Home Blog Page 69

Vijay Deverakonda’s “Kingdom” Shows Strong Start in US Advance Bookings

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “కింగ్డమ్” యూఎస్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. సినిమా రిలీజ్ కు రెండు వారాల ముందుగానే యూఎస్ లోని 64 లొకేషన్స్ లో 135 షోస్ కు భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటిదాకా “కింగ్డమ్” మూవీకి 15 కె ( 13.63 లక్షల రూపాయల) టికెట్ సేల్స్ జరిగాయి. సినిమా ట్రైలర్ రిలీజ్ కూడా చేయకముందే, ఏ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ తో ప్రమోషన్ జరపకముందే “కింగ్డమ్” సినిమాకు ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఈ మూవీ మీద ఉన్న క్రేజ్ ను చూపిస్తోంది. “కింగ్డమ్” టీజర్ రిలీజైనప్పటి నుంచే ఈ మూవీ మీద అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.

“కింగ్డమ్” చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. “కింగ్డమ్” సినిమా ఈ నెల 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

‘Nadive…’ lyrical song Release from National Crush Rashmika Mandanna’s “The Girlfriend” Movie

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.

ఈ రోజు “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా నుంచి ‘నదివే…’ లిరికల్ సాంగ్ ను హిందీతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం..ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. ‘నదివే…’ పాటను బ్యూటిఫుల్ మెలొడీగా కంపోజ్ చేసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. రాకేందు మౌళి లిరిక్స్ అందించారు. ‘నదివే నువ్వు నదివే, నీ మార్పే రానుంది వినవే. నదివే నువ్వు నదివే..నీకే నువ్వియాలి విలువే..సిలువ బరువేమోయక, సులువు భవితే లేదుగా, వెన్నెల వలదను కలువే నువ్వుగా..నదివే నువ్వు నదివే..’ అంటూ ప్రేయసి ప్రత్యేకతను పొగుడుతూ పొయెటిక్ గా సాగుతుందీ పాట. చిత్రీకరణ తుది దశలో ఉన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు – రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ – జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ – ఫస్ట్ షో
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్స్ – గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్

Aditya Om’s ‘Sant Tukaram’ Cinemas Worldwide grand Releasing on 18th July 2025

In a defining moment for Indian cinema’s spiritual storytelling, Curzon Films in association with Purushottam Studios, has announced their most ambitious production yet — Sant Tukaram, a sweeping feature film based on the life, legacy, and lyrical revolution of the 17th-century Marathi saint-poet who transformed devotion into resistance. The film made on a grand scale comes up with historical authenticity, cinematic craft, and a powerful theatrical experience. Written and directed by acclaimed filmmaker Aditya Om, the film is headlined by very popular Marathi actor Subodh Bhave, who steps into the iconic role of Sant Tukaram. Known for his deeply nuanced performances across Marathi and Hindi cinema, Bhave brings a rare combination of emotional depth and spiritual gravitas to the screen. His portrayal is expected to capture the quiet strength, inner turmoil, and divine transcendence of the 17th-century saint whose words sparked a devotional revolution. The film is scheduled for global release in the cinemas on 18th July 2025 and promises an intimate yet powerful interpretation of a man whose silence spoke louder than rebellion and whose poetry became a timeless voice of truth.

Set against the layered backdrop of 17th-century Maharashtra, the film will trace Tukaram’s transformation from a grieving husband to a voice that spoke for the voiceless through his spiritually electrified Abhanga poetry.

The film also boasts a stellar ensemble cast that enriches the narrative canvas with range and depth. Acclaimed actors such as Shiva Suryavanshi, Sheena Chohan, Sanjay Mishra, Arun Govil, Shishir Sharma, Hemant Pandey, Ganesh Yadav, Lalit Tiwari, Mukesh Bhatt, Gauri Shankar, Twinkle Kapoor, Rupali Jadhav and DJ Akbar Sami will bring to life key characters in Tukaram’s spiritual and social journey. Lending an iconic presence to the film, veteran actor Mukesh Khanna will serve as the narrator, providing philosophical insight and contextual grounding with his trademark voice and gravitas.

The soundtrack composed by Nikhil Kamath, Ravi Tripathi, and Veeral & Laavan, will be deeply rooted in the Abhanga tradition, combining classical and folk influences to create a musical landscape that is both devotional and dramatic. Each song will echo the emotional and philosophical evolution of Tukaram’s character, inviting audiences to feel his bhakti as well as his pain, his surrender as well as his resistance.

Produced by B.Gautham’s Curzon Films in association with Purushottam Studios, the film is being designed as a pan-India cinematic experience, intended to resonate with audiences across linguistic, regional, and spiritual boundaries.

Sahachara Productions ‘Aa Gang Rape 3’ Trailer Released held grandly

ఇంతకు ముందు 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్‌ సాధించి వైరల్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా పేరుపొందిన ‘ఆ గ్యాంగ్‌ రేపు’తో పాటు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందిన స్వీకెల్‌ చిత్రం ‘ఆ గ్యాంగ్‌ రేపు-2’ షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించిన టీమ్‌ నుండి రాబోతున్న మరో సన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఆ గ్యాంగ్‌ రేపు-3’ త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. దర్శకుడు యోగీ కుమార్‌ ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, నిజాయితీగా.. అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ లవ్‌ యూ టూ ఓటీటీలో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సారి ఈ ఆ గ్యాంగ్‌ రేపు-3 ఆయనకు దర్శకుడిగా మరింత గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు. నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మించిన ఈ చిత్రానికి, హ్యాండ్ హెల్డ్ స్టైల్ చిత్రీకరణ చేసిన సినిమాటోగ్రాఫర్ నాని ఐనవెల్లి విజువల్స్ మరింత ఎంగేజింగ్ గా ఉంటాయి. కథన వేగం, మూడ్‌ను ఖచ్చితంగా నిలబెట్టిన ఎడిటర్ అనిల్ కుమార్ జల్లు కట్ ఈ సినిమా టెన్షన్‌ను అద్భుతంగా పటిష్టం చేసింది.మరియు 2017లో మొదటి SIIMA షార్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు, కన్నడ హిట్ షుగర్ ఫ్యాక్టరీకి సంగీతం అందించిన కబీర్ రఫీ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ మరియు విడుదల తేదీ త్వరలో ప్రకటించబడనుంది! కాగా ఈ చిత్రం కంటెంట్‌ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అతిథిగా విచ్చేసిన నటుడు, కొరియోగ్రాఫర్‌ ఆటా సందీప్‌ మాట్లాడుతూ ” గ్యాంగ్‌ రేపు.. షార్ట్‌ ఫిల్మ్‌గా వైరల్‌ అయ్యింది. దీని రెండో భాగంలో నేను చేశాను. అది కూడా బాగా హిట్‌ అయ్యింది. ఆ గ్యాంగ్‌ రేపు 3కి అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు.నేను కొరియోగ్రాఫర్‌గానే ఉండాలనుకుంటున్నాను. ఇంత బోల్డ్‌గా ఉన్న పాత్రను చేయాలనుకులోదు. అందుకే ఈ సినిమా చేయలేదు. చాలా కారణాలతో ఈ సినిమా చేయలేదు. ఈటీమ్‌తో నాకు చాలా మంచి స్నేహం ఉంది. ఫీచర్‌ ఫిలిం చేసి, కథ నచ్చి ఓటీటీ కోసం మంచి పాషన్‌తో ఈ సినిమా చేశాడు. ఈ ట్రైలర్‌, బోల్డ్‌గా ఉంది. నేడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను కూడా ఈ సినిమాలో దర్శకుడు చర్చిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ఓటీటీలో అందరి ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ 2015లో అనుకోకుండా నాకున్న చిన్న ప్రయత్నం వైరల్‌ అయిపోయి గుర్తింపు తెచ్చింది. గ్యాంగ్‌ రేపు 2 కూడా హిట్‌ అయ్యింది. నా స్నేహితుడు ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేశాడు. ఆ గ్యాంగ్‌ రేపు 3 టైటిల్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. నిర్మాత నన్ను నమ్మి బాగా ఖర్చు పెట్టాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తోచేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. అందర్ని అలరించే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి. ఆటా సందీప్‌ ఆ గ్యాంగ్‌ రేప్‌, గ్యాంగ్‌ రేప్‌ 2లో చేశాడు. కానీ ఈ సినిమాలో ఆయనను విలన్‌గా చేపించడం ఇష్టం లేదు అందుకే చేయించలేదు.అందుకే కొత్తవాళ్లతో చేశాను” అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ” ట్రైలర్‌లోనే దర్శకుడి విజన్‌ అర్థమైపోతుంది. మంచి టీమ్‌తో చేసిన సినిమా ఇది. యోగి నాకు మంచి స్నేహితుడు. దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేశాను.కొత్త టీమ్‌తో చేశాం. ఈ సినిమా ప్రాసెస్‌లో నాకు ఈ చిత్రంపై ఇష్టం పెరిగింది. ప్రతి ఆర్టిస్ట్‌, టెక్నిషయిన్స్‌తో ఎంతో కష్టపడి చేశాడు. అందరూ హార్డ్‌ వర్క్‌తో సినిమా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఈ సమావేశంలో ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు.

నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌, సందీప్‌ సాండిలియా, దయానంద్‌ రెడ్డి, మహిపాల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యానర్‌: సహచర ప్రొడక్షన్స్‌, నిర్మాత: నోక్షియస్‌ నాగ్స్‌, దర్శకుడు: యోగేష్‌ కుమార్‌, డీఓపీ: నాని ఐనవల్లి, సంగీతం: కబీర్‌ రఫీ, ఎడిటర్‌: అనిల్‌ కుమార్‌ జల్లు

Heroine Sanchita Shetty received an honorary doctorate from Mother Teresa University

మనం చేసిన మంచి పనిని గుర్తించటమే కాకుండా ఆ పనికి అవార్డులు రివార్డులు వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది…ప్రస్తుతం అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఫేమస్‌ తమిళ, కన్నడ, తెలుగు నటి సంచితా శెట్టి. సంచితా విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘సూదుకవ్వుమ్‌’, ఆశోక్‌ సెల్వన్‌ హీరోగా నటించిన ‘విల్లా’తో పాటు ప్రభుదేవా హీరోగా ‘భగీరా’ చిత్రాలతో పాటు దాదాపు 25 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.

నటనతో పాటు సంచిత చేసిన యూత్‌ లీడర్‌ షిప్‌ సేవలను దృష్టిలో ఉంచుకుని సెయింట్‌ మథర్‌ థెరిసా యూనివర్సిటీవారు ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. కోయంబత్తుర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సంచితకు ఈ అవార్డును అందచేశారు. అవార్డును స్వీకరించిన అనంతరం ఇకపై మరిన్ని మంచి పనులు చేయటానికి ఈ డాక్టరేట్‌ కొత్త ఊపిరిని అందించిందని సంచితా శెట్టి పేర్కొన్నారు. ఈ అవార్డుకు తనను ఎన్నుకున్న కమిటీకి ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు.

‘Shrimad Bhagavatam Part 1’ Begins with Grand Muhurat Ceremony with CM Revanth Reddy as the chief guest

సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న‌ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం “శ్రీమద్ భాగవతం పార్ట్-1” సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే ఒక గొప్ప ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు . “శ్రీమద్ భాగవతం” వంటి గాఢమైన ఆధ్యాత్మిక కథాంశం ఆధారంగా రూపొందుతున్న‌ ఈ సినిమా ప్రేక్షకులకు స‌రికొత్త అనుభవాన్ని అందించనుంది.

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రామోజీ ఫిల్మ్ సిటీలో “శ్రీమద్ భాగవతం పార్ట్-1” చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జూలై 14,2025న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి, ప్ర‌ముఖ నిర్మాత మోతీ సాగ‌ర్‌, సీహెచ్ కిర‌ణ్‌(చైర్మ‌న్‌, ఎండి రామోజీ గ్రూప్‌), శ్రీ‌మ‌తి విజ‌యేశ్వ‌రి(ఎండి, రామోజీ ఫిల్మ్ సిటీ) తదితర ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ ఒక యూనిక్ ఫిల్మ్ సిటీ.. అలాంటి రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉండటం మనకు గర్వకారణం. శ్రీమద్ భాగవతం సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు సినిమా టీమ్ ను అభినందిస్తున్నా. తరం మారుతున్న ఈ సమయంలో ‘శ్రీమద్ భాగవతం’ లాంటి సినిమాలు చాలా అవసరం. నలభై ఏళ్ల క్రితం రామాయణం సీరియల్ రామాయణాన్ని అందరికీ చేరువ చేసింది. కోవిడ్ టైమ్ లో మళ్లీ రామాయణం సీరియల్ ను టెలికాస్ట్ చేస్తే రికార్డు సృష్టించింది.

2035 లోగా తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమిగా తీర్చి దిద్దాలని మేం సంకల్పించాం. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకోసం 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటున్నాం.. 2047 విజన్ డాక్యుమెంట్ లో సినిమా రంగానికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుంది. ఆనాడు రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ ఎంత పాపులర్ అయిందో.. శ్రీమద్ భాగవతం పార్ట్-1 సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నా మూవీ టీమ్ కు నా అభినందనలు. రాబోయే రోజుల్లో హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ చేసే స్థాయికి ఎదగాలని మా ఆకాంక్ష,” అని ఆయన పేర్కొన్నారు.

ఈ చిత్రం తెలంగాణలో సినిమా పరిశ్రమకు కొత్త ఊపిరి పోసే అవకాశం ఉందని, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి అత్యాధునిక సౌకర్యాలు దీనికి దోహదపడతాయని సినీ పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “శ్రీమద్ భాగవతం పార్ట్-1” చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో అత్యుత్తమ ప్రపంచ స్థాయి ప్రతిభావంతులు కూడా ఉన్నారు, మిస్టర్ క్లైడ్ ఎడ్వర్డ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు, ఆయన లైఫ్ ఆఫ్ పై, హ్యారీ పాటర్ సిరీస్, ది జంగిల్ బుక్, మార్వెల్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ మరియు మరెన్నో అంతర్జాతీయ చిత్రాలు మరియు సిరీస్‌లకు విజువల్ ఎఫెక్ట్స్ నిర్మాత మరియు సూపర్‌వైజర్‌గా ఉన్నారు. 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన AFI నుండి సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ గ్రాడ్యుయేట్ అయిన ఫోటోగ్రఫీ డైరెక్టర్ జోయెల్ షాఫెర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరారు, మిషన్: ఇంపాజిబుల్, స్టార్ ట్రెక్ మరియు ఫాస్ట్ & ఫ్యూరియస్ 7 వంటి బ్లాక్‌బస్టర్‌లను కలిగి ఉన్న అతని క్రెడిట్‌లు.

శ్రీమద్ భాగవతం మొదటి భాగం 2026లో బహుళ భాషలలో గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది మరియు 1987 రామాయణంపై పనిచేసిన అదే బృందం నాలుగు సంవత్సరాలకు పైగా సంస్కృత పరిశోధనతో భక్తిపూర్వకంగా రూపొందించబడింది. కథపై లోతైన దృష్టితో, భక్తి అంశాలలోకి లోతుగా వెళుతూ, ఈ ప్రాజెక్ట్ IMAX-సర్టిఫైడ్ లార్జ్-ఫార్మాట్ కెమెరాలను ఉపయోగించి చిత్రీకరించబడుతుంది మరియు అనుభవాన్ని మెరుగుపరచడానికి గ్లోబల్ గ్రేడ్ విజువల్ ఎఫెక్ట్‌లను కలిగి ఉంటుంది – భారతదేశ పవిత్ర వారసత్వం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచ ప్రేక్షకులకు తీసుకువస్తుంది. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం, విలువలు మరియు దైవిక కథలను కొత్త తరానికి – భాషలలో, ఖండాలలో మరియు కాలానుగుణంగా తిరిగి పరిచయం చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఒక ఉద్యమంగా లక్ష్యంగా పెట్టుకుంది.

డాక్టర్ రామానంద్ సాగర్ మరియు శ్రీమతి లీలా సాగర్ జ్ఞాపకార్థం అంకితం చేయబడిన ఈ చిత్రం వారి శాశ్వత వారసత్వానికి హృదయపూర్వక నివాళి.

National Award Winner Narasimha Nandi’s ‘Prabhutva Sarai Dukanam’ First Look launched held grandly

జాతీయ అవార్డ్ దర్శకులు నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాల తరువాత నరసింహ నంది తాజాగా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ , శ్రీనిధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది, ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, దర్శకులు సముద్ర, నటుడు పృద్వి తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

సెక్స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వం సారాయి దుకాణం సినిమా కథను తయారు చెయ్యడం జరిగింది. 1980 నాటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలచడం జరిగింది.

చిత్ర దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ.. నిర్మాతకు కథ చేప్పినప్పుడు కథ కమర్షియల్ ఫార్మాట్ లో బాగుంది దీనిని వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నాం..అయితే నిర్మాతలకు సినిమా పట్ల అవగాహన ఉండడం వలన ఈ కథను సినిమా ఫార్మాట్ లో తీద్దామని చెప్పారు. అందుకే రెండున్నర గంటలు కుదించి సినిమా తీస్తున్నాము. అయినా కథ పెద్దగా ఉన్నందున ఈ సినిమాకు పార్ట్ 1 అని పెట్టాము. ఈ సినిమా విషయానికి వస్తే ప్రతి మనిషిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. బయట మాట్లాడే వ్యక్తి విధానం ఒకటి, అయితే,లోపల ఉండే వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, సమాజం పట్ల ఎలా బిహేవే చేస్తాడు. అనేది మరొకటి ఉంటుంది. అందుకే జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అని క్యాప్షన్ పెట్టాను. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ సినిమాలో నటించిన నటీ, నటులు అందరూ చాలా అద్భుతంగా నటించారు.

అతిధిగా వచ్చిన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ ..మా ఇద్దరం నరసింహనాయుడు నుండి కో డైరెక్టర్స్ గా స్టార్ట్ అయ్యాము.1947 లో ఒక గ్రామం సినిమా నుంచి చాల రొటీన్ సినిమాలు తీయకుండా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలతో మంచి కంటెంట్ ఉన్న సినిమాలే తీస్తూ మంచి ఆర్టిస్ట్ లను టెక్నిషియన్స్ ను పరిచయం చేస్తూ ప్రతి సినిమా ఒక ప్రయోగాత్మకంగా ఒక అభిరుచి గల సినిమాలు తీస్తాడు. ఈ రోజు మోషన్ పోస్టర్ చూసాం చాలా బాగుంది.సో ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ నరసింహ నంది తీస్తున్న ఈ సినిమా కూడా గొప్ప హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

అతిధిగా వచ్చిన  ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. యస్. వి. యస్ బ్యానర్ మీద నరేష్, మల్లిక్ లు తీస్తున్న ఈ సినిమాకు దర్శకుడు నరసింహ నంది చేయడం చాలా సంతోషంగా ఉంది.ఆ రోజుల్లో అవార్డు రావడం కష్టంగా ఉండేది. నేను ఇండియన్ పనోరమకు జ్యూరీ మెంబెర్ గా వెళితే గత 8 సంవత్సరాలు ఒక్క అవార్డు రాలేదు. అలాంటి కష్టమైన సమయంలో తను తీసిన 1940 లో ఒక గ్రామం సినిమాకు నేషనల్ అవార్డు రావడం గొప్ప విషయం.ఈ సినిమాలో చేస్తున్న అందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు తను చేస్తున్న ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నటుడు 30 ఇయర్స్ పృద్వి మాట్లాడుతూ.. 1940 లో ఒక గ్రామం సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన తరువాత ఇటువంటి దర్శకుడు చేసే సినిమా నటించాలని అప్పట్లో ప్రయత్నించాను. తరువాత కబడ్డీ సినిమాలో ఛాన్స్ ఇచ్చినా చెయ్యలేకపోయాను. ఇప్పుడు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నటించిన వారందరూ చాలా అద్భుతంగా నటించారు.మంచి కథతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ దైన నరేష్ గౌడ మాట్లాడుతూ..డైరెక్టర్ నరసింహ నంది గారు తీసిన 1940 లో ఒక గ్రామం సినిమాను మా ఇంట్లో టీవీ లేనప్పుడు పక్కింటి కెళ్ళి సినిమా చూశాను. ఇప్పుడు అలాంటి వారితో సినిమా చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ గా ఉంది. మమ్మలి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రసన్న కుమార్ గారికి, పృథ్వి గారికి, సముద్ర గారికి కృతజ్ఞతలు, మా అన్న గురువు పరిగి మల్లిక్ గారితో కలిసి ఈ సినిమా నిర్మిచడం సంతోషంగా ఉంది, నరసింహ నంది గారు సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు రేపు అందరూ అదే ఫీల్ అవుతారు, త్వరలో మా ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా థియేటర్స్ లో అందరిని అలరించబోతోందని తెలిపారు.

నిర్మాత పరిగి మల్లేష్ మాట్లాడుతూ.. అడియన్స్ మెచ్చే సినిమాలు చేసినటువంటి నరసింహ నంది గారితో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయన తో పని చేయడం మా అదృష్టం. ఈ కథ విషయానికి వస్తే తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మంచి కంటెంట్ ఉన్న కల్ట్ సినిమా ప్రభుత్వ సారాయి దుకాణం. ఈ సినిమా మా మూడేళ్ళ జర్నీ, ఎంతో కష్టపడి నాతో కలిసి నరేష్ గౌడ ఈ సినిమాను నిర్మించారు, అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

హీరో విక్రమ్ మాట్లాడుతూ.. ఎలాంటి సినిమా బ్యాక్ డ్రాప్ లేని నేను గత 18 సంవత్సరాలనుండి వినిమా కోసం వెయిట్ చేస్తున్నాను.ఇలాంటి మంచి వీనిమాలో చేసే అవకాశం వచ్చినందుకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు.

హీరో సదన్ మాట్లాడుతూ…ఈ సినిమా నా కెరీర్ లో ఒక మంచి సినిమాగా మిగిలిపోతుందని నమ్మకం ఉంది, ఒక సినిమాలో నటించానాన్న తృప్తి ఉందన్నారు

హీరో వినయ్ మాట్లాడుతూ…ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నరసింహ నంది గారికి నిర్మాతలు నరేష్ గౌడ గారికి పరిగి మల్లిక్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

హీరోయిన్ అధితి మైకేల్ మాట్లాడుతూ…ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాను డైరెక్టర్ నరసింహ నంది గారు అద్భుతంగా తెరకెక్కించారు, ఈ సినిమా లో నటించినందుకు గర్వాంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాలను ఆడియన్స్ ఆధరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

హీరోయిన్ శ్రీలు దాసరి మాట్లాడుతూ...నరసింహ నంది గారి దర్శకత్వంలో ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాలో ఒక మంచి రోల్ లో నటించాను, తప్పకుండా నా పాత్ర మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

హీరోయిన్ మోహన సిద్ది మాట్లాడుతూ…ఈ సినిమా లో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు నరసింహ నంది గారికి కృతజ్ఞతలు. ఒక మంచి సినిమాలో నటించానన్న హ్యాపీ నెస్ ఉంది, త్వరలో రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

నటుడు తిలక్ మాట్లాడుతూ….ఎన్నో సినిమాల్లో మంచి రోల్స్ లో నటించిన నాకు ఈ సినిమాలో మరో గుర్తిండిపోయే పాత్రలో నటించాను, ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఆలోచింపజేసే విధంగా ఉంటుంది, డైరెక్టర్ నరసింహ నంది, నిర్మాతలు నరేష్, మల్లిక్ కు ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నటీనటులు: ఆర్.విక్రమ్ , సదన్ హాసన్, వినయ్, నరేష్ రాజ్, అదితి మైకేల్, శ్రీలు దాసరి, మోహన సిద్ది, రంగరాజు, పృద్వి, తిలక్, బాలు నాయక్, స్వప్న, జ్యోతి, బలగం సహాదేవ్, బలగం రమేష్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఎస్విఎస్ ప్రొడక్షన్, శ్రీనిధి సినిమాస్
నిర్మాతలు: దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్
ఎడిటర్ : వి . నాగిరెడ్డి
సంగీతం: ఎస్ ఎస్
కెమెరామెన్: ఎస్.మురళి మోహన్ రెడ్డి
రచన , దర్శకత్వం: నరసింహ నంది

TNR Productions ‘Mr. Reddy’ Pre-Release Event held grandly,Movie releasing on July 18

టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహా రెడ్డి-టీఎన్ఆర్) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. ఈ చిత్రానికి వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టీఎన్ఆర్‌తో పాటుగా.. మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూలై 18న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

హీరో, నిర్మాత టీఎన్‌ఆర్ మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ రెడ్డి’కి సపోర్ట్ చేస్తున్న మీడియాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎంతో తపన ఉంటేనే సినిమాలు నిర్మిస్తారు. ఎన్నో వ్యయ ప్రయాసలు పడితే గానీ ఓ మూవీ బయటకు రాదు. ఈ క్రమంలో నన్ను ఎంతో మంది మోసం చేశారు. కానీ నేను ఎప్పుడూ ఎక్కడా భయపడలేదు. నా టాలెంట్‌ను నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చాను. ఇది నా జీవితంలో జరిగిన కథే. ఇందులోని ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం జూలై 18న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు వెంకట్ వోలాద్రి మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ రెడ్డి’ లాంటి మంచి చిత్రాన్ని తీశాం. ఈ ప్రయాణంలో మాకు నిర్మాత, హీరో టీఎన్‌ఆర్ గారు ఎంతో సహకరించారు. మహదేవ్, అనుపమ, దీప్తి అందరూ అద్భుతంగా నటించారు. నాగ భూషణ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. టీం అంతా కూడా నా స్నేహితులే. అందరం కలిసి ఈ మూవీని తీశాం. రాజన్న ఓ ఫైట్ సీక్వెన్స్‌ను బాగా తీశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

హీరో మహదేవ్ మాట్లాడుతూ .. ‘మా ‘మిస్టర్ రెడ్డి’ కోసం టీఎన్‌ఆర్ గారు ఎంతో కష్టపడ్డారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా టీఎన్‌ఆర్ గారికి ధన్యవాదాలు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ మూవీని అందరూ తప్పకుండా థియేటర్లోనే చూడండి. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మా చిత్రం జూలై 18న రాబోతోంది. అందరూ చూసి విజయవంతం చేయండి’ అని అన్నారు.

హీరోయిన్ అనుపమ ప్రకాష్ మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ రెడ్డి’ టీం అంతా ఓ కుటుంబంలా కలిసి పని చేశాం. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

హీరోయిన్ దీప్తి శ్రీరంగం మాట్లాడుతూ .. ‘ఇది నాకు తొలి సినిమా. నేను తెలుగమ్మాయిని. మేం చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మహదేవ్‌తో నటించడం ఆనందంగా ఉంది. మా చిత్రం అందరినీ మెప్పించేలా ఉంటుంది’ అని అన్నారు.

కెమెరామెన్ నాగ భూషణ్ మాట్లాడుతూ .. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీఎన్‌ఆర్ గారికి థాంక్స్. ఈ చిత్రం బాగా వచ్చింది. అన్ని రకాల అంశాలు ఈ మూవీలో ఉంటాయి. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

నటీనటులు : టీఎన్ఆర్, మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి తదితరులు

సాంకేతిక బృందం
రచన, దర్శకత్వం : వెంకట్ రెడ్డి వోలాద్రి
నిర్మాత : టీఎన్ఆర్
కెమెరామెన్: కె ఎన్ భూషణ్
సంగీతం: కేఎస్ఆర్ మ్యూజికల్
కొరియోగ్రాఫర్: గోవింద్
ఫైట్స్: యాక్షన్ గౌరీ
పీఆర్వో : సాయి సతీష్

RB Choudhary’s Super Good Films, Actor Vishal’s “Vishal-35” Movie Pooja ceremony helld grandly

Actor Vishal, one of the leading stars of south cinema, recently scored a massive blockbuster hit with the film Madha Gaja Raja, which was well-received by audiences and critics alike.

Following the success of that film, Vishal is now set to star in his 35th movie, which is being produced by veteran producer Mr. RB Choudhary under the prestigious banner Super Good Films.

Mr. RB Choudhary started Super Good Films in 1990 with the film Pudhu Vasantham. Since then, the banner has delivered numerous successful films and has played a significant role in introducing many new directors to Tamil and Telugu cinema. This upcoming project marks the 99th film under the Super Good Films banner.

This new movie will be directed by Ravi Arasu, with acclaimed cinematographer Richard M. Nathan handling the camera. This marks the first collaboration between actor Vishal and director Ravi Arasu.

Notably, after the grand success of Madha Gaja Raja, Vishal is once again teaming up with cinematographer Richard M. Nathan. Editing will be handled by NB Srikanth, with Durairaj serving as the art director. Following the success of Mark Antony, music composer G.V. Prakash Kumar is once again collaborating with Vishal for this film.

Actress Dushara Vijayan will play the female lead opposite Vishal. The casting for other supporting roles is currently underway.

The film’s grand pooja ceremony was held this morning in Chennai with much fanfare. Eminent personalities from the industry like Director Vetrimaaran, Saravana Subbaiah (Citizen), Manimaran (NH4), Venkat Mohan (Ayogya), Saravanan (Engeyum Eppodhum), Actors Karthi & Jiiva, DOP Arthur A Wilson and Distributor Tiruppur Subramaniam graced the occasion and conveyed their heartfelt wishes for a huge success. Filming will begin in Chennai and is scheduled to be completed in a single stretch over 45 days.

This new project has generated high expectations among fans and cinema lovers, thanks to the promising team and powerful collaborations behind it.

Cast: Vishal, Dushara Vijayan, Thambi Ramaiah, Arjai

Technical Crew:
Production Company: Super Good Films,
Producer: RB Choudhary,
Director: Ravi Arasu,
Music Director: G.V. Prakash Kumar,
Cinematographer: Richard M. Nathan,
Editor: NB Srikanth,
Art Director: G. Durairaj
Costume Designer: Vasuki Bhaskar
PRO: Sai Satish

“Ambedkar in Agraharam” Title Song launched by Dalit Icon Padma Shri Manda Krishna Madiga

మన భారత రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల స్పూర్తితో రూపొందిన చిత్రం “అగ్రహారంలో అంబేద్కర్”. “దళిత సంచలనం” పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ ఈ చిత్రం టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. కృష్ణచైతన్య ఎన్నో కష్టాలు పడి తెరకెక్కించిన ఈ చిత్రం అసాధారణ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అంబేద్కర్ అభిమానులైన ప్రతి ఒక్కరూ “అగ్రహారంలో అంబేద్కర్” చిత్రం చూసి తీరాలని పిలుపునిచ్చారు!!

ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని రామోజీ – లక్షమోజి ఫిల్మ్స్ పతాకంపై మంతా కృష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హీరో కూడా ఆయనే కావడం విశేషం.

ఆయన మాట్లాడుతూ…”అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన మందా కృష్ణగారికి బిగ్ బిగ్ థాంక్స్. ఈ చిత్రాన్ని సినిటేరియా మీడియా వర్క్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం, కుల మత ప్రాంత వర్గ వైషమ్యాలకు అతీతంగా సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్ కు గొప్ప నివాళిగగా.. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు!!