అంతటి పెద్ద హిట్ అయ్యి కంటిన్యూ సినిమాలు చేయాలి.అమ్మ వారు పాత్రలో అర్చన గారు యాక్ట్ చేశారు. ఇంకా ఇందులో నటించిన వారందరికీ మంచి పేరు రావాలని, అలాగే ప్రొడ్యూసర్ గా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న మీసాల వాణిగారికి డెఫినెట్ గా ఈ దక్షిణ కాళీ సినిమా బ్రహ్మాండంగా ఆడి నిర్మాతగా డబ్బులు వచ్చి సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఫిల్మ్ ఛాంబర్ ఈసీ మెంబర్ పద్మిని మాట్లాడుతూ.. ప్రస్తుతం మీసాల పిల్ల సాంగ్ ఎంత హిట్ అయిందో అలాగే తోట కృష్ణగారి దర్శకత్వంలో మీసాల వాణిగారు తీసిన దక్షిణ కాళీ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

చిత్ర దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ..ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమానికి వచ్చిన శివాజీ రాజాగారికి, ప్రసన్న కుమార్ గారికి పద్మినిగారికి, రమేష్ గారికి అందరికీ నా ధన్యవాదాలు.పట్టుదలతో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ కలిసి కష్టపడి సాధించిన కృషి ఇద అని అన్నారు

దాసరి వెంకట కృష్ణ మాట్లాడుతూ.. నాకు ఇంత మంచి సినిమాకి మాటలు రాసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ తోటకృష్ణ గారికి, మా ప్రొడ్యూసర్ వాణి గారికి, మా లైన్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి అందరికీ నా ధన్యవాదాలు అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ మీసాల నాగావంశీ( నాని) మాట్లాడుతూ.. మన గ్రామ దేవతల గురించి,మన పోతురాజుల గురించి, మన గ్రామ పండుగల గురించి తెలియజేస్తూ మేము చేసిన చిన్న ప్రయత్నమే “దక్షిణ కాళీ”. ఈ సినిమా ద్వారా మేము కచ్చితంగా సక్సెస్ అవుతామని నమ్ముతున్నాము. అలాగే ఈ సినిమాలో నటించిన అర్చన గారికి, మా హీరో సుబ్బు, హీరోయిన్ ప్రియాంక, విలన్ ఆజాద్, చంద్రకళ మరియు ప్రతి టెక్నీషియన్ కి ఈ సినిమా ఒక మైలురాయిలా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

చిత్ర నిర్మాత మీసాల వాణిగారు మాట్లాడుతూ.. ఒక ఫిమేల్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి ఏదో ఒకటి సాధించాలనే కోరిక నాలో ఉండేది. మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుసు అందుకే అమ్మవారి సబ్జెక్టు అయిన దక్షిణ కాళీ కథను నేనే రాసుకొని సినిమా తీయడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఈరోజు స్టేజి మీద నిలుచున్నాను అంటే అంతా ఆ తల్లి దయే.. ప్రతిక్షణం, ఏం చేసినా అమ్మవారి దయతోనే.. ఇంకా నాకు మా మూవీ టీం మరియు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తున్న సహకారం మరువలేనిది. ఇప్పటివరకు డివోషనల్ మూవీస్ చాలా చూసుంటారు.కానీ నేను ఎంచుకున్న కాన్సెప్ట్ కాస్త భిన్నంగా ఉంటుంది. 101 మంది అమ్మవార్లు. అంటే 100 మంది అమ్మవార్లు, ఒకే తమ్ముడు పోతురాజు.ఈ కాన్సెప్ట్ తో సినిమాలు రాలేదు. అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని చూపించాలనుకున్నాను. ప్రతి సినిమాల్లో అమ్మవారిని చూపిస్తారు,కానీ ఇంతవరకు పోతరాజుని ఎవ్వరూ చూపించలేదు . లాస్ట్ లో పోతరాజు గారికి ఒక ప్రత్యేకత ఇచ్చి ఆ అక్కకి కాపలాగా ఎందుకు ఉంటాడు ? అనే సబ్జెక్టు తీసుకొని చేసిన సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అమ్మ వారు పాత్రలో అర్చన గారు అద్భుతంగా యాక్ట్ చేశారు.అలాగే శివాజీరాజా గారు 20 సంవత్సరాల నుంచి తెలుసు. మా లాంటి వారికి అండగా ఉంటూ చిన్న సినిమాలకు ప్రాణం పోస్తున్న ప్రసన్నకుమార్, పద్మిని, శివాజీ రాజా లు వచ్చి మా సినిమాకు సపోర్టుగా నిలిచినందుకు ధన్యవాదాలు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ఆదరించి ఆశీర్వదించి పెద్ద హిట్ అయ్యేలా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరో చంద్రగిరి సుబ్బు మాట్లాడుతూ.. దేవతల మీద తీసే సినిమాలు ఎప్పుడు కూడా విజయం సాధిస్తాయి.ఇప్పుడు అమ్మవారి కాన్సెప్ట్ తో వస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ.. దర్శకుడు తోట కృష్ణ గారు నేను యాక్టింగ్ చేయగలనా లేదా అని చూడకుండా నాకు ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించారు .ఇలాంటి మంచి సినిమాలో హీరోయిన్ నటించేందుకు అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు

విలన్ గా నటించిన ఆఫ్జాద్ అజాద్ మాట్లాడుతూ..శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై మీసాల వాణి గారు నిర్మించిన దక్షిణ కాళీ మూవీ లో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అమ్మోరు ఒక శక్తి, దృష్ట శక్తి ఎలా ఉంటుందో అలా నా క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేశారు. మంచి గ్రాఫిక్స్ సీన్స్ తో తీసిన ఈ సినిమా ఒక అమ్మోరు లాగా పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

నటి చంద్రకళ మాట్లాడుతూ.. తొలి సారిగా నన్ను తెలుగు తెరకు పరిచయం చేసినటువంటి దర్శక నిర్మాతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

నటీనటులు :
హీరో : చంద్రగిరి సుబ్బు,
హీరోయిన్ : ప్రియాంక శ్రీ
విలన్ : ఆఫ్జాద్ అజాద్
మాతంగి : చంద్రకళ ( అమ్మడి)
హీరో తాత : తోట కృష్ణ,
కెవ్వు కార్తీక్ – జబర్దస్త్,
తాగుబోతు రమేష్ – కమెడియన్
అశోక్ – జబర్దస్త్

సాంకేతిక నిపుణులు
డైరెక్టర్ : తోట కృష్ణ,
ప్రొడ్యూసర్ : వాణి మీసాల,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మీసాల నాగ వంశీ ( నాని)
మ్యూజిక్ డైరెక్టర్ : ఘంటాడి కృష్ణ
డి ఓ పి : వెంకట్ ఆనెం
పి. ఆర్. ఓ: నరేష్

Producer’s Bunny Vasu & Vamshi Nandipati interview about Rural Cult Block Buster ‘Raju Weds Rambai’

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. 3 రోజుల్లో ఈ సినిమాకు 7.28 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ పై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్, వంశీ నందిపాటి.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా మేము ఊహించినదాని కంటే పెద్ద విజయాన్ని సాధిస్తోంది. కొన్ని సినిమాలకు కలెక్షన్స్ చెప్పలేం. కానీ ఈ సినిమాకు మాత్రం కలెక్షన్స్ చెప్పాలని అనిపించింది. ఇప్పటిదాకా మొత్తం 7.28 కోట్ల రూ పాయల కలెక్షన్స్ రాగా, కేవలం నైజాం నుంచే 5 కోట్ల 2లక్షలు వసూలు అయ్యాయి. నిన్న ఒక్కరోజు 2 కోట్ల 17 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. తెలంగాణ స్టేట్ లోని మల్టీప్లెక్స్ ల కంటే సింగిల్ స్క్రీన్స్ నుంచే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఏపీలో మొదటి రెండు రోజులు డల్ గా ఉన్నాయి, నిన్న కలెక్షన్స్ బాగున్నాయి, వైజాగ్ 10 లక్షలు, ఈస్ట్ నుంచి 9 లక్షలు వచ్చాయి. కృష్ణా 12 లక్షలు, గుంటూరు 13 లక్షలు కలెక్ట్ చేసింది. సీడెడ్ కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నాయి. లిటిల్ హార్ట్స్ కు కూడా ఇలాగే కలెక్షన్స్ వచ్చాయి. ఇటీవల సినిమాలకు నైజాం తో చూస్తే ఏపీలో కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఐ బొమ్మ క్లోజ్ అవడం వల్ల మా మూవీ కలెక్షన్స్ పెరిగాయి. 99 రూపాయల రేట్ పెట్టడం వల్ల ఫ్లస్ అయ్యింది. కొందరు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మొదట్లో ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు 70 పర్సెంట్ అంతా ఈ రేటుకు అంగీకారానికి వచ్చారు. సి సెంటర్స్ లో కూడా “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు బాగా వసూళ్లు రావడం ఈ సినిమా ఎంత బాగా జనాల్లోకి వెళ్లింది అనేది ప్రూవ్ చేస్తోంది. మా చిత్రానికి 50 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎక్కువ సెంటర్స్ ఎందుకు ఇస్తున్నారు, లాంగ్ రన్ కిల్ అవుతోంది అని ఓ నిర్మాత నాతో అన్నారు. అయితే చిన్న చిత్రాలకు లాంగ్ రన్ ఆశించకూడదు. వీలైనంత తక్కువ టైమ్ లో ఎక్కువ మంది జనాలకు రీచ్ చేయాలి. మేము అదే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ను నమ్మి చేసిన ఈటీవీ విన్ వారికి నా అభినందనలు. ఇటీవల వారు కొత్త డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ 90 పర్సెంట్ సక్సెస్ రేట్ తో వెళ్తున్నారు. వంశీ నందిపాటితో నా జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. నేను సజెషన్స్ ఇస్తే, తను ఆచరణలో పెడతాడు. నేను సోలోగా చేస్తున్న సినిమాల్లో వంశీ తో ఈ వర్క్ షేర్ మిస్ అవుతున్నా. మిత్రమండలి సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద బాగా ఫన్ ఫీలయ్యాం, ఆ ఫన్ థియేటర్స్ లో ఆడియెన్స్ కు రీచ్ చేయడంలో ఎక్కడో లోపం జరిగింది. ప్రీ వెడ్డింగ్ షో మా దగ్గరకే వచ్చింది కానీ మేము ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఆ మూవీ చేయలేకపోయాం. మా చేతుల్లోకి వస్తే బెటర్ రిలీజ్ చేసేవాళ్లం. అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు ప్రేక్షకులు అందించిన విజయం సంతోషాన్ని ఇస్తోంది. ఈ సినిమా చూస్తూ అమ్మాయిలు ఎమోషన్ కు గురవుతున్నారు. మేము పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాన్ని ఈ మూవీ ఇస్తుందని ఆశిస్తున్నాం. ఏపీతో చూస్తే నైజాంలో కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. మా టీమ్ ఆల్రెడీ థియేటర్స్ విజిట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో మొత్తం టీమ్ అంతా థియేటర్స్ విజిట్ కు వెళ్తాం. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి స్క్రీన్స్ యాడ్ చేశాం. ఈ సినిమాను మేము చివరలో తీసుకున్నాం కానీ మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ నమ్మిన ఈటీవీ విన్ వారికి క్రెడిట్ ఇవ్వాలి. సినిమాతో పాటు క్లైమాక్స్ తప్పకుండా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుందని నేను నమ్మాను. మల్టీప్లెక్స్ తో పాటు బీ, సీ సెంటర్స్ లో కూడా కలెక్షన్స్ బాగున్నాయి. ప్రతి వారం పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. వాటిని మనం ఆపలేం. కంటెంట్ ఉన్న సినిమాను ప్రమోట్ చేసుకుని ఆ సినిమాను ఆడియెన్స్ దగ్గరకు చేర్చే ప్రయత్నం చేయాలి. 99 రూపాయల టికెట్ రేట్ పెట్టడం, ఐ బొమ్మ క్లోజ్ కావడం మా సినిమాకు కలిసి వచ్చింది. ఐ బొమ్మలో పైరసీ మూవీస్ చూసేవాళ్లు ఎక్కువగా బీ, సీ సెంటర్స్ వాళ్లే. ఇప్పుడు ఆ సైట్ క్లోజ్ కావడం వల్ల వాళ్లు థియేటర్స్ కు రావడం పెరిగింది. టికెట్ రేట్ 99 గా ఫిక్స్ చేసుకోకుంటే సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. అన్నారు.

Rebel fans, your cheers will make the theatres roar for “The Raja Saab”: Director Maruthi at the “Rebel Saab” song launch event*

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా “రాజా సాబ్”ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ తో ఈ సెలబ్రేషన్స్ ను బిగిన్ చేశారు మూవీ టీమ్. ఈ రోజు “రాజా సాబ్” సినిమా ఫస్ట్ సాంగ్ ‘రెబల్ సాబ్’ను హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – రెబల్ ఫ్యాన్స్ “రాజా సాబ్” సినిమా కోసం ఎంత ఆకలిగా ఉన్నారో మాకు తెలుసు. ఈ సినిమా మీకు విందుభోజనంలా ఉంటుంది. ఈ సినిమాకు ప్రభాస్ గారు యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు, పాటలు చేస్తున్నప్పుడు, ఎంటర్ టైన్ మెంట్ ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు సెట్ లోనే ఉన్నా. ఆ సీన్స్ అన్నీ అదిరిపోతాయి. విదేశాల్లో పాటలు చిత్రీకరించినప్పుడు గడ్డకట్టే చలిలో కూడా ప్రభాస్ గారు డ్యాన్సులు చేశారు. అభిమానులకు కావాల్సింది, వాళ్లు ఇన్ని రోజులు మిస్ అయ్యింది ఎంత కష్టపడైనా “రాజా సాబ్”తో ఇవ్వాలి డార్లింగ్ అనే ప్రభాస్ గారు మాతో చెప్పేవారు. తను తినే లాంటి భోజనం యూనిట్ లో ఉన్న 150 మందికి పెట్టిస్తారు ప్రభాస్. ఆయన అమ్మలాంటి వారు. ఎలాంటి బేధాలు చూపించకుంటా మనమంతా ఒక్కటే అని నమ్మే వ్యక్తి రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈ సినిమాలో ఇంట్రో సాంగ్ ఉంది, డ్యూయెట్ ఉంది. ముగ్గురు హీరోయిన్స్ తో కాంబినేషన్ సాంగ్ ఉంది. ఇన్ని రోజులు ప్రభాస్ గారిని మనం ఎలాంటి సినిమాలో మిస్ అయ్యామో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. మీరు థియేటర్స్ లో విసరాలని తెచ్చుకున్న కాగితాలు ఇంటర్వెల్ కే అయిపోతాయి. మళ్లీ వెళ్లి తెచ్చుకుంటారు. “రాజా సాబ్” సినిమా అంటే ప్రభాస్ గారిపై మారుతికి ఉన్న ఇష్టం, మారుతిపై ప్రభాస్ కు ఉన్న నమ్మకం. టీజీ విశ్వప్రసాద్ గారు ఎంతో గ్రాండ్ గా ఈ మూవీని రూపొందించారు. “రాజా సాబ్”తో పండక్కి వస్తాం, పండగ చేస్తాం. అన్నారు.

ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – “రాజా సాబ్” రిలీజ్ కోసం మీ కంటే ఎక్కువగా మేము వెయిట్ చేస్తున్నాం. జనవరి 9న సినిమా వస్తుందా లేదా అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. కానీ ఖచ్చితంగా జనవరి 9న మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నాం. గ్లోబల్ గా అత్యధిక థియేటర్స్ లో లార్జెస్ట్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాం. ఫస్ట్ డే అన్ని బాక్సాఫీస్ రికార్డులను “రాజా సాబ్” అధిగమిస్తుంది. కాస్త ఆలస్యమైనా మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో గ్రాండ్ గా రూపొందిస్తున్నాం. ఫైట్స్, సాంగ్స్, డ్యాన్సెస్, ఎంటర్ టైన్ మెంట్, హారర్, యాక్షన్, గ్రాండ్ విజువల్స్ అన్నీ ఉంటాయి. ఒక భారీ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రభాస్ గారిని గ్రూప్ ఆఫ్ డ్యాన్సర్స్ తో కలిసి చూసి చాలా రోజులైంది. మా సినిమాలో అలా గ్రూప్ డ్యాన్సర్స్ తో కొన్ని సాంగ్స్ రూపొందించాం. దాదాపు వెయ్యిమంది గ్రూప్ డ్యాన్సర్స్ తో రూపొందించిన రెబల్ సాబ్ సాంగ్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రభాస్ గారు ఎక్కువ రోజులు వర్క్ చేసిన సినిమా మాదే కావొచ్చు. ఆయన స్వీట్ పర్సన్. ప్రభాస్ గారితో ఇంత బిగ్ మూవీ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – మీ మొహాల్లో ఈ నవ్వు చూడటం కోసమే కష్టపడుతున్నాం. మా టీమ్ అంతా పడేది మామూలు కష్టం కాదు. ఈ సినిమాతో పండక్కి మీరంతా కాలర్ ఎగరేసుకుంటారు అని చెప్పను. ఎందుకంటే ఈ సినిమాకు ప్రభాస్ గారి కటౌట్ కు అది చాలా చిన్న మాట. మీ మనసుల్లోకి రెబల్ గాడ్ అని ఎలా వచ్చిందో తెలియదు. కానీ నేనిప్పుడు ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా. చిన్న కాలేజ్ లో చదివేవాడిని, అలాంటిది ఆయన నీకు టాలెంట్ ఉంది రమ్మంటూ తన యూనివర్సిటీలోకి అహ్వానించారు. నాకు అర్హత ఉందో లేదో తెలియదు కానీ ఆయన యూనివర్సిటీలోకి వెళ్లాక ఆయనను అర్థం చేసుకుంటూ ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా. ప్రభాస్ గారి ఫొటో జేబులో ఉంటే ఎలాంటి వాడైనా టాప్ డైరెక్టర్ అయిపోతాడు. అందులో డౌట్ లేదు. కల్మషం లేని మనస్తత్వం, ప్రేమతోనే అందరినీ దగ్గర చేసుకుంటాడు. రెండేళ్లు ఆయనతో ట్రావెల్ చేస్తున్నానంటే నేను అదృష్టవంతుడిని అనుకుంటా. మీ కేరింతలతో “రాజా సాబ్” థియేటర్స్ మార్మోగుతాయి. నేను ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ చూస్తున్నా. మీ లాంటి అభిమానులను ఊహించుకునే వర్క్ చేస్తున్నా. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ గారు ఇలాంటి పాట చేశారంటే అది కేవలం మన కోసమే. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి ఫస్ట్ మనమంతా థ్యాంక్స్ చెప్పాలి. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి పండక్కి “రాజా సాబ్” సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. ప్రభాస్ గారు ఇచ్చిన కంఫర్ట్, ప్రోత్సాహం వల్లే ఇంత బాగా మూవీని రూపొందించగలిగాను. ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ గారి పర్ ఫార్మెన్స్, వారి కెమిస్ట్రీ స్క్రీన్ మీదే చూడాలి. అభిమానులు నాపై పెట్టుకున్న హోప్స్ కు ఒక పర్సెంట్ ఎక్కువే ఇస్తా. మేము ఒక్కొక్కటిగా ఇవ్వబోయో కంటెంట్ తో మీరంతా రిలీజ్ ముందు వరకు రెబల్ ఆరాలో ఉంటారు. అన్నారు.

నటీనటులు – ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – టీజీ కృతి ప్రసాద్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి

Sri Venkateswara Swamy Kalyanam mahotsavam to Be Held on November 26 at Gachibowli

హైదరాబాద్ భక్తులను పరవశింపజేసేందుకు శ్రీవారి కళ్యాణం సిద్ధమవుతోంది. భక్తకోటి కనుల పండుగగా టీటీడీ ఆధ్వర్యంలో, మహాగ్రూప్స్ అధినేత మారెళ్ల వంశీకృష్ణ సంకల్పంతో గచ్చిబౌలి స్టేడియంలో నవంబర్ 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. త్రైలోక సుందరుడైన శ్రీవారికి జరగబోయే ఈ దివ్య కళ్యాణానికి సంబంధించిన పవిత్ర పోస్టర్‌ను వంశీరామ్స్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి, అపర్ణ గ్రూప్ చైర్మన్ సీవీ రెడ్డి, సుచిర్ ఇండియా అధినేత కిరణ్, స్వగృహ చైర్మన్‌ బీపీ నాయుడు, టీమ్‌ 4 అధినేత యార్లగడ్డ మురళి, మహాగ్రూప్‌ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ సహా పలువురు ఇటీవల ఆవిష్కరించారు. పతిత పావనుడి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ఈ సందర్భంగా మహాన్యూస్ సిఎండీ మారెళ్ల వంశీకృష్ణ మాట్లడుతూ... “తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియం నందు నవంబర్ 26వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము” అన్నారు.

Maha Group Chairman Vamsi Krishna Invites Telangana Chief Minister Revanth Reddy to ‘Sri Srinivasa Kalyana Mahotsavam’

మహా గ్రూప్ ఆధ్వర్యంలో, మహా భక్తి ఛానల్ సారథ్యంలో “తిరుమల తిరుపతి దేవస్థానం” (TTD) వారిచే నిర్వహించబడుతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నవంబర్ 26న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా మహా గ్రూప్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించారు.

ప్రతి ఏడాది భక్తి, సంప్రదాయాలతో నిర్వహించే ఈ మహోత్సవం ఈసారి హైదరాబాదులో విశేషమైన ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలుపుతున్నారు. నంబర్ 26వ తేదీన సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో ప్రత్యేక పూజలు, శ్రీవారి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.

భక్తులందరినీ ఈ వేడుకలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Mahaa Group Chairman Marella Vamsi Krishna Invites Megastar Chiranjeevi for ‘Sri Srinivasa Kalyanam Mahotsavam’

మహా గ్రూప్ ఆధ్వర్యంలో, మహా భక్తి ఛానల్ సారథ్యంలో “తిరుమల తిరుపతి దేవస్థానం” (TTD) వారిచే నిర్వహించబడుతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నవంబర్ 26న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా మహా గ్రూప్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించారు. నంబర్ 26వ తేదీన సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో ప్రత్యేక పూజలు, శ్రీవారి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.

ఈ సందర్భంగా మారెళ్ళ వంశీకృష్ణ మాట్లాడుతూ… “ఈరోజు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి చిరంజీవి గారిని ఆహ్వానించేందుకు కలవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆయన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరగాలని ఆశీర్వదించడం మాకు ఎంతో పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చింది. చిరంజీవి గారిని నేను సత్కరించి వెంకటేశ్వర స్వామి పటాన్ని అందించగా ఆయన వెంటనే నాకు డిజిటల్ భగవద్గీత అందజేయడం అనేది మరింత గుర్తుండిపోయే విషయం. ఇటువంటి కార్యక్రమాలకు ఆయన సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని చిరంజీవి గారు చెప్పడం మాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది” అన్నారు.

ఈ సందర్భంగా మారెళ్ళ వంశికృష్ణ మెగాస్టార్ చిరంజీవి గారిని శాలువాతో సహకరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు.

Australia to America.. A Ramana Gogula Musical Journey!

With a guitar resting on his shoulder…With melodies that once made a generation tremble…With a journey of music that never paused…With a voice that never tired…He returns—Our very own “Travelling Soldier”,To carry yesterday’s memories Onto tomorrow’s global stages.This is not just a flow of songs…It’s an emotional voyage.And this voyage begins in Australia…The beginning of Ramana Gogula’s grand global tour!

Hyderabad:
To take Telugu music to global stages and revive timeless memories, Ramana Gogula is gearing up for a monumental world tour. Melbourne MAMA Creative Space and Top Notch Entertainment Australia have jointly announced the mega musical journey titled “In Conversations with the Travelling Soldier – Ramana Gogula Australia Tour, February 2026.”

A special press meet was organized at Prasad Labs in Hyderabad where Ramana Gogula, Excel Global Services Managing Director Ram Kattala, and MAMA Creative Space Founder Satish Varma revealed the full details of the World Tour.

They stated that this would be the first-ever full-fledged global concert tour of Ramana Gogula’s musical career—marking a historic moment in Telugu music.
This tour is not limited to concerts alone. It is an emotional and artistic exploration of Ramana Gogula’s iconic songs, their hidden memories, and the untold stories behind them.

As part of this journey, Melbourne MAMA Creative Space is producing a unique docu-musical series, which will capture:

His return to world stages after many years

The real stories behind his hit songs

Candid conversations, jam sessions & creative philosophy

His travel experiences across Australia, the UK, and the USA

A new-age rebirth of the original “Travelling Soldier”

The documentary will be presented to leading OTT platforms as a premium Indo-Australian global musical experience.

Excel Global Services MD Ram Kattala facilitated visas for the entire team, who extended their heartfelt thanks during the event.

“This is a Musical Movement” – Satish Varma

Satish Varma, Founder of Melbourne MAMA Creative Space, said:

“Ramana Gogula garu has never done concerts like these before. This isn’t just a tour—it is a movement. A journey of nostalgia, emotions, and real conversations. The ‘Travelling Soldier’ is stepping onto the world stage for the first time, and we want music lovers across continents to experience his story and art.”

*Tour Schedule:*
The world tour begins with the Australia leg in February 2026, followed by planned tours in the UK and USA.

Australia (February 2026):
• Melbourne
• Sydney
• Perth

UK (2026 – Planned):
• London
• Manchester

USA (2026 – Planned):
• East Coast
• West Coast

This global musical journey aims to unite Indian diaspora communities across continents through the power of music, memories, and storytelling.
——-
PRO’s: Kadali Rambabu, Ashok Dayyala.

Horror thriller ‘Vichitra’ Movie is all set to release. directed by Saifuddin Malik

Starring Ravi and Shreya Tiwari as the lead pair, “Vichitra” is produced and directed by Saifuddin Malik under the banner of SIS Films. The movie, which promises to touch the hearts of the audience as a beautiful family entertainer, has completed its censor formalities and is gearing up for release soon.

On this occasion, director–producer Saifuddin Malik shared his thoughts:“In this film, Ravi plays the hero and Shreya Tiwari the heroine, along with Jyothi Apoorva, ‘Baby’ Sri Harshini Yasika, Ravi Prakash, Surya, Chhatrapathi Sekhar, and Meena Vasan in important roles. ‘Vichitra’ is a film made with a soulful mother sentiment. It is a heart-touching story that makes every family reflect on a mother’s love, sacrifice, and bond. Our team has worked with the belief that ‘Vichitra’ will stand out as a family drama that audiences can happily watch together. The story presents a fresh perspective on a mother’s affection, emotions, and family values.”

The film has completed censor certification and will be arriving in theatres soon. Saifuddin Malik expressed confidence that “Vichitra” will create a memorable impact on the hearts of the audience.

Cast

Jyothi Apoorva,
Ravi,
Shreya Tiwari,
Baby sri Harshini Yasika,
Ravi Prakash,
Surya,
Chhatrapathi Sekhar,
Jabardasth artists Addhandhulu Apparao, Trinath, Sattipandu, Bobby, and others

Technical Crew
• Story: SIS Films
• Editing: Kadimishetty Lakshminarayana
• Music: Nizani, Anjan
• PRO: Kadali Rambabu, Dayyala Ashok,
• Producer & Director: Saifuddin Malik

సైఫుద్దీన్ మాలిక్ దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగా ఉన్న హార్రర్ త్రిల్లర్ చిత్రం ‘విచిత్ర ‘

రవి శ్రీయ తివారి హీరో హీరోయిన్ గా సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగాఉన్న చిత్రం ‘విచిత్ర’ పేక్షకుల హృదయాలను హత్తుకునే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “విచిత్ర” సెన్సర్ పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది..

ఈ సందర్బంగా ఈ చిత్రం దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ.ఈ సినిమాలోని హీరోగా రవి, హీరోయిన్ శ్రేయ తివారి, జ్యోతి అపూర్వ, ‘బేబీ’ శ్రీ హర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలుగా నటించారు “విచిత్ర” ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందిన సినిమా. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసే హృదయాన్ని తాకే కథ ఇది. ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చూసే ఫ్యామిలీ డ్రామాగా “విచిత్ర” నిలుస్తుందనే నమ్మకంతో మా టీమ్ పనిచేసింది. కథ విషయానికి వస్తే అమ్మ ప్రేమను, భావోద్వేగాన్ని, కుటుంబ విలువలను కొత్త దృక్కోణంలో చూపించబోతున్నము.
ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని త్వరలోనే విచిత్ర మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేస్తుందనే ఆశాభావం ఉంది అని దర్శకనిర్మాత సైఫుద్దీన్ మాలిక్ తెలిపారు.

నటీనటులు జ్యోతి అపూర్వ, రవి, శ్రేయ తివారి, బేబీ యసిక రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, జబర్దస్త్ ఉద్ధండులు అప్పారావు, త్రినాథ్, సత్తిపండు, బాబీ తదితరులు .

స్టోరీ.సిస్ ఫిలిమ్స్, ఎడిటింగ్-కడిమిశెట్టి లక్ష్మీనారాయణ, సంగీతం- నిజాని, అంజన్ పి. ఆర్. ఓ. కడలి రాంబాబు, దయ్యల అశోక్, నిర్మాత దర్శకత్వం – సైఫుద్దీన్ మాలిక్. సైఫుద్దీన్ మాలిక్.

‘Raju Weds Rambai’ Opens Strong with ₹1.47 Cr Gross on Day 1 in AP & Telangana

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు 1.47 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. డే 1 ట్రెండ్ చూస్తుంటే “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా మంచి వసూళ్లను దక్కించుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

“రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు.

నటీనటులు – అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం, తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ప్రియాంక వీరబోయిన, ఆర్తి విన్నకోట
సౌండ్ డిజైన్ – ప్రదీప్.జి.
పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే
ప్రొడక్షన్ డిజైన్ – గాంధీ నడికుడికర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ధన గోపి
సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ – నరేష్ అడుపా
కో ప్రొడ్యూసర్స్ – ఢోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్
ప్రొడ్యూసర్స్ – వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
రచన, డైరెక్షన్ – సాయిలు కంపాటి
ప్రొడక్షన్ – ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్
థియేట్రికల్ రిలీజ్ – వంశీ నందిపాటి(వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్), బన్నీ వాస్ (బన్నీవాస్ వర్క్స్)
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)