Home Blog Page 42

‘3 Roses’ Season 2 Teaser Launch Event held grandly

ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “త్రీ రోజెస్”. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో “త్రీ రోజెస్” సీజన్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

ఆహా కమర్షియల్ హెడ్ రాజేశ్ వాసిరెడ్డి మాట్లాడుతూ – “త్రీ రోజెస్” ఫస్ట్ సీజన్ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సీజన్ సక్సెస్ అయినప్పటి నుంచి సెకండ్ సీజన్ పై డిమాండ్ ఏర్పడింది. మా మేనేజ్ మెంట్ కూడా సీజన్ 2 ఎప్పుడు చేస్తున్నారు అని అడిగేవారు. డిసెంబర్ 12న “త్రీ రోజెస్” సీజన్ 2 స్ట్రీమింగ్ కు రాబోతోంది. మీరంతా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుతున్నా. అన్నారు.

ఆహా కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ – ఇయర్ ఎండ్ అంటే ఫెస్టివ్ సీజన్. ఈ ఫెస్టివ్ సీజన్ ను డిసెంబర్ 12న ప్రీమియర్ అవుతున్న “త్రీ రోజెస్” సీజన్ 2తో సెలబ్రేట్ చేసుకుంటారని నమ్ముతున్నాం. ఆహా నుంచి బ్యాక్ టు బ్యాక్ మంచి కంటెంట్ ఉన్న సక్సెస్ ఫుల్ మూవీస్, షోస్ చేస్తున్నాం. మీ ఆదరణ ఇలాగే ఉండాలి. అన్నారు.

రైటర్ సందీప్ బొల్ల మాట్లాడుతూ – ఫస్ట్ సీజన్ లో ఆకట్టుకున్న ఈషా ఈ సీజన్ 2 లో అంతకంటే బాగా నటించింది. ఈషా, హర్ష ఎంటర్ టైన్ చేస్తారు. నా ఫేవరేట్ క్యారెక్టర్ రాశీ చేసిన మేఘన. సత్యకు పెయిర్ గా రాశీ కనిపిస్తుంది. అలాగే స్రష్టి క్యారెక్టర్ లో కుషిత ఆకట్టుకుంటుంది. ఎస్ కేఎన్ కు గతంలో ఒక కథ చెప్పాను. అప్పటినుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి సిరీస్ చేయడం కష్టం, డైరెక్టర్ కిరణ్ సక్సెస్ ఫుల్ గా చేయగలిగాడు. “త్రీ రోజెస్” సీజన్ 2 ను మీ ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడొచ్చు. అన్నారు.

యాక్టర్ సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ – “త్రీ రోజెస్” సీజన్ 2లో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈషాతో కలిసి నటించడం ఈజీ. సీన్ చేసే ముందు డిస్కషన్స్ ఉండేవి. ఇటీవల ఎస్ కేఎన్ మహేశ్ గారి ఫ్యాన్ కు హెల్ప్ చేయడం ఇన్స్ పైర్ చేసింది. అన్నారు.

డైరెక్టర్ కిరణ్ కె కరవల్ల మాట్లాడుతూ – డైరెక్టర్ గా నా డెబ్యూ సిరీస్ ఇది. చాలా బాగా వచ్చింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్. సిరీస్ మొత్తం ఎంటర్ టైనింగ్ తో ఎంజాయ్ చేస్తారు. మంచి కాస్టింగ్, వాళ్లు ఇచ్చిన పర్ ఫార్మెన్స్ లు ఆకట్టుకుంటాయి. అజయ్ అరసాడ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. ఫస్ట్ టైమ్ డైరెక్టర్ కు ఎలాంటి ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటారో ఆ క్వాలిటీస్ అన్నీ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ లో ఉన్నాయి. ఈ సిరీస్ చేసేందుకు ఏం కావాలో అన్నీ సమకూర్చారు, అలాగే బాగా ప్రమోట్ చేస్తున్నారు. అన్నారు.

హీరోయిన్ కుషిత కల్లపు మాట్లాడుతూ – ఈ సిరీస్ లో స్రష్టి అనే క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ కు కొంచెం తిక్క ఉంది కానీ దానికో లెక్క ఉంటుంది. స్రష్టి క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది. ఇలాంటి క్యారెక్టర్ రాయడం కష్టం ఎందుకంటే స్రష్టి క్యూట్, హాట్, నాటీ, క్రేజీగా ఉంటుంది. మా డైరెక్టర్ కిరణ్ గారు కనీసం గట్టిగా మాట్లాడటం కూడా సెట్ లో చూడలేదు. అంత కూల్ గా షూటింగ్ జరిగింది. సిస్టర్స్ లాంటి ఈషా, రాశీతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అన్నారు.

హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ – “త్రీ రోజెస్” సీజన్ 1 పెద్ద హిట్ అయ్యాక సీజన్ 2 గురించి ప్రతి ఒక్కరూ అడుగుతూ వచ్చారు. నేను ప్రాజెక్ట్ లోకి వచ్చేసరికే ఈ సిరీస్ పై బయట చాలా క్రేజ్ ఉండేది. మేఘన క్యారెక్టర్ లో నేను నటించాను. మేఘన క్యారెక్టర్ కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి. నాలాగే మేఘన పూజలు చేస్తుంది, పబ్ కు వెళ్తుంది, ఫైట్స్ చేస్తుంది. నేను, సత్య కలిసి చాలా ఫన్ సీన్స్ చేశాం. అవన్నీ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. ఈ సిరీస్ చేస్తున్నప్పుడు ఈషా మంచి ఫ్రెండ్ అయ్యింది. ఇండిపెండెంట్ వుమెన్ క్యారెక్టర్ లో తన పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. కుషిత క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవుతారు. “త్రీ రోజెస్” సీజన్ 2ను ఆహాలో చూడండి. అన్నారు.

హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ – “త్రీ రోజెస్” సీజన్ 1 కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ ఈ సీజన్ 2లో ఉంటుంది. సీజన్ 1 అంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. సీజన్ 2 స్క్రిప్ట్ చదివినప్పుడే ఇది అంతకంటే పెద్ద హిట్ అవుతుందని నమ్మకం కలిగింది. షూటింగ్ చేస్తున్నప్పుడు మేమంతా ఆ ఫన్ ను ఫీల్ అయ్యాం. నేను, హర్ష ఒక రివేంజ్ మోడ్ లో క్యారెక్టర్స్ చేశాం. ఈ సీజన్ 2 లో చాలా వైరల్ కంటెంట్ ఉంది. మా డైరెక్టర్ కిరణ్ కొత్త దర్శకుడిలా అనిపించలేదు. కాన్ఫిడెంట్ గా సిరీస్ చేశాడు. “త్రీ రోజెస్” సీజన్ 2 ను సినిమాగా రిలీజ్ చేయొచ్చు. అంత మంచి కంటెంట్ ఉంది. ఈ సీజన్ లో రాశీ, సత్య చేసిన క్యారెక్టర్స్ ఫేమ్ అవుతాయి. వాళ్ల కాంబినేషన్ సీన్స్ లోని డైలాగ్స్ వైరల్ గా మారుతాయి. కుషిత క్యూట్ గా, హాట్ గా కనిపిస్తుంది. యూత్ ఆడియెన్స్ తనకు ఫ్యాన్స్ అవుతారు. ఈ సిరీస్ తర్వాత కుషిత స్టార్ అవుతుంది. ఎస్ కేఎన్ గారు తన ప్రొడక్షన్ లో కల్ట్ బ్లాక్ బస్టర్స్ చేశారు. ఇప్పుడు ఈ సిరీస్ తోనూ సక్సెస్ అందుకోబోతున్నారు. అన్నారు.

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – “త్రీ రోజెస్” కాన్సెప్ట్ తో ఎన్ని సిరీస్ లు అయినా చేయొచ్చు. అలాంటి యూనిక్ కాన్సెప్ట్ మారుతి గారు ఇచ్చారు. ఆయన రాజా సాబ్ సాంగ్ రిలీజ్ పనుల్లో ఉండి రాలేకపోయారు. టాక్సీవాలా మూవీ చేశాక ఓటీటీలో ఏదైనా కంటెంట్ ప్రొడ్యూస్ చేసేందుకు కావాల్సినంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది “త్రీ రోజెస్”. సీజన్ 1ను మించిన ఎంటర్ టైన్ మెంట్ ఈ సీజన్ 2 లో చూస్తారు. ఫస్ట్ సీజన్ రవి నంబూరి డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తను మా చెన్నై లవ్ స్టోరీ మూవీ రూపొందిస్తున్నాడు. ఆయన సజెషన్ మీదే కిరణ్ ను డైరెక్టర్ గా , సందీప్ ను రైటర్ గా తీసుకున్నాం. ఈ సిరీస్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ను సందీప్ క్రియేట్ చేశాడు. డైరెక్టర్ గా కిరణ్ క్రియేటివిటీలో “త్రీ రోజెస్” సీజన్ 2 10శాతం మాత్రమే. తన ప్రతిభను ఫ్యూచర్ లో చూస్తారు. ఈషా మన తెలుగు హీరోయిన్స్ లో ఓజీ అనుకోవచ్చు. రాశీ సింగ్ తెలుగు నేర్చుకుని నటిస్తోంది. కుషిత టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయి. నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తూ వెళ్తున్నాను. కుషిత తమిళంలో, మలయాళంలో మూవీస్ చేస్తోంది. రాశీ డెడికేషన్ ఉన్న నటి. ఆమె ఇంకా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంటారు. ఈషా తమిళ, మలయాళం, తెలుగులో మూవీస్ చేస్తున్నారు. అయితే ఇది కంటిన్యుటీ ఉన్న సిరీస్ కాబట్టి ఇతర సినిమాలతో బిజీగా ఉన్నా ఆమె చేస్తానని ముందుకువచ్చింది. సత్య ఈ స్రిప్ట్ ను ఇష్టపడి నటించేందుకు వచ్చారు. సత్య ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. అలాగే హర్ష క్యారెక్టర్ కూడా మంచి ఫన్ అందిస్తుంది. అజయ్ అరసాడ మ్యూజిక్ వింటే నాకు దేవి శ్రీ ప్రసాద్ గుర్తొస్తాడు. ఈ సిరీస్ కోసం మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డాల్బీ సౌండ్ లో ఈ సిరీస్ చేశాం. మంచి కంటెంట్ ఉంటే వెంటనే ఓకే చెప్పి సపోర్ట్ చేసే ఓటీటీ ఆహా. డిసెంబర్ 12న “త్రీ రోజెస్” సీజన్ 2 చూసి ఎంజాయ్ చేయండి. “త్రీ రోజెస్” సీజన్ 3 కూడా ఉంటుంది. ఆ సీజన్ ను సినిమాలా రిలీజ్ చేస్తాం. అన్నారు.

‘Raju weds Rambai’ Movie Review (Emotional rural love story)

Cinemarangam.Com
Production – ETV Win Originals Production
Theatrical Release – Vamsi Nandipati – Vamsi Nandipati Entertainments, Bunny Vas – Bunny Vas Works
Movie Name : Raju weds Rambai
Release Date : November 21st, 2025
Review Rating : 2.75/5
Producers – Venu Udugula, Rahul Mopidevi
Writer & Director – Saailu Kampati
Cast: Akhil Uddemari, Tejaswini Rao, Shivaji Raja, Chaitu Jonnalagadda, Anita Chowdary, Kavitha Srirangam, and others.
Co-Producers – Dolamukhi Subaltern Films, Monsoons Tales
Executive Producer – Dhana Gopi
Cinematography – Wajid Baig
Music – Suresh Bobbili
Editing – Naresh Adupa
Costume Designers – Priyanka Veeraboyina, Aarthi Vinnakota
Sound Design – Pradeep G.
Publicity Designer – Dhani Aelay
Production Design – Gandhi Nadikudikar
PRO – GSK Media (Suresh – Sreenivas)

Starring newcomers Akhil Uddemari and Tejaswi Rao in the lead roles, a film titled, Raju weds Rambai has caught the audience’s attention with its promotional activities. Directed by Saailu Kampati,the film is scheduled to hit the silver screens on November 21st with a special premiers on November 20th night. Let’s see how it goes.

Story:

Set in the interiors of Telangana, Raju weds Rambai is a real incident happened fifteen years back in Khammam and Warangal board. Coming to main plot, Raju( Akhil Uddemari) leads life by running band in his village. For obvious reasons, he falls for a beautiful girl named Rambai ( Tejaswi Rao). Their love story hits a roadblock due to Rambai’s father, a government employee named Venkanna( Chaitu Jonnalagadda) as he plans his daughter’s marriage with a government employee. What happened during the course of time? What will Raju do to get his love life? What is the role of Ramesh ( Sivaji Raja) and Susheela ( Kavitha Srirangam), that forms the crucial crux.

Plus points:

Akhil is decent on the screen and gave a good performance in his character oriented role. His makeover as a running band man is superb and brings the depth to the proceedings in the first half. On the other hand, Tejaswi Rao is cute with her expressions and she stolen the limelight with her performance in the second half.

Undoubtedly, Chaitu Jonnalagadda is a surprise package for the film. He tried to emote the same with his outstanding screen presence.

Actor Sivaji gave a good performance in his given key role. Actresses like Kavita Srirangam and Anita Chowdhary are okay with their acting skills.

Minus points:

The pace of the film drops at regular intervals in the first half of the movie.

If the director would have focused on the first half proceedings, the result would have been even better.

Mainly the film lacks the commercial aspects in it which might disappoint the audience to an extent.

Technical Aspects:

Music by Suresh Bobilli is outstanding. Be it his songs or background score everything takes the audience’s mood into the film. The cinematography by Waij Baig is real and rustic.

The editing work is good. Production values for this limited budget movie are nice.

Coming to the director, Saailu Kampati did largely decent job in exploring the realistic story.

Verdict:

All in all, Raju weds Rambai is a rural love drama that has a emotional thread. The climax portion are back bond for the film making it a watchable fare during this weekend.

Cinemarangam.Com Review Rating 2.75/5

‘Raju weds Rambai’ Pre Release event held grandly, Movie Releasing on Nov 21

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా “రాజు వెడ్స్ రాంబాయి”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. బుధవారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటి అనిత చౌదరి మాట్లాడుతూ – బుల్లితెరపై నా కెరీర్ మొదలైంది ఈటీవీ ద్వారా. అదే సంస్థ నటిగా నాకు అవకాశం కల్పించింది. లిటిల్ హార్ట్స్ చిత్రంతో నాకు మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు “రాజు వెడ్స్ రాంబాయి”లోనూ నటించాను. ఈ సినిమా కూడా విజయం సాధించాలి. అన్నారు.

సింగర్ అనురాగ్ కులకర్ణి మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాలో నేను పాడిన రాంబాయి సాంగ్ పెద్ద హిట్ కావడం సంతోషంగా ఉంది. సురేష్ బొబ్బిలి, నా కాంబినేషన్ లో గతంలో వచ్చిన పాటలు కూడా శ్రోతల ఆదరణ పొందాయి. ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని ఈ సినిమాలో మీరంతా చూడబోతున్నారు. అన్నారు.

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ – వేణు ఊడుగుల నాకు మంచి మిత్రులు. నేను చేయబోతున్న ఒక మూవీలో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది. ఎవరైనా కొత్త దర్శకుడు కథ చెబితే వారికి కావాల్సిన సపోర్ట్ వేణు దగ్గర నుంచి దొరుకుతుంది. అలాగే సాయిలుకు కూడా అందించాడు. ఈ సినిమా క్లైమాక్స్ గురించి వేణు ఎగ్జైటింగ్ గా చెప్పేవాడు. ఈ సినిమాలో అఖిల్, తేజస్వినీతో పాటు చైతన్య కూడా బాగా పర్ ఫార్మ్ చేశాడు. తెలుగు ఆడియెన్స్ బెస్ట్ ఆడియెన్స్. అన్ని జానర్స్ సినిమాలు ఆదరిస్తున్నారు. ఈ కొత్త దర్శకులను చూస్తుంటే నాకు ఇన్స్ పైరింగ్ గా అనిపిస్తోంది. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నా. అన్నారు.

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా రిలీజ్ కు ముందు ఇంత క్రేజ్ తెచ్చుకుందంటే కారణం ఒక్కో ఈవెంట్ కు ఒక్కో హీరో వచ్చి ఈ సినిమాకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ చిత్రం విజయం అందుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ – ఈటీవీ విన్ వారు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ వేదిక మీద నిలబడగలిగాను. మా లిటిల్ హార్ట్స్ మూవీకి వర్క్ చేసిన టీమ్ అంతా మళ్లీ ఈ మూవీకి పనిచేశారు. అఖిల్, తేజస్వినీకి ఆల్ ది బెస్ట్. చైతన్య ఇళ్లు కూడా మా ఇంటి దగ్గరే. ఆయనకు కూడా ఈ చిత్రంతో మంచి పేరు రావాలి. అన్నారు.

నిర్మాత రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ – ఈటీవీ నుంచే నా జర్నీ మొదలైంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఆ సంస్థతో అసోసియేట్ కావడం హ్యాపీగా ఉంది. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను షూటింగ్ చేసే క్రమంలో యూనిట్ అందరి నుంచి పూర్తి సహకారం లభించింది. మా హీరో హీరోయిన్లతో సహా అనిత గారు, శివాజీ గారు, చైతన్య..ఇలా ఆర్టిస్టులంతా ఎంతో డెడికేటెడ్ గా నటించారు. ఒక ఊరు నేపథ్యంగా సహజమైన వాతావరణంలో సినిమాను రూపొందించాం. కొన్ని సినిమాలు ఎంటర్ టైన్ చేస్తాయి, కొన్ని మూవీస్ చూసి బాధపడతాం, ఈ చిత్రంలో స్ట్రాంగ్ ఎమోషన్స్ చూస్తారు. ప్రేమికులుగా వాళ్లు చేసే పనుల్లో ఒక అమాయకత్వం కనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు తెర వెనక ప్రతి డిపార్ట్ మెంట్ పడిన శ్రమ మీకు తెలుస్తుంటుంది. సినిమాకు సహజత్వం తీసుకొచ్చేందుకు మా డైరెక్టర్ సాయిలు చాలా శ్రద్ధ తీసుకున్నారు. అన్నారు.

నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ – ఇది ఏదో ఒక ప్రాంతానికి చెందిన కథ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ఏ ఒక్క ప్రాంతానికి పరిమితమైన కథ కాదు. ప్రతి కుటుంబంలో కూతురుని గారాబంగా చూసుకునే తండ్రి ఉంటాడు, ఆ కూతురు తండ్రి అంటే భయపడుతూనే, ప్రేమించే ఒక అబ్బాయి ఉంటాడు, ఈ అమ్మాయినే కోరుకున్న అబ్బాయి ఉంటాడు. ఈ ముగ్గురు పడే సంఘర్షణే ఈ కథ. రాజు, రాంబాయి పాత్రలను ప్రతి ప్రేమ జంట రిలేట్ చేసుకుంటారు. అఖిల్ మరో విజయ్ దేవరకొండ అవుతాడు. తేజస్వినీలో నాకు మరో సాయి పల్లవి కనిపించింది. ఈ సినిమా తర్వాత చైతన్య డేట్స్ దొరకడం కష్టమే. ఈటీవీ విన్ వాళ్లు ఇలాంటి కథను ఒప్పుకుంటారా అని భయపడ్డా. సాయి కృష్ణ మాకు సపోర్ట్ ఇచ్చారు. మా డైరెక్టర్ తనలోని నిజాయితీ, అమాయకత్వం, కసి అంతా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా చూశాక ప్రతి అమ్మాయి తండ్రి ఆలోచనలో పడతాడు. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను చూసి నచ్చితే అందరికీ చెప్పండి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – ఈ సినిమాలో రాంబాయి సాంగ్ ను పెద్ద హిట్ చేశారు. ఈ నెల 21న సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది. మిట్టపల్లి సురేందర్ అన్ని ఇచ్చిన లిరిక్స్ వల్లే ఈ పాట ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రంలో తేజస్వినీ, అఖిల్ అద్భుతంగా నటించారు. డైరెక్టర్ సాయిలు నిజాయితీగా సినిమా రూపొందించాడు. లేకుంటే ఇంత రియలిస్టిక్ స్టోరీ బయటకు రాదు. నాకు ఈ కథకు మూలమైన ఘటన గురించి తెలుసు. మాకు దగ్గరి ఏరియాలోనే జరిగింది. మనసును హత్తుకునే ఈ ప్రేమ కథను మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని పచ్చబొట్టులా మిగిలిపోతుంది. అన్నారు.

నటుడు శివాజీ మాట్లాడుతూ – ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే చిత్రమిది. ఇదొక మట్టికథ. ఇలాంటి రియలిస్టిక్ మూవీ చేయాలంటే ధైర్యం కావాలి. ఇలాంటి సినిమా చేసినందుకు ఈటీవీ విన్ వారిని అభినందిస్తున్నా. మలయాళంలో అయితే “రాజు వెడ్స్ రాంబాయి” లాంటి మూవీస్ ఏడాది పాటు ఆదరణ పొందుతాయి. దర్శకుడు అంత సహజంగా, ప్రేక్షకుల మనసును తాకేలా రూపొందించారు. తెలుగులో ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ మొదలైంది. ప్రేక్షకులు సినిమాను చూసే పర్సెప్షన్ మారిపోయింది. ఏది మంచి చిత్రమో వారికే బాగా తెలుసు. నిజాయితీగా కథను నమ్మి తీసిన ఏ సినిమా మోసం చేయదు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు చైతన్య జొన్నలగడ్డ మాట్లాడుతూ – మీరు ఉప్పెన సినిమాలో అమ్మాయి తండ్రి ఎలా ఉంటాడో చూసి ఉంటారు, కోర్టు సినిమాలో మంగపతిని చూసి ఉంటారు, ఈ “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాలో అమ్మాయి తండ్రి వెంకన్న ఎలా ఉంటాడో ఈ నెల 21న చూస్తారు. చూడగానే భయపెట్టే పాత్ర ఇది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ అవుతుంది. వెంకన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ సాయిలు, వేణు అన్న, ఈటీవీ విన్ వారికి థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – ఈ సినిమాను ఫస్ట్ నుంచీ నేను బాగా నమ్మాను. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. ఈ చిత్రానికి ఏపీ తెలంగాణలో 99 రూపాయలు టికెట్ రేట్ పెడుతున్నాం. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నమిది. ఈ నెల 21న మేము సాలిడ్ హిట్ కొట్టబోతున్నాం. ఈటీవీ విన్ తో మా అసోసియేషన్ లో మరో సక్సెస్ ఫుల్ మూవీ “రాజు వెడ్స్ రాంబాయి” కాబోతోంది. అన్నారు.

ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ – పైరసీని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్న పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతలు. టికెట్ రేట్స్, ఫుడ్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి, పైరసీ ఉండాలనే ప్రేక్షకులూ కొందరు ఉన్నారు. మేము సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్స్ 99లకే నిర్ణయించాం. అలాగే మల్టీప్లెక్స్ 105 రూపాయలు మాత్రమే. మా “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను థియేటర్స్ కు వచ్చి చూడండి. నేనొక్కడినే చూస్తే సరిపోతుందా అనుకోవద్దు. పైరసీ కూడా ఒక్కరు చూడటం నుంచే మొదలైంది. ఇలాంటి హార్ట్ టచింగ్ స్టోరీని మీ దగ్గరకు చేర్చేందుకే తక్కువ టికెట్ రేట్స్ పెట్టాం. ఈటీవీ విన్ లో వచ్చిన 90’s, ఎయిర్, అనగనగ, లిటిల్ హార్ట్స్ వంటి కంటెంట్ ను చూసి మాపై నమ్మకంతో థియేటర్స్ కు రండి, మీలో ఏ ఒక్కరినీ నిరాశపర్చం. అన్నారు.

ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ – రెండేళ్లుగా ఈ చిత్రంతో ట్రావెల్ చేస్తున్నాం. ఈ జర్నీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అలాగే నెల రోజులుగా ఈ మూవీ ప్రమోషన్ కోసం స్ట్రగుల్ పడుతున్నాం. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఆడియెన్స్ దగ్గరకు రీచ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. పదిహేనేళ్లుగా మరుగున పడిన ఈ ప్రేమకథే ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పిస్తుంది, సినిమా చూశాక మీతో పాటు వచ్చేస్తుంది. సినిమా చివరి 30 నిమిషాలు మిమ్మల్ని కదిలించకపోతే మరే సినిమా కూడా మీకు ఎమోషనల్ ఫీల్ ఇవ్వలేదు. “రాజు వెడ్స్ రాంబాయి” స్ట్రాంగ్ కంటెంట్ విషయంలో మేము గ్యారెంటీ ఇస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” ఒక ఇంటెన్స్ ఎమోషనల్ మూవీ. ఈ సినిమా హార్ట్ టచింగ్, హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా మీ గుండెల్ని హత్తుకుని ఆలోచింపజేస్తుంది. ఈ మూవీ ఇచ్చే ఎక్సిపీరియన్స్ కోసం ఈ నెల 21న తప్పకుండా థియేటర్స్ కు రావాలని కోరుతున్నా. థియేటర్స్ కు వచ్చాక మా మూవీతో ప్రేమలో పడతారు. ఈ చిత్రంలో రాంబాయి పాత్రలో నేను బాగా పర్ ఫార్మ్ చేశానంటే అందుకు మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ కారణం. అన్నారు.

డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ – ఇది ఊరి కథ అని కొందరు చులకనగా మాట్లాడుతున్నారు. అవును నేను ఊరోడినే. నా ఊరంటే నాకు ప్రేమ, ఆ ఊరిలో ఉండే మనషులు ఇష్టం. అక్కడి కథలతోనే సినిమాలు రూపొందిస్తా. మా సినిమాలో హెలికాప్టర్ షాట్స్, మెట్రో షాట్స్ లేవు. ఊరిలో ఆటోడ్రైవర్, కాలేజ్ కు వెళ్లే అమ్మాయి..వీళ్లే ఉంటారు. మీకు సినిమా నచ్చకుంటే లైట్ తీసుకోండి కానీ నెగిటివ్ ప్రచారం చేయకండి. ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. సినిమా బాగా లేదనే నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేట చౌరాస్తాలో అర్థనగ్నంగా తిరుగుతా. ఛాలెంజ్ చేస్తున్నా. 15 ఏళ్లు బయటకు రాకుండా సమాధి చేయబడిన ప్రేమ కథ ఇది. ఈ సినిమా కోసం నేనూ మా టీమ్ పగలూ రాత్రీ కష్టపడ్డాం. ఆ బాధతో చెబుతున్నాం నెగిటివ్ ప్రచారం చేయకండి. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీకు మీ ఊరు గుర్తుకొస్తుంది, మీ ఊరిలోని స్నేహితులు, మీ ప్రేమ కథ గుర్తుకు వస్తాయి. అన్నారు.

హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ – కిరణ్ అన్న షార్ట్ ఫిలింస్ చూసి ఇన్స్ పైర్ అయ్యేవాడిని. ఆయన ఈ రోజు మా మూవీ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ సినిమాను ప్రేమించేవారే. సినిమా మీద ప్యాషన్ తో వచ్చినవారే. మేమంతా ఇంత కష్టపడి చేసిన సినిమా మీద కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మా మూవీ క్లైమాక్స్ గురించి మీమ్స్ పెడుతున్నారు. అలాంటి క్లైమాక్స్ మా సినిమాలో ఉండదు. మా డైరెక్టర్ ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నారో, ఆయన అలాగే ఉంటారు. ఎవరు ఆపాలని చూసినా మా మూవీ ఆగదు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజున పెద్ద సక్సెస్ దక్కుతుందని ఆశిస్తున్నాం. నేను కెరీర్ బిగినింగ్ లో ఉన్నాం. మా సినిమా మీదనే ఆధారపడిఉన్నాం. ఈ సినిమా మీకు నచ్చకుంటే నా నెక్ట్స్ మూవీస్ కూడా చూడకండి. సినిమా మీద నమ్మకంతోన ఈ మాట చెబుతున్నా. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మేము షార్ట్ ఫిలింస్ చేసేప్పుడు కొత్త వాళ్లకు ఏదైనా సపోర్ట్ దొరికితే బాగుండేది అనిపించేది. ఇప్పుడా సపోర్ట్ ఈటీవీ వారి రూపంలో యంగ్ టాలెంట్ కు దక్కుతోంది. వంశీ నందిపాటి గారితో క మూవీ చేశాను. ఆయన చెబితే ఆ మూవీలో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నట్లే. హీరో అఖిల్ బాగా నటించాడు, తేజస్వినీ మన పొరుగు అమ్మాయి అనేంత సహజంగా ఉంది. ఈ జంటను చూస్తుంటే మన ఊరిలో అరుగుమీద కూర్చుని సరదాగా మాట్లాడుకునే జంటలా అనిపిస్తున్నారు. డైరెక్టర్ సాయిలును చూసినప్పుడు అతనిలో నిజాయితీ కనిపించింది. రాజు వెడ్స్ రాంబాయి మూవీ ట్రైలర్ చూస్తుంటే ప్రతి షాట్ కొత్తగా అనిపించింది. అదే విషయాన్ని సాయిలుకు చెప్పాను. ఊరి కథలు ప్రేక్షకులు చూస్తారా అంటే తప్పకుండా చూస్తారు మనలో 80శాతం మంది ఊరి నుంచి వచ్చినవాళ్లమే. సినిమాలను ఎక్కువగా ఆదరించేది ఊరి వాళ్లే. నేను చాలా దారుణాలు విన్నాను గానీ వీళ్లు వచ్చి సినిమా క్లైమాక్స్ గురించి చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇలాంటిది జరిగిందా. మా ఊరు చుట్టుపక్కల ప్రేమ కథల్లో కూడా దారుణాలు జరిగాయి గానీ ఇలాంటివి నిజంగా జరిగిందా, ఇలా చేస్తారా, ఇలాంటి మనుషులు ఉంటారా అనిపించింది. ఈ సినిమాను మిగతా అందరి కంటే ముందు పదిహేనేళ్లు ప్రేమ కథను దాచిపెట్టిన ఆ ఊరి వాళ్లు ఫస్ట్ చూడాలి. ఈ బాధను మనం పక్కని వాళ్లకు కూడా చెప్పుకోలేకపోయాం. ఈ కథను సినిమాగా చేశారు చూద్దామని ఆ ఊరిలోని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. క్లైమాక్స్ తెలుసుకుని నేను షాక్ అయినట్లే సినిమా చూసిన ఆడియెన్స్ కూడా ఫీల్ అవుతారు. మీకు అందుబాటులో ఉండేలా 99 రూపాయలకే టికెట్ రేట్ పెట్టారు. మీరంతా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – అఖిల్ ఉడ్డెమారి, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం, తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ప్రియాంక వీరబోయిన, ఆర్తి విన్నకోట
సౌండ్ డిజైన్ – ప్రదీప్.జి.
పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే
ప్రొడక్షన్ డిజైన్ – గాంధీ నడికుడికర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ధన గోపి
సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ – నరేష్ అడుపా
కో ప్రొడ్యూసర్స్ – ఢోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్
ప్రొడ్యూసర్స్ – వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
రచన, డైరెక్షన్ – సాయిలు కంపాటి
ప్రొడక్షన్ – ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్
థియేట్రికల్ రిలీజ్ – వంశీ నందిపాటి(వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్), బన్నీ వాస్ (బన్నీవాస్ వర్క్స్)
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

Producers Venu Udugula and Rahul interview about ‘RAJU weds RAMBAI’ Movie

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా “రాజు వెడ్స్ రాంబాయి”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు నిర్మాతలు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి.

నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారగా దర్శకుడు సాయిలు “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు స్క్రిప్ట్ చేశాడు. అతను నా దగ్గర వర్క్ చేస్తుండేవాడు. ఒకరోజు ఈ కథ నాకు నెరేట్ చేశాడు. వినగానే నన్ను కలచివేసింది. పరువు హత్యల గురించి మనం విన్నాం, ఇంకొన్ని విధాలుగా పరువు హత్య ఘటనలు జరగడం చూశాం. కానీ ఇలాంటి దుర్మార్గం ఏ ప్రేమకథలోనూ జరగలేదు అనిపించింది. ఇది వాస్తవ ఘటన నేపథ్యంగా సాగే సినిమా అయినా దర్శకుడు మెయిన్ స్ట్రీమ్ అప్పీల్ ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. సినిమా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.

– ఈ సినిమాకు నేను ప్రొడ్యూసర్ అయితేనే న్యాయం జరుగుతుంది అనిపించింది ప్రొడ్యూసర్ గా మారాను. అప్పటికే ఈటీవీ వాళ్లు నన్ను ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే అసోసియేట్ కమ్మని అడిగారు. నేను “రాజు వెడ్స్ రాంబాయి” మూవీ గురించి చెప్పాను. వాళ్లు ఈ సినిమా చేస్తామంటూ ముందుకు వచ్చారు. ఆ తర్వాత వంశీ నందిపాటి, బన్నీవాస్ లాంటి రెప్యుటెడ్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మా మూవీతో అసోసియేట్ అయ్యారు. వీళ్లంతా కలిసి చేతులు కలపడం వల్ల మా సినిమా ప్రేక్షకుల దగ్గరకు సరైన విధంగా రీచ్ అవుతోంది.

– ఈ సినిమా ట్రైలర్ లో అమ్మాయిపై హీరో చేయి చేసుకోవడం చూపించాం. వాస్తవ ఘటన ఆధారంగా సినిమా చేసినా, మూవీలో డ్రామా లేకుంటే ప్రేక్షకులకు సినిమాటిక్ ఫీల్ కలగదు. ఈ మూవీలో విషాధకరమైన ముగింపు ఉండదు. ఒక మంచి ఫీల్ తో థియేటర్స్ నుంచి ఆడియెన్స్ బయటకు వస్తారు. “రాజు వెడ్స్ రాంబాయి” లాంటి సినిమా చూసి కొందరైనా అమ్మాయిల తండ్రులు ఆమె ప్రేమ విషయంలో పాజిటివ్ గా ఆలోచిస్తారని నమ్ముతున్నాం.

– సినిమాలో ఎక్కడా ఈ ఘటన జరిగిన ఊరు పేరు, బాధితులైన ఆ వ్యక్తుల పేర్లు చెప్పడం లేదు. సురేష్ బొబ్బిలి, నేను, మిట్టపల్లి సురేందర్ ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ పడుతున్నప్పటి నుంచి స్నేహితులం. సురేష్ బొబ్బిలి అయితేనే ఇలాంటి రా అండ్ రస్టిక్ స్క్రిప్ట్ కు మంచి మ్యూజిక్ ఇవ్వగలడు అనిపించింది. నేను రూపొందించిన విరాటపర్వం సినిమా కూడా వాస్తవ ఘటనల నేపథ్యంగానే సాగుతుంది. అయితే ఆ సినిమాకు ఏం జరిగిందో ఓపెన్ గా చెప్పగలం. వారి కుటుంబ సభ్యులు కూడా మా అమ్మాయికి అన్యాయం జరిగిందని బయటకు వచ్చి మాట్లాడారు. కానీ ఈ ఘటన గురించి ఓపెన్ గా మాట్లాడుకోలేం.

– ఈ సినిమాకు హీరో అఖిల్ త్వరగానే దొరికాడు కానీ అమ్మాయి విషయంలో చాలా సెర్చ్ చేయాల్సివచ్చింది. ఇది లోకల్, రూటెడ్ స్టోరీ కాబట్టి తెలుగు అమ్మాయినే తీసుకోవాలి అనుకున్నాం, పైగా తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుందని భావించాం. ఒక రోజు తేజస్వినీ ప్రొఫైల్ చూసి వెంటనే ఓకే చేశాం. ఆ తర్వాత ఈ ఇద్దరితో వర్క్ షాప్స్ చేయించాం. ఆ ఊరికి వెళ్లి లోకల్ ఆర్టిస్టులతో కలిపి వర్క్ షాప్స్ చేశాం. అఖిల్, తేజస్వినీ తమ పాత్రల్లో ఎంతో సహజంగా నటించారు. హీరోయిన్ తండ్రి వెంకన్న పాత్ర కోసం ఆడిషన్ చేస్తే చైతన్య వచ్చాడు. అతను ఎవరు అనేది మాకు ముందుగా తెలియదు. చూస్తే ఫారినర్ లా ఉన్నాడు మన క్యారెక్టర్ కు సెట్ కాడు అని డైరెక్టర్ సాయిలు నాతో అన్నాడు. చైతన్యలో ఒక సైక్ లుక్ కనిపించింది. అతని ప్రవర్తన కూడా కొత్తగా ఉంది. ఇతను వెంకన్న క్యారెక్టర్ కు బాగుంటాడు ఆడిషన్ చేయి అని డైరెక్టర్ తో చెప్పాను. ఆడిషన్ చేసి ఓకే అని సాయిలు చెప్పాడు. చైతన్య అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. నటన మీద ప్యాషన్ తో యూఎస్ నుంచి హైదరాబాద్ కు మా ఆడిషన్ కోసం తిరిగేవాడు. ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్దిమంది మంచి నటుల్లో చైతన్య ఒకరిగా గుర్తింపు దక్కించుకున్నాడు. అతన్ని సెలెక్ట్ చేశాక తెలిసింది హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ అని.

– బేబి, 7జీ బృందావన్ కాలనీ, సైరత్, ప్రేమిస్తేలా “రాజు వెడ్స్ రాంబాయి” మూవీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. నేను ప్రొడ్యూసర్ గా చేయాలని కాదు ఏదైనా మంచి కాన్సెప్ట్, పర్పస్ ఫుల్ కథ దొరికితే దాన్ని ప్రేక్షకులకు సరైన విధంగా చేర్చాలనే ప్రయత్నంలో నిర్మాతగా మారాను. నిర్మాతగా మారాక ప్రొడక్షన్ లో ఉన్న స్ట్రగుల్స్ తెలిశాయి. నేను చదివిన నవలల్లో అంటరాని వసంతం, రచయిత కేశవరెడ్డి రచనల్ని సిరీస్ లా చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. యూవీ సంస్థలో నా దర్శకత్వంలో మూవీ ఉంటుంది. హీరో ఎవరు అనేది వాళ్లు అనౌన్స్ చేస్తారు.

నిర్మాత రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ..– ఓ ప్రేమ జంట జీవితంలో జరిగిన వాస్తవ ఘటన 15 ఏళ్లుగా అక్కడే సమాధి చేయబడింది. ఆ ఘటన గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మా డైరెక్టర్ సాయిలు అదే ప్రాంతానికి చెందినవాడు కాబట్టి, ఆ ఘటన గురించి తెలుసుకుని, ఆ నేపథ్యంతోనే మంచి డ్రామా యాడ్ చేసి అందరూ థియేట్రికల్ గా చూసేలా “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను రూపొందించాడు.

ఘటన జరిగిన ప్రాంతంలోనే సినిమా షూటింగ్ జరిపాం. అక్కడ సెల్ సిగ్నల్స్ కూడా ఉండేవి కావు. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్ నుంచి రోజూ ఆ ఊరికి వెళ్లి వస్తూ షూటింగ్ చేశాం. ఆ గ్రామంలోని వారినే కొందరిని చిన్న చిన్న పాత్రలకు తీసుకున్నాం. వారికి యాక్టింగ్ లో వర్క్ షాప్స్ పెట్టాం. మా డైరెక్టర్ సినిమా మేకింగ్ లో ప్రతి చిన్న డీటెయిల్ విషయంలో క్లారిటీగా ఉన్నాడు.

– రాజు క్యారెక్టర్ చేసిన అఖిల్ వరంగల్ అబ్బాయి తనకు తెలంగాణ యాస ప్రాబ్లమ్ కాదు, తేజస్వినీ ఏపీ అమ్మాయి, కానీ తెలంగాణ యాసలో డైలాగ్స్ పర్పెక్ట్ గా చెప్పింది. రాజు రాంబాయిగా వీళ్లద్దరు అద్భుతంగా నటించారు. ఈ సినిమా షూటింగ్ కోసం టీమ్ చాలా కష్టపడింది. మారుమూల గ్రామంలో షూటింగ్ చేశాం. అది వర్షాకాలం కాబట్టి వర్షాలు, వరదలు వచ్చేవి. రోజుకో ప్రాబ్లమ్ ఎదురయ్యేది. కానీ షూటింగ్ బాగా వస్తుందనే ఒకే ఒక విషయం మమ్మల్ని సంతృప్తి పడేలా చేసేది. ఒకరోజు బ్రిడ్జి కొట్టుకుపోయింది. 80 మంది యూనిట్ అంతా ఆ రాత్రి ఊరిలోనే ఉండిపోవాల్సివచ్చింది.

టెలివిజన్ లో ప్రొడక్షన్ చేసిన అనుభవంతో ఈ మూవీకి వర్క్ చేయడం సులువైంది. మా సినిమాను ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల చేస్తున్నాం.

Hero,Director, Producer Haranath Policherla interview about ‘Naa Telugodu’, Movie Releasing on Dec 12th

Written and directed by Harinath Policharla, “Naa Telugodu” will hit the screens on Dream Team Productions with Harinath Policharla as the hero, Tanikella Bharani, Raghu Babu, Zarina Wahab, Nidhi Pal, Ronnie Kaula, Sufiya Tanveer and others. Shiva has provided the music for this film, which has been re-cinematized, and Ramana has done the editing. Chandra Bose and Gaddam Veeru have written the songs for this film. Harinath Policharla shared details about the film “Naa Telugudu”, which will hit the screens on December 12th, with the media.

* We are preparing to hit the screens on December 12th after completing the shooting and censoring of the film ‘Naa Telugodu’. We did it with the intention of bringing something useful to the society to the audience.

* A soldier sacrifices his life for the country. We tried to show some aspects of their lives, saving girls, and saving society from drugs in this film.

* Telugu people got good recognition because of Nandamuri Taraka Rama Rao. NTR is my inspiration. I love NTR’s films very much. I am proud to give the title ‘Naa Telugodu’. We made the film so that we can say what we want to say through films in a way that the audience can understand.

* There will be some scenes in the film in the backdrop of war. The film was shot in Goa, Munnar, Hyderabad and some other places. We are happy that the film got an A certificate without cuts.

* My role in the film will be that of a soldier. Young children are being used to transport drugs. It is an anti-social program. There will be some scenes in this film with the intention of stopping them.

* I was interested in acting since childhood. Even though I am a doctor, I am continuing my acting career by striking a balance. Initially, I used to give more time as a doctor, but now I can also give time to my acting career.

* When I gave a speech about my elder brother in America, Balakrishna, who was there, praised me.

* We will also release this film in Hindi under the name RK. We will release it in 60 theaters in Telugu states. I am very proud that the Telugu film industry has reached a high level.

* There will be 5 songs in this film. My roles in the films are different from one film to another.

* The acting of Tanikella Bharani, Raghu Babu, Zarina Wahab, Nidhi Paul, Ronnie Kaula, Sufiya Tanveer and others has become a strength of the film. Again, the film has been given very beautiful visuals.

* We tried to give a good message through this film. We really inspired my mother’s role in the film by taking some inspiration from my mother’s role.

* Many people have praised me many times in my acting career. I have received some awards. They have given me a lot of happiness. It seems to me that showing Telugu identity in America is a thing.

* I am ready to introduce new people to the film industry through my production company. I want everyone to encourage me and my film.

Loukya entertainments *’DHANDORAA’ Teaser Launch Event held grandly

లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద శ్రీమతి. ముప్పనేని శ్రీలక్ష్మీ సమర్పణలో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో రవింద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న చిత్రం ‘దండోరా’. ఈ సినిమాకు మురళీకాంత్ దేవాసోత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సోమవారం నాడు విడుదల చేశారు.

నాలుగు పుస్తకాలు చదివి లోకమంత తెలిసినోడి లెక్క మాట్లాడకు.. నీకు తెలియని లోకం ఇంకోటి ఉంది ఈడ’, ‘చావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద’ అంటూ డైలాగ్స్‌తో ‘దండోరా’ టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. లవ్, కామెడీతో పాటుగా అంతర్గతంగా ఏదో ఓ కొత్త సందేశాన్ని ఇచ్చేలా ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ఈ టీజర్ చెప్పకనే చెప్పేసింది. ఇక ఈ చిత్రంలో శివాజీ, బిందు మాధవి, నవదీప్ వంటి వారు అద్భుతమైన పాత్రల్ని పోషించినట్టుగా కనిపిస్తోంది. విజువల్స్, బీజీఎం ఇలా అన్నీ కూడా ఎంతో నేచురల్‌గా కనిపిస్తున్నాయి. టీజర్‌తో అందరినీ ఆకట్టుకున్నారని మాత్రం తెలుస్తోంది. ఇక ఈ టీజర్ లాంఛ్ కోసం నిర్వహించిన ఈవెంట్‌లో..

*శివాజీ మాట్లాడుతూ* .. ‘బెన్నీ గారిని చూస్తుంటే నాకు నిర్మాత క్రాంతి కుమార్ గారు గుర్తుకు వస్తుంటారు. దర్శక, నిర్మాతగా క్రాంతి గారు ఎన్నో గొప్ప చిత్రాల్ని తీశారు. ఆయనలానే బెన్నీ గారిలోనూ ఎన్నో మంచి భావాలున్నాయి. మురళీ గారు చెప్పిన కథ విని ఎంతో కనెక్ట్ అయ్యాను. మన సమాజంలోని కుల వ్యవస్థ మీద సెటైరికల్‌గా అద్భుతమైన కథను రాసుకున్నారు. ప్రతీ ఒక్కరి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. బిందు మాధవి గారు అద్భుతంగా నటించారు. తమిళ్, మలయాళీ ఆర్టిస్టులే బాగా నటిస్తారు అని అనుకునే వారికి ఈ సినిమా చూస్తే.. అంతకంటే గొప్ప ఆర్టిస్టులున్నారని అర్థం అవుతుంది. నవదీప్‌కి ఎంతో సత్తా ఉంది. అతన్ని పూర్తి స్థాయిలో ఇంకా ఎవ్వరూ వాడుకోవడం లేదు. అతన్ని కళ్లని దర్శకులు వాడుకోవడం లేదు. నవదీప్ చాలా గొప్ప ఆర్టిస్ట్. నందు కూడా బాగా నటించారు. ఈ ఏడాదిలో గుర్తుంచుకోదగ్గ చిత్రంగా ‘దండోరా’ నిలుస్తుంది. వెంకట్ ఫోటోగ్రఫీ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. బీజీఎం అదిరిపోయింది. అందరం ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశాం. ఇది మంచి బిర్యానీలాంటి చిత్రం. నటీనటులందరికీ నటించేందుకు ఎంతో స్కోప్ ఉన్న చిత్రం. నా కారెక్టర్‌లో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. డిసెంబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. ఇది వంద శాతం కమర్షియల్ చిత్రం. పైరసీని ఎంకరేజ్ చేయకండి. అందరూ సినిమాని థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.

*నవదీప్ మాట్లాడుతూ* .. ‘మెదక్ నుంచి అమెరికాకు వెళ్లి జాబ్ చేస్తూ.. అది వదిలి.. సినిమాల్లోకి వచ్చి మురళీ కాంత్ ఈ ‘దండోరా’ని చేశారు. చావు, కులం అనే పాయింట్‌లతో ఎంటర్టైనింగ్‌గా ఎన్నో మంచి విషయాల్ని చెప్పారు. ఏదో నీతిని బోధిస్తున్నట్టుగా అని కాకుండా అందరినీ అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. ఇలాంటి కథకు సపోర్ట్‌గా నిలిచిన బెన్నీ గారికి హ్యాట్సాఫ్. ఆడియెన్స్‌గా ఈ సినిమాను మేం చూసినప్పుడు మాకు చాలా నచ్చింది. నటీనటులుగా మేమంతా సంతృప్తి చెందాం. శివాజీ గారి లాంటి సీనియర్ ఆర్టిస్టుల నుంచి కొత్త ఆర్టిస్టుల వరకు అందరూ అద్భుతంగా నటించారు. వారందరితోనూ మురళీ అద్భుతంగా చేయించుకున్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. ఓ మీనింగ్ ఫుల్ సినిమాను తీశామని మాత్రం చెప్పగలను. అందరూ చూసి మీ మీ అభిప్రాయాల్ని చెప్పండి’ అని అన్నారు.

*నటుడు నందు మాట్లాడుతూ* .. ‘‘దండోరా’ లాంటి కథను నమ్మి నిర్మిస్తున్న బెన్నీ అన్నకు థాంక్స్. కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన బెన్నీ అన్నకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మంచి విషయాల్ని ఎంతో ఎంటర్టైనింగ్‌గా మురళీ అన్న చెప్పారు. శివాజీ, నవదీప్ గార్ల నటన అంటే నాకు చాలా ఇష్టం. వారిద్దరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. డిసెంబర్ 25న మా చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని అన్నారు.

*బిందు మాధవి మాట్లాడుతూ* .. ‘‘దండోరా’లో ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. అన్ని కారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సమాజంలో ఆలోచనలు రేకెత్తించేలా మా ‘దండోరా’ ఉంటుంది. ఎంటర్టైన్ చేస్తూ మంచి విషయాల్ని చెప్పే ప్రయత్నం చెప్పాం. మనం మాట్లాడుకోలేని ఎన్నో టాపిక్స్‌ని ‘దండోరా’ టచ్ చేస్తుంది. కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఎంతో సున్నితమైన సబ్జెక్ట్‌ను మా దర్శకుడు ఇంకెంతో ఎంటర్టైనింగ్‌గా చెప్పారు. శివాజీ, నవదీప్ గార్లతో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. డిసెంబర్ 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

*నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని మాట్లాడుతూ* .. ‘‘దండోరా’ టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా ఇంతకు మించి అనేలా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన టీం అందరికీ థాంక్స్. డిసెంబర్ 25న ఈ చిత్రం రానుంది. అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.

*దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ* .. ‘‘దండోరా’ టీజర్‌ను చూసి అల్లు అర్జున్ గారు అభినందించారు. అదే మాకు పెద్ద సక్సెస్. ఈ కథను విన్న వెంటనే సపోర్ట్ చేసిన బెన్నీ అన్నకు థాంక్స్. నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ఇది చాలా మంచి చిత్రం. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని చూడండి. అందరూ ఎనర్జిటిక్‌గా నటించారు. వాళ్ల నటనతో ఈ చిత్రం నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఇలాంటి సందేశాన్ని ఇంత ఎంటర్టైనింగ్‌గా చెప్పారా? అని మూవీని చూసిన తరువాత ఆడియెన్స్ అంతా సర్ ప్రైజ్ అవుతారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

*నటుడు రవికృష్ణ మాట్లాడుతూ* .. ‘‘దండోరా’ ఈవెంట్‌కు వచ్చిన మీడియాకు థాంక్స్. టీజర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. టీజర్ కంటే సినిమా వంద రెట్లు బాగుంటుంది. డిసెంబర్ 25న మా సినిమాను చూసి ప్రతీ ఒక్కరూ సంతోషిస్తారు. ఓ మంచి ఎమోషన్‌తో తీసిన ఈ చిత్రంలో నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. శివాజీ అన్న, నవదీప్, నందు, బిందు మాధవిలతో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

*నటి మౌనిక మాట్లాడుతూ* .. ‘మురళీ గారు ‘దండోరా’ కథను అద్భుతంగా రాసుకున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

*నటి మణిక మాట్లాడుతూ* .. ‘‘దండోరా’ సినిమా అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీంకు థాంక్స్’ అని అన్నారు.

*ఎడిటర్ సృజన అడుసుమిల్లి మాట్లాడుతూ* .. ‘‘దండోరా’ టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు.

ఈ సినిమాలోని పాటలు టి సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. అథ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ సినిమాను ఓవ‌ర్‌సీస్ రిలీజ్ చేస్తోంది.

న‌టీన‌టులు:

శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: లౌక్య ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, నిర్మాత‌: ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని, ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళీకాంత్‌, సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి, ఎడిట‌ర్‌: సృజ‌న అడుసుమిల్లి, సంగీతం: మార్క్ కె.రాబిన్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: క‌్రాంతి ప్రియం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎడ్వ‌ర్డ్ స్టెవెన్‌స‌న్ పెరెజి, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: రేఖా బొగ్గార‌పు, లైన్ ప్రొడ్యూస‌ర్‌: కొండారు వెంక‌టేష్‌, ఆడియో: T-సిరీస్, ఓవర్సీస్ రిలీజ్: అథర్వణ భద్రకాళి పిక్చర్స్, పి.ఆర్‌.ఒ: నాయుడు సురేంద్ర కుమార్‌- ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా). మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్ట‌రీ

Raj Tarun, Amrutha Chowdary’s ‘Tortoise’ Movie pooja ceremony held grandly

“పగలు రాత్రి కలవకూడదు అన్నది  దైవ నిర్ణయం అయితే, కత్తి తో చావును కలపాలన్నది మానవ నిర్ణయం. రాత్రి జరిగే హత్యలకి సాక్ష్యం ఈ చంద్రుడు. వాడు ఎప్పటికి సాక్షిగా రాడు. కష్టాల్లో వున్న వాళ్ళని  కాపాడే వాడే కథానాయకుడు.  కానీ ఆ కాపాడే వాడే చంపడం మొదలు పెడితే “

ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ మరియు ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల మరియు ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “టార్టాయిస్”. ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం అయింది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ “”టార్టాయిస్” చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ, దర్శకుడు రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం చాలా బాగుంది. ఇంత మంచి కథతో వస్తున్నా మా నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లకి కంగ్రాట్స్. ఈ చిత్రం నా కెరీర్ కి మంచి కిక్ ఇస్తుంది” అని తెలిపారు.

దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ “మా సినిమా పూజ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు స్వాగతం. “టార్టాయిస్” చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. రాజ్ తరుణ్ గారికి కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ మరియు హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ కథ తో మంచి థ్రిల్లర్ చిత్రం ఇది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఈరోజు మా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసాం. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లకి నా ధన్యవాదాలు.

నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లు మాట్లాడుతూ “మా “టార్టాయిస్” చిత్రం ఈ రోజు ప్రారంభం అయింది. మాకు కథ చాలా బాగా నచ్చింది. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. మా దర్శకుడు రిత్విక్ కుమార్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది. రాజ్ తరుణ్ గారితో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

బ్యానర్ : ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ మరియు ఎన్ వి ఎల్ క్రియేషన్స్
చిత్రం పేరు : టార్టాయిస్

నటి నటులు: రాజ్ తరుణ్, అమృత చౌదరి, శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, రవి కాలే, షిజు మరియు తదితరులు.

సంగీతం: అనూప్ రూబెన్స్ 
లిరిక్స్: ఆస్కార్ చంద్రబోస్
సినిమాటోగ్రఫీ : శబరి
ఎడిటర్ : గుళ్ళపల్లి మాధవ్ కుమార్
ఆర్ట్ : దేవర మధుకర్
కథ & దర్శకత్వం  : రిత్విక్ కుమార్
నిర్మాతలు: శశిధర్ నల్ల, విజయ్ కుమార్, ఇమ్మడి సంతోష్, రామిశెట్టి రాంబాబు

A film like ‘Varanasi’ comes only once in a lifetime: Superstar Mahesh Babu at the Globe Trotter event

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘వారణాసి’. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తోన్న‌ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ మేరకు గ్లోబ్ ట్రాట‌ర్‌ అంటూ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రయూనిట్ ఈ కార్యక్రమంలోనే టైటిల్‌ను, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, సినిమా స్థాయిని చాటేలా ఓ టీజర్‌ (వారణాసి టు ది వరల్డ్)ను కూడా రిలీజ్ చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిన ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటుగా చిత్రయూనిట్ పాల్గొంది. ఇక ఈ ఈవెంట్‌లో
*సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ* .. ‘మా నాన్న గారు చెప్పిన ప్రతీ మాటను నేను విన్నాను. ఒక్క మాట తప్పా. పౌరాణిక పాత్రలు పోషించమని చెప్పిన మాటను మాత్రం నేను వినలేదు. ఈ చిత్రంతో ఆ కోరిక కూడా నెరవేరింది. మా నాన్న గారు ఎక్కడున్నా కూడా ఈ రోజు నా మాటల్ని విని సంతోషిస్తారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోని ఉంటాయి. ‘వారణాసి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇలాంటి అవకాశం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది. అందరినీ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా నా దర్శకుడ్ని గర్వపడేలా చేస్తాను. ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు మన భారతీయులంతా గర్వపడతారు. ఇది కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతోందో మీ (అభిమానులు) ఊహకే వదిలేస్తున్నాను. అభిమానుల ప్రేమ, సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమకు నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. మీ అందరికీ నేను చేతులెత్తి దండం పెడతాను, నాకు అది మాత్రమే తెలుసు. ఈ ఈవెంట్‌ను మేమెంతో కష్టపడి మీ (అభిమానులు) కోసం ఏర్పాటు చేశాం. అందరూ క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్లండి’ అని అన్నారు.

*ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ* .. ‘నాకు రామాయణం, మహాభారతం అన్నా చాలా ఇష్టం. మహాభారతం తీయాలనేది నా డ్రీమ్ అని చాలా సార్లు చెప్పాను. ఈ మూవీని మొదలు పెట్టినప్పుడు రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. కానీ ఒక్కో సీన్ రాస్తుంటే.. ఒక్కో డైలాగ్ వస్తుంటే.. షాట్‌ని ఊహించుకుంటూ ఉంటే.. నేల మీద కాకుండా గాల్లో విహరిస్తున్నట్టుగా అనిపించింది. మహేష్ బాబుని రాముడి గెటప్‌లో ఫోటో షూట్ చేస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ ఫోటోని వాల్ పేపర్‌గా పెట్టుకున్నాను. ఎవరైనా చూస్తారేమో అని మళ్లీ తీసేశాను. ఇప్పటి వరకు 60 రోజుల పాటు షూట్ చేశాం. ప్రతీ పాయింట్‌లో సబ్ పాయింట్ ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. నేను ఇంత వరకు చేసిన చిత్రాలన్నింటిలోకెల్లా మెమరబుల్ సినిమాగా ‘వారణాసి’ నిలుస్తుంది. సెట్‌కి వస్తే మళ్లీ తిరిగి వెళ్లే వరకు మహేష్ బాబు ఫోన్‌ను వాడరు. మహేష్ బాబులా నేను కూడా ఫోన్ వాడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఈ విషయంలో మహేష్‌ని ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తాను’ అని అన్నారు.

*మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ* .. ‘ఒకరోజు రాజమౌళి గారి దగ్గరి నుంచి నాకు మెసెజ్ వచ్చింది. ‘హాయ్.. నేను రాజమౌళిని.. నేను నెక్ట్స్ చేయబోతోన్న ప్రాజెక్ట్‌లో విలన్ పాత్ర అద్భుతంగా వస్తోంది.. మీరు చేసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారా’ అని మెసెజ్ వచ్చింది. వెంటనే రాజమౌళి గారి ఆఫీస్‌కి వెళ్లి ఆయన్ను కలిశాను. ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది. ఆయన స్టోరీని నెరేట్ చేసిన తీరు, ఆయన చెప్పే విధానం, ఆయన విజన్ చూసి షాక్ అయ్యాను. అలా మూడు గంటల పాటు నాకు నెరేట్ చేశారు. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. ఇందులో మహేష్ బాబు విశ్వరూపం చూస్తారు. ప్రియాంక చోప్రాతో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

*భారతీయ నటి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ* .. ‘‘వారణాసి’ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి, నన్ను నమ్మిన నా నిర్మాత కేఎల్ నారాయణ గారికి థాంక్స్. మహేష్ బాబు చాలా మంచి వ్యక్తి. ఆయన అద్భుతమైన నటుడు. నమ్రత, సితార వల్ల హైదరాబాద్ నాకు సొంత ఇంటిలా మారిపోయింది. వారంతా నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. పృథ్వీరాజ్‌ ఇందులోని పాత్రతో అందరినీ చాలా భయపెడతాడు. కానీ బయట మాత్రం పృథ్వీరాజ్ చాలా మంచి వ్యక్తి. ఈ చిత్రం పూర్తయ్యేలోపు నేను పూర్తిగా తెలుగు నేర్చుకుని, తెలుగులోనే స్పీచ్ ఇస్తాను’ అని అన్నారు.

*స్టార్ రైట‌ర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ* .. ‘‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబు నటన చూసి మాటలు రాలేదు. ఓ ముప్పై నిమిషాల సీన్ ఉంటుంది.. అది ఇంకా నా మైండ్‌లో తిరుగుతూనే ఉంది. సీజీ చేయలేదు.. డబ్బింగ్ లేదు.. ఆర్ఆర్ లేదు.. ఎలాంటి వర్క్ చేయలేదు.. కానీ అందులో మహేష్ బాబు తాలుకా విశ్వరూపం చూసి నాకు మాటలు రాలేదు. ఆ సీన్ నన్ను మంత్రముగ్దుడ్ని చేసింది. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్‌ కూడా అదే ఫీలవుతారు’ అని అన్నారు.

*ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం ఎం కీరవాణి మాట్లాడుతూ* .. ‘మహేష్ బాబు, మణిశర్మ కాంబోలో వచ్చిన ‘పోకిరి’ అంటే నాకు చాలా ఇష్టం. నేను క్లాస్ ట్యూన్స్ మాత్రమే ఇస్తానని , మాస్ బీట్స్ ఇవ్వలేని కొంత మంది అంటుంటారు. కానీ ఈ సారి ‘వారణాసి’లో బీట్స్ చూస్తారు. క్లాస్ నాదే.. బీట్స్ నాదే..  ఆ బీట్స్‌తో మహేష్ బాబు అభిమానుల గుండెల్లో చిరస్థానం దక్కుతుంది’ అని అన్నారు.

*నిర్మాత ఎస్ ఎస్ కార్తికేయ మాట్లాడుతూ* .. ‘నేను చిన్న చిన్న చిత్రాలు చేసుకుంటూ నిర్మాతగా ఎదుగుతున్నాను. నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కి నిర్మాతగా వ్యవహరిస్తానని అనుకోలేదు. ఈ స్థాయికి రావడానికి నాకు ఇంకో పదేళ్లు పడుతుందని అనుకున్నాను. కానీ నాకు ఈ ‘వారణాసి’తో చాలా త్వరగా అవకాశం వచ్చింది. నేను ఇలా మొదటి సారిగా గ్లోబల్ ప్లాట్ ఫాం మీద నిల్చుని నిర్మాతగా మాట్లాడుతున్నాను. ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్‌గా తీసుకెళ్లేందుకు మళ్లీ మేం మరొక ప్రయత్నం చేస్తున్నామ’ని అన్నారు.

*నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ* .. ‘పదిహేనేళ్ల క్రితం నేను మహేష్ బాబు గారి వద్దకు వెళ్లి రాజమౌళితో సినిమా చేద్దామా? అని అడిగాను. ఆయన వెంటనే ఓకే అన్నారు. ఆ తరువాత రాజమౌళి గారి వద్దకు వెళ్లి అడిగాను. నాకున్న కమిట్మెంట్లు పూర్తైన తరువాత చేస్తాను అని రాజమౌళి గారు మాట ఇచ్చారు. ఇప్పుడిలా పదిహేనేళ్ల తరువాత మేం మీ ముందుకు వస్తున్నాం. ఈ 15 ఏళ్లలో రాజమౌళి గారు ఎంతో ఎత్తుకు ఎదిగారు. కానీ ఆయన నాకు ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు సినిమా చేసి పెడుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఆయన ఏమీ మారలేదు. సినిమా తీసే విధానం, ఆయన ప్రవర్తించే విధానం, సినిమా పట్ల ఆయనకుండే విజన్, ఆయన సింప్లిసిటీ ఏమీ కూడా మారలేదు. అడిగిన వెంటనే ఒప్పుకున్న పృథ్వీరాజ్ గారికి, ప్రియాంక చోప్రా గారికి ధన్యవాదాలు. మహేష్ బాబు గారు ఆయన తండ్రిలానే ప్రొడ్యూసర్స్ హీరో. నా మొదటి సినిమా క్షణక్షణంకి మ్యూజిక్ అందించిన కీరవాణి ఇప్పుడు ఆస్కార్ గ్రహీత అయ్యారు. మళ్లీ ఆయనతో ఇలా పని చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీని త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తామ’ని అన్నారు.

‘Maa Ramudu Andarivadu’ Movie Teaser and audio Released held grandly

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ సంయుక్తంగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం మా రాముడు అందరివాడు. శ్రీరామ్, స్వాతి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్, లక్ష్మణ్ రావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. మనిష్ కుమార్ సంగీత దర్శకత్వంలో వినోద్ సినిమాటోగ్రాఫర్ గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్, డ్రామా, సస్పెన్, ఎమోషన్స్ చిత్రంలో క్యారీ చేస్తూ ఈ చిత్రం రానుంది. నర్ర సాయికుమార్ కోరియోగ్రఫీ చేయగా గీత మాధురి, రమ్య బెహర, నల్గొండ గద్దర్ నరసన్న, మనీష్ కుమార్ ఈ చిత్రంలోని పాటలను తన స్వరాన్ని అందించారు. త్వరలో ప్రేక్షకులను వెండి తెరపై అలరించనున్న ఈ చిత్ర టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో లాంచ్ కావడం జరిగింది.

ఈ సందర్భంగా నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ముందుగా మంచి టైటిల్ తో ప్రేక్షకుల ముందు రావడం గొప్ప విషయం. చిత్ర పరిశ్రమలో ఎంతో పెద్ద హీరోలు పెట్టుకునే స్థాయిలో ఈ చిత్ర టైటిల్ చాలా బావుంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని, ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా బావుంటే దూసుకెళ్లిపోయే రోజులు. అటువంటి ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను. అలాగే నిర్మాత లక్ష్మణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో గద్దర్ నరసన్న పాట పాడటం ప్రత్యేకం. సినిమా బృందం అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ప్రార్థిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు మైకిల్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ సినిమాలోని 4 పాటలు అన్ని నేను రాసాను, దానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ సినిమా కోసం లక్ష్మణ్ గారు ఎంతో పట్టుదలతో నటించారు. హీరో శ్రీరామ్ ఈ సినిమాకు ముందుగా నాంది పలికారు. చాలా కష్టపడి చిన్న స్థాయి నుండి హీరో స్థాయికి వచ్చారు. నటి స్వాతి నవరసాలు పండిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. మా సినిమాను ప్రోత్సహించి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. అందరూ మా సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత లక్ష్మణ్ రావు మాట్లాడుతూ... “మా చిత్ర టీజర్, ఆడియో లాంచ్ వేడుకకు విచ్చేసిన అందరికీ నా నమస్కారం. ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీరామ్, నటి స్వాతి ఇంకా ఎంతో మంది పేరుగాంచిన నటీనటులకు అందరికీ సినిమాలో నటించినందుకు థాంక్స్. అలాగే దర్శకుడు మైకిల్ తన ప్రాణం పెట్టి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. అలాగే మా కోసం వచ్చిన బాబు మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో కష్టపడి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి మంచి విజయాన్ని అందచేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటి స్వాతి మాట్లాడుతూ... “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా సినిమాను అందరూ సపోర్ట్ చేసి సినిమాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు శ్రీరామ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన బాబు మోహన్ గారికి థాంక్స్. ఈ సినిమా నాతోనే మొదలైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశాను. ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రం. లక్ష్మణ్ రావు గారు ఈ సినిమా రావడానికి ముఖ్య కారణం. మా సినిమాకు అందరూ 5 భాషలలో సపోర్ట్ చేయాలి. మా సినిమాలో కథ హీరోగా నిలుస్తుంది” అన్నారు.

గద్దర్ నరసన్న మాట్లాడుతూ… “నేను ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరుపేరున నమస్కారం. శ్రీరామ్ మంచితనంతో నేను ఆయనకు అభిమానిగా మారిపోయాను. ఆయన సినిమా కోసం కాదు, అతని స్నేహం కోసం ఈ సినిమాలో పనిచేశాను. హైదరాబాద్ వస్తె కచ్చితంగా శ్రీరామ్ ను కలుస్తాను. మా రాముడు అందరివాడు అనే సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను ” అన్నారు.

సమ్మెట గాంధీ మాట్లాడుతూ… “మా రాముడు అందరివాడు అనే టైటిల్ చాలా గొప్పది. నాకు ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. మా హీరో శ్రీరామ్ అందరివాడు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడం వారి బాధ్యత . అలాగే లక్ష్మణ్ గారు విలన్ పాత్రలో చాలా బాగా నటించారు. చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి, సినిమాను ఆదరించండి. సుమన్ గారు మంచి పాత్రలో కనిపిస్తున్నారు. మరోసారి ఈ చిత్రంలో పని చేసిన అందరికీ థాంక్స్” అన్నారు.

నాగ మహేష్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన బాబు మోహన్ గారికి, అతిథులకు, మీడియా వారికి నమస్కారం. ఈ సినిమాలో నేను ఒక మంచి పాత్ర పోషించాను. సినిమాలో ఎందరో పేరున్న నటులు నటించారు. ఈ సినిమాతో దర్శకుడు మంచి పేరు సంపాదించుకుంటారు. అలాగే సినిమా కోసం ఎక్కడ వెనకాడకుండా ఖర్చుపెట్టి సినిమాకు వెన్నుముకలా నిలబడ్డారు లక్ష్మణ్ గారు, హీరోగా నటించిన శ్రీరామ్, హీరోయిన్ గా నటించిన స్వాతి పెద్ద హీరో హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను.

గౌతం రాజ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. చిన్న సినిమాలు విజయం అయితే అందరూ బావుంటారు. ఈ సందర్భంగా ఈ చిన్న సినిమాను అందరూ ప్రోత్సహించాలి అని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని హీరో మంచి మనసు ఉన్నవాడు, అందరివాడు. జీవితంలో అతను ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. అలాగే సీనియర్ నటులు ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను ” అన్నారు.

నటీనటులు : శ్రీరామ్, స్వాతి, హీరో సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్, లక్ష్మణ్ రావు తదితరులు.

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు : యద్దనపూడి మైకిల్
నిర్మాతలు : అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు
అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్
సినిమాటోగ్రాఫర్ : వినోద్
సంగీత దర్శకుడు : మనిష్ కుమార్
కోరియోగ్రఫీ : నర్ర సాయికుమార్

“Seetha Prayanam Krishna Tho” Movie Review

Cinemarangam.com
Presented by: East West Entertainments – Dr. Rajeev
Banner: Khushi Talkies
Film: Seetha Prayanam Krishna Tho
Release Date: November 14, 2025
Review Rating: 3/5
Producer: Roja Bharathi
Director: Devender
Cast: Dr. Roja Bharathi, Rakhi Sharma, Dinesh, Sumanth, Anupama
Cinematography: Ravindra
Music: Sharavana Vasudevan
Co-Director: Rajendra
Post Production: Pixel Parrot
Executive Producer: Cherry
PRO: Harish – Dinesh

Under the presentation of East West Entertainments, Khushi Talkies brings “Seetha Prayanam Krishna Tho,” starring Roja Bharathi, Dinesh, Sumanth, and Anupama. Directed by Devender and produced by Dr. Rajeev and Dr. Roja Bharathi, the film arrives grandly in theatres on November 14. Let’s see how the movie turned out in this review.

Story

The story revolves around what happens when a husband fails to give his wife enough time, and later, when the same thing happens to him in return — what complications arise from it?

Krish (Dinesh), a software employee, falls in love with Seetha (Dr. Roja Bharathi) at first sight and marries her. After marriage, they move to the city due to work. There, Krish meets his colleague Radhika (Rakhi Sharma). Their acquaintance slowly turns into love. Swayed by Radhika’s charm, Krish starts avoiding his wife Seetha and stops spending time with her. This leads to misunderstandings between the couple.

Unbeknownst to Krish, Seetha makes an important decision. What changes does this decision bring into their lives? Does Krish get closer to Radhika or return to Seetha? To know that, you must watch Seetha Prayanam Krishna Tho in theatres.

Performances

Dinesh, in his debut as Krish, performs impressively. Whether it’s emotional scenes or comedy, he carries himself like an experienced actor. Dr. Roja Bharathi, who plays Seetha, delivers more than what you expect from her. Her expressions, performance, and screen presence captivate the audience. Rakhi Sharma, as the second lead Radhika, does a very good job despite being new to films. Sumanth, playing the hero’s friend, entertains with his comedy timing. Every other supporting actor delivers well in their respective roles.

Technical Departments

Director Devender deserves appreciation for choosing a story that reflects present-day husband–wife relationships and bringing it realistically onto the screen. The film reminds you of small moments and mistakes from your own married life, making you smile, laugh, and feel emotional at times.

Music by Sharavana Vasudevan is pleasant.
Ravindra’s cinematography is visually appealing, with every frame looking beautiful on screen. Editing by Viswanath is neat.Producers Dr. Rajeev and Dr. Roja Bharathi have ensured rich production values without compromising on cost.

Final Verdict

Seetha Prayanam Krishna Tho offers wholesome entertainment and delivers what it promises. It’s a satisfying watch for audiences who come with expectations.

Cinemarangam.com Review Rating: 3/5